
పరిశ్రమల్లో పటిష్ట భద్రతా చర్యలు
ఒంగోలు సబర్బన్: ప్రమాదకర పరిశ్రమల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కల్లెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సీహెచ్ శైలేంద్రకుమార్‌తో పాటు జిల్లాలోని క్రైసిస్ గ్రూపు ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సఽందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రమాదకర ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయరు చేయాలని సూచించారు. ప్రధానంగా అమ్మోనియా వినియోగిస్తున్న ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయో స్వయంగా పరిశీలించాలని క్రైసిస్ గ్రూప్ అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు ఆయా ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాలను నిశితంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో నాలుగు హజార్డస్ ఫ్యాక్టరీలు ఉన్నాయని నెల్లూరు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ తెలిపారు. సేఫ్టీ మెజర్స్‌లో భాగంగా చెరువుకొమ్ముపాలెంలోని భగీరధ ఫ్యాక్టరీలో, అమ్మోనియా వినియోగించే ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఐస్ ప్లాంట్స్, రొయ్యల ప్రొసెసింగ్ ప్లాంట్స్, మిల్క్ చిల్లింగ్ సెంటర్లలో ప్రమాదాల నివారణపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివిధ పరిశ్రమలు సంయుక్తంగా నిర్వహించినట్లు ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. సమావేశంలో ఫైర్, పొల్యూషన్, డీఎంహెచ్‌ఓ, డీటీఓ, అగ్రికల్చర్, ఏపీపీసీబీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే విద్యుత్ అదాలత్
పొదిలి రూరల్: వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే విద్యుత్ అదాలత్ ముఖ్య ఉద్దేశమని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసల్ ఫోరం(సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు. మంగళవారం పొదిలిలోని మంజునాథ కల్యాణ మండపంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేస్తూ వినియోగదారులతో మర్యాదగా మెలగాలని సూచించారు. రెండేళ్ల కాలపరిమితిలోగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై 20 అర్జీలు రాగా 15 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యుత్ అదాలత్ ప్రతి జిల్లాలో నెలకోసారి ఏర్పాటు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాసరావు, ఏడీఈ హరిబాబు, 10 మండలాలకు చెందిన ఏఈలు, పలవురు వినియోగదారులు పాల్గొన్నారు.
అమ్మోనియా వినియోగిస్తున్న ఫ్యాక్టరీల్లో విస్తృత తనిఖీలు
జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్

పరిశ్రమల్లో పటిష్ట భద్రతా చర్యలు