
భక్తిశ్రద్ధలతో కంపకల్లి
ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి
హనుమంతునిపాడు: హరి నామ స్మరణతో హనుమంతునిపాడు మండలంలోని గొల్లపల్లి మారుమోగింది. ఇక్కడి నాగులేటి ఒడ్డున వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశ్వస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం కంపకల్లి ఉత్సవంతో ముగిశాయి. పాలెగాళ్లు తమ ఆచార సంప్రదాయల ప్రకారం పూజలు చేసి మేకపోతు గావు నిర్వహించారు. పోతురాజుల వీర కేకల నడుమ స్వామి వారి ఉత్సవమూర్తులతో కంపకల్లి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు. వాలిచర్ల, పెద్దగొల్లపల్లికి చెందిన చెక్కా వంశస్తులు ముందుగా కంపకల్లిపై దొర్లగా అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించారు. కంపకల్లిపై దొర్లితే సంతాన ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో దంపతులు, ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. కనిగిరి సీఐ ఖాజావలి, ఎస్సైలు మాధవరావు, కొండయ్య, శ్రీరామ్, పోలీసులు, అంగన్‌వాడీ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో కంపకల్లి