
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ.. ఇలాగేనా?
కొనకనమిట్ల: కొనకనమిట్లలో ఇటీవల చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో దొంగ మస్టర్లు వేసి అవకతవకలకు పాల్పడిన వైనంపై ఏపీడీ విచారణకు రాగా ఓ వర్గం మోకాలడ్డింది. పనుల్లో అక్రమాలకు పాల్పడి ప్రజాధనం దుర్వినియోగం చేశారని గ్రామనికి చెందిన పలువురు ఒంగోలు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీడీ లలిత కుమారి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ.. పనులకు రానివారికి, గ్రామంలో లేనివారికి మస్టర్ వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. విచారణ నివేదికను జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఆమె వెంట ఏపీఓ బుల్లెన్నరావ్ ఉన్నారు.
పాత ఫీల్డ్ అసిస్టెంట్‌పై దౌర్జన్యం
ఏపీడీ విచారణ చేసి వెళ్లిన తర్వాత ఓ వర్గం వారు మాజీ ఫీల్డ్ అసిసెంట్‌పై దౌర్జన్యానికి దిగారు. తమపైనే ఫిర్యాదు చేయిస్తావా అంటూ హెచ్చరించారు. కాగా విచారణ పేరుతో గ్రామంలోకి వచ్చిన ఏపీడీ చేసిందేమీ లేదని పలువురు ఆరోపించారు. ఏపీడీని ఫీల్డ్‌కు వెళ్లనీయకుండా ఓ వర్గం వారు సచివాలయంలో కూర్చోబెడితే అక్రమాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ తరుణంలో సచివాలయం నుంచి వెళ్లిన ఏపీడీ ఓ ఫిర్యాదుదారుడిని మండల పరిషత్ కార్యాలయంలో విచారణకు రావాలని పిలిచారు. కూటమి నాయకులు దాడికి పాల్పడతారనే ఉద్దేశంతో అతను ఏపీడీ పిలుపును తిరస్కరించినట్లు సమాచారం.
మాజీ ఫీల్డ్
అసిస్టెంట్‌తో గొడవ
పడుతున్న
ఓ వర్గం వారు
ఏపీడీ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా
మోకాలడ్డు
సచివాలయంలో కూర్చోబెట్టి
అక్రమాల్లేవని చెప్పే యత్నం