
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో చైనా పట్ల తమ వైఖరిని వెల్లడించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజులు పొడిగించారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తలెత్తబోయే సుంకాల వివాదాన్ని ట్రంప్ మరికొంత కాలం వాయిదా వేశారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో చైనాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో పొడిగింపు కోసం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని, అయితే ఒప్పందంలోని అన్ని ఇతర అంశాలు అలాగే ఉంటాయని తెలియజేశారు. నిజానికి ట్రంప్ చైనాకు ఇచ్చిన గడువు మంగళవారం (ఆగస్టు 12) మధ్యాహ్నం 12:01 గంటలకు ముగియనుంది. ఒకవేళ ట్రంప్ గడువు ఇవ్వకుంటే అమెరికా.. చైనా దిగుమతులపై 30శాతం అధిక పన్నులను పెంచివుండేది.
( @realDonaldTrump - Truth Social Post )
( Donald J. Trump - Aug 11, 2025, 8:00 PM ET )
I have just signed an Executive Order that will extend the Tariff Suspension on China for another 90 days. All other elements of the Agreement will remain the same. … pic.twitter.com/ho0n2AaE6x— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) August 12, 2025
సుంకాల ఒప్పందం విషయంలో కుదిరిన విరామం రెండు దేశాలు పరస్పరం చర్చించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే ఈ సంవత్సరం చివర్లో ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికా-చైనా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు సీన్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ పొడిగింపు రెండు ప్రభుత్వాలకు వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరపడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ విరామం చైనాలో తమ మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరుస్తుందని, కంపెనీలు మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన ఖచ్చితత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర వాణిజ్య భాగస్వాములు ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించాయి. యేల్ విశ్వవిద్యాలయంలోని బడ్జెట్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం సగటు యూఎస్ సుంకం ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 2.5 శాతం నుండి 18.6 శాతానికి పెరిగింది. ఇది 1933 తర్వాత అత్యధికం.