
బంగారు దుకాణంలో చోరీ
● 40 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ
కనిగిరిరూరల్: పట్టణంలోని బోడ్డుచావిడి సెంటర్‌లో ఉన్న అచ్చుత పద్మ శివ జ్యూయలరీ షాపులో మంగళవారం చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యుయలరీ షాపు యజమాని అచ్చుత పద్మ సొంత పనులపై తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లగా దుండగులు షాపులోకి ప్రవేశించి షాపులోని సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఈ మేరకు పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం తెలిపారు. సీఐ ఎస్‌కే ఖాజావలి, ఎస్సైలు టీ శ్రీరాం, మాధవరావులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.