ఒంగోలు టౌన్: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్‌కు ఒంగోలు ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఘనంగా నివాళులర్పించింది. నగరంలోని బాపూజీ కాంప్లెక్స్‌లో మంగళవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దేశ యువతకు మురళీ నాయక్ త్యాగం స్ఫూర్తిగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, అసోసియేషన్ ప్రసిడెంట్ నరసింహరాజు, కార్యదర్శి చిరంజీవి, సహాయ కార్యదర్శి జై రాజు , ఉన్నం హరిబాబు, బోడపాటి శ్రీనివాసరావు, మోడ్రన్ వెంకటేశ్వరరావు, అనిల్ బాబు,బిపిఎల్ బాషా తదితరులు పాల్గొన్నారు.
2026 జూలైకి వెలిగొండ నీళ్లు విడుదల
● జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు
ఒంగోలు సబర్బన్: వెలిగొండ ప్రాజెక్టు నుంచి 2026 జూలైలో నీళ్లు విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కొండ మీద ఉన్న ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో జిల్లా జలవనరుల శాఖ ప్రాజెక్టు అధికారులు, ఆ శాఖ కార్యదర్శి జి.సాయి ప్రసాదు, కలెక్టర్ ఏ.తమీమ్ ఆన్సారియాలో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జూలైలో స్టేజ్–1 కింద సాగు నీరు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా శ్రీశైలం ఎగువ జలాలను రెండు టన్నెళ్ల నుంచి ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను నింపేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.
అందుకుగాను స్టేజ్–1 పరిధిలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. తీగలేరు, గొట్టిపడియ ఛానళ్ల ద్వారా స్టేజ్– 1 కింద నీరిచ్చే విధంగా పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలను పరిష్కరించాలని, అందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా మిగిలి ఉన్న భూముల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్ జిల్లా సీఈ బి.శ్యాం ప్రసాదు, ఎస్‌ఈ సి.నాగమురళీ మోహన్, డీఎస్‌ఈ హరి కిషన్‌రాజ్, మార్కాపురం ఈఈ అబుతలేం, జలవనరుల శాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమస్యకు తగిన పరిష్కారం చూపాలి
ఒంగోలు సబర్బన్: అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక్ఙలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్ధసారధి, వరకుమార్, కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉర్దూ లైబ్రరీపై అవగాహన ప్రదర్శన
ఒంగోలు వన్‌టౌన్: ఉర్దూ లైబ్రరీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒంగోలు ఇస్లాంపేటలో మంగళవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి పార్ధసారధి మాట్లాడుతూ ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో అధికార భాషగా గుర్తించిందన్నారు. ఉర్దూ లైబ్రరీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ఉర్దూ లైబ్రేరియన్ పఠాన్ తాహెరున్నీసా ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది సుధాకర్, అంకమ్మరావు, అశోక్, స్థానిక ముస్లిం సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఉర్దూ లైబ్రరీపై అవగాహన ప్రదర్శన