మరోసారి టారిఫ్‌ బాంబ్‌ పేల్చిన ట్రంప్‌ | Another Tariff Bomb Blasted From Tump This Time Details Here | Sakshi
Sakshi News home page

మరోసారి టారిఫ్‌ బాంబ్‌ పేల్చిన ట్రంప్‌

Oct 7 2025 6:56 AM | Updated on Oct 7 2025 6:56 AM

Another Tariff Bomb Blasted From Tump This Time Details Here

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి టారిఫ్‌ బాంబ్‌(Trump Another Tariff) పేల్చారు. ఈసారి మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ ట్రక్కులపై పెంచిన ఈ సుంకాలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. 

నవంబర్ 1వ తేదీ నుంచి మధ్యస్థ, భారీ వాణిజ్య ట్రక్కులపై అమెరికా 25% సుంకాలు వసూలు చేయనుంది. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రొత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే.. అమెరికా-ఆధారిత భాగస్వామ్య దేశాలు, జాయింట్ వెంచర్లు ఈ టారిఫ్‌ నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకపోలేదు. ఇక.. 

చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై ఈ లేటెస్ట్‌ టారిఫ్‌ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ టారిఫ్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ విడి భాగాలు, ఉపకరణాలు (components) దిగుమతులపై కూడా టారిఫ్‌లు ఉంటే, ఆటోమొబైల్ ఎక్స్‌పోర్ట్-ఆధారిత వ్యాపారాలపై ప్రభావం ఉండొచ్చు. భారత్ నుంచి అమెరికాకు ఈ తరహా ట్రక్కుల (Medium/Heavy-duty Trucks) దిగుమతులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంతగా ప్రభావం పడకపోవచ్చు. అయితే.. ఇక్కడి కంపెనీలు అమెరికా మార్కెట్‌లో ప్రవేశించాలనుకుంటే మాత్రం టారిఫ్‌ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 

ఇదీ చదవండి: నెల తిరగకముందే రాజీనామా చేసిన ప్రధాని!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement