
మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్ ప్రారంభం
మార్కాపురం: 54వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కమలా సీబీఎస్‌సీ స్కూల్‌గ్రౌండ్స్‌లో చైర్మన్ పవన్, లయన్స్ క్లబ్ చైర్మన్ రామకృష్ణలు చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక, శారీరక దృఢత్వంతోపాటు పోటీతత్వం అలవడుతుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు, జిల్లా హ్యాండ్‌బాల్ సెక్రటరీలు రవికుమార్, శ్రీకాంత్, గణేష్, లక్ష్మణ్, మహబూబ్‌బాషా, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి చంద్రశేఖరరావు, సత్యప్రసాద్ పాల్గొన్నారు.

మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్ ప్రారంభం