తిరగబడ్డ జెండా రంగులు
దర్శి(కురిచేడు): వీర సైనికులకు మద్దతుగా శనివారం దర్శి పట్టణంలో త్రివర్ణపతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, సీఐ రామారావు, మాజీ సైనికోద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. త్రివర్ణపతాకానికి ఎక్కడా అవమానం జరగకూడదు. అది దేశానికి అవమానం జరిగినట్లు అవుతుందని ప్రతి పౌరుడు భావిస్తారు. అయితే ర్యాలీలో చాలా మంది ధరించిన తీవ్రర్ణ పతాకం టీ షర్టులపై త్రివర్ణాలు తిరగబడ్డాయి. ఈ విషయాన్ని ర్యాలీ నిర్వాహకులు సైతం గమనించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
ఒంగోలు టౌన్: వేగంగా వెళుతున్న ట్రావెల్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం..అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం నుంచి తమిళనాడులోని నాగపట్నం వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నగర శివారులోని త్రోవగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 26 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన జుజ్జవరపు కోటమ్మ, మంద బుల్లమ్మాయి, పులిషారం పుష్ప, తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామానికి చెందిన చలివేంద్ర శ్రీలేఖ, రాయనపాడు గ్రామానికి చెందిన జుజ్జవరపు విక్రమ్, ఉద్దండరాయనిపాలెం గ్రామానికి చెందిన పులి పుష్పలను జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తిరగబడ్డ జెండా రంగులు


