ప్రకటనలు దాటని జిల్లా ఏర్పాటు... | - | Sakshi
Sakshi News home page

ప్రకటనలు దాటని జిల్లా ఏర్పాటు...

May 29 2025 1:13 AM | Updated on May 29 2025 1:13 AM

ప్రకటనలు దాటని జిల్లా ఏర్పాటు...

ప్రకటనలు దాటని జిల్లా ఏర్పాటు...

ఎన్నికల ప్రచారంలో మార్కాపురాన్ని జిల్లా చేస్తామని చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా చేసిన తరువాతనే మార్కాపురంలో అడుగుపెడతానంటూ పశ్చిమ ప్రకాశం ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. ఇప్పటికీ ఆయన రెండుసార్లు మార్కాపురం వచ్చి వెళ్లారు. మొదటిసారి పర్యటనలో మార్కాపురంను జిల్లా చేయడం ఇప్పట్లో కుదరదని తేల్చి చెప్పారు. రెండోసారైనా ఏమైనా చెబుతారేమోనని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మార్కాపురం వచ్చిన ఆయన జిల్లా గురించి ప్రస్తావించకుండా వెళ్లిపోయారు. చంద్రబాబు ఏదైనా మాట ఇచ్చారంటే దానిని చేయరని అర్థం చేసుకోవాలని పశ్చిమ ప్రాంత ప్రజలు నిట్టూరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement