ట్రాక్టర్ల సామగ్రి దొంగకు బేడీలు | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ల సామగ్రి దొంగకు బేడీలు

May 18 2025 1:05 AM | Updated on May 18 2025 1:05 AM

ట్రాక్టర్ల సామగ్రి దొంగకు బేడీలు

ట్రాక్టర్ల సామగ్రి దొంగకు బేడీలు

పుల్లలచెరువు: ట్రాక్టర్ల సామగ్రి దొంగను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లో శనివారం విలేకరులకు వెల్లడించారు. ముటుకుల, కొండారెడ్డి కొష్టాలకు చెందిన రైతులు వాగ్యానాయక్‌, విష్ణువర్ధన్‌రెడ్డిలు ఈ నెల 10వ తేదీన తమ పొలంలో ట్రాక్టర్‌, ట్రాలీ, రోటావేటర్‌ను దొంగలు అపహరించారని ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్‌ నేతృత్వంలో ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తమ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. సీఐ ప్రభాకర్‌ కథనం ప్రకారం.. నిందితుడి కోసం పోలీసులు అందుబాటులో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. అనుమానం ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం మృత్యుంజపురానికి చెందిన దూదేకుల హుస్సేన్‌గా తేలింది. అతను ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. చెడు వ్యసనాలకు బానిసై తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో పొలాల్లో ఉండే రొటావేటర్లు, కల్టివేటర్లు, ట్యాంకర్‌లను దొంగలించి వాటిని అమ్ముకునేవాడు. ఈ క్రమంలో మార్చి 23వ తేదీన ఐటీ వరంలో ట్రక్కు, రోటావేటర్‌ను దొంగలించి వాటిని తన స్వగ్రామం తీసుకెళ్లాడు. ఈ నెల 9వ తేదీన త్రిపురాంతకంలో నీటి ట్యాంకర్‌ను దొంగలించాడు, మే 10న మానేపల్లి వద్ద ట్రాక్టర్‌ను, ట్రాలీను తీసుకెళ్లాడు. మళ్లీ దొంగతనం చేసేందుకు తన ట్రాక్టర్‌తో ముటుకుల వస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి ట్రాక్టర్‌, రెండు రోటావేటర్‌లు, నీళ్ల ట్యాంకర్‌, రెండు ట్రక్కులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.14.60 లక్షలు ఉంటుందని సీఐ ప్రభాకర్‌ మీడియాకు వెల్లడించారు. నిందితుడి దూదేకుల హుస్సేన్‌ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టినట్లు ఆయన వివరించారు.

ఎస్పీ ప్రత్యేక అభినందనలు

కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడంలో కీలకప్రాత పోషించిన డీఎస్పీ నాగరాజు, సీఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌, ఏఎస్‌ఐ ప్రసాద్‌, సిబ్బంది రమేష్‌, అరుణ్‌కుమార్‌, వీరాంజనేయులు, నాగరాజు, సురేష్‌, కాశీబాబు, శివనాగరాజులను ఎస్పీ దామోదర్‌ అభినందించారు. ఎస్పీ రివార్డులు ప్రకటించగా వాటిని సంబంధిత సిబ్బందికి అందించినట్లు సీఐ ప్రభాకర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement