
సెల్ఫీ మోజు.. ఓ పర్వతారోహకుడి ప్రాణం బలి తీసుకుంది(Selfie Death). ఏకంగా 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆ వ్యక్తి పెద్ద పొరపాటు చేశాడు. తోటి బృందంతో సెల్ఫీ కోసమని కట్టుకున్న తాడును విప్పదీసుకున్నాడు. అదే.. అతని మరణానికి కారణమైంది.
చైనా సిచువాన్‌లోని మౌంట్ నామా(Mount Nama) శిఖరంపై(ఎత్తు: 5,588 మీటర్లు.. సుమారుగా 18,300 అడుగులు) ఓ బృందం ట్రెక్కింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఓ హైకర్.. సేఫ్టీ రోప్‌ను విప్పేసి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా.. 200 మీటర్లు(656 మీటర్లు) జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.
మృతుడ్ని 31 ఏళ్ల హాంగ్‌గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్ టౌన్‌కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం.. ఐస్ యాక్స్ లేకపోవడంతో కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచుపై జారి ఈ ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హంగ్ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలోMount Nama Viral Video వైరల్ అవుతోంది.
Terrifying Footage Shows Tourist Sliding To His Death After Taking A Selfie On Mount Nama Feng In Sichuan, 🇨🇳
He reportedly unclipped his safety harness to take a picture, but slipped on the ice and was sent plummeting into the abyss - to the horror of fellow climbers. pic.twitter.com/Z4Wa5esHlT— sanjay patel (@Sanjaypatel12Dr) October 3, 2025
ఇదిలా ఉంటే.. హంగ్‌తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రొఫెషనల్ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే ఉందని సిచువాన్ మౌంటెనీరింగ్ అసోషియేషన్ అంటోంది.
ఇదీ చదవండి: మీరు తినగా వదిలేసిన ఆహారం ఏమవుతుందో తెలుసా?