
పరోక్షంగా వెల్లడించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ భవితవ్యంపై డీల్ కుదిరినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. సోమవారం ఆయన తన సోషల్‌మీడియా ఖాతా లో దీనికి సంబంధించి సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు.
‘అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకుంటున్న ఒక కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిపై వచ్చే శుక్రవా రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడుతా’అని ప్రకటించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ కంపెనీ టిక్‌టాక్ అని భావిస్తున్నారు. చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్ సృష్టించిన టిక్‌టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.