
న్యూఢిల్లీ: బుల్లెట్ రైళ్ల వేగంలో చైనా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. చైనా తయారు చేసిన తాజా బుల్లెట్ రైలు సీఆర్ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు ట్రయల్ రన్‌లోనే గంటకు 453 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంది.
బుల్లెట్ రైలు సీఆర్ 450ను ప్రస్తుతం షాంఘై- చెంగ్డు మధ్య హై-స్పీడ్ రైలు మార్గంలో టెస్ట్ చేస్తున్నారు. ఈ రైలు వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఇది ప్రస్తుతం సేవలలో ఉన్న సీఆర్ 400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కి.మీ. వేగవంతమైనది. ఈ పాత మోడల్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి. సీఆర్ 450కి ముందు ఈ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంతో నడిచే రైళ్లుగా గుర్తింపు పొందాయి.
సీఆర్ 450ను స్మార్ట్ డిజైన్‌తో రూపొందించారు. దీని నోస్ కోన్ 15 మీటర్లు. నూతన మోడల్‌లో ఏరోడైనమిక్ నిరోధకతను 22 శాతం మేరకు తగ్గించారు. దీంతో వేగం, ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడ్డాయి. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కి.మీ./గం. వరకు వేగవంతం అవుతుంది. ట్రయల్స్ సమయంలో, రెండు సీఆర్ 450 రైళ్లు గంటకు 896 కిమీ వేగంతో పరుగులు తీశాయి. ప్రయాణ వేగంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాయి. ఈ రైలును రూపొందించిన ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల డిజైన్ ప్రేరణతో ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదేళ్లు పనిచేశారు.
#China's CR450 high-speed train, the world's fastest bullet train, has set a new record by reaching a top speed of 453 km/h during testing. It can accelerate from a standstill to 350 km/h within 5 minutes! #highspeedtrain pic.twitter.com/2AtK0LFZb1
— CCTV Asia Pacific (@CCTVAsiaPacific) October 22, 2025
ఇది కూడా చదవండి: మెహుల్ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు