స్పర్శ్‌ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

స్పర్శ్‌ సమస్యల పరిష్కారానికి కృషి

May 24 2025 10:03 AM | Updated on May 24 2025 10:03 AM

స్పర్శ్‌ సమస్యల  పరిష్కారానికి కృషి

స్పర్శ్‌ సమస్యల పరిష్కారానికి కృషి

సైనిక్‌ వెల్ఫ్‌ర్‌ డైరెక్టర్‌ వీవీ రెడ్డి

కంభం: స్థానిక మాజీ సైనికుల సంఘం కార్యాలయాన్ని శుక్రవారం సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డు డైరెక్టర్‌ వీవీ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పర్శ్‌ సమస్యలు పరిష్కరించడం కోసం జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు శెట్లం వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. మాజీ సైనికులకు ఇంటి పన్ను ఎలాంటి షరతులు లేకుండా మినహాయింపు ఇవ్వాలని, రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందజేసేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పుల్లయ్య, పోలయ్య, సంకతాల ప్రసాద్‌, మస్తాన్‌వలి, పాండు రంగయ్య, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

రేపు పవర్‌ లిఫ్టింగ్‌

క్రీడాకారుల ఎంపిక

ఒంగోలు: జిల్లా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఒంగోలులోని భారత జాతీయ వ్యాయామ కళాశాలలో ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.భక్తధృవుడు ఓ ప్రకటనలో తెలిపారు. పవర్‌ లిఫ్టింగ్‌, బెంచ్‌ ప్రెస్‌ విభాగాల్లో సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ బాలబాలికలు, మాస్టర్స్‌ సీ్త్ర, పురుష క్రీడాకారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 31 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివరాలకు 8142555000ను సంప్రదించాలని సూచించారు.

సీఐపై దాడి కేసులో

నిందితుల అరెస్టు

ఒంగోలు టౌన్‌: విధి నిర్వహణలో ఉన్న ఒంగోలు టూటౌన్‌ సీఐ మేడా శ్రీనివాసరావుపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు శుక్రవారం కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున కర్నూలు బైపాస్‌లోని ఒక హోటల్‌ వద్ద గొడవ చేస్తున్న యువకులను అదే సమయంలో అటుగా వచ్చిన టూటౌన్‌ సీఐ మందలించారు. పీకలదాకా తప్పతాగిన ఆ యువకులు ఎదుట ఉన్నది పోలీస్‌ అధికారి అనే స్పృహ లేకుండా అనూహ్య రీతిలో దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేయడంతో సీఐ తలకు గాయమైన సంగతి పాఠకులకు తెలిసిందే. కాగా, పరారైన నిందితులు కొత్తపట్నం మండంల ఆలూరు గ్రామానికి చెందిన తూముకూరి చంద్రశేఖర్‌, ఒంగోలు నగరంలోని కొప్పోలుకు చెందిన పాటూరి ప్రశాంత్‌ కుమార్‌, క్లౌపేటకు చెందిన దొడ్డి స్టీఫెన్‌ రాజాగా గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం

సింగరాయకొండ: ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి(47) మృతి చెందిన సంఘటన శుక్రవారం సింగరాయకొండ మండల పరిధిలోని దేవి సీ ఫుడ్స్‌ సమీపంలో వెలుగుచూసింది. ఒంగోలు జీఆర్పీ ఎస్సై కె.మధుసూదనరావు కథనం ప్రకారం.. మృతునికి సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. శరీరంపై మెరూన్‌ రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా ఇతను రైల్లో నుంచి జారిపడ్డాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయంపై విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440627647కు సమాచారం అందించాలని కోరారు.

లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

మద్దిపాడు: లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం మద్దిపాడు మండలంలోని బెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. వడ్లమూడి సరోజనమ్మ(70) తమ సుగ్రామమైన మేదరమెట్ల నుంచి వెల్లంపల్లికి బయలుదేరింది. జాతీయ రహదారిపై దిగి అక్కడ నుంచి వెల్లంపల్లి వెళ్లడానికి జాతీయ రహదారి దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో సరోజనమ్మ తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు మద్దిపాడు 108 వాహన సిబ్బంది వృద్ధురాలిని ఒంగోలులోని కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. మద్దిపాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement