breaking news
china
-
చైనా నగరాలు చూసొచ్చా.. మన లీడర్లు మోసం చేస్తున్నారేమో!
రోజూ మన కళ్లముందు కనిపించే రోడ్లు.. ట్రాఫిక్.. నగరాల పరిస్థితి.. ఇవన్నీ మనకు అలవాటైపోయినవే. కానీ, కొన్నిసార్లు మరో దేశంలోని నగరాలను చూసిన తర్వాత.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది. ఓ విదేశీ పర్యటన.. తిరిగొచ్చాక చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్.. ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.‘చైనాలోని సాధారణ నగరాలను సందర్శించి తిరిగి భారత వీధుల్లోకి వస్తే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, మొత్తం వ్యవస్థ మనల్ని ఎంతగా మోసం చేసిందో అర్థమవుతుంది’ అంటూ భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్ రాజేశ్వరి అయ్యర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆమె పోస్టుకు భారీగా లైక్స్, షేర్లు, కామెంట్లు వచ్చాయి. చైనాలోని నగరాల దృశ్యాలతో కూడిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.‘ఇలాంటి పోస్టులు పెడితే పరువునష్టం కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘చైనా అభివృద్ధిని మెచ్చుకునేవాళ్లు.. అక్కడి నియంత్రణల గురించి కూడా మాట్లాడాలి’ అని మరో వ్యక్తి బదులిచ్చారు. ఇంకొకరు స్పందిస్తూ.. ‘చైనాలో ఇలా బహిరంగంగా మాట్లాడితే.. ఉదయానికే కనిపించరు. భారత్‌లో మాత్రం యువత రోడ్డెక్కి నిరసనలు తెలిపేంత స్వేచ్ఛ.. ఇంత ప్రజాస్వామ్యం ఉంది’ అని వ్యాఖ్యానించారు.Once you visit random cities in China and come back to Indian streets, you realize how much you’ve been scammed by your local MLAs, MPs, IAS and the whole system. pic.twitter.com/uETFhAjSvk— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 25, 2026అంత దాకా ఎందుకు..అయితే ఆమె వ్యాఖ్యలకు అందరూ ఏకీభవించలేదు. కొందరు నెటిజన్లు చైనాతో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని.. బ్యాంకాక్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా వంటి దేశాల్లోని నగరాలను చూసినా భారత్‌లో మౌలిక వసతులు, పరిశుభ్రత, పౌర సదుపాయాల్లో తేడా కనిపిస్తుందని కామెంట్ చేశారు. ‘చైనానే కాదు.. బ్యాంకాక్ వెళ్లినా అభివృద్ధి, పరిశుభ్రత, పౌరస్పృహలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది’ అంటూ ఒకరు స్పందించారు. మరికొందరు వియత్నాం, ఇండోనేషియా, మలేసియాలను కూడా ప్రస్తావించారు.చైనా మోడల్‌పై మరో వాదనమరోవైపు.. చైనా నగరాల్లో కనిపించే వేగవంతమైన రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైస్పీడ్ రైళ్లను ప్రశంసించిన కొందరు నెటిజన్లు.. వాటిని భారత్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థతో నేరుగా పోల్చడం సరికాదని వాదించారు. చైనాలోని వేగవంతమైన అభివృద్ధి వెనుక ఒకే పార్టీ పాలన, కేంద్రీకృత నిర్ణయ వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయని కొందరు ప్రస్తావించారు. ప్రజా పర్యవేక్షణ, రాజకీయ స్వేచ్ఛ, సోషల్ క్రెడిట్ వ్యవస్థ వంటి అంశాలను కూడా వారు చర్చలోకి తీసుకొచ్చారు.భిన్నాభిప్రాయాలుచైనా హైస్పీడ్ రైళ్లను మెచ్చుకున్న ఒక నెటిజన్.. వాటి నిర్మాణానికి తక్కువ కార్మిక వ్యయం, జపాన్ నుంచి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు కూడా కారణమని వ్యాఖ్యానించారు. రైళ్ల నిర్మాణం ఒకవైపు ఉద్యోగాల కల్పన, మరోవైపు రవాణా వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమంగా సాగిందని పేర్కొన్నారు. కేవలం రైళ్ల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని దేశాల మధ్య పోటీని అంచనా వేయడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. దుబాయ్‌లాంటి చోట్ల రోడ్లు, భవనాల నిర్మాణానికి మన దేశం నుంచి కార్మికులు వెళ్తారని, వాళ్లనే ఉపయోగించి ఇక్కడ హైక్లాస్ రోడ్లను నిర్మించడం మన ప్రభుత్వాలకు చేత కాదా? అంటూ ఒకరు ప్రశ్నించారు.నెహ్రూ.. మోదీని మాత్రమే నిందించాలా?భారత్‌లో మౌలిక వసతుల సమస్యలకు రాజకీయ నాయకులను మాత్రమే బాధ్యులను చేయడం సరిపోదని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రభుత్వాలను నిందించడం కంటే.. దశాబ్దాలుగా కొనసాగుతున్న అధికార యంత్రాంగం, అవినీతి, జవాబుదారీతనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రాజకీయ సంకల్పంతో పాటు అధికార వ్యవస్థలోనూ మార్పులు అవసరమని ఆ వ్యాఖ్య సారాంశం.ఎవరీ రాజేశ్వరి అయ్యర్?డాక్టర్ రాజేశ్వరి అయ్యర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్. ఆమె ఎక్స్ ప్రొఫైల్‌లో ఎన్ఐటీ పుదుచ్చేరి, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థినిగా, డైరెక్టర్, ప్రొఫెసర్‌గా వివరాలు ఉన్నాయి. భారత్‌లో రిజర్వేషన్లు, పన్నులు, ప్రభుత్వ వ్యవస్థ, ప్రజా మౌలిక వసతులు వంటి అంశాలపై ఆమె తరచూ పోస్టులు చేస్తుంటారు. గతంలోనూ భారత్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లడానికి కారణాలను వివరిస్తూ ఆమె చేసిన పోస్టులు వార్తల్లో నిలిచాయి.She is visiting the Netherlands. This is how the Netherlands looks.Hope the Bihar MLA can transform Bihar and make it look like this one day. https://t.co/VzRVQ2rmZe pic.twitter.com/8qpU7yTFMi— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 26, 2026చైనా పర్యటన అనుభవం నుంచి మొదలైన ఈ పోస్టు ఇప్పుడు కేవలం చైనా-భారత్ నగరాల పోలికకే పరిమితం కాకుండా.. మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక, అధికార యంత్రాంగం, అవినీతి, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం వంటి విస్తృత అంశాలపై సోషల్ మీడియా చర్చకు దారితీసింది. -
సహజీవన రాగం సాధ్యమా?
ఆర్థిక రంగం మొదలు కృత్రిమ మేధ (ఏఐ) వరకూ అన్నిటా పరస్పరం హోరాహోరీ తలపడుతున్న బలమైన ప్రత్యర్థులు అమెరికా, చైనాలు నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి కరచాలనం చేసుకున్నాయి. మొన్న మేలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ చైనాలో పర్యటించగా... మూడు రోజుల దౌత్య పర్యటన కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బుధవారం వాషింగ్టన్ వచ్చారు. ఆయనకు రెండురోజులూ ఘనసత్కారాలే దక్కాయి. కెమెరాల ఎదుట అధినేతలిద్దరూ చిరునవ్వులు చిందించటం కూడా చూడముచ్చట గానే ఉంది.కానీ రెండు దేశాల మధ్యా ఉన్న సమస్యలు గానీ,వాటి కారణంగా ఇప్పటికే పేరుకు పోయిన విభేదాలు గానీ చిన్నవేం కాదు. అవి సంక్లిష్టమైనవి, సామరస్య పరిష్కారానికి ఓపట్టాన లొంగనివి. 60వ దశకంలో నాటి రష్యా అధినేత నికితా కృశ్చేవ్ ప్రతిపాదించిన ‘మూడు శాంతుల’ ప్రతిపాదనలో ఒకటైన ‘శాంతియుత సహజీవనం’ సూత్రాన్ని గుర్తుకు తెచ్చేలా సంఘర్షణకన్నా సహకారమే ఇద్దరికీ లాభదాయకమని షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అప్పట్లో కృశ్చేవ్‌కు రానట్టే జిన్‌పింగ్‌కు కూడా ట్రంప్‌నుంచి అనుకూల స్పందనేమీ రాలేదు. కానీ ఇరుపక్షాలూమరింత సమతూక వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవటానికి కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు. ఎగుమతులు పెంచటానికీ, ఆర్థికాభివృద్ధి సాధించటానికీ చైనా ప్రభుత్వం అక్కడి తయారీ రంగ పరిశ్రమలకు భారీయెత్తున సబ్సిడీలిస్తోంది. దాంతో చవగ్గా కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఖనిజాలు, ఉక్కు, ఇతర రకాల సరుకులు పాశ్చాత్య మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఈ వ్యూహం అమెరికానూ, పాశ్చాత్య దేశాలనూ తీవ్రంగా దెబ్బ తీస్తోంది. దీన్ని తగ్గించేందుకు తొలి ఏలుబడిలో ట్రంప్ చేసిన ప్రయత్నాలు కొంత వరకూ ఫలితాన్నిచ్చాయి. నిరుడు దీన్ని మరింత నియంత్రించేందుకు 25 శాతం అదనపు సుంకాలు విధించారు. వాటి కారణంగా సరుకుల వరద తగ్గిన మాట వాస్తవమే అయినా, దాదాపు 40 పాశ్చాత్య దేశాల మీదుగా ఆ వస్తువులు వెల్లువెత్తటం ట్రంప్‌కు తలనొప్పిగా మారింది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చైనా ఇదంతా చేస్తోంది. ఎవరెంతగా మొత్తుకుంటున్నా విదేశాలతో నిరుడు చైనా వాణిజ్య మిగులు లక్ష కోట్ల డాలర్ల పైమాటే. ఈమధ్యే అమెరికా మాజీ ఆర్థికమంత్రి జానెట్ ఎలెన్ అంతంతమాత్రంగా ఉన్న అమెరికా పారిశ్రామిక రంగం ‘చైనా షాక్’తో మరింత కుంగటం ఖాయమని చేసిన హెచ్చరిక వర్తమాన స్థితికి అద్దం పడుతోంది. చైనా సరుకులపై వ్యామోహంతగ్గించుకోమంటూ జనానికి చేసే హితబోధలేమీ పనిచేయటం లేదు. ‘మాగా’ పేరు చెప్పి ఆవేశంతో ఊగిపోయేవారు సైతం ఈ విషయంలో ట్రంప్ మాటల్ని బేఖాతరు చేస్తున్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలో చైనాపై గత నెలలో 12.5 శాతం అదనపు సుంకాలు విధించారు. కానీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుకోవాలన్న అవగాహన కుదిరాక గత నెలలో కొన్ని వస్తువులకు దీన్నుంచి మినహాయింపునిచ్చారు. నవంబర్‌తో ముగియాల్సిన ఆ వెసులుబాటును తాజాగా వచ్చే జనవరి 10 వరకూ పొడిగించారు. అమెరికాతో సంఘర్షణ ముదిరితే జరిగే పర్యవసానాలేమిటో చైనాకు తెలియంది కాదు. అందుకే అది ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. సుంకాలవల్ల అమెరికాలో కోల్పోయే నష్టాన్ని యూరోప్ దేశాల్లో భర్తీచేసుకుంటోంది. అలాగే తమవల్ల నష్టపోయే దేశాల్లో పరిశ్రమలు స్థాపిస్తామని, పెట్టుబడులు పెడతామని ప్రతిపాదిస్తోంది. ఆ దేశాల్లో భారీయెత్తున ఉద్యోగావకాశాలొస్తాయని ఊరిస్తోంది. ఈ వంకనే ప్రపంచాన్ని మభ్యపెట్టి నిలువు దోపిడీచేసిన చరిత్రగల అమెరికా, యూరోప్ దేశాలు వీటిని అంత తేలిగ్గాఅంగీకరిస్తాయా? ఈ విషయమై చైనాతో ఈయూ వచ్చేనెలలో చర్చించబోతోంది. కానీ ఫలితం ఉంటుందన్న ఆశ మాత్రం లేదు. అమెరికా–చైనా ఘర్షణలు ముదిరితే బాగుండు నని అవి కోరుకుంటున్నాయి. ఆ మాటెలా వున్నా ట్రంప్, జిన్‌పింగ్‌లిద్దరూ చైనాలోనవంబర్లో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం, డిసెంబర్లో అమెరికాలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుల సందర్భంగా కలుసుకోబోతున్నారు. అప్పటికల్లా వాణిజ్య సమస్య ఉపశమించాలని రెండు దేశాలకూ కోరికైతే ఉంది. కానీ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య అదంత సులభం కాదని చరిత్ర చెబుతోంది. -
చైనా స్విమ్మర్‌కు సప్త స్వర్ణాలు
నగోయా: ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేస్తూనే చైనా టీనేజ్ స్విమ్మర్ జాంగ్ జాన్షువో రికార్డు పుటల్లోకి ఎక్కాడు. శుక్రవారం జరిగిన పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో జాంగ్ స్వర్ణం సాధించాడు. దాంతో ఒకే ఆసియా క్రీడల్లో అత్యధికంగా 7 స్వర్ణాలు గెలిచిన క్రీడాకారుడిగా ఉత్తర కొరియా షూటర్ సో గిల్ సాన్ (1982 న్యూఢిల్లీలో 7 స్వర్ణాలు) పేరిట ఉన్న రికార్డును 19 ఏళ్ల జాంగ్ జాన్షువో సమం చేశాడు. అంతేకాకుండా ఒకే ఆసియా క్రీడల్లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన స్విమ్మర్‌గా రికార్డుసృష్టించాడు. తాజా గేమ్స్‌లో జాంగ్ 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో, 4్ఠ100 మీటర్ల రిలే, 4్ఠ200 మీటర్ల రిలే, 4్ఠ100 మీటర్ల రిలే ఈవెంట్లలో స్వర్ణ పతకాలు గెలిచాడు. -
చైనా ముందుగా అడుగుపెడితే.. జరిగేది ఇదే..!
చంద్రుడిపై మరో అంతరిక్ష పోరుకు తెరలేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనా మధ్య పోటీ ఇప్పుడు భూకక్ష్య దాటి ఏకంగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరింది. అక్కడి విలువైన నీటి మంచు నిల్వలున్న ప్రాంతాలను ముందుగా ఎవరు చేజిక్కించుకుంటారన్నది కీలకంగా మారింది. చైనా ముందుగా అడుగుపెడితే.. కీలక ప్రాంతాల్లో అమెరికాకు ప్రవేశం లేకుండా చేసే పరిస్థితి రావొచ్చని నాసా చీఫ్ జారెడ్ ఐజాక్మన్ హెచ్చరించారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘ఆఫ్ వరల్డ్’ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.చైనాకు చెందిన చాంగ్ఈ-7 మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంలోని షాకిల్టన్ క్రేటర్‌ను లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎప్పటికీ సూర్యకాంతి పడని ప్రాంతాలు ఉన్నాయి. వీటిని ‘కోల్డ్ ట్రాప్స్’గా పిలుస్తారు. అక్కడ నీరు మంచు రూపంలో ఉండటంతో పాటు భవిష్యత్ చంద్ర పరిశోధనలకు ఉపయోగపడే ఇతర పదార్థాలు కూడా పేరుకుపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అయితే చైనా గత నెలలో చాంగ్ఈ-7 మిషన్‌ను వాయిదా వేసింది. ఈ మిషన్‌లో చంద్రుడి ఉపరితలంపై గతంలో లభించని స్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, మొబైల్ హాపర్ అనే నాలుగు రకాల రోబోటిక్ వాహనాలను ఉపయోగించనున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో మేం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాన్నే వారు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని వారాల క్రితం చాంగ్ఈ-7 వాయిదా పడటం వల్ల మనం ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకున్నట్టే. ఆ మిషన్ షాకిల్టన్ క్రేటర్‌కు వెళ్లాల్సి ఉందని ఐజాక్మన్ పేర్కొన్నారు.చంద్రుడిపై చైనా ‘ఎక్స్‌క్లూజన్ జోన్లు’ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు అమెరికా అధికారుల్లో పెరుగుతున్నాయి. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే వాహనాల చుట్టూ భద్రతా నిబంధనల ప్రకారం సాధారణంగా 1 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రవేశ నిషేధ ప్రాంతం ఉండాల్సి ఉంటుంది. దీంతో ముందుగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్న దేశం.. ప్రత్యర్థి దేశాల ప్రవేశాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడొచ్చని అమెరికా భావిస్తోంది.చాంగ్ఈ-7లో రోవర్లతో పాటు హాపర్ డ్రోన్లు కూడా ఉంటాయని ఐజాక్మన్ తెలిపారు. చంద్రుడిపై ఉన్న నీటి మంచుతో నేరుగా పని చేయడం.. దాని గురించి అధ్యయనం చేయడం చైనా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎవరు ముందుగా చంద్రుడిపైకి దిగుతారనే విషయంలో వెనుకబడితే.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందంటూ ఐజాక్మన్ వ్యాఖ్యానించారు. చైనా చాంగ్ఈ-7 మిషన్‌ను వాయిదా వేయడంతో చంద్రుడి దక్షిణ ధ్రువానికి ముందుగా చేరుకునే అవకాశం ప్రస్తుతం నాసాకు కూడా లభించింది. బ్లూ ఆరిజిన్‌కు చెందిన ‘బ్లూ మూన్ మార్క్-1’ వాహనాన్ని తొలిసారిగా 2027లో ప్రయోగించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ భారీ ల్యాండర్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి నాసాకు చెందిన రెండు ప్రోబ్స్ను పంపే అవకాశం ఉంది.చంద్ర పరిశోధనలో అగ్రశక్తిగా ఎదగడానికి చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. అంతరిక్ష రంగంలో చైనా పురోగతిని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘చిరకాల కల’గా అభివర్ణించారు. 1972లో అమెరికా తర్వాత చంద్రుడిపై మనుషులను పంపే రెండో దేశంగా నిలవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపే లక్ష్యం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం -
ఎఫ్–35 విడిభాగాలు హాంకాంగ్‌కు ఎలా చేరాయి?
వాషింగ్టన్: అత్యంత ఆధునిక ఎఫ్–35 యుద్ధ విమానం విడి భాగాలు హాంకాంగ్‌కు మళ్లడంపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ దర్యాప్తు చేపట్టింది. ఎఫ్–35 విడిభాగాలు చైనాకు చేరాయంటూ బుధవారం బ్లూమ్‌బర్గ్‌లో వెలువడిన వార్త తీవ్ర సంచలనం రేపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అత్యంత ఆధునిక యుద్ధ విమానం విడిభాగాలు పక్కదారి పట్టిన అంశం తమ దృష్టికి వచ్చిందని ఎఫ్–35 జాయింట్ ప్రోగ్రామ్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ విడిభాగాలను తిరిగి తీసుకువచ్చేందుకు, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు పెంటగాన్ అధికారులు, సంబంధిత కంపెనీ లాక్‌హీడ్ మార్టీన్తో చర్చలు జరుపుతున్నామన్నారు. తమకు అందాల్సిన ఎఫ్–35 విడిభాగాలు కొన్ని పొరపాటున హాంకాంగ్‌కు చేరాయంటూ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ మంగళవారం మొదటిసారిగా బాంబు పేల్చారు. అయితే, అవి నిజంగా కీలకమైన విడిభాగాలేనా అన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఈ అంశాన్ని అమెరికా ప్రభుత్వం, లాక్‌హీడ్ మార్టిన్ చూసుకుంటాయన్నారు. దీనిపై లాక్‌హీడ్ మార్టీన్ స్పందించలేదు. ఈ విషయం తమకు తెలియదని చైనా విదేశాంగ శాఖ పేర్కొనగా, ఇటువంటి సున్నితమైన అంశాలపై వ్యాఖ్యానించలేమని హాంకాంగ్ ప్రభుత్వం తెలిపింది. అమెరికా నుంచి ఆ్రస్టేలియాకు చేరుకోవాల్సిన ఆ పరికరాలు అందుకు బదులుగా హాంకాంగ్‌కు మళ్లాయి. అత్యంత సున్నితమైన సాంకేతికతతో రూపొందించిన ఈ పరికరాలను చైనా స్వా«దీనం చేసుకుని ఉండొచ్చని పొలిటికో తన కథనంలో అనుమానాలు వ్యక్తం చేసింది. సొంత సైన్యం, విదేశాంగ విధానం లేని హాంకాంగ్‌పై చైనా ప్రభుత్వ పూర్తి నియంత్రణ కొనసాగుతుండటం తెల్సిందే. ఎఫ్–35కు ఎందుకంత ప్రాముఖ్యత? ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు అమెరికాలోని టెక్సాస్‌లో 20 ఏళ్ల క్రితం మొదటిసారిగా తయారయ్యాయి. ఇప్పటి వరకు 1,200 వరకు ఇవి తయారయ్యాయి. 19 దేశాల్లో సేవలందిస్తున్నాయి. అత్యంత ఆధునాతన సాంకేతికత కలిగిన ఈ యుద్ధ విమానాలు కలిగిన దేశాల్లో ఆ్రస్టేలియా ఒకటి. 2013లో చైనా సైబర్ దాడుల ద్వారా దొడ్డిదారిన చేజిక్కించుకున్న అమెరికా పరిజ్ఞానంలో ఎఫ్–35కు సంబంధించినవి కూడా ఉన్నట్లు పెంటగాన్ 2013లో వెలువరించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఎఫ్–35 విమానం అమెరికాలోనే అత్యుత్తమమైన, అత్యంత అధునాతనమైన ఫైటర్ జెట్. అమెరికా మిలిటరీ వ్యవస్థలు నిరంతరం అప్డేట్ అవుతుంటాయని, ఏళ్ల క్రితం ఎవరైనా కొంత పరిజ్ఞానాన్ని దొంగిలించినా పెద్ద ముప్పేమీ లేదని వాషింగ్టన్కు చెందిన ’ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్’సంస్థ సీనియర్ డైరెక్టర్ బ్రాడ్లీ బౌమన్ తెలిపారు. ఐదో తరం ఫైటర్ జెట్‌గా పేర్కొనే ఎఫ్–35 సాంకేతికతలో స్టెల్త్ కోటింగ్స్‌తో పాటు అధునాతన రాడార్, సెన్సార్లు ఉన్నాయి. శత్రువులను మెరుగ్గా గుర్తించేందుకు అధునాతన సెన్సార్లతో పాటు, యుద్ధ సమయంలో మిత్రదేశాల విమానాలు, యుద్ధక్షేత్రంలోని సైనిక బలగాలతో సమాచారాన్ని పంచుకోవడానికి అవసరమైన నెట్వర్కింగ్ సామర్థ్యాలు కూడా ఈ విమానానికి ఉన్నాయని బౌమన్ చెప్పారు. -
చైనా రహస్య అణు పరీక్షలపై అమెరికా ఏం చేసిందంటే?
చైనా వేగంగా విస్తరిస్తున్న అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం డ్రాగన్ దేశంతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న అణు పరీక్షల నిషేధాన్ని బీజింగ్ పాటిస్తోందా? లేదా? అన్నదానిపై అమెరికాకు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి.బహుపాక్షిక సమావేశాల సందర్భంగా ఈ చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు. జెనీవా, న్యూయార్క్, మొరాకోలోని కాసాబ్లాంకాలో జరిగిన సమావేశాల చివర అమెరికా, చైనా ప్రతినిధులు ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. చైనా అత్యంత తక్కువ స్థాయి అణు పరీక్షలను రహస్యంగా నిర్వహించిందన్న ఆరోపణలను పరిష్కరించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు.చైనా అణ్వాయుధ నిల్వలు, సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజింగ్ అణు పరీక్షలపై అంతర్జాతీయంగా అమల్లో ఉన్న నిషేధాన్ని పాటిస్తోందా అనే ప్రశ్నలను అమెరికా లేవనెత్తుతోంది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు బహిరంగంగా కాకుండా గోప్యంగా కొనసాగుతున్నాయి.ఇంతకుముందు కూడా చైనా 2020లో అత్యంత తక్కువ స్థాయి అణు పరీక్ష నిర్వహించి ఉండొచ్చని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. చైనాలోని లోప్ నూర్ ప్రాంతంలో 2020 జూన్ 22న నమోదైన భూకంప తరహా ప్రకంపనలను అమెరికా అధికారులు దీనికి ఆధారంగా ప్రస్తావించారు. అయితే అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలు ఆ ప్రకంపనలకు అణు పరీక్షే కారణమని నిర్ధారించలేదు. చైనా కూడా రహస్య అణు పరీక్షలు నిర్వహించిందన్న ఆరోపణలను ఖండించింది.ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య అణ్వాయుధ నియంత్రణ, వాణిజ్యం, సాంకేతికత, భద్రత వంటి పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రహస్య సంప్రదింపులు కీలకంగా మారాయి. రాబోయే చర్చల్లో చైనా అణు పరీక్షలపై అమెరికా చేసిన ఆరోపణలకు బీజింగ్ ఎలాంటి సమాధానం ఇస్తుందో, అణ్వాయుధ నియంత్రణపై ఇరు దేశాలు ఏదైనా ముందడుగు వేస్తాయో చూడాల్సి ఉంటుంది. -
జస్ట్ ఆరేళ్లు, నాలుగే సెకన్లు : ప్రపంచ రికార్డు బ్రేక్!
బీజింగ్: నాలుగంటే నాలుగే సెకన్లు... ఇంత తక్కువ సయయంలో రూబిక్ క్యూబ్పైని రంగులు సరి చేసి ఆరేళ్ల చైనా బాలిక లియాన్ యూంగ్జీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఈ నెల మొదట్లో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడం విశేషం. చైనాలోని వూహాన్ నగరంలో వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ సర్టిఫై చేసిన పోటీల్లో లియాన్ ముందు 4.52 సెకన్లతో రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించింది. ఆ తరువాత గాంగ్జౌలో జరిగిన ఇంకో పోటీలో మరింత తక్కువ సమయం అంటే 4.27 సెకన్లలోనే పూర్తి చేసిందని చైనా అధికారిక ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. A six-year-old Chinese girl has set a new women's world record by solving Rubik’s cubes at an average pace of just over four seconds per cube.It was the second time in three days Lian Yunzhi set a new record, having first done with an average time of 4.52 seconds. pic.twitter.com/8q0sdaCm29— ABC News (@ABC) September 23, 2026 రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడంలో సగటున 4.5 సెకన్ల కంటే తక్కువ సమయం మాత్రమే తీసుకున్న మొదటి స్పీడ్ క్యూబర్ లియాన్ అని తెలిపింది. వూహాన్ పోటీల్లో తలకు ఎర్రటి పట్టీ కట్టుకుని చిట్టి చేతులతో రూబిక్ క్యూబ్‌ను పట్టుకున్న లియాన్‌ను చూస్తే చాలా సీరియస్‌గా కనిపించింది కానీ.. ఒకానొక ప్రయత్నంలో 3.54 సెకన్లలోనే క్యూబ్‌ను పరిష్కరించడంతో ఆ బాలిక పెదవులపై చిరునవ్వు తొణికిస లాడింది. నాలుగేళ్ల వయసుండగానే లియాన్ రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడం మొదలుపెట్టిందని, తొలినాళ్లలో ఇందుకు 90 సెకన్ల సమయం పట్టేదని సీసీటీవీ తెలిపింది. రోజూ రెండు మూడు గంటలపాటు ప్రాక్టీస్ చేస్తూ, సుమారు 1300 ఫార్ములాలపై లియాన్ పట్టు సాధించినట్లు సీసీటీవీ తెలిపింది. గతంలో పోటీల్లో పాల్గొనేందుకు సంశయించిన లియాన్ ఇప్పుడు చాలా ధీమాగా కనిపిస్తోందని తల్లి లిన్ యాంగ్జీ తెలిపారు. లియాన్‌కు మంచి శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఆమెను షాంఘైకి కూడా తీసుకెళ్లారట. ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం -
చైనాలో కొత్త ట్రెండ్! ఒంటరితనంతో ₹83 లక్షల కోట్ల బిజినెస్
-
ప్రోటోకాల్ దాటి.. జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన స్వాగతం
అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్న జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లను ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత.. అమెరికా గడ్డపై ఓ విదేశీ నేతకు లభించిన అత్యంత అరుదైన స్వాగతంగా దీని గురించి చర్చ నడుస్తోంది.జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో జిన్‌పింగ్ విమానం దిగగానే రెడ్ కార్పెట్‌పైకి వచ్చిన ట్రంప్ దంపతులు ఆయనకు కరచాలనం చేసి స్వాగతం పలికారు. 21 మంది సభ్యులతో కూడిన గౌరవ వందనం, సైనిక బ్యాండ్, రెండు బి-1 బాంబర్ విమానాల విన్యాసంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్, జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుకుని అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఈ మూడు రోజుల పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం, సైనిక పరేడ్, ద్వైపాక్షిక చర్చలు, స్టేట్ డిన్నర్ జరగనున్నాయి.Chinese President Xi Jinping and his wife, Peng Liyuan, were warmly greeted by U.S. President Donald Trump and his wife, Melania Trump, at the airport in a rare planeside welcome. pic.twitter.com/IoUSosQZ8d— Mulan Chun-Li (@chunlimulan) September 24, 2026ఓ విదేశీ నేతను అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో స్వయంగా స్వాగతించడం.. అదీ సుమారు ఆరు దశాబ్దాల తర్వాత కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ 1962లో పలువురు విదేశీ నేతలను వ్యక్తిగతంగా స్వాగతించారు. ఆ తర్వాత బుష్, ఒబామా కాలంలో పోప్లను మాత్రం స్వాగతించారు. పోటోకాల్ పేరిట అధ్యక్షుడిని మినహాయించి.. విదేశీ నేతలకు అధికార యంత్రాంగం వెల్కమ్ చెప్పటం అక్కడ ఆనవాయితీగా మారిపోయింది. అయితే జిన్‌పింగ్ కోసం ట్రంప్ ఇప్పుడు దానిని చెరిపేశారు.ఎందుకింత ప్రత్యేకం?అమెరికా అధ్యక్షులు సాధారణంగా విదేశీ నేతలను విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా ఆహ్వానించరు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఇలాంటి స్థాయి స్వాగతాలు అత్యంత అరుదు. జిన్‌పింగ్ పర్యటనకు ముందు ట్రంప్ అక్కడికి వెళ్లి స్వయంగా స్వాగతం పలకనున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించడంతోనే ఆసక్తి నెలకొంది.ఈ పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. 2015 తర్వాత అమెరికా రాజధానికి చైనా అధ్యక్షుడి తొలి స్టేట్ విజిట్ ఇది. అయితే 2023లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికా–చైనా శిఖరాగ్ర భేటీ, APEC సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఇప్పుడు మాత్రం అధికారిక స్టేట్ విజిట్‌లో భాగంగా వాషింగ్టన్ చేరుకున్నారు. గత మేలో ట్రంప్ చైనాలో పర్యటించినప్పుడు జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనను కలవలేదు. ఈసారి మాత్రం ట్రంప్ స్వయంగా జిన్‌పింగ్‌ను స్వాగతించడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్?జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టిన రోజే రెండు దేశాల మధ్య వాణిజ్య అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకారం.. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య సంధిని జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం నవంబర్‌లో ముగియాల్సి ఉంది. సుంకాలను తగ్గించడం, కొత్త వాణిజ్య ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సుంకాలు, అరుదైన ఖనిజాలు, చిప్స్, సాంకేతికత వంటి అంశాల్లో విభేదాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.టేబుల్‌పై ట్రేడ్.. ఏఐ.. ఇరాన్.. తైవాన్ట్రంప్–జిన్‌పింగ్ భేటీలో వాణిజ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక అంశంగా ఉండనుంది. ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సాంకేతికతపై ఆందోళనలను చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటు చేసే అంశం కూడా ప్రాథమిక చర్చల్లోకి వచ్చింది.అరుదైన ఖనిజాల సరఫరా కూడా కీలకంగా మారింది. ఎలక్ట్రానిక్స్ నుంచి సైనిక పరికరాల వరకు అనేక రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాకు ఉన్న ఆధిపత్యం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కీలక చిప్స్, ఇతర సాంకేతిక ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ఎగుమతి నియంత్రణలను చైనా వ్యతిరేకిస్తోంది.ఇరాన్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇరాన్‌తో చైనా సంబంధాలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిణామాలు, తైవాన్ అంశాలపై రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మూడు రోజుల పర్యటనలో అసలు చర్చలు గురువారం జరిగే ట్రంప్–జిన్‌పింగ్ సమావేశంపైనే కేంద్రీకృతం కానున్నాయి.భారీ ఏర్పాట్లు.. టెక్ దిగ్గజాలతో విందుజిన్పింగ్ పర్యటనలో భాగంగా గురువారం వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్ నిర్వహించనున్నారు. ఇందులో అమెరికా టెక్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఏఐ, చిప్స్, టెక్నాలజీ రంగాల దిగ్గజాల హాజరు ఈ విందుకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది.శుక్రవారం జిన్‌పింగ్, పెంగ్ లియువాన్లు ట్రంప్ దంపతులతో వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమెరికా చరిత్రకు సంబంధించిన కీలక పత్రాలు భద్రపరిచిన నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి జిన్‌పింగ్ తిరుగు ప్రయాణం కానున్నారు.అమెరికా–చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక, భౌగోళిక రాజకీయ విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. అయితే చర్చల ద్వారా సంబంధాలను అదుపులో ఉంచి, మరోసారి పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయకుండా చూడాలన్న ప్రయత్నం మాత్రం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోంది. -
ఈసారి కాంస్యంతో సరి
గత ఆసియా క్రీడల ఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఈసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 1–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 16–21, 18–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ షి యుకీ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–11, 22–20తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 19–21, 13–21తో ప్రపంచ 12వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ జోడీ 16–21, 21–17, 9–21తో చెన్ బొయాంగ్–లియు యి జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్ మన్నేపల్లి, ధ్రువ్ కపిల కూడా సభ్యులుగా ఉన్నారు. -
చైనా చేతిలో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న భారత జట్టు
ఆసియా క్రీడలు-2026 టోర్నీ పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు చుక్కెదురైంది. సెమీ ఫైనల్లో భారత జట్టు చైనా చేతిలో ఓడిపోయింది. తద్వారా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో తలపడ్డ భారత జట్టు ఆరంభంలో అలరించినా ఆ తర్వాత ప్రత్యర్థి ముందు తలొగ్గింది. సింగిల్స్‌లో షి యు కీ చేతిలో లక్ష్య సేన్ 21-16, 21-18 పాయింట్ల తేడాతో ఓడిపోగా.. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. లియాండ్ వెయ్ కెంగ్, వాంగ్ చాంగ్‌లపై 21-11, 22-20 తేడాతో గెలిచారు.ఇక మూడో మ్యాచ్‌లో లి షి ఫెంగ్ ఆయుశ్ శెట్టిని 21-19, 21-13 తేడాతో ఓడించగా.. నాలుగో మ్యాచ్‌లో హి ఝి టింగ్, లియూ యీ- హరిహరన్ అమ్సకరుణన్, ఎంఆర్ అర్జున్లపై 21-16, 18-21, 21-9 తేడాతో విజయం సాధించారు. దీంతో భారత బ్యాడ్మింటన్ జట్టు చైనా చేతిలో 3-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత్ కాంస్యానికి పరిమితమైంది.ఇప్పటి వరకు లభించిన పతకాలు ఇవేకాగా ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో భారత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క స్వర్ణం గెలిచింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి పసిడి పతకం సాధించింది. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజతం, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇలవేణిల్ వలరివన్ రజతం గెలవగా.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజతం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజతం వచ్చాయి.ఇక మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరా బాయి చాను వెండి పతకం గెలవగా.. రుద్రాంక్ష్ పాటిల్ (షూటింగ్), సుచిక తరియాల్ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) కాంస్యం కైవసం చేసుకున్నారు. మహిళల, పురుషుల స్కీట్ టీమ్‌లో కాంస్యాలు వచ్చాయి. ఇక మెన్స్ సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్‌లో జై మీనా కాంస్యం గెలిచాడు. -
వైద్య వృత్తిని వదలేసి బన్షాప్!
ఏ పని చిన్నది పెద్దది ఉండదు. నిజాయితీగా ఉంటే..మనసుకి నచ్చిన ఏ పనైనా చేయొచ్చు అంటుంటారు పెద్దలు. కాకపోతే చేసేముందే ఇబ్బందులు, సవాళ్లు, బేరీజు చూసుకునే దిగడం అన్ని విధాల శ్రేయస్కరం. ఇదంతా ఎందుకంటో ఓ డాక్టర్ ఎంతో గౌరవప్రదమైన వృత్తి జీవితాన్ని వదలుకుని బన్షాప్ నడుపుతోంది. ఇదేంటి అని విస్తుపోకండి. అయినా అంత ఉన్నత వృత్తిని కాదనుకుని ఆ స్థాయి ఉద్యోగం చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి కూడా. మరీ ఈ డాక్టమ్మ అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా..?.చైనాకు చెందిన 48 ఏళ్ల డాంగ్ విన్ అనే డాక్టరమ్మ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రస్తుతం హుబే ప్రావిన్స్, వూహాన్లో స్టీమ్డ్ స్టఫ్డ్ బన్ షాప్‌ని నిర్వహిస్తోంది. ఆ వ్యాపారాన్ని జస్ట్ మూడేళ్లలోనే విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదింది. అంతేగాదు గత జూలై నెలలోనే రెండో బ్రాంచ్ని కూడా ప్రారంభించిందామె. ఎంతో గౌరవప్రదమైన డాక్టర్ వృత్తి ఎందుకు కాదనుకుందంటే..ఆమె 2023లో ఈ ఉద్యోగానికి రిజైన్ చేసిందట. డాంగ్ డాక్టర్‌గా ఉన్నప్పుడు విపరీతమైన ఒత్తిడికి గురై ఈ వృత్తికి రిజైన్ చేయాలని పదేపదే అనుకునేదట. గైనకాలజిస్ట్‌గా అపారమైన అనుభవం ఉన్న ఆమె 1999లో వుహాన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, షెన్‌జెన్‌లోనే గైనకాలజిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. అయితే తన తల్లి ప్రైవేట్ క్లినిక్‌లో సహాయం చేసే నిమిత్తం వూహాన్‌కి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. తన తల్లి పదవీ విరణమ అనంతరం ఆ క్లినిక్ మూతబడిందని, దాంతో హుబేలోని టియాన్మెన్కు తిరిగి వచ్చి డాక్టర్‌గా వృత్తి తోపాటు తన కమ్యూనిటీ న్యాయవాదిగా కూడా పనిచేసినట్లు పేర్కొంది. దాంతో తాను ఒక పక్క డాక్టర్‌గా విధులు నిర్వర్తించడం తోపాటు..ప్రభుత్వ ఏజెన్సీల తనిఖీలను కూడా తరుచుగా నిర్వహించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది. అందువల్ల విపరీతమైన ఒత్తిడి, ఆందోళనకు గురైనట్లు వెల్లడించింది. అలాగే ఆస్పత్రికి న్యాయవాదిగా ఉన్నందున కొన్ని కేసులకు బాధ్యత కూడా వహించక తప్పేది కాదని వాపోయింది. దాంతో ఈ ఉద్యోగంపై విరక్తి, రిజైన్ చేయాలన్న విసుగు వచ్చేశాయని వెల్లడించింది. అయితే తన స్నేహితురాలి కుటుంబం నడిపే బన్ వ్యాపారం ఎందుకనో తనను విపరీతంగా ఆకర్షించిందని పేర్కొంది డాంగ్. అలా ఆమె స్ఫూర్తితోనే 2023లో ఆవిరి మీద ఉడికించే స్టఫ్డ్ బన్ల వ్యాపారంపై ఆసక్తి మొదలై..వ్యాపారం పెట్టేందుకు దారితీసిందని చెబుతోంది. అయితే ఆమె బన్ వ్యాపారంలో పెట్టబడి మాత్రమే పెట్టింది. అయితే చెఫ్ అనుకోకుండా రాజీనామా చేయడంతో డాంగ్నే స్వయంగా బన్ల తయారీ నేర్చుకుని, ఆ పనిని ఆస్వాదించడం ప్రారంభించింది. అలా తాను పూర్తిగా వైద్యవృత్తిని వదిలిపెట్టి బన్ దుకాణాన్నే నడుపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తనకు 50 ఏళ్లు అని ఎన్నో అనుభవాలు చవిచూశానని అందువల్ల ఇతరులు ఏం అనుకుంటారనేది అనవసరం అని తెగేసి చెప్పింది డాంగ్. అంతేగాదు తనకు నచ్చిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నా అందుకే ఇలా చేశానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. అయితే ఈ వ్యాపారంలో కూడా 10 గంటలకు పైగా తీరిక లేకుండా పనిచేయాల్సి ఉన్నా..డాక్టర్‌గా ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఇప్పుడు అనుభవించడం లేదని చెబుతోంది డాంగ్. అంతేగాదు తన తల్లి, సోదరుడు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా దుకాణంలో తనకు చేదోడు వాదోడుగా ఉంటున్నట్లు సంతోషంగా చెప్పుకొచ్చింది. పైగా జీవితంలో మార్పుకి ఆలస్యం అంటూ ఉండదని, తను కదలలేని స్థితికి చేరుకునే వరకు కూడా ఈ షాప్‌ని నడుపుతానని ధీమాగా చెబుతోంది డాంగ్.ఇదీ చదవండి: కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని క్యాప్సికమ్ సాగు..! ఇవాళ ఏకంగా..) -
బ్రిక్స్: కొన్ని శేష సంభాషణలు
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఒక బృహత్తరమైన విషయం అయినందున అందు గురించి చర్చించుకోవలసినవి అనేకంఉంటూనే ఉంటాయి. అందులోనూ ఆ సంస్థ కజాన్‌తో ఆరంభించి రియో డి జనేరో మీదుగా ఢిల్లీ వరకు ఒక కొత్త దశలోకి ప్రయాణిస్తూ వచ్చినపుడు. ఇటు వంటి దశలో మార్గ నిర్దేశనాలను స్థూలమైన రీతిలో ఎన్ని చేసుకున్నా, ప్రశ్నలూ సందేహాలూ కూడా అంతగా మిగిలే ఉండటం సహజం. ఐక్యత సాధ్యమేనా?వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఐక్యత ప్రశ్న. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఆ దేశాల మధ్య ఏకాభిప్రాయాలు. రెండు, వారికి బ్రిక్స్ బయటి దేశాలతో గల సంబంధాలు. ఈ విషయాన్ని కొంత సూటిగా చెప్పుకుందాము. ఢిల్లీ సమావేశాలకు ముందూ, ఆ తర్వాతా పాశ్చాత్య మీడియా, పరిశీల కులతో పాటు ఇక్కడ కూడా పలువురు బ్రిక్స్‌లోని భిన్నత్వాలను చాలా ఎత్తి చూపారు. ఆ కారణంగా ఐక్యత సందేహాస్పదమన్నారు. వారు ఉదాహరించిన వాటిలో ముఖ్యమైనవి భారత–చైనా, ఇరాన్ –అరబ్ రాజ్యాల వివాదాలు.ఇవి ముఖ్యమైనవనటంలో సందేహం లేదు. అయితే, అవి ఉన్నప్పటికీ అందరూ ఒక చోట చేరటం, ఏకగ్రీవ ప్రకటనను విడుదల చేయటాన్ని కూడా విమర్శకులు అదే సమయంలో గుర్తించారు. అట్లా జరగటంలో భారతదేశపు దౌత్యనీతి కొంత పనిచేసిన మాట నిజమే అయినా, అంతకుమించిన మౌలిక కారణాలు ఉన్నాయనేది గమనించాలి. మొదటిది, పరస్పర సమస్యలు ఉన్న బ్రిక్స్ దేశాలకు కూడా బయటి శక్తుల నుంచి అంతకన్న పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. పరస్పర సమస్యల పరిష్కారం కన్నా బయటి సమస్యల పరిష్కారం పెద్ద సవాలు అవుతున్నది. మొదట 2006లో ‘బ్రిక్’ ఏర్పడినా, 2010లో ‘బ్రిక్స్’గా మారినా, ఇపుడు 2026లో మరింత విస్తరించినా సభ్య దేశాల మధ్య కొన్ని సమస్యలు ఎప్పుడూ ఉన్నవే. ఉదాహరణకు ఇండియా–చైనా వివాదం. అది 2006 నాటికి కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఒక యుద్ధం, కొన్ని ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ బ్రిక్స్లోనే గాక షాంఘై సహకార సంస్థ తదితరాలలోనూ చైనాతో పాటు సభ్య దేశంగా ఉండేందుకు భారత్ ఎందుకు అంగీకరించినట్లు?మూడు ముఖ్య దేశాలుపైన వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇందులోనే లభిస్తుంది. సభ్య దేశాలకు పరస్పర సమస్యలకన్న బయటి శక్తుల నుంచి ఎదు రవుతున్న సమస్యలు పెద్ద సవాళ్లవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, బయటి శక్తుల నుంచి సమస్యలన్నవి వందల సంవత్సరాల వలస పాలనలతో మొదలై, సామ్రాజ్యవాదపు వివిధ చర్యల రూపంలో నేటికీ కొనసాగుతున్నాయి. అందుకే వీరు ఒకటి అవుతుండటమే గాక, బ్రిక్స్ పట్ల అన్ని ఖండాల దేశాలలో ఆకర్షణలు పెరుగు తున్నాయి. కనుక, ఈ విస్తృత చిత్రాన్ని గమనించినప్పుడు, పరస్పర సమస్యలన్నవి భూతద్దంలో చూడవలసినవిగా తోచదు. అయితే, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య సమావేశంలో ‘భిన్నాభిప్రాయాలు విభేదాలుగా మారకూడ’దన్న మాట ఒకటి వచ్చింది. అందులోని రెండు పదాలకు చాలా అర్థం ఉంది. అది ఇక్కడ చర్చించలేము. కానీ, వారు అదే అవగాహనతో ముందుకు సాగుతుండటం మాత్రం గమనించదగ్గది. అందులో పరస్పర ప్రయోజనాలతో పాటు బ్రిక్స్ స్ఫూర్తి ఉంది. బ్రిక్స్‌ను చైనా హైజాక్ చేస్తుందా అనే ప్రశ్న ఒకటి ఉన్నది గానీ అది వేరే వివరమైన చర్చ.ఇందుకు పొడిగింపుగా చెప్పుకోవలసింది ఒకటున్నది. బ్రిక్స్‌లో వేర్వేరు ఖండాల నుంచి ప్రధానమైన దేశాలు ఉన్నప్పటికీ, సంస్థకు వెన్నుదన్ను అనదగ్గవి ఇండియా, చైనా, రష్యాలే. ఈ మూడూ ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికపరంగా, సైనికంగా, భౌగోళిక వైశాల్య పరంగా, జనాభా రీత్యా శక్తిమంతమైనవి. రాజకీయంగా చూసి నపుడు భారత్ ప్రజాస్వామికమైనది కాగా, తక్కిన రెండు స్థిరమైన వ్యవస్థలు. ఈ ముగ్గురికి కూడా వలస పాలనల కాలం నుంచి, ఆ తర్వాత వర్తమానంలోనూ వర్ధమాన దేశాలతో వెన్నంటి నిలిచిన పేరున్నది. బ్రిక్స్ పునాదులు కూడా 2006 నుంచి ఈ 2026 వరకు అవే. వర్ధమాన దేశాలకు బయటి శక్తులతో రాగల కాలంలో ఘర్షణాత్మక స్థితి ఏర్పడే కొద్దీ ఈ సంస్థకు నాయకత్వం వహించి నిలబెట్ట గలది, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించగలది, ఇపుడున్న అంతర్జాతీయ సంస్థలను సంస్కరించి వర్ధమాన దేశాలకు అవకా శాలు కల్పించేట్లు చేయగలది ఈ ముగ్గురి నాయకత్వమే. ఇదే సంద ర్భంలో మరొకటి కూడా చెప్పాలి. వర్ధమాన దేశాలకు బయటి శక్తు లతో రక్షణపరమైన సమస్యలు తలెత్తితే, ఈ ముగ్గురిలో ఇండియా, చైనాలు కాదు గానీ తమ సైన్యాలను పంపి ఆదుకునేందుకు సైతం రష్యా సిద్ధమే. ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలో అదే జరుగుతున్నది.భారత ప్రభుత్వం గురించి దాపరికం లేకుండా మాట్లాడుకోవ లసిన విషయం ఒకటున్నది. ఇండియా బ్రిక్స్‌లో చేరింది కాంగ్రెస్ అధికారంలో ఉండిన 2006లో కాగా, బీజేపీ గెలిచిన 2014 నుంచి మోదీ ప్రభుత్వ వైఖరి బయటి ప్రపంచపు దృష్టిలో అనుమానా స్పదంగా మారింది. వైఖరిలో మార్పునకు కారణం దేశ ప్రయోజ నాలు అని చెప్పేవి అయితే కావచ్చు గాక, కానీ అనుమానాస్పదంగా మారింది నిజం. వర్ధమాన దేశాలకు హాని కలిగే విధంగా బయటి శక్తులకు సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తూ పోయారన్న మాటలు ఇంటాబయటా వినిపించాయి. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణలు, వెనిజులా అధ్యక్షుని అపహరణ, ఇరాన్‌పై దాడుల సందర్భాలలో ప్రభుత్వ వైఖరులతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇపుడు ఢిల్లీలో వైఖరి కొంత మారుతున్న సూచనలు కన్పించినందున, ఇది ఇక స్థిరపడుతూ పోగలదేమో చూడాలి. బయటి శక్తులతో ఇండియాకు సమస్యలు క్రమంగా పెరుగుతున్నందున అందుకు అవకాశాలైతే ఉన్నాయి. అసలు ఆయుధీకరణచివరగా చర్చించవలసినవి రెండున్నాయి. స్వేచ్ఛా నౌకా యాన ప్రశ్న, వనరుల ఆయుధీకరణ ప్రశ్న. ఈ రెండూ ఢిల్లీ సమావేశాల సందర్భంగా మరొకమారు ప్రస్తావనకు వచ్చాయి. స్వేచ్ఛాయానం హార్మూజ్ దిగ్బంధం నుంచీ, ఆయుధీకరణ అమెరికా అధ్యక్షుని ట్యారిఫ్ వార్‌తోనూ మొదలయ్యాయి. హార్మూజ్‌ను ఇరాన్ మూసి వేసింది శత్రు దాడుల నుంచి ఆత్మరక్షణకే తప్ప అంతకు ముందు ఎటువంటి మూసివేతలూ లేవు. దాడులు ఆగకుండా హార్మూజ్‌ను తెరవాలని ఒత్తిడి చేయడమంటే తమ ఆత్మరక్షణ సాధనాన్ని వదలుకుని లొంగిపోవలసిందిగా కోరటమే. స్వేచ్ఛాయానమన్న మాట దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ ఉన్నా, బ్రిక్స్ చర్చల సంద ర్భం అది కాదు. పోతే, స్వేచ్ఛా యానాన్ని అమెరికా అట్లాంటిక్, పసిఫిక్లలో తమ ప్రత్యర్థులకు అనుమతించక పోవటాన్ని ఏమంటాం?అమెరికా అధ్యక్షుడు ట్యారిఫ్లను, సాంకేతిక పరికరాల ఎగుమతిని ఆయుధాలుగా మార్చటం మొదలు పెట్టినందునే చైనా, కెనడా, యూరప్ వంటివి ఎదురు ట్యారిఫ్‌లతో, కీలకమైన వనరుల ఎగుమతిపై ఆంక్షలతో ఆత్మరక్షణ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీనంతటిలో ఏది ఆయుధీకరణ అవుతుంది, ఏది కాదు? అందు వల్ల, సమస్యకు గల కారణాలను వదలి సమస్యల గురించి మాత్రమే మాట్లాడటంతో పరిష్కారం లభించదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వాణిజ్య యుద్ధం తర్వాత ఏఐ వార్.. అమెరికాకు వెళ్లనున్న జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన వాషింగ్టన్ చేరుకోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల అమలు, కీలక ఖనిజాల సరఫరా, సెమీకండక్టర్లు వంటి అంశాలు ఈ శిఖరాగ్ర భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.జిన్‌పింగ్ పర్యటనకు ముందు న్యూయార్క్‌లో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, చైనా ఉప ప్రధాని హీ లైఫెంగ్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. గతంలో కుదిరిన ఆర్థిక, వాణిజ్య అవగాహనలను అమలు చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, కృత్రిమ మేధపై చర్చించడం ఇందులో ఉన్నాయి. అమెరికా వైపు నుంచి రైతులు, తయారీదారులు, కార్మికులకు మార్కెట్ అవకాశాలు పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు.జాతీయ భద్రత కోణంలో.. ఈ భేటీలో కృత్రిమ మేధకు సంబంధించి ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదన కూడా కీలకంగా మారింది. కృత్రిమ మేధ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో ఏదైనా ఘటన జరిగితే ఇరు దేశాలు ముందుగానే ఒకరినొకరు అప్రమత్తం చేసుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనిని అనధికారికంగా ‘కృత్రిమ మేధ హాట్‌లైన్’గా పేర్కొంటున్నారు. అయితే ఏ పరిస్థితుల్లో సమాచారం తప్పనిసరిగా పంచుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. చైనా ఈ ప్రతిపాదనను అంగీకరించిందా లేదా అన్నది కూడా వెల్లడించలేదు.రేర్ ఎర్త్, కీలక ఖనిజాల సరఫరా కూడా ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా ఉంది. సెమీకండక్టర్ల విషయంలో చైనాకు ఆ చిప్‌లు లభించే అవకాశాన్ని అమెరికా పరిమితం చేస్తోంది. అదే సమయంలో చైనా.. పరిమితుల మధ్య కూడా కృత్రిమ మేధ నమూనాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 2025లో అమెరికా సంస్థలు కృత్రిమ మేధ రంగంలో 285.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, చైనా సంస్థల పెట్టుబడి 12.4 బిలియన్ డాలర్లుగా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ 2026 కృత్రిమ మేధ సూచీ నివేదిక పేర్కొంది.వాణిజ్యంతో పాటు రష్యాపై అమెరికా ఆంక్షలు, ఇరాన్‌తో అమెరికా ఘర్షణ, తైవాన్, అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం వంటి అంశాలు కూడా భేటీపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్-ట్రంప్ చర్చల్లో ఆర్థిక విభేదాల నిర్వహణతో పాటు కృత్రిమ మేధ రంగంలో ప్రమాదాలను నియంత్రించేందుకు ఇరు దేశాలు ఏ మేరకు సహకార మార్గాన్ని ఏర్పరచుకుంటాయన్నది కీలకంగా మారనుంది. -
ముఖంతో సంపాదన.. రూ.14 లక్షల వరకు!
ఏఐతో ఉద్యోగాలు పోతాయని ఎంతోమంది భయపడుతున్న వేళ.. చైనాలో మాత్రం కొందరు తమ ముఖాలనే అద్దెకిచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. ఏఐ కాలంలో మన ముఖానికి కూడా ఒక విలువ ఉంది. చైనాలో కొంతమంది తమ ముఖాలను ఏఐ ద్వారా తయారు చేసే వీడియోలు, ప్రకటనలు, గేమ్స్, షార్ట్ డ్రామాల్లో ఉపయోగించుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నారు. దీంతో డబ్బు సంపాదిస్తున్నారు.సింపుల్‌గా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన ముఖాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ చేసుకుంటాడు. ఆ తర్వాత వీడియో లేదా ప్రకటన తయారు చేసే వాళ్లు తమకు నచ్చిన ముఖాన్ని ఎంచుకుని, డబ్బు చెల్లించి ఆ ముఖాన్ని AI కంటెంట్‌లో ఉపయోగించుకోవచ్చు.రూ.700 నుంచి రూ.14 లక్షలుకొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ముఖాన్ని ఉపయోగించడానికి ధర 50 యువాన్ నుంచి 99,999 యువాన్ చెల్లిస్తున్నారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.700 నుంచి రూ.14 లక్షలు.ఉదాహరణకు, చెన్ అనే 34 ఏళ్ల వ్యక్తి తన ముఖాన్ని ఒక్కసారి ఉపయోగించుకోవడానికి 99 యువాన్ తీసుకుంటున్నాడు. తన ముఖాన్ని ప్రేమకథలు, కుటుంబ కథల్లో ఉపయోగించుకోవచ్చని, కానీ హారర్ లేదా లైంగిక కంటెంట్‌లో ఉపయోగించకూడదని అతను నిబంధన పెట్టుకున్నాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక బ్యాంక్ ఉద్యోగి ముఖాన్ని ఒక ప్రకటన సంస్థ మూడు రోజుల్లో ఏడు సార్లు ఉపయోగించుకుని అతనికి దాదాపు 2,500 యువాన్ చెల్లించినట్లు సమాచారం.ఇలా చేయడం వల్ల వ్యక్తులు ప్రతి షూటింగ్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాళ్ల ముఖాన్ని ఏఐ ద్వారా ఉపయోగించుకుంటారు కాబట్టి, ఇంట్లోనే ఉండి కూడా కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, తమ ముఖాన్ని ఎంతకాలం ఉపయోగించాలి, ఏ రకమైన కంటెంట్‌లో ఉపయోగించకూడదు అనే విషయాలను కూడా కొంతవరకు నిర్ణయించుకోవచ్చు.సమస్యలు ఇవేఅయితే దీంతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గోప్యత, అనుమతి, ముఖ డేటా భద్రతకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి మన ముఖం డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత అది ఎక్కడెక్కడ ఉపయోగించబడుతుందో పూర్తిగా తెలుసుకోవడం కష్టం కావచ్చు.పిల్లల ముఖాలను ఏఐలో ఉపయోగించడం గురించి కూడా న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల కోసం ప్రత్యేక కేటగిరీలు కూడా ఉన్నాయి. మరో సమస్య.. ఒప్పందాలకు సంబంధించినది. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తి తన అనుమతిని ముందుగానే రద్దు చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చని వార్తలు చెబుతున్నాయి. కానీ అదే సమయంలో ప్లాట్‌ఫారమ్ నుంచి చెల్లింపు ఆలస్యం అయితే వారి బాధ్యత తక్కువగా ఉండవచ్చనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: వయసు 15.. పెట్టుబడులు రూ.13 లక్షలు! -
ఇరాన్ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. మరోవైపు ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరాన్–ఫ్రాన్స్ మధ్య దౌత్య వివాదం కూడా ముదురుతోంది. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటోంది.అమెరికా కొత్త దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా లేదా దాని మిత్రదేశాలు మరోసారి దాడి చేస్తే.. ఈసారి ప్రతిస్పందన పరిమితం కాదని, అమెరికా స్థావరాలు.. ప్రయోజనాలపై సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. ఒప్పందానికి ముందుకు రావాలని.. లేదంటే ఇరాన్ ఆర్థికంగా మరింత కుదేలవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ వారంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనతో భేటీకి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పడం గమనార్హం. రియాద్‌పై హౌతీల మెరుపుదాడిఇదిలా ఉండగానే యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. సెప్టెంబర్ 19న క్షిపణి, డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ధ్రువీకరించింది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే సౌదీ నేతృత్వంలోని కూటమి ఆ దాడిని అడ్డుకున్నట్లు తెలిపింది. పెద్దగా నష్టమూ జరగలేదని వెల్లడించింది. హౌతీలు రియాద్‌తో పాటు యాన్బు, తాయిఫ్, బైష్, ఫరాసాన్ ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. యాన్బు సౌదీ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం కావడంతో ఈ దాడులు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. ఎందుకంత కీలకం బాబ్-ఎల్-మండేబ్..యెమెన్‌లో హౌతీల దూకుడు ఇటీవలి రోజుల్లో మరింత పెరిగింది. వ్యూహాత్మకమైన మొఖా ప్రాంతంతో పాటు బాబ్ ఎల్ మందెబ్ జలసంధికి సమీప ప్రాంతాలపై వారి పట్టు పెరిగింది. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌తో కలుపుతుంది. ఆసియా–యూరప్ మధ్య నౌకాయానానికి ఇది కీలకమైన మార్గం.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల కారణంగా ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు బాబ్ ఎల్ వద్ద కూడా భద్రతా సమస్యలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన మరింత పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతుల మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే కొనసాగుతోంది. చైనాకు కూడా టెన్షన్.. ఇరాన్‌పై ఒత్తిడిహౌతీల దూకుడుతో సౌదీ మాత్రమే కాకుండా చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. సౌదీ విజ్ఞప్తి నేపథ్యంలో హౌతీలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై చైనా ప్రైవేటుగా ఒత్తిడి తెచ్చినట్లు మూడు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తను ప్రచురించింది. ఎర్ర సముద్ర మార్గం చైనా వాణిజ్యానికి కూడా కీలకం కావడంతో ఈ పరిణామాలను బీజింగ్ నిశితంగా గమనిస్తోంది. ఇటు ఫ్రాన్స్‌తోనూ కొత్త వివాదంఇక ఇరాన్–ఫ్రాన్స్ సంబంధాల్లోనూ కొత్త చిచ్చు రేగింది. టెహ్రాన్‌లో ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫ్రెంచ్ భాషా కేంద్రాన్ని ఇరాన్ అధికారులు మూసివేశారు. సరైన లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది. వ్యక్తుల నెట్‌వర్క్‌లను నిర్మించడం, నైపుణ్యం ఉన్న ఇరానియన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహకరించడం వంటి ఆరోపణలను కూడా చేసింది. అయితే ఫ్రాన్స్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ సాంస్కృతిక సంస్థలపై మరో దాడిగా అభివర్ణించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ‘మొసలి కన్నీరు’ అంటూ ఫైర్ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ గతంలో అల్జీరియాలో చేసిన చర్యలను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై ఇప్పుడు సానుభూతి చూపడం ‘మొసలి కన్నీరు’ అంటూ బారోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ పాఠశాల విద్యార్థులు చనిపోయిన సమయంలో ఫ్రాన్స్ మౌనం వహించిందని కూడా అరాఘ్చీ ఆరోపించారు.ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులుఇలా చూస్తే ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఒకేసారి పలు స్థాయిల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ మళ్లీ ముదిరే సంకేతాలు, సౌదీపై హౌతీల దాడులు, హర్ముజ్–బాబ్ ఎల్ మండేబ్ జలమార్గాలపై ఒత్తిడి, ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి.అయితే ఇదే సమయంలో చర్చలకు అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్–ఇరాన్ మధ్య కఠిన ప్రకటనలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ అధ్యక్షుడితో భేటీకి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం దౌత్య మార్గం ఇంకా తెరిచే ఉందనే సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు హౌతీలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు కూడా తెరవెనుక దౌత్యం కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఏడు కండీషన్స్‌తో ఇరాన్ యుద్ధం ముగిసేనా? -
భారత్‌కు టారిఫ్ ముప్పు!
వాషింగ్టన్: రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి చట్టంగా మార్చారు. ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం లభించింది. తద్వారా భారత్, చైనాలకు అమెరికా సుంకాల ముప్పు పొంచి ఉన్నట్లే. ‘లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ అనే ఈ బిల్లును రిపబ్లికన్ల మద్దతుతో అమెరికా ప్రతినిధుల సభ 262–159 ఓట్ల తేడాతో ఆమోదించిన సంగతి తెలిసిందే. చట్టసభలో బిల్లు ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత ట్రంప్ దీనిపై సంతకం చేశారు. → ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులను తగ్గించడమే ఈ కొత్త చట్టం అసలు లక్ష్యం. → ఇది రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన సంస్థలు, మాస్కో సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న విదేశీ సంస్థలపై గురిపెట్టింది. → రష్యాకు చెందిన చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం అధ్యక్షుడికి కల్పిస్తుంది. → హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ప్రకారం ఈ చట్టం రష్యన్ ఉత్పత్తులపై 500 శాతం వరకు సుంకాలు విధించడానికి వీలు విధిస్తుంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపైనా ఆంక్షలు విధించడానికి ఆస్కారం ఉంది. → 100% వరకు సుంకాలు విధించడానికి అర్హమైన దేశాలుగా చైనా, భారత్, యూఏఈ, టర్కీ, సింగపూర్, అజర్బైజాన్, కజకిస్తాన్, హంగేరీ, కిర్గిజిస్తాన్, స్లోవేకియా పేర్లను స్పష్టంగా పేర్కొనాలని బిల్లులో ఒక సవరణ ద్వారా ప్రతిపాదించారు. ఈ బిల్లు భారత్‌పై 100% సుంకాలు విధించాలని నేరుగా చెప్పలేదు. → అధ్యక్షుడు ట్రంప్ తన అధికారాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటే భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల ఎగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 10 శాతం సుంకం వసూలు చేస్తోంది. ఒకవేళ ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తే అది ఇప్పుడున్న 10 శాతం సుంకానికి అదనం అవుతుంది. → అమెరికా సుంకం రేట్లను ప్రకటించిన తర్వాతే భారతీయ ఎగుమతులపై కొత్త సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పగలమని నిపుణులు అంటున్నారు. -
జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు) రాయని డైరీ
నిజాన్ని ఎంత లోతుకు పాతి పెట్టినా ఏదో ఒకనాటికైనా అది మొలకెత్తకుండా ఉండ లేదు. చేవ లేని అబద్ధపు చెట్టును మోసుకొచ్చి ఎంత సారవంతమైన భూమిలో నాటినా, ఏనాటికీ అది చిన్న చిగురైనా వేయలేదు. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఇండియాలో బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తున్న ప్పుడు నాకు తీవ్రాతి తీవ్రంగా ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చిందని, అందుకే నేను ఇండియా ఏర్పాటు చేసిన అధికారిక విందులో కనిపించలేదని, ఇండియా నుంచి అర్ధంతరంగా చైనాకు తిరిగి వచ్చాక, అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన నన్ను బీజింగ్‌లోని చైనీస్ పీపుల్స్ ఆర్మీ జనరల్ హాస్పిటల్‌కు తరలించా రని... వాంజున్ జియ్ అనే మనిషి గత వారంరోజులుగా ప్రపంచం అంతటా ప్రధాన కూడళ్లలో అబద్ధపు చెట్లను నాటే పనిలో ఉన్నాడు. ‘చైనా డెమోక్రసీ పార్టీ’ నాయకుడినని చెప్పుకుంటూ అమెరికాలో ఉంటున్న వాంజున్ జియ్ తనకై తనే ఒక పెద్ద అబద్ధం. చైనాలో అతడి ‘చైనా డెమోక్రసీ పార్టీ’ చట్ట విరుద్ధం. తియానన్మెన్ స్క్వేర్ నిరసనకారుడు అతడు. 25 ఏళ్ల క్రితమే చైనా నుంచి పారిపోయిన వాడు. పారిపోయి, ‘జోంగ్నాన్హాయ్’పై రోజుకో అసత్యాన్ని రాయిలా విసురుతున్నవాడు.‘జోంగ్నాన్హాయ్’... చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయం. వాంజున్ జియ్ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ వ్యతిరేకి. ‘‘ఈ డెమోక్రాటిక్ గుడ్లగూబను ఏం చేద్దాం కామ్రేడ్?’’ అని అడిగాను వాంగ్ని. ‘‘కొన్ని సందర్భాలలో ఏమీ చెయ్యకుండా ఉండటమే ఏదైనా చెయ్యటం అవుతుంది మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నారు వాంగ్! వాంగ్ విదేశాంగ మంత్రి. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ సీనియర్ దౌత్యవేత్త. అంతకన్నా కూడా నాకు నమ్మకస్థుడు. బ్రిక్స్ డిన్నర్లో నేను లేకపోవటానికి కారణం... హోటల్ గదిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని నా మనసు కోరుకోవటం తప్ప మరింకేమీ కాదు. గ్లాసులు పైకెత్తి ‘టోస్ట్’ చెప్పుకునే సందడి కంటే కూడా, కొన్నిసార్లు నాకు నిశ్శబ్దమే తృప్తికరమైన డిన్నర్లా ఉంటుంది. సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం. ఆ వివరాలు చెబుతున్నారు వాంగ్.‘‘వైట్ హౌస్‌లో ఆరోజు అధికారిక ‘స్టేట్ డిన్నర్’ ఉంటుంది మిస్టర్ ప్రెసిడెంట్. డిన్నర్లో మీతో పాటు టెక్ టైకూన్ లు... టిమ్ కుక్, సామ్ ఆల్ట్మాన్, జెన్సన్ హువాంగ్ ఉంటారు. ఇక, ట్రంప్ మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పటానికి వైట్ హౌస్ లాన్ లో మీ కోసమే ప్రత్యేకంగా కొత్త హెలిప్యాడ్‌ను కట్టించారు... ’’ అని చెప్పారు వాంగ్ యీ! వాంగ్ సాధారణంగా ముఖ్యమైన వివరాలను మాత్రమే నాకు చెబుతారు. మిగతావన్నీ తనే చూసుకుంటారు. నిజానికి డిన్నర్ కంటే ముఖ్యంగా... వాషింగ్టన్లో నేను మాట్లాడవలసినవి చాలానే ఉన్నాయి. వాణిజ్య సుంకాల ఇష్యూ ఉంది. ఏఐ నియంత్రణల ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ, వ్యాపార రంగాలలో ఇచ్చిపుచుకోవడం ఉంది. రేర్ ఎర్త్ ఖనిజాలపై కీలక చర్చలు ఉన్నాయి. తైవాన్ కు అమెరికా ఆయుధాల సరఫరా జరగకుండా ఆపటమూ ఉంది. ఇన్ని ముఖ్యమైన వాటిని వాంగ్ తను చూసుకోగలనని అనుకుంటున్నారంటే... వైట్ హౌస్ స్టేట్ డిన్నర్ ఇంకెంత ముఖ్యమైనదో ఆయనకు క్లారిటీ ఉన్నట్లుంది. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్, సెప్టెంబర్ 12న ఇండియాలో మీరు డిన్నర్ చేయకుండా, సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌లో డిన్నర్ చేశారంటే... ఇండియాలోని చైనీయులు, చైనాలోని ఇండియన్లు ఏమీ అనుకోరు. కానీ ఇండియాలో డిన్నర్ చేయలేదు కనుక, వైట్ హౌస్‌లోనూ డిన్నర్ చేయకుండా ఉన్నారంటే... అమెరికాలోని చైనీస్ డెమొక్రాట్లు, చైనాలోని అమెరికన్ డెమొక్రాట్లు మళ్లీ మీ ఆరోగ్యం గురించి ఎవరికి తోచిన హెల్త్ బులెటిన్లు వాళ్లు విడుదల చేసే అవకాశం ఉంది’’అన్నారు వాంగ్. ఆయనేమీ నవ్వుతూ ఆ మాట అనలేదు. -
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ బిగ్ అనౌన్స్మెంట్.. ఇక ‘పర్మినెంట్ కంట్రోల్’!
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌తో కలిసి అమెరికా ఒక కొత్త భద్రతా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్లాండ్ భద్రతపై అమెరికాకు ‘శాశ్వత నియంత్రణ’’ లభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. అలాగే దీనిని ఆయన ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా అభివర్ణించారు.ట్రంప్ చేసిన తాజా ప్రకటన.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని కాదు. కేవలం భద్రతకు సంబంధించింది మాత్రమే. గ్రీన్లాండ్ ఇక మీదట కూడా డెన్మార్క్ రాజ్యంలోనే కొనసాగుతుందని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అక్కడి ప్రజల స్వయం నిర్ణయ హక్కును ఒప్పందం గుర్తిస్తుందని డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా, డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా న్యూయార్క్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అనంతరం అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి రానుంది. కొత్త ఒప్పందం.. రష్యా, చైనాకు చెక్గ్రీన్లాండ్లో అమెరికా ప్రత్యర్థి దేశాలు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ఈ ఒప్పందం అడ్డుకట్ట వేస్తుందని ట్రంప్ చెప్పారు. ముఖ్యంగా రష్యా, చైనాలు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, సైనిక ఉనికిని పెంచడం లేదా సున్నితమైన పెట్టుబడులు పెట్టడం అమెరికా అనుమతి లేకుండా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికే గ్రీన్లాండ్లో పిటుఫిక్ స్పేస్ బేస్‌ను నిర్వహిస్తోంది. క్షిపణి హెచ్చరికలు, క్షిపణి రక్షణ, అంతరిక్ష నిఘా వంటి కార్యకలాపాల్లో ఈ స్థావరం కీలకంగా ఉంది. కొత్త ఒప్పందంతో గ్రీన్లాండ్లో అమెరికా సైనిక ఉనికిని మరింత పెంచుకునే అవకాశం ఏర్పడినట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యకు అర్థమేంటి?ఈ ఒప్పందానికి గడువు ఉండదనే అర్థంలో ట్రంప్ దీనిని ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా పేర్కొన్నారు. గ్రీన్లాండ్, అమెరికా భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం అమెరికాకు ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. గ్రీన్లాండ్లో పెద్ద ఎత్తున అమెరికా సైనిక ఉనికిని అభివృద్ధి చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. ఎందుకంత కీలకం?ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్లాండ్ భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఉత్తర అమెరికా, యూరప్ మధ్య ఉన్న ప్రాంతంలో దాని స్థానం కారణంగా అమెరికా రక్షణ వ్యూహంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రష్యా, చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌పై అమెరికా దృష్టి మరింత పెరిగింది.ట్రంప్ పాత డిమాండ్‌కు భిన్నంగా..గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను ట్రంప్ గతంలో పలుమార్లు వ్యక్తం చేశారు. అవసరమైతే బలప్రయోగాన్ని కూడా తోసిపుచ్చని ఆయన వైఖరి డెన్మార్క్‌తో పాటు ఇతర నాటో దేశాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. తాజా ఒప్పందం మాత్రం గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపడం లేదా దాని సార్వభౌమాధికారాన్ని మార్చడం కాకుండా.. భద్రత, సైనిక ఉనికిపై అమెరికా పాత్రను విస్తరించే దిశగా ఉంది. డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ఈ ఒప్పందం.. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఇది నాటో, యూరప్‌కు కూడా ప్రయోజనకరమని అన్నారు. గ్రీన్లాండ్ ప్రభుత్వ అధిపతి జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ కూడా ఈ ఒప్పందం గ్రీన్లాండ్, డెన్మార్క్, అమెరికా, పాశ్చాత్య కూటమి భద్రతను బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇదీ చదవండి: మీడియాను తొక్కిపారేస్తున్న ట్రంప్ -
ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్‌లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది. అబ్ ఆయేగా అస్లీ మజా!ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:భారత్చైనాఇటలీటర్కీనెదర్లాండ్స్ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్‌దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. చర్చల్లో మరికొన్ని దేశాలురష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. 30 రోజుల్లో నిర్ణయం?కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్‌లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.రష్యాపై మరింత ఒత్తిడిఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది. మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్‌పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్ -
ఉత్తర కొరియా వల్ల 1,399 భూకంపాలు!
ఉత్తర కొరియా నిర్వహించిన భూగర్భ అణు పరీక్షల కారణంగా మౌంట్ మంటప్ (Mount Mantap) పర్వతం పరిసర ప్రాంతాల్లో ఏకంగా 1,399 భూకంపాలు సంభవించినట్లు శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘సైన్స్’ (Science) లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఉత్తర కొరియా గతంలో జరిపిన అణు బాంబు పేలుళ్లు అక్కడి భూగర్భ పొరలను తీవ్రంగా దెబ్బతీశాయి. దక్షిణ కొరియాలోని పుసాన్ నేషనల్ యూనివర్సిటీ, చైనాలోని చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు 2008 నుంచి 2025 మధ్య కాలానికి సంబంధించిన భూకంప తరంగాల డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. ఉత్తర కొరియా 2006 నుంచి 2017 మధ్య కాలంలో పుంగ్యే-రి (Punggye-ri) పరీక్షా కేంద్రంలోని మంటప్ పర్వతం కింద ఆరు భూగర్భ అణు పరీక్షలు నిర్వహించింది.ఉత్తర కొరియాలోని పుంగ్యే-రి అణు పరీక్షా స్థావరం ఉపగ్రహ చిత్రం (PC: Twitter)ఈ శక్తివంతమైన పేలుళ్ల వల్ల అక్కడ శతాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న భూగర్భ ఫాల్ట్ లైన్లు (భూకంప బద్దలు) మళ్లీ యాక్టివ్ అయ్యాయి. 2017లో ఉత్తర కొరియా నిర్వహించిన ఆరవ, అత్యంత భారీ అణు పరీక్ష (హైడ్రోజన్ బాంబు పరీక్ష) తర్వాతే అత్యధిక ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఒక్క పరీక్ష తర్వాతే దాదాపు 1,330 కి పైగా భూకంపాలు సంభవించాయి.సాధారణంగా పెద్ద పేలుళ్లు జరిగిన కొన్ని రోజులు లేదా వారాల్లోనే ప్రకంపనలు తగ్గిపోతాయి. కానీ మంటప్ పర్వత ప్రాంతంలో మాత్రం 2017 పరీక్ష జరిగిన మూడు వారాల తర్వాత ప్రకంపనలు ప్రారంభమై, 2025 వరకు కాలక్రమేణా వాటి ఫ్రీక్వెన్సీ (తీవ్రత) పెరుగుతూ రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎక్కువగా 2.0 నుండి 3.0 మధ్య నమోదైనప్పటికీ, కొన్ని ప్రకంపనలు 3.4 తీవ్రతను కూడా తాకాయి. ఈ ప్రాంతం సహజంగా భూకంపాలు వచ్చే ప్రాంతం కాకపోయినప్పటికీ, అణు పరీక్షల వల్లే భూమి లోపలి పొరల్లో ఒత్తిడి పెరిగి ఈ పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.ఇదీ చదవండి: విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ వద్ద కలకలం -
రష్యాపై ఆంక్షలు
వాషింగ్టన్: రష్యాపై ఆంక్షలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కట్టబెట్టే బిల్లుకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లు చేస్తున్న భారత్, చైనాలపై భారీ ఎత్తున టారిఫ్‌లు విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ‘ద లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’పేరున్న ఈ చట్టాన్ని సెనేట్ గత నెలలోనే ఆమోదించింది. తాజాగా బుధవారం సాయంత్రం ప్రతినిధుల సభ 262–159 ఓట్లతో ఓకే చెప్పింది. అధ్యక్షుడు ట్రంప్ సంతకం పెట్టిన వెంటనే ఈ బిల్లు కాస్తా చట్టం అవుతుంది. ప్రతినిధుల సభలోని 203 మంది రిపబ్లికన్లతోపాటు 56 మంది డెమొక్రాట్లు, ఒక స్వతంత్ర ప్రతినిధి ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనార్హం. ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ ప్రతినిధులు ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాలపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి పరిమితమయ్యారు. సౌత్ కరొలీనా సెనేటర్, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి లిండ్సే గ్రాహం ఏడాది కాలంగా ఈ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి.. ఈ ఏడాది జూలైలో ఆకస్మిక మరణం పాలయ్యారు. దీంతో బిల్లుకు గ్రాహం పేరునే పెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో డెమొక్రాట్ ప్రతినిధి రిచర్డ్ నీల్ మాట్లాడుతూ ‘‘టారిఫ్‌లు విధించే విషయంలో ట్రంప్‌కు ఎక్కువ అధికారాలు ఇవ్వడంపై మాత్రమే తమ అభ్యంతరం’’అని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా రష్యా నేతలపై మాత్రమే కాకుండా ఇంధన రంగం మొత్తమ్మీద ఆంక్షలు విధించే అధికారాన్ని ట్రంప్‌కు కట్టబెట్టనుంది. అధికారికంగా ఇంధన సరఫరా చేసే నౌకలతోపాటు ‘షాడో ఫ్లీట్’లకు కూడా ఆంక్షలు వర్తించనున్నాయి. అదే సమయంలో రష్యా సరఫరా చేసే చమురు, గ్యాస్‌లపై భారత్, చైనా వంటి దేశాలు ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయా దేశాలపై టారిఫ్‌లు వడ్డించేందుకు ఈ బిల్లు ట్రంప్‌కు అధికారం ఇస్తుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా ఈ బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. సెనేట్ ఈ బిల్లును నెలరోజుల క్రితమే 86–11 ఓట్ల తేడాతో ఆమోదించగా ప్రతినిధుల సభలో కొంత ఆలస్యమైంది. నవంబరు మూడున జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభ సమావేశాల చివరిరోజున మాత్రమే ఆమోదం సాధ్యమవడం విశేషం. -
ప్రపంచంలోనే అతిపెద్ద మదర్షిప్.. చైనా మాస్టర్ ప్లాన్!
చైనా తన జలాంతర్గత సైనిక సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. భారీ మానవరహిత జలాంతర్గాములను చేరవేసి, మోహరించేందుకు వీలుగా షాంఘైలోని హుడాంగ్-జోంగ్‌హువా షిప్‌యార్డ్‌లో ఒక మదర్షిప్ నిర్మాణంలో ఉంది. ఉపగ్రహ చిత్రాలలో కనిపించిన ఈ నౌక, ప్రపంచంలోనే ఈ తరహాలో మొదటిదిగా పరిగణించబడుతోంది. ఇది ఒకేసారి కనీసం నాలుగు అతిపెద్ద మానవరహిత జలాంతర్గాములను మోయగలగడం దీని ప్రధాన లక్షణం. ఈ జలాంతర్గాములు సిబ్బంది లేకుండానే నీటి అడుగున సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా, ఈ నౌక నిర్మాణంలో ఉన్న ఎర్రటి ఓడలా కనిపిస్తోంది. దాని పరిమాణం, ఆకారం బట్టి లోపల ఒక పెద్ద హ్యాంగర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హ్యాంగర్‌లో పెద్ద మానవరహిత జలాంతర్గాములను ఉంచి, అవసరమైనప్పుడు వాటిని సముద్రంలోకి ప్రయోగించవచ్చు. ఈ నౌక కనీసం నాలుగు జలాంతర్గాములను మోయగలదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నౌక ముందు భాగంలో హెలికాప్టర్లను తరలించడానికి ఉపయోగపడే ఒక ప్రత్యేక హ్యాంగర్ కూడా కనిపిస్తోంది. దీనివల్ల ఇది కేవలం రవాణా నౌకగానే కాకుండా, సముద్రంలో డ్రోన్ జలాంతర్గాములను మోహరించడానికి ఒక చలనశీల వేదికగా కూడా మారగలదు.Photo Credit: Twitterచైనా అభివృద్ధి చేసిన మానవరహిత జలాంతర్గాముల వర్గాన్ని XXLUUV లేదా ఎక్స్ట్రా-ఎక్స్ట్రా-లార్జ్ అన్‌క్రూడ్ అండర్‌సీ వెహికల్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్లే ఇవి సాధారణ డ్రోన్ జలాంతర్గాముల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. ఇప్పటివరకు చైనాలో రెండు జలాంతర్గాములు గుర్తించబడ్డాయి. వాటిలో ఒకటి సుమారు 115 అడుగుల పొడవు, మరొకటి సుమారు 148 అడుగుల పొడవు ఉన్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓర్కా ఎక్స్ఎల్యూవీ (Orca XLUV) సుమారు 51 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మానవరహిత జలాంతర్గాములు ఓర్కా కంటే ఆరు నుంచి ఎనిమిది రెట్లు పెద్దవిగా ఉండవచ్చు, మరియు చైనా వీటిని హైనాన్ ద్వీపం సమీపంలోని దక్షిణ చైనా సముద్రంలో కూడా పరీక్షించింది.చైనా రక్షణ వ్యూహంలో సముద్రం పాత్ర క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకల తయారీదారుగా చైనా నిలిచింది. దాని నౌకా నిర్మాణ సామర్థ్యం అమెరికా కంటే కనీసం 200 రెట్లు ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా వద్ద సుమారు 405 యుద్ధనౌకలు ఉండగా, అమెరికా వద్ద దాదాపు 295 ఉన్నాయి. తైవాన్ను తమ నియంత్రణలోకి తీసుకురావాలన్న తన ఆశయాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేసే అవకాశాన్ని కూడా ఆయన తోసిపుచ్చలేదు. చైనా వాదనను తైవాన్ తిరస్కరిస్తోంది. అందువల్ల, ఏ సైనిక సంఘర్షణలోనైనా సముద్రం పాత్ర అత్యంత కీలకం కావచ్చు.ఇదీ చదవండి: 'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్' -
‘నూరుశాతం’ తప్పుడు చర్య
తీసుకునే నిర్ణయాలన్నీ వికటిస్తున్న వైనం కనబడుతూనే ఉన్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తత్వం బోధపడలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని నిలువరించే పేరిట ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించటానికీ... దాన్నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఆర్థికంగా తోడ్పడుతున్న భారత్, చైనాలపై వంద శాతం సుంకాలు విధించటానికీ అనుమతించే బిల్లును ఆయన ప్రభుత్వం ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకుంది. గత నెల ఇదే బిల్లుకు సెనేట్ ఓకే చెప్పింది. తాజా ఆమోదంతో ఈ ఆంక్షల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్టయింది. దీనిపై ట్రంప్ సంతకం చేశాక చట్టంగా మారుతుంది. ఆ అధికారాన్ని ట్రంప్ వినియోగిస్తారా లేదా అన్నది చూడాల్సివుంది. రెండోసారి అధికారంలోకొచ్చాక రష్యాపై ట్రంప్ విధించ దల్చుకున్న ఈ ఆంక్షలు అత్యంత కీలకమైనవి. ఈసారి ఆంక్షలన్నీ రష్యా ఇంధన, రక్షణ రంగాలే లక్ష్యంగా రూపొందించారు. తన అభీష్టానికి విరుద్ధంగా ఇరుగు పొరుగు దేశాలు నిర్ణయాలు తీసుకుంటే వాటితో ద్వైపాక్షిక వాణిజ్యంతోసహా వివిధ బంధాలన్నిటినీ తెంచుకోవటం ఏ ప్రభుత్వమైనా చేసే పని. కానీ ‘తన చావు జగత్ప్రళయమ’న్న రీతిలో ఆ పనే అందరూ చేసితీరాలనే డిమాండ్ మూర్ఖత్వం. అంతర్జాతీయంగా 80 ఏళ్ల క్రితం కుదిరిన ఒడంబడిక ప్రకారం దురాక్రమణ యుద్ధాలకు పాల్పడే దేశంపై ఎలాంటి చర్యలు అవసరమో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి నిర్ణయిస్తాయి. రష్యా తప్పు చేస్తున్నదని అమెరికా భావిస్తే ఆ వేదికలద్వారా ఒత్తిళ్లు తీసుకురావాలి. అలా చేయలేననుకుంటే తనవరకూ ఇష్టానుసారం చేసుకోవచ్చు. అసలు ట్రంప్ అత్యుత్సాహంతో అమలు చేస్తున్న సుంకాల విధానంపై అమెరికాలోనే ఏకాభిప్రాయం లేదు. రష్యాపై కఠిన చర్యల్ని సమర్థిస్తున్న డెమోక్రాట్లు సైతం ట్రంప్‌కు అతిగా అధికారాలు కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏకపక్ష అధికారాలు అప్పగిస్తే దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.మన దేశం గతంకన్నా దృఢంగా వ్యవహరించటం హర్షించదగ్గది. ప్రస్తుత విధానాన్ని విడనాడబోమనీ, మార్కెట్ చలనాలను నిర్దేశించే ధరవరలు, సరఫరా, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భిన్న మార్గాల్లో చమురు కొనుగోలు చేయడం కొనసాగిస్తామనీ స్పష్టంచేసింది. వంద శాతం సుంకాలపై అమెరికా చర్యకు దిగితే ద్వైపాక్షిక సంబంధాలపై వాటి ప్రభావం పడుతుందని ఇప్పటికే అమెరికాకు తెలియ జేశామని తెలిపింది. అసలు ఈ తీర్మానం చేసే నైతిక హక్కు అమెరికన్ కాంగ్రెస్‌కు ఉందా? ఈ ఆంక్షలు ఒక్కరోజు ఆలస్యమైనా ఉక్రెయిన్‌లో మరింతమంది ప్రజలు మృత్యువుకు బలి అవుతారని తీర్మానం చెప్పడం వంచన. ఈ సూత్రం తనకు వర్తించదా? ఇరాన్‌పై ఇజ్రాయెల్ సాగించిన దురాగతాలను నిలువరించకపోగా, తానూ అందులో పాలుపంచుకుని దేశాధినేతతోసహా అనేకమంది పౌర, సైనిక ముఖ్యుల్ని హతమార్చటం... ఇప్పటికీ పౌర ప్రాంతాలపై బాంబులేస్తూ పదులకొద్దీ మందిని నిత్యం హతమార్చటాన్ని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? తీర్మానం చేసేముందు తమ పాలకుడి నిర్వాక మేమిటన్న స్పృహ ఉండొద్దా? తాము అధర్మయుద్ధం కొనసాగిస్తూ ధర్మపన్నాలు వల్లించటం, వేరొకరిని వేలెత్తిచూపటం, అందరూ తననే అనుసరించాలనటం ఏం సబబు?వచ్చేవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా సందర్శనకు రాబోతున్నారు. ఇరు దేశాలమధ్యా శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆంక్షల తీర్మానం తీసుకురావటం, బెదిరింపులకు దిగటం తెలివిమాలిన చర్యగా అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యకరం. ఇప్పటికే ఏఐ విషయంలో సమష్టిగా కదలాలన్న అమెరికా ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. ఆ విషయంలో ఇరు దేశాలమధ్యా భిన్నాభిప్రాయాలున్నాయని బయటపడింది. ఈ నేపథ్యంలో మరో వివాదాన్ని రగల్చటం వల్ల ఒరిగేదేమిటి? తన పెత్తందారీ పోకడలతో విసిగిన ప్రపంచం ఇప్పటికే దూరం జరిగిందని అమెరికా గ్రహించటం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడటంలో తెరవెనక తాను నడిపించిన ఎత్తుగడలే కారణమని గుర్తులేదా? అంతర్జాతీయ వేదికల ప్రమేయం లేకుండా ప్రపంచ దేశాలపై ఒత్తిడి తేవటం చట్టవిరుద్ధమని అమెరికా తెలుసుకోవాలి. -
ICUలో చైనా అధ్యక్షుడు..
-
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టును అదృష్టం వరించింది. మ్యాచ్ ఆడే అవసరం లేకుండానే ఆసియా క్రీడల సెమీ ఫైనల్లో బంగ్లా అడుగుపెట్టింది. అసలేం జరిగిందంటే.. జపాన్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.చైనాతో మ్యాచ్ఇందులో భాగంగా మహిళల క్రికెట్ జట్ల మధ్య సెప్టెంబరు 17 నుంచి సెప్టెంబరు 22 వరకు టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా మహిళా జట్లు మ్యాచ్ ఆడాల్సి ఉంది.ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దుఅయితే, వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు.. ఒక్క బంతి కూడా పడకుండానే చైనా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.చైనా జట్టు (PC: X)సెమీస్‌కు బంగ్లాదేశ్ అర్హతకాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మహిళా జట్టు పదో స్థానంలో ఉండగా.. చైనా 36వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్- పాకిస్తాన్ జట్లు గురువారమే తలపడనున్నాయి.మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియా- శ్రీలంక మహిళా జట్లు పోటీ పడనుండగా.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ జట్లు తలపడతాయి. కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో సెప్టెంబరు 18న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన జట్టును బంగ్లాదేశ్ సెమీస్‌లో ఢీకొంటుంది. సెమీ ఫైనల్లో భారత్‌తో ఢీబలాబలాలు, ర్యాంకింగ్స్ ఆధారంగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు జపాన్ కంటే పటిష్ట స్థితిలో ఉంది. కాబట్టి సెప్టెంబరు 20న జరిగే తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ టీమిండియాను ఎదుర్కొనే అవకాశం ఉంది.చదవండి: అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్! -
భారత్‌లో జిన్‌పింగ్‌కు స్ట్రోక్?.. మోదీ విందుకు దూరం?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై తాజాగా షాకింగ్ ప్రచారం మొదలైంది. భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే పక్షవాతం) బారినపడ్డారని చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ ఆరోపించారు. అయితే ఈ ప్రచారంపై చైనా, భారత్ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బ్రిక్స్ విందుకు దూరం.. ఏడేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటించిన జిన్‌పింగ్.. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు. అయితే మోదీ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మాత్రం ఆయన హాజరుకాలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు నేతలు విందులో పాల్గొనగా.. చైనా తరఫున విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రాతినిధ్యం వహించారు.సుదీర్ఘమైన కార్యక్రమాల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే విందుకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై అధికారిక వివరణ రాలేదు. ఇదే సమయంలో బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగం సందర్భంగా జరిగిన ఓ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో కూడా చర్చకు వచ్చింది. మోదీ.. చైనా ప్రతినిధి బృందం వైపు తిరిగి ఇట్స్ ఓకేనా? అని అడగడం, జిన్‌పింగ్ స్పందించినట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.ఆసుపత్రిలో అత్యవసర చికిత్స?చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ జిన్‌పింగ్ ఆరోగ్యంపై పలు ఆరోపణలు చేశారు. బ్రిక్స్ సదస్సులో ఆయన స్పృహ కోల్పోయారని, వెంటనే వైద్య బృందం అత్యవసర చికిత్స అందించిందని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు తరలించారని ఆరోపించారు. భారత్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి భారత అధికారులకు తెలిసిపోతుందనే భయంతో జిన్‌పింగ్ నిరాకరించారని కూడా షీ పేర్కొన్నారు. బీజింగ్‌కు చేరుకున్న వెంటనే ఆయనను సైనిక హెలికాప్టర్లో 301 ఆసుపత్రికి తరలించినట్లు ఆరోపించారు.అక్కడి వైద్యులు జిన్‌పింగ్‌కు తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించారని, విమాన ప్రయాణం కారణంగా అత్యవసర చికిత్సకు కీలకమైన సమయం కోల్పోయారని షీ తన పోస్టుల్లో పేర్కొన్నారు. విమానంలో శస్త్రచికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రాథమిక చికిత్స మాత్రమే అందించగలిగారని ఆరోపించారు. జిన్‌పింగ్‌కు 301 ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూలో పర్యవేక్షిస్తున్నారని వాంజున్ షీ మరో పోస్టులో పేర్కొన్నారు. ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి ఇంకా బయటపడలేదని ప్రచారం చేశారు. అంతేకాకుండా చైనా సైనిక కమాండ్లు, గ్రూప్ ఆర్మీలు అప్రమత్త స్థితికి చేరుకున్నాయని, దేశంలో పరిణామాలను పర్యవేక్షిస్తున్నాయని కూడా ఆరోపించారు.ఎవరీ వాంజున్ షీ?జిన్‌పింగ్ ఆరోగ్యంపై ఆరోపణలు చేసిన వాంజున్ షీ.. చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను డెమోక్రసీ పార్టీ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. 1998లో చైనాలో ఏర్పాటైన ఈ రాజకీయ సంస్థను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం నిషేధించింది. బహుళపార్టీ ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ఎన్నికలు, అధికారాల విభజన, భావప్రకటనా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన వంటి అంశాల కోసం ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ప్రకటించుకుంది. పార్టీ ఏర్పాటులో భాగమైన పలువురు ప్రజాస్వామ్య కార్యకర్తలను చైనా అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపినట్లు మానవ హక్కుల సంస్థలు గతంలో నివేదించాయి. ప్రస్తుతం ఈ సంస్థ చైనా వెలుపల కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్‌పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్‌పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్‌ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్‌లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు! -
భాష మార్చిన రాత!
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్... ఈ ముగ్గురు మహానేతలు బ్రిక్స్ సమ్మిట్‌లో ఒక చోట ఉంటే మధ్యలో నిలుచున్న ‘నాల్గవ వ్యక్తి’ మన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ బాబు. ఒకే ఒక్క విదేశీభాషపై పట్టు సాధించి...ఇవాళ గ్లోబల్ లీడర్ల పక్కన దౌత్యం నెరిపే స్థాయికి ఎదిగాడు. విదేశీ భాషలు నేర్చుకుంటే లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చెప్పే సూపర్ సక్సెస్ స్టోరీ ఇది! యువతా... మీకెన్ని భాషలు వచ్చు?‘చైనాను భారతీయులు, భారత్‌ను చైనీయులు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. ఈ రెండు వేర్వేరు సంస్కృతుల మధ్య భాషే వారధి. ఆ భాషతోనే మనం సంబంధాలు నెరపగలం’ అంటారు సిద్ధార్థ్ బాబు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఈస్ట్ ఏషియా డివిజన్’లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న సిద్దార్థ్ బాబు చైనా, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, మంగోలియా తదితర దేశాలతో భారత్‌కు ఉన్న దౌత్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాదు, ఆ రాజ్యాధినేతలు వచ్చినప్పుడు ప్రధానికి అనువాదకునిగా కీలకమైన బాధ్యతను పోషిస్తుంటారు. ఆయన మాండరిన్ ఎక్స్పర్ట్. అందుకే బ్రిక్స్‌లో చైనా అధ్యక్షునికీ మన ప్రధానికీ మధ్య జరిగే సంభాషణల్లో కీలకంగా మారి ఇవాళ వార్తల్లో నిలిచారు.ఎవరీ సిద్ధార్థ్ బాబు? కేరళకు చెందిన సిద్ధార్థ్ బాబుది మామూలు మధ్యతరగతి కథే. మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఒక ఈ–కామర్స్ కంపెనీలో రెండేళ్లు జాబ్ చేశారు. కానీ సంతృప్తి కలగలేదు. లైఫ్‌లో పెద్దగా సెటిల్ అవ్వాలనే కసితో సివిల్స్ వైపు అడుగులు వేశారు. 2017లో ఆలిండియా 15వ ర్యాంక్ కొట్టి, ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) ఆప్షన్ ఎంచుకున్నారు. అయితే వృత్తిరీత్యా ఆయన నేర్చుకున్న ‘ఒక్క భాష’ ఆయన కెరీర్‌ను రాకెట్లా దూసుకెళ్లేలా చేసింది.స్మార్ట్‌గా కొత్త భాషకొత్త భాష నేర్చుకోవడం కష్టమనే అపోహ వద్దు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే కేవలం కొన్ని నెలల్లోనే కొత్త భాషపై పట్టు సాధించవచ్చు. భాషలు నేర్పించే డ్యుయోలింగో లాంటి యాప్స్ అనేకం ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 15 నిమిషాలు కేటాయించి బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఇక నేర్చుకోవాలనుకునే భాషలోని సినిమాలు, వెబ్ సిరీస్‌లను మొదట సబ్‌టైటిల్స్‌తో, ఆ తర్వాత సబ్‌టైటిల్స్ లేకుండా చూడటం ద్వారా ఉచ్చారణ సులువుగా అర్థమవుతుంది. స్థానిక యూనివర్సిటీలు ఆఫర్ చేసే డిప్లొమా కోర్సుల్లో చేరడం ద్వారా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ పొందవచ్చు. ‘ఒక మనిషితో అతడికి తెలిసిన భాషలో మాట్లాడితే అది అతడి మెదడుకు చేరుతుంది. అదే అతడి మాతృభాషలో మాట్లాడితే నేరుగా అతడి గుండెకు చేరుతుంది’ అంటాడు నెల్సన్ మండేలా. సిద్ధార్థ్ బాబు సరిగ్గా ఆ పని చేయడం ద్వారా ఎదిగారు. గ్లోబల్ సిటిజన్ గా ఎదగాలనుకునే యువత అదనంగా ఒక అంతర్జాతీయ భాషను నేర్చుకోవడం రెజ్యూమెకి బ్రహ్మాస్త్రాన్ని జోడించడమే. రీల్స్‌లో టైమ్ వృథా చేయకుండా ఇవాళే ఒక కొత్త భాష నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ‘మాండరిన్’ మంత్రంఐఎఫ్ఎస్ ట్రైనింగ్‌లో భాగంగా ఒక విదేశీ భాష నేర్చుకోవాలనేది రూల్. చాలామంది ఈజీగా ఉండేవి ఎంచుకుంటే సిద్ధార్థ్ మాత్రం ప్రపంచంలోనే కష్టమైన భాషల్లో ఒకటైన చైనీస్ ‘మాండరిన్’ ఎంచుకున్నారు. ‘చైనాను అర్థం చేసుకోవాలంటే ఆ దేశ భాష నేర్చుకోవడమే దారి’ అని గ్రహించి ఆ దారిలో వెళ్లారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో నాలుగేళ్లపాటు (2018–2022) పని చేస్తూ చైనా చరిత్ర, సంస్కృతి, రాజకీయాలపై లోతైన అధ్యయనం చేశారు. అయితే ఆయన అక్కడ ఉన్న కాలంలోనే కోవిడ్ చెలరేగింది. ఆ మృత్యుఘోషలో లాక్డౌన్లో నాలుగు గోడల మధ్య ఆయన మాండరిన్ భాషలో మునిగి పోయి ఆరితేరారు. ఆ తర్వాత అమెరికాలో ట్రాన్స్ లేషన్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇవన్నీ ఆయనను ప్రధానికి వెన్నెముకగా మార్చాయి. రిపబ్లిక్ డే పరేడ్స్ నుంచి బ్రిక్స్ సమ్మిట్ వరకు... మోదీ వెనుక నీడలా ఉంటూ దేశ దౌత్యవిధానంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఒక భాషపై కమాండ్‌తో దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే స్థాయికి చేరాడాయన. ‘అయితే ఈ పని అంత సులువు కాదు. నేతలు మాట్లాడే సమయంలో వాటి గాంభీర్యం, లోతు తెలుసుకుని మనం అనువాదం చేయాల్సి వస్తుంది’ అంటారు సిద్ధార్థ్ బాబు.గ్లోబల్ కెరీర్‌కు భాష కీలకంమార్కులు, ర్యాంకుల పిచ్చిలో ఉన్న మన విద్యార్థులు, తల్లిదండ్రులు విదేశీ భాషలు నేర్చడం ఎంత ముఖ్యమో గ్రహించడం లేదు. గ్లోబలైజేషన్ పెరిగాక మాండరిన్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్... ఈ ఐదు భాషల్లో ఏదో ఒకటీ లేదా రెండు తెలిసిన వాళ్లకు ఇంటర్నేషనల్ కంపెనీలు, ఎంబసీలు, గ్లోబల్ ఆర్గనైజేషన్లు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయి. లక్షల్లో జీతాలు మాత్రమే కాదు, సిద్ధార్థ్ లాగా గ్లోబల్ స్టేజ్ మీద దేశ ప్రతినిధిగా నిలబడే అరుదైన గౌరవమూ దక్కుతుంది. -
భారత్‌కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్‌లకు అమెరికా గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్‌లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.రష్యాపైనే ప్రధాన గురిఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.సెనేట్‌లో భారీ మెజార్టీతో ఆమోదంఈ బిల్లుకు అమెరికా సెనేట్‌లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్‌లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్‌ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.➤ India may face possible 100% tariff➤ India among 10 nations named for tariffs➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026ఇక ఏం జరుగుతుంది?హౌస్‌లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్! -
బ్రిక్స్ సూపర్ సక్సెస్!
చేరుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత, అందుకు అనుసరించాల్సిన మార్గంపై ఏకాభిప్రాయం సాధించగలిగితే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతమవుతాయి. ఆ రెండూ లేకుంటే ఉత్త లాంఛనప్రాయ సమావేశాలుగా మిగులుతాయి. ఆ కోణంలో శని, ఆదివారాల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించినట్టు లెక్క. అలాగని ఈ సమావేశాలు సమీప భవిష్యత్తులో బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని నిర్ణయించలేదు. అలాగే ఎడాపెడా సుంకాలు విధిస్తున్న అమెరికాను నిలదీయలేదు. పశ్చిమాసియా కల్లోలానికి నువ్వే కారణమని వేలెత్తి చూపలేదు. ఈ అంశాల్లో లౌక్యం ప్రదర్శిస్తూనే చేయదల్చుకున్నది చేయటంలో బ్రిక్స్ సఫలీకృతమైంది. ఇవి మాత్రమే కాదు... పరస్పరం కలహించుకుంటున్న ఇరాన్, దాని ప్రత్యర్థులు యూఏఈ, సౌదీలను సమావేశాలకు రప్పించగలిగింది. పైగా ఇరాన్, యూఏఈ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో విభేదాలున్న చైనా, ఫిలిప్పీన్స్ కూడా సదస్సుకు హాజరయ్యాయి. భారత్, చైనాల వివాదం సరేసరి. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు గల దేశాలన్నీ ఒక ఉమ్మడి డిక్లరేషన్ ప్రకటించటం చిన్న విషయం కాదు. అతిథేయ దేశంగా భారత్ ప్రత్యేక కృషి ఇందులో కనబడుతుంది. సభ్య దేశాలతో ఓపిగ్గా చర్చించాలి. ఒప్పించాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన టీమ్ ఆ పని చేయగలిగినందుకు అభినందించాలి.ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో దక్షిణార్ధ గోళ దేశాల స్వరం వినిపించటంలో ఏదోమేరకు కృషి చేసిన అలీనోద్యమ సంస్థతో బ్రిక్స్‌కు పోలికలున్నాయి. కానీ వాటిమధ్య వ్యత్యాసం కూడా ఉంది. అప్పటి ద్విధ్రువ ప్రపంచంలో స్వతంత్రంగా మనగలగటానికి అవసరమైన ఆర్థిక సంపత్తి అలీనోద్యమానికి లేదు. బ్రిక్స్ అలా కాదు. అందులో పూర్తి స్థాయి సభ్యత్వంగల 11 దేశాలను చూసినా వాటి ఉమ్మడి దేశీయోత్పత్తి (జీడీపీ) వాటా ప్రపంచ జీడీపీలో 40 శాతం. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచంలో చైనా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. రష్యావద్ద అపారమైన చమురు నిక్షేపాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయి. మనతోసహా బ్రిక్స్ దేశాలన్నీ ఆర్థికంగా చురుగ్గా ఎదుగుతున్న దేశాలు. బ్రెజిల్ అయితే దక్షిణమెరికా ఆర్థిక వ్యవస్థల్లో అతి పెద్దది. ఇవన్నీ సమష్టిగా దక్షిణార్ధ గోళ దేశాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నాయి. ఇన్ని అనుకూలాంశాలున్నా అమెరికాపై నేరుగా ధిక్కార స్వరం వినిపించనప్పుడు ప్రయోజనమేమిటన్న సందేహం వస్తుంది. ఆ ప్రక్రియ క్రమబద్ధంగా సాగాలి. భద్రతా మండలి, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర సంస్థల్లో వర్ధమాన దేశాలకు మరింత మెరుగైన చోటీయాలని బ్రిక్స్ కోరుతోంది. కానీ అది అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే డిమాండ్‌గా మారకుండా సదస్సు జాగ్రత్తపడింది. డాలర్ వాడకాన్ని క్రమేపీ తగ్గించుకునే ప్రక్రియలోనూ అదే ఎత్తుగడ పాటించింది. ఆ దిశగా అడుగులేస్తే బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయటానికి ముందే 2024 డిసెంబర్లో డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ బెదిరింపుల్ని ఆయన అడపా దడపా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఉనికిలో లేకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది మరి! అందుకే కావొచ్చు... ఆ విషయంలో బ్రిక్స్ సంయమనం పాటించింది. అది వేరే రూపంలో ఇప్పటికే అమలవుతోంది. చైనా, రష్యా 90 శాతం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లో జరుపుకొంటున్నాయి. రష్యా చమురు విక్రయాలకు మన దేశం రూపా యిల్లో చెల్లించింది. డాలర్ రద్దు చేయకుండానే దాని వాడకాన్ని తగ్గించటం బ్రిక్స్ దేశాలు ఎంచుకున్న పద్ధతి. ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఇప్పటికీ ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా 56.77 శాతం. యూరో కరెన్సీ వాటా 20.25 శాతం. చైనా కరెన్సీ రెన్మిన్బి(ఆర్ఎంబీ) వాటా కేవలం 1.95 శాతం. డాలర్ నిల్వలు పుష్కలంగా ఉన్న చైనా మరో కరెన్సీని వినియోగించాలనుకున్నా దానికే నష్టం. మనకూ ఆ సమస్యవున్నా, అమెరికా ఆధిపత్యం స్థానంలో చైనాను అంగీకరించటానికి సిద్ధపడలేం. ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో ఎవరి జాగ్రత్తలు వారివి. ఈ దశలో అస్పష్టతతోనైనా బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన వెలువరించటం దానికదే ఘన విజయం. -
చైనా స్పై గేమ్.. ఇక నీటిలో చేపను నమ్మేదెలా!?
మొన్నీమధ్యే రోబోట్ గేమ్స్‌తో అబ్బురపరిచిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు మరో టెక్నాలజీ మాయాజాలంతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పటివరకు డ్రోన్లు అంటే ఆకాశంలో ఎగిరేవే.. కానీ చైనా మాత్రం వాటి పరిధిని నీటి అడుగునకూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అచ్చం చేపలా కనిపిస్తూ.. చేపలాగే ఈదుతూ.. నీటిలో తన ఉనికి ఏమాత్రం అనుమానం రాకుండా కదిలే ఓ రోబోటిక్ చేపను అభివృద్ధి చేసింది. దూరం నుంచి చూస్తే నిజమైన చేపే అనిపించే ఈ యంత్రం.. దగ్గరగా పరిశీలిస్తే మాత్రం సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన నిఘా రోబోగా కనిపిస్తుంది.బీజింగ్‌లోని షౌగాంగ్ పార్క్‌లో జరుగుతున్న 2026 చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (CIFTIS)లో రోబో చేప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు మూడు కిలోల బరువు ఉన్న ఈ బియోనిక్ రోబో చేప పేరు.. గోల్డెన్ డ్రాగన్ ఫిష్(BG-5). గోల్డెన్ అరోవానా చేపకు జిరాక్స్‌లా ఉందది. అంతేకాదు.. నీళ్లలో ఈదుతూ.. అడ్డంకులు ఎదురైతే తన దారిని తానే మార్చుకుంటూ ముందుకు సాగింది. దీనికి ఏ రిమోట్ అక్కర్లేదు. ఏ ప్రొగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మాత్రం మోటార్లు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉంటాయి. సాధారణ అండర్‌వాటర్ డ్రోన్లు ప్రొపెల్లర్లతో కదులుతాయి. కానీ ఇది మాత్రం తోకలో ఉండే 3 కదిలే జాయింట్లు, 7 సెగ్మెంట్లు ఉంటాయి. వాటిని ఊపుతూ ముందుకు సాగుతూ నీటిలో అలల తరహా కదలికలను చూపిస్తుంది. దీంతో ఏదో యంత్రం కదులుతున్నట్లు కాకుండా.. అచ్చం జీవం ఉన్న చేప ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సహజమైన కదలికే దీని అసలు బలం. 3 కిలోలే.. కానీ టెక్నాలజీ మాత్రం భారీదే!BG-5 పరిమాణం చూస్తే ఆశ్చర్యమే. ఇది సుమారు 640 మిల్లీమీటర్ల పొడవు, 204 మిల్లీమీటర్ల వెడల్పు, 90 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. బరువు కేవలం 3 కిలోలు. గరిష్టంగా 5 మీటర్ల లోతులో పనిచేయగలదు. గరిష్ట వేగం సెకనుకు 0.6 మీటర్లు. అంటే ఇది సముద్రంలో నిఘాకు పనికి రాదన్నమాట!. తక్కువ లోతున్న నీళ్లలో పని చేసే రోబో మాత్రమే. Look at the quality of this fish drone that China just revealed pic.twitter.com/v24asLP4d1— The Gulag (@WelcomeTheGulag) September 15, 2026 అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో గూఢచర్యానికి ఉపయోగపడుతుందా? అనే ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది. దాని చుట్టూ ఉన్న సెన్సార్లు.. ఏదైనా ఆటంకాలు ఎదురైతే దానంతట అదే తప్పించుకుని ముందుకు సాగుతుంది. అంటే నీటిలో పరిస్థితులు మారినా.. ఎదురుగా ఏదైనా వస్తే ఆగిపోకుండా, దాన్ని తప్పించుకుని ఓ నిజం చేపలా ముందుకు వెళ్లగలదు. పైగా మనుషులు సాధారణంగా ఉపయోగించే అండర్‌వాటర్ డ్రోన్లా బయటికి యంత్రంలా కనిపించదు. దీంతో చేప రూపంలోనే నిఘా పెట్టే కొత్త రోబోను చైనా ప్రదర్శించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మాయ ఇక్కడే..ఒక పెద్ద అండర్‌వాటర్ డ్రోన్ నీటిలోకి వస్తే దాన్ని గుర్తించడం కొంత సులభం. కానీ చేపల గుంపులో ఒక చేపలా కనిపించే రోబోను గుర్తించడం అంత సులభం కాకపోవచ్చు. ఇదే కారణంగా BG-5ను షాలో-వాటర్ రీకానైసెన్స్, సర్వైలెన్స్ కోణంలో నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనా సైనిక గూఢచర్యానికి ఉపయోగిస్తోందని నిర్ధారించే ఆధారం లేదు. కంపెనీ మాత్రం పౌర అవసరాలకూ ఉపయోగించవచ్చని చెబుతోంది.కానీ, ఈ రోబోను తయారు చేసిన సంస్థకు రక్షణ రంగానికి సంబంధించిన అండర్‌వాటర్ రోబోటిక్స్‌లో పనిచేసిన నేపథ్యం ఉంది. ఈ సంస్థ గతంలో రోబో షార్క్ (ROBO-SHARK) అనే బయోమిమెటిక్ అండర్‌వాటర్ రోబోను సైనిక యూనిట్‌తో కలిసి అభివృద్ధి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే నీటి అడుగున బయోమిమెటిక్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన రక్షణ ప్రాజెక్టులో పనిచేసినట్లు సంస్థే పేర్కొంది. China will turn anything that moves into a spying machine—Chinese cars, Chinese products, and now even fish. China wants to control all of us. China is a real threat to the freedom of every person on the planet. pic.twitter.com/ycou8OaVQy— Israel & World News (@Nonstopnews_) September 15, 2026..గుంపుగా వస్తే?ఇక్కడ ఇంకో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. BG-5కు సంబంధించిన రూట్ మ్యాప్, పనుల కేటాయింపు, ఫార్మేషన్ కంట్రోల్, బహుళ రోబోట్ల మధ్య సమన్వయం వంటి సామర్థ్యాలను కంపెనీ ప్రస్తావించింది. అంటే భవిష్యత్తులో ఒక్క రోబో చేప కాకుండా.. చేపల గుంపులా అనేక రోబోలు నీటిలోకి వెళ్లి, ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతాన్ని గమనించే పరిస్థితి రావొచ్చు. ఒకటి సమాచారం సేకరిస్తే.. మరొకటి మరో ప్రాంతాన్ని పరిశీలించడం.. వాటన్నింటినీ సమన్వయం చేయడం సాధ్యమయ్యే దిశగా టెక్నాలజీ వెళ్తోంది. ఇప్పటివరకు BG-5ను “స్పై ఫిష్” అని అధికారికంగా పిలవడం లేదు. కానీ దాని సహజమైన రూపం, స్వయంచాలకంగా దారి మార్చుకునే సామర్థ్యం, నీటి అడుగున పరిశీలనకు అనువైన డిజైన్, తయారీ సంస్థకు ఉన్న రక్షణ రంగ అనుసంధానాలు.. ఇవన్నీ కలిపి చూస్తే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో నిఘా, పరిశఋలన వంటి భద్రతా కార్యకలాపాలకు ఉపయోగపడే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం.యంత్రం యంత్రంలా కనిపించకుండా.. ప్రకృతిలోని జీవిలా కలిసిపోయేలా చేయడమే ఈ టెక్నాలజీ వెనుక అసలు ఆలోచన. నేడు చేప రూపంలో కనిపించిన ఈ రోబోట్.. రేపు పురుగు, తేనెటీగ, డ్రాగన్‌ఫ్లై రూపంలోనూ నిఘా కోసం రంగంలోకి దిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో! అసలు ప్రశ్న ఒక్కటే.. మన చుట్టూ కనిపిస్తున్న జీవుల్లో ఎన్ని నిజమైనవో.. ఎన్ని నిఘా యంత్రాలో గుర్తించడం ఎలా?.ఇదీ చదవండి: కరాచీలో ‘ధురంధర్-3’ షూటింగ్ -
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెంచాలని టెక్ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గితే చైనా ముందుకు దూసుకెళ్లి ప్రపంచ ఏఐ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరి ఎవరి వాదనలో నిజమెంత? ఎవరిది కరెక్ట్?..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి’ అన్నది ట్రంప్ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?టెక్ దిగ్గజాలు చెబుతున్నది ఇదే..ఇక్కడ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నాయి. ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్(Anthropic) సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఆల్ట్‌మన్ చెబుతున్న ‘పేసింగ్’ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్ రెండూ ఉండాలన్నమాట.ఆందోళనలో ట్రంప్ ట్రంప్ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన.చైనా నిజంగానే అమెరికాను దాటేస్తుందా?ఇది మాత్రం అంత సులభమైన ప్రశ్న కాదు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు OpenAI, Google, Anthropic వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, అధునాతన చిప్ టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.అసలు భయం ఏంటంటే..ఆల్ట్‌మన్ మాత్రం ఏఐ విషయంలో రెండు ‘నైట్మేర్’ పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్‌మన్ హెచ్చరించారు.ఇదే కారణంగా Anthropicలోని కొందరు పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఏఐపై బ్రేకులు.. నాదెళ్లదీ అదే మాట!ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏఐని ఆపేయాలని తాను చెప్పడం లేదన్న నాదెళ్ల.. మానవ నియంత్రణలో, మానవాళికి ఉపయోగపడే ఏఐనే అభివృద్ధి చేయాలని అన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా వెళ్లే ముందు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ మోడళ్లను పరీక్షించి పర్యవేక్షించాలని సూచించారు. ఏఐ కొద్దిమంది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దేశాలు, పరిశ్రమలు, విద్యావేత్తలకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, ఓపెన్ సోర్స్ మోడళ్లకూ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.మరి ఎవరి వాదన కరెక్ట్?నిజానికి ట్రంప్‌ది కూడా పూర్తిగా తప్పు కాదు.. టెక్ దిగ్గజాలదీ కాదు. అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో ‘చైనాను ఓడించాలి’ అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు.అంతిమంగా ఇది అమెరికా–చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ. వేగం అమెరికాకు అవసరం.. కానీ ఆ వేగానికి బ్రేకులు లేకపోతే అదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారొచ్చు.ఇదీ చదవండి: హర్ముజ్‌లో మారిన సీన్.. అయోమయంలో ట్రంప్ -
ఆసియా కప్ విజేతగా భారత్
జూనియర్ మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది. చైనాలోని మోకీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది.పాక్‌ను మట్టికరిపించికాగా గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన భారత మహిళల జట్టు.. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌ను 19-0తో మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాతో శనివారం జరిగిన ఫైనల్లో 5-1 గోల్స్ తేడాతో గెలిచిన భారత్.. సెమీ ఫైనల్లో చైనాతో తలపడింది.ఏకైక గోల్ ఎవరిదంటే?మోకీలో జరిగిన టైటిల్ పోరులో సనికా చంద్రకాంత్ పదిహేడో నిమిషంలో గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించింది. ఈ క్రమంలో ఆధిక్యంలో వెళ్లిన భారత జట్టు.. ఆ తర్వాత చైనాకు గోల్ కొట్టే అవకాశం ఇవ్వకుండా నిలువరించింది. తద్వారా 1-0 తేడాతో గెలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది.ఇక ఈ విజయంతో భారత మహిళల జూనియర్ జట్టు.. ప్రపంచకప్-2027 టోర్నీకి అర్హత సాధించింది. ఇక భారత్‌తో పాటు పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన చైనా, జపాన్, సౌత్ కొరియా కూడా వరల్డ్‌కప్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. 2023, 2024 సీజన్లలో ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. తాజాగా జరిగిన ఎడిషన్‌లోనూ పతకాన్ని కైవసం చేసుకుంది. నజరానామహిళల జూనియర్ హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతీ ప్లేయర్‌కు రూ. 3 లక్షల చొప్పున.. కోచింగ్, సహాయక సిబ్బందికి రూ. 1.5 లక్షల చొప్పున రివార్డు అందజేయనుంది.చదవండి: పంత్వి పిల్లాడి చేష్టలు.. సంజీవ్ గోయెంకా కామెంట్లు వైరల్ 𝗧𝗛𝗘 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗜𝗧 𝗔𝗟𝗟 𝗦𝗜𝗡𝗞𝗦 𝗜𝗡. 🇮🇳🏆From tears to laughter, hugs to unforgettable celebrations, the Indian Junior Women’s Team let it all out after being crowned AHF Junior Asia Cup 2026 champions! 🥇💙#HockeyIndia #IndiaKaGame #JuniorAsiaCup pic.twitter.com/NC2OR6Se9k— Hockey India (@TheHockeyIndia) September 13, 2026 -
బంగారం కొండను గుర్తించిన చైనా.. సంచలన అన్వేషణపై చర్చ!
చైనా శాస్త్రవేత్తలు చేపట్టిన ఓ సముద్ర అన్వేషణ అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అందరూ భూమిపై బంగారం కోసం గనులు తవ్వుతుంటే.. చైనా మాత్రం సముద్ర గర్భంలోకి వెళ్లి ఖనిజ సంపదను వెతుకుతోంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన అన్వేషణలో అక్కడి సముద్ర అడుగుభాగంలో అత్యంత విలువైన బంగారం, వెండి నిక్షేపాలను గుర్తించినట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని ఖనిజ నమూనాల్లో భూమిపై సాధారణంగా కనిపించే నిక్షేపాల కంటే గణనీయంగా అధిక స్థాయిలో బంగారం, వెండి ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.చైనాకు చెందిన త్సింగ్‌హువా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తల బృందం ఆగస్టులో 18 రోజుల పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర అన్వేషణ చేపట్టింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (AUV), డీప్-సీ విజువల్ శాంప్లర్ వంటి పరికరాలతో సముద్ర గర్భాన్ని పరిశీలించారు. ఇప్పటికే నిర్వహించిన ప్రాథమిక సర్వేల ఆధారంగా 700 నుంచి 1,500 మీటర్ల లోతులో హైడ్రోథర్మల్ వెంట్స్‌ను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. అత్యంత చురుకైన రసాయనిక, ఉష్ణ ప్రక్రియలు చోటుచేసుకునే ఈ ప్రాంతాల చుట్టూ భారీ ఖనిజ నిర్మాణాలు ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు.హైడ్రో థర్మల్ వెంట్స్ చుట్టుపక్కల మూడు భారీ శంఖాకార ఖనిజ నిర్మాణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. అక్కడి నుంచి సేకరించిన నమూనాలను నౌకలోని ప్రయోగశాలలో ప్రాథమికంగా పరీక్షించారు. చాల్కోపైరైట్, పైరైట్, స్ఫాలరైట్ వంటి ఆర్థికంగా విలువైన ఖనిజాలతో పాటు భారీ స్థాయిలో బంగారం, వెండి ఉన్నట్లు తేలింది. బంగారం గరిష్ఠ సాంద్రత 15.4 పార్ట్స్ పర్ మిలియన్ (PPM)గా నమోదైంది. అంటే ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 15.4 గ్రాముల బంగారం ఉన్నట్లు లెక్క. ఇక వెండి సాంద్రత ఏకంగా 1,271 PPMకు చేరింది. అంటే ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 1.271 కిలోల వెండి ఉన్నట్లు అర్థం. ఈ స్థాయి సాంద్రత కొన్ని నమూనాల్లో భూభాగంలోని సాధారణ ఖనిజ నిక్షేపాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీంతో సముద్ర గర్భంలోని ఈ ప్రాంతాలు భవిష్యత్తులో అత్యంత విలువైన ఖనిజ వనరులుగా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.బంగారంతో పాటు అరుదైన జీవరాశులుఈ అన్వేషణ కేవలం ఖనిజ సంపదకే పరిమితం కాలేదు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ జీవించే అరుదైన జీవరాశులను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. హైడ్రోథర్మల్ వెంట్స్ ప్రాంతంలో రొయ్యలు, పీతలు, షెల్ఫిష్, ఎక్స్‌ట్రీమోఫైల్స్ వంటి జీవ సమూహాలను పరిశోధకులు ఫొటోలు తీశారు. సాధారణ సముద్ర జీవులకు అనుకూలంగా లేని అధిక ఉష్ణోగ్రతలు, రసాయనిక మార్పులు ఉన్న ప్రాంతాల్లో ఈ జీవులు ఎలా మనుగడ సాగిస్తున్నాయన్నది శాస్త్రవేత్తలకు కీలక పరిశోధనా అంశంగా మారింది. వీటి జన్యు వనరులు భవిష్యత్తులో బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధనలకు ఉపయోగపడే అవకాశాలపైనా ఆసక్తి పెరుగుతోంది.సముద్ర గర్భమే కొత్త బంగారు గని?భూమిపై సులభంగా అందుబాటులో ఉన్న ఖనిజ వనరులు తగ్గుతున్న నేపథ్యంలో సముద్ర గర్భంలోని ఖనిజ నిక్షేపాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా చైనా గుర్తించిన ఈ నిక్షేపాల్లో బంగారం, వెండి అధిక సాంద్రతలో ఉండటం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. అయితే సముద్ర గర్భం నుంచి ఖనిజాలను వెలికితీయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. అత్యంత లోతైన ప్రాంతాల్లో పనిచేసే సాంకేతికత, భారీ వ్యయం, పర్యావరణ ప్రభావాలు వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రో థర్మల్ వెంట్స్ చుట్టూ ఉన్న ప్రత్యేక జీవ వ్యవస్థకు మైనింగ్ వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందన్నది కీలక ప్రశ్న.అయినా.. సముద్రం అడుగున దాగి ఉన్న బంగారం, వెండి ప్రపంచ మైనింగ్ రంగానికి కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా చేపట్టిన ఈ అన్వేషణ భవిష్యత్తులో సముద్ర గర్భ ఖనిజాలపై మరిన్ని పరిశోధనలకు, అలాగే కొత్త సాంకేతికతల అభివృద్ధికి దారితీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐర్లాండ్ విలీనంపై అగ్గి రాజేసిన ట్రంప్ -
భారత్‌లో పుతిన్-జిన్‌పింగ్ ‘పవర్’ షో!
ప్రపంచ దేశాల అధినేతలు సదస్సులు, సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలకే కాదు.. వాళ్ల ప్రయాణాలు, భద్రత-ఆహార ఏర్పాట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వెంట తీసుకొచ్చే వస్తువులు, అందుకునే కానుకల వరకు ప్రతీ అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విషయంలో అంతకు మించిందేదో కనిపిస్తోంది.. ఇద్దరు నేతలు భారత్‌కు చేరుకున్న తీరు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకవైపు పుతిన్ అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఐఎల్-96-300పీయూలో ఢిల్లీకి వచ్చారు. దీనినే ‘డూమ్స్‌డే ప్లేన్’, ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ వంటి పేర్లతో పిలుస్తారు. మరోవైపు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్ వచ్చారు. గగన ప్రయాణమే కాదు.. ఇటు వీళ్ల కోసం తెచ్చిన ప్రెసిడెన్షియల్ కార్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. పుతిన్ కోసం ఔరస్ సెనాట్.. జిన్‌పింగ్ కోసం సమ్‌థింగ్ స్పెషల్ హోంగ్‌చీ ఎన్701 హైలైట్‌గా నిలిచాయి. ఒకరిది ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా పేరొందితే.. మరొకరి రాజకీయ చరిత్రతో ముడిపడిన ‘రెడ్ ఫ్లాగ్’ బ్రాండ్‌గా పేరొందాయి.‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’..పుతిన్ ప్రయాణించే విమానం ఐఎల్-96-300పీయూ.. ఎంతో ప్రత్యేకం. అత్యవసర పరిస్థితుల్లోనూ రష్యా అధ్యక్షుడు దేశ సైనిక, ప్రభుత్వ వ్యవస్థలతో సురక్షితంగా కమ్యూనికేట్ చేయగలిగేలా దీన్ని మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించారు. శాటిలైట్ లింకులు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, రాడార్ జామింగ్ సహా పలు రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. పుతిన్ భారత్‌కు వచ్చినప్పుడు ఒకే తరహాకు చెందిన రెండు విమానాలు ఒకేసారి ప్రయాణించాయి. అసలు అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారో గుర్తించడం కష్టమయ్యేలా చేసే ఈ వ్యూహం.. భద్రతలో భాగమే. అందుకే ఐఎల్-96-300పీయూకి ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’, ‘డూమ్స్‌డే ప్లేన్’ వంటి పేర్లు వచ్చాయి.ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్..ఆకాశంలో ఇంతటి భద్రత ఉంటే.. పుతిన్ నేలపై ప్రయాణించే కారు కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటుంది. ఢిల్లీలో పుతిన్ ఉపయోగించిన ఔరస్ సెనాట్‌ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తారు. బుల్లెట్లు, పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన ఈ ఆర్మర్డ్ లిమోసిన్‌ను రష్యా దేశీయంగా అభివృద్ధి చేసింది. పాశ్చాత్య లగ్జరీ కార్లపై ఆధారపడకుండా.. దేశాధ్యక్షుడి స్థాయికి తగ్గ భద్రతా వాహనాన్ని సొంతంగా తయారు చేసుకోగలిగింది. బ్రిక్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పుతిన్ ఇదే కారులో ప్రయాణించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.జిన్‌పింగ్ ‘ఎయిర్ చైనా’..ఇక పుతిన్ విమానంతో పోలిస్తే జిన్‌పింగ్ ప్రయాణించిన విమానం మరో రకమైన ప్రత్యేకతను చూపిస్తుంది. చైనా అధ్యక్షుడు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఇది పుతిన్ ఐఎల్-96-300పీయూ తరహాలో మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించిన ప్రత్యేక అధ్యక్ష విమానం కాదు. అయితే దేశాధ్యక్షుడి విదేశీ పర్యటన కావడంతో భద్రత, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. ఒకరి విమానం అత్యంత రహస్య భద్రతా వ్యవస్థలకు ప్రతీక అయితే.. మరొకరి ప్రయాణం చైనా అధికారిక విమానయాన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది.‘రెడ్ ఫ్లాగ్’ ఎన్701..విమానం నుంచి రోడ్డుపైకి వస్తే.. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే హోంగ్‌చీ ఎన్701 మరో ప్రత్యేక ఆకర్షణ. హోంగ్‌చీ అంటే చైనీస్‌లో ‘రెడ్ ఫ్లాగ్’.. అంటే ‘ఎర్ర జెండా’ అని అర్థం. చైనా రాజకీయ, అధికార వ్యవస్థతో దశాబ్దాలుగా ముడిపడిన ఈ బ్రాండ్.. దేశ అత్యున్నత నాయకత్వానికి ప్రతీకగా మారింది. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే ఎన్701 సాధారణ హోంగ్‌చీ కారు కాదు. సుమారు 5.5 మీటర్ల పొడవుండే ఈ ప్రత్యేక లిమోసిన్‌లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, భారీ ఆర్మర్, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని పూర్తి సాంకేతిక వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు. అందుకే ఎన్701 చుట్టూ ఉన్న ఆసక్తి.. దాని డిజైన్ కంటే, దానిలో దాగి ఉన్న భద్రతా సాంకేతికతపైనే ఎక్కువ.కేవలం ప్రయాణం కాదు.. పవర్ స్టేట్మెంట్!ఈ విమానాలు, కార్లు కేవలం ప్రపంచ నేతలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే సాధనాలు మాత్రమే కాదు. ఆ విమానాలు, కార్లు ఆయా దేశాల భద్రతా ఏర్పాట్లు, టెక్నాలజీ, సొంత తయారీ సామర్థ్యాన్ని చూపిస్తాయి. బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికపై నేతల రాకతో పాటు వారి వెంట వచ్చిన ఈ ‘పవర్ మెషీన్లు’ కూడా తమదైన రీతిలో ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో భద్రతా కోటలు.. నేలపై కదిలే కోటలు.. మొత్తంగా చూస్తే ఇది కేవలం నేతల ప్రయాణం కాదు.. రష్యా, చైనాల పవర్ స్టేట్మెంట్!.ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు! -
బ్రిక్స్ సదస్సు: భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ సదస్సు-2026లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన భారత అధికారులు స్వాగతం పలికారు. బ్రిక్స్‌లో భాగంగా.. సాయంత్రం జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. పాలమ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్‌తో పాటు సుమారు 400 మందితో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చింది. భారత అధికారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో సాదర స్వాగతం పలికారు. మోదీతో జరిగే ద్వైపాక్షిక భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇరు దేశాల సంబంధాల మెరుగుదలతో పాటు వాస్తవాధీన రేఖ (LAC) పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.New Delhi: Chinese President Xi Jinping arrives in New Delhi to attend the 18th BRICS Summit https://t.co/jqG0LAC3Rw pic.twitter.com/QG6cB1BtXH— IANS (@ians_india) September 12, 2026గాల్వాన్ ఘటన నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రావడం గమనార్హం. ఆ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు ఇవాళ మధ్యాహ్నాం 2గం.లకు ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఆ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు ముందు బీజింగ్ కీలక సందేశం ఇచ్చింది. రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుని, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. భారత్–చైనా సంబంధాలు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడం ఇరు దేశాల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని స్పష్టం చేసింది.ఇటు చైనా, భారత్ కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్లు భారత్‌లో చైనా రాయబారి షూ ఫెంగ్హాంగ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాలు పరస్పర విభేదాలను సరిగ్గా పరిష్కరించుకుంటూ.. సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడి చేతిలో చెయ్యేసి.. -
డ్రాగన్–ఎలిఫెంట్ నృత్యం... వినోద క్రీడేనా?
డ్రాగన్ గాలిలోకి ఎగిరే భీకర జంతువే కాని వాస్తవంగా లేని మిథ్యామృగం. భూగోళంపై అతిపెద్ద బలమైన జంతువైన ఏనుగు మృదుస్వభావి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను డ్రాగన్‌గా, మన భారతీయ ప్రజాస్యామ్య దేశాన్ని ఏనుగుగా పోల్చడం సహజంగా మీడియా చేస్తుంటుంది. ‘టాంగో’ అనేది స్పానిష్ నృత్య సంబంధిత పదం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో, అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీలో జరిగే రెండ్రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానుండటం ప్రాధాన్యతసంతరించుకుంది. చివరిదాకా ఆయన పర్యటనపై స్పష్టతనివ్వని చైనా ఎట్టకేలకు 67 మంది సభ్యుల ప్రాతినిధ్య బృందంతో రావడం ఇరుదేశాల సంబంధాల్లో సానుకూలతను సూచిస్తోంది.దగ్గరకు చేర్చిన అమెరికాకమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్దేశించిన సూచనలపై ఇటీవల చైనా 15వ పంచవర్ష ప్రణాళిక (2026–2030)కు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని 150 దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన చైనా, ప్రపంచ ద్వితీయ భారీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు సవాలు విసురుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ దిగుమతులపై ఆగస్ట్ 2025 నుంచి అదనంగా 25 శాతం ట్యారిఫ్ విధింపు ప్రభావం, భారత్ – చైనాల మధ్య వాణిజ్య సయోధ్యకు దారి తీసింది. 2025 ఆగస్ట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిఇండియా రాక సందర్భంలో అయిదు సంవత్సరాల క్రితం ఆగి పోయిన బోర్టర్ ట్రేడ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది. భారత్, చైనా ఆర్థిక వాణిజ్య బాంధవ్యం రెండు దేశాల 280 కోట్ల జనావళి దృష్ట్యా పటిష్ట మవుతున్నాయి. భారత్–చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచి అత్యంత క్లిష్టమైన భౌగోళిక సరిహద్దు వివాదా లున్నప్పటికీ, వాటిని పక్కకు పెట్టి, వరస్పర ప్రయోజనాల దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకొనే సత్కృషి ప్రారంభమైంది. 2017లో భారత్ అధికార యుతంగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో చేరింది. 2024 నాటికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అర్థిక సర్వేలోనూ, నీతి ఆయోగ్ నివేదికలోనూ చైనా పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించాలనే సానుకూల ప్రతిపాదన లున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో 2025 అగస్టు 18న జరిపిన న్యూఢిల్లీ సమావేశం కొత్త వాకిళ్ళు తెరిచింది. దానికి తోడు రెండు దేశాల మధ్య 2021 నాటి 125.6 బిలియన్ యూఎస్ డాలర్ల వాణిజ్యం, 2024 నాటికి 138.5కు పెరిగింది.షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) బిష్కెక్ శిఖరాగ్ర సమావేశం; యూఎస్, ఇజ్రాయిల్‌లు అంతర్జాతీయ చట్టం, యూఎన్ ఛార్టర్ ప్రాథమిక సూత్ర నియమావళిని ఉల్లంఘించే దుర్నీతిని దుయ్యపట్టడం భారత్, చైనాల సయోధ్యను మరింత బలపరిచాయి. ట్రంప్ శిక్షగా విధించే సుంకాలు, అస్థిర వైఖరి కారణంగా భారత్ యిప్పటికే చైనాతో చేతులు కలుపుతోంది.సంబంధాల్లో ముల్లుకానీ పాకిస్తాన్ పట్ల చైనా అనుకూల వైఖరి భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతోంది. ఉగ్ర, వేర్పాటు, తీవ్రవాదాలుసృష్టిస్తున్న యుద్ధ ప్రజ్వలనంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్‌ను చైనా వెనకేసుకు రావటం, పైగా పాకిస్తాన్ ఛైర్‌గా రానున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి వేదిక కావటం, భారత్‌కు మింగుడుపడని సమస్య అవుతోంది. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్‌కు చెందిన సెంట్రల్ కమిటీ, ‘యూనియన్ టెర్రిటరీ ఆఫ్ లదాఖ్’లో వున్న నిర్దిష్ట జిల్లాలను హియాన్, హికాంగ్ పేర్లతో రెండు కొత్త కౌంటీలుగా ప్రకటించడానికి అనుమతించింది. అదీగాక టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లుంగ్ సాంగ్పో అంటారు. అరుణాచలప్రదేశ్‌లోని మనదేశ సరిహద్దుల సమీపంలో మిడాన్ ప్రాంతంలో కొండవాగు కనుమలలో చైనా నిర్మించనున్న సూపర్ జలవిద్యుత్ కేంద్రం వల్ల ప్రవాహం దిగువలో ఉన్న ఇండియా, బంగ్లాదేశ్‌లకు బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగానికి అవరోధమని భారత్ హెచ్చరిస్తున్నా చైనా పట్టించు కోవడం లేదు. 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించే లక్ష్యంగా ఈ ‘ప్రాజెక్ట్ ఆఫ్ ద సెంచరీ’ని చైనా ప్రభుత్వం ప్రస్తుత 2026 నుంచి ప్రారంభించనున్న 15వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది. గతేడాది జూలైలో ఈ భారీ విద్యుత్ పునరుత్పాదన కేంద్రాన్ని ప్రాధాన్యతా పరంగా కమ్యూ నిస్ట్ చైనా రెండవ అగ్రశ్రేణి నేత, ప్రధాని లిక్వియంగ్ టిబెట్‌లోని నియింగ్చి వద్ద ప్రారంభించారు. 1.2 ట్రిలియన్ యువాన్లతో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) అయిదు పవర్ స్టేషన్ల నిర్మాణం జరగనుంది. జంగ్ము వద్ద చైనా ఇప్పటికే భారీ జలాశయం నిర్మించింది. ఇండియా–చైనాల మధ్య ట్రాన్స్ బోర్టర్ నదీ జలాలపై నిపుణుల స్థాయి సమావేశం జరగవలసి ఉంది.పర్యావరణ విధ్వంసం కారణంగా హిమాలయాల మహోన్నత శిఖరాల నుంచి ప్రకృతి ప్రళయాలు అనుభవిస్తూనే ఉన్నాం. జల విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మిస్తున్న జలాశయాలు ప్రవాహ అవరో ధాలకు కారణం అవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా, నేపాల్ చైనా సరిహద్దులలో ఈ మానవ విధ్వంసం ఆగేటట్టు లేదు. ప్రపంచ అగ్రరాజ్యాలలో ప్రప్రథమ స్థానాన్ని పొందాలనే కమ్యూనిస్ట్ చైనా డ్రాగన్ విజృంభిస్తోంది. ప్రస్తుతం ట్రంప్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలక్రిందులు చేస్తున్న ఈ తరుణంలో ‘డ్రాగన్ – ఎలిఫెంట్టాంగో’... వినోదం అవుతుందా? రణక్రీడ కానుందా?-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-జయసూర్య -
జిన్‌పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు బీజింగ్ చివరి నిమిషంలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ మోదీ-జిన్‌పింగ్ భేటీపై పడింది. అసలు ఇంత కీలకమైన పర్యటనను చైనా చివరి వరకు ఎందుకు సస్పెన్స్‌లో పెట్టింది? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.2019లో మహాబలిపురం అనధికారిక సమావేశం తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గాల్వాన్ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జిన్‌పింగ్ పర్యటనకు కేవలం 48 గంటల ముందే అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.చివరి నిమిషం వరకు ఎందుకు?జిన్‌పింగ్ పర్యటనను ఆలస్యంగా ప్రకటించడం వెనుక ఎలాంటి అనిశ్చితి లేదని.. ఇది చైనా అనుసరించే దౌత్య వ్యూహంలో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ముందు జరిగే చర్చల్లో తనకు గరిష్ఠ స్థాయి వెసులుబాటు ఉండేలా బీజింగ్ వ్యవహరించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్, సదస్సు అజెండా, మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ వంటి కీలక అంశాలపై చివరి వరకు చర్చలు కొనసాగించేందుకు ఈ సస్పెన్స్ చైనాకు ఉపయోగపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.NOW:🇨🇳🤝🇮🇳 Chinese President Xi Jinping is coming to India for the first time post Covid for BRICS summit. pic.twitter.com/8CkwJ8MeLu— RealWestern (@RealWestern2003) September 11, 2026భేటీలో ఏం జరుగుతుంది?అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మోదీ-జిన్‌పింగ్ భేటీలో సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గాల్వాన్ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఇచ్చే సంకేతాలు అత్యంత కీలకం కానున్నాయి.బ్రిక్స్ వేదికగా చైనా మరో వ్యూహంబ్రిక్స్లో ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా కీలక దేశాల నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో జిన్‌పింగ్ హాజరు చైనా దౌత్యానికి కూడా కీలకమే. అందుకే చివరి నిమిషం వరకు సస్పెన్స్.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. జిన్‌పింగ్ భారత్ పర్యటన వెనుక అసలు ఫోకస్ బ్రిక్స్ సదస్సేనా? లేక మోదీతో కీలక ద్వైపాక్షిక డీల్‌కు రంగం సిద్ధమైందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్ -
కార్గో నౌకలో చెలరేగిన మంటలు.. 20 మంది..
బీజింగ్: తూర్పు చైనాలోని క్వింగ్డావోలోని షిప్‌యార్డులో మరమ్మతులు జరుగుతున్న కార్గో నౌకలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మరో ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. షిప్‌యార్డులో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఉదయం 11:15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.నౌకలో మొత్తం 42 మంది ఉండగా.. వారిలో 12 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మంటలను సిబ్బంది అదుపులోకి వచ్చారు. లైబీరియా జెండాతో ఉన్న ఓషియన్ మెలోడీ(Ocean Melody)నౌకలో ఈ ఘటన జరిగింది. ఈ నౌక ఆగస్టు 31న క్వింగ్డావో షిప్‌యార్డుకు చేరుకుని.. అప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. -
చైనా కండకావరం.. లైవ్‌లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్‌కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతున్న టైంలో చైనా తరఫున ఓ నోట్ అందింది. ప్రసంగం మధ్యలో అందిన ఆ లేఖను టియోడోరో అక్కడే బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు.. చైనా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వెనుక నుంచి వచ్చి టేబుల్‌పై ఓ కాగితాన్ని ఉంచాడు. సియోల్‌లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన మిలిటరీ అటాషే ఆ నోట్‌ను సిబ్బందికి అందించినట్లు సమావేశ నిర్వాహకులు తెలిపారు. అయితే అది టియోడోరో బృందం నుంచి వచ్చిన సందేశమని భావించిన సిబ్బంది.. ప్రసంగం మధ్యలోనే దాన్ని మంత్రికి అందించారు.నోట్ తీసుకున్న టియోడోరో.. ‘‘ఇది చైనా నుంచి వచ్చినదని అనుకుంటున్నాను. దీన్ని చదవనా?’’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. అనంతరం దానిలోని విషయాలను బహిరంగంగా చదివారు.‘అంతర్జాతీయ చట్టాన్ని అవమానించారు’దక్షిణ చైనా సముద్రంపై 2016లో జరిగిన మధ్యవర్తిత్వ తీర్పుపై చైనా తన వైఖరిని నోట్లో స్పష్టం చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను టియోడోరో తీవ్రంగా తప్పుబట్టారు. తన ప్రసంగం మధ్యలో ఇలా నోట్ పంపడం దక్షిణ కొరియాను, ఈ కార్యక్రమ నిర్వాహకులను, అక్కడి ప్రతినిధులను అవమానించడమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను చైనా గౌరవించడం లేదని విమర్శించారు.ఇది బెదిరించడమే..చైనా చర్యను.. బెదిరించడం, వేధించడమే అవుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోట్‌ను చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తుచేసే జ్ఞాపికగా దాచుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోట్‌ను అందించిన వ్యక్తిని ఉద్దేశించి కూడా టియోడోరో వ్యంగ్యంగా మాట్లాడారు. అతను తన దేశానికి గొప్ప సేవ చేశాడంటూ వ్యాఖ్యానించారు.PHILIPPINES SHREDS CHINA OVER SOUTH CHINA SEA RULING IN FRONT OF THE WORLDYOU LOST : PHILIPPINE DEFENCE CHIEF PUBLICLY REBUKES CHINESE MILITARY OFFICIALA dramatic confrontation unfolded at a defence forum in seoul after a chinese military attaché handed a note to philippine… pic.twitter.com/QiwwlluQVl— Raj anand (@Rajanand7654) September 9, 2026దక్షిణ చైనా సముద్రంపై వివాదంఫిలిప్పీన్స్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 2016లో ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసులో మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్.. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తృత చారిత్రక హక్కుల వాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని వనరులపై చైనాకు హక్కు లేదని పేర్కొంది.అయితే ఈ తీర్పును చైనా తిరస్కరిస్తూ.. ఆ ట్రైబ్యునల్‌కు ఈ కేసుపై విచారణ జరిపే అధికారమే లేదని చెబుతోంది. మరోవైపు చైనా తమ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డిఫెన్స్ ఫోరంలో నోట్ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి తెరపైకి తెచ్చింది.ఇదీ చదవండి: ఎడారికి సముద్రపు నీరు!! ఎలా వచ్చిందో తెలుసా? -
మోదీకి ఊహించని షాక్.. భారత్‌కు ముయిజ్జు వెన్నుపోటు?
ఒకప్పుడు ‘ఇండియా ఔట్’ అంటూ భారత్‌ను మాల్దీవుల నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ఇటీవలే న్యూఢిల్లీతో స్నేహగీతం ఆలపించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే భారత్‌కు షాకిస్తూ.. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ముయిజ్జు భారత్‌కు వెన్నుపోటు పొడిచారా? అన్న చర్చ మొదలైంది.మాల్దీవుల ప్రభుత్వ ఆధీనంలోని మాల్దీవ్స్ పోర్ట్స్ లిమిటెడ్.. థిలాఫుషి పోర్ట్ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. ప్రస్తుతం మాలేలోని పోర్టులపై ఉన్న రద్దీని తగ్గించి.. దేశ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక భాగాన్ని థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. ఇక్కడే భారత్‌కు అసలు ట్విస్ట్ ఎదురవుతోంది. అదే థిలాఫుషికి భారత్ భారీ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్‌వేలను భారత్ నిర్మిస్తోంది. 400 మిలియన్ డాలర్ల రుణం, మరో 100 మిలియన్ డాలర్ల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇస్తోంది.అంటే.. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. హిందూ మహాసముద్రంలో కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఈ పరిణామం సాధారణ నిర్మాణ ఒప్పందంగా చూడలేని పరిస్థితి. మౌలిక వసతుల వెనుక భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి.భారత్‌కు నమ్మకద్రోహం..ఇక, ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరు చూస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2023లో ‘ఇండియా ఔట్’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తొలుత చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. తన తొలి విదేశీ పర్యటనను కూడా చైనాలోనే చేపట్టారు. భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం ముయిజ్జును మళ్లీ భారత్‌వైపు చూసేలా చేసింది. భారీ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో భారత్.. మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది. 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ సదుపాయంతో పాటు రూ.3,000 కోట్ల మేర సహకారం అందించింది. దీంతో ముయిజ్జు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల థిలమాలే బ్రిడ్జిని ప్రశంసించడం, మోదీకి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఈ మార్పులో భాగమే. దీంతో మాల్దీవులు పూర్తిగా భారత్ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.అయితే, మాల్దీవులకు ఆర్థికంగా భారత్ అవసరం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో చైనా కూడా కీలక భాగస్వామే. అందుకే మాలే ఒకరిని ఎంచుకోవడం కంటే ఇద్దరితోనూ సంబంధాలు కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్‌కు మాత్రం థిలాఫుషి పరిణామం కీలక హెచ్చరిక. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీకి అనుసంధానంగా ఉన్న కీలక పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లడం.. హిందూ మహాసముద్రంలో బీజింగ్ ప్రభావం పెరగడానికి మరో అవకాశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారత్‌కు నష్టం ఎక్కడ?మొదటిది.. వ్యూహాత్మక ప్రభావం. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీ చివరకు చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి యాక్సెస్‌ను మరింత సులభం చేయవచ్చు.రెండోది.. చైనా ప్రభావం పెరిగే అవకాశం. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్‌గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల బీజింగ్‌కు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్‌కు సున్నితమైన అంశం.మూడోది.. భారత్ ప్రభావానికి సవాలు. 2024లో భారత్, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు చైనా సంస్థకు కీలకమైన పనులు వెళ్లడం.. మాలే తన మౌలిక వసతుల భాగస్వామ్యాలను భారత్‌తో మాత్రమే పరిమితం చేయడం లేదని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా? -
యంత్రాలు, ఆటోమేషన్ పెరిగాయ్.. మనషుల పరిస్థితి ఇదీ..
చైనాలో తయారీ రంగం వేగంగా మారిపోతుండటంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి ప్రధాన తయారీ కేంద్రంగా ఉన్న చైనాలో ఇప్పుడు కర్మాగారాల్లో ఆటోమేషన్ పెరగడం, ఉత్పత్తి ప్రక్రియల్లో యంత్రాల వినియోగం అధికం కావడం వల్ల మనుషుల అవసరం తగ్గుతోంది.ఇటీవల చాంగ్జౌ షింగ్యూ ఆటోమోటివ్ లైటింగ్ సంస్థ 440 మంది కొత్త గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకున్న కొద్దికాలానికే 107 మందిని తొలగించింది. ఈ ఘటన చైనాలో యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.చైనాలో యువ నిరుద్యోగం పెరగడానికి ఆటోమేషన్ ఒక్కటే కారణం కాదు. తయారీ రంగంలో ఉద్యోగాల తగ్గుదలతో పాటు విదేశాలకు ఉత్పత్తి కార్యకలాపాలు తరలిపోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం వంటి అంశాలు కూడా ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయి.చైనా ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం బలంగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి మారుతోంది. యంత్రాలు, ఆటోమేషన్ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల స్వభావం మారడంతో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి.చైనాలో ఏం జరుగుతోంది? చైనాలో ఈ ఏడాది 12.7 మిలియన్ల మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి వచ్చారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద గ్రాడ్యుయేట్ల బ్యాచ్.16-24 ఏళ్ల యువతలో నిరుద్యోగిత మేలో 15.6 శాతానికి చేరింది. ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు చేస్తున్నా అవకాశాలు తక్కువగా ఉన్నాయి.చాంగ్జౌ జింగ్యూ ఆటోమోటివ్ లైటింగ్ సంస్థ 440 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించి, కొద్ది వారాలకే 107 మందిని తొలగించింది. ఈ ఘటన చైనాలో పెద్ద చర్చకు దారితీసింది.ఫ్యాక్టరీ కార్మికుల ఉద్యోగాలు తగ్గడానికి ఆటోమేషన్, తక్కువ వేతన దేశాలకు తయారీ కార్యకలాపాల తరలింపు, రియల్ ఎస్టేట్ సంక్షోభం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.2021–2025 మధ్య రియల్ ఎస్టేట్ రంగం పతనం కారణంగా 14 మిలియన్లకు పైగా కార్మికులు నిర్మాణ రంగం నుంచి బయటకు వచ్చారు.చైనాలో గిగ్ వర్కర్ల సంఖ్య ఈ ఏడాది 320 మిలియన్లకు చేరవచ్చని అంచనా. గత ఏడాది ఇది 280 మిలియన్లుగా ఉంది.కృత్రిమ మేధస్సు కారణంగా గ్రాడ్యుయేట్లకు లభించే ప్రారంభ స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు కూడా తగ్గుతున్నాయి.చైనా ప్రభుత్వం పాతబడిన విశ్వవిద్యాలయ కోర్సులను తొలగిస్తూ టెక్నాలజీ, ఏఐ ఆధారిత కోర్సులపై దృష్టి పెడుతోంది. అలాగే గ్రాడ్యుయేట్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యోగ నియామక కార్యక్రమాలు చేపట్టింది.చైనా తయారీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నా ఉత్పత్తి సామర్థ్యం తగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉత్పత్తిని తక్కువ మంది కార్మికులతో సాధించడం ఆటోమేషన్ ప్రభావానికి సంకేతం అని పేర్కొన్నారు.చైనా తయారీ ఉద్యోగాలు 2013లో 152 మిలియన్ల గరిష్ఠ స్థాయి నుంచి 134 మిలియన్లకు తగ్గాయి. ఇదే సమయంలో భారత్ తయారీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. -
మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్?
బీజింగ్ : ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, చైనా నోస్ట్రాడామస్‌గా పేరొందిన జియాంగ్ జుక్సిన్ సంచలన జోస్యం చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ముచ్చటగా మూడోసారి అమెరికా అధ్యక్షుడవుతారని అన్నారు. ‘ప్రిడిక్టివ్ హిస్టరీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ గేమ్ థియరీ ఆధారంగా జియోపాలిటికల్ విశ్లేషణలు చేసే ఆయన, ప్రాచీన గ్రీకు చరిత్రను ఆధారం చేసుకుని భవిష్యత్తుపై పలు అంచనాలను వెలువరించారు.ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు కేవలం వైమానిక దాడితో ముగియవని, అమెరికా తప్పనిసరిగా భూతల దాడులు చేపట్టాల్సి వస్తుందని చెప్పారు. ఈ యుద్ధం ఏళ్ల తరబడి సాగి అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీస్తుందని హెచ్చరించారు. యుద్ధం కారణంగా అమెరికా ప్రభుత్వం తప్పనిసరి సైనిక సేవలను తిరిగి ప్రవేశపెట్టేలా చట్టపరమైన సన్నాహాలు చేస్తుందని, దీనివల్ల యువత సైన్యంలో చేరాల్సిన పరిస్థితి వస్తుందని అంచనా వేశారు.ఆర్థిక ఇబ్బందులు, సైనిక విధింపులు, కఠినమైన చట్టాల అమలు కారణంగా అమెరికాలో రెండో అంతర్గత యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, దేశంలో నిరసనలు మిన్నంటుతాయని పేర్కొన్నారు. ప్రపంచ శక్తి వనరుల రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు ఏర్పడితే, చమురు, గ్యాస్, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని జియాంగ్ తెలిపారు. దీనివల్ల సరఫరా గొలుసు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత, తీవ్రమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని హెచ్చరించారు.దేశంలో అంతర్గత భద్రతను కాపాడుకునే పేరుతో అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారాలు మరింత విస్తరిస్తాయని, ప్రధాన నగరాల్లో నేషనల్ గార్డ్ బలగాల మోహరింపు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవిని చేపడతారని తాను నమ్ముతున్నట్లు జియాంగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యే అవకాశం లేదు. కానీ ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు.కానీ, జియాంగ్ మాత్రం రాజ్యాంగంలోని ఒక ఆసక్తికరమైన లొసుగును ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ట్రంప్ భవిష్యత్తులో అమెరికా వైస్ ప్రెసిడెంట్ (ఉపాధ్యక్షుడు)గా పోటీ చేసి గెలుపొందుతారు. ఆ తర్వాత అప్పటి అధ్యక్షుడు రాజీనామా చేస్తే, రాజ్యాంగ ప్రకారం ఉపాధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆటోమేటిక్‌గా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. ఇలా ట్రంప్ నేరుగా ఎన్నిక కాకుండానే మూడోసారి దేశానికి అధ్యక్షుడు అవుతారని జియాంగ్ అంచనా వేశారు. ట్రంప్, ఆయన మిత్రపక్షాలు కూడా గతంలో ఈ విధమైన లొసుగుల అవకాశాన్ని పదేపదే ప్రస్తావించడంతో జియాంగ్ విశ్లేషణ ప్రాధాన్యత సంతరించుకుంది. 👉ఇదీ చదవండి: కెనడాతో ట్రంప్ ట్రేడ్ వార్‌లో మరో సంచలనం -
చైనాలో బీభత్సం కళ్లు చెదిరేలా.. కొట్టుకుపోతున్న ఇళ్లు
-
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
హిమాలయాల్లో ప్రకృతి విలయం సృష్టించిన ప్రతిసారీ అక్కడి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నేపాల్-చైనా సరిహద్దులో సంభవించిన భారీ వరద కూడా అలాంటి ప్రశ్నలనే ముందుకు తెచ్చింది. ఆగస్టు 26న హిమనదం కూలిపోవడంతో వచ్చిన వరదల్లో నేపాల్‌లోని రసువా ప్రాంతంతోపాటు చైనా వైపున్న గ్యిరాంగ్ సరిహద్దు ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు రద్దీగా ఉండే ఈ సరిహద్దు వాణిజ్య కేంద్రం.. ఇప్పుడు బురద, శిథిలాల కుప్పగా మారింది.ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన గ్యిరాంగ్.. చైనా-నేపాల్ ప్రతిపాదిత రైల్వే మార్గంలో కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచే రైల్వే నేపాల్‌లోకి ప్రవేశించి, రసువా మీదుగా కాఠ్మాండూకు చేరేలా ప్రణాళిక ఉంది. చైనా ప్రతిపాదించిన ఈ రైల్వేను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి నేపాల్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలకు ఇది కీలకమైన మార్గంగా మారుతుందని అంచనా.అంత ఈజీనా?ఖాట్మాండు-గ్యిరాంగ్ రైల్వే ప్రాజెక్టు సాధారణ రైల్వే మార్గం కాదు. నేపాల్ పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ పర్వత ప్రాంతం కావడంతో ఇందులో దాదాపు 98.5 శాతం మార్గం సొరంగాలు లేదంటే వంతెనల మీదుగానే నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక అధ్యయనం తేల్చింది. అంటే.. రైల్వే పట్టాలు వేయడం కంటే ముందుగా కొండలను తొలిచి సొరంగాలు నిర్మించాలి. లోతైన లోయలపై భారీ వంతెనలు వేయాలి. ఎత్తుల్లో భారీ తేడాలను అధిగమించాలి. దీనికితోడు ఈ ప్రాంతం భూకంపాలు, కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, మట్టి జారిపోవడం వంటి ప్రమాదాలకు లోనయ్యే ప్రాంతం.ప్రాజెక్టుపై 2018లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భౌగోళిక పరిస్థితులు, ఇంజినీరింగ్ సవాళ్లు ఈ రైల్వేకు అతిపెద్ద అడ్డంకులని పేర్కొంది. అప్పట్లో సుమారు 2.75 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.ఏళ్లుగా సాగుతున్న అధ్యయనాలుచైనా-నేపాల్ రైల్వే ఆలోచన కొత్తదేమీ కాదు. 2016లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2018లో బీఆర్ఐలో భాగమైంది. 2019లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2022లో పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల అధ్యయనం మొదలైంది. మార్గం, సొరంగాలు, వంతెనలు, స్టేషన్లు, నిర్మాణ వ్యయం, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలపై చైనా సాంకేతిక బృందం పరిశీలనలు చేసింది. తుది నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా? అనేది తేలనుంది.ఇంతలోనే భారీ విపత్తుఇలాంటి సమయంలోనే ఆగస్టు 26న హిమనదం(గ్లేసియర్) కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి నీటితో కలిసి దిగువకు దూసుకొచ్చాయి. నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. ఆ వరద చైనా వైపు గ్యిరాంగ్ వరకు చేరింది. కీలకమైన సరిహద్దు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఐదు అంతస్తుల కస్టమ్స్ భవనం కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో 1,300 మందికి పైగా మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. చైనా వైపు గ్యిరాంగ్లో 43 మంది మృతి చెందగా, 519 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఈ విధ్వంసం ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుపై కొత్త ఆలోచనలకు కారణమవుతోంది. ఒక భారీ వరదతోనే రహదారులు, వంతెనలు, సరిహద్దు మౌలిక వసతులు ఇలా ధ్వంసమైతే.. ఇదే భూభాగంలో నిర్మించబోయే రైల్వే సొరంగాలు, వంతెనలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎలా తట్టుకుంటాయి? అనేదే అసలు ప్రశ్న.రైల్వే కంటే ముందు..తాజా విపత్తు నేపథ్యంలో ప్రాజెక్టు మార్గాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. హిమనదాల కదలికలు, వరదల ప్రవాహ మార్గాలు, భూకంప ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు వంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనాలు అవసరం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవిస్తే రైల్వేకు నష్టం జరగకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మరోవైపు గ్యిరాంగ్ ప్రాంతం చైనా-నేపాల్ వాణిజ్యానికి కీలకమైన మార్గం. తాజా విపత్తుతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే నిర్మాణానికి ముందే అక్కడి మౌలిక వసతులను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.బీఆర్ఐ అటకెక్కినట్లేనా?అయితే తాజా వరదలతో చైనా బీఆర్ఐ మొత్తం ఆగిపోయిందని చెప్పలేం. కానీ చైనా-నేపాల్ అనుసంధానానికి కీలకంగా భావిస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టుకు మాత్రం ప్రకృతి పెద్ద పరీక్ష పెట్టింది. నిర్మాణం ఇంకా మొదలుకాకపోవడం ఒక రకంగా ప్రాజెక్టుకు అవకాశం కూడా. ఇప్పుడు ఎదురైన విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని మార్గం, డిజైన్, భద్రతా ప్రమాణాలను మార్చుకునే అవకాశం చైనాకు ఉంది.హిమాలయాల్లో బీఆర్ఐ రైల్వేను ముందుకు తీసుకెళ్లడం అనుకున్నంత సులభం కాదని తాజా ప్రకృతి విపత్తు గట్టిగా చాటిచెబుతోంది. ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందా? మార్గంలో మార్పులు వస్తాయా? లేదంటే ప్రకృతి సవాళ్లను అధిగమించేలా భారీ ఇంజినీరింగ్ పరిష్కారాలతో చైనా ముందుకెళ్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: యుద్దం ఎఫెక్ట్.. బూతు కంటెంట్‌తో మరీ ఇంత దిగజారాలా? -
సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా!
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్‌గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ జరిగింది ఇలా..మ్యాచ్ ఆరంభం నుంచి మంచి ఈజ్‌తో కనిపించినప్పటికీ సాత్విక్-చిరాగ్ ద్వయం తొలి గేమ్‌ను కోల్పోయారు. అయితే రెండో గేమ్‌లో మాత్ర ఫుంజుకున్న ఈ జంట 21-13తో చైనా జోడికి చెక్ పెట్టారు. ఇక కీలకమైన మూడో గేమ్‌లో మాత్రం మొదట తడబడడంతో ఈసారి కూడా రన్నరప్‌కే పరిమితమవుతారేమోననిపించింది. ఒక దశలో 11-9తో వెనుకబడిన సాత్విక్ జంట విజృంభించి 16-16తో స్కోరును సమం చేసింది. ఈ దశలో ఒక్కసారిగా చెలరేగిపోయిన సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా 21-17తో గేమ్‌ను ముగించడంతో పాటు మ్యాచ్‌ను గెలిచారు. 2023, 2025 సీజన్లలో ఫైనల్‌కు చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమైన సాత్విక్, చిరాగ్ ద్వయం ఈసారి మాత్రం టైటిల్ గెలుపే లక్ష్యంగా ఆటను కొనసాగించారు. ఇన్నాళ్లు చైనా ఫోబియాను ఎదుర్కొన్న ఈ జంట అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ చాంపియన్స్‌గా నిలిచారు.WATCH SATWIK & CHIRAG WINNING THE CHINA MASTERS 2026 TITLE! 🏆🤩- Second BWF Super 750 Title for duo! 🇮🇳BEAT CHINA AT HOME IN THE FINAL! 🔥🔥🔥 pic.twitter.com/ZCEdec0mLR https://t.co/CWOqWu1y7f— The Khel India (@TheKhelIndia) September 6, 2026Read: కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్! -
ఇల్లు కొంటే నష్టం.. డబ్బు బ్యాంకులో పెడితే వడ్డీ లేదు
చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన 'ఎవర్‌గ్రాండే' (Evergrande) మాజీ చైర్మన్‌కు అక్కడి ప్రభుత్వం రీసెంట్గా జీవిత ఖైదు విధించింది. ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకున్నప్పటికీ.. చివరకు ప్లాన్ బెడిసికొడితే పాలకుల చేతిలో ఎలా బలి కావాల్సి వస్తుందో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. అసలు చైనాలో ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం..చైనా పౌరులకు తమ దేశంలో డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి సరైన మార్గాలు చాలా తక్కువ. ఒకవేళ తమ దేశపు ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ మార్కెట్ కోసం తెరిస్తే, అక్కడి డబ్బు ట్రిలియన్ల కొద్దీ దేశం దాటి బయటకు వెళ్లిపోతుందని బీజింగ్ ప్రభుత్వానికి బాగా తెలుసు. ఎందుకంటే చైనా ఆర్థిక విధానం చాలా వరకు లాభాల కంటే ఉత్పత్తి, ఉపాధి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అక్కడి కంపెనీలకు ప్రభుత్వమే సబ్సిడీ లోన్లను నెగెటివ్ రియల్ వడ్డీ రేట్లకు ఇస్తుంది. దాంతో ఇన్వెస్టర్లకు వచ్చే రిటర్న్స్ కూడా నెగెటివ్‌లోనే ఉంటాయి. మరి ప్రజలు తమ డబ్బును ఎక్కడ పెట్టాలి..? పూర్తి విశ్లేషణ కింది పాడ్‌కాస్ట్‌లో చూడండి.. -
భూమిపై మరో సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
చైనా అభివృద్ధి చేసిన ‘ఈస్ట్’ (ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్) రియాక్టర్ ప్రపంచ శక్తి (ఎనర్జీ) రంగాన్ని సరికొత్త మలుపు తిప్పే దిశగా పురోగమిస్తోంది. సూర్యుడిలో నిరంతరం శక్తిని ఉత్పత్తి చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ (అణు సంలీనం) ప్రక్రియను భూమిపై సురక్షితంగా పునఃసృష్టించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఒకదానికొకటి వేగంగా ఢీకొని, కలిసిపోయి ఒకే బరువైన పరమాణు కేంద్రకంగా మారడాన్ని అణు సంలీనం అంటారు. భూమిపై సూర్యుడిలోని గురు త్వాకర్షణ శక్తిని సృష్టించడం సాధ్యం కాదు. అందుకే టోకమాక్ అనే శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు కలిగిన డోనట్ ఆకారపు పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇందులో హైడ్రోజన్ ఐసోటోప్‌లైన డ్యూటీరియం, ట్రిటియంలను వందల మిలియన్ల డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి ప్లాస్మా రూపంలో బంధించి ఈ సంలీన ప్రక్రియను జరుపుతారు.చైనా సైంటిస్టులు 12 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 101 సెకన్ల పాటు, అలాగే మరికొన్ని ప్రయోగాల్లో 1,000 సెకన్ల కంటే ఎక్కువ సమయం స్థిరంగా నిర్వహించి ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. ఈ ప్రాజెక్ట్ చైనాలోని అనూయ్ ప్రావిన్స్‌లో ఉన్న ‘హెఫీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్’ ఆధ్వర్యంలో నడుస్తోంది.ప్రస్తుతం వాడుతున్న అణు విచ్ఛిత్తి వల్ల ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ వ్యర్థాలు వస్తాయి. ఈ ఫ్యూజన్ సాంకేతికత వల్ల జీరో కార్బన్ ఉద్గారాలు, సురక్షితమైన శక్తి లభిస్తుంది. సముద్రపు నీటిలో లభించే డ్యూటీరియం, ట్రిటియం వంటి హైడ్రోజన్ ఐసోటోప్‌లను ఇంధనంగా వాడుతారు. నిజమైన సూర్యుడి కేంద్రకంలో ఉష్ణోగ్రత సుమారు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చైనా సృష్టించిన ఈ పరికరం ఏకంగా 16 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకి రికార్డు సృష్టించింది.ప్లాస్మాను ఎక్కువసేపు స్థిరంగా ఉంచడం, ఉత్పత్తి అయ్యే శక్తిని సమర్థ వంతంగా విద్యుత్‌గా మార్చడం వంటి సాంకేతిక సవాళ్లు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. చైనా మాత్రమే కాకుండా అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అణు సంలీన సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. చైనా ప్రయోగాలు కేవలం ఈస్ట్తోనే ఆగడం లేదు. తదుపరి తరం ప్రాజెక్ట్ ‘బెస్ట్’ (బర్నింగ్ ప్లాస్మా ఎక్స్పెరిమెంటల్ సూపర్ కండక్టింగ్ టోకమాక్)ను నిర్మిస్తున్నారు. 2030 నాటికి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను సిద్ధం చేయాలనేది దీని లక్ష్యం.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు
‘దురద ఒకడికి అయితే, గోకుడు ఇంకొకడికా?’ అనేది ఒక వ్యంగ్య సామెత. అంటే ఎవరి సమస్యను వారి తీర్చుకోవాలి అని అర్థం. కానీ చిన్నపుడు దురద పుట్టే మన వీపును అమ్మమ్మనో, తాతయ్యనో మృదువుగా అలా గోకుతుంటూ ఆహా..అనిపించిన అనుభవం గుర్తుందా? ఈ ఫీలింగ్ ఆధారంగా చేసుకునే గంటకు రూ. 4,200 వసూలు చేస్తున్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది థాయ్ మసాజ్‌లు, ఆయిల్ మసాజ్‌ల గురించి విన్నాం గానీ, ఈ 'ఇచ్-స్క్రాచింగ్' బిజినెస్ ఏంటీ అనుకుంటున్నారా.. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.షెన్జెన్కు చెందిన 32 ఏళ్ల జాంగు షియావోకియావో అనే చైనీస్ వ్యాపారవేత్త శరీర దురదను గోకే (itch-scratching) వినూత్న సేవలను ఒక వ్యాపారంగా మార్చి, రెండు అవుట్లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షలు (1,00,000 యువాన్లు) ఆర్జిస్తున్నాడు. సుమా (Suma) అనే బ్రాండ్ నేమ్‌తో షెన్జెన్లోని బావోవాన్, ఫుటియాన్ జిల్లాల్లో రెండు స్టోర్లు నడుస్తున్నాయి. అంతేకాదు తన ఈ వ్యాపారాన్ని చైనా వ్యాప్తంగా 100 అవుట్లెట్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు.ఇదీ చదవండి: నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగావినియోగదారులు హాయిగా విశ్రాంతి పొంది, బాగా నిద్రపోవడానికి సహాయపడే ఈ సేవ కోసం గంటకు సుమారు 300 యువాన్లు చెల్లిస్తారు. తన కస్టమర్లలో 70 శాతం మంది పురుషులేనని ఝాంగ్ చెబుతున్నారు. 30 శాతం మహిళా వినియోగ దారులుంటారని చెప్పాడు. మసాజ్ కంటే కూడా ఇది ఎక్కువ విశ్రాంతినిస్తుందని కొంతమంది కస్టమర్లు చెప్పానీ ఫలితంగా దీనివల్ల తమకు రిపీటెడ్ క్లయింట్లు ఎక్కవని కూడా చెప్పుకొచ్చాడు. ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు ఎలా ఉంటుందీ సర్వీస్వినియోగదారులు మసాజ్ సెంటర్లలో లాగా బెడ్‌పై పడుకుంటారు. ప్రత్యేకంగా రూపొందించిన పదునైన గోళ్లతో అక్కడున్న సిబ్బంది శరీర భాగాలను సున్నితంగా గోకుతారు. ఇది కస్టమర్ల మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టడానికి సహాయ పడుతుందని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక మహిళ తన భర్త వెన్ను గోకుతున్న వీడియో , చిన్నతనంలో తన తండ్రి తనకు గోకిన అనుభూతిని గుర్తుచేసుకుని ఝాంగ్ ఈ వ్యాపార ఆలోచనను ప్రారంభించారు. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్!
హిమాలయాల కొండల్లో.. సునామీ విరుచుకుపడిన వరద నేపాల్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మంచు, మట్టి, రాళ్లతో ఉప్పొంగిన వరద ప్రవాహం గ్రామాలను, రహదారులను, వంతెనలను మింగేసింది. వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారం గడిచినా కూడా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతటి విపత్తు తర్వాత ఇప్పుడు నేపాల్ కళ్లు తెరిచింది. మరోసారి ఇలాంటి ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు మొదలుపెట్టింది.ఆగష్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలపై చైనా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది నేపాల్ ప్రధాన ఆరోపణ. అయితే తాము సకాలంలోనే స్పందించామని చైనా ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ తరుణంలో రసువా జిల్లాలో ఎక్కడైతే వరద ముంచెత్తిందో.. అక్కడే కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ నిర్ణయించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, నదుల ఉద్ధృతి వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సీస్మిక్ సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు ఉపగ్రహ ఆధారిత వీఎస్ఏటీ (VSAT) కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.పాత వ్యవస్థ ఏమైంది?ఇక్కడే అసలు వైఫల్యం బయటపడుతోంది. గతంలోనూ ఆ ప్రాంతంలో వరదలు, నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. అయితే ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలో పలు పర్యవేక్షణ కేంద్రాలు, గేజ్‌లు కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని కనీసం నాలుగు గేజింగ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారం అందించడంలో వ్యవస్థ విఫలమైంది.మొబైల్ నెట్వర్క్ పోయినా..కొత్త వ్యవస్థలో వీఎస్ఏటీని కీలకంగా ఉపయోగించనున్నారు. భారీ విపత్తుల సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకపోయినా.. ఉపగ్రహం ద్వారా పర్యవేక్షణ కేంద్రాలు అధికారులతో అనుసంధానంలో ఉండేలా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ ప్రవాహం పెరుగుతున్నట్లు గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేసి, ప్రజలకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపేలా వ్యవస్థను రూపొందించనున్నారు.ఇంకా 4 వేల మంది మిస్సింగ్ఆగస్టు 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదకు నేపాల్ తీవ్రంగా నష్టపోయింది. రెండు దేశాల్లో కలిపి కనీసం 1,114 మంది మరణించగా.. దాదాపు 4 వేల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధిక మరణాలు నేపాల్‌లోనే నమోదయ్యాయి.41 నిమిషాల ఆలస్యం.. ప్రాణాల మీదకుఈ విపత్తులో హెచ్చరిక వ్యవస్థ వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఒక అంశం స్పష్టం చేస్తోంది. వరదకు దారితీసిన మంచు, రాళ్ల విరిగిపాటు ఉదయం సంభవించినప్పటికీ.. అధికారిక హెచ్చరిక ప్రజలకు చేరేసరికి దాదాపు 41 నిమిషాలు గడిచిపోయాయి. ఇలాంటి కొండ ప్రాంతాల్లో 10–15 నిమిషాల ముందస్తు సమాచారం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కీలకంగా మారుతుంది.చైనాతో మరింత డేటా షేరింగ్ఇకపై చైనాతోనూ విపత్తు సమాచారాన్ని మరింత వేగంగా పంచుకునే దిశగా నేపాల్ అడుగులు వేస్తోంది. హిమనదుల కదలికలు, నీటి మట్టాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదకర పరిస్థితులపై రియల్‌టైమ్ సమాచారాన్ని పొందేందుకు సహకారం పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా ఉపగ్రహ చిత్రాలు, నీటి మట్టం–ప్రవాహ సమాచారం, ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రమాదాలపై వివరాలను పంచుకున్నట్లు సమాచారం.కొన్ని నిమిషాలైనా.. ప్రాణాలు కాపాడొచ్చు!కొత్త వ్యవస్థ వల్ల భారీ విపత్తును పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రమాదాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి హెచ్చరికలు పంపగలిగితే.. ప్రజలను, సరిహద్దు సిబ్బందిని, సహాయక బృందాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి జరిగిన ఘోర వైఫల్యం తర్వాత నేపాల్ హడావుడిగా పాత వ్యవస్థ స్థానంలో కొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మాత్రం మరో విపత్తు వచ్చినప్పుడు హెచ్చరించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకే ‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: నేపాల్ వరదలే కాదు.. భూకంపాలకూ కారణం ఇదే! -
చట్టం సవరించిన చైనా.. భారత్‌కు గట్టి హెచ్చరిక!
సరిహద్దుల్లో యుద్ధం మొదలైతే సైన్యం ముందుకు కదులుతుంది.. ఆయుధాలు రంగంలోకి దిగుతాయి. కానీ అదే సమయంలో దేశంలోని ఫ్యాక్టరీలు, టెక్నాలజీ కంపెనీలు, డేటా సెంటర్లు, రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు కూడా యుద్ధంలో భాగమైతే? చైనా ఇప్పుడు సరిగ్గా అదే దిశగా అడుగులు వేస్తోంది. తన జాతీయ రక్షణ సమీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా అవసరమైనప్పుడు దేశంలోని ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, మానవ వనరులను ఒకేసారి రక్షణ అవసరాలకు మళ్లించే వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. తాజాగా రక్షణ సమీకరణ చట్టంలో చేసిన భారీ మార్పులు.. భారత్‌కు రాబోయే యుద్ధాల అసలు స్వరూపంపై గట్టి హెచ్చరిక ఇస్తున్నాయి.2010లో అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని తొలిసారిగా భారీగా సవరించిన జిన్‌పింగ్ ప్రభుత్వం.. ఆగస్టు 28న కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. 72 ఆర్టికల్స్‌ను 82కు పెంచిన ఈ సవరణలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. చైనా తాజా చట్టంలో అసలు కీలకమైన అంశం ఇదే. జాతీయ సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రతతో పాటు ఇప్పుడు ‘అభివృద్ధి ప్రయోజనాలు’ కూడా రక్షణ సమీకరణకు కారణంగా చేర్చింది. అంటే సరిహద్దుల్లో యుద్ధం మొదలైనప్పుడే దేశ వనరులను సమీకరించడం కాదు.. ఆర్థిక భద్రత, సాంకేతిక ప్రయోజనాలు, విదేశీ ఆస్తులు లేదా ఇతర వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పు వచ్చినా జాతీయ వనరులను రక్షణ అవసరాలకు ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే.. చైనా యుద్ధాన్ని కేవలం సైన్యం చేసే పనిగా చూడటం లేదు. మొత్తం దేశ సామర్థ్యాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉంచే వ్యవస్థను తయారు చేస్తోంది.ఫ్యాక్టరీ నుంచి యుద్ధభూమి వరకు.. కొత్త చట్టం ప్రకారం అవసరమైనప్పుడు కంపెనీలను పరికరాలు, ముడి పదార్థాలు, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, డేటా నిల్వ చేసుకునేలా ఆదేశించవచ్చు. నిపుణులైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. సమీకరణకు ఆదేశాలు వచ్చినప్పుడు ఉత్పత్తిని పెంచాలి. అయితే, ఇక్కడే భారత్‌కు అసలు సవాలు మొదలవుతుంది. ఒకవేళ ఎల్ఏసీ వద్ద దీర్ఘకాలిక ఉద్రిక్తత ఏర్పడితే.. చైనా తన పరిశ్రమలను వేగంగా రక్షణ అవసరాలకు మళ్లించగలిగితే, సైన్యానికి అవసరమైన పరికరాలు, డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర సాంకేతిక సామగ్రి సరఫరాను వేగంగా పెంచే అవకాశం ఉంటుంది.యుద్ధభూమిలో సైనికులు పోరాడుతుంటే.. వెనుక దేశంలోని పరిశ్రమలు ఆ సైన్యానికి నిరంతరం ‘ఇంధనం’ అందించేలా వ్యవస్థను సిద్ధం చేయడమే చైనా లక్ష్యం.తుపాకులే కాదు.. డేటా యుద్ధం కూడా!ఏఐ, సైబర్ ఆపరేషన్స్, డ్రోన్లు, రోబోటిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, డేటా వ్యవస్థలను కూడా చైనా రక్షణ సమీకరణలో భాగం చేసింది. దీంతో భవిష్యత్ ఘర్షణలో సరిహద్దుల్లో సైనిక ఒత్తిడితో పాటు సైబర్ దాడులు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం, సమాచార యుద్ధం, కీలక మౌలిక వసతులపై ఒత్తిడి వంటి చర్యలు ఏకకాలంలో ఎదురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు.. సరిహద్దులో సైనిక ఉద్రిక్తత కొనసాగుతూనే భారత్‌లోని కీలక డిజిటల్ నెట్‌వర్క్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేదా సమాచార వాతావరణంపై ఒత్తిడి పెరిగితే.. అది సంప్రదాయ యుద్ధం కంటే చాలా విస్తృతమైన సవాలుగా మారుతుంది.భారత్‌కు ప్రమాదం ఏంటి?చైనా ఈ చట్టాన్ని సవరించిందంటే వెంటనే యుద్ధం వస్తుందన్న అర్థం కాదు. కానీ భవిష్యత్‌లో యుద్ధం లేదా సుదీర్ఘ సంక్షోభం వస్తే తన జాతీయ శక్తిని ఎంత వేగంగా సమీకరించుకోవాలనుకుంటోందో ఈ చట్టం స్పష్టం చేస్తోంది. భారత్-చైనా మధ్య 2020 లద్దాఖ్ ఉద్రిక్తతల తర్వాత ఎల్ఏసీపై ఇరు దేశాలూ మౌలిక వసతులు, సైనిక సామర్థ్యాలను పెంచుతున్నాయి. అలాంటి పరిస్థితిలో మరోసారి దీర్ఘకాలిక సరిహద్దు సంక్షోభం తలెత్తితే.. చైనా సైనిక బలంతో పాటు తన పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం ఉపయోగించగలగడం భారత్‌పై ఒత్తిడిని పెంచే అంశం.పాక్‌తో టెన్షన్.. ఇక్కడ మరో కీలక అంశం చైనా-పాకిస్తాన్ సమీకరణం. ఒకవైపు ఉత్తర సరిహద్దులో చైనాతో ఉద్రిక్తత.. మరోవైపు పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్‌తో సమస్యలు తలెత్తితే భారత్ తన సైనిక వనరులను రెండు దిశల్లో పంచుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో యుద్ధాన్ని ప్రారంభించడం కంటే దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించగల సామర్థ్యం అత్యంత కీలకంగా మారుతుంది. సైన్యానికి ఆయుధాలు ఉండటం మాత్రమే కాదు.. వాటిని నిరంతరం ఉత్పత్తి చేయగలగాలి. సైనికులకు సరఫరాలు చేరాలి. రోడ్లు, రైల్వేలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయాలి. ఉపగ్రహాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు సురక్షితంగా ఉండాలి. సైబర్ దాడులను తట్టుకోవాలి. ఈ మొత్తం వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకునే దిశగా చైనా అడుగులు వేస్తోంది.భారత్ ఏం చేయాలి?చైనా మోడల్‌ను భారత్ కాపీ చేయాల్సిన అవసరం లేదు. కానీ దాని వ్యూహం ఇచ్చే హెచ్చరికను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేశీయ రక్షణ ఉత్పత్తిని మరింత పెంచడం, మందుగుండు సామగ్రి-ముఖ్యమైన పరికరాల వ్యూహాత్మక నిల్వలను బలోపేతం చేయడం, సరిహద్దు మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయడం, సైబర్ భద్రతను జాతీయ రక్షణలో భాగంగా చూడటం అవసరం. అదే సమయంలో ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు, కమ్యూనికేషన్ కంపెనీల సామర్థ్యాన్ని అవసరమైనప్పుడు దేశ రక్షణకు ఉపయోగించుకునే విధానాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్‌హౌస్!చైనా కొత్త చట్టం వెనుక ఉన్న అసలు ఆలోచనను ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. యుద్ధం వచ్చినప్పుడు సైన్యాన్ని మాత్రమే సిద్ధం చేయడం కాదు.. యుద్ధం చేయగల దేశాన్నే ముందుగానే సిద్ధం చేయాలి. భవిష్యత్ యుద్ధం సరిహద్దుల్లో మాత్రమే జరగదు. అది ఆకాశంలో, సముద్రంలో, సైబర్ ప్రపంచంలో, ఆర్థిక వ్యవస్థలో, సమాచార రంగంలో, ఫ్యాక్టరీల్లోనూ సాగవచ్చు. అందుకే భారత్‌కు చైనా తాజా చట్టం తక్షణ యుద్ధ హెచ్చరిక కంటే దీర్ఘకాలిక వ్యూహాత్మక హెచ్చరిక. ఎవరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయన్నదే కాదు.. సంక్షోభం వచ్చినప్పుడు ఎవరు తమ మొత్తం దేశ శక్తిని వేగంగా సమీకరించగలరు? ఎవరు ఎక్కువకాలం సరఫరాను కొనసాగించగలరు? ఎవరి ఆర్థిక, సాంకేతిక, సైబర్ వ్యవస్థలు ఎక్కువకాలం నిలబడగలవు?. రాబోయే ఘర్షణల్లో విజేతను నిర్ణయించే ప్రశ్నలు ఇవే కావచ్చు. -
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఆకస్మిక వరదలతో అతలాకుతలం అయిన నేపాల్ సరికొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భారత్ సహా పలు దేశాలు పాలు పంచుకుంటున్నాయి. అయితే తమకు సాయంతో పాటు న్యాయం కూడా జరగాలని నేపాల్ వాదిస్తోంది. చేయని తప్పులకు శిక్ష తామెందుకు అనుభవించాలని.. భారత్, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ చెబుతోంది.హిమాలయ దేశం నేపాల్.. ఇప్పుడు క్లైమేట్ జస్టిస్ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ చెబుతున్నారు. తాము తక్కువ స్థాయిలోనే కార్బన్ ఉద్గారాలు చేస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని శిశిర్ అంటున్నారు. తమ దేశం సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘ఇది పర్వత సునామీ’చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సాధారణ వర్షపాతం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల ప్రజలకు తగినంత ముందస్తు హెచ్చరిక అందలేదు. దీంతో ఈ విపత్తును నేపాల్ విదేశాంగ మంత్రి ‘క్యాటస్ట్రాఫిక్ మౌంటెన్ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు ఆందోళనకరంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మా తప్పు లేకుండా మూల్యం చెల్లిస్తున్నాం’వాతావరణంలోకి నేపాల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు వాస్తవంగా చాలా తక్కువ. అయినప్పటికీ మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం చెల్లిస్తున్నాం’’ మంత్రి ఖనాల్ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదలతో నేపాల్‌లో కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగం దెబ్బతిందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారాయన.‘సాయం కాదు.. న్యాయం’ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయం. ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో మా దౌత్య విధానాన్ని ‘సాయం’గా కాకుండా.. ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తాం. ఇది దాతృత్వం కాదు.. చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్ క్లెయిమ్ పంపిందని మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు.కాలుష్యంలో ఎవరి వాటా ఎంత?వాతావరణ మార్పులపై నేపాల్ చేస్తున్న వాదనలో ప్రధానంగా కార్బన్ ఉద్గారాల అసమానతను ప్రస్తావిస్తోంది. గ్లోబల్ కార్బన్ బడ్జెట్ (Global Carbon Budget 2025) గణాంకాల ప్రకారం.. కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల్లో చైనా వాటా సుమారు 32 శాతం. అమెరికా వాటా 13 శాతం, భారత్ వాటా 8 శాతం. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ ఫాసిల్ కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం రిలీజ్ చేశాయన్నమాట. అయితే.. అయితే నేపాల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి రిలీజ్ అయిన కర్బన ఉద్గారాలు సుమారు 1.59 కోట్ల టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాల్లో ఆ వాటా 0.04 శాతం మాత్రమే. అలాగే యావరేజ్‌గా ఒక దేశం 0.5 టన్నులు రిలీజ్ చేస్తుంటే.. నేపాల్ అంతకంటే తక్కువగా ఉందన్నమాట. అలాగని..చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు నేపాల్‌కు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే రూల్‌గానీ, చట్టంగానీ లేదు. ఇది కేవలం నేపాల్ తెర మీదకు తెచ్చిన ‘క్లైమేట్ జస్టిస్–లాస్ అండ్ డ్యామేజ్’ వాదన మాత్రమే. అయితే తక్కువ ఉద్గారాలు చేసే దేశాలే వాతావరణ విపత్తులతో ఎక్కువగా నష్టపోతున్న నేపథ్యంలో.. ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తున్న చేసిన దేశాలు ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: కాల్చరు.. పూడుస్తారు! ఎందుకో తెలుసా? -
విస్తరణ చాలదు... బలపడాలి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుతో అన్ని దేశాలూ కొత్త కొత్త దారులు వెదుక్కుంటున్నాయి. ఉన్న కూటములు విస్తరిస్తున్నాయి. సైనిక సహకార ఒప్పందాలు పుట్టుకొస్తున్నాయి. మంగళవారం ముగిసిన రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాలు దీన్నే నిరూపించాయి. 2001లో అయిదు సభ్యదేశాలతో మొదలైన ఆ సంస్థ 2017లో మనదేశంతోపాటు పాకిస్తాన్‌ను కూడా చేర్చుకోగా... 2023లో ఇరాన్, ఆ మరుసటి ఏడాది బెలారస్ కూడా సంస్థలోకి ప్రవేశించాయి. ఈసారి తుర్కియే, అజర్బైజాన్, ఆర్మేనియా, మంగోలియా, లావోస్, టోగో, నేపాల్, మాల్దీవులు, బహ్రెయిన్, శ్రీలంక తదితర 14 దేశాలు ‘సంభాషణ భాగస్వాములు’గా ఇందులో పాలుపంచుకున్నాయి. ఎస్సీఓ పాతికేళ్ల ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది క్రమేపీ రష్యా పరిధినుంచి చైనా పరిధిలోకి జారుకుంటున్నదన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటికైతే మధ్య ఆసియాలోని పూర్వపు సోవియెట్ ప్రాంతాలైన కజఖ్‌స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు భద్రత, సంస్కృతి, సంస్థాగత, వ్యూహాత్మక అంశాల్లో ఇంకా రష్యాకు సాన్నిహిత్యంగానే ఉన్నాయి. అది కొనసాగుతుంది కూడా. కానీ మరోపక్క ఈ దేశాల్లో చైనా ఆర్థిక ప్రాబల్యం పెరుగుతోంది. అది ఈసారి సమావేశాల్లో బాహాటంగానే కనబడింది. చైనాను పశ్చిమాసియా, యూరప్, పశ్చిమాసియాలతో అనుసంధానించే బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) బృహత్తర ప్రాజెక్టు ద్వారా వచ్చే రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, పోర్టులు వగైరాలు తమ ప్రాంత ఆర్థిక చిత్రాన్ని సమూలంగా మార్చేస్తాయని ఆ దేశాలు భావిస్తున్నాయి. చైనా వీటికి ఆయుధ సామగ్రి విక్రయాన్ని కూడా మొదలెట్టింది. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి మరింత నష్టపోయింది. ఈ దశలో చైనాతో భాగస్వామ్యం కలిసొస్తుందని పూర్వపు సోవియెట్ దేశాలు భావించటంలో వింతేమీ లేదు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ విషయంలో చైనాతో విభేదించే ఓపిక, తీరిక రష్యాకు లేవు. అందుకే ఈ పరిణామాలను మౌనంగా వీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం కూడా ఆచితూచి అడుగేయటం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ (భద్రత), కనెక్టివిటీ (అనుసంధానం), ఆపర్చ్యునిటీ (అవకాశం) అనే మూడుస్తంభాలుగా ఎస్సీఓ దేశాలమధ్య సహకారం పటిష్టపడాలనీ... అది కొలవగలిగే ఫలితాల సాధన దిశగా ఉండాలనీ సదస్సులో పిలుపునివ్వటం గమనించదగింది. చైనా మాదిరే ఆ సంస్థ ఛత్రఛాయలో మనం కూడా ఎదగటానికి, ఆర్థికంగా విస్తరించటానికి మరింతగా ప్రయత్నించాల్సి వుంది. ఇందుకు అవరోధాలు తక్కువేం లేవు. సంస్థలోని రెండు సభ్య దేశాలు రష్యా, ఇరాన్ యుద్ధాల్లో కూరుకుపోయాయి. వాటితో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య వైరం అలాగే ఉంది. అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇరాన్ నుంచి మన దేశం చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించుకుంది. ఏడేళ్ల తర్వాత ఇటీవలే ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో రాగల కాలంలో ఆ దేశంతో మరిన్ని రంగాలకు వాణిజ్యాన్ని విస్తరించదల్చుకున్నట్టు మోదీ చెప్పారు. ఇరాన్‌పై మహా ఆర్థిక దిగ్బంధనాన్ని అమలు చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇది కీలక వాగ్దానం. భిన్న ప్రయోజనాలున్న, వివిధ రాజకీయ వ్యవస్థలున్న దేశాలమధ్య అర్థవంతమైన సహకారం విస్తరించటం అంత సులభమేమీ కాదు. ఈ పాతికేళ్లలో గణనీయంగా పెరిగిన ఎస్సీఓ... ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనాలన్న చైనా ప్రతిపాదనకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా, ఆచరణలో అదేమీ అమలుకావటం లేదు. మన దేశంలో ఉగ్రవాద దాడుల వెనక తన హస్తం లేదని దబాయించటంతోపాటు తమ దగ్గర జరిగే అలాంటి దాడుల్లో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఎదురు ఆరోపిస్తోంది. ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి సభ్యదేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే ఏ సంస్థలైనా లక్ష్యసాధనలో విజయం సాధిస్తాయి. ఎస్సీఓ విస్తరణ మంచిదే... దాని మాటెలావున్నా ఆ సంస్థ బలపడాలంటే పెడ ధోరణులను అరికట్టడం తప్పనిసరి. -
ఏడు రోజుల్లో ఐదు కిలోలు .? నో జిమ్..జస్ట్ ఇలా చేస్తే చాలు..
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో వ్యాయామలు, స్ట్రిక్ట్ డైట్‌ని అనుసరించడం అతి పెద్ద సవాలు చాలామందికి. పైగా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత స్కిప్ చేసేస్తుంటారు. నిలకడగా చేయాలంటే సమయం ఉండక ఇబ్బంది పడుతుంటారు. అదీగాక ప్రస్తుతం చాలామటుకు ఉద్యోగాలు గంటలు గంటలు పనిచేసే డెస్క్ ఉద్యోగాలే. బాగా తినకపోయినా..లావుగానే ఉండటం, పోనీ వర్కౌట్లు చేద్దామా అంటే సమయం కుదరక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం సులభంగా ఎంజాయ్ చేస్తూ చేసే వ్యాయామాలు నెట్టింట ట్రెండ్‌గా మారాయి. వాటిని వర్కౌట్లు అనేకంటే అందమైన డ్యాన్స్ అనొచ్చు. చూడటానికే కాదు, చేయడానికి కూడా చాలా అనువైనవి, సులువైనవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..జస్ట్ నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కనిపిస్తున్న వర్కౌట్లు చేస్తే ఒక్క వారంలో ఐదు కిలోలు తగ్గడం ఖాయం అట. ప్రస్తుతం ఈ వ్యాయామాలు జపాన్‌లో బాగా ట్రెండ్‌గా మారింది. డంబెల్క్ కూడ పక్కనే పడేసి ఇవి ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. పైగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే శరీరానికి మంచి కదలిక, కొలస్ట్రాల్‌ని కరిగించి ఫిట్‌గా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్లు కూడా అని అంటున్నారు. చాలామంది నెటిజన్లు దీన్ని కొట్టిపారేస్తున్నా..జస్ట్ నాలుగు నిమిషాలు ఎంజాయ్‌చేస్తూ వేగంగా చేసేవి ప్రయత్నిస్తే నష్టమేమి ఉండదు కదా అని అడుగుతున్నారు. పైగా ఏ వ్యాయామమైనా..ఆరోగ్యకరమైనదే తప్ప హానికరం అంటూ ఉండదు. పైగా ఇవి కష్టతరమైనవి కాదు ఎవ్వరైనా సులభంగా ఆడుతూ పాడుతూ చేసేవే కదా ట్రై చేస్తే పోలే అని సపోర్టు చేస్తూ మాట్లాడటం విశేషం. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని చూసి..చకచక నాలుగే నాలుగు నిమిషాల్లో చేసి స్లిమ్‌గా మారిపోండి మరి..!.영상은 길이는 고작 4분.일주일동안 매일 루틴으로 하면 -5kg이 빠진다는 일본 다이어트 영상.지금 일본에서 엄청난 유행임.마운자로 집어 던지고 이거하자.부작용 따위 없다. pic.twitter.com/J5ewOHbnui— rrace🇰🇷 (@junssi1982) August 31, 2026 (చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!) -
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
నేపాల్‌ను కుదిపేసిన వరద బీభత్సం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదని నేపాల్ ఆరోపించగా.. చైనా ఆ వాదనను కొట్టిపారేసింది. అయితే ఈ ప్రవాహం వేగం ఊహకందని రీతిలో ఉందని దూసుకొచ్చిందని.. అందుకే ముందస్తు హెచ్చరిక ఇవ్వడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అత్యంత కష్టంగా మారిందని తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి ఓ విపత్తు రావొచ్చని పది రోజుల కిందటే నేపాల్‌ను చైనా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ విలయంలో 800 మంది మృతదేహాలను వెలికి తీయగా.. మరో 2,500 వేల మంది ఆచూకీ గల్లతైంది. అయితే దాదాపు 12 రోజుల ముందే టిబెట్ ప్రాంతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చైనా నేపాల్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాటితో పాటు కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ చైనాకు చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం నేపాల్‌కు ఓ మెయిల్ పంపింది. అలాగే హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలపై దృష్టిసారించాలని సూచించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.జస్ట్.. 26 నిమిషాల్లో?ఆగస్టు 26న ఉదయం సుమారు 8.32 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద బీభత్సం మొదలైంది. కేవలం 26 నిమిషాల తర్వాత నేపాల్ అధికారులకు సమాచారం అందింది. అయితే వరద ధాటికి పలు పర్యవేక్షణ కేంద్రాలు ధ్వంసం కావడంతో డేటా ప్రసారం నిలిచిపోయింది. స్థానిక అధికారుల నుంచి నిర్ధారణ పొందిన తర్వాత నేపాల్ అధికారులు ఉదయం 9.13 గంటలకు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపారు. అప్పటికే వరద ట్రిషూలీ నది వెంట దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్తోంది.అయితే నేపాల్ వాదన మరోలా ఉంది. చైనా ఆ హెచ్చరికలను 14-19 తేదీల మధ్యే అని ప్రస్తావించిందని అంటోంది. అలాగే తమకు కేవలం భారీ వర్షాల హెచ్చరికలు మాత్రమే జారీ చేసిందని, దానికి తాము ‘‘కేవలం వర్షపాతం సమాచారం మాత్రమే కాదని, హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలు, కొండచరియల ప్రమాదంపై ముందస్తు సమాచారం’’ కూడా కోరామని అంటోంది. వరద స్పీడు.. మరీ అంతనా?ఇదిలా ఉండగా.. తాజా అంచనాలు ఈ విపత్తు తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. నీరు, బురద, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు నేపాల్ హిమాలయ గ్లేసియర్, పర్వత పరిశోధకుడు ధనంజయ్ రెగ్మి తెలిపారు. ఇంతటి వేగంతో వచ్చిన ప్రవాహం మార్గంలో కనిపించిన ప్రతిదానినీ ఊడ్చుకెళ్లింది.పర్వతారోహకుడు సంజిత్ సింగ్ బాల్ అంచనా ప్రకారం.. సుమారు ఒక కిలోమీటరు పరిమాణంలో ఉన్న హిమనదం భాగం దాదాపు 5,000 మీటర్ల ఎత్తు నుంచి విరిగిపడి కిందికి దూసుకొచ్చి ఉండొచ్చు. మార్గమధ్యంలో నీరు, మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను తనతో కలుపుకోవడంతో ప్రవాహం మరింత శక్తిమంతంగా మారింది.అంత పెద్ద.. హిమనదం కూలిందిమొదట మూడు హిమ సరస్సుల్లో ఏదో ఒకటి తెగిపోవడం వల్లే ఈ వరద సంభవించిందని భావించారు. కానీ ఉపగ్రహ చిత్రాల పరిశీలనలో అసలు కారణం మరోటి అని తేలింది. సుమారు 7,000 మీటర్ల ఎత్తున్న లాంగ్టాంగ్ లెరుంగ్ శిఖరంలోని ఉత్తర హిమనదం(గ్లేసియర్)లో దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతం కూలిపోయినట్లు గుర్తించారు. హిమనదం భారీ భాగం లోయలోకి పడటంతో నీరు, మంచు, రాళ్లు, మట్టి కలిసి అత్యంత వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.మూడు సరస్సులు.. మరో ముప్పు?తాజా విపత్తు తర్వాత.. ఆ రీజియన్‌లో మూడు సరస్సులు సహజంగా ఏర్పడడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వీటిలో ఏదైనా ఒకదానిపై కొత్తగా కొండచరియలు లేదంటే భారీ రాళ్లు పడితే.. దాని ప్రభావం వరుసగా మిగిలిన సరస్సులపైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇటు ప్రస్తుతం చైనా–నేపాల్ సరిహద్దు వద్ద ఏర్పడిన బ్యారియర్ సరస్సులోని నీరు సహజంగా బయటకు వెళ్లి దాదాపు పూర్తిగా ఖాళీ కావడంతో.. ఒక్కసారిగా సరస్సు తెగిపోయి భారీ వరద వచ్చే ముప్పు గణనీయంగా తగ్గింది. అలాగని.. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అటు చైనా, ఇటు నేపాల్ అధికారులు అంటున్నారు. నేపాల్‌లోని భోటేకోషి నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నదీ ప్రవాహంలో ఆకస్మిక మార్పులు, కొండచరియలు లేదంటే కొత్తగా ఏర్పడే నీటి నిల్వలపై నిఘా కొనసాగుతోంది. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోనే ఉండాలని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.800 మంది మృతి.. మిస్సింగ్ లెక్క వేరే!ఈ వరదలో నేపాల్, చైనాలో కలిపి దాదాపు 800 మంది మరణించగా.. 2,500-3,000 మందికిపైగా గల్లంతైనట్లు తాజా సమాచారం. వరద ధాటికి భారీ బండరాళ్లు, బురదతో భవనాలు కొట్టుకుపోయాయి. మొత్తంగా 19 వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతానికిపైగా ప్రభావితమైనట్లు అంచనా. సరిహద్దు నుంచి సుమారు 168 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. దాదాపు 5.74 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఈ ప్రవాహంలో ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది.చైనాతో మరింత సమాచార భాగస్వామ్యంనేపాల్ ఆరోపణలు-చైనా కౌంటర్లతో ముందస్తు వార్నింగ్‌లపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ విపత్తు నేపథ్యంలో హిమనదాలు, హిమ సరస్సులు, నదుల ప్రవాహంపై చైనాతో మరింత సమగ్ర సమాచార భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ భావిస్తోంది. ప్రతి 10 నిమిషాలకోసారి వర్షపాతం, నదుల నీటిమట్టం, హిమనదాల కదలికలపై సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వాతావరణ మార్పులతో హిమనదాల కరుగుదల వేగం పెరుగుతున్న నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో వరదలు, కొండచరియలు, హిమ సరస్సుల ఉప్పెనల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే మూడు కొత్త సరస్సులు మరో ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ప్రాణాలు కాపాడిన ఛాయ్! -
అంతరిక్షంలో వరిపంట
చైనీస్ అంతరిక్ష శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సాధించారు. చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో తొలిసారిగా భూమికి 400 కిలోమీటర్లకు పైగా దూరంలోనున్న కక్ష్యలో వరిపంట పండించారు. ఈ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న ‘షెంఝౌ–23 మిషన్’ బృందం శాస్త్రవేత్తలు గడచిన నాలుగేళ్లలో అంతరిక్షంలోనే వరి విత్తనాలను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో అభివృద్ధి చేసిన విత్తనాలతో ఇటీవల పూర్తిస్థాయిలో వరిపంట పండించారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) సహా వివిధ అంతరిక్ష కేంద్రాలలో పనిచేసే శాస్త్రవేత్తల కోసం భూమి నుంచి ఆహార పదార్థాలు సహా నిత్యావసరాలను సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భూమి పైనుంచి వచ్చే సరఫరాలపై ఆధారపడకుండా, అంతరిక్షంలోనే ఆహారపంటలు పండించే దిశగా శాస్త్రవేత్తలు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అంతరిక్షంలో ఆహారధాన్యాన్ని పండించడంలో చైనీస్ శాస్త్రవేత్తలు తొలి విజయాన్ని సాధించారు. -
భారత్‌తో ఢీ కొట్టాడు.. జిన్‌పింగ్ వేటులో పడ్డాడు!
చైనాలో సైనిక ప్రక్షాళన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా జనరల్ జావో జోంగ్కిని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పించారు. గతంలో భారత్‌తో డోక్లామ్ ప్రతిష్టంభన, గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు నేతృత్వం వహించింది ఈయనగారే. ఇందుకుగానూ జిన్‌పింగ్ నోట హీరోగా ప్రశంసలు అందుకున్న వ్యక్తే.. ఇప్పుడు వేటుకు గురి కావడం గమనార్హం. భారత్‌తో కీలక సరిహద్దు ఘర్షణల సమయంలో చైనా సైన్యానికి నాయకత్వం వహించిన జనరల్ జావో జోంగ్కి (Zhao Zongqi)పై తాజాగా వేటు పడింది. 2017లో డోక్లామ్ ప్రతిష్టంభన, 2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు నేతృత్వం వహించిన జావోను చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి నుంచి తొలగించింది. అయితే ఆ తొలగింపునకు కారణాలను మాత్రం బీజింగ్ వర్గాలు వెల్లడించలేదు.2016లో వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌ను పునర్వవ్యవస్థీకరించిన తర్వాత తొలి కమాండర్‌గా జనరల్ జావో జోంగ్కి బాధ్యతలు చేపట్టాడు. టిబెట్, జిన్జియాంగ్తోపాటు భారత్‌తో చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో పీఎల్ఏ కార్యకలాపాలను ఈ కమాండ్ పర్యవేక్షిస్తుంటుంది. అయితే 2017లో భారత్-చైనా-భూటాన్ త్రిసంధికి సమీపంలోని డోక్లామ్‌లో 72 రోజులపాటు ఇరు దేశాల సైనికులు ఉద్రిక్తతల్లో జావోనే కీలక పాత్ర పోషించారు. ఇందులో జావోదే పూర్తి బాధ్యత ఉందంటూ అంతర్జాతీయ మీడియా సైతం కథనాలు ఇచ్చింది.ఆ తర్వాత 2020లో తూర్పు లడ్డాఖ్లో ఉద్రిక్తతలు మొదలైనప్పుడు కూడా ఆయన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ బాధ్యతల్లోనే ఉన్నారు. అదే ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా అధికారికంగా నలుగురు PLA సైనికులు మరణించినట్లు ప్రకటించింది.గల్వాన్ ఘర్షణకు సంబంధించి అమెరికా నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ.. 2020లో వచ్చిన ఓ నివేదికలో జావో జోంగ్కి ఆపరేషన్‌కు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌కు ‘గుణపాఠం చెప్పాలనే’ ఉద్దేశంతో ఈ చర్యకు ఆయన ఆమోదం తెలిపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ వాదనను చైనా అధికారికంగా ధృవీకరించలేదు. డోక్లామ్, గాల్వాన్ వంటి భారత్‌తో అత్యంత సున్నితమైన సరిహద్దు ఘర్షణలకు జావో నేతృత్వం వహించిన నేపథ్యంలో ఆయన తాజా తొలగింపు ఆసక్తికరంగా మారింది.ఆగస్టు 26న చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (CPPCC) జావోను తన స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించింది. అలాగే జాతి, మత వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడంతోపాటు సీపీపీసీసీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయితే ఈ చర్యకు కారణమేంటన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయా? లేదంటే క్రమశిక్షణా ఉల్లంఘనలపై దర్యాప్తు జరుగుతోందా? అనేది కూడా స్పష్టం చేయలేదు.జిన్‌పింగ్ ‘పర్జ్’లో మరో వికెట్?జావోపై చర్యలు తీసుకున్న సమయంలోనే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ జనరల్స్ జాంగ్ యూషియా, లియు జెన్లీపై కూడా క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.2012లో జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా సైన్యంలో అవినీతిపై ప్రారంభమైన చర్యలు క్రమంగా విస్తృత ప్రక్షాళనగా మారాయి. పలువురు సీనియర్ సైనికాధికారులు పదవులు కోల్పోవడం, కనిపించకుండా పోవడం(చంపేశారనే అనుమానాలు), దర్యాప్తులను ఎదుర్కోవడం జరిగింది. ఆయుధాల కొనుగోలు, రక్షణ విశ్వవిద్యాలయాలు, కీలక కమాండ్ల వరకు ఈ ప్రక్షాళన విస్తరించినట్లు తెలుస్తోంది.2026 ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అంచనా ప్రకారం.. 101 మంది సీనియర్ పీఎల్ఏ అధికారులు పదవుల నుంచి తొలగించబడ్డారు. వాళ్లలో చాలామంది ఏమయ్యారో తెలియదు. ఈ నిర్ణయం ఎంతలా అంటే.. చైనా సైనిక నాయకత్వంలోని దాదాపు 52 శాతం పదవులను ప్రభావితం చేసిందట.ఇదీ చదవండి: కాళరాత్రి.. చైనా చరిత్రకే మాయని మచ్చ -
నేపాల్ జల ప్రళయం వెనుక చైనా.!
-
రెండున్నర లక్షల శవాల సమాధి.. చైనా దాచిన జలప్రళయం
-
వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ!
మీరు పేపర్ మీద బొమ్మ వేస్తారు కదా? మరి వరి పొలంలోనే బొమ్మ వేస్తే? ఇది చైనాలో వరిపొలం. అక్కడ రైతులు వరి మొక్కలతోనే పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు. దీన్ని ‘ప్యాడీ ఆర్ట్’ లేదా ’టాన్బో ఆర్ట్’ అంటారు. అసలు ఈ ఆర్ట్ జపాన్ లో మొదలైంది, ఇప్పుడు చైనాలో సూపర్ ఫేమస్.ఈ ఫోటోలోని అమ్మాయి జుట్టు, చీర, వాయిద్యం అన్నీ వరి మొక్కలే! కింద నుంచి చూస్తే పొలం మామూలుగా ఉంటుంది. టవర్ మీద జనం ఎక్కి చూస్తేనే బొమ్మ కనిపిస్తుంది. అందుకే దీన్ని 3డి పెయింటింగ్ అంటారు.రంగు ఎలా వస్తుంది? మనకు తెల్ల బియ్యం ఉన్నట్టే, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, ఊదా బియ్యం కూడా ఉంటాయి. వాటి ఆకులు కూడా అదే రంగులో ఉంటాయి. ఆకుల్లో ‘ఆంథోసైనిన్’ అనే సహజ రంగు ఉంటుంది. రైతు ఏ చోట ఏ రంగు కావాలో, ఆ చోట ఆ రంగు విత్తనం నాటుతాడు. మొక్కలు పెరిగేకొద్దీ బొమ్మ పెద్దదవుతుంది!ఈ ఆర్ట్ చైనాలో షెన్యాంగ్ నగరంలో చాలా ఫేమస్. అక్కడ ‘రైస్ డ్రీమ్ పార్క్’ అనే పెద్ద పార్క్ ఉంది. అక్కడి రైతులు ప్రతి ఏడాది 13 హెక్టార్లలో 17 పెద్ద బొమ్మలు వేస్తారు. మొక్కల ఎత్తును కూడా కంట్రోల్ చేసి 3డి ఎఫెక్ట్ తెస్తారు. రైతు అంటే అన్నం పండించేవాడే కాదు, ఆర్టిస్ట్ కూడా! మనం కూడా మన పొలంలో బతుకమ్మ బొమ్మ వేయొచ్చు కదా!- నిర్వహణ: కెఇవీ చదవండి: గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్ సాహసం! -
యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్!
భారీ ఆకస్మిక వరదల నుంచి తేరుకోకముందే నేపాల్‌ను మరో జలప్రళయం ముంచెత్తుందన్న హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వరదల ధాటికి ఏర్పడిన సహజ సరస్సు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని చైనా హెచ్చరించింది. సరస్సులోని నీటి రంగు మరింత ముదురుతోందని.. ఇది కట్ట తెగే ప్రమాదానికి సంకేతం కావొచ్చని పేర్కొంది. ఎప్పుడైనా సరస్సు కట్టలు తెంచుకునే అవకాశం ఉందని నేపాల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో సహాయక చర్యలకు, గల్లంతైన వాళ్ల కోసం కొనసాగుతున్న అన్వేషణకు తాజా వార్నింగ్ ఆటంకాలు కలిగిస్తోంది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు ఘోర నష్టాన్ని కలిగించాయి. అయితే ఆ సమయంలో ఎగువ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. దీంతో నదీ ప్రవాహానికి అడ్డుగా సహజ కట్ట ఏర్పడి.. దాని వెనుక బారియర్ సరస్సు ఏర్పడింది. చైనా జలవనరుల శాఖ ప్రకారం.. శుక్రవారం నాటికి అందులో సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సరస్సు చైనాలోని చోచెన్ నది, నేపాల్‌లోని పురేపు నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. నీటిమట్టం క్రమక్రమంగా.. శరవేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది.కట్ట తెగితే.. 500 క్యూబిక్ మీటర్ల ప్రవాహంఈ సరస్సు ఏ క్షణాన అయినా కట్టలు తెంచుకోవచ్చని చైనా నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే టిబెట్ ప్రాంతంలో సహాయక చర్యలను సైతం నిలిపివేసింది. సరస్సు కట్టలో కొంత భాగం తెగితే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల నీరు నదిలోకి చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇది మొన్న సంభవించిన వరద ఉధృతితో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ఉండే చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే సరస్సు నుంచి నీరు లెహెండే ఖోలా, త్రిశూలి నదుల్లోకి ప్రవహించడం ప్రారంభమైందని వెల్లడించింది. దీంతో డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నేపాల్ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను, సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. నిన్నటి నుంచి పోలీసులు మైక్‌లలో చేస్తున్న హెచ్చరికలతో.. ఎత్తైన ప్రాంతాలకు తరలి పోతున్నారు.600కు చేరువలో మృతుల సంఖ్యఆకస్మిక వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. రసువాతోపాటు మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో 600 మంది దాకా మృతి చెందారు. 1,500 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు.. భారత సరిహద్దు వైపునకు కూడా కొన్ని మృతదేహాలు, బ్యాగులు కొట్టుకువస్తున్నాయి. దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్‌క్రాస్ అంచనా వేసింది.2,000 people now missing in Nepal as death toll from floods hits 579.Nepali authorities say they’re monitoring two lakes upstream from the main flood zone, one of which has begun overflowing. pic.twitter.com/4cyByjJ1Yx— 𓂀 𝕋𝔼𝔸ℍ 𓂀 (@TeahCartel) August 28, 2026అటు టిబెట్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పలువురు మృతి చెందగా.. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కైలాస్–మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయుల ఆచూకీపై ఆందోళన కొనసాగుతోంది.టన్నెళ్లలో వందలమంది?భారీ వరదలకు నేపాల్‌లోని 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 933 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో కొందరు టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క అప్పర్ త్రిశూలి–1 ప్రాజెక్టులోనే 576 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం.. మొబైల్, టెలిఫోన్ నెట్‌వర్క్‌లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు మూడు డజన్లకుపైగా వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.భారత్ నుంచి భారీ సాయంవిపత్తు నేపథ్యంలో ఇతర దేశాల సాయం వద్దన్న నేపాల్.. కొద్దిగంటల్లోనే మనసు మార్చుకుంది. ధ్వంసమైన రవాణా మార్గాలను పునరుద్ధరించేందుకు 42 బెయిలీ వంతెనలు(తాత్కాలిక) నిర్మించేందుకు భారత్, చైనా సాయాన్ని నేపాల్ కోరింది. ఇటు భారత్ ఇప్పటికే నేపాల్‌కు సహాయక సామగ్రిని పంపింది. వైద్య సిబ్బంది, టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపేందుకు కూడా ముందుకొచ్చింది. ప్రస్తుతం వేలాది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా.. మరోవైపు సహజ సరస్సు ఎప్పుడైనా కట్టలు తెంచుకునే అవకాశం ఉందన్న చైనా హెచ్చరిక నేపాల్‌లో కొత్త ఆందోళనకు కారణమైంది. దీంతో బోటెకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.ఇదీ చదవండి: చైనా బార్డర్ వల్లే నేపాల్ సంచలన నిర్ణయం? -
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం ఇతర దేశాల సాయం తమకేం అక్కర్లేదని తేల్చేసింది. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపినట్లు ప్రధాని బాలేంద్ర షా వెల్లడించారు. తమ భద్రతా బలగాలే సమర్థంగా పని చేస్తున్నాయని.. అలాంటప్పుడు వేరే దేశాల అవసరం తమకు ఉండకపోవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ అంటోంది. దీనికి స్పందించిన భారత్.. ఓ కీలక ప్రకటన చేసింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం ఆకస్మిక వరద పోటెత్తింది. ఎగువన ఉన్న గ్లేసియర్ కరిగిపోవడంతో.. బండరాళ్లు, బురదతో కూడిన వరద క్షణాల్లో ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా 600 మృతదేహాలను వెలికి తీశారు. మరో 1,400 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇందులో భారత్ సహా పలు దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేపాల్‌లోని రసువా జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. పలు గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఇంతకు ముందు వరద కారణంగా ఏర్పడిన మరో సరస్సు కట్టలు తెంచుకునే ప్రమాదం చైనా ఇప్పటికే నేపాల్‌ను హెచ్చరించింది. దీంతో మరోసారి జల ప్రళయం(మునుపటి కంటే ఐదు రెట్లు తీవ్రతతో..) రావొచ్చని ఆందోళనల నడుమ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.భారత్ రియాక్షన్ ఇదే..నేపాల్ విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని ప్రకటించినప్పటికీ.. భారత్ మాత్రం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నేపాల్ అభ్యర్థన మేరకు.. అదనపు మానవతా సాయం, వైద్య బృందాలు, ఇంజినీరింగ్ సిబ్బంది, అవసరమైన పరికరాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో విమానం కూడా త్వరలో బయలుదేరనుంది. టన్నెల్ రెస్క్యూ టీమ్‌ను పంపేందుకు ముందుగా రెకీ బృందాన్ని పంపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అక్కడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అవసరమైన పరికరాలను గుర్తించనున్నారు. అదేవిధంగా వైద్య బృందాన్ని పంపడంతోపాటు.. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు బెయిలీ(పోర్టబుల్) వంతెనలు, సాంకేతిక బృందాలను అందించేందుకు భారత్ ముందుకొచ్చింది.బృందాలనూ పంపుతాంసహాయక చర్యల్లో సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైన పరికరాలను పంపేందుకు భారత్ ప్రత్యేకంగా నేపాల్‌కు ప్రతిపాదన చేసినట్లు జైస్వాల్ వెల్లడించారు. దీనిపై నేపాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విపత్తుతో ప్రభావితమైన ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.పలు దేశాల నుంచి సాయం ఆఫర్నేపాల్ వరదల్లో తమ దేశాలకు చెందిన పౌరులు గల్లంతైన నేపథ్యంలో పలు దేశాలు సహాయక బృందాలను పంపేందుకు ముందుకొచ్చాయి. భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతానికి విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి తెలిపారు. తమ భద్రతా సంస్థలు ఇప్పటికే శోధన, రక్షణ చర్యలను చేపట్టాయని.. అవి సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు.చైనా సరిహద్దు ప్రాంతం కావడం వల్లేనా?విదేశీ రెస్క్యూ బృందాలను అనుమతించకపోవడం వెనుక రసువా ప్రాంత భౌగోళిక ప్రాధాన్యత కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోని టిబెట్‌కు సమీపంలో ఉండటంతో.. విదేశీ బృందాల రాక సున్నితమైన అంశంగా మారి ఉండొచ్చని నేపాల్ మాజీ దౌత్యవేత్త దినేశ్ భట్టారాయ్ అభిప్రాయపడ్డారు. అయితే నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.‘సాయం పూర్తిగా వద్దనడం కాదు’నేపాల్ అంతర్జాతీయ సాయాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదని ఛేత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ భద్రతా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని, ఏదైనా ప్రత్యేక నైపుణ్యం లేదంటే సాంకేతిక సహాయం అవసరమైతే ఆయా దేశాలను తామే సంప్రదిస్తామని చెప్పారు.వరదల్లో దక్షిణ కొరియాకు చెందిన పలువురు జలవిద్యుత్ ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాలను అంగీకరించే పరిస్థితిలో లేదని తమకు సమాచారం అందినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అయినప్పటికీ నేపాల్‌తో చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది. మానవతా సాయం కింద 10 లక్షల డాలర్లను అందించనున్నట్లు ప్రకటించింది.ఆ వెంటనే యూటర్న్.. విదేశీ బృందాలకు ఓకే!విదేశీ రెస్క్యూ బృందాల సాయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి, పెద్ద సంఖ్యలో విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో పరిమిత స్థాయిలో విదేశీ నిపుణులను అనుమతించింది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా నుంచి నిపుణులు టన్నెల్ రెస్క్యూ, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ గుర్తింపు ప్రక్రియల్లో సహకరించనున్నారు. ఇదిలా ఉండగా.. భారత్ ఇప్పటికే వైద్య, టన్నెల్ రెస్క్యూ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫరక్కా డెడ్‌లైన్.. మరో జల యుద్ధం తప్పదా? -
ఘర్షణ లేదు... పురోగతీ లేదు!
భారత్ ప్రస్తుతం దౌత్య వ్యవహారాల్లో తలమునకలై ఉంది. కిర్గిజ్స్తాన్లోని బిష్కెక్లో ఆగస్టు 31 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖ రాగ్ర సమావేశాలు మొదలవుతున్నాయి. తర్వాత, ఢిల్లీలో సెప్టెంబర్ 12 నుంచి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు జరగ నున్నాయి.మన జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ ఆగస్టు 25న చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యితో బీజింగ్‌లో చర్చలు జరిపారు. భారత్–చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల ప్రత్యేక ప్రతి నిధుల 25వ దఫా సమావేశాలు చైనాలో జరిగాయి. రెండు దేశాలు మొదటి రోజున విడివిడిగా ప్రకటనలు చేశాయి. దాంతో ఏకాభి ప్రాయం కుదరనట్లుగా కనిపించింది. కానీ, ఆగస్టు 26న, ఎనిమిది అంశాలతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఏకీభావం ఎందులో?ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింపజేసుకోవడం, స్థిరత్వాన్ని కొనసాగించడం, శాంతి, ప్రశాంతతలకు భంగం వాటిల్లకుండా చూసుకొనే దిశగా ముందడుగు వేయాలని స్థూలంగా ఒక అభిప్రా యానికి వచ్చారు. సరిహద్దుల పునర్విభజనపై ‘వీలైనంత త్వరగా, గణనీయమైన ఫలితాలు’ సాధించేలా చర్చలు జరపాలనే సంకల్పం గురించి ప్రత్యేకించి పేర్కొన్నారు. సరిహద్దుకు రెండు వైపుల ప్రవహి స్తున్న నదుల గురించి సెప్టెంబర్‌లో మాట్లాడుకోవాలని నిర్ణయాని కొచ్చారు. సరిహద్దు గుండా సాగే వర్తకానికి వెసులుబాటు కల్పించు కోవాలనీ, సరిహద్దులో అదనంగా సమావేశ ప్రాంతాలు, హాట్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలనీ నిర్ణయించారు.భారత్–చైనా మధ్యనున్న 3,488 కిలోమీటర్ల నిడివి గల వాస్తవాధీన రేఖలో పునర్విభజనకు ఏయే రంగాలను ఎంచుకున్నదీ రెండు పక్షాలు వెల్లడించలేదు. భారత్–చైనా ప్రత్యేక ప్రతినిధుల తదుపరి దఫా సమావేశం మన దేశంలో 2027లో జరుగనుంది. గల్వాన్ ఘర్షణ (2020) తర్వాత, స్నేహ సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు ఆమధ్య కాలంలో సాగిన ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ చర్చలు జరిగాయని భావించవచ్చు. కూటముల భిన్న లక్ష్యాలుభారత్ విషయానికొస్తే, ‘ఎస్సీఓ’, ‘బ్రిక్స్’ నెరవేర్చగల ప్రయోజనాలు భిన్నమైనవి. షాంఘై సహకార సంస్థలో భారత్– చైనాలతోపాటు రష్యా, పాకిస్తాన్, కజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఉన్నాయి. ఇది మొదట్లో ప్రాంతీయ భద్రత, కౌంటర్–టెర్రరిజంపైనే దృష్టి పెట్టింది. తర్వాత, ఆయా దేశాల మధ్య కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలకు విస్తరించి నప్పటికీ, ఈ సంస్థకు ఇప్పటికీ భద్రతే మూల బిందువు.బిష్కెక్ సమావేశంలో మనం సీమాంతర తీవ్రవాదం గురించి లేవనెత్తే అవకాశం ఉంది. సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేదిగా ఉన్న చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లపై వెనక్కి తగ్గాలని కోరవచ్చు. మధ్య ఆసియా, రష్యా, చైనాలతో కలసి పనిచేయగల మార్గాలను అన్వేషించవచ్చు. ‘బ్రిక్స్’కు విస్తృత భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత అధ్యక్ష హోదాలో ‘బ్రిక్స్’ కూటమి నాయకుల 18వ శిఖరాగ్ర సమావేశాలకు మనమే ఆతిథేయిగా ఉన్నాం. ‘స్థితిస్థాపకత, నవీ కరణ, సహకారం, సుస్థిరత’లను ప్రధాన భావనగా చేసుకుని ఈ సమావేశాలు సెప్టెంబర్ 12–13 తేదీలలో జరుగనున్నాయి. రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఢిల్లీ సదస్సుకు జిన్‌పింగ్ హాజరవుతారని బీజింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, భారత్ ‘విజయవంతంగా’ ‘బ్రిక్స్’ సమావేశాలు నిర్వహించేందుకు అండగా ఉంటామని చైనా చెబుతోంది. బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ హాజరవబోవడం లేదని బీజింగ్ 2025 మొదట్లోనే ప్రక టించేసింది. ఇది నిష్క్రియాపరత్వం కాదు. ఆచితూచి వ్యవహరించే ధోరణి. హాజరయ్యే అంశాన్ని నాన్చడం వల్ల సరిహద్దు పునర్విభజన, వాణిజ్యం అంశాలపై బేరసారాలాడేందుకు బీజింగ్‌కు అవకాశం చిక్కుతుంది.పాతుకుపోయిన అపనమ్మకంబీజింగ్ రెండు నాల్కల ధోరణి ఢిల్లీని కలవరపరుస్తోంది. అది ఒక పక్క, ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక, దీర్ఘకాలికదృక్పథం’తో చూస్తున్నామని చెబుతోంది. మరోపక్క, అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి కొత్త మ్యాప్‌లు విడుదల చేస్తోంది. వాస్తవాధీన రేఖపై అస్పష్టతను కొనసాగిస్తోంది. ఉగ్ర జాబితాలో చేర్చే విషయంలో ఐక్యరాజ్య సమితిలో మనకు అడ్డంపడుతోంది.ఢిల్లీ కూడా రెండు మార్గాల వైఖరిని కనబరుస్తోందని బీజింగ్ భావిస్తోంది. ‘క్వాడ్’ (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా)తో సంబంధాలు బలపరచుకోవాలని చూస్తోంది. భారత్‌లో చైనాసంస్థల పెట్టుబడుల విషయంలో సవాలక్ష నిబంధనలనుముందుకు తెస్తోంది. భారత్ ఇలా సంశయించడానికి ఆర్థికఅంశాలు కారణమవుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధాని అయినపుడు 2003–04లో భారత్–చైనా వాణిజ్య లోటు కేవలం 1.1 బిలియన్ డాలర్లు. మొత్తం వాణిజ్యం 14 బిలియన్ డాలర్లకన్నా తక్కువే. చైనా 2008 నాటికి భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారుగా 38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అది 2023–24 నాటికి 118.4 బిలియన్ డాలర్లను మించిపోయింది. 2024–25 నాటికి 127.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనాతో వాణిజ్యం మాదిరిగానే దాని నుంచి దిగుమతులు కూడా మనకు ఎక్కువ అవుతున్నాయి. ఈ వాణిజ్య లోటు 2003–04లో 1 బిలియన్ డాలర్లుగా ఉండేది. అది 2023–24 నాటికి 85.07 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 17% పెరుగుదలను కనబరుస్తూ 2024–25లో 99.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశపు మొత్తం వాణిజ్య అసమతుల్యతలో చైనా వాటాయే ఇపుడు 35%. చైనా నుంచి మరో పెద్ద అలను తట్టుకోగల స్థితిలో భారత్ లేదు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 245% ఉన్నాయి. దాంతో చైనా వస్తువులు మన దేశంలోకి మరింతగా వచ్చిపడే ప్రమాదం ఉంది. పైగా, అమెరికాతో వాణిజ్యాన్ని పెంపొందించుకుని, దాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ఢిల్లీ–వాషింగ్టన్ మధ్య చర్చలు సాగుతున్నాయి. భారత్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. కనుక, ఎంతో యుక్తిని ప్రదర్శించవలసి ఉంటుంది. షాంఘై సంస్థలో సరిహద్దు, భద్రతా సమస్యలను లేవనెత్తాలి. ప్రపంచ బడుగు దేశాల వేదికగా ‘బ్రిక్స్’ను సజీవంగా ఉంచాలి. అదే సమయంలో, ఆర్థిక సంబంధాలు తెగి పోకుండా చూసుకోవాలి. ట్రంప్ 2026లో సృష్టించిన సంక్షోభం భారత్–చైనాలను ఎడమొహం పెడమొహం కాకుండా చేస్తోంది. అందుకనే, భారత్–చైనా ముంగిట ‘చారిత్రక అవకాశం’ ఉందని డోభాల్ వ్యాఖ్యానించారు. ఇతర విషయాల్లో ప్రగతిని సాధించే ముందు ‘సరిహద్దు సమస్యను సరైన విధంగా పరిష్కరించుకునేందుకు’ భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యి కూడా గత ఏడాదిగా రెండు పక్షాలు ‘క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపేందుకు కృషి చేశాయి. మంచి ప్రగతిని కనబరి చాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రగతిని కనబరిచాయి అన్నారేగానీ, పురోగతి అనే పదాన్ని ఉపయోగించలేదు. సంపూర్ణ నమ్మకం లేక పోవడం వల్లనే పదాలను ఆచితూచి ప్రయోగిస్తున్నారు. రెండు దేశాలు ఘర్షణను కోరుకోవడం లేదు. గొప్పగా బేర సారాలు సాగించాలనే కోరిక ఇరువైపులా లేదు. పోటీని కొనసా గిస్తూ రావడమే ప్రస్తుతానికి చేయగలిగిన పని. రక్షణను చూసుకుంటూనే మిగిలిన పనులను చక్కబెట్టుకోవడం. ఇదీ భారత్–చైనా మధ్య సంబంధాల ప్రస్తుత స్థితి. రెండూ పరస్పర మిత్రదేశాలు కాదు. శత్రువులూ కాదు. ఒకరిని చూసి ఒకరు శాశ్వతంగా జంకే శక్తిమంతమైన దేశాలు. తదుపరి సంక్షోభం సంభవించకుండా నివారించడానికి చర్చలు జరుపుతూ ఉంటాయి. -వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు;‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్’-సి. ఉదయ్ భాస్కర్ -
నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?
హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఫ్లాష్‌ఫ్లడ్స్ గురించి సమాచారం ఉన్నప్పటికీ చైనా తమను హెచ్చరించలేదని నేపాల్ ఆరోపించింది. అయితే చైనా మాత్రం ఆ ఆరోపల్ని ఖండించింది. ఇలాంటి సమయంలో ఆరోపణలు కాదని.. ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉండాలని సూచించింది. దీంతో చైనా చెబుతున్న సహకార నీతుల నేపథ్యంలో గతంలో అదే గడ్డపై జరిగిన అతిపెద్ద డ్యామ్ విపత్తు మరోసారి చర్చకు వచ్చింది.బుధవారం నేపాల్‌లోని పలు జిల్లాలను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు.. ఊర్లకు ఊళ్లే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. టిబెట్ సరిహద్దులోని చైనా రీజియన్‌లో మంచు ఫలకాలు కూలిపోవడం వల్ల భారీగా నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చిందని ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణాలపై కూడా నేపాల్‌లోని కొందరు నిపుణులు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు, హిమ సరస్సులు, కొండచరియలు, భారీ వర్షాలు, నదీ ప్రవాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండటం దిగువ దేశాలకు అత్యంత కీలకం. టిబెట్‌లో చోటుచేసుకునే ప్రకృతి పరిణామాలు నేపాల్‌లోని నదులపై తక్కువ సమయంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో నేపాల్ ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.చైనా చరిత్రలో మాయని మచ్చనేపాల్ ఆరోపణల నేపథ్యంలో.. 1975లో చైనాలో జరిగిన బాన్కియావో డ్యామ్(Banqiao Tragedy) విపత్తు మళ్లీ గుర్తుకొస్తోంది. హెనాన్ ప్రావిన్స్‌లోని రు నదిపై నిర్మించిన బాన్కియావో డ్యామ్‌ను వరద నియంత్రణ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే డ్యామ్, గేట్లలో పగుళ్లు కనిపించడంతో సోవియట్ ఇంజినీర్ల సాయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ‘ఐరన్ డ్యామ్’గా పేరుపొందింది.కానీ 1975 ఆగస్టులో టైఫూన్ నినా కారణంగా హెనాన్‌లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం మూడే రోజుల్లో.. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం రికార్డైంది. దీంతో బాన్కియావో రిజర్వాయర్‌లోకి తీవ్ర ఉధృతిలో నీరు వచ్చి చేరింది. అయితే అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.ఒక రాత్రిలో 62 డ్యామ్‌లు!1975 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బాన్కియావో డ్యామ్ తెగిపోయింది. భారీగా నీరు దిగువ ప్రాంతాలపైకి దూసుకొచ్చింది. బాన్కియావోకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమాంటన్ డ్యామ్ కూడా దెబ్బతింది. అనంతరం వరుసగా అనేక చిన్న రిజర్వాయర్లు, డ్యామ్‌లు నాశనం అవుతూ వచ్చాయి. వాటిలో కొన్నింటిని వరద నీటి మల్లింపు కోసం కావాలనే ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా మొత్తం 62 దాకా డ్యామ్‌లు నాశనం అయినట్లు తర్వాత వివిధ నివేదికలతో వెలుగులోకి వచ్చింది. 2 లక్షల మందికిపైనే..ఈ విపత్తులో మృతుల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఆ టైంలో చైనా మీడియా తీవ్రమైన గోప్యత ప్రదర్శించింది. అయితే వరదల కారణంగా 26 వేల మంది మరణించినట్లు 2017లో ప్రిన్స్టన్, సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. కరువు, ఆకలి, అంటువ్యాధుల కారణంగా మరో లక్ష మందికి పైగా మరణించి ఉండొచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది.అయితే మరికొన్ని అంచనాలు మాత్రం ఆ మరణాల సంఖ్య 2.3 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సంఖ్యను కొందరు చైనా నిపుణులు అంచనా వేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు ప్రస్తావించాయి. మరణాల సంఖ్యను పక్కన పెడితే.. దాదాపు కోటి మంది ఈ విపత్తు ప్రభావానికి గురైనట్లు అంచనాలు ఉన్నాయి.సమాచారం ఇవ్వక.. విషాదాన్ని దాచి!బాన్కియావో విషాదంలో చైనాపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. హెచ్చరికలు సరిగా చేరకపోవడం, అధికారుల నిర్ణయాల్లో జాప్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం కూడా విపత్తు తీవ్రతను పెంచినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి. అటుపై ఈ విపత్తు పూర్తి స్థాయిని ప్రపంచానికి వెల్లడించలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో డ్యామ్‌ల వైఫల్యం, ప్రాణనష్టం, సహాయక చర్యల దుస్థితి వంటి అంశాలు విస్తృతంగా బయటకు రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ప్రస్తుతం నేపాల్–టిబెట్ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు ఈ పాత ఘటనతో ఈ పాతగాయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నైతిక పాఠాలు చెప్పే చైనా.. తన పౌరుల భద్రతతో పాటు పొరుగు దేశాల ప్రజల ప్రాణాల విషయంలోనూ అదే పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు.. అలాంటి సమయంలో సమాచారం దాచడం కంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, సహకారంతో వ్యవహరించడమే నిజమైన మానవత్వం. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడమే ప్రతి దేశం ముందున్న అసలైన బాధ్యత.ఇదీ చదవండి: ఇరాన్ కళ్లుగప్పి అమెరికా అంత పని చేసిందా? -
చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్
బీజింగ్: వరుస ప్రకృతి విలయాలు ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో జలవిలయం మరువక ముందే.. చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో చైనా నేపాల్‌ను అప్రమత్తం చేసింది. నేపాల్-టిబెట్ సరిహద్దులో మరో భారీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. తాజా పరిణామం మరింత వణుకు పుట్టిస్తోంది.సిచువాన్ ప్రావిన్స్ లాంగ్చాంగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. లాంగ్చాంగ్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.గత రాత్రి నేపాల్, టిబెట్లు కూడా భూకంపంతో వణికిపోయాయి. ఆకస్మిక వరదల తర్వాత మరోసారి ఏ ముప్పు ముంచుకొస్తుందేమోనని వణికిపోయిన ప్రజలు రాత్రంతా నడి రోడ్లపైనే గడిపారు. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం గ్లేసియర్ కూలిపోవడంతోనే సిచువాన్ ప్రావిన్స్ భూకంపం సంభవించిందని.. బారియర్ సర్సు తెగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటు భూకంపం నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఏ క్షణంలోనైనా వరద విరుచుకుపడొచ్చని నేపాల్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఇక టిబెట్ సరిహద్దులో వరద సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచింది. మరో వరద ముంచుకొస్తున్న నేపథ్యంలోనే రెస్క్యూ నిలిపివేసినట్లు వెల్లడించింది. గైరాంగ్ పోర్ట్ వద్ద వరద ప్రవాహాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మరో జల ప్రళయం ముప్పు నేపథ్యంలో నేపాల్ కూడా అప్రమత్తమైంది. రుసువా, నువాకోట్‌లకు తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో.. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికాసేపట్లో భారీ వరద దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మొన్నటి వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా వరద ముంచెత్తుతుందన్న పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోతున్నారు.ఇదీ చదవండి: యుగాంతాన్ని తలపించేలా నేపాల్‌కు మరో ముప్పు! -
నేపాల్‌లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పు
మరో వరద ముప్పు పొంచి ఉండడంతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. కాసేపట్లో.. మొన్న సంభవించిన ఆకస్మిక వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో ఆ వరద నేపాల్‌ను ముంచెత్తబోతుందనే సమాచారం అందుతోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి.. ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రాణభయంతో నదీ తీర ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. నేపాల్‌కు మరో భారీ జల ప్రళయ ముప్పు పొంచి ఉంది. గ్లేసియర్లు బద్ధలు కావడం.. చైనా సరిహద్దులో బారియర్ సరస్సు తెగిపోవడంతో వరద ఉధృతంగా దూసుకొస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని చెబుతున్నారు. ఇటు వరద ముప్పు నేపథ్యంలో ఇటు చైనా కూడా టిబెట్‌లో సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. గైరాంగ్ పోర్టు వద్ద ప్రవాహాన్ని అధికారులు గమనిస్తున్నారు.టిబెట్‌లోని గైరాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన సరస్సు కట్ట తెగిపోవడంతో నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నేపాల్ భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి. దీంతో గంటన్నర పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. టిబెట్‌లోనూ వరద ప్రమాదం కారణంగా చైనా రెస్క్యూ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని కిలోమీటరు మేర వెనక్కి రప్పించింది. రెండు రోజుల క్రితం మట్టి, శిథిలాల ప్రవాహంతో ఏర్పడిన ఈ బారియర్ సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరిన్ని వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.ఏ క్షణమైనా నేపాల్‌ను వరదలు ముంచెత్తనున్నాయని పోలీసుల హెచ్చరికలతో నేపాల్ ప్రజలు పరుగులు తీస్తున్నారు. క్షణక్షణానికి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. బారియర్ సరస్సు వరద విరుచుకుపడితే.. రుసువా, నువాకోట్‌కు తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.Alert !! pic.twitter.com/grYxhc5N7Q— Nepal Police (@NepalPoliceHQ) August 28, 2026బిహార్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్నేపాల్ వరద హెచ్చరికల నేపథ్యంలో ఇటు సరిహద్దు గ్రామాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. భారత్‌లోని బిహార్‌లో గండకీ నది బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్-బిహార్ బోర్డర్లో గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. అక్కడ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఇదీ చదవండి: చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్బుధవారం ఉదయం ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడడంతో నేపాల్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 500 మృతదేహాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సుమారు 1500 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. ఈసారి ఐదు రెట్ల వరద వస్తుందన్న హెచ్చరికలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
నేపాల్-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
వరదలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని మరో ప్రకృతి ముప్పు వణికించింది. రెండు చోట్లా గురువారం రాత్రి భూకంపం సంభవించింది. నేపాల్‌లో రిక్టర్‌స్కేల్‌పై 3.2 తీవ్రతతో.. టిబెట్‌లో 5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఖాట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో నమోదు అయ్యింది. అదే సమయంలో బారియర్ సరస్సు కట్టలు తెంచుకుని విరుచుకుపడొచ్చని చైనా హెచ్చరికలు నేపాల్‌ను మరింత వణికిస్తున్నాయి.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ప్రకృతి విలయంలో ప్రాణనష్టం 500కి చేరింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నేపాల్, టిబెట్ రెండు చోట్లా కలిపి 1500 మంది గల్లంతయ్యారు. ఇందులో 33 దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు ఉండగా.. అత్యధికంగా భారతీయులే 300 మంది ఉన్నట్లు సమాచారం. వాళ్లలో అత్యధికంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. టెలికాం వ్యవస్థలు నాశనం కావడంతో చాలామంది జాడ తెలియక ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తెగిపోయిన రహదారులు, కొట్టుకుపోయిన వంతెనలు, భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక బృందాలకు బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. తాజా విషాదానికి కారణం భూకంపం కాదని.. హిమనదం కూలిపోవడంతో భారీ మంచు–రాళ్ల ప్రవాహం ఏర్పడి ఆకస్మిక వరదలకు(ప్లాష్ఫ్లడ్స్) దారితీసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తేల్చిచెప్పింది. మరో వరద ముప్పునేపాల్ ఆకస్మిక వరదల విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్తగా ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకరంగా మారింది. భోటే కోషి నదీ వ్యవస్థకు సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. సహజంగా ఏర్పడిన అడ్డంకి తెగిపోతే భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భోటే కోషి, త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి.భారతీయుల ఆచూకీ లేదుఈ విపత్తుతో భారత్‌లోనూ ఆందోళన నెలకొంది. సుమారు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది ఉన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్ ప్రభుత్వంతో కలిసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భారతీయుల్లో 84 మందిని రక్షించినట్లు సమాచారం. మరోవైపు టిబెట్ వైపున కూడా సుమారు 200 మంది భారతీయులు తరలింపు కోసం సహాయం కోరినట్లు సమాచారం. వీరిలో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారు కూడా ఉన్నారు. విపత్తు కారణంగా యాత్రికుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు.ఎటు చూసినా బురద.. వరదల ధాటికి సెకన్ల వ్యవధిలో రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికాం వ్యవస్థలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులకూ భారీ నష్టం వాటిల్లింది. నేపాల్ పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, భూతల బృందాలతో గాలింపు చేపడుతున్నాయి. నదీ తీరాలు, బురదలో కూరుకుపోయిన ప్రాంతాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాల్లో గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమైనా.. తాజా భౌగోళిక విశ్లేషణలు మరో విషయాన్ని వెల్లడించాయి. హిమనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి కిందికి జారిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, మట్టి, శిథిలాలు దిగువకు దూసుకెళ్లి ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సులు, కొండచరియలు మరోసారి విరిగిపడే అవకాశం ఉండటంతో విపత్తు ఇంకా ముగియలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. This is apocalyptic 👀What really caused these Nepal floods? Could it have been prevented from happening? pic.twitter.com/UPPDcutom5— Dr. Chika (@chikaehiemere) August 27, 2026ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కళ్ల ముందే సర్వనాశనం! -
ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ చైనా బ్యాంకులేనా?
ఇరాన్‌తో సంబంధాలున్నాయనే కారణంతో.. చైనా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం ఆంక్షలకు సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. టెహ్రాన్‌ను ఏకాకిని చేసేందుకు, వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అనే చెప్పాలి.ఇరాన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా ఇప్పటికే ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ వారం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని ప్రకటించారు. ముఖ్యంగా.. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పెంచుతోంది. దీంతో ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.చైనా ఎందుకు టార్గెట్?ఇరాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ముఖ్యంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా కీలకంగా ఉంది. ఇరు దేశాల మధ్య చమురు, ఇతర వస్తువుల వ్యాపారానికి సంబంధించిన చెల్లింపుల్లో చైనా బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అమెరికా నిజంగానే చైనా బ్యాంకులపై ఆంక్షలు విధిస్తే.. అది కేవలం ఇరాన్‌పైనే కాకుండా అమెరికా-చైనా సంబంధాలు, ప్రపంచ చమురు మార్కెట్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటివరకు అమెరికా.. పెద్ద చైనా బ్యాంకులపై ఇరాన్‌కు సంబంధించి ఆంక్షలు విధించలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి సహాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్‌లోని కొన్ని కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంది. మరోవైపు అమెరికా విధించే సెకండరీ ఆంక్షలను చైనా చట్టవిరుద్ధమైనవిగా వ్యతిరేకిస్తోంది. దీంతో చైనా బ్యాంకులపై అమెరికా తదుపరి చర్యలు తీసుకుంటే.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
మూడో ప్రపంచ యుద్ధ ముప్పున్నదా?
ఒకవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండగానే అనూహ్యంగా కొత్త సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో శాంతి ఎండమావిగా తోస్తున్నది. ఇజ్రాయెల్ అనూహ్యంగా సిరియాను, తద్వారా టర్కీని కూడా యుద్ధంలోనికి లాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక దాడికి దిగిన ట్రంప్ సరికొత్తగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం పల్లవి అందుకున్నాడు. ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ విధానం అమలైతే తీవ్రంగా నష్టపోయేది చైనా. ఇరాన్ చమురులో 90 శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. ఈ రకంగా ఇరాన్ యుద్ధంలోనికి ప్రత్యక్షంగా చైనాను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతున్నది. మరొకవైపు ఇజ్రాయెల్ ప్రధాని, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పల్లవిని అందుకున్నాడు. ఇంకొకవైపు సౌదీ– పాకిస్తాన్–టర్కీ ‘మక్కా ఒప్పందం’తో నాటో తరహా సైనిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని మక్కా ఒప్పందంలోనికి చేరటానికి సంకేతాలివ్వటం భారత్‌ను ఒత్తిడిలోనికి నెట్టింది. వేగంగా మారుతున్న సమీకరణాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంవైపు తీసుకెళ్తున్నాయా అనే సందేహాన్ని కలిగించక మానవు.ప్రపంచ యుద్ధాల నేపథ్యంమొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపా రెండు రాజకీయ /సైనిక కూటములుగా చీలిపోయింది. బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ సవాలు చేసింది. పాన్ జర్మనిక్, పాన్ స్లావిక్, బాల్కన్ జాతీయవాద ధోరణులు బలంగా వ్యాపించి ఉన్నాయి. జూన్ 1914లో ఆస్ట్రియా– హంగరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంక్ ఫెర్డినాండ్ హత్యతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. కూటమి ధర్మంలో భాగంగా సెర్బియాకు మద్దతుగా రష్యా, ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో చేరాయి. జర్మన్ సైనికాధికారి ‘షెఫర్’ యుద్ధ తంత్రంలో భాగంగా తటస్థ దేశమైన బెల్జియంపై దాడి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా యుద్ధం ఐరోపా మొత్తం విస్తరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుదిరిన వెర్సెయిల్స్ ఒప్పందంలో భాగంగా జర్మనీపై విధించిన యుద్ధనష్ట పరిహారం, ఇతర అంశాలను అమలు చేసే యంత్రాంగం లేకపోవడం, ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్), పునరుత్థానం చెందుతున్న జర్మనీ/ జపాన్ వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి సరి హద్దుల వ్యాప్తి (లెబెన్స్రామ్), లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఫాసిజం, కమ్యూనిజం, లిబరల్ డెమోక్రసీ వంటి సిద్ధాంతాల వైరుధ్యం అగ్నికి ఆజ్యంపోశాయి.ఈ సందర్భంలో ‘తూసిడైడీస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని చర్చించు కోవాలి. ప్రాచీన చరిత్రకారుడైన తూసిడైడీస్... ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల ప్రస్తుత రాజకీయ శక్తిలో సందేహాన్ని, భయాన్ని కలిగించినప్పుడు... ఇరు శక్తులు ఆయుధ సమీకరణ చేస్తాయనీ, అప్పుడు యుద్ధం అనివార్యమనీ సిద్ధాంతీకరించాడు. ప్రాచీన గ్రీక్ ప్రాంతంలో ఏథెన్స్ ఎదుగుదల స్పార్టాలో భయానికి కారణమై యుద్ధానికి దారితీసింది. 2017లో రాజకీయ శాస్త్రజ్ఞుడు గ్రాహమ్ ఆలిసన్ తన ‘డెస్టైన్డ్ ఫర్ వార్: కెన్ అమెరికా అండ్ చైనా ఎస్కేప్ తూసిడైడీస్స్ ట్రాప్?’ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా పరిశీ లించాడు. గత 500 ఏళ్ల చరిత్రలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన 16 సందర్భాల్లో 12 సార్లు యుద్ధం జరిగిందని పేర్కొన్నాడు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?1914, 1939 సంవత్సరాలలో మాదిరిగానే ఇప్పుడూ ఒక కొత్త రాజకీయ శక్తి చైనా ప్రపంచ ఆధిపత్య రేసులోనికి వచ్చింది. ట్రంప్ ట్యారిఫ్ వార్‌లో చైనా, అమెరికాపై ప్రతిసుంకాలను విధించింది. ఇటీవల ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని జిన్‌పింగ్ హెచ్చరించాడు. సెమికండక్టర్స్, చిప్స్, కృత్రిమ మేధ, క్రిటికల్ మినరల్స్ రంగాలలో అమెరికాకు, ఐరోపాకు చైనా నేరుగా సవాలు విసిరింది. 2020 నుండి రష్యా తిరిగి బలం పుంజుకొని నాటో ఆధిప త్యాన్ని సవాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐక్యరాజ్యసమితి బలహీనపడటంతో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిలువరించే వ్యవస్థలు లేవు. కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, గల్ఫ్ యుద్ధం, వాతావరణ మార్పుల వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధరంగంలోనికి అణ్వస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాన రాజకీయ శక్తులన్నీ అణ్వస్త్ర దేశాలే. వీటిమధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవిస్తే, పరస్పర వినాశం అనివార్యం. అందువలన ఏ అణ్వస్త్ర దేశం ఇంకో అణ్వస్త్ర దేశంపైన దాడికి సాహసించే అవకాశం లేదు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. అందువలన మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏ రాజకీయ శక్తి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు స్పష్టమైన పరస్పర, వైరుధ్య శత్రు కూటములు కూడా లేవు. కొత్త కూటములుఅయితే కూటములు ఏర్పడే అవకాశాలూ కనపడుతున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా (క్రింక్) ఒక కొత్త సైనిక కూట మిగా ఏర్పడి నాటోను నేరుగా సవాలు చేయవచ్చు. మక్కా ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కొత్త సైనిక కూటమిగా ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వస్తుంది. బహుశా దీనికి విరుగు డుగా భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – ఇజ్రాయెల్ – జపాన్ కూటమి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్‌లో భాగంగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు లేదా, కనీసం జోర్డాన్ నది నుండి మద్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్ విస్తరణకు పూనుకుంటే గల్ఫ్ యుద్ధక్షేత్రం మరింత విస్తరిస్తుంది. ఇరాన్‌పై అమెరికా ఆర్థిక యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తే నష్టపోయే చైనా... ఇరాన్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలప వచ్చు. దీంతో ఇరాన్... ఐరోపా దేశాలపై దాడులు చేయవచ్చు. ఇదే అదనుగా రష్యా ఇతర ఐరోపా దేశాలపై (ముఖ్యంగా బాల్టిక్ దేశాలపై) దాడులు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవచ్చు. శత్రువును నిలువరించటానికి ఇదే అనువైన సమయంగా భావించి తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోవటానికి ఉపక్రమించవచ్చు. రష్యా, చైనాలకు మద్దతుగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి ప్రారంభించవచ్చు. ఇదే అదనుగా పాక్–చైనా కలిపి భారత్‌పై దాడి చేయవచ్చు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం... దేశాలను, భూభాగాలను ఆక్రమించుకోవటానికి కాకుండా శత్రుదేశాల సామర్థ్యాన్ని ధ్వంసం చేసే దిశగా ఉంటుంది. నగరాలు, పౌరులు లక్ష్యంగా ఉండదు. రేవుల దిగ్బంధనం, రవాణా మార్గాల దిగ్బంధనం, ఆర్థిక విధ్వంసం, సైబర్, అంతరిక్ష దాడులు, ప్రాక్సీ వార్ఫేర్ రూపంలో ఉండవచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
చైనా హెచ్చరిక.. పొంచి ఉన్న మరో ప్రమాదం!
మరో సరస్సుతోనూ ప్రమాదం పొంచి ఉందంటూ చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది. టిబెట్–నేపాల్ సరిహద్దులోని బ్యారియర్ సరస్సు 72 గంటల్లో పొంగిపొర్లే ప్రమాదం ఉందని చెబుతోంది. భారీ కొండచరియలు విరిగిపడటంతో టిబెట్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 558 మంది వరకు గల్లంతైనట్లు చైనా మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని బీజింగ్ అధికారులు మరో హెచ్చరికను జారీ చేశారు.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ సమీపంలో ల్హెండే నదిలోకి భారీగా మట్టి, రాళ్లు కొట్టుకురావడంతో ముగ్గురు మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటన కారణంగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో దిగువ ప్రాంతాల్లో ఈ వరదల కారణంగా 177 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. టిబెట్ వైపు ప్రమాద ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇద్దరు గ్రామస్థులను రక్షించారు.ఇదిలా ఉండగా.. మరో ప్రమాదాన్ని చైనా మీడియా గుర్తించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సుపై నిఘా పెంచింది. ఈ సరస్సు విపత్తు ప్రాంతానికి ఈశాన్య దిశలో, చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఉంది. గురువారం నాటికి ఈ బ్యారియర్ సరస్సులో సుమారు 20 లక్షల ఘన మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా. సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల ఘన మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.ఇదిలా ఉండగా.. సహాయక చర్యల కోసం చైనా బీజింగ్, చెంగ్డూ నుంచి అగ్నిమాపక, రెస్క్యూ బృందాలను పంపించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గ్యిరోంగ్ పట్టణంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించారు. అయితే పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు ఇంకా నిలిచిపోయినట్లు సీసీటీవీ తెలిపింది.ఇదీ చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్ -
చైనాకు తెలిసిన నేపాల్‌ను హెచ్చరించలేదా? చైనా పాపమే .. నేపాల్ కి శాపమా?
-
నేపాల్ ఫ్లాష్‌ఫ్లడ్స్.. ఆ ఆరోపణల్ని ఖండించిన చైనా
ఫ్లాష్ఫ్లడ్స్పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్‌లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.భూకంపం.. హిమపాతమే కారణం: చైనాఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్‌ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.175 మంది మృతి.. వందలాది మంది గల్లంతుహిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.నేపాల్ వైపు భిన్న వాదనలువర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్‌ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్‌కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్‌గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.మరోవైపు నేపాల్‌లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్‌లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026రంగంలోకి దిగిన చైనానేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్‌కే పెనుముప్పు? -
నేపాల్ ఎఫెక్ట్.. చైనాలోనూ జలప్రళయం.. క్షణాల్లో కొట్టుకుపోయిన భవనాలు
-
ముందే తెలిసినా చెప్పలేదా?.. చైనా అసలేం చేసింది?
నేపాల్‌లోని రసువాలో బుధవారం ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అయితే ఇంతటి విపత్తు సంభవించే అవకాశం గురించి నేపాల్, చైనా ప్రభుత్వాలకు ముందస్తు సమాచారం ఎందుకు అందలేదు? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణ, జలవనరుల సమాచారాన్ని పరస్పరం పంచుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ.. తాజా విపత్తుపై ఎలాంటి ముందస్తు హెచ్చరిక అందలేదని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ శాఖ వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.రసువాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర వరదలు రావడంతోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అప్పటికే వరద ఉధృతి భారీగా పెరిగి నదీ పరివాహక ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయి.BIG ALLEGATION ON CHINA | Nepal FloodsQuestions are being raised over whether Nepal received timely information about the flood situation from China.Nepali media reports, citing Chinese media, claim that flooding hit Tibet’s Kerung County around 10:30 AM local time, more than… pic.twitter.com/BywSpR5CtK— The Bharat Post (@TheBharatPost__) August 27, 2026అసలు వరదలకు కారణమేంటి?టిబెట్‌లో ఏదైనా హిమానీనదం, హిమనద సరస్సు లేదా నదీ వ్యవస్థలో ఆకస్మిక మార్పు జరిగితే.. దాని ప్రభావం నేపాల్‌పై పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగానే సమాచారం అందితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. కానీ తాజా ఘటనలో అలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో నష్టం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, నేపాల్ మధ్య వాతావరణ సంబంధిత సమాచారాన్ని పంచుకునేందుకు ఒక యంత్రాంగం ఉంది. కానీ ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ తాజా వరదలపై ముందస్తు సమాచారం రాలేదని నేపాల్ అధికారులు చెబుతున్నారు.ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య సమాచార మార్పిడిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. టిబెట్‌లో విపత్తుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే గుర్తించినా.. అవి నేపాల్‌కు చేరలేదా? లేక అక్కడ అలాంటి సమాచారం అందుబాటులో లేదా? అన్నది తేలాల్సి ఉంది. విపత్తు తర్వాత సమాచారం అందడం వల్ల ప్రయోజనం పరిమితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు.🔴 Les images en provenance du #Népal sont terrifiantes. Le séisme d’une magnitude de 4,4 qui s’est produit la nuit dernière au Tibet a déclenché des #avalanches de glace et des #glissements de terrain. Ils ont formé des embâcles sur les rivières de la région qui ont fini par… pic.twitter.com/XIdlQ76gii— Guillaume Woznica (@GWoznica) August 26, 2026ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి..భోటేకోశి నది వరదల అనంతరం రూపొందించిన నివేదికలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. చైనా-నేపాల్ సరిహద్దుల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అంతర్గత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హిమానీనదాలు, హిమనద సరస్సులు, నదుల్లో ఆకస్మిక మార్పులను ముందుగానే గుర్తించి సమాచారం అందించే వ్యవస్థ ఉంటే.. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.చైనాతో అధికారిక ఒప్పందం అవసరమా?విపత్తు నిర్వహణ రంగ నిపుణులు చైనా, నేపాల్ ప్రభుత్వాలు ఈ అంశంపై అధికారికంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదలు, హిమానీనదాల విస్ఫోటనాలు, ఇతర ప్రకృతి విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పరస్పరం పంచుకునేలా ప్రత్యేక అవగాహన ఒప్పందం (MOU) చేసుకోవాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. టిబెట్ వైపు జరిగే పరిణామాలను నిరంతరం గమనించాలని నిపుణులు అంటున్నారు. టిబెట్‌లో జరిగే ఏ చిన్న మార్పు అయినా నేపాల్‌లోని నదులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు సమాచారం అత్యంత కీలకమని చెబుతున్నారు.చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్చైనా అధ్యక్షుడు, ప్రధాని స్పందననేపాల్ విపత్తు జరిగిన కొన్ని గంటలకే చైనా ప్రభుత్వం కూడా స్పందించింది. టిబెట్‌లో పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఆదేశించినట్లు ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. అలాగే వరద నియంత్రణ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని విభాగాలు, సంబంధిత సంస్థలు హై అలర్ట్‌లో ఉండాలని, ప్రమాదాలను గుర్తించి వాటిని పరిష్కరించే చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది.ఆలస్యమైన సమాచారం.. పెరిగిన నష్టం?నేపాల్ నిపుణుల ప్రధాన ఆందోళన ఇదే. విపత్తు జరిగిన తర్వాత సమాచారం అందడం కాదు.. విపత్తు రాకముందే సమాచారం అందాలి. ముఖ్యంగా చైనా-నేపాల్ సరిహద్దుల్లోని హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులు అత్యంత ప్రమాదకర ప్రాంతాలు కావడంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. అందుకే తాజా వరదలు కేవలం ప్రకృతి విపత్తుగానే కాకుండా.. చైనా-నేపాల్ మధ్య సరిహద్దు సమాచార మార్పిడి వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన ఘటనగా నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా రెండు దేశాలు ఎంత త్వరగా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం మరోసారి భయాందోళనలు రేపుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమపాతం ఘటనలు అక్కడి భౌగోళిక సున్నితత్వాన్ని(ఎక్కువ భూకంపాల ముప్పు) ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ విపత్తు నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు మెడోగ్ డ్యామ్‌పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కొందరు నిపుణులు ‘వాటర్ బాంబ్’గా అభివర్ణిస్తుంటారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా దీనిని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండడం మొదటి నుంచే ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణం భవిష్యత్తులో భారత్ ఈశాన్య ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.నేపాల్ వరదలతో పెరిగిన ఆందోళనఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 160 మంది మరణించారు. వందల మంది జలప్రళయంలో గల్లంతు అయ్యారు. తొలుత భూకంపం ధాటికి వరదలు ముంచెత్తాయని నిపుణులు భావించినా.. మంచు ఫలకాలు విరిగిపడటం వల్ల భారీగా నీరు నదుల్లోకి చేరి వరద పోటెత్తిందని ఓ అంచనాకు వచ్చారు. ఆ రీజియన్లలో ఆనకట్టలు ఎక్కువగా ఉండడం కూడా ఈ విపత్తునకు మరో ప్రధాన కారణంగా మారింది.ఇక హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటి. చిన్న స్థాయి భౌగోళిక మార్పులు కూడా భారీ ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాలపై ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.చైనా మెగా డ్యామ్ ఇదే..చైనా టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇదే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్‌ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.భూకంప జోన్లో భారీ నిర్మాణంమెడోగ్ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్ లైన్లు ఉన్నట్లు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్ నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత్‌కే ఎందుకు ముప్పు?యార్లంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతంలో భారత్ ఉండటమే ప్రధాన కారణం. టిబెట్‌లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే.. భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు.‘ఈశాన్యంపై కన్నేసిన నీటి ఆయుధం’?వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు. నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ దీనిని చూడాల్సి ఉందని అంటున్నారు. చైనా చేతుల్లో బ్రహ్మపుత్ర ఎగువ ప్రవాహ నియంత్రణ ఉండటం భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధి లక్ష్యాలతోనే చేపడుతున్నట్లు చెబుతోంది.భారత్ వ్యూహం సిద్ధంచైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ కూడా నీటి భద్రతపై దృష్టి పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై సుమారు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో బహుళ ప్రయోజన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి లక్ష్యాలను సాధించాలని భారత్ భావిస్తోంది.భారత్, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు అత్యంత అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భవిష్యత్తు ఎలా?ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం.. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా? లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి. నేపాల్-టిబెట్ ప్లాష్ఫ్లడ్లు సంభవించిన వేళ చైనా ‘బ్రహ్మరాక్షసి’ మెగా డ్యామ్.. భారత్‌కు ‘వాటర్ బాంబ్’ ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.ఇది చదవండి: భూకంపం కాదు.. నేపాల్ వరదలపై అమెరికా సంచలన ప్రకటన -
నేపాల్‌లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు
టిబెట్: పవిత్ర మానస సరోవర్ యాత్ర నిమిత్తం నేపాల్ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులంతా దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన ఈ యాత్రికులందరూ ప్రాణాపాయం లేకుండా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.అయితే, నేపాల్ ప్రకృతి ప్రకోపానికి సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో రాజధాని కాఠ్మాండ్కు చేరుకోవడంలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు యాత్రికుల వీసాలన్నీ ట్రావెల్ ఏజెన్సీల వద్దే ఉండిపోవడంతో స్వస్థలాలకు తిరిగి రావడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈ యాత్రికులంతా సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు స్వల్ప ఆందోళనకు గురవుతున్నప్పటికీ, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు, ట్రావెల్ ఆపరేటర్లు ధృవీకరించారు. యాత్రికులను త్వరగా సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర ప్రాంతం వద్దే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం ఉంది. ఈ యాత్రకు సాధారణంగా భారత్ లేదా నేపాల్ మీదుగా టిబెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నుంచి రోడ్డు లేదా వాయు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. -
సంచలనం.. అమెరికాలో భారీ సైబర్ దాడుల కుట్ర భగ్నం
అమెరికాలో భారీ సైబర్ దాడి కలకలం రేపింది. ఆ దేశపు అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలపై హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. సెనెట్‌తో పాటు న్యాయశాఖ, అంతరిక్ష సంస్థ నాసా, ఫెడరల్ రిజర్వ్ లాంటి కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ ఆపరేషన్‌ను అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించింది.అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యూస్కాన్(QScan), క్యూటీరూటర్( QTRouter) అనే రెండు హ్యాకింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన డొమైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ వేదికల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. అయితే డాటా సురక్షితమేనా?.. కీలక సమాచారం ఏదైనా బయటకు పొక్కిందా? అనే వివరాలను మాత్రం ధృవీకరించలేదు.చైనా హ్యాకర్లపై ఆరోపణలుఈ సైబర్ దాడుల వెనుక చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ ఉందని అమెరికా ఆరోపించింది. చైనాకు చెందిన నాన్జింగ్ జిన్జియువీ నెట్వర్క్ టెక్నాలజీ కంపెనీ నిర్వహించిన ఈ వ్యవస్థలను చైనా గూఢచార సంస్థలు, సైన్యానికి సంబంధించిన వర్గాలు ఉపయోగించినట్లు అమెరికా దర్యాప్తు పత్రాల్లో పేర్కొంది. 2018 నుంచే దాడుల ప్రయత్నాలు?ఈ హ్యాకింగ్ కార్యకలాపాలు 2018 నుంచే కొనసాగుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. కీలక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ నెట్‌వర్క్‌లు, అంతర్జాతీయ సంస్థల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు. 2019లో నాసా నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం జరిగినా.. అది విఫలమైందని అధికారులు తెలిపారు. 2024లో ఎనర్జీ డిపార్ట్మెంట్ ల్యాబ్‌లు, ఆరోగ్య శాఖకు చెందిన సంస్థలు, ఇతర సున్నితమైన నెట్‌వర్క్‌లపై చొరబాట్లు జరిగినట్లు వెల్లడించారు. డాటా చోరీపై ఆందోళనసైబర్ దాడితో అమెరికా రక్షణ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం దొంగిలించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సైబర్ భద్రతా సంస్థలు తెలిపాయి. సెనెట్, ఆసుపత్రి నెట్‌వర్క్‌లను కూడా హ్యాకర్లు పరిశీలించినట్లు దర్యాప్తులో తేలింది. చైనా రియాక్షన్అమెరికా ఆరోపణలపై చైనా స్పందిస్తూ.. సైబర్ దాడులను తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. సైబర్ భద్రత అంశాలను ఉపయోగించుకుని చైనాను అపఖ్యాతి పాలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే తాజా నివేదికలపై మాత్రం డ్రాగన్ దేశం స్పందించాల్సి ఉంది. సైబర్ యుద్ధం ఇలా..అమెరికా-చైనా మధ్య ఇప్పటికే వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైబర్ నిపుణుల ప్రకారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పనిచేసే హ్యాకింగ్ నెట్‌వర్క్‌లు ప్రపంచవ్యాప్తంగా కీలక సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఆ మధ్య ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్తగా అమెరికా భద్రతా బలగాలు వ్యవహరించాయి. తాజాగా జరిగిన సైబర్ దాడుల వ్యవహారం రెండు దేశాల మధ్య డిజిటల్ భద్రతపై కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కళ్లెదుటే కల్లోలం.. ఈ షాకింగ్ దృశ్యాలు చూశారా? -
BIG BREAKING: సెప్టెంబరు15 నుండి లాక్ డౌన్!
-
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
మనిషి శరీరాన్ని పోలిన యంత్రుడు మరమనిషి. కానీ మనిషికి సాధ్యమైన పనులను మరింత వేగంగా, కచ్చితంగా చేయగలిగే శక్తి!. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. మనిషి, యంత్రం మధ్య ఉన్న తేడాను రోజురోజుకూ తగ్గిస్తోంది. ఈ మార్పునకు తాజా ఉదాహరణే ‘టియాన్గాంగ్ అల్ట్రా’.చైనా మరోసారి సాంకేతిక ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈసారి కారణం కారు కాదు, క్షిపణి కాదు.. ‘టియాన్గాంగ్’ (Tiangong) అనే హ్యూమనాయిడ్ రోబోట్. మనిషిలా రెండు కాళ్లపై నడవడం, చకచకా మెట్లు ఎక్కడం, ఎత్తుపల్లాలపై బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడం, పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలతో ఈ రోబోట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణలో టియాన్గాంగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.జస్ట్ 8.86 సెకన్లలోనే..బీజింగ్‌లో జరుగుతున్న 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌లో.. 16 దేశాలకు చెందిన సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఇందులో టియాన్గాంగ్ అల్ట్రా తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల పరుగును కేవలం 8.86 సెకన్లలో పూర్తి చేసింది. ఇంతకు ముందు ఇదే రోబోట్ 9.39 సెకన్లతో ఉసేన్ బోల్డ్ రికార్డును అధిగమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టియాన్గాంగ్ కేవలం నడిచే రోబోట్ కాదు. పరుగులో వేగాన్ని పెంచుకుంటూనే తన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం, అడుగుల్లో చిన్న మార్పులు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా కదలికలను సరిచేసుకోవడం దీని ప్రత్యేకత. అలా బాక్సింగ్ సహా పలు కేటగిరీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.అసలు టియాన్గాంగ్ అంటే?టియాన్గాంగ్ అనే చైనీస్ పదానికి స్వర్గ భవనం అని అర్థం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలిన పూర్తి పరిమాణ హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. బ్రెయిన్‌ను బట్టి మనిషి శరీరం ముందుకు నడుస్తుంది. ఇదే టియాన్గాంగ్ విషయంలో ఆ పనిని సెన్సర్లు, కంప్యూటింగ్ వ్యవస్థ, కృత్రిమ మేధ(AI) చేస్తాయి. చుట్టూ ఉన్న వస్తువులు, అడ్డంకులు, నేల పరిస్థితులను గుర్తించి.. వాటికి అనుగుణంగా తన కదలికలను మార్చుకుంటుంది.కళ్లుగా కెమెరాలు.. చెవులే సెన్సర్లుటియాన్గాంగ్కు మనిషిలా కళ్లూ, చెవులూ ఉండవు కదా! వాటి పనిని చేసే సాంకేతిక వ్యవస్థ ఉంది. కెమెరాలు, లిడార్ సెన్సర్లు, ఫోర్స్ సెన్సర్లు, ఇతర సెన్సింగ్ వ్యవస్థలు పరిసరాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను ఏఐ ఆధారిత కంప్యూటింగ్ వ్యవస్థ విశ్లేషిస్తుంది. ముందున్న అడ్డంకి ఎంత దూరంలో ఉంది? నేల సరిగ్గా ఉందా? అడుగు ఎక్కడ వేయాలి? వేగాన్ని తగ్గించాలా? పెంచాలా? వంటి విషయాలపై క్షణాల్లో నిర్ణయం తీసుకుని కాళ్లు, చేతులు, శరీర కదలికలను సమన్వయం చేస్తుంది. అందుకే టియాన్గాంగ్ నడకలో మెషిన్ కంటే మనిషి కదలికలను పోలిన సహజత్వం కనిపిస్తుంది.తోసినా.. తడబడినా పడిపోదు!హ్యూమనాయిడ్ రోబోట్లకు అతిపెద్ద సవాళ్లలో ఒకటి సమతుల్యం(బ్యాలెన్స్). రెండు కాళ్లపై నడిచే యంత్రం చిన్న పొరపాటుతోనైనా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే టియాన్గాంగ్ ఇందులో గణనీయమైన పురోగతి సాధించింది. ఎవరైనా తోసినా, నేల ఒక్కసారిగా మారినా శరీర బరువును మార్చుకుని తిరిగి బ్యాలెన్స్‌లోకి వచ్చేసేలా దీన్ని రూపొందించారు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ముందుగానే ఊహించి.. అవసరమైతే కదలికను మధ్యలోనే సరిచేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంటే.. మనిషి తడబడినప్పుడు వెంటనే కాలు మార్చి నిలబడినట్లే, ఈ రోబోట్ కూడా తన కదలికలను సర్దుబాటు చేసుకుంటుంది.పరుగే కాదు.. ఇంకా చాలాటియాన్గాంగ్ పేరు ఇప్పుడు 100 మీటర్ల పరుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నప్పటికీ.. దాని అసలు లక్ష్యం క్రీడా ప్రదర్శన కాదు. మనుషులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోట్లు చేపట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో యంత్రాల మధ్య పనిచేయడం, గోదాంల నుంచి వస్తువులను తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో శిథిలాల్లోకి వెళ్లడం వంటి పనుల్లో హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంతే కాదు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం, ఆసుపత్రుల్లో కొన్ని పనులు నిర్వహించడం వంటి సేవల్లోనూ భవిష్యత్తులో వీటి వినియోగం పెరగొచ్చని రోబోటిక్స్ రంగం అంచనా వేస్తోంది.ఒక్క రోబోట్ కాదు.. చైనా పెద్ద ప్రయోగంటియాన్గాంగ్ను అభివృద్ధి చేసింది.. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రయోగం కాదు. ఇంజినీర్లు, రోబోటిక్స్ నిపుణులు, ఏఐ పరిశోధకులు, విద్యా సంస్థలు కలిసి పనిచేసిన పెద్ద ప్రాజెక్టు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌ను భవిష్యత్ పరిశ్రమల్లో కీలక రంగంగా చైనా భావిస్తోంది. అందుకే పరిశోధన, తయారీ, ఏఐ సాంకేతికతలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ముందుకు వెళ్తోంది.మనిషికి ప్రత్యామ్నాయమా?టియాన్గాంగ్ అల్ట్రా రికార్డు చూసిన వెంటనే తలెత్తే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోబోట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా?. నిపుణుల దృష్టిలో ప్రస్తుతానికి సమాధానం అంత సులభం కాదు. హ్యూమనాయిడ్ రోబోట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మానవుడిలా అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గ్రహించడం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాల్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.8.86 seconds for 100m.🏃💨 That's not a sprinter. That's #Tiangong Ultra, a #humanoid #robot.It just broke the human record for a 100m sprint at the World Humanoid Robot Games. And honestly? My 100m time is looking real slow right now. 🤖🥇#humanoidrobot #TiangongUltra pic.twitter.com/11UUlgY9q4— So Shanghai (@shanghai490528) August 26, 2026మనిషి చేసే పనులను మనిషితో కలిసి చేయగలిగే తెలివైన యంత్రాల యుగం మొదలైంది. కేవలం 100 మీటర్లను 8.86 సెకన్లలో పరుగెత్తిన టియాన్గాంగ్ ఆ భవిష్యత్తుకు టీజర్ మాత్రమే. మనిషిలా ఆకారం.. యంత్రంలా శక్తి.. ఏఐ ఆలోచన.. టియాన్గాంగ్ రికార్డు కేవలం ఒక రోబోట్ గెలుపు కాదు రాబోయే సాంకేతిక ప్రపంచానికి చైనా ఇచ్చిన సంకేతం.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఆ రహస్య విమానంలో వచ్చింది ఆయనేనంట! -
త్వరలో భారత్‌కు జిన్‌పింగ్? 400 మంది బృందంతో!
ఢిల్లీ: వచ్చే నెల ( సెప్టెంబర్) ఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రధానితో ప్రత్యేక భేటీ సైతం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఇరుదేశాలు సరిహద్దులో భారీగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించాయి. దానితో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంతో చైనా తరచుగా కయ్యానికి కాలు దువ్వడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు భారత్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకానున్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఈ సారి ఆయన బృందంలో సుమారు 400 మంది అధికారులు ఉండవచ్చని తెలుస్తోంది. చివరిసారిగా 2019లో షీ జిన్‌పింగ్ చివరిసారిగా భారత్‌కు వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన అధికారుల సంఖ్యతో పోలిస్తే ఇది రెండింతల కంటే ఎక్కువ. ఒక భారతీయ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం చైనా అధికారులు హోటళ్లు, ఇతర భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాట్లు తెలిపారు. అయితే, షీ జిన్‌పింగ్ తుది ప్రయాణ వివరాలను చైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే భారత్-చైనా మధ్య ఆయనకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య జరిగే అవకాశం ఉన్న ద్వైపాక్షిక సమావేశంపై సైతం ఇంకా తుది ప్రకటన రాలేదు.సరిహద్దు చర్చలకు ప్రాధాన్యతకాగా షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలోనే, భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు.మంగళవారం దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సరిహద్దు సమస్యలు, భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన విస్తృత అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. -
YouTubersకు మైండ్ బ్లాక్.. చైనా కొత్త App!
-
ఏలియన్స్‌తో మాట్లాడొద్దు.. హెచ్చరించిన చైనా!
బీజింగ్: గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఎవరినైనా సంప్రదిస్తే స్పందించవద్దని చైనా ప్రభుత్వం తన పౌరులకు అధికారిక హెచ్చరికలు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. అనుమతి లేకుండా ఏలియన్స్‌కు బదులివ్వవద్దని, ఏదైనా సంకేతం అందితే వెంటనే ఐక్యరాజ్యసమితికి సమాచారం అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పలు పోస్టులు, నకిలీ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ వ్యోమగామ సంస్థ (ఐఏఏ) సూచనల పేరిట కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన వదంతులని స్పష్టమైంది. చైనా ప్రభుత్వం గానీ, సంబంధిత సంస్థలు గానీ అటువంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదు.అసలు కథ ఏమిటి?ఈ విచిత్ర ప్రచారానికి చైనాకు చెందిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత లియు సిక్సిన్ రాసిన ‘ది త్రీ-బాడీ ప్రాబ్లమ్’ నవల మూలమని తెలుస్తోంది. ఆ కథలో గ్రహాంతరవాసుల నుంచి భూమిని కాపాడుకోవడానికి ‘ఎట్టి పరిస్థితుల్లోనూ బదులివ్వవద్దు’ అనే హెచ్చరిక ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడమే లక్ష్యంగా కొందరు కంటెంట్ క్రియేటర్లు ఈ కల్పిత కథాంశాన్ని నిజమైన ప్రభుత్వ ప్రకటనగా మార్చి ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా 2026 ఆగస్టు 12న భూమిపై గురుత్వాకర్షణ శక్తి కొద్ది సెకన్ల పాటు నశిస్తుందంటూ ఇలాంటి అసత్య ప్రచారమే జరిగింది. డిజిటల్ మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయవద్దని, నిజానిజాలు పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: మళ్లీ జైలు బయటకు రామ్ రహీమ్.. -
ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు..
బీజింగ్: చిన్న భూకంపం వస్తే ఏకంగా 7.7 తీవ్రత (రిక్టర్ స్కేలుపై)తో భారీ భూకంపం వచ్చిందంటూ హెచ్చరిక చేసింది ఓ సంస్థ. దీంతో జనాలు బెంబేలెత్తిపోయారు. చైనాలోని నైరుతి ప్రాంతంలోని చెంగ్డూ మహానగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్.. భూకంపం సంభవించిన 5 సెకన్లకే 7.7 తీవ్రతతో భూకంప హెచ్చరికను జారీ చేసింది. ఇతర భూకంప పర్యవేక్షణ సంస్థలు తెలిపిన తీవ్రత కంటే చాలా ఎక్కువ తీవ్రతతో భూకంప హెచ్చరికను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్ జారీ చేయడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ అపార్ట్మెంట్లు కుప్పకూలిపోతాయేమోనని భయపడ్డారు.చైనా భూకంప నెట్వర్క్స్ కేంద్రం ప్రకారం.. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో యిబిన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.26 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప హెచ్చరిక వ్యవస్థ అయిన "చైనా భూకంప ముందస్తు హెచ్చరిక నెట్వర్క్" పేరును కేర్-లైఫ్ అనుమతి లేకుండా ఉపయోగించి.. హానర్, వివో స్మార్ట్ఫోన్లతో పాటు షియావోటియాన్కాయ్ స్మార్ట్‌వాచ్‌ల ద్వారా ప్రజలకు 7.7 తీవ్రతతో హెచ్చరికను పంపినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది.తీవ్రత అంచనాలో భారీ వ్యత్యాసంపై స్పందిస్తూ.. నెట్వర్క్ 6వ సెకనులో అంచనాను 6.4కు, 7వ సెకనులో 3.7కు, 8వ సెకనులో 4.1కు, 16వ సెకనులో 3.9కు తగ్గించినట్లు తెలిపింది. సేవలను మెరుగుపరిచేందుకు ఈ వ్యత్యాసానికి కారణాన్ని సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్-లైఫ్ తెలిపింది.గతంలో వరసగా భూకంపాలు జూలైలో చైనాలోని ఓ మారుమూల ప్రావిన్స్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, కేవలం 18 నిమిషాల తర్వాత 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. వాయవ్య చైనాలోని క్వింగ్హై ప్రావిన్స్‌లోని జింగ్హై కౌంటీలో ఉదయం 11.16 గంటలకు, 11.34 గంటలకు ఈ భూకంపాలు సంభవించాయి. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపాల కేంద్రం, క్వింగ్హై రాజధాని షినింగ్కు సుమారు 244 కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్కువ జనాభా కలిగిన ఎత్తైన ప్రాంతంలో ఉంది.మే నెలలో దక్షిణ గ్వాంగ్సీ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. భవనాలు కూలిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నలుగురు గాయపడగా, లియుజౌ నగరం నుంచి 7,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
ఉసేన్ బోల్ట్ రికార్డ్ బ్రేక్ చేసిన చైనా రోబో
-
ఉసేన్ బోల్ట్ రికార్డును బీట్ చేసిన రోబో!
రోబోలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఫ్యాక్టరీల్లో పనులు చేసే యంత్రాలు మాత్రమే. కానీ.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రోబోలు కూడా మనుషుల్లా నడవడం, పరుగెత్తడం, క్రీడల్లో పాల్గొనడం నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు చైనాలో తయారైన ఓ హ్యూమనాయిడ్ రోబో ఏకంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌గా పేరున్న ఉసేన్ బోల్ట్ రికార్డును మించిన వేగంతో పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది.100 మీటర్లు.. కేవలం 9.32 సెకన్లలో!చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ అభివృద్ధి చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో పేరు 'లైట్నింగ్' (Lightning). బీజింగ్‌లో శనివారం ప్రారంభమైన రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌కు ముందు నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో లైట్నింగ్ 100 మీటర్ల పరుగులో ఈ సంచలన ప్రదర్శన చేసింది.రోబో కేవలం 9.32 సెకన్లలో 100 మీటర్ల పరుగును పూర్తి చేసింది. ఈ క్రమంలో గరిష్ఠంగా సెకనుకు 14.5 మీటర్ల వేగాన్ని అందుకుంది.బోల్ట్ రికార్డు కంటే కూడా వేగం అన్నమాట.జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇప్పటివరకు పురుషుల 100 మీటర్ల పరుగులో ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది. అయితే లైట్నింగ్ 9.32 సెకన్లలో రేసును పూర్తి చేయడంతో.. బోల్ట్ రికార్డు కంటే 0.26 సెకన్లు వేగంగా పరుగెత్తినట్లయింది.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది హ్యూమన్ అథ్లెటిక్స్‌లో జరిగిన ప్రపంచ రికార్డు కాదు. రోబో సాధించిన వేగాన్ని బోల్ట్ ప్రపంచ రికార్డుతో పోల్చినది మాత్రమే.హాఫ్ మారథాన్లోనూ సత్తా'లైట్నింగ్'కు పరుగులో ఇది మొదటి రికార్డ్ మాత్రమే కాదు. ఎందుకంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బీజింగ్ హాఫ్ మారథాన్‌లో కూడా ఈ రోబో పాల్గొంది. అక్కడ 21 కిలోమీటర్ల దూరాన్ని 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసింది. హ్యూమన్ అథ్లెట్ల అత్యుత్తమ ప్రపంచ రికార్డు స్థాయి వేగంతో పోల్చినా ఇది చాలా వేగమైన ప్రదర్శన కావడం విశేషం.🔴 Çinli teknoloji şirketi Honor'un robotu “Lightning”, Pekin'deki Dünya İnsansı Robot Oyunları öncesi testte 100 metreyi 9,32 saniyede koşarak Usain Bolt'un 9,58 saniyelik rekorunu geride bıraktı. pic.twitter.com/lO0cDz4ZCm— Piyasa Türkiye ✰ (@PiyasaTturkiye) August 22, 2026హాఫ్ మారథాన్ సమయంలో రోబో ఎత్తు 169 సెంటీమీటర్లు ఉండగా, దాని కాళ్ల పొడవు 95 సెంటీమీటర్లు. అయితే ఆ తర్వాత పరిశోధకులు రోబో పరుగును మరింత మెరుగుపరిచేందుకు దాని కాళ్లను 10 సెంటీమీటర్లు పొడిగించారు. ఇప్పుడు లైట్నింగ్ కాళ్ల పొడవు 1.05 మీటర్లకు చేరింది. దీని వల్ల రన్నింగ్‌లో మరింత వేగం, స్థిరత్వం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.రోబోలపై చైనా ఫోకస్చైనా ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోట్లను భవిష్యత్తులో కీలకమైన టెక్నాలజీ రంగంగా చూస్తోంది. ఏఐ, రోబోటిక్స్, హార్డ్‌వేర్ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఉపయోగించుకుని ఈ రోబోలను వివిధ రంగాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తయారీ పరిశ్రమ, లాజిస్టిక్స్, వినియోగదారుల సేవలు వంటి రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెంచే దిశగా చైనా అడుగులు వేస్తోంది.రోబోటిక్స్‌లో కొత్త దశకు సంకేతమా?ఒకప్పుడు రోబోలు మనుషులు చేసే పనులను అనుకరించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అవే రోబోలు మనుషుల్లా నడవడం, పరుగెత్తడం మాత్రమే కాకుండా క్రీడా పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరుకున్నాయి. లైట్నింగ్ 100 మీటర్లను 9.32 సెకన్లలో పూర్తి చేయడం రోబోటిక్స్ రంగంలో గొప్ప మైలురాయి. భవిష్యత్తులో ఏఐ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ మరింత అభివృద్ధి చెందితే.. మనుషులు, రోబోల సామర్థ్యాల మధ్య తేడా ఇంకా ఎంత తగ్గుతుందో చూడాలి. -
రూ. 4,896 కోట్ల ఎఫ్‌డీఐలు..
న్యూఢిల్లీ: ఆటోమాటిక్ మార్గంలో లభించిన 29 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) సమాచారం అందినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వీటి విలువ రూ. 4,896 కోట్లుకాగా.. మే నెలలో ప్రభుత్వం చైనాకు వాటాగల ఎఫ్‌డీఐలపై మార్గదర్శకాలను సవరించింది. తద్వారా చైనా కంపెనీలకు 10 శాతంలోపు వాటాగల విదేశీ సంస్థలు ఆటోమాటిక్ మార్గంలో దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. వెరసి మే 1 నుంచి 2026 ఆగస్ట్ 20కల్లా 29 ప్రతిపాదనల వివరాలు దాఖలైనట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తెలియజేసింది.ఐటీ, ఏఐ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, తయారీ, ఫార్మాస్యూటికల్స్, డేటా సెంటర్లు, రవాణా సరీ్వసులలో తాజా పెట్టుబడులు నమోదైనట్లు వెల్లడించింది. పెట్టుబడులు మారిషస్, యూఎస్, కొరియా, జపాన్, సింగపూర్, లక్సెమ్‌బర్గ్, కేమన్ ఐలాండ్స్ నుంచి లభించినట్లు పేర్కొంది. మే నెలకంటే ముందు భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాల కంపెనీలకు వాటా కలిగిన విదేశీ సంస్థలు ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవలసి ఉండేది. మేలో చేపట్టిన మార్గదర్శకాల సవరణల తదుపరి ఆటోమాటిక్ మార్గంలో పెట్టుబడులకు అనుమతి లభిస్తోంది. అయితే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. -
ప్రముఖ కార్ల కంపెనీ సంచలన నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఏకంగా 30 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.డోర్ హ్యాండిల్ భద్రతకు సంబంధించిన సమస్య కారణంగా.. అమెరికా కార్ల తయారీ సంస్థ మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ సహా చైనాలో తయారైన, దిగుమతి చేసుకున్న సుమారు 29.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తోందని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ తెలిపింది.చైనా మీడియా ప్రకారం.. ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్దదైన ఈ రీకాల్. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, అనేక చైనీస్ ఈవీ మోడళ్లలో సాధారణంగా కనిపించే లోపలికి ఉన్న కార్ డోర్ హ్యాండిల్స్‌ను వచ్చే ఏడాది నుంచి నిషేధిస్తామని చైనా అధికారులు ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత ఈ భారీ రీకాల్ ప్రకటన వెల్లడైంది.దేశంలో అనేక చోట్ల జరిగిన ఈవీల ప్రమాదాల నేపథ్యంలో.. చైనా ఇటీవల ఫ్లష్ కార్ డోర్ హ్యాండిల్స్‌పై నిఘాను ముమ్మరం చేసింది. ఈ ప్రమాదాలలో కార్లలోని ఎలక్ట్రానిక్ డోర్లు విఫలమై, ప్రజలు లోపల చిక్కుకుపోయారు.చైనా నియంత్రణ సంస్థ వెబ్‌సైట్‌లోని ఒక ప్రకటనలో.. భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వ్యవస్థ వైఫల్యానికి కారణమయ్యే తీవ్రమైన ప్రమాదం వంటి తీవ్రమైన పరిస్థితులలో.. కారు హ్యాండిల్స్, కారు వినియోగదారులు తప్పించుకోవడానికి తలుపులు త్వరగా ఓపెన్ కాకుండా అడ్డుకోవచ్చని, లేదా కారు బయట ఉన్న సహాయక సిబ్బంది లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. పరిశ్రమలోని కొంతమంది నిపుణులు వాహన తయారీదారులు డిజైన్ కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ అధిపతి కుయ్ డోంగ్షు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధిలో ఈ రీకాల్‌ను 'ఒక అనివార్యమైన అడుగు' అని అభివర్ణించారు. వాహన తయారీదారులు మరింత విశ్వసనీయమైన, భద్రతకు ప్రాధాన్యతనిచ్చే విధానం వైపు పయనిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ప్రమాదాలను తగ్గించడానికి టెస్లా వాహనాలకు సాఫ్ట్వేర్ అప్డేట్లను నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బీజింగ్‌కు చెందిన చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమీ, 3,90,000కు పైగా వాహనాలను రీకాల్ చేస్తోంది. హాంగ్జౌకు చెందిన లీప్‌మోటార్ 3,70,000కు పైగా కార్లను రీకాల్ చేస్తోంది. గీలీ, ఎక్స్‌పెంగ్ సహా ఇతర చైనా కార్ల తయారీ సంస్థలు కూడా కొన్ని వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రీకాల్ ప్రకటించడానికి కారణం కారు డోర్ హ్యాండిల్స్‌కు సంబంధించిన సమస్యలే అని తెలుస్తోంది. -
ఏకంగా 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసిన చిన్నారి.. చివరికి!
పసిపిల్లలు కనిపించిన ప్రతీవస్తువును నోట్లో పెట్టుకోవడం, దాన్ని మింగేయడం చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి చర్యలు ఒక్కోసారి ప్రమాదకరంగా మారడం చాలా సార్లు విన్నాం. తాజాగా ఏకంగా బంగారు కడ్డీని మింగేసిందో చిన్నారి. దీంతో ఆమె ప్రాణాలమీదకు తెచ్చుకుంది. మరోవైపు అంత బంగారం పాపకు అందుబాటులో ఎందుకుంచారు అనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఉత్తర చైనాలో ఐదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసింది. ఆ బాలిక ఇంట్లో ఆడుకుంటుండగా ఆ బంగారు కడ్డీని పొరపాటున మింగింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో, గత ఆదివారం (ఆగస్టు 16) ఆ బాలికను బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఎక్స్-రేలో వెల్లడైన ప్రకారం, 4 సెం.మీ. పొడవున్న ఆ చిన్న బంగారు కడ్డీ, బాలిక మింగిన తర్వాత కూడా కడుపులోనే ఇరుక్కుపోయింది. ఆ బంగారు కడ్డీ బాలిక జీర్ణాశయ కుహరంలో ఇరుక్కుపోయిందని వైద్యులు కనుగొన్నారు. ఆపరేషన్ చేయడానికి ఆ ప్రదేశం చాలా ఇరుకుగా ఉంటుంది. అయినప్పటికీ, వైద్యులు ఆపరేషన్ జరుగుతున్నప్పుడే ఎండోస్కోపీ చేసి, ఒక ఉచ్చు సహాయంతో ఆ కడ్డీని బయటకు తీసి, కుహరం నుండి జాగ్రత్తగా బయటకు తీశారు.ఆ బంగారు కడ్డీని తొలగించడానికి వైద్యుల బృందానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది, కానీ అది చాలా సున్నితమైన ఆపరేషన్. ఆ బాలిక కూడా కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బరువుగా, గట్టిగా ఉన్న ఆ బంగారు కడ్డీ ఆమె జీర్ణాశయ పొరను గీరివేసి, తీవ్రమైన అంతర్గత రక్తస్రావం , అవయవాలకు రంధ్రాలు పడే ప్రమాదాన్ని కలిగించేదన్నారు వైద్యులు. ఈ ఆపరేషన్ వార్త వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలోని కొంతమంది వినియోగదారులు ఆ బాలిక అంత ఖరీదైన బంగారు కడ్డీని ఎలా అందుకుందని ప్రశ్నించగా, మరికొందరు తల్లిదండ్రులు ఆ వస్తువును అందుబాటులో లేకుండా ఉంచాల్సిందని అన్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ నెటిజన్ల రియాక్షన్స్ "ఐదేళ్ల చిన్నారికి 50 గ్రాముల బంగారు కడ్డీని అంత సులభంగా అందేలా చేయడానికి ఆ కుటుంబం ఎంత ధనవంతులై ఉండాలి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించగా, మరొకరు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, ప్రమాదకరమైన వస్తువులను వారికి అందుబాటులో లేకుండా ఉంచాలని సూచించారు.ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్యఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నా -
పాక్‌తో ఎప్పుడూ ముప్పే.. చైనాతోనే అసలు సవాల్.. మాజీ ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఒక వైపు దాయాది దేశం పాకిస్తాన్ నుంచి ఉగ్ర ముప్పు.. మరోవైపు చైనా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక సవాలు! భారత్ భద్రతకు ముందు ముందు అసలు పరీక్ష ఎక్కడ? పశ్చిమ సరిహద్దుల్లోనా.. తూర్పు సరిహద్దుల్లోనా?.. దీనిపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాయి. పాకిస్తాన్ ప్రస్తుతం తక్షణ ముప్పే అయినా.. రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు ప్రధాన పోటీదారు మాత్రం చైనానే అని ఆయన తేల్చి చెప్పారు.చైనా, పాకిస్తాన్ రెండింటినీ ఒకే విధంగా చూడలేమని నరవణే స్పష్టం చేశారు. రెండు దేశాలతోనూ భారత్ యుద్ధాలు చేసిందని, ఇరువురితోనూ సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. అయితే పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న ఉగ్రవాద ముప్పు కారణంగా ప్రస్తుతం భారత దృష్టి పశ్చిమ సరిహద్దులపైనే ఉందన్నారు. కానీ దీర్ఘకాలిక, వ్యూహాత్మక లెక్కల్లో చైనానే ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతుందని నరవణే అన్నారు. అంతేకాదు.. చైనాను శత్రువుగా కాకుండా ప్రధాన పోటీదారుగా చూడాలని ఆయన చెప్పడం కీలకంగా మారింది.చైనాతో పోటీ కేవలం సరిహద్దుల్లోనే ఉండదని నరవణే పేర్కొన్నారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగం.. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్-చైనా పోటీ పెరుగుతుందని అన్నారు. పోటీ ఉన్న చోట కొంత ఘర్షణ సహజమే అయినా.. ప్రతి విభేదం యుద్ధంగా మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చైనాతో సమస్యలను చర్చలు, దౌత్యం, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవడమే భారత్ తొలి ప్రాధాన్యత కావాలని ఆయన సూచించారు. బలప్రయోగం చివరి మార్గంగా మాత్రమే ఉండాలని అన్నారు. అయితే దౌత్యం పనిచేయని పరిస్థితి వస్తే.. భారత్ వెనక్కి తగ్గకుండా ఉండేందుకు బలమైన సైనిక నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పార్టీలో నాకు మద్దతు ఏదీ.. ఖర్గే ఆవేదన?అంటే నరవణే సందేశం క్లియర్‌గా చర్చలకు సిద్ధంగా ఉండాలి.. కానీ బలహీనంగా కాదు. శాంతిని కోరుకోవాలి.. కానీ అవసరమైతే సమాధానం చెప్పే శక్తి కూడా ఉండాలి అని. ఇదే సమయంలో భారత్ భద్రత కేవలం పాక్, చైనాతోనే పరిమితం కాదని నరవణే గుర్తుచేశారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగుదేశాల్లో స్థిరత్వం కూడా భారత ప్రయోజనాలకు కీలకమన్నారు. పొరుగుదేశాల్లో అస్థిరత ఏర్పడితే శరణార్థులు, స్మగ్లింగ్, డ్రగ్స్, అక్రమ ఆయుధాల రవాణా వంటి సమస్యలు నేరుగా భారత్‌పై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. మయన్మార్‌ను ఉదాహరణగా తీసుకున్న నరవణే.. పొరుగుదేశం తగలబడుతుంటే మనం సంతోషంగా ఉండలేమనే భావనను వ్యక్తం చేశారు. అందుకే పొరుగు దేశాల్లో స్థిరత్వం కోసం భారత్ తన వంతు పాత్ర పోషించాలని సూచించారు. -
మధుమేహానికి బ్యాక్టీరియాతో చెక్?
మన పేవుల్లో ఉండే కోటానుకోట్ల బ్యాక్టీరియా రకాల్లో ఈ–కోలీ ఒకటి. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. కొన్ని రకాలతో ఆరోగ్య సమస్యలూ వస్తాయి. అలాంటి బ్యాక్టీరియాతో టైప్–2 మధుమేహానికి చికిత్స కూడా అందించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! ప్రీ క్లినికల్ ట్రయల్స్ దాటుకుని జంతు ప్రయోగాల దశకు చేరిన ఈ ఆసక్తికర పరిశోధన వివరాలు.. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అంటూంటారు. కనీసం పది కోట్ల మంది ఈ జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువ. రోజూ మందులేసుకోవడం, అవి చాలకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు... వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఎవరికైనా భరించలేని వేదనే. అందుకే మధుమేహానికి మెరుగైన చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చైనాలోని ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి ఒక వినూత్నమైన పరిష్కారాన్ని సూచించారు. గ్లూకోజును పసిగట్టే జన్యు రిసెప్టర్లను ఈ–కోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. చక్కెర నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువైతే చాలు... ఈ బ్యాక్టీరియా జీఎల్పీ–1 హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే.. ఈ బ్యాక్టీరియా కారణంగా ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్తోపాటు సెమాగ్లూటైడ్ వంటి మందులు శరీరంలోనే తయారై విడుదలవుతాయన్నమాట. ఇదీ సమస్య... శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఇన్సులిన్ విడుదల చేయమని కాలేయానికి సందేశాలు వెళతాయి. ఈ ఇన్సులిన్ కాస్తా గ్లూకోజును మన కణాల తలుపులు తెరిచి గ్లూకోజు లోపలికి చొచ్చుకెళ్లేందుకు సాయపడతాయి. తగినంత గ్లూకోజు కణాల్లోకి చేరిన తరువాత ఇన్సులిన్ విడుదల కూడా తగ్గిపోతుంది. దీంతో కాలేయం అవసరాలకు తగ్గట్టు మళ్లీ చక్కెర తయారు చేసి రక్తంలోకి వదులుతూంటుంది. అయితే మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. కణాలు ఇన్సులిన్‌కు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. సెమాగ్లూటైడ్ వంటి మందులు ఇన్సులిన్ స్థాయిలను పెంచి గ్లూకోజు ఖర్చయ్యేందుకు సాయపడతాయి. ఈస్ట్ చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ–కోలీ బ్యాక్టీరియానే రక్తంలోని గ్లూకోజు స్థాయిలను బట్టి జీఎల్పీ–1 హార్మోన్ విడుదల చేసేలా చేశారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ విడుదల అవుతూండటం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశాలు తక్కువ. మధుమేహం ఉన్న కొన్ని రకాల కోతులు, ఎలుకలపై ఇప్పటికే తాము ఈ బ్యాక్టీరియాను ప్రయోగించామని, మంచి ఫలితాలే వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. హానికర ప్రభావాలు కూడా లేనట్లు స్పష్టమైనట్లు చెప్పారు. మానవ ప్రయోగాలు కూడా నిర్వహించి సత్ఫలితాలు సాధిస్తే ఈ బ్యాక్టీరియా చికిత్స టైప్–2 మధుమేహ బాధితులకు వరం కాగలదనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవర్‌గ్రాండ్.. చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజానికి జీవిత ఖైదు
షాన్జై: చైనా ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఎవర్‌గ్రాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా వెలిగిన ఎవర్‌గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయ్ కా యాన్‌కు చైనా కోర్టు జీవిత ఖైదు విధించింది. భారీ ఆర్థిక మోసాలు, లంచాలు, నిధుల దుర్వినియోగం సహా ఎనిమిది నేరాలను అంగీకరించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.1996లో స్థాపించిన ఎవర్‌గ్రాండ్ చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. అయితే 2016–2021 మధ్య కంపెనీ ఆస్తులను కృత్రిమంగా పెంచి చూపడం, అప్పులను దాచిపెట్టడం, పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పడిందని దర్యాప్తులో తేలింది. దీంతో సంస్థపై వేల కోట్ల యువాన్ల ఆర్థిక మోసాల కేసులు నమోదయ్యాయి.జీవిత ఖైదుతో పాటు ఆస్తుల జప్తుషెన్జెన్ మధ్యంతర ప్రజా న్యాయస్థానం హుయ్ కా యాన్‌కు జీవిత ఖైదు విధించడమే కాకుండా ఆయన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని ఆదేశించింది. ఎవర్‌గ్రాండ్ గ్రూప్‌కు 8.82 బిలియన్ యువాన్, దాని అనుబంధ సంస్థ హెంగ్డాకు 7 బిలియన్ యువాన్ జరిమానా విధించారు. మరో 56 మంది మాజీ అధికారులు కూడా వివిధ కాలాల జైలు శిక్షలు పొందారు.చైనా ఆర్థిక సంక్షోభానికి ప్రతీక2021లో ఎవర్‌గ్రాండ్ సుమారు 300 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో డిఫాల్ట్ కావడంతో (రుణాలు చెల్లించలేక చేతులెత్తేయడంతో) చైనా రియల్ ఎస్టేట్ రంగం కోలుకోలేని సంక్షోభంలోకి కూరుకుపోయింది. వేలాది మంది గృహ కొనుగోలుదారులు, చిన్న పెట్టుబడిదారులు తాము దాచుకున్న సొమ్మును కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ పరిణామం దేశ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీసింది. హాంకాంగ్ కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ కంపెనీ లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నప్పటికీ బాధితులకు, రుణదాతలకు రావాల్సిన సొమ్ములో అతిస్వల్ప భాగం మాత్రమే ఇప్పటివరకు రికవరీ అయింది.బిలియనీర్ నుంచి ఖైదీ వరకు…2017లో హుయ్ కా యాన్ సంపద 45 బిలియన్ డాలర్లకు పైగా చేరి ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచాడు. కానీ ఐదేళ్లలోనే అదే వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలి, ఇప్పుడు జీవితాంతం జైలుకు చేరడం చైనా కార్పొరేట్ చరిత్రలో అత్యంత సంచలన పతనాల్లో ఒకటిగా నిలిచింది -
సూపర్‌మ్యాన్ స్పీడ్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు!
ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్‌మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్‌ను రోబో అధిగమించినట్లయింది.Chinese humanoid robot named “Superman”, made by Unitree Robotics, surpassed Usain Bolt’s world record (12.42 meters/second) by running at 12.66 m/s (roughly 28.3 miles/h) pic.twitter.com/xobXzUPDI5— Massimo (@Rainmaker1973) August 18, 2026ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్‌మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం.నిలబడే రెండు మీటర్లు జంప్!పరుగులోనే కాదు.. జంప్‌లోనూ ‘సూపర్‌మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీని వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది.వైరల్‌గా మారిన వీడియోయూనిట్రీ ఆగస్టు 17న ‘సూపర్‌మ్యాన్’ సామర్థ్యాలను చూపిస్తూ వీడియోను విడుదల చేసింది. వేగంగా పరుగెత్తడం, నిలబడి రెండు మీటర్ల వరకు ఎగరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మనిషి వేగానికి ప్రతీకగా నిలిచిన బోల్ట్ గరిష్ఠ వేగాన్ని రోబో దాటిందన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.18 వేల రోబోలు తయారు చేసిన యూనిట్రీచైనాలోని హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న యూనిట్రీ.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే వివిధ మోడళ్లకు చెందిన సుమారు 18 వేల బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు యూనిట్రీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లోని STAR మార్కెట్లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఐపీఓలో భాగంగా సుమారు 6.1 బిలియన్ యువాన్లు (దాదాపు 905 మిలియన్ డాలర్లు) సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘సూపర్‌మ్యాన్’ ప్రదర్శన సంస్థ సాంకేతిక సామర్థ్యాలపై మరింత ఆసక్తిని పెంచింది. -
మేఘాలను గమనిస్తూ, వీడియోలు తీస్తూ..నెలకు రూ. 8.5 లక్షలు!
పనిప్రదేశం, ఆఫీస్ డెస్క్‌లు, టార్గెట్లు లేకుండా ప్రకృతితో మమేకమై ఉద్యోగం అంటే అబ్బా అని ఎగిరిగంతేస్తాం. అయినా అలాంటి ఉద్యోగం ఎక్కడుంటుంది అని కొట్టిపారేయకండి. అలాంటి గొప్ప ఉద్యోగం కూడా ఉంది. పైగా జీతం ఎంతో తెలిస్తే..వామ్మో అని ఉబ్బితబ్బిబవ్వడం ఖాయం. ఇంతకీ ఏంటా జాబ్..? ఏం పని చేయాల్సి ఉంటుందంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లావోజున్ పర్వత సుందర ప్రాంతం ఒక అసాధారణమైన ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఆ ఉద్యోగానికి "క్లౌడ్‌స్కేప్ అబ్జర్వర్" అని పేరు పెట్టి మరి దరఖాస్తులకు ఆహ్వానించింది. ఎంపికైన వ్యక్తి జూలై 16 నుంచి ఆగస్టు 15 వరకు పర్వతంపై ఉండి మారుతున్న మేఘాలను, ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించి రోజువారీ వీడియోలు పంచుకోవాల్సి ఉంటుంది. అంఉకోసం నెలకు సుమారు రూ. 8.5 లక్షలు దాక చెల్లిస్తారట. అంతేకాదండోయ్ వసతి కూడా కల్పిస్తారట. ఈ ఆఫర్ చైనాలో చాలామంది నిరుద్యోగ యువతను ఆకర్షించింది. దీన్ని చాలామంది డ్రీమ్ జాబ్‌గా, దేవతా ఉద్యోగంగా అభివర్ణిస్తూ..ఈ ఉద్యోగాన్ని ఎలాగైన కొట్టేయాలని ఉవ్విళ్లూరారు. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నిర్దేశించిన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి వీడియోలను సమర్పించాల్సి ఉంటుంది. సదరు సుందరమైన ప్రాంతం నిర్వాహకులు పంపిన కంటెంట్ నాణ్యతకు వచ్చిన స్పందనను పరిగణలోనికి తీసుకుని ఎంపిక చేస్తుందట. ఈ ఉద్యోగానికి సుమారు మూడు వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా, హెనాన్‌కు చెందిన 23 ఏళ్ల లీ సిచెన్ అనే వ్లాగర్ ఎంపికయ్యాడు. అతను @xiaozao అనే హ్యాండిల్‌ను ఉపయోగిస్తాడు. అతను లావోజున్ పర్వతం నెం 001 క్లౌడస్కేప్ అబ్జర్వర్‌గా ఎంపికయ్యాడు. అతని దరఖాస్తు వీడియోకు బలమైన స్పందన వచ్చింది. అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లతో సహా ఇతర దరఖాస్తుదారులకు విభిన్నంగా తన పనితీరుని చాటాడు. ఇక సదరు యువకుడు లీ ఇటీవలే ఈ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. నిజానికి ఈ ఉద్యగోం విశ్రాంతి, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉద్యోగంలా ఉంటుంది కానీ అతడి పనిదిన సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. అలాగే సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. ఇక్కడ రోజులో వివిధ సమయాల్లో వివిధ కోణాల నుంచి ఎక్కువ ఫుటేజ్‌లు చిత్రీకరించడమే అతడి టార్గెట్. ఆ అందమైన ప్రాంతం ఆన్లైన్ కంటెంట్ కోసం అతను మేఘాలు, పొగమంచు, పర్వత దృశ్యాలు, కాంతి ప్రదర్శనలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఈ పని లీకి కొత్త సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడింది. అలాగే ఈ ఉద్యోగంలో తెలియని ఒక రకమైన ఒత్తిడిన ఎదుర్కొనక తప్పదు కూడా. అదేంటంటే తన వీడియోలు క్లిక్ అవుతాయో లేదో అనే భయం వెంటాడుతూ ఉంటుందట. ఏ వీడియో కంటెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదిచుకున్నాడో..అంతే స్థాయిలో ప్రతిసారి కంటెంట్ క్రియేట్ చేయడం అంటే విపరీతమైన ఒత్తిడితో కూడిన పనే అని చెప్పొచ్చు. ఒక్కోసారి ప్రతికూల పరిస్థితుల వల్ల ఫోటోలు చక్కగా రావు. నిరంతరం వాతారణ పరిస్థితులను తట్టుకుంటూ ఫోటోలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా..నెల మొత్త విజయవంతంగా చిత్రీకరణ కొనసాగించడం విశేసం. ముగింపు సమయంలో ఇట్టే నెల గడిచిపోతుందని అంటున్నాడు లీ. అంతేగాదు ఆ నెల లావోజున్ పర్వతం వద్ద గడిపిన లీ కూడా ఆన్లైన్ బాగా ఫేమస్ అయ్యాడు. అతడు ఆ పర్యాటక ప్రదేశం వీడియోల తోపాటు ఆ క్రమంలో తను ఎదుర్కొన్న కష్టాలను, ఇబ్బందులను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఇలా కంటెంట్ క్రియేటర్ ఎందుకంటే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఆ పర్యాటక ప్రదేశంలో ఇప్పటికే పూర్తి-కాలం పనిచేసే వీడియో మేకర్లు ఉన్నారు. అలాంటప్పుడు, ఇలా ప్రత్యేకంగా కంటెంట్ క్రియేటర్లు ఎందుకు అంటే..లావోజున్ పర్వతానికి చెందిన జాంగ్ అనే ప్రతినిధి మాట్లాడుతూ.. తమ పర్యాటక ప్రదేశానికి ఒక కొత్త దృక్కోణం కావాలని కోరుకున్నట్లు చెప్పారు. జాంగ్ ఆ పరిశీలకుడిని "మూడవ కన్ను"గా వర్ణించారు. భవిష్యత్తులో ఇలా క్లౌడ్‌స్కేప్ పరిశీలకులను మళ్లీ నియమించుకోవచ్చని ఆ ప్రతినిధి తెలిపారు.కాగా, ఈ లావోజున్ పర్వతం మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లువాన్చువాన్ కౌంటీలో ఉంది. ఈ పర్వతం దాని 'మేఘాల సముద్రం'కు ప్రసిద్ధి చెందింది. ఇది చైనాలో ప్రసిద్ధి చెందిన టావోయిస్ట్ పర్వతాలలో ఒకటి. ఇది రెండు వేల ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. అంతేగాదు పర్యాటక ఆర్షణ రేటింగ్ వ్యవస్థలో దీనికి 5A-రేటింగ్ ఉండటం గమనార్హం.(చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..! స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన భారతీయ మహిళ) -
వాడేసిన రాకెట్ మళ్లీ ల్యాండైంది
బీజింగ్: రాకెట్ల పునర్వినియోగం విషయంలో చైనా కీలకమైన ముందడుగు వేసింది. మొట్టమొదటిసారి వాడేసిన ఒక రాకెట్ తొలిదశను భూమిపై సేకరించి వెనక్కు తీసుకు రాగలిగామని చైనా మీడియా బుధవారం తెలిపింది. అయితే ల్యాండ్ అయిన కొంత సేపటికి ఈ రాకెట్ దశ నుంచి మంటలు చెలరేగడంతో ప్రయోగం విజయవంతంపై కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఝూక్యూ–3ని బుధవారమే ప్రయోగించగా ఆ తరువాత ఎక్కడో పడిపోయిన రాకెట్ తొలిదశ గోబీ ఎడారి ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. కానీ అందులోని ఇంధనం మండిపోయింది. అడుగు భాగం నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో కార్బన్ ఫైబర్‌తో తయారైన నాలుగు కాళ్లు బలహీన పడినట్లు తెలిసింది. బూస్టర్ కూడా మంటల్లో చిక్కుకుపోవడంతో అది కుప్పకూలినట్లు సమాచారం. మిన్కిన్ ప్రాంతంలో ఈ రాకెట్ దశ ల్యాండైన వీడియోలో ముందు బూస్టర్ నిట్టనిలువుగా ల్యాండ్ అయిన దృశ్యాలు కనిపించాయి. నేలవాలడం పూర్తయి అది నాలుగు ల్యాండింగ్ కాళ్లపై నిలబడింది కూడా. అయితే కొంత సమయం తరువాత మాత్రం మంటలంటుకున్నట్లు తెలిసింది. ల్యాండ్ స్పేస్ అనే ప్రైవేట్ సంస్థ ఈ రాకెట్‌ను తయారు చేసింది. డాంగ్‌ఫెంగ్ స్పేస్ సెంటర్ నుంచి నింగికేగిన తరువాత 137 సెకన్లకు రాకెట్ రెండోదశ విడిపోయింది. తరువాతి దశ రాకెట్ ద్వారా హోంఝూ–03 ఉపగ్రహం కక్ష్యలోకి విజయవంతంగా చేరడం విశేషం. ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ 2015 నుంచి వాడేసిన రాకెట్ దశలను మళ్లీ సేకరిస్తోంది. తద్వారా ప్రయోగాల ఖర్చును తగ్గించుకుంటోంది. చైనా బుధవారం సేకరించిన రాకెట్ దశలో ల్యాండింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం విశేషం. పునర్వినియోగ రాకెట్ల విషయంలో ఇదో పెద్ద విజయమని చైనా మీడియా సంస్థలు ప్రకటించాయి. ఈ ఏడాది జూలై పదవ తేదీ చైనా వాడేసిన రాకెట్ దశను సముద్ర ఉపరితలంపై నుంచి ఒడిసిపట్టుకున్న విషయం తెలిసిందే. లాంగ్‌మార్చ్–10 ప్రయోగం తరువాత విడిపోయిన రెండో దశ సముద్ర ఉపరితలంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థకు చేరింది. ఆ తరువాతి రోజు అంటే జూలై 11న జపాన్ మొట్టమొదటి పునిర్వనియోగ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. -
చైనాలో భూకంపం.. 5.6 తీవ్రత నమోదు
కింగ్హాయ్: ఉత్తర-పశ్చిమ చైనాలోని కింగ్హాయ్ ప్రావిన్స్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:36 గంటలకు భూకంపం సంభవించింది. చైనా ఎర్త్‌క్వెక్ నెట్వర్క్స్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, భూకంప తీవ్రత 5.6 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. దీని కేంద్రం కింగ్హాయ్లోని హైక్సీ ప్రిఫెక్చర్లో భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రకంపనలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రపంచంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో చైనా ఒకటి. దీనికి ప్రధాన కారణం దేశ పశ్చిమ మరియు నైరుతి భాగాలలో ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొనడం, అనేక క్రియాశీల ఫాల్ట్‌లు (సక్రియ పలకలు) ఉండటమే. -
‘చెత్త’ సినిమా కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు!
సినిమా అంటే కథ, నటన, గ్రాఫిక్స్.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు. అన్నింటి కంటే ముందు రివ్యూలు చూస్తుంటారు. అయితే ఇక్కడ ఓ సినిమా విషయంలో.. పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ‘పరమ చెత్త సినిమా’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని చూసేందుకు ఎగబడి పోతున్నారు. తొలుత ఎవరూ పట్టించుకోని ఈ సినిమా.. ఇప్పుడు అదే విమర్శలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.‘నియు లాయ్’ (Niu Lai) అంటే చైనా భాషలో ‘ది కౌ ఈజ్ కమింగ్’. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ సినిమాలో ఓ దూడ, ఓ స్కైలార్క్ పక్షి మధ్య సంబంధాన్ని కలలలాంటి.. అర్థంపర్థం లేని సన్నివేశాల ద్వారా చూపించారు. కథ, పాత్రలు, గ్రాఫిక్స్, వాయిస్ యాక్టింగ్.. అన్నింటిపైనా ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి.ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా మొదటి పది రోజుల్లో కేవలం 7,700 యువాన్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.04 లక్షలు. దేశవ్యాప్తంగా 300 మందికంటే తక్కువ మంది మాత్రమే టికెట్లు కొనుగోలు చేశారు. ప్రచారం లేదు.. ప్రీ-రిలీజ్ ఈవెంట్లు లేవు.. కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు.ఆ రివ్యూనే మలుపు తిప్పిందిఅయితే సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్‌లు సోషల్ మీడియాలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సినిమాలోని నాసిరకం కంప్యూటర్ గ్రాఫిక్స్, బిగుసుకుపోయినట్లు కనిపించే పాత్రలు, విచిత్రమైన వాయిస్‌లు, గందరగోళమైన కథపై నెటిజన్లు జోకులు పేల్చారు. కొందరు దీన్ని విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్‌తో పోల్చగా.. మరికొందరు ‘ఏఐ కంటే దారుణం’, ‘2026లో వచ్చిన అత్యంత చెత్త సినిమా’ అంటూ కామెంట్లు చేశారు.అయితే ఈ విమర్శలే సినిమాకు ఊహించని ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. ‘ఇంత చెత్తగా ఉందట.. అసలు ఎలా ఉంటుందో చూద్దాం’ అంటూ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో సినిమాపై ఆసక్తి అనూహ్యంగా పెరిగింది.రూ.20 కోట్లకు పైగా వసూళ్లుచైనీస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ మాయాన్ గణాంకాల ప్రకారం.. సినిమా ఇప్పటివరకు 14.9 మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.20 కోట్లు. దీంతో భారీ బడ్జెట్ సినిమాల మధ్య ఈ చిన్న యానిమేషన్ కూడా బాక్సాఫీస్ రేసులో కనిపిస్తోంది. ఇదే సమయంలో ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి భారీ చిత్రాలతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారీ ప్రమోషన్లు, పెద్ద స్టార్లు, కోట్లాది రూపాయల బడ్జెట్ లేకుండానే ‘నియు లాయ్’ అందరి దృష్టినీ ఆకర్షించడం విశేషంగా మారింది.ఇద్దరి కష్టం.. ఐదేళ్లపాటు!ఈ సినిమా వెనుక కూడా ఆసక్తికరమైన కథే ఉంది. జిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు ఐదేళ్లపాటు ఈ చిత్రంపై పనిచేసినట్లు సమాచారం. తల్లీకొడుకులుగా భావిస్తున్న వీరిద్దరే రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్ ఆర్టిస్టులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సినిమాకు ఉన్న ఏకైక ప్రచార పోస్టర్ మాత్రం ఎంతో అందంగా ఉంది. సంప్రదాయ చైనీస్ ఇంక్-వాష్ పెయింటింగ్‌ను తలపించేలా రూపొందించిన ఆ పోస్టర్‌కు.. సినిమాలో కనిపించే ముడతలు పడినట్లున్న యానిమేషన్‌కు అసలు పోలిక లేకపోవడం మరో చర్చగా మారింది.‘విడుదల చేయొద్దు’ అనుకుని..సినిమా నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తూ విడుదల చేయకపోవడమే మంచిదని తనకు సలహా వచ్చిందని చిత్ర పంపిణీదారు చెప్పినట్లు సమాచారం. అయితే దర్శకుడితో స్నేహం కారణంగా సినిమాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పూర్తిగా చెత్తగా చూడటం లేదు. ఏఐ సాయంతో క్షణాల్లో అద్భుతమైన విజువల్స్ రూపొందిస్తున్న కాలంలో.. ఇద్దరు వ్యక్తులు ఐదేళ్లపాటు కష్టపడి రూపొందించిన ముడి, చేతిపని తరహా యానిమేషన్ తమకు కొత్తగా అనిపించిందని చెబుతున్నారు.చెత్తే.. కానీ అదే హిట్!సినిమా బాగుందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం సాధారణం. కానీ సినిమా ఎంత చెత్తగా ఉందో తెలుసుకునేందుకే టికెట్ కొనడం ఇప్పుడు ‘నియు లాయ్’ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. మొదట్లో సినిమాను చంపేసిన విమర్శలే.. చివరికి దానికి ఉచిత ప్రచారంగా మారాయి. అంటే.. ఈ సినిమాకు అసలు బలం కథ కాదు.. దాని ‘చెత్త’ పేరే!. -
ప్రపంచ కప్‌లో భారత్‌కు పోరాట ఆరంభం
ఆమ్స్టెల్వీన్: 2026 మహిళల FIH హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు పోరాట ఆరంభం చేసింది. నెదర్లాండ్స్‌లోని వాగెనర్ స్టేడియంలో ఆదివారం జరిగిన పూల్-డీ మ్యాచ్‌లో ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో 2-2 డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లినా.. చైనా ప్రతిసారీ పుంజుకుని స్కోరును సమం చేసింది.రెండుసార్లు ఆధిక్యంలో భారత్మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ఆడింది. 8వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.అయితే తొలి క్వార్టర్ ముగిసే సమయానికి చైనా తిరిగి పుంజుకుంది. 15వ నిమిషంలో జాంగ్ గోల్ చేయడంతో స్కోరు 1-1గా సమమైంది.రెండో క్వార్టర్లో భారత్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. 25వ నిమిషంలో దీపిక గోల్ చేయడంతో భారత్ 2-1తో ముందంజ వేసింది.భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయంపై ఆశలు పెంచుకున్న సమయంలో చైనా మరోసారి ఎదురుదాడి చేసింది. 39వ నిమిషంలో మా నింగ్ గోల్ చేయడంతో స్కోరు 2-2గా మారింది.ఆ తర్వాత ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.దక్షిణాఫ్రికాతో తదుపరి మ్యాచ్చైనాతో పాయింట్లు పంచుకున్న భారత్‌కు పూల్-డీలో తదుపరి మ్యాచ్ కీలకంగా మారింది. ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది.వరల్డ్ కప్‌లో నాకౌట్ దశకు చేరుకోవాలంటే భారత్ ఇకపై పూల్ మ్యాచ్‌ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. చైనా వంటి బలమైన ప్రత్యర్థిపై రెండు సార్లు ఆధిక్యంలోకి రావడం సానుకూల అంశమే అయినప్పటికీ, ఆధిక్యాన్ని విజయంగా మలచలేకపోవడం మాత్రం భారత్ సరిదిద్దుకోవాల్సిన అంశంగా నిలిచింది. -
మయన్మార్‌లో మరో ప్రళయం.. వణికిస్తున్న చైనా మెగా డ్యామ్!
నేపిడా: మయన్మార్‌లో ఎప్పుడో నిలిచిపోయిన వివాదాస్పద మైత్సోన్ జల విద్యుత్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాచిన్ రాష్ట్రంలో చైనా సహకారంతో నిర్మంచ తలపెట్టిన ఈ భారీ ఆనకట్ట నిర్మాణంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం ప్రజా వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. తాజాగా మిన్ ఆంగ్ హ్లైంగ్ చైనా పర్యటన తర్వాత దీనికి మళ్లీ ఊతమిచ్చారు.మాలి, నమై నదుల సంగమ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇది పూర్తయితే సింగపూర్ దేశ అంతర్గత వైశాల్యానికి సమానమైన భారీ జలాశయం ఏర్పడుతుంది. దీని ద్వారా సుమారు ఆరు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. అయితే, పర్యావరణ ముప్పు, స్థానికుల నిర్వాసిత సమస్యల నేపథ్యంలో అప్పట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 2011లో నాటి అధ్యక్షుడు తేయిన్ సీన్ దీని నిర్మాణాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం మయన్మార్ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది.దేశంలో మొత్తం పది గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, ఈ ప్రాజెక్టు ద్వారా ఆ అవసరంలో సగానికి పైగా తీరవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సింహభాగం చైనాకు తరలిపోతుందనే అపనమ్మకం వ్యక్తమవుతోంది. భౌగోళికంగా ఈ ప్రాంతం భూకంప ముప్పునకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐదు వందల అడుగుల ఎత్తైన ఈ భారీ ఆనకట్ట నిర్మాణం లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ జలాశయం వల్ల దిగువ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ సివిల్ సొసైటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం భద్రతా చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.ఇది కూడా చదవండి: బెంగాల్లో హైటెన్షన్.. మమత సన్నిహితుడు దారుణ హత్య -
బామ్మ మాట.. దేశభక్తి బాట
హైదరాబాద్: నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల బామ్మ చెప్పిన దేశభక్తి ఉదంతం శనివారం స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో అక్కడి డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని కంటనీరు పెట్టించింది. సీతారావమ్మ అనే వృద్ధురాలు 1962 నాటి భారత్– చైనా యుద్ధ సమయం నాటి జ్ఞాపకాలను వైద్యులు, సిబ్బందితో గుర్తు చేసుకున్నారు. యుద్ధ సమయంలో మన సైనికులకు అండగా నిలవాలని, దేశ రక్షణ నిధికి తోచిన సాయం చేయాలని భారత ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో సీతారావమ్మ కుటుంబం కూడా దేశం కోసం ముందుకొచ్చింది. తమకు ఎంతో పవిత్రమైన, జీవితాంతం గుర్తుగా దాచుకునే తమ పెళ్లి ఉంగరాన్ని స్వచ్ఛందంగా విరాళం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందనారెడ్డి మాట్లాడుతూ.. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల మనోధైర్యాన్ని తాము నిత్యం గమనిస్తూనే ఉంటామని.. కానీ.. సీతారావమ్మ 1962 నాటి త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మేమంతా భావోద్వేగానికి గురయ్యామని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తికి వైద్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
FIH Hockey World Cup 2026: నేడు మహిళల సమరం
ఆమ్స్టెల్వీన్: హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తమ తొలి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే పూల్ ‘డి’ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ చైనాతో మ్యాచ్ మన జట్టుకు అంత సులువు కాదు. ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో ఉన్న భారత్ గెలుపు కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. కోచ్ జోయెర్డ్ మరీన్ శిక్షణలో ఇటీవల జట్టు రాటుతేలిన తీరు అంచనాలను పెంచుతోంది. ఇదే పూల్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలంటి పటిష్ట జట్లు ఉండటంతో భారత్ తొలి మ్యాచ్‌లో ఏమాత్రం ఉదాసీనత చూపించడానికి లేదు. యూరోపియన్ పరిస్థితులను అలవాటు పడేందుకు కొంతకాలంగా అక్కడే ఉండి మ్యాచ్ వేక వాగ్నర్ స్టేడియంలో సాధన చేసిన భారత మహిళలు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆతిథ్య నెదర్లాండ్స్‌తో కూడా తలపడ్డారు. మన టీమ్‌లోని 11 మందికి ఇదే తొలి వరల్డ్ కప్. అయితే గోల్ కీపర్ సవిత పూనియా (313 మ్యాచ్‌లు), సుశీల చాను (262 మ్యాచ్‌లు) వంటి అత్యంత అనుభవజు్ఞలతో నిండిన జట్టులో 200కు పైగా మ్యాచ్‌లు ఆడిన నవ్‌నీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహ గోయల్వంటి ప్లేయర్లు ఉన్నారు. డ్రాగ్‌ఫ్లికర్ దీపిక ప్రదర్శన ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. గత ఏడాది ఆసియా కప్‌లో చైనా 4–1తో భారత్‌ను ఓడించింది. -
చైనా అక్రమ వ్యాపారానికి భారత్ సహకారం?
అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను తప్పించుకునేందుకు చైనా చేపడుతున్న చట్టవిరుద్ధ రవాణాకు భారత్‌తో పాటు మరో 40 దేశాలు సహకరిస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ రకమైన షాడో ట్రాన్స్-షిప్మెంట్ నెట్వర్క్ ద్వారా జరుగుతున్న చట్టవిరుద్ధ రవాణాను గుర్తించి అడ్డుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను రంగంలోకి దించనున్నట్లు ప్రకటించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార, తయారీ రంగానికి సంబంధించిన సలహాదారు పీటర్ నవారో రూపొందించిన ‘ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్’ అనే నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల ద్వారా ఏటా అక్రమంగా రవాణా అవుతున్న వస్తువుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు నుంచి 303 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.చైనాకు సహకారం..అమెరికా సుంకాల నుంచి చైనా తప్పించుకోవడానికి సహకరిస్తున్న ప్రాంతాల్లో భారత్‌కు చెందిన పుణె - గుజరాత్ - చెన్నై బెల్ట్‌ను అమెరికా నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. చైనా ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను మూడో దేశం ద్వారా రవాణా చేస్తూ స్వల్పంగా అసెంబ్లీ చేయడం, ఫినిషింగ్, రీప్యాకేజింగ్ లేదా లేబుళ్లు మార్చడం ద్వారా ఆ వస్తువు వేరే దేశంలో తయారైనట్లు భ్రమ కల్పిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ అక్రమ రవాణాలో భాగమైన భారతీయ ఎగుమతిదారులను లేదా సంబంధిత సంస్థల పేర్లను ఈ నివేదిక స్పష్టంగా ప్రస్తావించలేదు.నివేదికలోని ముఖ్యాంశాలుచైనా నుంచి మెక్సికో, భారత్, వియత్నాంల ద్వారా అమెరికాకు దాదాపు 67 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు అక్రమంగా రవాణా అయ్యాయని తెలిపింది. దీనివల్ల అమెరికా సుమారు 28 బిలియన్ డాలర్లు సుంకాల ఆదాయాన్ని కోల్పోయిందని అంచనా వేసింది. భారత్, కెనడా, ఈయూ వంటి దేశాలను టైర్-1 కేటగిరీలో చేర్చారు. చైనా ఉత్పత్తుల భారీ విక్రయాలు జరుపుతూనే విభిన్న పారిశ్రామిక స్థావరాలు కలిగి ఉన్న దేశాలుగా వీటిని పేర్కొన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియాలు టైర్-2 జాబితాలో ఉన్నాయి. కంబోడియా, లావోస్, మైన్మార్‌లు చైనాతో సరిహద్దు కారిడార్లు కలిగి ఉన్న దేశాలు టైర్-3 స్థానంలో పొందాయి.తాజా పరిణామాలు.. ప్రభావంభారత్పై అమెరికా సెక్షన్ 301 కింద 10% టారిఫ్‌లు విధించడంతో పాటు ఫోర్స్డ్ లేబర్ (వెట్టి చాకిరీ) అంశంపై విచారణ జరుపుతున్న సమయంలోనే ఈ నివేదిక వెలువడటం గమనార్హం. అంతేకాకుండా రష్యన్ ఆయిల్, గ్యాస్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నందున భారత్‌పై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే చట్టాన్ని ఆమోదించే దిశగా కూడా అమెరికా ఆలోచిస్తోంది. ఈ పరిణామం భవిష్యత్తులో భారత్‌పై అమెరికా తనిఖీలను పెంచడానికి, ఎగుమతుల్లో ఆలస్యానికి, కఠినమైన జరిమానాలకు దారితీయవచ్చని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
భార్య కోసం అతిపెద్ద పూల తోట..!
ఇటీవల కాలంలో భార్యభర్తల బంధాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అలాంటి తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న కథ నెటిజన్ల మనసుని అమితంగా ఆకర్షిస్తోంది. వారి 35 ఏళ్ల అనురాగ దాంపత్యానికి ముచ్చటపడి అభినందనలు చెబుతుండటం విశేషం. ఇంతకీ అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన జౌజియావోలిన్, తన భార్య యిన్ జీ కోసం భారీ తోటను నిర్మించాడు. అది ఎంత పెద్దదంటే..ప్రపంచంలో అతిపెద్ద ఉద్యానవన తోట. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో అతిపెద్ద రంగరంగు పూల తోట కనువిందు చేస్తోంది. ఆ దంపతులే ఈ భారీ తోటను స్వయంగా చూసుకుంటున్నారు. ఒక టెలివిజన్ షోలో ఈ దంపతులు కనిపించడంతో వారి కథ వెలుగులోకి వచ్చింది. ఆ షో వారిని ఆదర్శ జంటగా అభివర్ణించడం విశేషం.ఇంతకీ జౌజియావోలిన్ ఎందుకు ఈ తోటను నిర్మించాడంటే..2013లో తన భార్య యిన్ బీజింగ్‌లో పెరిగే హాలీహాక్లుగా పిలిచే ఆ పువ్వులంటే తనకెంత ఇష్టమో చెప్పింది. ఆ నేపథ్యంలోనే జౌ ఆమె కోసం ఒక తోటను నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతనికి తోటపని చేసిన అనుభవం లేదు. అయినా తన సొంత ఇంటిని అమ్మి..ఝువాన్లాంగ్ టౌన్లో సుమారు 80 హెక్టార్ల లోయను కొని, హాలీహాక్ మొక్కలను పెంచడం గురించి నేర్చుకున్నాడు. అలా పదేళ్లకు పైగా దేశ విదేశాల నుంచి విత్తనాలను సేకరించి ఒక పెద్ద తోటనే నిర్మించాడు. అదికాస్తా ఇప్పుడు అతి పెద్ద వైవిధ్యమైన హాలీహాక్ తోటగా ప్రసిద్ధి చెందింది. 35 ఏళ్ల వైవాహిక బంధం వారిది. పిల్లలు లేని ఆ దంపతులు తమ విశ్రాంత జీవితాన్ని పెంపుడు జంతువులు, పూల మొక్కల మధ్య గడుపుతున్నారు. సంప్రదాయబద్ధంగా సంపద లేదా కుటుంబంతో కాకుండా ప్రకృతిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న ఈ జంట నిజంగానే ఆదర్శ దంపతులు కదూ..!. నెటిజన్లు కూడా డబ్బు సంపాదించడం, పిల్లలను పెంచడం కంటే జీవితంలో ఇంకా చాలానే ఉందని నిరూపించారు ఈ దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..) -
చైనా గేమ్‌లో పావుగా భారత్?.. అమెరికా షాకింగ్ ఆరోపణలు
అమెరికా–చైనా వాణిజ్య పోరు మరో కీలక మలుపు తిరిగింది. చైనాపై అమెరికా విధించిన భారీ టారిఫ్‌లను తప్పించుకునేందుకు.. భారత్ సహా 40కిపైగా దేశాల మీదుగా చైనా తన వస్తువులను అమెరికా మార్కెట్లోకి పంపుతోందని అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ‘షాడో ట్రాన్స్షిప్మెంట్ నెట్వర్క్’గా అభివర్ణించారు. అంతేకాదు.. ఇక ఇలాంటి సరుకులను గుర్తించేందుకు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రంగంలోకి దింపబోతోంది. దీంతో అసలు చైనా ఏం చేస్తోంది? భారత్ పేరు ఈ వ్యవహారంలో ఎందుకు వచ్చింది? అమెరికా చెప్పే ‘ట్రాన్స్షిప్మెంట్’ అంటే ఏమిటి? అన్న ఆసక్తి మొదలైంది.‘ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్’ పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో తయారైన వస్తువులు నేరుగా అమెరికాకు వెళ్తే భారీ టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సరుకులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపుతున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో వస్తువులను మరో దేశానికి పంపించి అక్కడ రీప్యాకేజింగ్, రీలేబెలింగ్, స్వల్ప స్థాయి ప్రాసెసింగ్, ఇన్వాయిస్ లేదా షిప్పింగ్ మార్గంలో మార్పులు చేస్తున్నారని అమెరికా పేర్కొంది. దీంతో అసలు వస్తువు చైనాలో తయారైనప్పటికీ.. పత్రాల్లో అది మరో దేశం నుంచి వచ్చినట్లుగా కనిపించే అవకాశం ఉంటుందని తెలిపింది.అంటే.. చైనా సరుకు.. మధ్యలో మరో దేశం.. చివరికి అమెరికా మార్కెట్! ఇదే అమెరికా ఆరోపిస్తున్న ట్రాన్స్షిప్మెంట్ విధానం. ఈ నెట్‌వర్క్‌లో భారత్‌తో పాటు మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల పేర్లను కూడా నవారో ప్రస్తావించారు. ఈ మార్గంలో అక్రమంగా మళ్లుతున్న వస్తువుల విలువ ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా నివేదిక అంచనా వేసింది. అయితే ఈ అంచనా ఉపయోగించిన పద్ధతి, ట్రాన్స్‌షిప్‌మెంట్‌కు ఇచ్చే నిర్వచనాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది.టార్గెట్ భారత్..ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా నివేదికలో పుణే,గుజరాత్,చెన్నై ఉత్పత్తి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా తయారు చేసిన పంపులు, కంప్రెషర్లు భారత్ మీదుగా అమెరికాకు చేరుతున్నాయని నవారో ఉదాహరణగా చెప్పారు. ఇక్కడే ఒక కీలక విషయాన్ని గమనించాలి. అమెరికా నివేదికలో భారత్ పేరు రావడం అంటే భారతదేశం మొత్తం అక్రమంగా చైనాకు సహకరిస్తోందని అర్థం కాదు. నిజమైన భారతీయ తయారీ, చట్టబద్ధమైన ప్రాసెసింగ్, విదేశీ పెట్టుబడులు, సరఫరా గొలుసుల మార్పులను కూడా అక్రమ ట్రాన్స్షిప్మెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకే అమెరికా ఇప్పుడు తన తదుపరి ఆయుధంగా AIని ఉపయోగించబోతోంది.‘డిటెక్టివ్ బోర్డర్’గా పేర్కొన్న AI ఆధారిత వ్యవస్థ ద్వారా అమెరికా అధికారులు షిప్మెంట్లకు సంబంధించిన భారీ డేటాను విశ్లేషించనున్నారు. సరుకు ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని గత రూట్ ఏంటి? తయారీదారు ఎవరు? కంపెనీల యాజమాన్య సంబంధాలు ఏంటి? ఒక దేశానికి అంత భారీగా ఆ వస్తువులను తయారు చేసే సామర్థ్యం ఉందా? ఉత్పత్తి వర్గీకరణలో ఏమైనా అనుమానాలున్నాయా? వంటి అంశాలను పరిశీలించనున్నారు. అనుమానం బలపడితే.. సరుకును అడ్డుకోవడం, అదనపు సుంకాలు వసూలు చేయడం, జరిమానాలు విధించడం లేదా అమెరికా మార్కెట్లోకి ప్రవేశాన్ని నిరోధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదంతా ఎందుకు?2018లో చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద టారిఫ్‌లు విధించిన తర్వాత.. చైనా ఎగుమతులు మూడో దేశాల ద్వారా మళ్లించే విధానం పెరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. భారీ సుంకాల నుంచి తప్పించుకునేందుకు మూడో దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని వాషింగ్టన్ వాదిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా వ్యూహం మారుతోంది. గతంలో ‘చైనా నుంచి నేరుగా వస్తోందా?’ అని చూసే స్థాయి నుంచి.. ఇక ‘చైనా నుంచి వచ్చి మధ్యలో ఏ దేశాల మీదుగా తిరిగి వచ్చింది?’ అనే స్థాయికి తనిఖీలు వెళ్లబోతున్నాయి.భారత్‌పై ఎఫెక్ట్?భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్న సమయంలో.. భారతదేశాన్ని చైనా టారిఫ్‌లను తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగితే, కొన్ని భారతీయ ఎగుమతులపై అదనపు తనిఖీలు లేదా చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అమెరికా ఆరోపణలకు తగిన ఆధారాలు, నిర్దిష్ట కేసులు, అధికారిక దర్యాప్తు ఫలితాలు బయటకు రావాల్సి ఉంది. కేవలం ఒక నివేదికలో దేశం పేరు ప్రస్తావించబడటాన్ని బట్టి మొత్తం భారత ఎగుమతి రంగంపై తీర్పు ఇవ్వడం సరికాదు. -
కోత లేకుండానే.. కేవలం 10 నిమిషాల్లో మెదడులో చిప్ అమరిక!
బీజింగ్: టెక్నాలజీ రంగంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ఎలన్ మస్క్‌కు చెందిన 'న్యూరాలింక్' వంటి సంస్థలు పుర్రెను తెరిచి మెదడులో చిప్‌లను అమర్చే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, అత్యంత సులభమైన, తక్కువ రిస్క్ ఉన్న సరికొత్త బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి.షాంఘైకి చెందిన ‘స్టైర్మెడ్ టెక్నాలజీ’ అనే స్టార్టప్ సంస్థ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులతో కలిసి పుర్రెను తెరవకుండానే మెదడులో చిప్‌ను అమర్చే సరికొత్త విధానంపై పరిశోధనలు చేస్తోంది.ఈ పద్ధతిలో మెదడుపై నేరుగా సర్జరీ చేయడం లాంటి పెద్ద ప్రమాదాలకు తావు ఉండదు. వైద్యులు మెడలోని రక్తనాళం ద్వారా ఈ చిన్న పరికరాన్ని లోపలికి పంపి, రక్తనాళాల వ్యవస్థ గుండా దానిని నేరుగా మెదడులోని నిర్దేశిత ప్రాంతానికి చేరుస్తారు. ఆ తర్వాత ఆ డివైస్‌ను రక్తనాళం గోడ వెలుపల సురక్షితంగా ఉంచుతారు.బీజింగ్ క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన జ్సువాన్వు హాస్పిటల్ వైద్యుడు దువాన్ వాన్ రు మాట్లాడుతూ.. తగిన అనుభవమున్న సర్జన్ ఈ పరికరాన్ని కేవలం 10 నిమిషాల్లోనే సరైన స్థానంలో అమర్చగలరని తెలిపారు.ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటివరకు గొర్రెలపై విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే మానవులపై కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తితే నెల రోజుల్లోపు ఆ ఇంప్లాంట్‌ను సులభంగా వెనక్కి తీసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.పక్షవాతం, వెన్నుముక గాయాలు లేదా ఇతర తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ తమ అవయవాలను కదిలించలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది. మెదడు ఇచ్చే సంకేతాలను ఈ చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరవేయడం ద్వారా వారు తమ ఆలోచనల ద్వారానే డివైయర్లను కంట్రోల్ చేయవచ్చు.అలీబాబా, టెన్సెంట్ వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో ముందుకు వెళ్తున్న ఈ టెక్నాలజీ, రాబోయే రోజుల్లో న్యూరో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
సముద్రం నుంచి అంతరిక్షం వరకు చైనా సీక్రెట్ సెన్సార్లు!
సముద్ర గర్భం నుంచి అత్యాధునిక అంతరిక్షం వరకు చైనా సాగిస్తున్న గూఢచర్య కార్యకలాపాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. బ్రిటన్ నావికాదళం ఉపయోగిస్తున్న నిఘా డ్రోన్ల ద్వారా కీలక డేటా నేరుగా బీజింగ్‌కు చేరడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. అమెరికా, తైవాన్, జపాన్ సహా అనేక యూరోపియన్ దేశాలు డ్రాగన్‌పై ఇప్పటికే ఇలాంటి ఆరోపణలే చేశాయి. ఈ నేపథ్యంలో చైనా గూఢచర్య నెట్వర్క్ ఎందుకు అంత శక్తివంతంగా మారుతోంది? సముద్రాలు, సైబర్ స్పేస్, ఆకాశాన్ని డ్రాగన్ ఎలా ఆయుధాలుగా మలుచుకుంటోంది?బ్రిటన్ డ్రోన్లలో చైనా గుట్టు రట్టు!బ్రిటన్ నావికాదళం నిఘా కోసం వినియోగిస్తున్న 'క్రాకెన్ కే3 స్కౌట్' డ్రోన్లలో భారీ భద్రతా లోపం బయటపడింది. 'ది టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం, ఈ డ్రోన్లు పంపుతున్న ఆన్లైన్ హార్ట్‌బీట్ కమ్యూనికేషన్ డేటా నేరుగా చైనాలోని ఐపీ (ఐపీ) చిరునామాలకు మళ్లించినట్లు తేలింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ ఉదంతం వెలుగులోకి రావడం బ్రిటన్ రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేసింది. కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా అమెరికా, తైవాన్, జపాన్ దేశాలు కూడా చైనాపై ఇలాంటి నిఘా ఆరోపణలను చాలా కాలంగా మోపుతున్నాయి.చైనా నేషనల్ ఇంటెలిజెన్స్ చట్టం కారణంగా..పాశ్చాత్య దేశాల నిఘా వర్గాలు చైనాపై చేస్తున్న ఆరోపణలకు 2017 నాటి చైనా జాతీయ నిఘా చట్టమే ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఈ వివాదాస్పద చట్టం ప్రకారం... చైనాలోని ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు దేశ నిఘా అవసరాలకు సహకరించడం చట్టబద్ధంగా తప్పనిసరి. దీనివల్ల చైనాకు చెందిన రీసెర్చర్లు, కార్పొరేట్ కంపెనీలు తమకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి వస్తోందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) న్యాయ శాఖ పదేపదే స్పష్టం చేశాయి.సముద్ర గర్భాన్ని నిఘా కేంద్రంగా..సాధారణంగా సముద్రంలో గూఢచర్యం చేయడం అత్యంత కష్టతరమైన పనిగా భావిస్తారు. అయితే చైనా మాత్రం మహాసముద్రాలనే తన ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం... గడిచిన ఐదేళ్లలో పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాలలో కనీసం 42 చైనా పరిశోధనా నౌకలు సముద్ర అంతర్భాగంపై సర్వేలు నిర్వహించాయి. అమెరికన్ నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సముద్ర గర్భపు మ్యాపింగ్ ద్వారా భవిష్యత్తులో తమ సబ్మెరైన్లను సులభంగా దాచడానికి, సముద్ర అడుగున సీక్రెట్ సెన్సార్లు, ఆయుధాలను మోహరించడానికి చైనా ప్లాన్ చేస్తోంది.సైబర్ స్పేస్ ద్వారా డిజిటల్ దండయాత్రభౌతిక సరిహద్దులతో సంబంధం లేకుండా వేల కిలోమీటర్ల దూరంలో కూర్చుని దాడులు చేసేందుకు చైనా సైబర్ స్పేస్‌ను శక్తివంతమైన అస్త్రంగా మలచుకుంది. ఫిషింగ్, మాల్వేర్ దాడుల ద్వారా లక్షిత సంస్థల ఉద్యోగులను మోసగించి అత్యంత సున్నితమైన పాస్వర్డ్లు, రహస్య ఫైళ్లను హ్యాకర్లు తస్కరిస్తున్నారు. అమెరికన్ ఏజెన్సీలు వెల్లడించిన నివేదిక ప్రకారం... చైనాకు చెందిన 'వోల్ట్ టైఫూన్' అనే హ్యాకర్ గ్రూప్ అమెరికా రవాణా, ఇంధనం, జలవనరుల వంటి క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి చొరబడి సంవత్సరాల తరబడి రహస్యంగా నిఘా ఉంచింది.అంతరిక్షంలో నిఘా.. గూఢచార బెలూన్లుచైనా తన శాటిలైట్ నెట్‌వర్క్‌ను అనూహ్యంగా విస్తరిస్తూ సిగ్నల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రగామిగా మారుతోంది. శత్రు దేశాల రేడియో సంభాషణలు, మిస్సైల్ సిస్టమ్స్, రాడార్ల ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ను శాటిలైట్లు, డ్రోన్ల సహాయంతో చైనా ఇట్టే పసిగట్టగలదు. దీనికితోడు 2023 జనవరిలో అమెరికా గగనతలంలో ప్రత్యక్షమైన భారీ చైనా స్పై బెలూన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించి, నేరుగా బీజింగ్‌కు చేరవేయగలగడం రక్షణ రంగ నిపుణులను విస్మయానికి గురిచేసింది.తాము కూడా బాధితులమే అంటున్న చైనా వాదనపశ్చిమ దేశాల ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. చైనా రక్షణ, గూఢచార సంస్థ ‘మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ’ ప్రకారం... చైనా ఎవరిపై గూఢచర్యం చేయడం లేదు, స్వయంగా తామే అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ)సైబర్ దాడికి బలవుతున్నామని వాదిస్తోంది. విదేశీ మొబైల్ బ్రాండ్లలోని లోపాలను ఆసరాగా చేసుకుని అమెరికా సంస్థలు తమ సిబ్బంది ఫోన్లను హ్యాక్ చేశాయని, కీలకమైన రక్షణ, ఇంధన రంగ సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడ్డాయని చైనా గట్టిగా ఆరోపిస్తోంది.ఇది కూడా చదవండి: 23న ఏకంగా 377 పెళ్లిళ్లు.. ‘గురువాయూర్’లో సరికొత్త రికార్డు -
ఆ దేశ సైనిక పాలకులు ఆడుతున్న మైండ్ గేమ్స్ ఇవే..
ఎన్నో ఏళ్లుగా గృహనిర్బంధంలో మగ్గుతున్న మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూ కీని ఎట్టకేలకు రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడం ప్రపంచ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఒకవైపు దేశంలో దారుణమైన సివిల్ వార్ (అంతర్యుద్ధం) కొనసాగుతుండగా, మరోవైపు మయన్మార్ సైనిక పాలకులు అంతర్జాతీయ వేదికలపై తమపై ఉన్న ఏకాకితనాన్ని (International Isolation) పోగొట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలతో దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కంటికి కనిపించకుండా సాగుతున్న ఈ దౌత్య రాజకీయాల వెనుక అసలు మయన్మార్ సైన్యం పన్నిన వ్యూహం ఏమిటి? అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో మయన్మార్ ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్ సాన్ సూ కీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు, 'పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్' (PDF) రూపంలో తిరుగుబాటు చేయడంతో దేశం పూర్తిస్థాయి అంతర్యుద్ధంలోకి జారిపోయింది.గత కొన్నేళ్లుగా జరిగిన పోరులో జాతి సాయుధ సంస్థల చేతిలో సైన్యం భారీగానే భూభాగాన్ని కోల్పోయింది. అయితే, జనాభా ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలపై పట్టు నిలుపుకున్న సైన్యం, గత ఏడాదిన్నరగా కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాడులను తీవ్రం చేసింది.ఒత్తిళ్లను తట్టుకునేందుకు యత్నాలు అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకునేందుకు, తన ప్రభుత్వాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు సైనిక చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ డ్రామాలు మొదలుపెట్టారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నికలు నిర్వహించి, తానే స్వయంగా సైనిక పదవి నుంచి తప్పుకుని అధ్యక్షుడిగా పీఠం ఎక్కారు. సివిల్ ప్రభుత్వం ముసుగు వేసుకున్న తర్వాత ఆయన తన అంతర్జాతీయ పర్యటనలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా దేశాల్లో అధికారిక పర్యటనలు చేసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు భద్రత, చైనా ఆధిపత్యం, వాణిజ్య ప్రయోజనాలరీత్యా పొరుగు దేశాలు కూడా మయన్మార్ ప్రభుత్వంతో తిరిగి సంబంధాలు నెరపుతున్నాయి.ఆసియాన్ కూటమిలో చోటు కోసం.. ముఖ్యంగా ఆసియాన్ (ASEAN) కూటమిలో తిరిగి చోటు దక్కించుకోవడానికి మయన్మార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. థాయ్‌లాండ్ వంటి దేశాలు సరిహద్దు భద్రత, శరణార్థుల సమస్యలు, డ్రగ్స్ అండ్ సైబర్ స్కామ్ కాంపౌండ్ల నియంత్రణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఆసియాన్ విధించిన 'ఐదు సూత్రాల శాంతి ఒప్పందాన్ని' మయన్మార్ పార్లమెంట్ ఏకంగా విదేశీ జోక్యంగా అభివర్ణించి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆంగ్ సాన్ సూ కీని రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడానికి అనుమతించడం అనేది మయన్మార్ మారుతోందడానికి సంకేతం కాదని, ఆసియాన్ కూటమిలో దేశాల మధ్య ఐక్యతను దెబ్బతీసి, తమపై ఒత్తిడి తగ్గించుకునేందుకు సైన్యం ఆడిన ఒక 'కాస్ట్-ఫ్రీ' మైండ్ గేట్ మాత్రమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. -
డాల్ఫిన్ దెబ్బకు చైనా అతలాకుతలం
బీజింగ్ : చైనాను టైఫూన్ డాల్ఫిన్ తుపాన్ అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాన్ దాటికి దేశ ఆర్థిక రాజధాని షాంఘైతో సహా తూర్పు చైనాలోని వివిధ ప్రాంతాల నుండి పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దానితో పాటు ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. ఈ రోజు ఒక్కరోజే (సోమవారం) షాంఘైలో దాదాపు 1,000 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వుహాన్‌లో తొలిసారిగా తీరాన్ని తాకిందని అప్పుడు ఆ డాల్ఫిన్ గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఈ తుపాన్ ధాటికి పర్యాటకులు అధికంగా వచ్చే షాంఘై ప్రాంతాల్లోని భవనాల కింది అంతస్తులలోని వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు వరదల కారణంగా ప్రభావితమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని వీధుల్లోని వరద నీటిలో నిల్చున్నారని పేర్కొన్నారు.న్జౌలోని అధికారులు సుమారు 9 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, దాదాపు 1,000 అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. తైజౌ నగరంలో 3,90,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ఫుజియాన్ తీరప్రాంతంలో, సముద్ర అధికారులు డజన్ల కొద్దీ ప్రయాణీకుల ఫెర్రీ సర్వీసులను నిలిపివేసి, 100కు పైగా సముద్ర నిర్మాణ ప్రాజెక్టుల పనులను నిలిపివేశారని పేర్కొన్నారు.అయితే తుఫాన్ గురించి చాలా మంది తప్పుడు సమాచారం ప్రసారం చేస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలుతీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అటువంటి సమాచారాన్ని పంపినందుకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
సింపుల్.. ఈ 7 టిప్స్ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!
మనిషి వందేళ్లు జీవించాలనే కల ఎప్పటినుంచో ఉంది. కానీ మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఆ కల అందరికీ సులభంగా నెరవేరడం లేదు. అయితే ఆరోగ్యంగా, చురుగ్గా శతాధిక వయసు దాటిన ఓ బామ్మ మాత్రం సుదీర్ఘ జీవితానికి పెద్ద పెద్ద రహస్యాలు అవసరం లేదంటోంది. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి పునాది అని బంగారు మాట చెబుతోంది.ఆమె వయసు 111 ఏళ్లు. ఇంకా ఆరోగ్యంగానే ఉంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉన్న ఈ బామ్మ జీవన విధానం నెట్టింట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వయసు పెరిగినా.. శరీరాన్ని కదిలిస్తూ ఉండటమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతోంది. అంతేకాదు.. తాను పాటించే ఏడు సూత్రాలే తన దీర్ఘాయుష్షుకు కారణమని చెబుతున్నారు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, పరిమితంగా ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనసుతో జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని ఆమె నమ్మకం.తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని రుగావో ప్రాంతానికి చెందిన వాంగ్ గైయింగ్ అనే ఈ బామ్మ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచారు. వందేళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతంగా రుగావోకు పేరుంది. ఐదు తరాల కుటుంబంతో కలిసి జీవిస్తున్న వాంగ్.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పొలాల్లో పనులకు సాయం చేసేవారు. వేరుశెనగలు, పుచ్చకాయల కోత వంటి పనుల్లో పాల్గొనేవారు.ప్రస్తుతం వయసు కారణంగా పనులు తగ్గించినా.. ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రం స్వయంగా చేసుకుంటారు. టేబుళ్లు తుడవడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను వ్యాయామంగా భావిస్తారు. “శరీరం కదులుతూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది” అనేది ఆమె నమ్మకం.ఆహారంలోనూ అదే సూత్రంవాంగ్ ఎప్పుడూ కఠినమైన డైట్‌ను పాటించలేదు. అన్ని రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడమే తన అలవాటు అని చెబుతారు. కుడుములు, ఆవిరితో ఉడికించిన బన్స్ వంటి సాధారణ ఆహారాలతో పాటు చేపలు ఆమెకు ఎంతో ఇష్టం. జీర్ణం కావడానికి సులభంగా ఉండటంతో చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎంత ఇష్టమైన ఆహారమైనా అతిగా తినకూడదనేది ఆమె సూత్రం.కోపానికి దూరం.. ప్రశాంతతకు దగ్గరదీర్ఘాయుష్షుకు ఆహారం మాత్రమే కారణం కాదని వాంగ్ చెబుతారు. మంచి మనసు, ప్రశాంతమైన ఆలోచనలు కూడా ఎంతో ముఖ్యమని అంటారు. ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలని ఆమెకు ఓ నియమం ఉంది. అది కుటుంబ సభ్యులను అభినందించడం కావచ్చు.. పాత స్నేహితుడికి ఓ మెసేజ్ పంపడం కావచ్చు. ఎవరితోనైనా గొడవ జరిగినా ఎక్కువసేపు ఆలోచిస్తూ బాధపడకుండా నిద్రపోతే ఉదయం అంతా సర్దుకుంటుందని ఆమె నమ్మకం.12 గంటల నిద్ర.. క్రమబద్ధమైన జీవనంవాంగ్ రోజువారీ జీవితం కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. రాత్రి 7 గంటలకే నిద్రకు వెళ్లి.. ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తారు. మధ్యాహ్నం ఒకటి లేదా రెండు చిన్న కునుకులు కూడా తీసుకుంటారు. ఆమె జీవన విధానం చూస్తే.. దీర్ఘాయుష్షు కోసం ఖరీదైన పద్ధతులు, ప్రత్యేక మందులు అవసరం లేదని తెలుస్తోంది. శరీరాన్ని చురుగ్గా ఉంచడం, పరిమితంగా తినడం, ప్రశాంతంగా జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తాయని ఈ 111 ఏళ్ల బామ్మ చెబుతోంది. వయసు పెరగడం సహజం.. కానీ ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందేమో!బామ్మ చెప్పిన జీవన రహస్యాల్లో ప్రధానంగా 7 పాయింట్లు.. 1. బద్ధకించకూడదుబద్ధకం ఏ వయసు వాళ్లకైనా మంచిది కాదు. వయసు పెరిగినా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇంటి పనులు కూడా ఒకరకంగా వ్యాయామమే!.2. బ్యాలెన్స్డ్ ఫుడ్సుదీర్ఘమైన ఆయుషు కోసం కఠినమైన డైట్ లాంటి వేవీ అక్కర్లేదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం.3.అతిగా తినకూడదుఇష్టమైన ఆహారం అయినా మితంగా తీసుకోవాలన్నది ఆమె సూత్రం.4. సులభంగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యంఈ తరహా ఆహారం.. ఆరోగ్యానికి మంచివి5. మంచి మనసుతో జీవించాలిప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలన్నది ఆమె అలవాటు.6. కోపం, ఆందోళనకు దూరంగా ఉండాలిసమస్యలను ఎక్కువగా మదిలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం.7. క్రమబద్ధమైన నిద్ర అలవాటురాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం.. మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. అది ఏడు గంటలా?, 8 గంటలా? అనేది మీ ఇష్టం.కొసమెరుపు.. వాంగ్ గైయింగ్ నివసించే రుగావో ప్రాంతం దీర్ఘాయుష్షుకు పేరుగాంచింది. అక్కడ 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు గణనీయంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ప్రాంతంలో 672 మంది శతాధికులు (100 ఏళ్లు దాటిన వారు) ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు దీర్ఘాయుష్షుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు భావిస్తున్నారు. -
అంతరిక్షంలో వరి సాగు
రోదసీ పరిశోధనల్లో మానవాళి మరొక చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చైనా ‘తియాంగాంగ్’ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు వరి పంటను తొలిసారి విజయవంతంగా పండించారు. విత్తనం వేసి ధాన్యాన్ని నూర్చే వరకు జీవిత చక్రాన్ని పూర్తి చేసి ప్రతిష్టాత్మక మైలురాయిని దాటారు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం నివసించే రోదసీ యాత్రికులకు స్వయంసమృద్ధిగల ఆహార భద్రతను అందించే ప్రయత్నాల్లో ఈ ప్రయోగం విప్లవాత్మక మలుపుగా నిలిచింది.అంతరిక్ష కాలనీలకు మార్గంఈ సంచలన ప్రయోగం ద్వారా రోదసీలోనే ఆహారాన్ని పండించటం మాత్రమే కాకుండా, వ్యోమగాములు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయటానికి కూడా అవకాశం దొరికింది. నీటి వ్యవస్థను సహజ సిద్ధంగా శుద్ధి చేయటం కూడా సాధ్యమవుతుంది. అంతరిక్షంలో ‘క్లోజ్డ్–లూప్ ఎకోసిస్టమ్’ రూపుదిద్దుకో వడానికి ఇది ప్రాథమిక అడుగు.భవిష్యత్తులో మార్స్ లేదా చంద్రుడిపై కాలనీలు నిర్మించే క్రమంలో భూమి నుంచి ప్రతీసారీ ఆహారాన్ని మోసుకెళ్లే అవసరం లేకుండా, అక్కడే స్వయంగా పంటలు పండించుకునేందుకు ఇక మీదట 100 శాతం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ అంతరిక్ష వరి విత్తనాల్లోని జన్యుపరమైన మార్పులను అధ్యయనం చేయటం ద్వారా భూమిపై తీవ్ర ప్రతికూల వాతావరణ మార్పులను ఎదుర్కొనే నూతన వరి రకాలను అభివృద్ధి చేయటానికి కూడా ఈ పరిశోధన దోహదపడుతుందని చెబుతున్నారు.ఎల్ఈడీ కాంతి, ద్రవ పోషకాలు..భూమిపై గురుత్వాకర్షణ ప్రభావంతో మొక్కల వేళ్లు కిందికి, కాండం పైకి పెరుగుతాయి. అయితే, రోదసీలోని మైక్రోగ్రావిటీ (శూన్య గురుత్వాకర్షణ శక్తి)లో వాతావరణంలో మొక్కల పెరుగుదల శైలి మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష ఇంక్యుబేటర్లలో ప్రత్యేక ఎల్ఈడీ కాంతి, ద్రవ పోషకాల ద్వారా నీరు, ఎరువుల వరి పంట పండించారు. ఈ ప్రయోగంలో పొడవు రకం వరి మొక్కలు అనుకున్న దానికంటే ఆలస్యంగా ధాన్యాన్ని పండించగా, పొట్టి రకం మొక్కలు సరైన సమయంలోనే పండాయి.అంతరిక్ష వరి సాగు ముఖ్యాంశాలుఅంతరిక్ష కేంద్రం: చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్సాగు చేసిన పంట: వరి (పొడవు, పొట్టి రకాలు)ప్రయోగ కాలం: 120 రోజులు మైలురాయి: శూన్య గురుత్వా కర్షణలో ‘నారు నుంచి నూర్పిడి వరకు’ ప్రయోగం విజయవంతంముఖ్య ప్రయోజనాలు: రోదసీలో ఆహారోత్పత్తి, ఆక్సిజన్ పునరుత్పత్తి, నీటి శుద్ధి వ్యవస్థల అనుసంధానం -
35 కోట్ల బ్రాలు, 43 కోట్ల బనియన్లు, అండర్వేర్లు.. అయినా తప్పని కష్టాలు!
గ్వారావో: చైనాలోని గ్వారావో (Guurao) నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ‘అండర్వేర్ సిటీ’గా పిలుస్తారు. ఇక్కడ కేవలం అండర్వేర్లు, బ్రా, బనియన్ల తయారీ పరిశ్రమపైనే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ప్రతిరోజూ లక్షలాది ఇన్వర్వేర్లు తయారయ్యే ఈ నగరంలో ఏటా సుమారు 35 కోట్ల బ్రాలు, 43 కోట్ల బనియన్లు, అండర్వేర్లు ఉత్పత్తి అవుతున్నాయి.ఇక్కడి పారిశ్రామిక ఉత్పత్తిలో అండర్వేర్ రంగానికి దాదాపు 80 శాతం వాటా ఉంది. 1982లో ప్రారంభమైన ఈ పరిశ్రమ హాంకాంగ్, తైవాన్ పెట్టుబడుల సహాయంతో క్రమంగా విస్తరించి, 1995-2005 మధ్య కాలంలో భారీ పారిశ్రామిక కేంద్రంగా అవతరించింది. అయితే, కేవలం ఒకే రకమైన పరిశ్రమపై పూర్తిగా ఆధారపడటం ఆ నగరానికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం, గిరాకీకి తగినట్లుగా ధరలు పెంచలేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.దీనికితోడు, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో తయారీ ఖర్చులు తక్కువగా ఉన్న ఆ ప్రాంతాలకు ఆర్డర్లు తరలిపోతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గి, స్థానిక ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోలేకపోతే, కేవలం ఒకే రంగంపై ఆధారపడిన ఇటువంటి ‘వన్-ఇండస్ట్రీ టౌన్లు’ భవిష్యత్తులో తీవ్ర సంక్షోభాన్ని చవిచూసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ! -
బిల్లు పాస్.. భారత్‌పై ట్రంప్ 100% టారిఫ్ అస్త్రం!
ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలోనే కాకుండా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లోనూ చర్చకు దారితీసింది.రష్యా ఇంధన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా వ్యూహం. అయితే ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలు కొత్త ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.ఏమిటీ రష్యా శాంక్షన్స్ బిల్లు?అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు పేరు “లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026”. రష్యా చమురు, గ్యాస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడం, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉపయోగపడుతున్న ఆర్థిక వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ బిల్లు సెనేట్‌లో 86-11 ఓట్లతో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఇక ఇది అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అధ్యక్షుడు ట్రంప్ సంతకం తర్వాత ఇది చట్టంగా మారనుంది.అయితే.. ఈ బిల్లు పేరులో ఇరాన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల్లో ప్రధాన దృష్టి రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవడంపైనే ఉంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్‌కు ఇవ్వడమే ఈ బిల్లులో అత్యంత కీలక అంశంగా మారింది.రష్యా ఇంధనం కొనే దేశాలపై టారిఫ్ పిడుగురష్యా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా మాస్కో ఆదాయానికి గండికొట్టాలని అమెరికా భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే టాప్ ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం లభిస్తుంది.అంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించే దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఇంధన కొనుగోళ్ల అంశం కేవలం ఆర్థిక వ్యవహారంగా కాకుండా అంతర్జాతీయ దౌత్య అంశంగా మారనుంది.భారత్, చైనాలపైనే ఎందుకు గురి?ప్రస్తుతం రష్యా చమురు, గ్యాస్‌కు అతిపెద్ద కొనుగోలుదారుల జాబితాలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. ఈ దేశాల ఇంధన కొనుగోళ్లే రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతుగా మారాయని అమెరికా వాదిస్తోంది.2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే రష్యా చమురు తక్కువ ధరకు లభించడంతో భారత్, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో రష్యా ఇంధన ఆదాయాన్ని పూర్తిగా నిలువరించాలన్న అమెరికా ప్రయత్నాల్లో ఈ దేశాలు ప్రధానంగా మారాయి.భారత్‌కు అసలు పరీక్ష ఎక్కడ?రష్యా చమురు భారత్‌కు గత కొన్నేళ్లుగా కీలక ఇంధన వనరుగా మారింది. తక్కువ ధరకు ముడి చమురు లభించడం వల్ల దేశ ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో ఇది ఉపయోగపడుతోంది. 2026 జూన్‌లో భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే 34 శాతం పెరిగి 4.5 బిలియన్ యూరోలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.అయితే ఇప్పుడు భారత్ ముందు రెండు కీలక అంశాలు నిలిచాయి. ఒకవైపు తక్కువ ధరకు లభించే రష్యా చమురు ద్వారా ఇంధన భద్రతను కొనసాగించాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చైనాపైనా భారీ ప్రభావంఈ బిల్లు ప్రభావం ఎక్కువగా చైనాపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా కొనసాగుతోంది. 2026 జూన్ గణాంకాల ప్రకారం రష్యా ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయంలో చైనా వాటా గణనీయంగా ఉంది. ఐదు అతిపెద్ద కొనుగోలుదారుల ఆదాయంలో 41 శాతం చైనా నుంచే వచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.రష్యా చమురు ఎగుమతుల్లో చైనా దాదాపు సగం కొనుగోలు చేస్తుండగా.. భారత్ కూడా 36 శాతం వాటాతో కీలక కొనుగోలుదారుగా ఉంది. దీంతో ఈ బిల్లు రష్యాపైనే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.లిండ్సే గ్రాహమ్ పేరుతో ఎందుకు?ఈ బిల్లుకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కీలక రూపకర్తల్లో ఒకరు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం జూలై 11న ఆయన ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికీ ఆయన రూపొందించిన ఆంక్షల ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఆయనకు గౌరవంగా ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు.పుతిన్, రష్యా సంస్థలపైనా చర్యలుఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు, ఆర్థిక సంస్థలపై కూడా ఆంక్షలు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న “షాడో ఫ్లీట్” చమురు నౌకల నెట్‌వర్క్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.500 శాతం నుంచి 100 శాతానికి తగ్గిన టారిఫ్ ప్రతిపాదనఈ బిల్లు మొదటి రూపంలో మరింత కఠినంగా ఉంది. రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రతిపాదన ఉండేది. అయితే అమెరికా ప్రభుత్వం, చట్టసభ సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత దీనిని సవరించారు. చివరకు రష్యా ఇంధన కొనుగోలుదారులపై గరిష్ఠ టారిఫ్‌ను 100 శాతానికి పరిమితం చేశారు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై విమర్శలుఈ బిల్లుకు అమెరికాలోనే భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు డెమొక్రాట్లు ట్రంప్‌కు విస్తృత టారిఫ్ అధికారాలు ఇవ్వడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. టారిఫ్‌ల భారం చివరకు అమెరికా వ్యాపారాలు, వినియోగదారులపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్య అవసరమని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు.ఇక ముందు ఏం జరగనుంది?ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ సంతకం తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న.. ట్రంప్ ఈ అధికారాన్ని వెంటనే ఉపయోగిస్తారా? లేదంటే భారత్, చైనా వంటి దేశాలతో చర్చలు, మినహాయింపులు, దౌత్య మార్గాలను ఎంచుకుంటారా? అన్నదే. అయితే..టారిఫ్‌లు అమల్లోకి రాకముందే వాటి ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికా చర్యల భయంతో చమురు కంపెనీలు, బ్యాంకులు, షిప్పింగ్ సంస్థలు తమ భవిష్యత్ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలన్న అమెరికా వ్యూహం ఇప్పుడు భారత్, చైనా వంటి దేశాలకు కొత్త ఆర్థిక పరీక్షగా మారింది. ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల భవిష్యత్ ఆధారపడనుంది. -
చైనా ప్లాన్‌కు భారత్ చెక్! ఆ 27 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు..
చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం ఇదివరకు తెలిసిందే. అయితే, దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో గుర్తించింది. ఈ ప్రాంతాలను స్థానికులు, స్వదేశీయులలో అవగాహన పెంచేదిశగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'జాంగ్నాన్'గా పేర్కొంటూ అక్కడి ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతోంది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కేవలం పేర్లు మార్చడం ద్వారా భూభాగంపై హక్కులు మారవని భారత్ మరోసారి స్పష్టం చేసింది.అయితే, తాజాగా సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించిన మ్యాప్ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలోని లాంగ్జు కూడా ఉంది. 1959లో చైనా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు తొలి ప్రధాన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఎగువన ఉన్నటువంటి సుబన్సిరి జిల్లాలోని సమీప మాజా గ్రామాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.అదేవిధంగా డ్జో లా (Dzo La), రిజా లా (Riza La), పుకుర్ లా (Pukur La) వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తైన పర్వత మార్గాలు ఉన్నాయి. 1962 భారత్-చైనా యుద్ధం ప్రారంభంలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒకటైన థాగ్ లా (Thag La) కూడా ఈ అధికారిక మ్యాప్‌లో భాగమే.27 ప్రదేశాల జాబితా..అలాగే, 1962 భారత్-చైనా యుద్ధంలో కీలక పాత్ర పోషించిన జస్వంత్ గఢ్, షేర్-ఎ-థాపా మెమోరియల్ వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు చాంగ్లాంగ్ జిల్లాలోని జైరాంపూర్ను కూడా ఈ జాబితాలో ఉంది. ఇది తూర్పు అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల భద్రతా దళాల కదలికలకు ముఖ్యమైన కేంద్రం.అయితే, భారత భూభాగాలకు కల్పిత పేర్లు పెట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు 'ఆధారరహిత కథనాలను సృష్టించే ప్రయత్నాలు' మాత్రమేనని న్యూఢిల్లీ పేర్కొంది. ఇటువంటి చర్యలు వాస్తవ పరిస్థితులను ఎప్పటికీ మార్చలేవని స్పష్టం చేయడంతోపాటు ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చని భారత్ హెచ్చరించింది.చైనా తొలిసారిగా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలు, 2021లో 15 ప్రాంతాలు, 2023లో మరో 11 ప్రాంతాలకు పేర్లు మార్చినట్లు ప్రకటించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగమని భారత్ నిరంతరం స్పష్టం చేస్తోంది. అయితే, చైనా చేపట్టే పరిపాలనా లేదా మ్యాప్‌లకు సంబంధించిన చర్యలు భారతదేశ చట్టపరమైన, భౌగోళిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపవని ఈ సందర్భంగా పేర్కొంది. -
అమెరికాకు కొత్త పవర్.. చైనా, రష్యాకు వార్నింగ్ బెల్స్?
ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే నిర్ణయం దిశగా అమెరికా అడుగులు వేస్తోందా? చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటివరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీర్ఘ శ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా, యుద్ధభూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం అమెరికా ప్రధానంగా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక (Strategic) అణు క్షిపణులపై ఆధారపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదనలో తక్కువ శ్రేణి టాక్టికల్ అణు ఆయుధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు పెంటగాన్ విధానాల విభాగం అధిపతి ఎల్బ్రిడ్జ్ కోల్బీ నాయకత్వం వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.మరిన్ని సైనిక ఎంపికలే లక్ష్యమా?ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని ప్రతిస్పందన ఎంపికలు అందుబాటులో ఉంచడమేనని అధికారులు చెబుతున్నారు. రష్యా లేదా చైనా.. అమెరికా మిత్రదేశాలపై దాడి చేసిన సందర్భంలో, భారీ స్థాయి అణు దాడికి మాత్రమే పరిమితం కాకుండా పరిస్థితికి అనుగుణంగా స్పందించే అవకాశాలు ఉండాలని ఈ సమీక్ష సూచిస్తోంది. ఒక సీనియర్ రక్షణ శాఖ అధికారి ప్రకారం..‘అమెరికాకు విశ్వసనీయమైన అణు ప్రతిస్పందన ఎంపికలు అవసరం. అధ్యక్షుడికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటేనే శత్రుదేశాలను సమర్థంగా నిరోధించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.టాక్టికల్ అణు ఆయుధాలు అంటే?టాక్టికల్ అణు ఆయుధాలు వ్యూహాత్మక అణు బాంబులతో పోలిస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఇవి యుద్ధభూమిలోని సైనిక స్థావరాలు, దళాలు లేదా ఇతర సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగించేందుకు రూపొందించబడతాయి. అయినప్పటికీ, ఇవి కూడా భారీ ప్రాణనష్టం, విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగిన అణు ఆయుధాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే, ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చ మొదలైంది. అనుకూల వర్గాలు ఇది అమెరికా అణు నిరోధక శక్తిని (Deterrence) మరింత బలపరుస్తుందని చెబుతుండగా, విమర్శకులు మాత్రం టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెరగడం వల్ల వాటి వినియోగానికి ఉన్న మానసిక అడ్డంకి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అణు ఆయుధం ఉపయోగిస్తే అది మరింత పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.కాగా, ఈ ప్రతిపాదన ఇప్పటికీ విధాన సమీక్ష (Policy Review) దశలోనే ఉంది. అమెరికా ప్రభుత్వం అధికారికంగా కొత్త అణు విధానాన్ని ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న ప్రతిపాదనగా మాత్రమే పరిగణించాలి. అయితే, 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తర్వాత ప్రపంచంలో యుద్ధ రంగంలో అణు ఆయుధాలు మళ్లీ ఉపయోగించబడలేదు. అందుకే అమెరికా అణు వ్యూహంలో ఎలాంటి మార్పు ప్రతిపాదన వచ్చినా, అది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతోంది. -
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఇటీవల పార్లమెంట్లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్ వీళినాథన్ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీలకు నిరోధకంగా’ పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి ‘వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యా’యనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని ‘తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే’ హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూడా కామకోటికి వత్తాసు పలికారు. అధికారిక మద్దతుగోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి. వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు. ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరిం చాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు. గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్ పరిధిలోకి వస్తుంది. యూరిన్ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్‌గా కనిపిస్తుంది. నవ భారతానికి ప్రాచీన జబ్బుకీమోథెరపీ సంబంధిత తక్కువ ప్లేట్లెట్ కౌంట్ల సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా బొప్పాయి ఆకుల నుంచి తీసిన దానిని వినియోగించుకోవచ్చని ఒక నూతన అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఆ అధ్యయన ఫలితాలను ఒక ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కానీ, స్వతంత్ర నిపుణుల అభ్యంతరాలతో ఆ పత్రిక ఆ ఫలితాలను పునః సమీక్షించుకోవాల్సి వచ్చింది. బొప్పాయి ఆకుల నుంచి తీసిన పదార్థ ప్రభావం గొప్పగా ఉందని చూపేందుకు, ఆ పదార్థాన్ని ఉపయోగించినా ఫలితం చూపని రోగుల వివరాలను ఆ అధ్యయన ఫలితాలకు జోడించలేదని స్వతంత్ర నిపుణులు అభ్యంతరం తెలిపారు. పసుపు వేరులలో లభించే రసాయన పదార్థం కర్కుమిన్ విషయంలోనూ ఇదే జరిగింది. క్యాన్సర్‌తో సహా పలు వ్యాధులకు ఆ మూలిక గొప్ప ఔషధంగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. కర్కుమిన్పై భరత్ అగర్వాల్ అనే అమెరికన్ పరిశోధకుడు రాసిన 30కి పైగా పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికలు వెనక్కి తీసుకున్నాయి. గుండె వ్యాధి ముదిరే ప్రక్రియపై భారత–మధ్యధరా సముద్ర తీర ప్రాంత ఆహారపు అలవాట్లు చూపగల ప్రభావంపై మొరాదాబాద్‌కు చెందిన ఆర్.బి. సింగ్ 1990లలో పరిశోధించారు. ఆయన మన ఆహార అలవాట్లను ఇజ్రాయెల్, స్లొవేకియా ప్రాంతవాసుల ఆహార అలవాట్లతో పోల్చి చూశారు. వాటిని లాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురించారు. కొద్ది ఏళ్ళ తర్వాత, ఆ అధ్యయనానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా సాధికారతను కొందరు ఇండిపెండెంట్ సైంటిస్టులు ప్రశ్నించారు. అధ్యయనానికి చెందిన ఒరిజినల్ డేటాను కోరినప్పుడు, ఆ పత్రాలను చెద పురుగులు తినేశాయని సింగ్ జవాబిచ్చారు. ధ్రువీకరించాలనుకునే వైఖరి వల్ల సేఫ్టీ అంశాలు కూడా పక్కనపడతాయి. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న నేచురల్ రెమిడీల వల్ల దుష్ఫలితాలు ఏవైనా సంభవిస్తాయేమో చూడనవసరం లేదనడం కూడా తప్పుడు వాదనే అవుతుంది. ఒక మొక్క నుంచి లభ్యం కాగల జీవరసాయన పదార్థాలు కూడా ఆ మొక్క పెరిగిన భూమిపై ఆధారపడి ఉంటాయి. తిరిగి గోమూత్రం విషయానికొస్తే, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నందువల్ల , దాని సేవనం మానవులకు హానికరం కావచ్చని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయంలో తేలింది. చైనా ఉదాహరణచైనాలోనూ సంప్రదాయ వైద్యానికి ఆదరణ ఉంది. కానీ, అక్కడ మతపరమైన లేదా భావజాల ఆధారిత వైఖరిని అనుసరించడానికి బదులుగా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వినిమయాన్ని చేపట్టారు. ఉదాహరణకు, మలేరియాపై పనిచేసే ఆర్టిమైసినిన్ కనుగొన్నందుకు తు యుయు అనే చైనా సైంటిస్టుకు 2015లో నోబెల్ బహుమతి లభించింది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నవాటిని తిరుగులేని సత్యాలుగా తీసుకునే బదులు, వాటిని ఒక ఐడియాగా తీసుకుని, ఈ ప్రాజెక్టు కింద 400లకు పైగా మొక్కలను పరీక్షించి చూశారు. ఒక మాలిక్యూల్‌ను వేరు చేసి, ఔషధంగా అభివృద్ధి చేయడానికి ముందు యాభై ఏళ్ళకు పైగా నిరంతర ప్రయోగాలు నిర్వహించారు. ఆ డిస్కవరీని కూడా ప్రాచీన గ్రంథాల గొప్పదనాన్ని నిరూపించినదిగాకాక, కాలపరీక్షకు నెగ్గిన సైంటిఫిక్ పద్ధతులకు తార్కాణంగానే పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన పద్ధతులను ప్రోత్సహించే పేరుతో సందేహాస్పద సంస్థల, పరిశోధకుల అధ్యయనాలకు సౌజన్యం వహించడాన్ని సైన్స్ ఏజన్సీలు మానుకోవాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే, అకాడమీలే కలసికట్టుగా ముందుకు వచ్చి పరిశోధనల్లో నిజాయతీకి పాటుపడే ఒక స్వతంత్ర సంస్థను, ఒక రకమైన రిసెర్చ్ అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ప్రపంచానికి షాక్.. భారత్ సహా విదేశీయులపై చైనా సీక్రెట్ మిషన్?
బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ... ఈ మాట చైనా విషయంలో నిజమవుతోందా?. విదేశీయుల పాస్‌పోర్ట్ నుంచి ఆస్పత్రి రికార్డులు.. విమాన టికెట్లు నుంచి గ్యాస్ బిల్లుల వరకు వేలాది వ్యక్తిగత వివరాలను ఒకే ప్లాట్ఫామ్లో చైనా భద్రపరిచినట్లు వెల్లడైంది. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ఎవరిని కలిసినా.. ఆ సమాచారం అంతా ఒక రహస్య డేటాబేస్‌లో చేరుతుందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వందలాది విదేశీయుల వ్యక్తిగత జీవితాలను అక్షరాలా ‘డిజిటల్ ఫైల్’గా మార్చిన ఈ నిఘా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలకు తెరతీస్తోంది. ఓ సైబర్ పరిశోధకుడు అనుకోకుండా కనిపెట్టిన ఈ రహస్య డేటాబేస్ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఈ డేటాబేస్‌లో భారతీయులతో పాటు వందలాది మంది విదేశీయుల సమాచారం ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఈ సంచలన విషయాన్ని మాజీ విదేశీ పాత్రికేయుడు, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ గుర్తించారు. చైనాకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు ‘డైనమిక్ కంట్రోల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్’ అనే వెబ్సైట్ కనిపించింది. వెబ్సైట్ తెరిచిన వెంటనే స్క్రీన్‌పై తన ఫొటో, పాస్‌పోర్ట్ నంబర్, ఒకప్పుడు చైనాలో ఉపయోగించిన మొబైల్ నంబర్ కనిపించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. తనకు కనిపించిన సమాచారం నిజమైనదేనని, అది కేవలం నమూనా డేటా కాదని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం తనకు హాలీవుడ్ చిత్రం మైనారిటీ రిపోర్ట్ గుర్తు చేసిందని వ్యాఖ్యానించారు.ఆ డేటాబేస్‌లో జాంగ్జియాకౌ నగరంతో సంబంధం ఉన్న 700 మందికి పైగా విదేశీయుల సమాచారం, మొత్తం దాదాపు 12 వేల రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. అందులో విదేశీ జర్నలిస్టులు, విద్యార్థులు, హాంకాంగ్, తైవాన్‌కు చెందిన వ్యక్తులు, పోలీసులు వెతుకుతున్న కొందరి వివరాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, ఆ నగరానికి ఎప్పుడూ వెళ్లని కొంతమంది విదేశీయుల పేర్లు కూడా అందులో కనిపించాయి. ఈ డేటాబేస్‌లో కేవలం పేరు, ఫోన్ నంబర్, పాస్‌పోర్ట్ వివరాలు మాత్రమే కాదు.. ఇంటి చిరునామా, ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా నమోదైన సీసీటీవీ కదలికలు, ఆసుపత్రి సందర్శనలు, గ్యాస్ బిల్లుల చెల్లింపులు, విమానాలు, రైలు ప్రయాణాల వివరాలు, సీటు నంబర్లు, తరచూ వెళ్లే ప్రదేశాలు వంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం కూడా నమోదు చేసినట్లు వెల్లడైంది.చైనాలో పలు యూనివర్సిటీలో చదువుతున్న భారత్, పాకిస్తాన్‌కు చెందిన విద్యార్థుల వివరాలు కూడా ఈ డేటాబేస్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారు ఏ కోర్సు చదువుతున్నారు, వారి మతం, వైవాహిక స్థితి, యూనివర్సిటీ గేటు ఎప్పుడు దాటారు, కెమెరాల్లో ఎప్పుడు నమోదయ్యారు వంటి వివరాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పౌరులను "ఫైవ్ ఐస్ అలయన్స్" పేరుతో ఒకే విభాగంలో వర్గీకరించగా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్, సూడాన్ వంటి దేశాల వారిని "కీ కంట్రీస్"గా గుర్తించారు. హాంకాంగ్, తైవాన్ ప్రజలకు వేర్వేరు ఫోల్డర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.ఈ వెబ్సైట్ లాగిన్ చరిత్రలో అనేక పోలీసు స్టేషన్ల నుంచి యాక్సెస్ చేసిన ఆనవాళ్లు కనిపించాయని హోఫర్ తెలిపారు. దీంతో ఇది సాధారణ సాఫ్ట్వేర్ కాదని, అధికారిక నిఘా వ్యవస్థలో భాగమై ఉండే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ డేటాను చైనా పోలీసులు వాస్తవంగా ఎలా ఉపయోగించారనే విషయంపై స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ డేటాబేస్కు సంబంధించిన లాగిన్ పేజీలో యూజర్‌నేమ్, పాస్వర్డ్ ముందే నమోదు చేసి ఉండటాన్ని హోఫర్ గుర్తించారు. అంటే వందలాది మంది వ్యక్తిగత సమాచారం తగిన భద్రత లేకుండా ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆయన భావించారు. జనవరిలో ఈ సమాచారాన్ని భద్రపరిచిన ఆయన, మే నెల నాటికి ఆ వెబ్సైట్ పూర్తిగా అదృశ్యమైనట్లు తెలిపారు.ఈ ఘటన చైనా డిజిటల్ నిఘా వ్యవస్థపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తింది. విదేశీయుల రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఒకేచోట సమీకరించే సామర్థ్యం ఉన్న వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్దిష్ట డేటాబేస్‌ను చైనా అధికారులు అధికారికంగా ఎలా ఉపయోగించారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా నిర్ధారించబడలేదు. ఈ వివరాలు ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన పరిశోధన ఆధారంగా వెలుగులోకి వచ్చాయి. -
జనాభా తగ్గించండ్రా అంటే చైనా వాళ్ళు ఏం తగ్గించారో చూడండి!
-
భారత్‌కు జిన్‌పింగ్.. గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలి పర్యటన!
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటనపై భారత్ లేదా చైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే.. 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఆయన చేసే తొలి భారత పర్యటనగా నిలుస్తుంది. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. కాగా, జిన్‌పింగ్ పర్యటనకు ముందు భారత్–చైనా మధ్య దౌత్య చర్చలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనాలో పర్యటించి ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే, సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశం, అనంతరం ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో భారత్–చైనా సరిహద్దు వివాద పరిష్కారానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, ఉద్రిక్తతల నివారణ, పరస్పర విశ్వాసం పెంపు వంటి అంశాలపై రెండు దేశాలు ముందడుగు వేయాలని ప్రయత్నిస్తున్నాయి.#JUSTIN: Sources: Chinese President Xi Jinping is likely to visit India in September for the BRICS Summit in New Delhi, marking his first trip to India since the COVID-19 pandemic and the Galwan border tensions, sources said. Ahead of the summit, India and China are expected to…— India Today Global (@ITGGlobal) July 31, 2026మోదీ–షీ భేటీపై ఆసక్తిషీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరైతే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశముంది. ఈ భేటీలో సరిహద్దు వివాదం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అయితే, ప్రస్తుతం జిన్‌పింగ్ భారత్ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేదు. ఢిల్లీ లేదా బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ పర్యటన ఖరారైనట్లు భావించాల్సి ఉంటుంది. -
తాతయ్య వేళకు మందులు వేసుకునేలా..మనవడి అద్భుత ఆవిష్కరణ!
మన అవసరాలు, ఇబ్బందులే ఒక్కోసారి ఆవిష్కరణకు దారితీస్తాయి. ఒక్కోసారి మన ప్రియమైన వాళ్ల కోసం కొంగొత్త ఆవిష్కరణలకు నాందిపలుకుతాయి. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అన్ని తానై పెంచిన తాత బాగోగులు కోసం ఈ మనవడు ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘైకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి మాకై తన తాత వేళకు మందులు వేసుకునేలా గుర్తు చేయడానికి సహాయపడేలా ఓ యాప్‌ని రూపొందించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన తాతగారిపై ఉన్న అపారమైన ప్రేమ ఈ యాప్ రూపకల్పనకు దారితీసిందని చెబుతుండటం విశేషం. ఇటీవలే సెకండరీ స్కూల్ పూర్తి చేసిన మా కై, జూన్‌లో చైనా జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అయిన గావోకావోను రాశాడు.జూలై మధ్యలో షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC)కు హాజరైనప్పుడు షాంఘై మార్నింగ్ పోస్ట్ అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు చెందిన ఏఐ కంపెనీ మోడల్బెస్ట్ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అయిన మినీసీపీఎం (MiniCPM)ను ఉపయోగించి తాను ఈ యాప్‌ను రూపొందించినట్లు మా వివరించాడు. ఆ కాన్ఫెరెన్స్‌లో కంపెనీకి చెందిన కొంతమంది నిపుణులు వస్తారని తెలిసి, వారిని ప్రశ్నలు అడగడానికి వచ్చానని అతను చెప్పాడు. తాతగారి కోసం రూపొందించిన యాప్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇందులో కేవలం కొన్ని లైన్ల కోడ్ మాత్రమే ఉందని వెల్లడించాడు. తాను రూపొందించిన యాప్ మందులు వేసుకోవాలని గుర్తు చేయడమే కాకుండా, యూజర్ ప్యాకేజింగ్ ఫోటోని అప్లోడ్ చేసినట్లయితే..మందుల గడువు ముగిసిందో లేదో కూడా ఈ యాప్ తనిఖీ చేయగలదుని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మందుల గడువు ముగిసినట్లయితే వేసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తుందని తెలిపాడు. చిన్ననాటి నుంచి అన్నీ తానై తాతగారే పెంచారని, ఆయనతో ఉన్న అనుబంధం మాటలకందనిదని పంచుకున్నాడు. ప్రస్తుతం 70 ఏల్ల వయసులో ఉన్న ఆయనకు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించాడు. తాను కాలేజ్‌కి వెళ్లిపోయినా..ఆయన వేళకు మందులు వేసుకోవాలనే ఆరోగ్య సంరక్షణ నిమిత్తమే ఈ యాప్‌ని రూపొందించానని అన్నాడు. తన తాతగారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల మందులు వేసుకోవడం మర్చిపోతారేమో లేదా వాటిని తికమక పడతారేమో అని ఆందోళనతోనే ఇలా యాప్‌ని ఆవిష్కరించినట్లు వెల్లడించాడు. పొరపాటున గడువు మందులు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన, భయమే ఈ యాప్‌ని రూపొందించడానికి కారణమని చెప్పాడు. కాగా, తాను వచ్చే నెల సెప్టెంబర్‌లో మరో నగరంలోని విశ్వవిద్యాలయలంకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇష్టమనేది అవతలి వాడి బాధ్యత, సంరక్షణను హ్యాండిల్ చేయడమని తన జీవనశైలితో చాటి చెప్పాడు కదూ..!.(చదవండి: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్‌లాస్ జర్నీ..! ఓమాడ్‌తో ఏకంగా 18 కేజీలు..) -
చైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్
అత్యాధునిక పద్ధతులతో మౌలికరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా, విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ వినూత్న ప్రయోగాలకు తెరలేపింది. ఇటీవల సిచువాన్ ప్రావిన్స్‌లోని యిబిన్ ప్రాంతంలో భారీ ఎయిర్ షిప్‌ను ఆకాశంలోకి ఎగురవేసింది. దీనికి ‘ఫ్లయింగ్ విండ్ పవర్షిప్ ఎస్–2000’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్లయింగ్ పవర్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఇది గాలి వేగాన్ని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత. సాధారణ విండ్ మిల్లులు భూమికి తక్కువ ఎత్తులోఉంటాయి. అక్కడ గాలి వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఎస్–2000 వంటి వ్యవస్థలు సుమారు 300 నుండి 600 మీటర్ల ఎత్తుకు ఎగిరి, అక్కడ వేగంగా వీచే గాలులను ఉపయోగించుకుంటాయి. ఈ ఎత్తులో గాలి నుండి లభించే శక్తి భూమిపై కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ.సుమారు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తు ఉండే ఈ ఎయిర్‌షిప్ హీలియం నింపిన తేలియాడే వేదిక. భూమిపై కంటే ఆకాశంలో గాలి వేగం స్థిరంగా, బలంగా ఉంటుంది, కాబట్టి ఇది ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. భారీ విండ్ టవర్లు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇనుము వాడకం తగ్గుతుంది. వీటిని అవసరమైన చోటికి సులభంగా తీసుకువెళ్లవచ్చు.ఎస్ –2000 వంటి వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలుగా విద్యుత్తును తయారు చేస్తాయి: ఆన్–బోర్డ్ జనరేషన్ ఒకటైతే, గ్రౌండ్–బేస్డ్ జనరేషన్ రెండోది. ఆన్–బోర్డ్ పద్ధతిలో షిప్ రెక్కలకు ఉండే చిన్న టర్బైన్లు ఆకాశంలో గాలి వేగానికి తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. గ్రౌండ్–బేస్డ్ పద్ధతిలో షిప్ ఆకాశంలో ఎనిమిది అంకె ఆకారంలో తిరుగుతూ కేబుల్‌ను బలంగా లాగుతుంది. దీంతో భూమిపై ఉన్న డ్రమ్ము తిరుగుతుంది. ఆ డ్రమ్ముకు అనుసంధానించిన జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.ఒక సాధారణ విండ్ టవర్ నిర్మించడానికి వందల టన్నుల స్టీల్, కాంక్రీట్ అవసరం కాగా, ఎస్–2000కు అందులో 10% మెటీరియల్ ఉంటే సరిపోతుంది. కేవలం ఒక చిన్న బేస్ స్టేషన్ మాత్రమే భూమిపై ఉంటుంది, కాబట్టి మిగిలిన భూమిని వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఈ షిప్ బాడీని కార్బన్ ఫైబర్‌తో తయారు చేస్తారు. ఇది ఉక్కు కంటే ఐదు రెట్లు బలంగా ఉంటుంది. అలాగే బరువు చాలా తక్కువ.భారత్ పరిస్థితిభారతదేశం పవన శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో మారు మూల గ్రామాల్లో గ్రిడ్ కనెక్షన్ లేని చోట్ల వీటిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా లదాఖ్ వంటి హిమాలయ ప్రాంతాల్లో సాధారణ విండ్ టవర్లు కట్టడం చాలా కష్టం. అక్కడ ఈ ‘ఫ్లయింగ్ షిప్స్’ను సులభంగా తరలించి విద్యుత్ సమస్యను తీర్చవచ్చు.అయితే, మన దేశంలో ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2,000 మీటర్ల ఎత్తులో వీటిని ఎగరవేయడానికి డీజీసీఏ నుండి ప్రత్యేక అనుమతులు కావాలి. రుతుపవనాల సమయంలో వీచే భారీ గాలులు, తుఫానుల నుండి ఈ షిప్స్‌ను రక్షించడం ఒక సవాలు. ఏది ఏమైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్స్ ఆకాశంలో వీచే గాలి నుండి శక్తిని పొందే సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.– తరిగొప్పుల వీఎల్ఎన్ మూర్తి, జర్నలిస్ట్ -
అమెరికాకు బిగ్ షాక్.. ఆ సంచలన సర్వేలో ఏముంది?
ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త.. 'ప్యూ రీసెర్చ్ సెంటర్' (Pew Research Center) ఒక సంచలన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 దేశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు. దీంట్లో బైటపడిన మోస్ట్ ఐ-క్యాచింగ్, షాకింగ్ విషయం ఏంటంటే..? ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రజలు అమెరికా కంటే చైనానే ఎక్కువగా ఇష్టపడుతున్నారట..! అవును..! మీరు చదివింది నిజమే..! ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాధించుకున్న 'సాఫ్ట్ పవర్' క్రమక్రమంగా ఎలా కరిగిపోతుందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే..అసలు అమెరికా మీద ఈ వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది..? చైనా గ్రాఫ్ ఎందుకు అకస్మాత్తుగా పైకి వెళ్తోంది..? దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిజంగానే ఏమైనా మార్పు వస్తుందా? ముందుగా ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే.. అమెరికా గ్రాఫ్ పడిపోవడానికి కేవలం అమెరికా తప్పులే కారణం కాదు..! చైనా తన ఇమేజ్ను గతంతో పోలిస్తే చాలా మెరుగుపరుచుకుంది. సర్వే చేసిన 37 దేశాల సగటు చూసుకుంటే.. చైనాకు అనుకూలంగా 51 శాతం మంది ఓటు వేస్తే, వ్యతిరేకత 39 శాతమే ఉంది..! అంటే చైనాకు నెట్ పాజిటివ్ ఇమేజ్ ఉందన్నమాట..! ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో చైనాకు మంచి మద్దతు ఉంది. మన ఇండియా మాత్రం దీనికి మినహాయింపు అనుకోండి..!కారణం ఇదే..అలాగే, పేద దేశాల్లో చైనాకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఐరోపా లాంటి ధనిక దేశాల్లో చూస్తే.. స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి అత్యంత ధనిక దేశాల ప్రజలు చైనాను కాస్త తక్కువగా ఇష్టపడినా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తర్వాత చైనా మీద ఉన్న నెగెటివిటీ అయితే చాలావరకు తగ్గిపోయింది. కానీ, అమెరికా పరిస్థితి పూర్తిగా తారుమారైంది..! ఆ 37 దేశాల సగటు తీసుకుంటే.. అమెరికాను కేవలం 37 శాతం మందే ఇష్టపడుతున్నారు. ఏకంగా 57 శాతం మంది అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడారు.కేవలం 9 దేశాల్లో మాత్రమే..గత ఏడాదితో పోలిస్తే, ఒక్క మెక్సికో మినహా ప్రతి దేశంలోనూ అమెరికా మీద అభిమానం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు అమెరికా అంటే పడిచచ్చే జర్మనీ లాంటి దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీలో కేవలం 27 శాతం మందే అమెరికాను ఇష్టపడుతున్నారు. కానీ చైనాను ఇష్టపడేవాళ్ళు మాత్రం దానికంటే ఎక్కువే ఉన్నారు..! ప్రపంచంలో కేవలం 9 దేశాల్లో మాత్రమే.. అంటే బ్రెజిల్, ఘనా, హంగేరి, పోలాండ్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ఇండియా, జపాన్, ఇజ్రాయెల్ ఇప్పటికీ చైనా కంటే అమెరికానే బెటర్ అనుకుంటున్నారు.ఇదొక్కటే సమస్య కాదు..సరే..! అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి..? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 'డొనాల్డ్ ట్రంప్' గురించి. అమెరికా వెలుపల ట్రంప్‌కు పాపులారిటీ ఎంత తక్కువగా ఉందో ఈ సర్వే మరోసారి నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 23 శాతం మందికి మాత్రమే ట్రంప్ మీద నమ్మకం ఉందట..! జో బైడెన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ..! అయితే ఇదొక్కటే సమస్య కాదు..! అమెరికా గత దశాబ్ద కాలంగా ప్రతి నాలుగేళ్లకోసారి వైట్‌హౌస్‌లో నాయకులు మారినప్పుడల్లా తన విదేశాంగ విధానాన్ని మార్చేస్తూ వస్తోంది. దీనివల్ల 'అమెరికా ఒక నమ్మకమైన భాగస్వామి కాదు' అనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో బలపడింది.కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! కానీ, ఇక్కడ ట్రంప్ లాంటి వాళ్ళైతే ఒకటే మాట అనొచ్చు.. 'ఐ డోంట్ కేర్!' అని..! ఎందుకంటే, మెత్తగా మాట్లాడితే సాఫ్ట్ పవర్ వస్తుంది. కానీ, అందరూ మనల్ని మోసం చేస్తారనేది ఆయన వాదన. టారిఫ్‌లు, మిలిటరీ బెదిరింపులు లాంటి 'హార్డ్ పవర్' ఉపయోగించడం ద్వారానే అమెరికా తన పనులు సాధించుకోవచ్చని ట్రంప్ గట్టిగా నమ్ముతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! హార్డ్ పవర్‌ని మాత్రమే నమ్ముకోవడం వల్ల కొన్ని షార్ట్-టర్మ్ లాభాలు రావచ్చు. కానీ, లాంగ్-టర్మ్‌లో అమెరికా చాలా నష్టపోతోంది. ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు..ఇందులో మొదటిది.. ఇతర దేశాలు అమెరికా దెబ్బకు భయపడి తమని తాము రక్షించుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటాయి. రెండవది.. ఇది మల్టీపోలార్ (Multipolar) ప్రపంచం..! ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు. కండబలం చూపిస్తే మిగతా దేశాలు చైనాతో చేతులు కలిపేస్తాయి. అప్పుడు అమెరికా బొక్క బోర్లా పడాల్సిందే..!. ఇక మూడవది.. అమెరికా నాయకులు ఒక భ్రమలో ఉంటారు..! 'మా దగ్గర బలం ఉంది. కాబట్టి మిగతా దేశాలు మేము చెప్పినట్లు వింటాయి' అని. కానీ, ఇది తప్పు..! బ్రెజిల్ లాంటి దేశాల ఉదాహరణే తీసుకోండి. ట్రంప్ బ్రెజిల్ మీద టారిఫ్ బాంబులు వేస్తామని బెదిరించినా, అక్కడి అధ్యక్షుడు 'లూలా' వెనక్కి తగ్గలేదు సరికదా.. మరింత గట్టిగా బదులిచ్చారు. ఎందుకంటే అక్కడ ప్రజలకు జాతీయవాదం ముఖ్యం. కాబట్టి, లూలా అలా చేయడం వల్ల అక్కడి ప్రజల్లో ఆయన గ్రాఫ్ ఇంకా పెరిగింది..!అమెరికా నెగ్గుకురాగలదా..?మొత్తానికి చూస్తే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ హయాం, అమెరికాకు ఒక పెద్ద టెస్ట్ కేస్ అని చెప్పవచ్చు..! దశాబ్దాలుగా అమెరికా అంటే 'సాఫ్ట్ పవర్'.. 'హార్డ్ పవర్' రెండింటి కలయిక. మరి ఇప్పుడు కేవలం కండబలం అదే.. Hard Power మాత్రమే చూపించి అమెరికా నెగ్గుకురాగలదా..? లేదా తన గ్లోబల్ లీడర్షిప్ను కోల్పోతుందా..? రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుంది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి, 50 మంది మిస్సింగ్
బీజింగ్: నైరుతి చైనాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. వాటిలో 11 మృతదేహాలను ముందుగా గుర్తించగా, తాజాగా మరో 30 మంది మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య 41కు చేరిందని బుధవారం ప్రకటించారు. మరో 50 మంది ఆచూకీ తెలియరాలేదని చెప్పారు.చోంగ్‌కింగ్‌లోని పెంగ్షుయ్ కౌంటీలో జూలై 17న కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ అడుగున, నది ఒడ్డున ఉన్న పలు నివాస భవనాలు కొండచరియల కింద చిక్కుకున్నాయి.ప్రభుత్వ మీడియా ప్రసారం చేసిన దృశ్యాల్లో భారీగా రాళ్లు, మట్టి కూలిపడి నివాస, వాణిజ్య బజారుపై పేరుకుపోయినట్టు కనిపించింది. ఘటనాస్థలిలో వందలాది మంది సహాయక సిబ్బందిని మోహరించారు.ఘటనాస్థలిలో లభ్యమైన మృతదేహాలు, అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు చేసి గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కొత్తగా 30 మంది బాధితుల మరణాన్ని ధ్రువీకరించినట్టు కౌంటీ అధికారులు తెలిపారు. ఈ విపత్తు చోటుచేసుకోవడానికి 2 వారాల ముందే వాయవ్య చైనాలోని గాన్సు ప్రావిన్స్‌లో మరో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో 33 మంది మట్టిలో చిక్కుకోగా, 21 మంది మృతి చెందారు. -
భూమిపై కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా..
-
ఆ సూర్యుడే దిగి వస్తే.. 582 టన్నుల ‘పవర్ హౌస్’!
సూర్యుడు ఉదయించకపోతే ఒక్క రోజు కూడా మన జీవితం ముందుకు సాగదు. కోట్ల ఏళ్లుగా భూమికి వెలుగు, వేడి, శక్తిని అందిస్తున్న ఆ సూర్యుడి రహస్యం ఏమిటో తెలుసుకుని.. అదే శక్తిని భూమిపైనే సృష్టించాలన్నది శాస్త్రవేత్తల కల. ఇప్పటివరకు అది ప్రయోగశాలలకే పరిమితమైన ఆలోచన. కానీ ఇప్పుడు ఆ కలను నిజం చేసే దిశగా చైనా మరో భారీ అడుగు వేసింది.ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ మాగ్నెట్‌ను నిర్మించి విజయవంతంగా పరీక్షించింది. ఇది చైనా చేపడుతున్న ‘కృత్రిమ సూర్యుడు’ (Artificial Sun) ప్రాజెక్టులో కీలక మైలురాయిగా మారింది. ఈ ఒక్క పరికరం వెనుక దాగి ఉన్న సాంకేతికత.. భవిష్యత్తులో ప్రపంచ విద్యుత్ అవసరాలనే మార్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.582 టన్నుల మహా అయస్కాంతం.. అంత పెద్దదెందుకు?చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసిన ఈ భారీ అయస్కాంతం సాధారణ పరికరం కాదు. దీని బరువు ఏకంగా 582 టన్నులు. ఇది 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో భారీ ‘డి’ ఆకారంలో రూపొందించారు. ఫ్యూజన్ రియాక్టర్లో అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను అదుపులో ఉంచేందుకు ఈ అయస్కాంతం ఉపయోగపడుతుంది.సాధారణంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. సూర్యుడిని భూమిపై తీసుకురావడం కాదు. సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను చిన్న స్థాయిలో, నియంత్రిత పరిస్థితుల్లో పునరావృతం చేయాలన్నదే ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.అసలు ‘కృత్రిమ సూర్యుడు’ అంటే ఏమిటి?సూర్యుడి గుండెలో ప్రతి క్షణం కోట్లాది హైడ్రోజన్ అణువులు కలుస్తూ అపారమైన శక్తిని విడుదల చేస్తుంటాయి. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇదే ప్రక్రియను భూమిపై సృష్టించి విద్యుత్‌గా మార్చగలిగితే.. దాదాపు అంతులేని స్వచ్ఛమైన శక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఫ్యూజన్ విద్యుత్‌లో బొగ్గు, చమురు వంటి ఇంధనాల మాదిరిగా భారీగా కార్బన్ ఉద్గారాలు ఉండవు. అందుకే దీనిని భవిష్యత్తు ‘క్లీన్ ఎనర్జీ’గా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.100 మిలియన్ డిగ్రీల వేడి.. ఎలా అదుపు చేస్తారు?ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది. ఫ్యూజన్ రియాక్టర్లో ప్లాస్మా ఉష్ణోగ్రతలు ఏకంగా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి. అంతటి వేడిని ఏ సాధారణ పదార్థం కూడా తట్టుకోలేదు. అందుకే శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు. చైనా తయారు చేసిన ఈ భారీ మాగ్నెట్ పని కూడా అదే. ఇది అత్యంత వేడిగా ఉన్న ప్లాస్మాను గాల్లోనే నియంత్రిస్తూ రియాక్టర్ గోడలకు తాకకుండా చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మండుతున్న అగ్నిగోళాన్ని చేతితో పట్టుకోకుండా, దూరం నుంచి అదుపు చేసే సాంకేతికత ఇది.2030 నాటికి విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంఈ ప్రయోగంతో చైనా తన ఫ్యూజన్ ప్రణాళికలో మరో ముందడుగు వేసింది. 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఆ దేశ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే EAST (Experimental Advanced Superconducting Tokamak) అనే ప్రయోగ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీన్నే ‘చైనా ఆర్టిఫిషియల్ సన్’ అని కూడా పిలుస్తారు. ఈ కేంద్రం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 1,066 సెకన్ల పాటు కొనసాగించి రికార్డు సృష్టించింది.అయితే ప్రమాదాలు లేవా? సవాళ్లు ఏమిటి?ఫ్యూజన్ శక్తి గురించి వింటే.. “అయితే ఇక విద్యుత్ సమస్యకు ముగిసినట్టేనా?” అనే ప్రశ్న రావచ్చు. కానీ శాస్త్రవేత్తల ముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మొదటిది.. ఖర్చు. ఇలాంటి భారీ రియాక్టర్ల నిర్మాణానికి వేల కోట్ల పెట్టుబడులు అవసరం. రెండోది.. ప్లాస్మాను ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగించడం. 100 మిలియన్ డిగ్రీల వేడిని నియంత్రించడం ఇప్పటికీ అత్యంత క్లిష్టమైన పని. మూడోది.. రియాక్టర్ పదార్థాల భద్రత. ఫ్యూజన్ ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్ల ప్రభావాన్ని తట్టుకునే కొత్త పదార్థాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.అయితే సంప్రదాయ అణు విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే ఫ్యూజన్లో ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంధన సరఫరా ఆగిపోతే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అదుపు తప్పి భారీ అణు విపత్తుగా మారే అవకాశం చాలా తక్కువ.భవిష్యత్తు విద్యుత్‌కు కొత్త ఆశ582 టన్నుల ఈ భారీ అయస్కాంతం కేవలం ఓ యంత్ర భాగం కాదు.. మానవాళి శక్తి భవిష్యత్తుపై పెట్టుకున్న ఓ భారీ ఆశ. ఒకప్పుడు సూర్యుడి శక్తి మనకు అందని అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు అదే శక్తి రహస్యాన్ని భూమిపై అర్థం చేసుకుని ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయోగం వెంటనే మన ఇళ్లకు విద్యుత్ ఇవ్వకపోవచ్చు. కానీ భవిష్యత్తులో బొగ్గు, చమురు వంటి కాలుష్య ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ‘భూమిపై సృష్టించిన సూర్యుడు’ నుంచి విద్యుత్ పొందే రోజులకు ఇది వేసిన మరో పెద్ద అడుగుగా నిలవొచ్చు. -
భారత్- చైనా వాణిజ్యం.. కీలక నిర్ణయం
గ్యాంగ్‌టక్: కోవిడ్ మహమ్మారి మరియు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది. పురాతన సిల్క్ రూట్ (Silk Route) చారిత్రక మార్గంలో భాగమైన నాథూలా పాస్ ఈ వాణిజ్యం ఆగస్టు 1, 2026 నుండి పునఃప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఈ దౌత్యపరమైన ముందడుగుతో సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాథులా పాస్ ద్వారా భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం నాథులా తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని షిప్కీలా, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ తదితర హిమాలయ సరిహద్దు మార్గాలను దశలవారీగా తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.నాథూలా సిల్క్ ప్రత్యేకత ఇది ప్రాచీన 'సిల్క్ రూట్' (పట్టుదారి) మార్గంలో అత్యంత కీలకమైన భాగం. ఒకప్పుడు భారత్ నుండి టిబెట్ (చైనా) మధ్య ప్రధాన వాణిజ్యం ఈ మార్గం గుండానే జరిగేది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న మోటారు మార్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనికులు ముఖాముఖిగా కనిపిస్తారు. సరిహద్దు కంచెను తాకి చూసే అవకాశం ఉండటంతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. నాథులా పాస్ అత్యంత ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉండటం వల్ల వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ఇది ఏడాది పొడవునా తెరిచి ఉండదు డిసెంబర్ నుండి మార్చి వరకు ఉన్న శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది (కొన్నిసార్లు -25°C వరకు). రోడ్లన్నీ మంచుతో కప్పుకుపోవడం వల్ల ప్రయాణం పూర్తిగా అసాధ్యం అవుతుంది. -
చైనాలో తుపాను బీభత్సం
బీజింగ్: నౌల్ తుపాను చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. వాయవ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు 10 మంది మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. జాతీయ సమగ్ర అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ హుయిజౌ నగర సమీపంలో ఆదివారం తెల్లవారుజామున తుపాను తీరం దాటింది. దీంతో గంటకు 162 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తుపాను తీవ్రతను ఊహించిన హోం శాఖ 28 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా వ్యవస్థ దెబ్బతిని వందలాది విమానాలు, హైస్పీడ్ రైలు సరీ్వసులు రద్దయ్యాయి. గ్వాంగ్జౌ, షెన్‌జెన్‌లలో 700కు పైగా విమానాలను నిలిపేశారు. -
1949లో విడిపోయారు : మళ్లీ అనుకోకుండా ఇలా !
దశాబ్దాల క్రితం విడిపోయిన తన పూర్వీకుల కుటుంబాన్ని కలుసుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. ఒక పర్యాటక ప్రాంతంలో జరిగిన సాధారణ సంభాషణ ఇంత మ్యాజిక్ చేస్తుందని వారు అస్సలు ఊహించలేదు. చైనాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంతకీ అసలు ఏమైంది?షాంఘైకి చెందిన చెన్ జీ (Chen Jie) తన బిజినెస్ పనిపై యున్నాన్ ప్రావిన్స్‌లోని లూగూ సరస్సు (Lugu Lake) వద్దకు వెళ్లాడు. జూలై 9 ఉదయం సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో తైవాన్‌కు చెందిన ఫే (Fei) అనే వృద్ధ పర్యాటకుడు అక్కడకు వచ్చాడు. ఇంత అందమైన ప్రదేశంలో తనకు ఒక ఫోటో తీసిపెట్టమని అడిగాడు. ఆ తరువాత అతనితో ఒక సెల్ఫీ తీసుకున్న చెన్ మాటలు కలిపాడు. తీరా చూస్తే, అతను అపరిచితుడు కాదని, చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కుటుంబ సభ్యుడని తరువాత తెలుసుకున్నాడు. తమ పూర్వీకుల ఊరు "పుయువాన్" (Puyuan) అని ఫే చెప్పడంతో చెన్ ఆశ్చర్య పోయాడు. ఎందుకంటే చెన్ సొంత ఊరు కూడా అదే కావడంతో ఈ విషయాన్ని చెన్ తన తండ్రికి చెప్పగా, ఫే తండ్రి పేరు "ఫే యున్‌ఫెంగ్" ఏమో అడగమన్నాడు. అలా ఫే తండ్రి చెన్ తాతగారు సొంత అన్నదమ్ములని తేలింది. దీంతో ఇద్దరూ సంతోషంగా ఉక్కిరిబిక్కిరయ్యారు. కుటుంబ వరస ప్రకారం ఫే, చెన్ జీకి బాబాయి అవుతారు.1949 నాటి చరిత్ర: ఎందుకు విడిపోయారు1949లో ఫే తండ్రి తైవాన్‌కు వెళ్లిపోగా, చెన్ తాతగారు వేరొక కుటుంబానికి దత్తత వెళ్లడం వల్ల వారి ఇంటిపేరు 'చెన్'గా మారింది. కాలక్రమేణా, ఫేయ్ తండ్రి, చెన్ తాత ఇద్దరూకన్నుమూశారు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ ఇపుడు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. ఫెయ్ తండ్రి స్వయంగా చైనాకు రాలేకపోయినా, 1991లో తన సోదరుడికి ఒక లేఖ పంపారు. ఆయన ఒకరి ద్వారా 200 డాలర్లు కూడా పంపారు. ఆ సమయంలో చైనా ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని, 200 డాలర్లను ఒక గణనీయమైన మొత్తంగా పరిగణించే వారని చెన్ వివరించారు. ఆ లేఖలో ఇలా ఉంది, "ఈ డబ్బు నా ప్రేమకు,ఆప్యాయతకు గుర్తు. నేను ఈ సంవత్సరం చైనాకు రాలేకపోతున్నాను. వచ్చే ఏడాది మనం కలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. దేవుడు మీ కుటుంబంలోని వారందరినీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను." అని రాశారు. ఆ కుటుంబం ఇప్పటికీ ఆ లేఖను భద్రంగా దాచుకుంది. దశాబ్దాల పాటు ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయినప్పటికీ, 1980ల చివరలో తైవానీయులు చైనాలోని తమ బంధువులను సందర్శించడానికి అనుమతించడం ప్రారంభమైంది. కొన్నిసార్లు, జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అచ్చం సినిమా కథలా అనిపిస్తాయి ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మన రెండు కుటుంబాల మధ్య సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం బహుశా మన తరం బాధ్యత అంటూ చెన్ ఆనందం ప్రకటించారు. విధి వారి తర్వాతి తరాన్ని కలిపింది అని ఫేయ్ అన్నారు. లేదంటే అక్కడ ఎంతోమంది ఉన్నా ఫే తననే ఫోటో తీయమని అడగడం, ఎపుడో విడిపోయిన తన దగ్గరి బంధువు దొరకడం ఒక అద్భుతమని చెన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఫే తన సొంత ఊరైన పుయువాన్ సందర్శించి, ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన 20 మంది కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోబోతున్నారన్నమాట. కొన్నిసార్లు విధి నమ్మలేనంతటి వింత ఆటలు ఆడుతుంది అంటే ఇదేనేమో! -
అలా చేస్తే మీ పని అంతే.. చైనా,రష్యాలకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్‌కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్‌కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్‌కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. -
ఇక ఫేస్‌ను కూడా అమ్ముకోవచ్చు!
ఇప్పటివరకు మనం ఇళ్లు, భూములు, బంగారం, వాహనాల కొనుగోళ్లు, అమ్మకాల గురించి విన్నాం, చూశాం. కానీ ‘ఫేస్‌వాల్యూ’అనే మాటను నిజం చేస్తూ... మనుషులు తమ ముఖాలను కూడా అమ్ముకునే రోజులు వచ్చేశాయని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, చైనా వినోద రంగంలో ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్! చైనాలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించే షార్ట్ డ్రామాల పరిశ్రమ ఊహించని వేగంగా విస్తరిస్తోంది. రోజుకు వందలాది కొత్త వీడియోలు విడుదలవుతున్నాయి. అయితే, పరిమిత బడ్జెట్ కారణంగా ఒకే నటుడి ముఖం వేర్వేరు పాత్రల్లో, భిన్నమైన రూపాల్లో కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారు. ఒక వీడియోలో ప్రేమకథలో హీరోగా కనిపించిన వ్యక్తి... మరో వీడియోలో హంతకుడిగా, ఇంకో దాంట్లో డాక్టర్‌గా దర్శనమిస్తుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్‌లు చేయడం నిర్మాతలకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొందరు నిర్మాతలు ఫేస్ బయ్యింగ్ అనే క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చారు. అందంగా ఉండి, ఎలాగైనా స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక ఉన్న సామాన్యులను ఆహ్వానించి వారి ముఖాలను త్రీడీ స్కాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, కొంత డబ్బు ఇచ్చి వారి డిజిటల్ రూపాన్ని భద్రపరుచుకుంటారు. ఈ డిజిటల్ ఫేస్‌లను ఏఐ సాయంతో తమ డ్రామాలు, సిరీస్‌లలో వాడుకుంటారు. దీనివల్ల సదరు వ్యక్తులు ప్రత్యక్షంగా షూటింగ్‌కు రావాల్సిన అవసరమే ఉండదు. అయితే, ఒక్కసారి ఆ ఒప్పందంపై సంతకం చేస్తే... తమ ముఖాలపై ఆ అమ్మకందారులకు ఎలాంటి హక్కులు ఉండవు. అయినా ఫర్వాలేదంటూ కేవలం 500 యువాన్లు (సుమారు రూ. 6 వేలు) ఆశపడి చాలామంది తమ ముఖ హక్కులను నిర్మాతలకు రాసిచ్చేస్తున్నారట. డిజిటల్ అస్తిత్వానికే ప్రమాదమా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ట్రెండ్‌పై సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మన డిజిటల్ ఫేస్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్తే, దాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారనే దానిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. భవిష్యత్తులో ఈ డేటాను సైబర్ నేరాలు, డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలకు ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం మన డిజిటల్ గుర్తింపునే శాశ్వతంగా అమ్మేసుకోవడం... నిజంగా లాభమా? లేక కొరివితో తలగోక్కున్నట్టా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.-సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అత్యంత ఖరీదైన 'టీ'.. కిలో రూ. 9 కోట్లా..! ఐతే..
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్ అని పాడుకుంటూ ఆనందంగా ఉదయాన్నే ఆస్వాదిస్తుంటా. టీ అనేది నిత్యజీవితంలో ఒక భాగం అనేలా స్థిరపడిపోయింది. ఒక పూట సిప్ చేయకపోతే ఏదో వెలితి. ఆఫీస్ బాయ్ నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు అంతా మెచ్చే ఈ చాయ్‌లో అత్యంత విలాసవంతమైన రకం కూడా ఉందన్న విషయం తెలుసా!. అత్యంత ఖరీదు అంటే వేలల్లో ఉందనుకుంటున్నారేమో కాదు..ఏకంగా కోట్లు పైమాటే. గ్రాముల్లో కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. ఇంతకీ ఏంటా ఆ చాయ్ ప్రత్యేకత, ఎక్కడ పండిస్తారు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ప్రపంచంలో అత్యంత ఖరీదైన 'టీ' చైనాలోని మాండరిన్లో లభిస్తుంది. ఈ 'టీ' పేరు డా హాంగ్ పావో. దీని అర్థం ఎర్రని వస్త్రం. ఇదేం పేరు అనుకోకండి. ఎందుకంటే ఈ పేరు వెనుక గమత్తైన కథతో పాటు ఇది ఎక్కడ పండిస్తారో తెలిస్తే కంగుతింటారు. దీన్ని ఊలాంగ్ టీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చైనాలో ఫుజియాన్ ప్రావిన్స్‌లో అద్భుతమైన వుయి పర్వతాల్లో పండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ టీకి శతాబ్దాల నాటి చరిత్ర, రాజరిక వారసత్వం ఉంది. ఈ డా హాంగ్ పావో రుచి సాధారణంగా అర్థం కాదట. నెమ్మదిగా ఆస్వాదిస్తేనే దాని రుచి తెలుస్తుందట. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలా కాకుండా, ఈ రెండింటి రుచులకు మధ్యస్థంగా గాఢతను కలిగి ఉంటుందట. తాజా ఆర్కిడ్లతో పోల్చబడే పూల సువాసనలతో పాటు, వేయించిన, పండ్ల వంటి పొగ వాసనలతో మిళితమై ఉంటుంది. దీనికి సహజమైన తీపితో కూడిన రుచి ఉంటుందట. టీ ప్రియులు దీన్ని ఎంతో విలువైనదిగా అపురూపమైనదిగా చూస్తారట.ఎందుకంత ఖరీదు అంటే..వుయి పర్వతాల కొండచరియల మధ్య, పురాణ మాతృ వృక్షాలుగా ప్రసిద్ధి చెందిన ఆరు అసలైన డా హాంగ్ పావో పొదలు మాత్రమే ఉన్నాయి. ఈ పురాతన మొక్కలు వందల ఏళ నాటివని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేగాదు చైనా వీటిని వెలకట్టలేని జాతీయ సంపదగా అభివర్ణిస్తుంది. ఇవి కేవలం ఆరు మాత్రమే ఉండటం కారంణంగా తేయాకు ఉత్పత్తి కూడా పరిమితమే కావడంతో అత్యంత ఖరీదైనదిగా మారిందట. కిలో టీ ధర వచ్చేసి రూ. 9 కోట్లు పై మాటే. ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రసిద్ధ టీ వేలంపాటలలో ఒకదానిలో, 20 గ్రాముల అసలైన డా హాంగ్ పావో సుమారు రూ. 20 లక్షలు. ఒక గ్రాము అసలైన టీ ధర వచ్చేసి రూ. 1.2 లక్షలు. చెప్పాలంటే. ఇది బంగారం కంటే 30 రెట్లు విలువైనది. అయితే చైనా ప్రభుత్వం ఈ టీపై నిషేధం విధించింది. నిషేధం ఎందుకంటే..భవిష్యత్ తరాల కోసం ఆరు అసలైన మాతృ వృక్షాలను రక్షించడానికి, 2006లో చైనా ప్రభుత్వం వాటి నుంచి ఆకులను వాణిజ్యపరంగా సేకరించడాన్ని శాశ్వతంగా నిషేధం విధించింది. ఈ పురాతన పొదలు ఇప్పుడు చైనా సాంస్కృతిక వారసత్వంలో భాగంగా సంరక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ టీని సేకరించడానికి ఎవ్వరి అనుమతి లేదు. వాటి అపారమైన చారిత్రక, సాంస్కృతిక విలువ కారణంగా చైనా ప్రభుత్వం ఆ చెట్లకు సుమారు ₹142 కోట్లు బీమా కూడా చేయించిందట.అంతేగాదు ఈ మాతృ వృక్షాల నుంచి వచ్చిన చివరి పంటను బీజింగ్ ప్యాలెస్ మ్యూజియంలో భద్రపరిచారట. ప్రస్తుతం మార్కెట్లో లభించే డా హాంగ్ పావో, అసలైన మాతృ వృక్షాల నుంచి సేకరించిన టీ కాదట. ఆ గొప్ప రుచిని పునః సృష్టించడం కోసం అసలైన మాతృ వృక్షాల నుంచి జాగ్రత్తగా పెంచిన కృత్రిమ సంతతి (క్లోన్ల) నుంచి ఉత్పత్తి చేయబడుతుందట. ఈ చాయ్ వెనకున్న ఆసక్తికర కథనం..ఒక యువ పండితుడు చక్రవర్తి పరీక్షల కోసం బీజింగ్‌కు వెళ్లే మార్గంలో వుయి పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా, అతను అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సమీపంలోని ఒక ఆలయానికి చెందిన సన్యాసి కొండలపై పెరుగుతున్న ఒక ప్రత్యేకమైన టీ పొద నుంచి ఆకులను ఉపయోగించి టీ తయారు చేయగా, ఆ పండితుడు త్వరగా కోలుకున్నాడు. ఆ తర్వాత చక్రవర్తి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించాడు. కొన్నేళ్లకు చక్రవర్తినే స్వయంగా అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఆ పండితుడు అదే టీని తయారు చేసి ఇవ్వగా చక్రవర్తి కూడా ఆ యువకుడిలానే కోలుకున్నారట. బహుమతిగా, చక్రవర్తి ఆ పండితుడికి ఒక అద్భుతమైన ఎర్రటి ఉత్సవ వస్త్రాన్ని బహూకరించారు. తమ ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఆ తేయాకును గౌరవించాలనే ఉద్దేశ్యంతో, ఆ పండితుడు ఆ వూయి పర్వతాల వద్దకు వెళ్లి, చక్రవర్తి ఇచ్చిన వస్త్రాన్ని తేయాకు పొదలపై కప్పాడు. అప్పటి నుంచి, ఆ తేయాకును డా హాంగ్ పావో, లేదా “పెద్ద ఎర్ర వస్త్రం” అని పిలుస్తున్నారని చైనా జానపద కథనం. ఎలా తయారు చేస్తారంటే..సాధారణం 95-100°C వద్ద అప్పుడే మరిగించిన నీటిలో చాలాసారు నానబెట్టి తీసిని డా హాంగ్ పావో ఆకులను వేస్తారట. కనీసం మూడు సార్లు నానబెట్టి.. మరిగే నీటిలో వేస్తే అత్యంత గాఢమైన రుచులు బయటకు వస్తాయట. ప్రతిసారి నానబెట్టగానే పూల వంటి తీపిదనం వస్తుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఒత్తైన జుట్టు కోసం..! గాయని అరుణా సాయిరామ్ హెయిర్ టిప్స్) -
దీని ముందు చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్ జుజుబీ
కృత్రిమ మేధ (AI) రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా-చైనా మధ్య పోటీ మరింత తీవ్రమైంది. చైనా స్టార్టప్ మూన్‌షాట్ AI తన కొత్త 'కిమి' AI మోడల్‌ను విడుదల చేయడంతో ఈ పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్-సోర్స్ AI మోడల్‌గా కంపెనీ చెప్పుకుంటోంది. ఈ మోడల్ ఉచితంగా, ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంది.కోడింగ్ సామర్థ్యంలో ఇది నంబర్-1గా నిలిచిందని కంపెనీ అంటోంది. అంతేగాక, లోతైన ఆలోచనా సామర్థ్యం (డీప్ థింకింగ్) కలిగి ఉంటూనే, చాలా తక్కువ ఖర్చుతో నడుస్తుంది. కిమి కె-3 మోడల్ పనితీరు ఓపెన్AI, ఆంథ్రోపిక్ వంటి అమెరికన్ కంపెనీల మోడళ్లకు దాదాపు సమానంగా ఉండటంతో అమెరికా టెక్ వర్గాల్లో కలకలం రేగింది.విశేషమేమిటంటే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రపంచవ్యాప్తంగా AI అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని పంచుకున్న సమయంలోనే ఈ మోడల్ విడుదల కావడం. చైనాను ఓపెన్-సోర్స్ విధానానికి మార్గదర్శిగా జిన్‌పింగ్ చిత్రీకరించారు. AI అభివృద్ధి చేయడమనేది ఏ దేశానికి సొంతం కాదని, ఇది ప్రపంచ దేశాల సమష్టి సహకారంతో సాగాల్సిన ప్రక్రియ అని ఆయన అన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం AIలో అమెరికా ఆధిక్యతను వ్యూహాత్మక అవసరంగా భావిస్తున్నారు.గత 18 నెలల్లో చైనా టెక్ కంపెనీలు తక్కువ కంప్యూటింగ్ వనరులతోనే అమెరికన్ మోడళ్లకు దీటుగా పనిచేసే ఓపెన్-సోర్స్ AI మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. మెరుగైన పనితీరు, తక్కువ ఖర్చు కలగలిసిన ఈ కాంబినేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు చైనా AI వ్యవస్థలవైపు మొగ్గు చూపుతున్నారు. మూన్‌షాట్ తాజా మోడల్ ఈ ధోరణికి మరింత ఊతమిచ్చింది.ఇదే సమయంలో, మెటా ప్లాట్‌ఫామ్స్ AI స్టార్టప్ ఆంత్రోపిక్‌కు కంప్యూటింగ్ పవర్ అందించేందుకు భారీ చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు ఉండొచ్చని, ఇది రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రకటనల వ్యాపారానికి మించి, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల నుంచి కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించే ప్రయత్నంలో మెటా ఉంది. పలు దేశాల్లో వ్యాజ్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రధాన ప్రకటనల వ్యాపారంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. -
పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..! పాపం ఆ వధువు స్నేహితురాలు..
పెళ్లిళ్లలో సరదాగా ఆటపట్టించడం అనేది మాములు. ఆ వేడుకకు వచ్చినవారందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తే పర్లేదు..అది కాస్త సీరియస్ అయితేనే లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఏదైనా శృతి మించకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక్కడ అది లోపించడంతో ఆ పెళ్లి బృందం, ఆ కొత్త దంపతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏ సరదా అయినా నష్టం చేకూర్చేలా ఉండకూదనే సత్యాన్ని నేర్పించే బాధకర ఘటన ఇది.చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడ పెళ్లిళ్లలో హున్నావో అనే పురాతన చైనీస్ ఆచారం ఉంది. ఇది వాస్తవానికి దుష్టశక్తులను తరిమికొట్టడానికి, నూతన వధూవరులు, అతిథుల మధ్య బిడియాన్ని తొలగించేందుకు ఏర్పాటు చేసిన సరదా ఆచారం. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్ది అది కాస్తా ప్రమాదకరమైన చిలిపి పనిగా మారిపోయింది. గతంలో కూడా ఇలాంటి ఆచారంతోనే ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు కూడా. ఈసారి మాత్రం మరింత సీరియస్‌గా మారింది. 2023 అక్టోబర్‌లో ఒక జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వివాహ తంతులో భాగంగా ఓ ఫ్రాంక్ చేశారు. అది కాస్తా చూస్తుండగానే సీరియస్‌గా మారింది. ఆ ఫ్రాంక్‌లో భాగంగా వధువు స్నేహితురాలు జాంగ్ని పెళ్లి కొడుకు స్నేహితుల గదిలో ఒంటరిగా వదిలేశారు. ప్రాంక్‌లో భాగంగా ఆమెను అల్మరా నుంచి బయటకు లాగి మంచ మీదకు విసిరి ఆపై ఒక దుప్పటితో గాలిలోకి ఎగరవేస్తారు. ఆ క్రమంలోనే వధువు స్నేహితురాలిని ఒకసారి ఎగరువేసినప్పుడు పెళ్లికొడుకు బృందం పట్టుకుంది. ఆ తర్వాత విసిరినప్పుడు ఆమె నేల మీద సరాసరి పడిపోవడంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. దాంతో జాంగ్ సుమారు 18 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ ఫ్రాంక్ ఆమెకు తీవ్రమైన గాయంతోపాటు శాశ్వత వైకల్యాన్ని మిగిల్చిందామెకు. దాంతో జాంగ్ కోర్టుని ఆశ్రయించింది. ఆ నేపథ్యంలో ఆగస్టు 2024 ఫోరెన్సిక్ న్యాయ బృందం ఆమె గాయాన్ని విచారించి గ్రేడ్ 9 వైకల్యంగా వర్గీకరించింది. అంటే ఇది 20% శాశ్వత వైకల్య రేటింగ్‌కు సమానం. దాంతో ఈ ఘటనకు కారణమైన వధువువరులకు, మరో తొమ్మిది మందిపై వైద్య ఖర్చులు, మానసిక క్షోభకు పరిహారంగా 32 లక్షలు చెల్లించమని ఆదేశించింది చైనా కోర్టు. వివాహ నిర్వాహకులకు ఈ ఫ్రాంక్ గురించి తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు లేదా ఆపడంలో ఎందుకు విఫలమైందంటూ చురకలంటించింది. ఈ దుశ్చర్యకు గానూ ఆ నష్టపరిహారాన్ని.. ఆ నూతన వధువరులకు 40%, అలా చేయమని సూచించిన వ్యక్తికి 20%, ఆ సమయంలో ఉన్న మిగతా తొమ్మిది మందికి 40% వంతున చెల్లించాలని పేర్కొంది.(చదవండి: Dr Deepti Sharma: ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..) -
గెలుపంటే ఇదేకదా..డెలివరీ బాయ్‌టూ చైనా సాహిత్య పురస్కారం
బీజింగ్: పొట్టకూటికోసం వీధుల వెంట పరుగులు తీస్తూ డెలివరీ బాయ్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ఏకం ఒక సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్.. చైనాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని కైవసం చేసుకుని అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. 56 ఏళ్ల వాంగ్ జిబింగ్ రాసిన "మ్యాన్ ఇన్ ఎ హర్రీ" అనే కవితా సంకలనానికి ఆ దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘లుక్సున్" పురస్కారం లభించిందికష్టాల నుంచి కవిత్వం వైపుచైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ జిబింగ్ జీవితం అంతా ఒడిదుడుకులతోనే సాగింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నతనంలోనే చదువుకు దూరమైన వాంగ్.. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా, వ్యర్థాలు సేకరించే వ్యక్తిగా, రోడ్డు పక్కన చిరు వ్యాపారిగా మారారు. చివరకు 2019లో కున్షాన్ నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా స్థిరపడ్డారు.రోజుకు 12 నుంచి 14 గంటల పాటు సైకిళ్లు, బైకులపై తిరుగుతూ డెలివరీలు ఇచ్చే క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలే ఆయనలోని కవిని మేల్కొలిపేలా చేశాయి.ఒక్క ఘటన జీవితాన్నే మార్చింది2019లో ఒక కస్టమర్ తప్పుడు అడ్రస్ ఇవ్వడం వల్ల వాంగ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్డర్ లేట్ అవ్వడంతో కస్టమర్ ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా, కంపెనీ నుండి పెనాల్టీ పడింది. ఆ రాత్రి గుండెల్లోని ఆవేదనను కవిత్వంగా మారుస్తూ ఆయన రాసిన ‘మ్యాన్ ఇన్ ఎ హర్రీ’ (తొందరపాటులో ఉన్న మనిషి) అనే కవిత 2022లో చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'వైబో' (Weibo) లో విపరీతంగా వైరల్ అయింది. కోట్లాది మంది శ్రమజీవుల మనసులను తాకిన ఆ ఒక్క కవితతో ఆయన రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అత్యున్నత పురస్కారం ‘లుక్సున్ లిటరరీ ప్రైజ్’వాంగ్ జిబింగ్ తాజాగా రాసిన ‘లో ఫ్లైట్’ (Low Flight) అనే కవితల సంపుటికి చైనాలోనే అత్యున్నత గౌరవప్రదమైన "లు క్సున్ లిటరరీ ప్రైజ్" లభించింది. చైనా ఆధునిక సాహిత్య పితామహుడిగా పిలవబడే 'లు క్సున్' జ్ఞాపకార్థం ఇచ్చే ఈ అవార్డును, కవిత్వ విభాగంలో వాంగ్‌కు అందజేశారు.ఈ పుస్తకం కోసం ఆయన కేవలం తన బాధలనే కాకుండా, గిగ్ ఎకానమీ (తాత్కాలిక ఉపాధి రంగం) లో పనిచేసే దాదాపు 200 మంది తోటి డెలివరీ రైడర్ల జీవితాలను, వారి సవాళ్లను ఇంటర్వ్యూ చేసి కవితలుగా మలిచారు. ఇప్పటివరకు ఆయన దాదాపు 6,000 పైగా కవితలు రాయడం విశేషం.నగదు పురస్కారం.. అంతకుమించి రాయల్టీ!ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కింద వాంగ్‌కు చైనీస్ రైటర్స్ అసోసియేషన్ భారీ నగదు బహుమతిని కూడా అందజేసింది. గత అవార్డుల లెక్కల ప్రకారం ఈ పురస్కార గ్రహీతలకు సుమారు 1,00,000 చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 11.5 లక్షలకు పైగా) నగదు లభిస్తుంది. దీనితో పాటు, అవార్డు రావడంతో ఆయన పుస్తకాల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి. దీని ద్వారా పబ్లిషర్స్ నుండి ఆయనకు లక్షల్లో రాయల్టీ ఆదాయం కూడా సమకూరుతోంది.డెలివరీలు ఆపేది లేదుసాధారణంగా ఇంత పెద్ద అవార్డు, డబ్బు వస్తే ఎవరైనా ఆ కష్టమైన ఉద్యోగాన్ని వదిలేస్తారు. కానీ వాంగ్ జిబింగ్ మాత్రం తన వినమ్రతను చాటుకున్నారు."ఈ అవార్డు నా జీవితాన్ని కానీ, నన్ను కానీ మార్చలేదు. నాకు 60 ఏళ్లు వచ్చే వరకు నేను డెలివరీ బాయ్‌గానే పనిచేస్తాను. ఈ పనే నన్ను శారీరకంగా దృఢంగా ఉంచుతుంది, సమాజంలోని సామాన్య ప్రజల కష్టాలకు దగ్గరగా ఉంచుతుంది. శ్రమజీవుల గొంతుకగా నా కలాన్ని సాగిస్తూనే ఉంటాను" అని వాంగ్ స్పష్టం చేశారు. -
చైనాలో ఎందుకీ ప్రక్షాళనలు?
చైనాలో విధానపరమైన అన్ని నిర్ణయాలు తీసుకునే కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఈ నెల 14న మరొక సభ్యుడిని తొలగించారు. అసలు పార్టీ నుంచే బహిష్కరించారు. మొత్తం 24 మంది సభ్యులుండే ఆ విభాగం నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ముగ్గురు బహిష్కృతులయారు. ఇదే కాలంలో అత్యున్నత సైనిక జనరల్స్ నలుగురు పదవీ చ్యుతులు కావటమేగాక, కొందరు ఉన్నతాధికారులు ఉరిశిక్షలకు గురికావటమో, జీవిత కాలపు జైలుకు వెళ్లటమో జరిగింది.ప్రచారంలో నిజం ఎంత?ఇందుకు కారణాలు ఏమిటన్నది అర్థం చేసుకోవలసిన విషయం. ఇటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఒక విధమైన దిగ్భ్రమకు కూడా లోనవుతుంది. పలువిధాలైన ఊహాగానాలు, చర్చలు సాగుతాయి. కానీ, చైనా 1949 కమ్యూనిస్టు విప్లవానికి ముందుకాలపు చరిత్రలోనూ తనకుతానే సీమితమై, తన చుట్టూ తాను తిరిగే మిస్టిక్ దేశమే. కమ్యూనిజంలో ఉండే పారదర్శకతా రాహిత్యానికి, ఈ చారిత్రక మిస్టిసిజం తోడై, అక్కడి పరిణామాలలోని వాస్తవాలు ఏమిటో బయటి ప్రపంచానికి సరిగా తెలియని పరిస్థితి ఏర్పడింది. చైనా ప్రభుత్వం స్వయంగా చెప్పేది ఎక్కువగా అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం. కొద్ది సందర్భాలలో మాత్రం రక్షణ రహస్యాలను, శాస్త్ర–సాంకేతికరంగ రహస్యాలను శత్రు దేశాలకు చేరవేయటం. చైనా నాయకత్వం మధ్య అధికార గ్రూపు రాజకీయాలని కూడా పాశ్చాత్య ఇంటెలిజెన్స్ సంస్థలు, మీడియా ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారాన్ని నిజానికి తేలికగా కొట్టివేయవచ్చు. మావో, డెంగ్ జియావ్ పింగ్ తర్వాత ఈ రోజున షీ జిన్‌పింగ్ పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో, ప్రజలలో కూడా ఎదురులేని నాయకుడు. పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో అత్యున్నతాధికార స్థానాలన్నీ ఆయనవే. అది వాంఛనీయమా అన్న చర్చ వేరే. కానీ, ఈ ప్రక్షాళనలకు కారణం మాత్రం అధికార ఘర్షణల నటం కేవలం పాశ్చాత్య ప్రచారాలే.మెరుగ్గా లేని ర్యాంకుఇపుడు విషయానికి వస్తే, ఈ విధమైన ప్రక్షాళనలను పురస్కరించుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి రెండున్నాయి. మొదటిది అవినీతి కోణం. కమ్యూనిస్టు వ్యవస్థలలో నైతికతలు, క్రమశిక్షణలు ఎక్కువనీ, ముఖ్యంగా ఉన్నత స్థానాలకు చేరుకునే వారికి త్యాగశీలత, దేశభక్తి కూడా ఉన్నతంగా ఉంటాయనీ భావిస్తాము. కానీ చైనాలో అవినీతి విస్తృతంగా ఉన్న మాట నిజం. నిరుడు నేను చైనా వెళ్లినప్పుడు, సామాన్య ప్రజలలో ఈ మాట అననివారు కన్పించలేదు. కింది స్థాయిలో గ్రామీణాధికారుల నుంచి ఉన్నత స్థాయి వారిదాకా అందరూ దోషులేనన్నది వినవచ్చిన మాట. దానితో కొంత వెతకగా కనిపించిన లెక్క, అవినీతి ర్యాంకింగ్స్‌లో 182 దేశాలలో చైనా స్థానం 76.చైనా వ్యవస్థలో కీలకమైన విభాగాలు కమ్యూనిస్టు పార్టీ, అధికార యంత్రాంగం, సైన్యం, శాస్త్ర–సాంకేతిక రంగాలు. ఈ నాలుగింటికి నాలుగులోనూ ఏదో ఒక స్థాయిలో అవినీతి చేరింది. వీటిలో పార్టీ అవినీతి అన్నింటికన్న ప్రమాదకరమైనదని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయం. ఎందుకంటే – పార్టీ, దాని సిద్ధాంతం తమ వ్యవస్థకు వెన్నెముక. అది బాగుంటే తక్కిన లోపాలను సరి దిద్దుకోవచ్చు. అదే లేనట్లయితే మొత్తం వ్యవస్థ కుప్పగూలుతుంది. పార్టీని ఎంత లోపరహితంగా ఉంచగలిగితే జన సామాన్యానికి పార్టీపై, నాయకత్వంపై, వ్యవస్థపై అంత విశ్వాసం కుదురుతుంది. అంతిమంగా దేశ సుస్థిరతకు, పురోభివృద్ధికి ఇది అవసరం.ఈ అవగాహనతోనే జిన్‌పింగ్ 2013లో అధికారానికి వచ్చి నప్పటినుంచే అవినీతిని అరికట్టడంపై దృష్టి పెట్టారన్నది చైనాకు బయటి చైనా నిపుణులు చెప్తున్న మాట. ఇందుకు ధ్రువీకరణలను నేను చైనా వెళ్లినప్పుడు విన్నాను కూడా. ఆయన ఆ స్థాయి పార్టీ బాధ్యులపై, సీనియర్ జనరల్స్‌పై సాహసించి తీవ్ర చర్యలు తీసుకుంటున్నారంటే, తన లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండటం ఒకటైతే, ఆయన చర్యలకు తక్కిన పార్టీ నుంచి, సైన్యం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి మద్దతు ఉండటమే కారణం.పెరిగిన సంపదతో అవినీతి కూడా!అంతవరకు బాగున్నదిగానీ, అసలు చైనా వంటి వ్యవస్థలో ఇంతటి అవినీతి ఏమిటన్నది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితే. ఆ కారణాన్ని విని తిరిగి ఆశ్చర్యం కలగవచ్చు. మనమంతా డెంగ్ జియావో పింగ్ సంస్కరణలు సృష్టించిన సంపదల గురించి తప్ప, ఆ దీపం కింద గల నీడలను చూడటం లేదు. అవినీతి, అసమానతల పెరుగుదల ఆ నీడలలో భాగమే. ఆయన చైనా సంపదలను పెంచుతూ, ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు మార్గాన్ని సరళతరం చేస్తూ, మనుషులు ధనికులు కావటం సిగ్గుపడవలసిన విషయమేమీ కాదని ప్రకటించాడు. ఆ ఒక్క వాక్యం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. సక్రమంగానైనా, అక్రమంగానైనా ధన సంపాదనకు ప్రోత్సహించింది. ఒక స్థాయిలో ఆలోచించినపుడు, మావో అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి కోసం వ్యవస్థలో ఒత్తిడులు ఏర్పడిన మాట నిజం. అదే సమయంలో అభివృద్ధి కోసం అనుసరించిన మార్గాలు అనివార్యంగా అవినీతికి కూడా దారితీశాయి. అది మావో కాలంలో లేదు. పింగ్ అధికారానికి వచ్చేనాటికి ఇది అది అని గాక అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయి. అక్కడి ప్రజలు చేసే వ్యాఖ్యలకుగానీ, అవినీతిలో అటువంటి ర్యాంకింగ్కుగానీ, ప్రస్తుత అధ్యక్షుని ప్రక్షాళన చర్యలకుగానీ ఆ పరిస్థితి కారణమవుతున్నది. మరొక ముఖ్య విషయం కూడా దీని వెనకున్నది. అది, 1991లో సోవియెట్ యూనియన్ పతనం వెనుక గల కారణాల నుంచి చైనా నాయకత్వం నేర్చుకున్న పాఠాలు. ఆ కారణాలలో ఒకటి, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సహా అన్ని రంగాలలో పెచ్చు పెరిగిన అవినీతి. రెండవది– పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో స్వేచ్ఛగా చొరబడగలిగిన పాశ్చాత్య గూఢచార సంస్థలు. ఇక్కడ ఒక విశేషం ఉంది. సోవియట్ యూనియన్ పతనానికి ఆర్థిక వెనుక బాటుతనం కూడా ఒక ముఖ్య కారణం. అయితే, పింగ్ బలమైన సైన్యం అవసరమనే పాఠాన్ని అయితే బాగానే తీసుకున్నా,సంపదల వెంట అవినీతి పెరుగుదల అనే పాఠాన్ని మాత్రం తీసుకోలేదు. 1997లో ఆయన మరణించే నాటికే ఏర్పడిన ఈ సమస్యను ఆయన గుర్తించలేదనలేము. ఎందువల్లనైతేనేమి చర్యలేమీ కనిపించ లేదు. తర్వాత 15 ఏళ్లకు 2012లో జిన్‌పింగ్ పార్టీ బాధ్యతలు తీసుకునే వేళకు, ప్రజలకు అసలు కమ్యూనిస్టు పార్టీ పట్లనే విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భావించటంతో, ఆయన అప్పటినుంచే ఈ జాఢ్యం నిర్మూలనకు పూనుకొన్నారు. పూర్తి నిర్మూలన సాధ్యమవుతుందనుకోలేము గానీ, కనీసం తగినంత అదుపు అవుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలదేమో చూడాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మీ మనసుని అర్థం చేసుకునే రోబో
నేటి ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. మనుషుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతున్న ఈ తరుణంలో సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ UBTECH తన వినియోగదారు బ్రాండ్ కింద UWORLD U1 అనే హ్యూమనాయిడ్ కంపానియన్ (సహచర) రోబోను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయగల అల్ట్రా-బయోనిక్ రోబోగా ఇది రికార్డు సృష్టించింది.మనిషికి ప్రతిరూపంఈ రోబో కేవలం యంత్రంలా కాకుండా అచ్చం మనిషి లాంటి రూపాన్ని, హావభావాలను కలిగి ఉంటుంది.మనిషి స్పర్శను తలపించేలా బయోమిమెటిక్ సిలికాన్ చర్మంతో దీనిని రూపొందించారు. దీనికి మేకప్ వేయడం, జుట్టును అమర్చడం కూడా సాధ్యమే.మనుషుల శారీరక కదలికలను 90 శాతం వరకు అనుకరించేందుకు ఇందులో 88 సర్వో జాయింట్లు, ప్రత్యేక మెడ భాగం అమర్చారు.కేవలం మాట్లాడటమే కాదు, మనుషుల వాయిస్ టోన్, ముఖ కవళికలను బట్టి వారి మానసిక స్థితిని 90% కచ్చితత్వంతో గ్రహించి దానికి తగ్గట్టుగా ఓదార్పు మాటలు చెప్పగలదు.ఈ రోబో వంట చేయడం, ఇల్లు ఊడ్చడం వంటి గృహ పనులు చేయదు. కేవలం ఒక మంచి స్నేహితుడిలా సంభాషించడం, మందుల వేళలను గుర్తు చేయడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మానసిక ఉల్లాసాన్ని అందించడమే దీని ఉద్దేశం.చైనాలో ఒంటరిగా ఉంటున్న దాదాపు 12 కోట్ల మంది సింగిల్స్, 32 కోట్ల మందికి పైగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు.ధర ఎంతంటే..ఈ రోబోల ప్రారంభ ధర 1,19,800 యువాన్లు (సుమారు రూ. 14 లక్షలు) కాగా, అత్యంత అధునాతన ఫీచర్లు గల ఆల్ట్రా వెర్షన్ ధర 9,90,000 యువాన్ల (సుమారు రూ. 1.15 కోట్లు) వరకు ఉంది. ఖరీదైన మోడల్స్‌లో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా లేదా గతంలో మరణించిన తమ ప్రియమైన వారి ముఖ రూపాలను (3డీ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్, వాయిస్‌ప్రింట్ ద్వారా) రీ-క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి రోజే ఈ సిరీస్ కోసం ఏకంగా 13,361 యూనిట్ల ప్రీ-ఆర్డర్లు రావడం గమనార్హం. దీని డెలివరీలు రాబోయే సెప్టెంబర్ మధ్య నాటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మానవ సంబంధాల కొరతను ఎంతవరకు తీరుస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
డాలర్‌కు చెక్.. చైనా చెల్లింపుల వ్యవస్థలోకి లిబియా!
ట్రిపోలి: లిబియా తన వాణిజ్య బ్యాంకులను చైనాకు చెందిన ‘క్రాస్-బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్’ (సీఐపీఎస్)తో అనుసంధానించనుంది. దీనివల్ల చైనా కరెన్సీ యువాన్ ఆధారిత లావాదేవీలకు మార్గం సుగమం కావడంతో పాటు, అమెరికన్ డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుంది. ఈ నిర్ణయం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం, సరిహద్దు దాటిన చెల్లింపులను సరళతరం చేయడం, లిబియా-చైనా ఆర్థిక సహకారాన్ని మరింత లోతుగా మార్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఒక కీలక పరిణామంలో చైనా చెల్లింపు, సెటిల్మెంట్ వ్యవస్థకు తమ వాణిజ్య బ్యాంకులను అనుసంధానించాలని లిబియా నిర్ణయించుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లిబియా గవర్నర్ నాజీ మహమ్మద్ ఇస్సా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గాంగ్షెంగ్ శనివారం (జులై 19) ఈ విషయాన్ని ప్రకటించారు. ఇస్సా బీజింగ్‌లో పర్యటించిన సందర్భంగా శుక్రవారం గాంగ్షెంగ్తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ బదిలీలను చైనీస్ యువాన్ ద్వారా సులభతరం చేయడానికి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 2015లో సీఐపీఎస్ను ప్రారంభించింది. లిబియా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని సమీక్షించడంతో పాటు, దానిని బలోపేతం చేయడానికి, వృద్ధి రేటును పెంచడానికి గల మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయి.‘రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య నూతన వ్యూహాత్మక భాగస్వామ్య దశను ప్రారంభించడంపై ప్రాముఖ్యతను చర్చించాం. ఆర్థిక బదిలీలను సరళతరం చేయడానికి, వాటిని సులభంగా నిర్వహించడానికి లిబియా వాణిజ్య బ్యాంకులను చైనాకు చెందిన క్రాస్-బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్‌తో అనుసంధానించాలని నిర్ణయించాం’ అని ఇస్సా పేర్కొన్నారు. అమెరికా పేరును ప్రస్తావించకుండానే, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని మరింత పెంచే విధంగా అడ్డంకులను తొలగించి, వాణిజ్య ప్రక్రియలను సులభతరం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఒక ప్రకటనలో తెలిపారు.నివేదికల ప్రకారం సీఐపీఎస్ అనేది మధ్యవర్తి బ్యాంకుల ద్వారా లావాదేవీలను ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా యువాన్ ఆధారిత చెల్లింపులను పంపడానికి, స్వీకరించడానికి బ్యాంకులకు వీలు కల్పిస్తుంది. చైనీస్ బ్యాంకుల ద్వారా నేరుగా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేయడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నేతృత్వంలో లిబియా బ్యాంకింగ్ ప్రతినిధుల బృందం త్వరలో బీజింగ్‌లో పర్యటించేలా ఏర్పాట్లు చేయాలని కూడా వారు నిర్ణయించారు. ఈ పర్యటన ఇరు దేశాల వాణిజ్య బ్యాంకుల మధ్య సహకారాన్ని నెలకొల్పడానికి, ఆర్థిక బదిలీల విషయంలో చైనా సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. -
తల తెగినా ఫైటింగ్ ఆగలేదు.. భవిష్యత్తు యుద్ధానికి జస్ట్ ట్రైలర్?
చైనాలో జరిగిన ఓ హ్యూమనాయిడ్ రోబో పోరాట కార్యక్రమం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పోటీలో పాల్గొన్న ఓ రోబో ప్రత్యర్థి దాడిలో తన తలను కోల్పోయినప్పటికీ, కొన్ని క్షణాల పాటు పోరాటాన్ని కొనసాగించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటన చైనాలో నిర్వహించిన హ్యూమనాయిడ్ రోబో కాంబాట్ ఈవెంట్లో చోటుచేసుకుంది. ఫైట్ సమయంలో రెండు రోబోలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ప్రత్యర్థి రోబో ఇచ్చిన బలమైన దెబ్బకు ఒక రోబో తల భాగం విరిగిపోయింది. సాధారణంగా యంత్రం పనిచేయడం ఆగిపోతుందని అందరూ భావించినప్పటికీ, ఆ రోబో తన కదలికలను కొనసాగిస్తూ పోరాటం చేసింది.Robot lost its head mid-fight and kept swinging anyway 😂pic.twitter.com/KnMaFDsr2n— Tansu Yegen (@TansuYegen) July 17, 2026రోబో తల భాగం లేకుండానే ముందుకు కదులుతూ దాడులు చేయడం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు దీనిని సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ‘టెర్మినేటర్’ సన్నివేశాలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఘటన రోబోటిక్స్ రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని కూడా చూపిస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల మాదిరిగా నడవడం, సమతుల్యత పాటించడం, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రోగ్రామ్ చేసిన విధంగా స్పందించడం వంటి సామర్థ్యాలను సాధిస్తున్నాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిపై టెక్నాలజీ కంపెనీలు, పరిశోధనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రోబోలు పరిశ్రమలు, సేవా రంగాలు, అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో జరిగిన ఈ రోబో ఫైట్ మాత్రం ఒక విషయం స్పష్టం చేసింది. యంత్రాల ప్రపంచం ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. -
బలూచ్ బిగ్ ట్విస్ట్‌తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
పాకిస్థాన్ ఉనికినే ప్రశ్నిస్తూ, ఆ దేశపు అతిపెద్ద ప్రావిన్స్(రాష్ఠ్రం) ‘బలూచిస్తాన్’ నుండి ఒక సంచలన ప్రకటన వెలువడింది. బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియాలో చేసిన ఒక వైరల్ ట్వీట్ అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. బలూచిస్తాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించడమే కాకుండా, ఆ ప్రాంతంలోని 85 శాతం భూభాగంపై తమ నియంత్రణ ఉందని ఆయన పేర్కొనడం పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సొంత జెండా, జాతీయ గీతం ‘బలూచీ ఫాలూస్’ పేరుతో కొత్త కరెన్సీని కూడా ప్రకటించడంతో, ఈ ప్రాంతం మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో చర్చాంశంగా మారింది.బలూచిస్తాన్ ఎందుకు కీలకం?పాకిస్థాన్ మొత్తం వైశాల్యంలో అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్తాన్, ఆ దేశానికి ప్రాణవాయువు వంటిది. ఇది కేవలం భౌగోళికంగానే కాకుండా, ఖనిజ సంపద పరంగానూ ఎంతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ బంగారం, రాగి, సహజ వాయువు, బొగ్గు వంటి అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రావిన్స్ గనుక పాకిస్థాన్ నుంచి విడిపోతే, పాక్ ఆర్థిక స్థితిగతులు కుప్పకూలడం ఖాయం. అత్యంత వ్యూహాత్మకమైన ఈ ప్రాంతం, ఆసియా దేశాల మధ్య ఒక ప్రధాన ‘గేట్‌వే’గా పనిచేస్తోంది.దశాబ్దాల సుదీర్ఘ పోరాటం1947లో భారత్-పాకిస్థాన్ విభజన జరిగినప్పటి నుండే బలూచిస్తాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. 1950, 60, 70 దశకాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వయంప్రతిపత్తి కోసం, తమ సహజ వనరులపై తమకే హక్కు ఉండాలని, మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలని కోరుతూ వీరు దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.కళాత్ సంస్థానం చరిత్రబలూచిస్తాన్ చరిత్ర 1947 నాటిది. విభజన సమయంలో కళాత్, మకరన్, లాస్ బేలా, ఖారన్ అనే నాలుగు స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. అందులో కళాత్ అత్యంత శక్తివంతమైనది. 1947 ఆగస్టు 11న ఖాన్ ఆఫ్ కళాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. కానీ 227 రోజుల తర్వాత, 1948 మార్చి 20న, బలవంతంగా పాకిస్థాన్‌లో విలీనం చేయబడింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాక్ దమనకాండకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రగిలిపోతూనే ఉంది.పేదరికంలో మగ్గుతున్న సంపన్న ప్రాంతంపాకిస్థాన్లోని ఇతర ప్రాంతాలకు గ్యాస్, విద్యుత్ అందిస్తున్న బలూచిస్తాన్, దురదృష్టవశాత్తూ పేదరికంలో కూరుకుపోయింది. ఇక్కడ 70 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. తమ వనరులను కేంద్రం దోచుకుంటోందని, తమకు దక్కాల్సిన అభివృద్ధి అందడం లేదని బలూచ్ జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షే ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’ వంటి సంస్థలు ఆయుధాలు పట్టేలా చేసింది.చైనాకు బలూచిస్తాన్ ఎందుకు ముఖ్యం?చైనా చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’కు బలూచిస్తాన్ గుండెకాయలాంటిది. 65 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా, పశ్చిమ ప్రాంతాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించాలని చూస్తోంది. ముఖ్యంగా గ్వాదర్ ఓడరేవు చైనాకు ఎంతో కీలకం. ఇది ప్రపంచ వాణిజ్య మార్గాలను శాసించడానికి, మలక్కా జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనాకు ఉన్న ఏకైక మార్గం.ఆయుధ సంపత్తిపై పాక్ ఆందోళనబలూచ్ తిరుగుబాటుదారుల వద్ద ఇప్పుడు అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా పార్లమెంట్లో అంగీకరించారు. పాక్ సైన్యం వద్ద ఉన్న ఆయుధాల కంటే శక్తివంతమైనవి విద్రోహుల వద్ద ఉన్నాయని ఆయన చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ తిరుగుబాటును అణచివేయడం పాకిస్థాన్‌కు సవాలుగా మారింది.స్వతంత్ర దేశం అయ్యే అవకాశం ఉందా?ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా గుర్తింపు రావడం కష్టమైనప్పటికీ, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారాలనే ఆకాంక్ష ఏమాత్రం తగ్గలేదు. పాకిస్థాన్ తన సైనిక శక్తితో ఎంత అణచివేసినా, బలూచ్ ప్రజల స్వేచ్ఛాకాంక్ష రోజురోజుకూ బలపడుతోంది. అధికారిక గుర్తింపు లేకపోయినా, ఈ ప్రాంతం పాకిస్థాన్ అస్థిరతకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్‌కు దక్కింది ఇంతేనా? -
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను చైనా నిర్మించింది. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా రూపొందించింది. దీని విస్తీర్ణం 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇది న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ కంటే ఆరురెట్ల పెద్దది. చాంగ్కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్లో దాదాపు అరకిలోమీటరు పొడవైన 29 ప్లాట్‌ఫామ్స్, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అనువైన 15 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి.ఎనిమిది అంతస్తుల ఈ రైల్వేస్టేషన్ భవంతిని అత్యధునాతనమైన హంగులతో నిర్మించారు. గంటకు 16 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రైల్వేస్టేషన్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. దీని నిర్మాణం కోసం 40 వేల మంది కార్మికులు, రోబోటిక్ యంత్రపరికరాలతో స్టేషన్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో కేవలం 38 నెలల్లోనే పూర్తి చేశారు. -
రోబో అంకుల్! చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా?
పిల్లలూ... మనం షాపుకెళితే ‘చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా’ అని అంకుల్ అడుగుతాడు. కాని ఇక్కడ అంకుల్ లేడు రోబో ఉంది. అందుకే ఈ షాపు పేరు ‘గెలాక్సీ రోబో కియోస్క్’.2026 జూలై 17న చైనాలోని బీజింగ్‌లో తీసిన ఫోటో ఇది. ఈ షాపులో ఏం కావాలన్నా రోబోనే అమ్ముతుంది. జ్యూస్ బాటిల్స్, నీళ్లు, చిన్న బొమ్మలు.... ఏవైనా సరే. పిల్లలు క్యూలో నిలబడి స్క్రీన్ పై ఏది కావాలో టచ్ చేస్తే, లోపల ఉన్న రోబో ఆ వస్తువును తీసి ఇస్తుంది. చూశారా ఎంత బాగుందో! పిల్లలకు ఇది కొత్త అనుభవం. ‘వావ్! రోబో మనకు జ్యూస్ ఇస్తోంది‘ అని సంతోషంగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోబో షాపులు ఇంకా ఎక్కువ అవుతాయట. అప్పుడు మన ఊళ్లో కూడా వస్తాయేమో! అన్నట్టు ఈ రోబో పేరు ‘హ్యూమనాయిడ్ సెల్లర్ రోబో’. అంటే మనిషిలా నిలబడి సామాన్లు అమ్మే రోబో. బీజింగ్‌లోని ‘గెలాక్సీ’ కంపెనీ దీనిని తయారు చేసింది. వెల దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 8 నుంచి 12 గంటల వరకు ఆగకుండా పని చేస్తుంది. లోపల కెమెరా, సెన్సార్లు ఉంటాయి. మీరు ఏ బటన్ నొక్కితే ఆ వస్తువును తీసి ఇస్తుంది. అలసి΄ోదు, కోప్పడదు, లెక్క తప్పదు! -
2020 నాటి ఎన్నికల్లో చైనా జోక్యం
వాషింగ్టన్: 2020 నాటి అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఓటింగ్ వ్యవస్థలో అత్యంత ఆందోళనకరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి వైట్‌హౌస్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రైమ్‌టైమ్ ప్రసంగం చేశారు. దాదాపు అరగంట పాటు మాట్లాడారు. అప్పట్లో తన ప్రత్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా కుట్రలు సాగించిందని, ఆ విషయాన్ని నిర్ధారించే వందలాది నిఘా ఫైళ్లను తాను బహిర్గతం చేశానని చెప్పారు. తన వ్యక్తిగత సమాచారంతో సహా 22 కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా అక్రమంగా సేకరించిందని మండిపడ్డారు. 18 రాష్ట్రాల్లోని ఓటర్ల డేటాను చైనా కొనుగోలు చేసిందని, దొంగిలించిందని లేదా హ్యాక్ చేసిందని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని నిఘా అధికారులు ప్రభుత్వానికి గానీ, కాంగ్రెస్‌కు గానీ చెప్పలేదని నిందించారు. అమెరికా పౌరులు కాని 2,78,000 మంది ఓటర్లుగా నమోదైనట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఓటర్లకు సంబంధించిన సమాచారం చాలావరకు బహిరంగంగానే అందుబాటులో ఉంటుంది. అయితే, ఓటింగ్ విధానాలను మార్చడానికి లేదా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి చైనా ఈ సమాచారాన్ని వాడుకుందని తేల్చడానికి ట్రంప్ ఎటువంటి ఆధారాలనూ చూపలేదు. 2020 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విదేశీ జోక్యం వల్ల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆయన పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సాక్ష్యాధారాలను మాత్రం బయటపెట్టడం లేదు. మరోవైపు, కాంగ్రెస్‌పై నియంత్రణను నిర్ణయించే రాబోయే మధ్యంతర ఎన్నికలపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విపక్ష డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోలేదని బలమైన నమ్మకం ఉన్నట్లు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ 2021 నాటి నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రజామోద రేటింగ్ 37 శాతానికి పడిపోయినట్లు వాషింగ్టన్ పోస్ట్–ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. జీవన వ్యయం పెరగడం, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ప్రత్యక్ష ప్రసారం చేయాలా? వద్దా? తన ప్రసంగాన్ని తప్పనిసరిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రసార, కేబుల్ వార్తా సంస్థలు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాయి. ప్రసారం చేయాలా? వద్దా? అనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోయాయి. అమెరికా మీడియా సంస్థల్లో తన వ్యతిరేకులు ఉన్నారని ట్రంప్ చాలా రోజులుగా ఆక్షేపిస్తున్నారు. మీడియాపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మీడియా సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. కోట్లాది డాలర్ల విలువైన మన ప్రజా ఆస్తి ఎయిర్‌వేవ్స్‌ను (ప్రసార తరంగాలను) ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే వాడుకుంటున్నాయి. మాకు కావాల్సిందల్లా ఎన్నికలు, వార్తల ప్రసారంలో నిజాయితీ మాత్రమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ప్రసంగాన్ని కొన్ని చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయగా, మరికొన్ని చేయలేదు. ట్రంప్ ఆరోపణలు అవాస్తవం: చైనా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. అమెరికా అధ్యక్షుడి వాదనలు కల్పితం, దురుద్దేశపూర్వకం అని స్పష్టంచేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ట్రంప్‌కు సూచించింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ శుక్రవారం పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, ఎన్నడూ జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎల్లప్పుడూ ఎవరు జోక్యం చేసుకుంటారో, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, సాధారణ పౌరులపై ఎవరు నిఘా పెడతారో, విదేశీ పౌరుల డేటాను ఎవరు దొంగిలిస్తారో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. సొంత ప్రవర్తనను సమీక్షించుకోవాలని అమెరికాకు హితవు పలికారు. చైనాను ఎన్నికల అంశంగా వాడుకోవద్దని, చైనా–అమెరికా సంబంధాలను మెరుగుపరిచే దిశగా మరింత కృషి చేయాలని అమెరికాకు స్పష్టంచేశారు. -
చైనా ‘అదృశ్య ఆయుధం’.. భారత్ ముందు భారీ సవాల్!
ఆకాశంలో కనిపించని యుద్ధం మొదలైందా..? శత్రువు కంటికి కనిపించకుండానే దాడి చేసే అత్యాధునిక యుద్ధ విమానాల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న వేళ.. చైనా సామర్థ్యంపై వచ్చిన తాజా అంచనాలు రక్షణ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. చైనా వద్ద అత్యాధునిక జే-20 ‘మైటీ డ్రాగన్’ స్టెల్త్ ఫైటర్ల సంఖ్య ఇప్పటికే సుమారు 500 వరకు ఉండొచ్చని చైనా సైనిక వ్యవహారాల నిపుణుడు ఆండ్రియాస్ రుప్రెక్ట్ అంచనా వేశారు.ఈ అంచనా నిజమైతే.. స్టెల్త్ యుద్ధ విమానాల తయారీలో చైనా ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతున్నట్టే అవుతుంది. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన యుద్ధ విమానాలను భారీ సంఖ్యలో తయారు చేయగల సామర్థ్యాన్ని చైనా సాధించినట్లు ఈ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామం భారత్‌కు కీలక హెచ్చరికగా మారింది. కారణం.. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద ఒక్క స్టెల్త్ ఫైటర్ కూడా లేదు. భవిష్యత్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించనున్న ఐదో తరం యుద్ధ విమానాల రంగంలో భారత్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.🇨🇳 China’s J-36: Next-Gen Stealth FighterInsane footage of China’s J-36 stealth fighter: massive tailless trijet 6th generation design with advanced stealth shaping and powerful long-range capabilities. This is China pushing the frontier of air superiority.Meanwhile the US… https://t.co/bbJW44bv4U pic.twitter.com/JkoJLcnHEn— GeoPaul626 (@Paull626) June 9, 2026జే-20 సాధారణ యుద్ధ విమానం కాదు. రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా శత్రు గగనతలంలోకి చొచ్చుకెళ్లడం, కీలక లక్ష్యాలను గుర్తించడం, శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడం దీని ప్రత్యేకతలు. యుద్ధం ప్రారంభమైన తర్వాత కాకుండా.. మొదటి దశలోనే ప్రత్యర్థి సామర్థ్యాలను బలహీనపరిచే శక్తి స్టెల్త్ విమానాలకు ఉంటుంది. చైనా ఇప్పటికే ఈ విమానాలను టిబెట్ ప్రాంతంలో మోహరించినట్లు గతంలో నివేదికలు వచ్చాయి. భారత్-చైనా సరిహద్దులకు సమీపంలో అత్యాధునిక యుద్ధ విమానాల ఉనికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.భారత్ అడుగులు.. మరోవైపు భారత్ కూడా ఈ సవాలును గుర్తించి ఐదో తరం స్టెల్త్ ఫైటర్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా రూపొందిస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ భవిష్యత్‌లో భారత వాయుసేనలో కీలక పాత్ర పోషించనుంది. అయితే అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.ఇటీవలి సైనిక పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. భవిష్యత్ యుద్ధాల్లో కేవలం సైనిక బలం లేదా సంప్రదాయ ఆయుధాల సంఖ్య మాత్రమే విజయం నిర్ణయించవు. ఆకాశంపై ఆధిపత్యం సాధించే దేశమే వ్యూహాత్మకంగా ముందంజలో ఉంటుంది. అయితే స్టెల్త్ విమానాల సంఖ్యే మొత్తం యుద్ధ సామర్థ్యాన్ని నిర్ణయించదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ కూడా శత్రు విమానాలను గుర్తించే అధునాతన రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలను బలోపేతం చేస్తోంది. ఇవి స్టెల్త్ విమానాల ప్రయోజనాన్ని కొంతవరకు తగ్గించగలవు. కానీ సంఖ్యలు కూడా యుద్ధంలో కీలకమే.చైనా వందల సంఖ్యలో జే-20లను తయారు చేస్తుంటే.. భారత్ ఇంకా తన తొలి స్టెల్త్ యుద్ధ విమానం కోసం ఎదురుచూస్తోంది. ఈ అంతరం కేవలం విమానాల మధ్య కాదు.. రక్షణ తయారీ సామర్థ్యం, సాంకేతిక అభివృద్ధి, నిర్ణయాల వేగం మధ్య ఉన్న తేడాను కూడా చూపిస్తోంది. మరోవైపు.. చైనా జే-20ల సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అదే సమయంలో చైనా ఆరవ తరం యుద్ధ విమానాల అభివృద్ధిపైనా దృష్టి పెడుతోంది.స్టెల్త్ యుద్ధ విమానాల సామర్థ్యం ఉన్న దేశాలు..అమెరికా ప్రపంచంలో అత్యంత అధునాతన స్టెల్త్ టెక్నాలజీ కలిగిన దేశం.ప్రధాన స్టెల్త్ విమానాలు:F-22 Raptor – వైమానిక ఆధిపత్యం కోసం రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం.F-35 Lightning II – ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న స్టెల్త్ ఫైటర్.B-2 Spirit – స్టెల్త్ బాంబర్.B-21 Raider – కొత్త తరం స్టెల్త్ బాంబర్ అభివృద్ధిలో ఉంది.చైనా.. వేగంగా స్టెల్త్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న దేశం.ప్రధాన స్టెల్త్ విమానం: J-20 ‘Mighty Dragon’ – చైనా ఐదో తరం స్టెల్త్ ఫైటర్.భారీ స్థాయిలో J-20 ఉత్పత్తి చేస్తూ సంఖ్యలను పెంచుతోంది.భారత్ సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాల్లో కూడా ఈ విమానాల మోహరింపు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.రష్యా..ప్రధాన స్టెల్త్ యుద్ధ విమానం: Su-57 Felonస్టెల్త్ సామర్థ్యం ఉన్నప్పటికీ ఉత్పత్తి సంఖ్యలు పరిమితంగా ఉన్నాయి.అమెరికా F-35, చైనా J-20 స్థాయిలో పెద్ద ఫ్లీట్ లేదు.U.S. Air Force F-35A stealth fighter aircraft are refueled by a KC-135 Stratotanker while flying patrols over the Middle East. pic.twitter.com/KSbmYTH2LT— U.S. Central Command (@CENTCOM) July 16, 2026 -
'మాకేం అవసరం'.. పెద్దన్నకు చైనా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చైనా అమెరికా ఎన్నికల డేటాలో భారీ స్థాయిలో జోక్యం చేసుకుందని, దాదాపు 22 కోట్ల (220 మిలియన్) మంది అమెరికన్ ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో "పెద్దన్న"గా భావించే ఆయన.. అమెరికా ఎన్నికల భద్రతపైనే విదేశీ జోక్యం జరిగిందంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. అయితే, ట్రంప్ ఆరోపణలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైనా కౌంటర్ ఇచ్చింది. వైట్‌హౌస్‌లో ప్రైమ్‌టైమ్‌లో ప్రసంగించిన ట్రంప్.. 2020 ఎన్నికల సమయంలోనే చైనా అమెరికా ఓటర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దీంతో అమెరికా ఎన్నికల భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికల వ్యవస్థలోని లోపాలను "డీప్ స్టేట్"లోని కొందరు కావాలనే దాచిపెట్టారని కూడా విమర్శించారు.ట్రంప్ ఆరోపణలకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియూ చాంగ్ స్పందించారు. "అమెరికా ఎన్నికలతో మాకేం అవసరం?. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని చైనా ఎప్పుడూ పాటిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత అంశం. వాటి ఫలితాన్ని అమెరికా ప్రజలే నిర్ణయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు" అని స్పష్టం చేశారు.ఇక ట్రంప్ తన ప్రసంగంలో.. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అమెరికా ఎన్నికల విధానం నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు ఏమాత్రం సరిపోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటు ఖచ్చితంగా లెక్కించబడేలా, హ్యాకింగ్ లేదంటే విదేశీ జోక్యానికి అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎన్నికల మౌలిక వసతుల్లో ఉన్న బలహీనతలను వెల్లడించే కీలక నిఘా సమాచారాన్ని ప్రజలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.అమెరికాలో ఓటర్ల నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేసే సేవ్ యాక్ట్ SAVE Actను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్‌ను ట్రంప్ కోరారు. అయితే, ఈ బిల్లు అమలైతే లక్షలాది మంది చట్టబద్ధ ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఓటర్ల హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు ఓటు వేయడం ఇప్పటికే నిషేధితమే.ఇక 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ లభించలేదు. ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన 60కుపైగా కేసుల్లో ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయి అక్రమాలు జరిగాయని ఏ కోర్టూ తేల్చలేదు. రీకౌంట్లు, ఆడిట్లు, ట్రంప్ హయాంలోని న్యాయశాఖ కూడా అలాంటి ఆధారాలు గుర్తించలేదు.అంతేకాకుండా, ఎన్నికల మోసంపై తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయని ఏబీసీ, ఎన్బీసీ వంటి టీవీ నెట్‌వర్క్‌లపై కూడా ట్రంప్ మండిపడ్డారు. అవి ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ.. వాటి ప్రసార లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఓట్ల చోరీ.. చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పాత పాటే పాడిన ఆయన.. ఈసారి ఆసియా దేశమైన చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల సంఖ్యలో అమెరికన్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశం దొంగిలించిందని ఆరోపించారు. అంతేకాదు అమెరికా ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన (Data Breach)గా దీనిని అభివర్ణించారు. అమెరికా ప్రైమ్ టైమ్ స్పీచ్‌లో భాగంగా.. ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్నికల భద్రతపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోట్ల 22 కోట్ల (220 మిలియన్ల) అమెరికన్ ఓటర్ల డేటాను చైనా చోరీ చేసిందన్నారు. ఇటీవల గోప్యత నుంచి తొలగించిన (డీక్లాసిఫై చేసిన) నిఘా పత్రాల్లో చైనా భారీ స్థాయిలో అమెరికా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారని చెప్పారు. ఆ డేటాలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ అనుబంధం వంటి సున్నితమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమాచారాన్ని ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఇతర దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.#WATCH | US President Donald Trump says, "The documents cover five major areas of concern. They show that over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in… pic.twitter.com/V8efjdVqT1— ANI (@ANI) July 17, 2026'డీప్ స్టేట్ నిజాలను దాచింది'అమెరికా ఎన్నికల వ్యవస్థపై దాడి చేసే సామర్థ్యం చైనాతో పాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌కు ఉందని అమెరికా నిఘా వ్యవస్థ గుర్తించినట్లు ట్రంప్ తెలిపారు. చైనా ఎన్నికల జోక్యానికి సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. తన తొలి అధ్యక్ష పదవీకాలంలో ఈ సమాచారం తనకు, అమెరికా ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే జాతీయ నిఘా విభాగం (ODNI), న్యాయశాఖ (DOJ), ఎఫ్‌బీఐ, సీఐఏలను ఆదేశించినట్లు వెల్లడించారు. సమాచారం దాచిన వారిపై ఉద్యోగాల నుంచి తొలగింపుతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు.మళ్లీ అదే మాట2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ఎన్నికల్లో ఉపయోగించిన కొన్ని ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని, ఎన్నికల వ్యవస్థలో అనేక బలహీనతలు బయటపడ్డాయని ఆరోపించారు. అమెరికా ఎన్నికల భద్రతను బలోపేతం చేయాలంటే కఠినమైన ఎన్నికల సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి?భవిష్యత్తులో ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ల నమోదు సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక పత్రాలు తప్పనిసరి చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఫొటో ఐడీ లేకుండా ఓటు హక్కు కల్పించకూడదని, రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఓటర్ల సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ లక్ష్యంతో రిపబ్లికన్లు మద్దతిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act వంటి చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆధారాలు చూపలేదు.. నిఘా వర్గాల వేర్వేరు అభిప్రాయాలుఅయితే తన ప్రసంగంలో ట్రంప్ ఈ ఆరోపణలకు ప్రత్యక్ష ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, అమెరికా నిఘా వర్గాలకు చెందిన కొన్ని సమాచారం ప్రకారం.. చైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నప్పటికీ, 2020 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును మార్చిందని లేదంటే ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసిందని నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.అలాగే 2020 ఎన్నికల ఫలితాలను ట్రంప్ గతంలోనూ పలుమార్లు ప్రశ్నించినప్పటికీ, అమెరికా కోర్టులు, రీకౌంట్లు, అధికారిక సమీక్షల్లో ఎన్నికల ఫలితాన్ని మార్చే స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు వెలుగుచూడలేదని గతంలో తేలింది. అయినప్పటికీ ఎన్నికల భద్రత అంశాన్ని ట్రంప్ మరోసారి జాతీయ చర్చగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అమెరికా కిరీటానికి చైనా సవాల్.. పవర్ గేమ్‌లో కొత్త మలుపు!
ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పేరు అంటేనే ఆధిపత్యం, ప్రభావం, నాయకత్వానికి ప్రతీకగా భావించేవారు. ఆర్థిక శక్తి, సాంకేతిక ఆధిపత్యం, సైనిక బలం, అంతర్జాతీయ సంస్థలపై ప్రభావంతో అమెరికా దశాబ్దాలుగా ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ప్రపంచ ప్రజాభిప్రాయంలో ఓ ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం, కొన్ని దేశాల్లో ప్రజలు అమెరికా కంటే చైనాపై ఎక్కువ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఈ అంతర్జాతీయ సర్వేలో 36 దేశాలు, ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను పరిశీలించారు. ఇందులో అనేక దేశాల్లో చైనా పట్ల సానుకూల దృక్పథం పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యంగా 25 దేశాల్లో చైనాపై ఉన్న అనుకూల అభిప్రాయాలు అమెరికాతో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయి. ఇది ప్రపంచ శక్తి సమీకరణాల్లో మారుతున్న ధోరణులకు సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, దీని అర్థం ప్రపంచం మొత్తం చైనాను అమెరికా కంటే గొప్ప శక్తిగా అంగీకరించిందని కాదు. ప్రజల అభిప్రాయాలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధాలు, భద్రతా ప్రయోజనాలు, రాజకీయ పరిస్థితులు, స్థానిక ప్రజల అనుభవాల ఆధారంగా అమెరికా, చైనాలపై అభిప్రాయాలు మారుతున్నాయి.చైనా పట్ల పెరుగుతున్న సానుకూలతకు ప్రధాన కారణాల్లో ఒకటి ఆ దేశ ఆర్థిక ప్రభావం. గత కొన్ని దశాబ్దాల్లో చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టుల ద్వారా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఆర్థిక సంబంధాలను బలపరిచింది.మరోవైపు అమెరికాపై కొన్ని దేశాల్లో అభిప్రాయాలు మారడానికి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కారణమయ్యాయి. విదేశీ విధాన నిర్ణయాలు, యుద్ధాల్లో అమెరికా పాత్ర, ప్రపంచ వ్యవహారాల్లో దాని జోక్యం వంటి అంశాలపై కొన్ని ప్రాంతాల్లో విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమెరికా విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే అమెరికా బలం ఇంకా గణనీయంగానే ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండటం, డాలర్ ఆధిపత్యం, ఆధునిక సాంకేతిక రంగం, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సైనిక కూటములు వంటి అంశాల్లో అమెరికా ముందంజలో ఉంది. అనేక దేశాలు ఇప్పటికీ భద్రత, పెట్టుబడులు, సాంకేతిక సహకారం కోసం అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నాయి. చైనాపై కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు ఉన్నాయి. మానవ హక్కులు, రాజకీయ స్వేచ్ఛ, పారదర్శకత, దక్షిణ చైనా సముద్ర వివాదాలు వంటి అంశాలపై పలు దేశాలు చైనాను విమర్శిస్తున్నాయి. అందువల్ల చైనా పట్ల సానుకూల అభిప్రాయం పెరగడం అంటే అన్ని అంశాల్లో ఆ దేశానికి మద్దతు పెరిగిందని భావించలేం.ప్యూ సర్వేలో మరో ఆసక్తికర అంశం నాయకులపై ఉన్న అభిప్రాయాలు. కొన్ని దేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పట్ల ఉన్న అభిప్రాయాలు అమెరికా అధ్యక్షుడి పట్ల ఉన్న అభిప్రాయాల కంటే మెరుగ్గా నమోదైనట్లు సర్వే వెల్లడించింది. ఇది వ్యక్తిగత నాయకత్వంపై ఉన్న అంతర్జాతీయ అభిప్రాయాల్లో కూడా మార్పులను సూచిస్తోంది. ఇక, భారత్ విషయానికి వస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. భారత్‌కు అమెరికాతో వ్యూహాత్మక, రక్షణ, సాంకేతిక సంబంధాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో చైనా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైనా, సరిహద్దు వివాదాలు, భద్రతా అంశాలు రెండు దేశాల సంబంధాల్లో కీలకంగా ఉన్నాయి. అందుకే భారత్‌లో అమెరికా, చైనా పట్ల అభిప్రాయాలు ఇతర దేశాల కంటే ప్రత్యేకంగా ఉంటాయి.మొత్తంగా చూస్తే, ఈ ప్యూ సర్వే ప్రపంచ శక్తి సమీకరణాల్లో వస్తున్న మార్పులకు ఒక అద్దంలా కనిపిస్తోంది. అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, చైనా ఆర్థిక, దౌత్య ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. రాబోయే కాలంలో ప్రపంచ నాయకత్వ పోరు కేవలం సైనిక బలం లేదా ఆర్థిక శక్తితోనే కాకుండా... ప్రజల అభిప్రాయాలు, దౌత్య సంబంధాలు, అభివృద్ధి నమూనాలపై కూడా ఆధారపడనుంది. -
భారత్, చైనాకు గుడ్‌న్యూస్.. అమెరికా కీలక నిర్ణయం!
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు ఊరట లభించింది. రష్యా ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా చట్టసభ సభ్యులు తీసుకొచ్చిన కఠిన ఆంక్షల బిల్లులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధించే ప్రతిపాదన ఉండగా, తాజాగా సవరించిన బిల్లులో ఆ పరిమితిని 100 శాతానికి తగ్గించారు. దీంతో అమెరికా టారిఫ్ ముప్పు నుంచి భారత్, చైనాలకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.రష్యాపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన ఈ ద్వైపాక్షిక బిల్లును రిపబ్లికన్ పార్టీకి చెందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమొక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ తొలిసారిగా ప్రవేశపెట్టారు. రష్యా అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించడంతో పాటు.. రష్యా ఇంధనంపై ఆధారపడుతున్న దేశాలపై టారిఫ్‌ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.ప్రారంభ ప్రతిపాదనలో రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలపై ఒకే విధంగా 500 శాతం భారీ సుంకాలు విధించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అమల్లోకి వస్తే రష్యా చమురుకు ప్రధాన కొనుగోలుదారులైన భారత్, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండేది. అయితే తాజాగా సవరించిన వెర్షన్లో రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై విధించే టారిఫ్‌ను గరిష్ఠంగా 100 శాతానికి తగ్గించారు.కొత్త ప్రతిపాదనలో కొన్ని దేశాలకు మినహాయింపులు కూడా కల్పించారు. రష్యా సహజ వాయువు దిగుమతులు మొత్తం రష్యా ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాలు, ఆ దిగుమతులను తగ్గించేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంటున్నట్లయితే ఆ దేశాలకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఈ నిబంధనతో జపాన్, ఫ్రాన్స్, హంగేరీ, బెల్జియం వంటి దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ బిల్లుకు ప్రస్తుతం అమెరికా సెనేట్‌లో మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 26 మంది సెనేటర్లు సహ-ప్రతిపాదకులుగా ఉన్నారని సెనేట్ వర్గాలు తెలిపాయి. మరింత మంది సభ్యులు మద్దతు ఇస్తారని, బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. వీటితో పాటు స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ కూడా రష్యా ముడి చమురు దిగుమతిదారులుగా ఉన్నాయి. రష్యా సహజ వాయువు దిగుమతుల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరీ, బెల్జియం ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఇక, రష్యా చమురు ఆదాయం తగ్గించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంపై మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా లక్ష్యం. అయితే భారత్ మాత్రం తన ఇంధన అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. చౌక ధరలకు లభించే రష్యా ముడి చమురు భారత ఇంధన భద్రతకు కీలకంగా మారింది. 500 శాతం టారిఫ్ ప్రతిపాదన నుంచి 100 శాతం పరిమితికి మారడం భారత్‌కు తక్షణ ఉపశమనంగా కనిపిస్తోంది. అయితే రష్యా చమురు అంశం అమెరికా-భారత్ సంబంధాల్లో, అలాగే ప్రపంచ ఇంధన రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా కీలక అంశంగానే కొనసాగనుంది. -
ఏఐ బూమ్‌తో ఎగుమతులు అప్!
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం చైనా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదింది. అంతర్జాతీయ మార్కెట్లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది జూన్ నెలలో చైనా ఎగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మేరకు చైనా కస్టమ్స్ శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ఆర్థికవేత్తల ముందస్తు అంచనాలను తలకిందులు చేస్తూ నమోదైన ఈ రికార్డు వృద్ధి, చైనా ఎగుమతి రంగానికి బలమైన మైలేజీని ఇచ్చింది. గడిచిన మే నెలలో నమోదైన 19.4 శాతం వార్షిక వృద్ధితో పోలిస్తే జూన్ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం.ఏఐ సాంకేతికత, ఈవీలదే హవాగ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ చైనా హైటెక్ ఉత్పాదక రంగానికి భారీగా కలిసివచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ మోడల్స్ విస్తృతి పెరగడంతో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు కంప్యూటర్లు, ఆటోమేటెడ్ డేటా ప్రాసెసింగ్ పరికరాలు, హైటెక్ ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతులు వృద్ధి చెందాయి. అలాగే, చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా గ్లోబల్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అమెరికా టారిఫ్‌ల భయంతో పశ్చిమ దేశాల వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇవ్వడం కూడా ఈ అసాధారణ వృద్ధికి మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.దేశీయ మందగమనానికి విదేశీ ఊరటప్రస్తుతం చైనా దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర సంక్షోభాన్ని, వినియోగదారుల ఖర్చుల్లో మందగమనాన్ని ఎదుర్కొంటోంది. స్థానిక మార్కెట్లో నెలకొన్న ఈ బలహీనతలను విదేశీ ఎగుమతుల జోరు సమర్థవంతంగా భర్తీ చేస్తోంది. అయితే, ఈ వృద్ధి సుస్థిరంగా కొనసాగడంపై ఆర్థిక నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రస్తుతానికి ఎగుమతుల వృద్ధి బాగున్నప్పటికీ భవిష్యత్తులో ఇది మరింత సున్నితంగా మారే అవకాశం ఉంది. ఆటోమొబైల్స్, ఏఐ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు పూర్తిగా అంతర్జాతీయ డిమాండ్, పశ్చిమ దేశాల నియంత్రణలపైనే ఆధారపడి ఉంటాయి’ బీఎన్పీ పారిబాస్ సెక్యూరిటీస్ (చైనా) మల్టీ-అస్సెట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వేయ్ లీ అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
సముద్రం లోతుల్లో చైనా సీక్రెట్ టెస్ట్.. భారత్‌కు భారీ ముప్పు
చైనా గత వారం (జులై 6) సముద్రం నుంచి ప్రయోగించే దీర్ఘ శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించింది. అంతర్జాతీయ జలాల్లో జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణికి ఇదే తొలి పరీక్ష. ఇంకో కీలక విషయం ఏమిటంటే, 1980 తర్వాత అంతర్జాతీయ జలాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చేపట్టిన రెండో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ఇదే. 2024 సెప్టెంబర్ 21న డాంగ్ ఫెంగ్ లేదా డీఎఫ్-31 వ్యవస్థతో భూమి నుంచి ప్రయోగించే ఐసీబీఎం పరీక్షను చైనా నిర్వహించింది.తాజా పరీక్షలో పీఎల్ఏ నౌకాదళానికి చెందిన జిన్-తరగతి టైప్ 094 జలాంతర్గామి నుంచి క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. అది నకిలీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లింది. 7,300 కి.మీ. దూరం ప్రయాణించిన ఆ వార్‌హెడ్ ఫిలిప్పీన్స్పైగా వెళ్లి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడినట్టు తెలుస్తోంది. నౌరు, కిరిబాటి, టువాలు దేశాల ప్రత్యేక ఆర్థిక మండలాలపైగా ప్రయాణించిన ఆ వార్‌హెడ్, రరోటోంగా ఒప్పందం పరిధిలోని దక్షిణ పసిఫిక్ అణు ఆయుధ రహిత ప్రాంతంలో పడింది. అక్కడ అణు పేలుడు పరికరాల పరీక్షలు, మోహరింపు నిషేధం అమల్లో ఉంది.ఈ క్షిపణి పరీక్ష గురించి ఏమి తెలుసు?ఈ క్షిపణి జు లాంగ్ 2 (జేఎల్-2)నా లేదా తాజా జు లాంగ్ 3 (జేఎల్-3)నా అన్నది కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. జేఎల్-2, జేఎల్-3 రెండూ జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులే. వీటిని వరుసగా డీఎఫ్-31, డీఎఫ్-41 వ్యవస్థలతో కలిపి అభివృద్ధి చేశారు. సాధారణంగా ఐసీబీఎంల పరిధి కనీసం 5,000 కి.మీ. ఉంటుంది. జేఎల్-2 8,000-9,000 కి.మీ. దూరం వెళ్లగలదు. జేఎల్-3 పరిధి 9,000 కి.మీ.కుపైగా ఉంటుందని సమాచారం.ప్రస్తుతం చైనా వినియోగిస్తున్న టైప్ 094 ఎస్ఎస్బీఎన్ జలాంతర్గాములతో ఈ రెండు వ్యవస్థలను అమర్చవచ్చు. ప్రయాణించిన దూరాన్ని బట్టి ఏ వ్యవస్థ వాడారో స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే చైనా రెండు సార్లు పరీక్షించి ఉండవచ్చు లేదా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల మాదిరిగానే క్షిపణి పరీక్షలు లేదా సైనిక విన్యాసాలకు ముందు చైనా నావిగేషన్ హెచ్చరిక జారీ చేస్తుంది. ఈసారి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం రెండు మార్గాలను పరిశీలించింది. ఒకటి దక్షిణ చైనా సముద్రం నుంచి దక్షిణ పసిఫిక్ మహాసముద్రం వైపు ప్రయోగించడం. రెండోది ఈశాన్య ప్రాంతంలోని బొహాయ్ సముద్రం నుంచి జపాన్పైగా పసిఫిక్ వైపు ప్రయోగించడం. రెండో మార్గం ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉండటంతో, తొలి మార్గాన్నే చైనా ఎంచుకున్నట్టు అంచనా.బీజింగ్ ఇప్పుడు ఎందుకు పరీక్షిస్తోంది?ఈ దశాబ్దం ఆరంభం నుంచి, ముఖ్యంగా గత రెండేళ్లలో, తన అణు సామర్థ్యాలు పెరుగుతున్నాయని బీజింగ్ బహిరంగంగానే ప్రపంచానికి చూపిస్తోంది. అమెరికా ఉపగ్రహాలు గుర్తిస్తాయని తెలిసినా దాచిపెట్టకుండా అనేక క్షిపణి సైలోలను నిర్మించింది. 2025 సైనిక పరేడ్‌లో కొత్త అణు ఆయుధ రవాణా వ్యవస్థలను ప్రదర్శించింది. 2024లో పసిఫిక్ మహాసముద్రంలో భూమి నుంచి ఐసీబీఎం పరీక్ష కూడా చేపట్టింది.ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, తన అణు సామర్థ్యాల పెరుగుదలను గుర్తించాలని చైనా కోరుకుంటోంది. భూమి, సముద్రం, గగనం నుంచి అణు ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యంతో అణు త్రయం నిర్మాణాన్ని ప్రదర్శించాలన్న ప్రయత్నం కూడా ఇందులో భాగం. తొలి దాడి చేయబోమన్న అణు విధానాన్ని ప్రకటించిన దేశాలు భారత్, చైనా మాత్రమే. అందువల్ల ప్రతిదాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యం కూడా ఇందులో ఉండవచ్చు. ఇవే కాదు. అణు రక్షణ కవచాన్ని నిర్మించడం, మహాశక్తి హోదా సాధించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ స్థాయి అణు ఆధిపత్యాన్ని పెంచుకోవడం వంటి లక్ష్యాలు కూడా ఈ చర్యల వెనుక ఉండవచ్చు.చైనా అణు వ్యూహం మారిందా?లేదు.. చైనా ప్రకటించిన అణు వ్యూహంలో ప్రధాన అంశాలు ఇవి. మొదటిది తొలి అణు దాడి చేయబోమన్న విధానం. రెండోది దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తామన్న హామీ. మూడోది అణు ఆయుధాలు లేని దేశాలపై, అణు ఆయుధ రహిత ప్రాంతాలపై అణు ఆయుధాలను వినియోగించబోమని లేదా బెదిరించబోమని ప్రకటించడం.ఈ అంశాల్లో మార్పు లేదు. అయితే చైనా కనీస అణు నిరోధక విధానాన్ని కూడా అనుసరిస్తోంది. ఇటీవల అణు సామర్థ్యం, వైవిధ్యం, కచ్చితత్వం, సన్నద్ధత పెరిగిన తీరు చూస్తే ఆ విధానం నుంచి దూరమవుతున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. 2030 నాటికి చైనా వద్ద సుమారు 1,000 అణు వార్హెడ్లు ఉండే అవకాశం ఉంది. దాడి హెచ్చరిక అందగానే లక్ష్యాలు తాకకముందే ప్రతిదాడి ప్రారంభించే "లాంచ్ ఆన్ వార్నింగ్" సన్నద్ధత వైపు తన బలగాల్లో కొంత భాగాన్ని మార్చుతోంది. దీనిని బీజింగ్ "ఎర్లీ వార్నింగ్ కౌంటర్ స్ట్రైక్" (యుజింగ్ ఫాంజి)గా పిలుస్తోంది.అణు కమాండ్, నియంత్రణ, సమాచార వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. 10 కిలోటన్నుల కంటే తక్కువ శక్తి ఉన్న యుద్ధ వినియోగ అణు వ్యవస్థలను అభివృద్ధి చేస్తుండవచ్చు. బలమైన అణు త్రయంతో ప్రకటించిన సిద్ధాంతం, వాస్తవ అణు సామర్థ్యం మధ్య తేడా పెరుగుతోంది.భారత్‌పై ప్రభావం ఏంటి?మనదేశం దృష్టిలో ఈ పరీక్షతో భారత్, చైనా అణు ఆయుధ నిల్వలు, ప్రయోగ సామర్థ్యాల మధ్య వ్యూహాత్మక అంతరం మరింత స్పష్టమైంది. అరిహంత్ తరగతి ఎస్ఎస్బీఎన్ జలాంతర్గాములతో భారత్ అణు త్రయాన్ని అమల్లోకి తెచ్చింది. అయినా ప్రస్తుతం వినియోగిస్తున్న జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల పరిధి తక్కువే.చైనా ప్రదర్శనతో భారత్ దీర్ఘ శ్రేణి కే-5, కే-6 క్షిపణులను త్వరగా మోహరించాల్సిన అవసరం పెరిగింది. అప్పుడు మాత్రమే ప్రతిదాడి సామర్థ్యంలో సమతుల్యత సాధిస్తుంది. చైనా అణు ఆధునికీకరణను చూస్తే దక్షిణాసియాలో అణు ఆయుధ పోటీ మరింత వేగం అందుకుంటుంది.దక్షిణ చైనా సముద్రంలోని రక్షిత ప్రాంతం నుంచి జేఎల్ క్షిపణిని ప్రయోగించడం వల్ల చైనా జలాంతర్గాములను గుర్తించడం కష్టమవుతుంది. అందువల్ల భారతదేశం జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు, సముద్ర అడుగు ప్రాంతాల పర్యవేక్షణను కనీసం హిందూ మహాసముద్ర ప్రాంతంలో విస్తరించాలి.అమెరికా, మిగతా ప్రపంచం దృష్టిలో ఈ ప్రయోగం చైనా అణు త్రయం పరిపక్వ స్థాయికి చేరిందనే విషయాన్ని, అణు నిరోధక సామర్థ్యం పెరిగిందనే విషయాన్ని స్పష్టంగా చూపించింది. చైనా అణు ఆధునికీకరణ గురించి అమెరికాకు ఇప్పటికే అవగాహన ఉన్నా, ఈ పరీక్ష క్షిపణి రక్షణ ప్రణాళికలను మరింత క్లిష్టం చేస్తుంది. పశ్చిమాసియా నుంచి తూర్పు ఆసియాపై దృష్టి, వనరులను మళ్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. చైనా తీర ప్రాంతాలు, దక్షిణ చైనా సముద్రానికి సమీపంలో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు, నిఘా వ్యవస్థలను మరింత పెంచాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది.చైనా సామర్థ్యాలు పెరగడం వల్ల తన ప్రభావ పరిధిలో ఏ సంక్షోభం తలెత్తినా బయటి దేశాలు జోక్యం చేసుకోవడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతుందని ప్రాంతీయ దేశాలు కూడా గుర్తిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా సైనిక సాయంపై అనిశ్చితి పెరిగిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
మొరార్జీ దేశాయ్ చేసిన ఒక్క ఒక్క ఫోన్ కాల్ తో..
-
చైనాపై ప్రకృతి విలయం.. టైఫూన్ దెబ్బకు అతలాకుతలం
చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. శక్తివంతమైన టైఫూన్ బవి (Typhoon Bavi) తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, చెట్లు విరిగిపడటం, రవాణా అంతరాయాలు చోటుచేసుకున్నాయి.TyphoonBavi.. టైఫూన్ బవి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు సుమారు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం తుపాను బలహీనపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారినప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో జెజియాంగ్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూకింగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు.#China evacuated more than 1 million people & issued high alerts as eastern China braced for #TyphoonBavi, which brought strong winds and rain to #Japan's southern islands and #Taiwan. #floods #Phillipines #typhoon #Bavi #Beijing #heavyrain pic.twitter.com/hjSWM5y1kQ— Salar News (@EnglishSalar) July 11, 2026టైఫూన్ దెబ్బకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విమాన సర్వీసులు రద్దయ్యాయి, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షాంఘైలోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. చైనాతో పాటు తైవాన్, జపాన్ దక్షిణ దీవులపై కూడా టైఫూన్ ప్రభావం చూపింది. తైవాన్‌లో బలమైన గాలులు, వర్షాల కారణంగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. వాతావరణ నిపుణులు మరో హెచ్చరిక జారీ చేశారు. తుపాను బలహీనపడినప్పటికీ తూర్పు చైనా ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచి, ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ప్రకృతి ప్రకోపం నుంచి కోట్లాది మంది ప్రజలను రక్షించేందుకు భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.🇹🇼 Typhoon Bavi is battering Taiwan, forcing more than 14,000 people to evacuate. Keelung is being lashed by fierce winds and heavy rain, while over 27,000 households are already without power. 🌪️⚠️ #TyphoonBavi #Taiwan #Breaking pic.twitter.com/VU1Nrd0AkB— 呀婷 (Ya-Ting) (@YaTing542311) July 11, 2026Nature returning the trash with gigantic waves during the arrival of Typhoon Bavi in Taizhou, Zhejiang Province, China 🇨🇳 , on July 11, 2026.#TyphoonBavi pic.twitter.com/aX9ulp23gN— 🄲🄾🄻🄾🄽🄴🄻 🄱🄾🄶🄴🅈 (@alfadelta0108) July 11, 2026


