
19వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె
ఒంగోలు టౌన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. సమ్మెలో వుయ్ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సీహెచ్‌ఓల్లో 85 శాతం మహిళలు పనిచేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలు, కొండప్రాంతాల్లో పనిచేసే మహిళలు అభద్ర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాత్రి 8 గంటల వరకు హెడ్ క్వార్టర్స్‌లో ఉండి ముఖ హాజరు వేయాలని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ ఉత్తర్వులను జారీ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ నాయకులు షేక్ ఆదిల్, గంటా ప్రసన్న, జీవనజ్యోతి, పసుపులేటి శైలజ, దీప్తి, కామేష్, రమాదేవి పాల్గొన్నారు.