
రాచర్లలో బంగారు బాల్యం సర్వే పూర్తి
ఒంగోలు సబర్బన్: బంగారు బాల్యం పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన రాచర్ల మండలంలో బంగారు బాల్యం సర్వే పూర్తి చేసినట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. అందుకు సంబంధించి మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాచర్ల మండలంలోని పాఠశాలలకు వెళ్లాల్సిన బాల బాలికలను 380 మందిని గుర్తించారన్నారు. వారి కుటుంబాల స్థితిగతులు తెలుసుకొని వారిని తిరిగి పాఠశాలల్లో చేర్చేందుకు సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వారికి అవసరమైన వనరుల సమకూర్చాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సర్వేలో చాలా మంది వికలాంగుల పిల్లలు ఉన్నందున వారికి వీల్ చైర్స్, త్రి సైకిల్స్‌ను సమకూర్చాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. త్వరలో జరగబోయే బంగారు బాల్యం నెలవారీ సమీక్షలో జిల్లా వ్యాప్తంగా బంగారు బాల్యం సర్వేపై తగిన సూచనలు తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి పి. సుధా మారుతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి. దినేష్ కుమార్, గిరిధర్ శర్మ, సునీల్ కుమార్ పాల్గొన్నారు.