
కనిగిరి రూరల్:
పట్టణ సమీపంలోని పొగాకు బోర్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు పి.పోలయ్య, హనోక్‌లది మండలంలోని పట్టాభిరామపురం. మండలంలోని కృష్ణాపురంలో కుటుంబ, ఆర్థిక సమస్యలతో యూ.పద్మనాభరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా భూతంవారిపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో గుండాబత్తుని సుజాత (22) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కనిగిరిలో ఒకే రోజు నలుగురు మృతి చెందడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. పట్టాభిరామపురం ఎస్సీ కాలనీకి చెందిన పాలిపోగు పోలయ్య (28), అదే కాలనీకి చెందిన మర్రి హనోక్ (24)లు బైకుపై పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. మార్గంమధ్యలో టుబాకో బోర్డు సమీపంలో పొదిలి రోడ్డు వైపు నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. పోలయ్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా హనోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో కనిగిరి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు తీసుకెళ్తుండగా మృతి చెందాడు. పోలయ్య బేల్దారి పనులు చేసుకుని జీవిస్తుండగా హనోక్ డిగ్రీ వరకు చదివి కూలి పనులకు వెళ్తున్నాడు. మృతులు బంధువులు.
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య
మండలంలోని కృష్ణాపురంలో యూ.పద్మానాభరెడ్డి (45) తన ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని భూతంవారిపల్లిలో శనివారం జరిగింది. సీఎస్‌పురానికి చెందిన జి.సుజాత (22)కు కనిగిరి మండలం భూతంవారిపల్లికి చెందిన అశోక్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి 100 కాల్ చేసి మరీ..తాను పురుగుమందు తాగి చనిపోతున్నట్లు తెలిపి ఆత్మహత్యకు పాల్పడింది. సుజాతను స్థానిక వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ఆత్మహత్య చేసుకుని మరో ఇద్దరు మృతి