
సబ్‌స్టేషన్‌కు పసుపు రంగు
రాచర్ల: ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై గతంలో నానా రచ్చ చేసిన కూటమి నాయకులు.. తాము అధికారంలోకి రాగానే తాపీగా పసుపు రంగు రాస్తున్నారు. రాచర్ల మండలంలోని మేడంవారిపల్లెలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు నిధులు మంజూరు చేశారు. సోమిదేవిపల్లె, గుడిమెట్ట, రామాపురం, సత్యవోలు, శీలంవెంకటరెడ్డిపల్లె, సంగపేట, ఒద్దులవాగుపల్లె, మేడంవారిపల్లెలో విద్యుత్ లోఓల్టేజీ సమస్యతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో గత ప్రభుత్వం రూ.30 లోలతో సబ్‌స్టేషన్ నిర్మించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు భూమి పూజ చేయగా.. కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేశారు. సబ్ స్టేషన్ గదితోపాటు ప్రధాన గేటుకు గ్రామ కూటమి నాయకులు పసుపు రంగు వేయించడం చర్చనీయాంశమైంది. ‘‘కడాన మీ మొహానికి రంగులేసుకోండి..’’ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గ్రామస్తులు గుర్తుచేస్తూ.. మరి ఇప్పుడు పసుపు రంగు ఎలా వేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.