స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు కండి | - | Sakshi
Sakshi News home page

స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు కండి

May 18 2025 1:15 AM | Updated on May 18 2025 1:15 AM

స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు కండి

స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు కండి

బీట్‌ ద హీట్‌లో కలెక్టర్‌

తమీమ్‌ అన్సారియా

కొత్తపట్నం: వేసవిలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అల్లూరులో బీట్‌ ద హీట్‌ అనే కార్యక్రమం నిర్వహించారు. తొలుత బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం రాజీవ్‌ కళామందిర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించి చెత్తను ఎరువుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అల్లూరు గ్రామాన్ని కూడా విజువల్‌ క్లీన్‌ వీలేజ్‌గా తీర్చిదిద్దేలా గ్రామస్తులు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో అనేక పనులు చేపడతామన్నారు. గ్రామంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

మండలంలో 15 పంచాయతీల్లో పెండింగ్‌ పనులు ఉన్నాయని, పూర్తి చేయాలని ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి కలెక్టర్‌ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రావెల్‌, మట్టి రోడ్లకు రూ.11 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులు ఇప్పుడు నిలిచిపోయాయని, వాటిని తిరిగి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అల్లూరు చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో డీకే భూములు 70 శాతం ఉన్నాయని, వాటిని వారి వారసుల పేర్లపై మార్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి పంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నంబూరి సూర్యనారాయణ, ఆర్డీఓ లక్ష్మిప్రసన్న, జిల్లా పరిషత్‌ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూస్‌ ఎస్‌ఈ బాల శంకరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాశాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ పి.మధుసూధన్‌రావు, ఎంపీడీఓ శ్రీకృష్ణ, ఈవోఆర్డీ వేణుగోపాల్‌ మూర్తి, ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement