
ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తంతు ముగిస్తే చాలు.. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. పాత కాలంలో అమ్మాయి-అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోవడమే గగనమైతే.. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లికొడుకు-పెళ్లికూతరు(పెళ్లికి ముందే) ప్రీ వెడ్డింగ్ షూట్‌లో మెరిసి మురిసిపోవడం పరిపాటిగా మారిపోయింది.
ఇదంతా ఇలా ఉంచితే, ప్రీ వెడ్డింగ్ షూట్‌లో అమ్మాయిని అబ్బాయి హగ్ చేసుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అటు పెళ్లి క్యాన్సల్ కావడం ఒకటైతే, తనను హగ్ చేసుకున్నందుకు మూడు లక్షల డబ్బై ఐదు వేలు రూపాయిలు ఇవ్వాలని అమ్మాయి డిమాండ్ చేస్తోంది. చైనాలో చేసుకున్న ఈ ఘటన వైరల్‌గా మారింది.
వీరి నిశ్చితార్థం జనవరిలో జరగ్గా, నవంబర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ దాదాపు పూర్తి చేసుకున్నారు. ఒక హోటల్ తీసుకుని మరీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయి ముందుండి, అబ్బాయి వెనుక ఉండే ఫోటో తీసే సందర్భంలో హగ్ చేసుకోమన్నాడు ఫోటో గ్రాఫర్. దాంతో నిశ్చితార్థ పెళ్లి కొడుకు ఆమెను హగ్ చేసుకున్నాడు. అంతే ఈ పెళ్లి క్యాన్సిల్ అంటూ అమ్మాయి తెగేసి చెప్పేసింది. ఇలా హగ్ చేసుకోవడం ఏంటని పాత సంప్రదాయాన్ని తిరగతోడింది. తాము నిశ్చితార్థం చేసుకోవడానికి ఖర్చులు అయినందున రూ. 3.73 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయికి నిశ్చితార్థంలో అబ్బాయి కుటుంబం వారు 200,000 యువాన్లు(రూ. 25 లక్షలు) బహుమతిగా ఇవ్వడానికి అంగీకరించి అది కాస్తా ఇచ్చేశారు. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ కావడంతో 30,000 యువాన్లు(రూ. 3.73 లక్షలు ) కట్ చేసి మిగతా అమౌంట్‌ను తిరిగి ఇచ్చేసింది. ఇలా ఎందుకు కట్ చేసారని అడిగితే.. అబ్బాయి హగ్ చేసుకున్నందుకు అని ఆమె సమాధానం చెప్పింది. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు ఆ సంబంధం కుదిర్చిన మధ్యవర్తి. తాను వెయ్యికిపైగా పెళ్లిల్లు చేశానని, ఈ అమ్మాయి మాత్రం చాలా భిన్నంగా ఉందన్నాడు. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత మొత్తం తిరిగి ఇవ్వకుండా ఇలా కట్ చేసుకుని మిగతా 170,500 యువాన్లు(సుమారు రూ. 21లక్షలు) మాత్రమే తిరిగి ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏమీ కారణం లేకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇలా డిమాండ్ పేరుతో సుమారు నాలుగు లక్షల రూపాయిలు కట్ చేసుకోవడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు ‘పెళ్లిళ్ల పేరయ్య’.
ఇదీ చదవండి:
ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ