
మర్కటంగారి.. పానీ కహానీ..
ఎండ దెబ్బకు ఠారెత్తిపోయిన ఓ మర్కటం దప్పిక తీర్చుకునేందుకు నానాపాట్లు పడింది. నీళ్ల ట్యాంక్‌పై కూర్చుని ఇది ప్రదర్శించిన హావభావాలు చూసినవారు కాసేపు ఆశ్యర్యచకితులయ్యారు. భక్తులు ఇచ్చిన ఆహారం తాపీగా తినేసిన తర్వాత ఎవరైనా గుక్కెడు నీళ్లు పోయకపోరా అని ఎదురుచూసింది. అంతలోనే ఇక లాభం లేదనుకుని ట్యాంక్ వద్ద కుప్పిగంతులేసి ఓ కుళాయి తిప్పి దాహం తీర్చుకుంది. ఈ దృశ్యాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.
– కొనకనమిట్ల

మర్కటంగారి.. పానీ కహానీ..

మర్కటంగారి.. పానీ కహానీ..

మర్కటంగారి.. పానీ కహానీ..