
ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశస్వాతంత్య్ర పోరాటంలో, దేశాభివృద్ధిలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్ కుమార్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డీఆర్‌ఓ సీహెచ్.ఓబులేసు, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర రావు, సీఈఓ శ్రీమన్నారాయణ, ప్రకాశం భవనంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్ : బ్రిటీష్ ముష్కరుల తుపాకులకు ఎదురొడ్డి గుండె తీసి చూపించిన ధీరుడు, స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు వాడి దమ్ము చాటి చెప్పిన సాహసి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ప్రకాశం పంతులు వర్ధంతి నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ఎన్నో సేవలు చేశారని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ రాఘవేంద్ర, సీసీస్ సీఐ జగదీష్, ఆర్‌ఐ రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, పాపిరెడ్డి పాల్గొన్నారు.

ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం