‘అసలు ట్రంప్‌కు బుర్ర ఉందని అనుకోవడం లేదు’ | China Geopolitical Expert Blasts Trump Tariffs Over India | Sakshi
Sakshi News home page

‘భారత్‌ లాంటి దేశాన్ని చిన్నచూపు చూస్తారా?’

Aug 31 2025 4:44 PM | Updated on Aug 31 2025 5:22 PM

China Geopolitical Expert Blasts Trump Tariffs Over India

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఫుల్‌ స్టాప్‌ పడ్డ పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా మోదీ.. చైనాలో అడుగుపెట్టారు.  ఎప్పట్నుంచో భారత్‌తో సంబంధాల కోసం ఎదురుచూస్తున్న చైనా కూడా మోదీ పర్యటనకు ఘన స్వాగతం పలికింది.   ఇదిలా ఉంచితే, భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ సుంకాలను 50 శాతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్‌ టాన్‌జెన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్‌కు కనీసం బుర్ర ఉంటే భారత్‌పై ఆ విధంగా సుంకాలు విధించే వాడు కాదంటూ మండిపడ్డారు.  ప్రపంచ మార్కెట్‌ పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా భారత్‌ అతి పెద్దదని, అటువంటి దేశంపై ట్రంప్‌ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు . ట్రంప్‌ తన బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం, అందులోనూ  భారత్‌ లాంటి దేశంపై సుంకాలతో కాలు దువ్వడం వంటిది అమెరికాకే మంచిది కాదన్నారు.  ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌-మోదీల మధ్య జరుగుతున్న చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు. 

‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌ను బలవంతంగా లొంగిపోయేలా చేయాలనుకున్నారు. రష్యా  ఆయిల్‌ కొంటే సుంకాలు విధించడం ఏంటి?,. భారత్‌ లాంటి దేశాన్ని తక్కువ చేసి చూడటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. తెలివైన వారు ఎవరూ కూడా ఇలా వ్యవహరించరు. ట్రంప్‌ చర్య సరైనది కాదు. భారత్‌కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది.. అవకాశం కూడా ఉంది’ అని  ఎయిమర్‌ టాన్‌జెన్‌ స్సష్టం చేశారు. 

ఇదీ చదవండి: 
భారత్‌లోకి మళ్ళీ టిక్‌టాక్‌?: మొదలైన నియామకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement