
వాషింగ్టన్: ప్రస్తుతం చైనాపై విధించిన సుంకాలు శాశ్వతం కాదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా చర్యలకు అనుగుణంగానే వారి వస్తువులపై అత్యధిక సుంకాలు విధించాల్సి వచ్చిందన్నారు. అవేమీ స్థిరంగా కొనసాగవన్నారు ట్రంప్. కాకపోతే తాను ఆ విధంగా సుంకాలు విధించేలా చేశారంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్.. చైనాపై విదించిన సుంకాలకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరుదేశాలు ఒకరిపై ఒకరు అత్యధిక సుంకాలు విధించుకోవడానికి కారణాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ బదులిచ్చారు.
మరో రెండు వారాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం అవుతానని, అప్పుడు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు, సుంకాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తమ మధ్య భేటీ అంతా సజావుగానే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
చైనా ఎప్పుడూ తమపై ఆదిపత్యం కోసమే చూస్తుందని, ఏం జరుగుతుందనేది తనకైతే తెలియదని, ఏం జరుగుతందో చూద్దాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చైనాపై 145 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య వైరం కాస్త ముదిరింది. ఆపై చైనాపై సుంకాలను 100 శాతానికి పరిమితం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సైతం చైనా తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండటానికి ఈ తరహా విధానం మంచిది కాదని, తమ ఆధిపత్యంతో ప్రపంచ దేశాల్ని కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చైనా ధ్వజమెత్తింది. అప్పట్నుంచీ ఇరు దేశాల మధ్య వైరంతో పాటు దూరం కూడా పెరిగింది.
ఇదీ చదవండి.
‘రాబోయే కాలమంతా భారత్‌ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’