
జగన్ పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం
● పనులను పరిశీలించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, నాయకులు
పొదిలి రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పొదిలిలో ఆయన పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జగనన్న పర్యటన ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మార్కాపురం సమన్వయకర్త అన్నా రాంబాబు, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి సోమవారం పరిశీలించారు. ముందుగా పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్‌ఎస్‌ఆర్ పెట్రోల్ బంక్ వద్ద జరుగుతున్న హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలకు సలహాలు, సూచనలు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చెట్ల తొలగింపు, మట్టితోలకం, చదును చేయడం వంటి పనులు వేగవంతం చేయాలని చెప్పారు. జగనన్న పర్యటనకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా భోజనం, మంచినీరు, తదితరాలను ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై స్థానిక నాయకులతో చర్చించారు. ఆయా ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జగన్ పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం

జగన్ పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం