మృతదేహాలను వెలికితీసి | - | Sakshi
Sakshi News home page

మృతదేహాలను వెలికితీసి

May 24 2025 1:34 AM | Updated on May 24 2025 10:03 AM

మృతదే

మృతదేహాలను వెలికితీసి

● కొమరోలు రోడ్డు ప్రమాదంలో లారీ కిందకు సగభాగం దూసుకెళ్లిన కారు ● కారు ముందు సీట్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలు జేసీబీ సాయంతో వెలికితీత ● మొత్తం ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు ● అందరూ బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ● కారు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణంగా నిర్ధారించిన పోలీసులు ● వైరల్‌ అవుతున్న సీసీ టీవీ ఫుటేజ్‌
అరగంట శ్రమించి..

జేసీబీ సహాయంతో కారును వెనక్కు లాగిస్తున్న పోలీసులు

కొమరోలు: ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందిన సంఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై కొమరోలు మండలంలోని తాటిచెర్లమోటు సమీపంలో హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో చోటుచేసుకున్న పలు విషయాలు జిల్లావాసులను ఉలికిపాటుకు గురిచేశాయి. డ్రైవర్‌ కర్రెద్దుల దివాకర్‌ కారును అతివేగంగా నడపడం కారణంగా లారీని ఢీకొట్టి సగభాగం వరకూ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారు ముందు సీట్లలో ఉన్న డ్రైవర్‌ దివాకర్‌, పక్క సీటులో ఉన్న బొచ్చు సన్ని మృతదేహాలు ఇరుక్కుపోయాయి. వారి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసేందుకు జేసీబీ సహాయంతో అరగంటపాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు మృతదేహాలు ఛిద్రమైపోయి భయాందోళన కలిగించేలా ఉన్నాయి.

ఒక్కసారిగా పెద్ద శబ్దం...

డ్రైవర్‌ దివాకర్‌ అతివేగంగా కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించినట్లు రోడ్డుపక్కన పెట్రోలు బంకులో ఉన్న వ్యక్తులు తెలిపారు. అతివేగం కారణంగా లారీని బలంగా ఢీకొని లారీ కిందకు సగభాగం వరకు కారు దూసుకెళ్లడంతో ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం అంతా పెట్రోలు బంకులోని సీసీ టీవీలో రికార్డయింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. గజ్జల అంకాలు (40), గజ్జల భవాని (25), గజ్జల నరసింహులు (20), గజ్జల జనార్దన్‌ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్‌ (30) మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారులు జీతన్‌, శిరీషలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడు జీతన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించారు. చిన్నారి శిరీష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కుటుంబ కలహాలపై చర్చించి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా...

బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు చిన్నారులతో కలిసి కుటుంబ కలహాలపై చర్చించేందుకు నంద్యాల జిల్లా డోన్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ చర్చల అనంతరం నంద్యాల జిల్లాలోనే ఉన్న మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ...

ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పెట్రోల్‌ బంకు ఉండటంతో అందులోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. కారు అతివేగంగా వెళ్లి లారీని ఢీకొన్నట్లు తెలుసుకున్నారు. పలకల లోడుతో వెళ్తున్న లారీని కారు వేగంగా ఢీకొట్టిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో గిద్దలూరు అర్బన్‌ సీఐ సురేష్‌, కంభం సీఐ మల్లికార్జునరావు, కొమరోలు, గిద్దలూరు, అర్థవీడు, కంభం ఎస్సైలు నాగరాజు, ఇమ్మానియేలు, సుదర్శన్‌, నరసింహారావు, గిద్దలూరు సర్కిల్‌ పోలీసుస్టేషన్లలోని సిబ్బంది పాల్గొన్నారు.

మృతదేహాలను వెలికితీసి1
1/2

మృతదేహాలను వెలికితీసి

మృతదేహాలను వెలికితీసి2
2/2

మృతదేహాలను వెలికితీసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement