breaking news
Amit Shah
-
ఐఎస్ఐ కుట్రను భగ్నం చేశాం: అమిత్ షా
ఢిల్లీ: ఇటీవల జరిగిన 80వ భారత స్వాతంత్ర్య వేడుకలకు ముందు ఐఎస్ఐ భారీ కుట్రకు ప్లాన్ చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా వెల్లడించారు. అయితే ఆ భారీ కుట్రను నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం భగ్నం చేసి 200 మంది ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ‘స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే మోదీ ప్రభుత్వం, 200 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఐఎస్ఐ మద్దతుగల ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసి, దాని విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేసింది. ఉగ్రవాదంపై భారత్‌కు ఉన్న జీరో టాలరెన్స్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తూ, భారత భద్రతా దళాలు 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించి ఈ నెట్‌వర్క్‌ను చిన్నాభిన్నం చేశాయి.రాష్ట్ర పోలీసు బలగాలతో రియల్-టైమ్ ఇంటెలిజెన్స్-షేరింగ్ వ్యవస్థను ఉపయోగించి ఆగస్టు 12న సమన్వయంతో కూడిన బహుళ-రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించాం. దీని ఫలితంగా 14 రాష్ట్రాలలో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ (62), హర్యానా (52), ఢిల్లీ (51), పంజాబ్ (44), రాజస్థాన్ (15), మహారాష్ట్ర (8), ఉత్తరాఖండ్ (5), కర్ణాటక, గుజరాత్ మరియు బీహార్ (ఒక్కొక్క రాష్ట్రంలో 3 చొప్పున), మరియు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు కేరళ (ఒక్కొక్క రాష్ట్రంలో 2 చొప్పున) అరెస్టులు చేశాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.Modi govt destroyed the ISI-backed terror group Shahzad Bhatti Network ahead of Independence Day and thwarted its plans for subversive attacks by arresting more than 200 operatives.Indian security forces ripped apart the network by launching coordinated operations across…— Amit Shah (@AmitShah) August 17, 2026 -
భారతీయులకే అవమానం.. సోనియా క్షమాపణలు చెప్పాలిందే: అమిత్ షా
ఢిల్లీ: వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దేశ ప్రజలను అవమానించిందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన అవమానాన్ని 140 కోట్ల మంది భారతీయులు కళ్లారా చూశారని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా భావించే ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15 సందర్బంగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జరిగాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు వేదికపై ఉన్నారు. వందేమాతరం పాట ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గేతో మాట్లాడటం, కొన్ని సంజ్ఞలు చేయడం కనిపించిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. బీజేపీ ఆరోపణ ఏమిటంటే.. పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసి, దాన్ని ఆపేలా సంకేతాలు చేశారని మండిపడుతున్నారు.కాంగ్రెస్ ఏం చెబుతోంది?కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ పాటను ఆపాలని సూచించలేదని, ఆమె ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సూచించారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. దీంతో, రాజకీయం దుమారం రేగింది. ఇక్కడ ఒక చారిత్రక అంశం ఉంది. 1937లో కాంగ్రెస్ వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే బహిరంగ కార్యక్రమాల్లో పాడే విధానాన్ని అనుసరించింది. అయితే, 2026లో వందేమాతరం పూర్తి రూపంపై కేంద్రం కొత్తగా ప్రాధాన్యత ఇవ్వడంతో, పూర్తి ఆరు చరణాల ఆలాపనపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యక్రమంలో పూర్తి రూపం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ చేసిన సంజ్ఞల వీడియో బీజేపీ చేతికి రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం తమ నేతలు వందేమాతరాన్ని అవమానించారనే ఆరోపణను తిరస్కరిస్తోంది. -
రూ.13 వేల కోట్ల కేసు.. డ్రగ్ కింగ్‌పిన్ అరెస్టు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు. గత రెండేళ్లుగా పరారీలో ఉంటూ తప్పించుకుని తిరుగుతున్న వీరేందర్ సింగ్‌ను.. ఎన్సీబీ అధికారులు ఇంటర్‌పోల్ సాయంతో అదుపులోకి తీసుకుని భారత్‌కు రప్పించారు. సుమారు రూ. 13 వేల కోట్ల డ్రగ్స్ సంబంధిత కేసులో కింగ్ పిన్‌గా ఉన్న వీరేందర్ సింగ్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన కొకైన్, సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు వీరేందర్ సింగ్ బసోయా. దుబాయ్ కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ను నడిపిస్తున్న వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈలో అరెస్ట్ చేశారు. భారతీయ, అరేబియా అధికారుల సమన్వయంతో భారత్‌కు రప్పించిన ఎన్సీబీ.. అదుపులోకి తీసుకుంది.బసోయాను యూఏఈ నుంచి భారత్‌కు తీసుకు వచ్చిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. విదేశాలలో దాక్కున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లను నిర్దాక్షిణ్యంగా వేటాడి, వారి మొత్తం వ్యవస్థను ప్రభుత్వం అత్యంత కఠినమైన పద్ధతితో నాశనం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై జీరో టోలరెన్స్ పద్ధతితో ఒక కొత్త మైలురాయిని సృష్టిస్తూ పరారీలో ఉన్న డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడంలో ఎన్సీబీ విజయం సాధించింది. డ్రగ్స్ సరఫరా దారులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని మన ఏజెన్సీలు మరోసారి నిరూపించుకున్నాయి. భారత చట్టాలను వారు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని విషయం మరోసారి రుజువైంది’ అని పేర్కొన్నారు. Modi govt is relentlessly tracking down drug traffickers hiding abroad and destroying their entire ecosystem with a ruthless approach.Creating a new milestone in the policy of zero tolerance against narcotics, the NCB secured the return of fugitive drug kingpin Virender Singh…— Amit Shah (@AmitShah) August 14, 2026రూ. 13 వేల కోట్ల డ్రగ్స్ సిండికేట్వేల కోట్ల డ్రగ్స్ రాకెట్లో కీలక సూత్రధారిగా ఉన్న బసోయా.. 2023లో తన కుమారుడి వివాహం తర్వాత దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత 2024 అక్టోబర్‌లో ఢిల్లీ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన క్రమంలో బసోయా పేరు తెరపైకి వచ్చింది.2024, అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జాతీయ రాజధానిలోని మహిపాల్పూర్ ఎక్స్టెన్షన్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో వారికి సుమారు 16 కిలోల కొకైన్ లాంటి పదార్థం, 547 కిలోల కొకైన్ మరియు 39.706 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి లభించాయి. అధికారులు తుషార్ గోయల్, హిమాన్షు కుమార్, మరియు ఔరంగజేబ్ సిద్ధిఖీ అనే ముగ్గురిని అరెస్టు చేశారు.రెండు రోజుల తర్వాత, జతిందర్ సింగ్ గిల్ అలియాస్ జస్సీగా గుర్తించిన మరో వ్యక్తిని అమృత్సర్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అక్టోబర్ 5న, పంజాబ్‌లో అతను ఉపయోగించిన ఫార్చ్యూనర్ వాహనాన్ని సోదా చేయగా, సుమారు 1.096 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. కోర్టు రికార్డుల ప్రకారం, ఆ వాహనం బసోయా సోదరుడు రవీందర్‌కు చెందినది గుర్తించారు. అక్టోబర్ 10వ తేదీన, ఢిల్లీలోని రమేష్ నగర్లో 208 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను స్పైసీ స్నాక్స్ ప్యాకెట్లలో దాచి ఉంచారు. తదనంతరం, అక్టోబర్ 13న గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ఉన్న ఆవ్కర్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణం నుండి 518.18 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.2026 జనవరిలో అదే సిండికేట్‌లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై సిక్కింలో తిలక్ ప్రసాద్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు ఢిల్లీ పోలీసులుఈ మొత్తం నెట్‌వర్క్‌కు విదేశాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరేందర్ సింగ్ బసోయాతోపాటు సంసార్ ధునేలు దీనికి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. వీరు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా సామ్రాజ్యం మలేషియా, పాకిస్తాన్, థాయ్‌లాండ్, దుబాయ్‌ల వరకు విస్తరించి ఉన్నాయి. వీరు డ్రగ్స్‌ను ప్రధానంగా దక్షిణ అమెరికా నుండి దుబాయ్ మీదుగా భారతదేశానికి తీసుకువచ్చేవారు. బసోయా విదేశాల నుంచి తన నెట్‌వర్క్‌ను కొససాగిస్తూ తప్పించుకుని తిరుగుతూ తన డ్రగ్స్ మాఫియాలో కింగ్‌పిన్‌గా మారిపోయాడు. సుమారు రూ. 13,000 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా కేసులో వీరేందర్ బసోయా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు..అక్టోబర్ 10న, ఢిల్లీలోని రమేష్ నగర్లో 208 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను స్పైసీ స్నాక్స్ ప్యాకెట్లలో దాచి ఉంచారు. తదనంతరం, అక్టోబర్ 13న గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ఉన్న ఆవ్కర్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణం నుండి 518.18 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
సీజేపీ దాస్ ఇంటికి పోలీసులు.. బీజేపీ ప్లాన్ మార్చిందా?
పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని ప్రశ్నల పేరుతో భయబ్రాంతులకు గురిచేశారని దాస్ ఆరోపించగా.. పోలీసు శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చేపట్టే సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఇంటికి వెళ్లామని స్పష్టం చేసింది.పోలీసులు తమ కుటుంబం వద్దకు వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది కేవలం సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని దాస్ ప్రశ్నించారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అసలు ఇలాంటి విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయించాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తమ పోరాట సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.అంతేకాదు, రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరికి వచ్చి అక్కడి హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని సందర్శించే నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, పోలీసుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను పోలీసులు సందర్శించడం సాధారణమేనని చెప్పారు.#Alert🚨Two hours ago, the Pondicherry Police showed up at my family’s home and subjected them to all kinds of questioning. Why this harassment, @PuducheryPolice? Who ordered this and for what purpose? Is this the legal procedure? Why is the BJP government in Pondicherry…— Saurav Das (@SauravDassss) August 12, 2026ముఖ్యమైన రూట్లకు సమీపంలో నివసించే ప్రజలను కలిసి కొన్ని వివరాలు తెలుసుకోవడం, భద్రతకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు అడగడం పోలీసుల రొటీన్ ప్రక్రియలో భాగమని అధికారి వివరించారు. దీంతో ఒకే ఘటనపై రెండు భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. దాస్ మాత్రం దీన్ని రాజకీయ బెదిరింపుగా చూస్తుండగా.. పోలీసులు మాత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చేపట్టే సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమని చెబుతున్నారు. ఇక దాస్ చేసిన వ్యాఖ్యలు పుదుచ్చేరి రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా పర్యటనను ఈ ఘటనతో ముడిపెడుతూ ఆయన ప్రశ్నలు లేవనెత్తడంతో రాజకీయ కోణం కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పుదుచ్చేరిలో హాట్ టాపిక్‌గా మారింది. -
పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నుంచి.. నిన్నటి వరకు ఉభయ సభల్లో వాయిదాల పర్వమే కొనసాగింది. 18 రోజుల పాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. మరోవైపు సభలను నడిపేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు.. వెరసి పార్లమెంట్ వేదికగా రాజకీయ వేడి కొనసాగింది.లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. చివరి దశలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా.. ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. నిరసనల మధ్యే పలు కీలక బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. సభ వెలుపల కూడా అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఇక వర్షాకాల సమావేశాల ఇవాళ చివరి రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమంటోంది.. బాధ్యతపై నేరుగా సమాధానం కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఫైనల్ షోలో చర్చకు తెరలేస్తుందా?.. లేక మరోసారి చిచ్చు రగులుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.చర్చకు సిద్ధం: అమిత్ షావిద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తానేం పారిపోలేదని.. రోజూ పార్లమెంట్‌కు వచ్చి తన ఛాంబర్‌లోనే కూర్చుకుంటున్నానని.. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు సభల్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘ చర్చ కొనసాగించేందుకు సిద్ధమని స్పీకర్‌కు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని.. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని తెలిపారు. అయితే అమిత్ షా ప్రతిపాదనకు విపక్షాలు అంగీకరించలేదు. చర్చకు ముందు బాధ్యతపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.‘ఆదేశాలు ఎవరివి?’.. రాహుల్ ప్రశ్నఇన్నాళ్లు సభకు రాకుండా భయపడి.. ఇప్పుడు అభూత కల్పన కథలు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, బలప్రయోగానికి ఆదేశాలు ఎవరు ఇచ్చారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చింది అమిత్ షా అయితే రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హోంశాఖ పరిధిలోనే ఉంటాయని గుర్తుచేస్తూ.. ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.తప్పించుకుంటోంది ఎవరు?విపక్షాల తీరును ప్రభుత్వం తప్పుబట్టింది. చర్చకు డిమాండ్ చేసిన వారే ఇప్పుడు చర్చకు రావడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హోంమంత్రి స్వయంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నినాదాలు, ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే.. హోం మంత్రి ఇన్నాళ్లపాటు సభకు వచ్చేందుకు భయపడ్డారని.. ఆయన ఇప్పుడు ఇచ్చే సమాధానం ఎవరికి కావాలని, విద్యార్థులపై పోలీసు చర్యలకు ఆదేశాలిచ్చింది ఆయనో కాదో తేల్చాలని, కారకుడు ఆయనే గనుక అయితే రాజీనామా చేయాలని విపక్షాలు మండిపడుతున్నాయి.విద్యార్థుల ఆందోళనలే ప్రధాన అజెండానీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలే ఈ సమావేశాల్లో ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వినియోగంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.అయితే.. మొత్తం సమావేశాల్లో ఒకే అంశంపై సభ సజావుగా సాగింది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పరీక్షా సవరణ బిల్లుపై జరిగిన చర్చ ప్రశాంతంగా జరిగింది. ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా.. ఎలాంటి తీవ్ర అంతరాయం లేకుండా సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఆ తర్వాత మాత్రం మళ్లీ విద్యార్థుల ఆందోళనలు-పోలీసుల చర్యల అంశంపై రాజకీయ రగడ కొనసాగింది.నిరసనల మధ్య కీలక బిల్లులుపార్లమెంట్లో రాజకీయ రగడ కొనసాగినప్పటికీ.. శాసనపరమైన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోలేదు. అధికార, విపక్షాల నినాదాల మధ్యే పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది.వందేమాతరం గౌరవం, జాతీయ చిహ్నాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసే సవరణలకు ఆమోదం లభించింది. వందేమాతరం అవమానాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు చేశారు.విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. విదేశీ నిధులపై పర్యవేక్షణ, నిబంధనల కఠినతరం ఈ బిల్లులో ప్రధాన అంశాలు.మరోవైపు కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అలాగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది.చివరి రోజైనా తెరపడేనా?వర్షాకాల సమావేశాల చివరి రోజు ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతుండగా.. విపక్షాలు మాత్రం బాధ్యతపై స్పష్టమైన సమాధానం కోసం పట్టుబడుతున్నాయి. 18 రోజులుగా సాగుతున్న పార్లమెంట్ పోరుకు చివరి రోజు అయినా ముగింపు లభిస్తుందా?.. లేదంటే ఫైనల్ షో కూడా మరో రాజకీయ చిచ్చుతోనే ముగుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
అమిత్ షా ‘లెక్చర్’ మాకొద్దేవద్దు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చే ‘లెక్చర్’వినాలన్న ఆసక్తి ప్రతిపక్షానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. అభూత కల్పనలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తమకు అక్కర్లేదని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా చేసిన ప్రకటనపై రాహుల్ బుధవారం స్పందించారు. అమిత్ షా ఇమేజ్ బెలూన్ ఇప్పటికే పగిలిపోయిందని అన్నారు. అందులో గ్యాస్ నింపడానికి ఆయన చివరి నిమిషంలో ప్రయతి్నస్తున్నారని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీక్‌పై నిరసనకు దిగిన విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో తెలుసుకోవాలని యువత కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులపై కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశించి ఉంటే ఆయన బాధ్యుడవుతాడని, ఒకవేళ ఆదేశించకపోతే ఆయన అసమర్థుడని తేల్చిచెప్పారు. ఏది ఏమైనా అమిత్ షా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బుధవారం మీడియాతో మాట్లాడారు. అమిత్ షాతో చర్చ జరపడానికి తమకు ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. ‘‘విద్యార్థులపై ఎవరు కాల్పులు జరిపారు? కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారు? విద్యార్థుల్లో ఒకరిని అంధుడిని చేసింది ఎవరు? ఒక విద్యార్థి చెవిలో ఎవరు కాల్చారు? లాఠీలు, మేకులతో కూడిన కర్రలతో విద్యార్థులను కొట్టాలని ఎవరు ఆదేశించారు? అనేది తెలుసుకోవాలని కోరుతున్నాం. అందులో మాత్రమే మాకు ఆసక్తి ఉంది. పిల్లలపై కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉంటే ఆయన బాధ్యుడు కాబట్టి రాజీనామా చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే అసమర్థుడు కాబట్టి రాజీనామా చేయాలి’’అని పేర్కొన్నారు. తాను మాట్లాడుతుండగా అంతరాయం కలిగించినందుకు విలేకరులపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించారు. అమిత్ షాలో అంత ప్రత్యేకత ఏముంది? ఆయన ముందు ఒక ఎలుకలాగా ఎందుకు నిల్చుంటారు? అని విలేకరులను నిలదీశారు.మౌనమే ఆయన అంగీకారం జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన విషయంలో తాను మౌనంగా ఉండడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘విద్యార్థులపై జరిగే ఏ విధమైన హింసనైనా సమరి్థంచబోమని విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పాను. నేను మౌనంగా లేను, బహిరంగంగానే ఈ విషయాన్ని చెబుతున్నాను’’అని వివరించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ‘ఎక్స్’లో రాహుల్ షేర్ చేశారు. ‘‘ఒక వ్యక్తికి నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు, అతని మౌనమే అతనికి బదులుగా మాట్లాడుతుంది. అమిత్ షా మౌనమే ఆయన వ్యక్తంచేస్తున్న అంగీకారం’’అని ఉద్ఘాటించారు. -
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం
న్యూఢిల్లీ: నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. విద్యార్థుల నిరసనలు, ఇతర అంశాలపై చర్చ కోసం లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ సమర్పించాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. చర్చ ప్రారంభమైన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. చర్చలో పూర్తిగా పాల్గొంటానని వెల్లడించారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. చర్చలో పాల్గొనాలా లేక పార్లమెంట్లో గందరగోళం సృష్టించాలా అనేది ఇప్పుడు ప్రతిపక్షం చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం 2 గంటలలోపు స్పీకర్‌కు లేఖ సమర్పించాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏ రకమైన చర్చలకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని తెలిపారు. తాను చర్చ నుంచి పారిపోతున్నానంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అదృశ్యం’, ‘పారిపోయినవారు’వంటి పదాలు భారతదేశ ప్రజా, పార్లమెంటరీ చర్చల్లో ఇటీవలి కాలంలోనే వినిపించడం మొదలయ్యాయని పేర్కొన్నారు. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా వచ్చి పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్లో కూర్చుంటున్నానని, ప్రతిపక్షం మాత్రం ఉభయ సభలనూ పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. సభలో కార్యకలాపాలను విపక్షాలు సాగనివ్వనప్పుడు ఎవరైనా లోపలికి వెళ్లడంలో ఇక అర్థం ఏమిటని ప్రశ్నించారు. నీట్ వ్యవహారానికి సంబంధించి విద్యార్థుల నిరసనలు సహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారని అమిత్ షా గుర్తుచేశారు. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు. కానీ, వారు(విపక్షాలు) అసలు చర్చ జరగాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు నిజంగా ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయించుకుంటారని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ప్రతిపక్షం ఎందుకు చర్చ జరగాలని కోరుకోవడం లేదనే అంశంపై చర్చించడానికీ సిద్ధంగా ఉన్నాననివివరించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ విద్యార్థుల నిరసనలపై చర్చ కోసం ప్రతిపక్షాలను సంప్రదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభలో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు బుధవారం స్పీకర్‌కు లేఖ రాశా రు. -
అమిత్ షా బండారం బయటపడింది: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ నిరసనల అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ.. ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.“అమిత్ షా బండారం బయటపడింది. ఆయన సభకు ఎందుకు రావడం లేదు? సభకు రావడానికి ఆయన భయపడుతున్నారా?” అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. నీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు, ఆందోళనకారులపై జరిగిన దాడులపై హోంమంత్రి సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? పోలీసుల కర్కశ చర్యలపై అమిత్ షా నోరు విప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనలకు బాధ్యత హోంమంత్రిదేనని ఆరోపించారు.VIDEO | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "Kharge ji and I have held press conferences, and the other Opposition parties have also made it clear that we are not interested in listening to Amit Shah's imagination. We are interested in one simple thing. And when we say 'we',… pic.twitter.com/sjkm33QjZ9— Press Trust of India (@PTI_News) August 12, 2026రాజీనామాకు డిమాండ్నిరసనల సమయంలో కాల్పులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే అమిత్ షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమిత్ షా ఏం మాట్లాడతారన్నది తమకు అవసరం లేదని, బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.“చర్చకు సిద్ధం”: షామరోవైపు, విపక్షాల ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ.. నీట్ అంశంతో పాటు విపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు రావాలని, సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని కోరారు. విపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, చర్చకు వస్తారా? లేదంటే ఆందోళనలు కొనసాగిస్తారా? అనేది విపక్షాలు తేల్చుకోవాలని అన్నారు.నీట్ నిరసనల అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం చర్చకు సిద్ధమంటూ చెబుతోంది. దీంతో పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. -
నేను రెడీ..: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విపక్షాలు లేవనెత్తుతున్న అన్ని అంశాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభలో చర్చకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.బుధవారం పార్లమెంట్‌కు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. ఇటీవల రాజకీయ, పార్లమెంటరీ చర్చల్లో “లాపతా”, “భాగ్ గయే” వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అన్నారు. తాను పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా వస్తున్నానని, తన ఛాంబర్‌లోనే ఉంటున్నానని చెప్పారు.అయితే లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ప్రశ్నించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ విపక్షాలే చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపించారు.నీట్ అంశంపై చర్చకు సిద్ధంనీట్ నిరసనల సమయంలో పోలీసుల చర్యపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.“చర్చకు సమయం కేటాయించాలని, విపక్షాలు సిద్ధంగా ఉండాలని కోరాం. అదే వారి మొదటి డిమాండ్. దానికి ప్రభుత్వం అంగీకరించింది. నేను కూడా సభలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను” అని అమిత్ షా పేర్కొన్నారు.ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారువిపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. “ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారు” అంటూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు 3 గంటల వరకు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాను సభలో కూర్చొని అందరి అభిప్రాయాలు వింటానని, ప్రతి అంశానికి సమాధానం ఇస్తానని తెలిపారు.దాచాల్సింది ఏమీ లేదుఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని, పార్లమెంట్ సజావుగా నడవడానికి విపక్షాలు సహకరించాలని కోరారు.సజావుగా సాగని సమావేశాలునీట్ నిరసనల అంశంపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కొందరు నేతలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సజావుగా సాగలేదు. విపక్షాల నిరసనల మధ్యే కేంద్రం పలు కీలక బిల్లులను ఆమోదించుకుంది. ఇప్పటివరకు ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.రేపటితో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అమిత్ షా చర్చకు సిద్ధమన్న ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం-విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు చివరి రోజైనా తెరపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఒకే ఫ్రేమ్‌లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్‌సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
అమిత్ షా సిద్ధం.. తగ్గని విపక్షం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఉద్యమించిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాష్టీకం ఉదంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌కు హాజరై స్వయంగా వివరణ ఇవ్వాలన్న విపక్షాల డిమాండ్ అంశం మరోసారి లోక్‌సభ అర్ధంతరంగా ముగియడానికి కారణమైంది. హోం మంత్రి సభలో మాట్లాడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించినా విపక్ష సభ్యుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరు ఆగలేదు. అయోధ్యలో రామమందిరంలో కోట్ల రూపా యల విరాళాల చోరీ ఉదంతంపైనా అమిత్‌షా ప్రకటన చేయాలని విపక్షసభ్యులు తమ పాత డిమాండ్‌కు పదునుపెట్టారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విపక్షాల ఆందోళనలు కొనసాగి చివరకు లోక్‌సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. మీరైతే పారిపోవద్దు: రిజిజు సోమవారం లోక్‌సభ ఆరంభమైన వెంటనే విపక్ష ఎంపీలు అమిత్‌షా ప్రకటన కోరుతూ ఆందోళనకు దిగడంతో కేవలం ఒక్క నిమిషంలో మధ్యాహ్నానికి, ఆ తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమయ్యాక సైతం విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ విపక్షాలు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా విపక్ష ఎంపీలు శాంతించకపోవడంతో మంత్రి రిజిజు స్పందించారు. ‘‘సమావేశాల తొలిరోజు నుంచి కాంగ్రెస్, రాహుల్ గాం«దీలు హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని పట్టుబడుతున్నారు. ఈ అంశంలో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న యువత, విద్యార్థుల సమస్యలపై లోక్‌సభలో జరిగే చర్చలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తారు. ఆయన సమగ్రస్థాయిలో సమాధానం ఇచ్చే సమయంలో విపక్ష సభ్యులు భయపడొద్దు. సభ నుంచి పారిపోవద్దు. వాకౌట్ లాంటివి చేయొద్దు. ఆయన ప్రసంగాన్ని మీరంతా పూర్తిగా వినాల్సిందే. ప్రసంగం మధ్యలో విపక్షసభ్యులు నినాదాలు ఇస్తూ అడ్డు తగలొద్దు’’అని రిజిజు అన్నారు. దీంతో విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలుచేశారు. ఇదే సమయంలో సభాధ్యక్షస్థానంలోఉన్న జగదాంబికాపాల్ అసహనం వ్యక్తంచేశారు. ‘‘ప్రభుత్వం ముందుకొచ్చి అమిత్‌షాతో మాట్లాడిస్తామని చెబుతోంది. ఇకనైనా విపక్ష సభ్యులు సభ సజావుగా సాగేలా ప్రవర్తించాలి. ఇదే వర్షాకాల సమావేశాలకు చివరి వారం. గత మూడు వారాలు నిష్ఫలంగా ముగియడానికి ఎవరు బాధ్యులు? చర్చలో మీరు పాల్గొనరా?’’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ విపక్షసభ్యుల నినాదాలు ఆగకపోవడంతో సభాధ్యక్షుడు చివరకు సభను మంగళవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ నిరసనలు.. రాజ్యసభలోనూ నిరసనల పర్వం కొనసాగింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. నిరసనల మ«ధ్యే రాజ్యసభలో పలు అధికారిక పత్రాలు, పార్లమెంటరీ స్థాయీ సంఘాల నివేదికలను మంత్రులు సభలో సమర్పించారు. విద్యుత్, బొగ్గు, గనులు, రక్షణ, జలశక్తి, పౌర విమానయాన శాఖలకు సంబంధించిన పత్రాలను సంబంధిత మంత్రులు సమర్పించారు. మరోవైపు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మకర ద్వారం వద్ద ప్రతిపక్ష పారీ్టలు నిరసన చేపట్టాయి. విరాళాల చోరీ అంశంలో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని, ఘటనకు హోంమంత్రి బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు ఆమోదం ట్రైబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘‘ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026’’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సోమవారం సభలో విపక్ష ఎంపీల నినాదాల నడుమ ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. ట్రైబ్యునళ్ల నియామకాల్లో పారదర్శకత, స్వతంత్రత, ఏకరూపత తీసుకురావడం, మెరుగైన పనితీరు లక్ష్యంగా ఈ బిల్లు తెచ్చారు. కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మారుస్తూ రూపొందించిన బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. -
విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం!
నీట్ అభ్యర్థుల నిరసనలు, ఢిల్లీలో చోటుచేసుకున్న పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు స్పీకర్ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. అదే రోజు నీట్ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ క్రమంలో పెలెట్ గన్స్ సైతం ప్రయోగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.మొదట రాజీనామా డిమాండ్నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో తొలుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే మంత్రి రాజీనామా తర్వాత కూడా నిరసనలు ఆగలేదు. విద్యార్థులపై పోలీసుల చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనజంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ యాక్షన్‌పై హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. “అమిత్ షా ఎక్కడ?” అంటూ పార్లమెంట్ లోపల, బయట నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టాయి. కేంద్రం పరిధిలో ఉన్న ఢిల్లీలో ఆయన ఆదేశాల మేరకే విద్యార్థులపై లాఠీలు ఝులిపించారని రాహుల్ గాంధీ సైతం ఆరోపణలు గుప్పించారు. ఆయన(షా) సభకు రావడానికి భయపడుతున్నారని.. ఈ అంశంపై కేంద్రం మౌనం వీడాలని ప్రతిపక్షాలు పదేపదే డిమాండ్ చేశాయి.ఆగస్టు 13తో ముగియనున్న సమావేశాలువర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై స్పందించేందుకు ముందుకొచ్చింది. విద్యార్థుల నిరసనలు, ఢిల్లీలో పోలీసుల వ్యవహారశైలి, ప్రభుత్వ చర్యలపై అమిత్ షా ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
"జవాబ్ దేవో అమిత్‌షా" వర్షంలో ఎంపీల నిరసన
సాక్షి,ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై జరిగిన దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విపక్ష ఎంపీలు పార్లమెంటు ఎదుట ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. అమిత్‌షా కనపడడం లేదని పార్లమెంటు సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ఎంపీలు ప్రశ్నించారు. "అమిత్ షా జవాబ్ దేవ్" అని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. అయితే ఎంపీల నిరసన సమయంలో భారీగా వర్షం పడుతున్నా వెనక్కి తగ్గలేదు. వానకు తడుస్తూనే నిరసన చేపట్టారు.కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకాకపోవడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. జూలై 20న ఢిల్లీలో 'నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లను ఉపయోగించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోంశాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి.అయితే అమిత్ షా పార్లమెంట్‌కు దూరంగా లేరని, ఆయన రోజంతా పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్ లోనే ఉంటూ అధికారిక విధులు నిర్వహిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గందరగోళమే కారణమని ప్రతిపక్షాలు నిరంతర నిరసనలతో సభను సజావుగా సాగనివ్వడం లేదని, సభను నడవనిస్తే అమిత్ షా వచ్చి ఖచ్చితంగా సమాధానం ఇస్తారని తెలిపారు. -
అమిత్ షాను కలిసిన YSRCP ఎంపీలు.. జగన్ భద్రత, DSC అంశంపై ఫిర్యాదు
-
కావాలనే వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కూడా కల్పించడం లేదు. ఈ విషయమై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత ఇవ్వడం లేదు. దీని వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో లాకప్ డెత్ లు కొనసాగుతున్నాయిభారతి సిమెంట్స్ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీని వల్ల కార్మికుల ఉపాధికి దెబ్బ తగులుతుంది. పరిశ్రమలకు ఇబ్బందులు సృష్టించి ఏం సందేశం పంపుతున్నారు?. డీఎస్సీ పేపర్ లీక్ అంశంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరాం. బిల్లులపై కేంద్రంతో ఎలాంటి చర్చలు జరగలేదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల్లో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు.ఇటీవల దేవరపల్లి పర్యటనకు భారీగా హాజరైనా సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదుఅమిత్ షాను కలిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం.. వైఎస్ జగన్ భద్రతతో పాటు డీఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్ షాకు వివరించారు. గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు సంభవించాయని ఆందోళన వ్యక్తం చేశారు.భారతి సిమెంట్స్‌ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఎంపీలు.. ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మోదీ, అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి.. బీవీ రాఘవులు
సాక్షి, హైదరాబాద్: సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన చలో పార్లమెంట్ సందర్భంగా జెన్‌జీపై లాఠీలు ఝులిపించడం, పిల్లెట్లను ప్రయోగించడం దారుణమనీ సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు అన్నారు.ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల మీద చర్చించేందుకు కాకుండా ప్రతిపక్ష పార్టీల ఎంపీలను చీల్చి గత సమావేశాల్లో వీగిపోయిన బిల్లులను ఆమోదించుకోవడానికి పార్లమెంట్ సమావేశాలు పెట్టినట్టు ఉందని విమర్శించారు. చలో పార్లమెంట్ సందర్భంగా జరిగిన ఘటనలపైనా, విద్యార్థులపై జరిగిన దాడులపైనా కనీసం చర్చించేందుకు అధికార ఎన్డీఏ కూటమి ముందుకు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులకు పాల్పడింది ఎవరు? పెల్లెట్లు ప్రయోగించాల్సిన అవసరమేమి వచ్చింది? ఆ ఘటనకు ఆదేశాలు జారీ చేసిందెవరు? అనే దానిపై చర్చే లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా అమిత్‌షా మొహం చాటేయడాన్ని తప్పుబట్టారు.జెన్‌జీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను క్షమిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటన చేయడం అంటే విద్యార్థుల పోరాటాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ మహిళా బిల్లును కలిపి పెట్టినందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయన్నారు. కేవలం మహిళా బిల్లునే విడిగా ప్రవేశపెట్టేందుకు ముందుకు వస్తే అన్ని పక్షాలు మద్దతు తెలుపుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు పదో తేదీన తలపెట్టిన జైల్‌భరోకు మద్దతిస్తున్నామనీ, ఆ నిరసనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.బిహార్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు బీజేపీకి చెంపపెట్టు అన్నారు. దేశంలోని యువతరం బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నదనీ, మతం, రాముని పేరుతో రాజకీయాలు ఎల్లకాలం సాగవని తెలిపారు. జెన్‌జీ పోరాటం రాజకీయంగా వినూత్న మార్పునకు సంకేతమనీ, ఇది లౌకిక శక్తులకు పెద్ద ఊరట అని కొనియాడారు. ప్రధాని మోదీ మెప్పు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలపించినట్టు ఉందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడ్డప్పుడు ఎందుకు ఏడుపు రాలేదని ప్రశ్నించారు. ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు : జాన్వెస్లీప్రజలకు విద్యావైద్యాన్ని ఉచితంగా అందించేలా పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటాలు చేస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. విద్యావైద్య రంగాలను పరిరక్షించడంలో భాగంగా వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 85 శాతం మంది పిల్లలను తల్లిదండ్రులు ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తున్నారనీ, కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడమే కారణమని తెలిపారు. తక్కువలో తక్కువగా ఏటా ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు రూ.50 వేల వరకు ఖర్చుపెట్టాల్సి రావడం భారంగా మారిందని చెప్పారురాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా నియోజకవర్గానికి ఒకటో, రెండో స్కూళ్లను పెడతామని చెప్పడమంటే ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరుగార్చడమేనని విమర్శించారు. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. 20 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చేదాకా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికే నష్టమని హెచ్చరించారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులను, వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఎనిమిది లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాలివ్వాలని కోరారు. -
అమిత్ షా ఎక్కడ?!
జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా వాయిదాల పర్వం(ఇవాళ కూడా) కొనసాగుతోంది. అయితే అమిత్ షా గైర్హాజరీని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోగా.. బీజేపీ మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది.విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు అనవసర బల ప్రయోగం జరిపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చలో సంసద్ ర్యాలీ సమయంలో లాఠీలు, పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయని, అందుకే ఘటనకు బాధ్యత హోంమంత్రి అమిత్ షాదేనని విపక్ష నేతలు అంటున్నారు.“అమిత్ షా సమాధానం చెప్పాలి”పరీక్షల సంస్కరణ బిల్లు చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై పోలీసు చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. హోంమంత్రి అనుమతి లేకుండా ఇలాంటి పరిణామాలు ఎలా చోటుచేసుకున్నాయని నిలదీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారిపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమిత్ షాపై ఉందని పేర్కొంటూ.. ఆయన సభకు రాకపోవడంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కేంద్రం వాదన ఏంటి?అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. నిరసనల సమయంలో పోలీసులు సంయమనం పాటించారని, ఎలాంటి అనవసర బలప్రయోగం జరగలేదని చెబుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా విపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.మళ్లీ రంగంలోకి CJPమరోవైపు నీట్ నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదని ఆ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి మరో సవాల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసుల ఉపసంహరణ, విద్యార్థులపై చర్యలపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలను మళ్లీ ఉధృతం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.షా మౌనం చర్చనీయాంశంనీట్ నిరసనల వ్యవహారంలో ఇప్పటివరకు అమిత్ షా ప్రత్యక్షంగా స్పందించకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరీని విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. మరోవైపు CJP తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.విద్యార్థులపై పోలీసు చర్యల ఆరోపణలు.. అమిత్ షా మౌనం.. కేసుల ఎత్తివేత డిమాండ్.. ఈ మూడు అంశాలు కేంద్రంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో హోంమంత్రి స్పందిస్తారా? రాజకీయ రగడ మరింత కొనసాగుతుందా?? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
రక్షణ రంగం బలోపేతంలో దోవల్ కీలకపాత్ర
పుణె: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భారత రక్షణ సామర్థ్యాన్ని గత పుష్కరకాలంలో సమున్నత స్థాయికి తీసుకెళ్లారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. శనివారం పుణెలో జరిగిన కార్యక్రమంలో అజిత్ దోవల్‌కు అమిత్ షా ‘లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్,2026’ను ప్రదానంచేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ‘‘రక్షణాత్మక వైఖరితోపాటు విరుచుకుపడే తత్వాన్ని దోవల్ సారథ్యంలో భారత సాయుధ బలగాలు అందిపుచ్చుకున్నాయి. భారత విదేశాంగ విధానం బలపడటంలోనూ దోవల్ తనదైన పాత్ర పోషించారు. ప్రధాని మోదీ జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న ప్రతి తుది నిర్ణయంలోనూ దోవల్ కీలకమైన పాత్ర పోషించారు. 2008లో నేను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో వరసబెట్టి బాంబుపేలుళ్లు జరిగాయి. నాడు సీఎం హోదాలో మోదీయే దోవల్‌కు ఈ పేలుళ్ల కారకులను కనిపెట్టాలని సూచించారు. ఈ ఘటనతోపాటు మొత్తం దేశవ్యాప్తంగా 13 బాంబుపేలుళ్ల ఘటనలను దోవల్ ఛేదించారు’’అని అమిత్ షా కొనియాడారు. దేశసేవకు సిద్ధంగా ఉండాలి: దోవల్ ఈ సందర్భంగా దోవల్ మాట్లాడారు. ‘‘స్వేచ్ఛ అంటే మనం ఏదైనా చేయొచ్చని నేటి యువత భావిస్తోంది. అది సబబు కాదు. స్వీయ ప్రయోజనాల కోసమేకాదు యువత దేశ ప్రయోజనాలనూ పట్టించుకోవాలి. ఏరకంగానైనా దేశ సేవ చేసేందుకు యువతరం సంసిద్ధంకావాలి. దేశ చరిత్రలోనే నేడు భారత్ సమున్నతంగా ఎదిగే సువర్ణావకాశం వచ్చింది. దీనిని మనం చేజార్చుకోవద్దు. దేశం కోసం త్యాగాలు చేసేందుకు సిద్దపడాలి. తిలక్ పుణెలో ప్లేగువ్యాధి ప్రబలి తన 21 ఏళ్ల కుమారుడిని కోల్పోయినా ఆయన ఈ నగరాన్ని వీడలేదు. నగరసేవకు ప్రాధాన్యతనిచ్చారు. యువత చిన్నపాటి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి దేశ సేవ కోసం ఆలోచించాలి. స్వరాజ్యం నా జన్మహక్కు అని తిలక్ అనుకుని అక్కడితో ఆగిపోలేదు. అదే స్పృహ అందరిలో కలిగేలా స్ఫూర్తి కణికలు మండించారు’’అని దోవల్ వ్యాఖ్యానించారు. -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాజ్యసభ వాయిదా.. రాజ్యసభ సోమవారానికి వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు లోక్‌సభలో విపక్షాల నిరసనలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా.. ఎంపీ వినూత్న నిరసనలు..రెండు కుండీలు పెట్టి అందులో డబ్బులు వేసిన ఎంపీలుహుండీ చోరీపై ఎంపీ వినూత్న నిరసనలు.స్వామీజీ గెటప్లోని వచ్చి చందా అడిగిన ఎంపీ పప్పూ యాదవ్.హుండీలో డబ్బులు వేసిన రాహుల్ గాంధీ. #WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi protest over the issue of alleged Ayodhya Ram Mandir donations embezzlement pic.twitter.com/1BXa6UiUuq— ANI (@ANI) July 31, 2026 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..పార్లమెంటు మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ధర్నావిద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ నినాదాలుకేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నినాదాలుపార్లమెంటుకు అమిత్ షా రావాలని డిమాండ్అయోధ్య విరాళాల చోరీపై దర్యాప్తు జరపాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల డిమాండ్ -
రాహుల్‌పై సభా హక్కుల నోటీస్
న్యూఢిల్లీ: హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు ఆ నోటీస్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఠాకూర్ అందజేశారు. ‘అమిత్ షానుద్దేశించి రాహుల్ జూలై 29 తేదీన అమర్యాదగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలుచేసి సభా మర్యాదలను ఉల్లంఘించారు. విద్యార్థులతో సంభాషణను గుర్తుచేస్తూ ‘విద్యార్థులు’,‘మూర్ఖులు’,‘అంధభక్తులు’ అనే పదాలు వాడారు. చివరి రెండు పదాలు రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ మద్దతుదారులనుద్దేశించి వాడారు. సభలో ఇలాంటి పదాల వినియోగాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ నియమావళిలోని 352(3), (7), 353 నిబంధనల ప్రకారం ఏనాడో నిషేధించారు. దారుణమైన ఆరోపణలు చేసిన రాహుల్‌గాంధీ వెంటనే లోక్‌సభకు, అమిత్ షాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాహుల్ అమర్యాదకర వైఖరి అంశాన్ని సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి సిఫార్సు చేసి సమగ్ర దర్యాప్తు తర్వాత ఆయనపై తగు చర్యలు తీసుకోవాలి’’ అని తన మూడు పేజీల నోటీస్‌లో అనురాగ్ ఠాకూర్ కోరారు. -
లోక్‌సభలో మళ్లీ రగడ
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండ్రోజులుగా కాస్తంత ప్రశాంత వాతావరణం కన్పించిన పార్లమెంట్లో గురువారం మళ్లీ విపక్షాల నిరసనహోరు మొదలైంది. చలో సంసద్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల కర్కశ చర్య, అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఆరోపణలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేయడంతో సభా కార్యక్రమాలు దాదాపు స్తంభించాయి. పలుమార్లు వాయిదాలు పడ్డ సభలో తీవ్ర గందరగోళం మధ్యే ప్రభుత్వం జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) (వందేమాతరం) బిల్లును ఆమోదించింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసు అతి చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని, ఆ అంశంపై వెంటనే చర్చకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయంలో కోట్ల కొలదీ విరాళాలు చోరీ అయిన ఉదంతంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టాయి. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు పార్లమెంటరీ పత్రాలు సభ ముందుంచిన తర్వాత విపక్ష సభ్యులు తిరిగి నినాదాలు కొనసాగించారు. దీంతో సభను 3:30 గంటల వరకు వాయిదా వేశారు. మకర్ ద్వార్ వద్ద ప్రతిపక్ష నిరసనలు.. అయోధ్య రామాలయంలో భారీ స్థాయిలో విరాళాలు చోరీకి గురైన ఘటనపై మకరద్వారం ముందు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఒక విరాళాల పెట్టెను ఏర్పాటు చేసి అందులో కరెన్సీ నోట్లను విరాళమిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ‘చందా చోరులారా..గద్దె వీడండి’అంటూ ప్లకార్డులు, నినాదాలతో ఆందోళన కొనసాగించారు. మంత్రి అమిత్ షా సభకు హాజరై ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ‘అమిత్ షా ఇంకా ఎంతకాలం ప్రజలకు సమాధానం చెప్పకుండా దాక్కుంటారు?. ఆయన పార్లమెంట్లో ఎందుకు కనిపించడం లేదు?’అని విపక్ష నేతలు ప్రశ్నించారు. డీఎంకే అభ్యంతరం.. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు– 2026ను ప్రవేశపెట్టారు. జాతీయ గేయం వందేమాతరంను కించపరిచినా, గేయాన్ని పాడే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకపరిచినా, మరే విధంగా గేయం పవిత్రత, ప్రతిష్టను మంటగలిపేలా దుస్సాహసం చేసినా ఆ చర్యలన్నింటినీ ఇకపై తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ శిక్షలు విధించేలా జాతీయ గేయంపై బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జాతీయ గీతం జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం వందేమాతరానికి కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తెచ్చినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. వెంటనే డీఎంకే సభ్యురాలు కె కనిమొళి లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘జాతీయవాదం ముసుగులో హిందుత్వ ఎజెండాను మోదీ సర్కార్ ముందుకు తెస్తోంది. ఇది సమాఖ్య విధానానికి పూర్తిగా వ్యతిరేకం. జాతీయవాదాన్ని బలవంతంగా రుద్దకూడదు. వందేమాతరం పూర్తి గేయం దేశ లౌకికవిధానానికి విభిన్నంగా సాగుతుంది. అందుకే జాతినిర్మాతలు ఆనాడు గేయంలోని తొలి రెండు చరణాలనే తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం ఆరు చరణాలను కచ్చితంగా పాడాల్సిందేనని మీరు బలవంతం చేస్తూ దేశాన్ని ఏకధృవంగా మారుస్తున్నారు’’అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో డీఎంకే సభ్యుడు ఎ.రాజా కొన్ని ప్రతులను చించి అధికార సభ్యుల వైపు వెదజల్లారు. ‘‘1950 జనవరి 24వ తేదీన రాజ్యాంగసభ కేవలం రెండు చరణాలనే జాతీయ గేయంగా ఎంచుకుంది. నాటి సభ నిర్ణయాన్ని కాలరాస్తూ మోదీ సర్కార్ కొత్త నిర్ణయం ఎలా తీసుకుంటుంది. ఇది రాజ్యాంగవిరుద్ధం’’అని ఎ.రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన పూర్తి చరణాలను ఆనాడు రాజ్యాంగసభ ఆమోదించిందని మోదీ సర్కార్ అవాస్తవాలను ఈ బిల్లులో పొందుపరిచిందని ఎ.రాజా ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎంసీ సభ్యుడు సౌగత రాయ్ సైతం తప్పుబట్టారు. మత స్వేచ్ఛ అనే రాజ్యాంగబద్ధ హక్కును కొత్త బిల్లుతో మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇలా విపక్షసభ్యుల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో అధికార కూటమి సభ్యులు ఈ బిల్లును ఆమోదించారు. తర్వాత లోక్‌సభ శుక్రవారానికి వాయిదాపడింది. ఇప్పటికే రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీంతో ఈ సవరణ బిల్లు ఇకపై చట్టంగా అమల్లోకి రావడానికి మార్గం సుగమమైంది. -
అమిత్ షా రాజీనామా చేయాలి: ‘సీజేపీ’ అభిజీత్ దిప్కే
న్యూఢిల్లీ: పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే జరిగిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలని గురువారం డిమాండ్ చేశారు.మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో విలేకరులతో దీప్కే మాట్లాడుతూ.. “నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడి, రక్తం కారేలా చేయడం అమిత్ షా ఆదేశాలు లేకుండా జరిగి ఉండదు” అని అన్నారు.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా నిరసనకారులపై తీసుకున్న చర్యలకు షానే బాధ్యుడని ఆరోపిస్తూ ఆయన రాజీనామా కోరిన నేపథ్యంలో దీప్కే సైతం ఇదే డిమాండ్ చేశారు. తాను కూడా రాహుల్ గాంధీ అభిప్రాయాన్నే సమర్థిస్తున్నానని చెప్పారు. “ఆయన (షా) రాజీనామా చేయాలని నేను కూడా భావిస్తున్నాను” అని అన్నారు.సీజేపీ విదేశీ నిధులు పొందుతోందన్న ఆరోపణలను దీప్కే కొట్టిపారేశారు. “హోంశాఖ బాధ్యతలు షా వద్ద ఉన్న సమయంలోనే మాకు విదేశీ నిధులు వస్తున్నాయంటే అది కూడా ఆయన వైఫల్యమే. అప్పుడు మీరు ఎలాంటి చాణక్యులు? అలాంటప్పుడు షా కూడా రాజీనామా చేయాలి” అని చురకలు అంటించారు.బీజేపీలో చేరాలని ఒత్తిడి నిరసనకారులపై చర్యలు తీసుకోవడానికి కారణం చూపించేందుకే ఢిల్లీ పోలీసులు రాళ్లదాడిని సృష్టించారని దిప్కే ఆరోపించారు. “రాళ్లదాడికి ఢిల్లీ పోలీసులు ప్రణాళిక వేశారు. బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసిరారు. దానికి విద్యార్థులనే బాధ్యుల్ని చేశారు” అని ఆయన అన్నారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని దిప్కే ఆరోపించారు. “నన్ను బెదిరించారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు నా తల్లిదండ్రులను కూడా బెదిరించారు. పార్టీలో చేరండి లేకపోతే పరిణామాలు ఎదుర్కోండి అని చెప్పారు” అని అన్నారు.ఆరోపణలను ఖండించిన బీజేపీదిప్కేపై బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యే విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మార్గంలో నడవాలనుకుంటే దీప్కే కాంగ్రెస్‌లో చేరాలని అన్నారు. “అతను ఒక నిరసన ఉద్యమానికి ముఖచిత్రం. ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లు తీసుకురావడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించడం ద్వారా అతని డిమాండ్లను అంగీకరించింది బీజేపీ ప్రభుత్వమే. దాన్ని గౌరవించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మార్గాన్ని అనుసరించాలనుకుంటే కాంగ్రెస్‌లో చేరాలి” అని అన్నారు. -
విద్యార్థులను హింసించే హక్కు ఎవరిచ్చారు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులను కఠినంగా అణచివేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, కాల్పులకు అమిత్ షా ఆమోదం తెలిపారని మండిపడ్డారు. పేపర్ లీక్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీని, ఆ పార్టీ మద్దతుదారులను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇందుకోసం మూడు వర్గాలను ప్రస్తావించారు. విద్యార్థులు, తమకు అంతా తెలుసని భావిస్తూ దేవుడిలా నటించేవారు, ఆ రెండో వర్గమే సాక్షాత్తూ దేవుడని నమ్మే అంధభక్తులు ఉన్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఈ రోజు సభకు రాలేదని రాహుల్ అన్నారు. విద్యార్థులపై హింసకు పాల్పడే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన మన విద్యార్థుల శరీరంలోకి పెల్లెట్లను(తుపాకీ గుళికలను) దించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో విద్య నేడు ఖరీదైన వ్యాపారంగా, విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తూ, విద్యార్థులకు ఏమి బోధించాలనే దానిని ఆ సంస్థే నిర్దేశిస్తోందని ఆరోపించారు. విద్యా వ్యవస్థ ఆత్మను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ విద్యా శాఖను నడపలేదని, ఆ పని చేసింది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఆక్షేపించారు. విద్యార్థుల అసలైన శత్రువు ఆర్ఎస్ఎస్ అని విమర్శించారు. అన్‌పార్లమెంటరీ పదం తొలగింపు కొంతమంది విద్యార్థులతో జరిపిన సంభాషణ యువత విద్య, జ్ఞానాన్ని ఎలా చూస్తుందనే దానిపై తనకు ఒక అవగాహన కల్పించిందని రాహుల్ అన్నారు. విద్యారి్థగా ఉండడం అంటే ఏమిటని తాను ఒక విద్యారి్థని అడిగానని చెప్పారు. అంటే కళాశాల లేదా పాఠశాలలో చదువుకోవడం, పుస్తకాలు చదవడం అని అర్థమా? అని అడిగితే.. విశాలమైన దృక్పథం, విశాలమైన హృదయం కలిగినవారే విద్యార్థి అని ఆమె సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ‘‘విద్యార్థి అంటే తనకు అన్నీ తెలియవని అంగీకరించే వ్యక్తి. తనకు తెలిసిన విషయాల స్థానంలో కొత్త జ్ఞానం వచ్చి చేరుతుంది. విశ్వం నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుందని అతనికి తెలుసు. జ్ఞానం కూడా నిరంతరం మారుతూ ఉంటుందని అతను అర్థం చేసుకుంటాడు. విద్యారి్థకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం వినమ్రత అని ఆమె అన్నారు’’అని రాహుల్ వెల్లడించారు. తమకు అన్నీ తెలుసని భావించే మరో వర్గం గురించి కూడా ఆమె వివరించారని పేర్కొన్నారు. ‘‘తమకు అన్నీ తెలుసని కొందరు వ్యక్తులు దృఢంగా నమ్ముతారు. విశ్వం స్థిరమైనదని, జ్ఞానం తమ అంతరంగం నుంచే ఉద్భవిస్తుందని వారు భావిస్తారు. వారు అహంకారంతో ఉంటారు. వారు ఇతరుల మాట వినరు, సత్యాన్ని గౌరవించరు’’అని చెప్పారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన ఒక పదంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యారి్థని తనతో చెప్పిన మాటలనే సభలో ప్రస్తావించానని, సభలోని ఏ సభ్యుడినీ ఉద్దేశించి అనలేదని రాహుల్ బదులిచ్చారు. రాహుల్ ఉపయోగించిన అన్‌పార్లమెంటరీ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దాంతో స్పీకర్ ఆ పదాన్ని తొలగించారు. ఎన్డీయే సభ్యుల తీవ్ర అభ్యంతరం సభలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పట్ల అధికార ఎన్డీయే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. రాహుల్ అబద్ధాల పుట్ట అంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ చర్చ జరుగుతున్నది అమిత్ షాపై కాదని అన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రాహుల్‌కు సూచించారు. -
ఇవాళే డెడ్‌లైన్! కేంద్రానికి సీజేపీ మరో వార్నింగ్
నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. కేంద్రంతో చర్చల అనంతరం ఆందోళనను విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావడం లేదని ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో కేంద్రానికి మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేరుస్తూ ఇవాళ గనుక రాతపూర్వక హామీ ఇవ్వకుంటే.. మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జులై 25న తాత్కాలికంగా ముగిసింది. అదే సమయంలో ఈ నిరసనలకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించారు. అయితే వాళ్లపైనా ఆయా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నీట్ నిరసనలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో జరిగిన చర్చల్లో.. నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారని సీజేపీ పేర్కొంది. ఆ తర్వాత కూడా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారంటూ ఆరోపించింది.‘‘హామీ ఉల్లంఘిస్తే నమ్మకద్రోహమే’’సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు కేంద్రానికి డిమాండ్లు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను నమ్మి ఉద్యమాన్ని విరమించారని.. ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.వార్నింగ్ ఎఫెక్ట్.. బిహార్ ప్రభుత్వ హామీసీజేపీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.బిహార్‌లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. మొత్తం 335 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆందోళనల సమయంలో హింస, ఆస్తుల నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.ఏకే-47 ఘటనపై దుమారంబిహార్లోని సివాన్‌లో నిరసనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జేపీ చౌక్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ అభిషేక్ కుమార్‌ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆందోళనల్లో మొత్తం 694 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 339 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల్లో పోలీసు అధికారులు సహా 91 మంది గాయపడ్డారని, 14 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.బెంగాల్లోనూ కేసులు.. 16 మంది అరెస్టుఇటు పశ్చిమ బెంగాల్లో నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోల్‌కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి, పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణపై బెంగాల్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల విషయంలో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.అసోంలోనూ అరెస్టులు.. కేసుల ఉపసంహరణకు నిర్ణయంఅసోంలోనూ నిరసనలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే.. సీజేపీ హెచ్చరికల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిఘాఇదిలా ఉండగా.. నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లాలో ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌పై మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.ముంబైలో కొనసాగుతున్న పోలీసుల నోటీసులుసీజేపీ ప్రకటన తర్వాత కూడా.. ముంబైలో కొంతమంది నిరసనకారులకు పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అధికారికంగా కేసుల ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.విద్యార్థుల న్యాయ పోరాటానికి సిబల్ చేయూతనీట్ నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. సీజేపీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లో నీట్ నిరసనలకు సంబంధించి కేసులు, అరెస్టుల ప్రక్రియ కొనసాగింది. అయితే కేవలం ప్రకటనలతోనే ఈ వివాదం ముగిసిపోతుందా? కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులువైన ప్రక్రియేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కీలకంగా మారాయి.తమ డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని సీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి? విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లేక ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తదుపరి చర్యలపైనే నీట్ ఉద్యమం భవిష్యత్ ఆధారపడి ఉంది. -
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం.. కేంద్రానికి మరో పరీక్ష!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానుండగా, విద్యార్థి నిరసనలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితిలో లేదు.జూలై 20న జరిగిన సీజేపీ చలో సంసద్ నిరసన సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడులు చేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారన్న ఆరోపణలపై అమిత్ షాకు లేఖ రాశారు. 19 ఏళ్ల విద్యార్థి సహిల్ లోచాబ్ ఒక కంటిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, ఇలాంటి బలప్రయోగానికి అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన వ్యక్తులు విద్యార్థులను లాఠీలతో కొట్టిన ఘటనపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.Another disturbing video from the CJP "Sansad Chalo" protest is circulating online.Protesters allege that, after lathi charges and tear gas, pellet guns were also used during the crackdown.#संसद_मार्च#cjp_पार्टी pic.twitter.com/6IrdPuAQss— Zo World (@ZoWorldd1) July 22, 2026మరోవైపు, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఉపనేత సాగరికా ఘోష్ రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో తక్షణమే చర్చ జరపాలని ఆమె కోరారు. అయితే, నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)పై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం సీఆర్పీఎఫ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. సవరణ బిల్లు ప్రకారం, వ్యక్తులకు కనిష్ఠ జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు, గరిష్ఠ శిక్షను పది సంవత్సరాలకు పెంచనున్నారు. గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, సేవలందించే సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా, నిర్వాహకులకు కఠిన శిక్షలు, వ్యవస్థీకృత ప్రశ్నాపత్రాల లీకేజీ నేరాలకు మరింత కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చారు. అలాగే కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.ఇక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) కారణంగా వాహనాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నెల 31న ఢిల్లీలో మరో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. -
పాశవిక దాడికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచ్చింది మీరేనా? అని హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పాలని దేశ ప్రజల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయని రాహుల్ చెప్పారు. విద్యార్థులపై పాశవికంగా జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం అమిత్ షాకు రాహుల్ ఒక లేఖ రాశారు. ‘‘జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. విద్యార్థులు న్యాయమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుతూ ఆందోళన నిర్వహించారు. వారి డిమాండ్లను వినాల్సిన ప్రభుత్వం, పోలీసులతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వినియోగం వంటి తీవ్ర బలప్రయోగానికి పాల్పడింది. విద్యార్థినులతో కొందరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసుల దమనకాండలో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెల్లెట్స్ తగిలి గాయపడిన, ఒక కంట్లో చూపును కోల్పోయే ప్రమాదంలో పడిన టీనేజీ విద్యార్థి సాహిల్ లోచబ్‌ను కలిశా. ఒక జర్నలిస్టు సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడాలని మీరే అనుమతి ఇచ్చారా? ఇవ్వకపోతే ఎవరు ఆదేశించారు? సాధారణ దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు పోలీసులా లేదా వలంటీర్లా? వారికి అక్కడ విధులను అప్పగించింది ఎవరు?’’ అని అమిత్‌షాను రాహుల్ నిలదీశారు. ‘‘విద్యార్థులపై జరిగిన హింస ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. యువత దేశ భవిష్యత్తు. వారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’’ అని రాహుల్ ఆ లేఖ ద్వారా డిమాండ్‌చేశారు. -
పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనపై పోలీసులు జరిపిన హింసాత్మక చర్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కిరాతక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జూలై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లుతో పాటు పెల్లెట్ గన్లను ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా 19 ఏళ్ల సాహిల్ లోచబ్ అనే విద్యార్థి పెల్లెట్ గాయాల కారణంగా తన కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.ఈ లేఖలో రాహుల్ హోంమంత్రి అమిత్ షాకు ప్రధానంగా రెండు ప్రశ్నలు సంధించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్ల వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతిచ్చింది ఎవరు? పోలీసులతో కలిసి సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులు పోలీసులా లేదా వాలంటీర్లా? వారిని ఎవరి ఆదేశాల మేరకు రంగంలోకి దించారు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ -
అమిత్‌షా పర్యటన రద్దు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దయింది. వచ్చే ఆదివారం, 26న కరీంనగర్లో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉండగా అది రద్దయింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా...నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు, వాటికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కడం, విపక్షాల నిరసనలు రోజు కో రూపం తీసుకుంటుండడంతో అమిత్‌షా పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా లేదా ఆ తర్వాత అమిత్‌షా తప్పకుండా తెలంగాణ ప ర్యటనకు వస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. -
అమిత్ షా నివాసంలో కీలక భేటీ
-
ఇదీ అమిత్‌షా షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 26న (ఆదివారం) ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వస్తున్న విషయం తెలిసిందే. కాగా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.45 నిమిషాలకు కరీంనగర్‌కు వెళతారు. అక్కడికి దగ్గరలోని నగునూరు రోడ్డులో ఉన్నప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చేరుకుని లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.45 గంటల వరకు ప్రతిమ వైద్య కళాశాల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హె లికాప్టర్‌లో సాయంత్రం 4.55 నిమిషాలకు బేగంపేటకు చేరుకుని ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. -
కాక్రోచ్ ముట్టడి.. అమిత్ షాతో ధర్మేంద్ర ప్రదాన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతకవలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను కోరుతూనే.. కేంద్రం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్రతరమైంది. సోమవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం జరగ్గా.. పోలీసులు, భద్రతా సిబ్బంది నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కఠిన చర్యలతో.. పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో..కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రదాన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రదాన్‌పై ఆరోపణలు చేస్తూ ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏదైనా నిర్ణయం వెలువడుతుందా? లేదంటే కేవలం పరిస్థితిని సమీక్షించే భేటీనా? అనేదానిపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ధర్మేంద్ర ప్రదాన్‌తో అమిత్ షా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమయంలోనే.. మరోవైపు పార్లమెంట్ సమీపంలో సీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలుపుతున్నారు. అంతకు ముందు కేంద్రంతో చర్చలు ఉంటాయని సీజేపీ ప్రతినిధులు ప్రకటించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆ ప్రచారాన్ని ఖండించారు. ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ఈ డిమాండ్లతోనే ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన చలో సంసద్ పిలుపు మేరకు మద్దతు దారులు భారీగా తరలి రావడం గమనార్హం. బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంఆందోళనకారులు పార్లమెంట్ ప్రధాన గేటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి తోపులాటకు దారితీసింది. ఆందోళనకారులు భద్రతా బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.పార్లమెంట్ గేట్లు మూసివేతకార్యకర్తలు పార్లమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్ గేట్లను మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.భద్రత కట్టుదిట్టంపార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆందోళనను అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. కొంతసేపు నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ పరిసరాలు హోరెత్తాయి. అమిత్ షా–ధర్మేంద్ర ప్రదాన్ భేటీ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న నిరసనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. -
‘రెండో భారీ రథయాత్ర’లో అమిత్ షా మంగళహారతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 149వ జగన్నాథ రథయాత్ర ఈరోజు (గురువారం) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉపముఖ్యమంత్రి హర్ష సంఘవి సంప్రదాయబద్ధంగా 'పహింద్' విధిని నిర్వహించి, రథాలను ప్రారంభించారు.జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి రథాలు జమాల్పూర్ ఆలయం నుంచి బయలుదేరి నగరం గుండా సాగుతున్నాయి. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, భజన బృందాలు, అఖారాలు పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం 30,000 మంది సిబ్బందిని, సుమారు 3,700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్లను పోలీసులు రంగంలోకి దించారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. అటు భక్తులు నామస్మరణతో నగరాన్ని భక్తిపారవశ్యంతో ముంచెత్తుతున్నారు. -
ఒక్క గంటలో 3.61 లక్షల మొక్కలు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఏఎంసీ ఆధ్వర్యంలో గంట వ్యవధిలో∙ఏకంగా 3.61 లక్షల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు. 25 వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన మియావాకి విధానంలో ఈ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఏఎంసీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం అభినందించారు. ప్రజల భాగస్వామ్యం, పటిష్టమైన ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజానికి ఉన్న నిబద్ధతకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనమని పేర్కొన్నారు. దాదాపు 91,006 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. సుమారు 35 రకాల దేశీయ వృక్ష జాతులకు చెందిన 3.61 లక్షల మొక్కలను నాటారు. ఏక్ పేడ్ మా కే నామ్(తల్లి పేరిట ఒక మొక్క) కార్యక్రమం విస్తృత ప్రజాదరణ పొందుతోందని, సామూహిక ఉద్యమంగా మారుతోందని అమిత్ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పచ్చదనం పెరుగుతోందన్నారు. భవిష్యత్ తరాల కోసం భూమిపై పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడానికి అత్యంత కీలకమని సూచించారు. ఆదివారం అహ్మదాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద దేశంలో 1.26 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఇక సహకార జీవిత బీమా సంస్థ
న్యూఢిల్లీ: సహకార రంగంలో జీవిత బీమా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బీమా రంగంలో కూడా సహకార సంస్థలు వృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఎరువులకు సంబంధించిన కోఆపరేటివ్ ఇఫ్కో ఇప్పటికే జాయింట్ వెంచర్ (ఇఫ్కో–టోకియో) ద్వారా బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని సహకార శాఖ ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 26 జీవిత బీమా సంస్థలు ఉన్నాయి.మరోవైపు, కోఆపరేటివ్ మోడల్‌గా ప్రవేశపెక్టిన భారత్ ట్యాక్సీ సేవలను వచ్చే రెండేళ్లలో 500 నగరాలకు విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఢిల్లీ, లక్నో, చండీగఢ్, ముంబై తదితర నగరాల్లో ఇవి అందుబాటులో ఉండగా.. త్వరలో రాంచీ, పాట్నా, భోపాల్ మొదలైన నగరాల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు షా చెప్పారు. భారత్‌లో 30 కోట్ల మంది పైగా సభ్యులతో 8.5 లక్షల పైచిలుకు సహకార సంఘాలు ఉన్నాయి. కోఆపరేటివ్ రంగంలో మానవ వనరుల సమస్యను పరిష్కరించేందుకు గుజరాత్‌లోని ఆనంద్‌లో ఏర్పాటు చేస్తున్న త్రిభువన్ సహకారి యూనివర్సిటీ తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. బ్యాంకింగ్, డెయిరీ, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఈ వర్సిటీ నిపుణులను తయారు చేస్తుందని వివరించారు. -
పంజాబ్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తి!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ముదిరిపాకానపడింది. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీయే ఈ లుకలుకలకు ఆజ్యం పోయడం గమనార్హం. పీసీసీ అధ్యక్షుడిగా లూథియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వడింగ్‌ను కొనసాగించాలంటూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద సంఖ్యలో కీలక నేతలు హాజరయ్యారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై అధిష్టానం ఆందోళన చెందుతోంది. పశ్చిమబెంగాల్లో టీఎంసీలో మాదిరిగానే ఇక్కడ కూడా పార్టీ ముక్కలవుతుందా అని బెంబేలెత్తుతోంది.కాషాయం వైపు రంధావా చూపుగురుదాస్పూర్ కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం రంధావా మాట్లాడుతూ.. పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితుల గురించి మాజీ సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ రాజా వడింగ్లనే అడగాలంటూ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలతో ఇన్ని సమావేశాలు నిర్వహించిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎంపీ మనీశ్ తివారీ అసంతృప్తి..రాజకీయ పరిణామాల మధ్య చండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీల్లో తనకు చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యక్తులు, సంస్థల అభద్రతాభావానికి ఏదైనా చికిత్స ఉంటే బాగుండు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 45 ఏళ్లుగా తాను పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశానని, కాంగ్రెస్ పార్టీ కూడా తనకు చాలా ఇచి్చందని అందులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై పరోక్ష దాడిగానే విశ్లేషకులు భావిస్తున్నారు.మొరిండాలో చన్నీ బలప్రదర్శన..పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో జలంధర్ ఎంపీ, మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ అధిష్టానంపై పోరుబాట పట్టారు. స్వగ్రామం మొరిండాలోని నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు సహా 30 మంది దాకా కీలక నేతలు హాజరయ్యరు. పంజాబ్ కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా గుర్తింపు ఉన్న రాణా గుర్జీత్ (కపుర్తలా ఎమ్మెల్యే), పర్గత్ సింగ్ (జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే), ఓపీ సోనీ (మాజీ డిప్యూటీ సీఎం), భరత్ భూషణ్ ఆశు (మాజీ మంత్రి) తదితరులున్నారు.సమావేశానికి ఎమ్మెల్యేలు తృప్త రాజిందర్ బాజ్వా, కాలా థిల్లాన్ సహా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యరు. తదుపరి కార్యాచరణలపై వారంతా దాదాపు మూడుగంటలపాటు చర్చించారు. చన్నీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయకుండా పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాదని సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే దర్శన్ బ్రార్ కుండబద్దలు కొట్టారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్‌గా చన్నీ పేరు ఖరారైనప్పటికీ, అనూహ్యంగా రాజా వడింగ్నే కొనసాగించారని ఆయన ఆరోపించారు.చన్నీ వ్యూహాలు.. ప్రధాన డిమాండ్లు..రాజా వడింగ్‌ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని చన్నీ వర్గం బహిరంగంగానే వకాల్తా పుచ్చుకుంటోంది. చన్నీ రెండు ప్రధాన డిమాండ్లతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవారే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడం ఆనవాయితీ. 2017లో కెపె్టన్ అమరీందర్ సింగ్ సైతం అప్పటి పీసీసీ చీఫ్ ప్రతాప్ బాజ్వాను తప్పించి ఆ పదవిని దక్కించుకున్నారు. తద్వారా తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు చన్నీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజా వడింగ్ క్రెడిట్ తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే, 2022 ఎన్నికల తరహాలోనే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ పట్టుబడుతున్నారు. పంజాబ్‌లో జాట్ సిక్కుల సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్ అధిష్టానం రాజా వడింగ్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని కౌంటర్ చేసేందుకు చన్నీ పంజాబ్‌లోని 31 శాతం దళిత ఓటుబ్యాంకును అస్త్రంగా వాడుకుంటున్నారు. -
‘అమిత్‌షా అయోధ్యకు ఎందుకు రాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం వ్యవహారంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రామాలయం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్నా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి కూడా స్వామివారిని ఎందుకు దర్శించుకోలేదని ఆయన నిలదీశారు. ఓట్ల కోసం ప్రసంగాల్లో రాముడి పేరు పదేపదే జపించిన నేతలకు గుడికి వెళ్లే తీరిక లేకపోవడం విచిత్రంగా ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాళాల అవకతవకలు, సిట్ విచారణ తీరుపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. రామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి కచ్చితంగా 891 రోజులు గడిచిందని, ఈ కాలంలో అమిత్ షా ఒక్కసారి కూడా అయోధ్య వెళ్లలేదని కేజ్రీవాల్ గణాంకాలతో సహా వివరించారు. అమిత్ షా తన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో 42 సార్లకు పైగా రామ మందిరం గురించి మాట్లాడారని గుర్తుచేశారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగేందుకు సమయం ఉంటుంది కానీ గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకునే తీరికలేదా ? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త క్యాబినెట్లో అమిత్ షాకు కీలక బాధ్యతలు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగబోయే విస్తరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్ర మరింత కీలకం కానున్నదనే చర్చ జోరందుకుంది. 2019 మే 30న తొలిసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, 2025 ఆగస్టులో లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న 2,256 రోజుల రికార్డును అధిగమించి, భారత చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు సృష్టించారు.2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా చేపడుతున్న ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త తరాన్ని ప్రోత్సహించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉండగా.. అమిత్ షా సాధించిన పరిపాలనా విజయాల కారణంగా ఆయన రాజకీయ ప్రాధాన్యత మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అమిత్ షా తన ఏడేళ్ల హోంమంత్రిత్వ కాలంలో దేశ భద్రత, రాజకీయ వ్యూహాల్లో ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించారు. 2019లో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం, 2023లో కొత్త నేర చట్టాలను తీసుకురావడం వంటివి ఆయన కెరీర్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన కోసం 12కు పైగా చారిత్రాత్మక ఒప్పందాల ద్వారా దాదాపు 11,000 మంది తీవ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి అమిత్ షా తీసుకువచ్చారు. అలాగే, 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేశారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా, ఎంపీగా తన సొంత నియోజకవర్గమైన గాంధీనగర్‌లో నిరంతరం పర్యటిస్తూనే, పార్టీ మేనేజ్మెంట్లో సునీల్ బన్సల్, వినోద్ తావ్డే వంటి నేతలను తీర్చిదిద్దారు. 2026 మే నెలలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత, బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేశారు. అలాగే, 2026 జూన్‌లో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ‘యమునా జలాల ఒప్పందం కుదర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ బయోడేటా ఆధారంగానే మోదీ క్యాబినెట్లో ఆయనకు మరింత పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. -
అమిత్ షా ‘మహా వ్యూహం’.. జూలై 9న కీలక భేటీ
న్యూఢిల్లీ: దేశ భద్రతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న అక్రమ చొరబాటుదారుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. భారతదేశ సరిహద్దుల్లోనూ, దేశ అంతర్గతంగానూ తిష్టవేసిన అక్రమ వలసదారులను ఏరిపారేయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్త భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జూలై 9న దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్ కోసం దేశంలోని అగ్రగామి నిఘా, దర్యాప్తు సంస్థలన్నీ ఒకే తాటిపైకి రానున్నాయి.ఈ దేశవ్యాప్త మహా ప్రచారంలో ప్రధానంగా అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని తిరిగి దేశం దాటించడం (డిపోర్టేషన్) వంటి కీలక చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం జూలై 9న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల డీజీపీలతో జరగబోయే భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన చొరబాట్లను పూర్తిగా అరికట్టేలా, అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలను అప్రమత్తం చేస్తూ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. చొరబాటుదారుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా పడగొట్టడమే ఈ ప్రచారంలోని ముఖ్య ఉద్దేశం.నకిలీ పత్రాల నెట్వర్క్ ధ్వంసంచొరబాటుదారులకు సహకరిస్తున్న అంతర్గత శక్తులను మట్టుబెట్టేందుకు కేంద్రం కఠిన వ్యూహాన్ని రచించింది. అక్రమంగా దేశంలోకి చొరబడటమే కాకుండా, ఇక్కడి నకిలీ గుర్తింపు పత్రాలను (ఫేక్ డాక్యుమెంట్స్) సృష్టిస్తున్న ముఠాల నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయనున్నారు. ఈ భారీ ఆపరేషన్ కేవలం పోలీసులకే పరిమితం కాకుండా.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఇంటెలిజెన్స్ బ్యూరో , రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ , నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి అగ్రగామి సంస్థలను రంగంలోకి దించుతున్నారు. ఈ సంస్థలన్నీ రాష్ట్ర పోలీసు విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయనున్నాయి.అక్రమార్కుల ఆస్తుల జప్తుచొరబాటుదారులకు, వారికి సహకరించే నెట్‌వర్క్‌లకు ఆర్థికంగా ఊపిరి అందకుండా చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అస్త్రాలను సిద్ధం చేసింది. అక్రమ వలసలు, మానవ రవాణా, నకిలీ పత్రాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి, వాటిని పూర్తిగా సీజ్ చేసే బాధ్యతను ఈడీకి అప్పగించారు. ఈ ఆర్థికపరమైన కఠిన చర్యల ద్వారా చొరబాటు నెట్‌వర్క్‌ల వెన్ను విరచాలని కేంద్రం నిశ్చయించుకుంది. నిఘా సంస్థల సమాచారంతో, దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఈ దాడులు జరిగేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. -
భారత్ ట్యాక్సీ.. అమిత్ షా కీలక ప్రకటన!
కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలు పోటీకి దిగుతున్నాయని ఆరోపించారు.భారత్ ట్యాక్సీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవేనని అమిత్ షా స్పష్టం చేశారు. తమ లక్ష్యం ఇతర కంపెనీలకు నష్టం కలిగించడం కాదని.. డ్రైవర్లు, ప్రయాణికులకు న్యాయమైన సేవలు అందించడమేనని చెప్పారు. భారత్ ట్యాక్సీ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకే కొన్ని సంస్థలు తాత్కాలికంగా తక్కువ ఛార్జీలు, డ్రైవర్లకు అధిక కమిషన్లు ఇస్తున్నాయని ఆరోపించారు.కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు మొదట నష్టాలను భరిస్తూ మార్కెట్లో పోటీదారులను తొలగించి, ఆ తర్వాత తమ ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించే విధానాన్ని అనుసరిస్తున్నాయని అమిత్ షా అన్నారు. అయితే భారత్‌లో సహకార భావన ఎంతో బలంగా ఉందని, ఇలాంటి వ్యూహాలు ఎక్కువ కాలం పనిచేయవని ఆయన అన్నారు.భారత్ ట్యాక్సీ సేవలను ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, ద్వారక, సోమనాథ్ మొదలైన మొత్తం 14 ప్రధాన నగరాల్లో ప్రారంభించారు. ఈ సేవలు టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీల్ ట్యాక్సీలు అనే మూడు విభాగాల్లో అందుబాటులో ఉంటాయి.భారత్ ట్యాక్సీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది దేశంలోనే తొలి సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే, డ్రైవర్ల యాజమాన్యంలోని రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్. ఇందులో డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. ప్రయాణికుడు చెల్లించిన మొత్తం ఛార్జీ నేరుగా డ్రైవర్‌కే అందుతుంది. దీంతో డ్రైవర్ల ఆదాయం పెరగడంతో పాటు, వారికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.భారత్ ట్యాక్సీ విస్తరణపై కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూలై 31లోపు నాగ్‌పూర్, పుణే, ముంబై, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని, అలాగే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలు, పట్టణాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా.. 'సహకార్ సే సమృద్ధి' అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదాన్ని రవాణా రంగంలో కూడా విజయవంతం చేయాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే సహకార నమూనాను మరిన్ని రంగాల్లో కూడా విస్తరిస్తామని వెల్లడించారు. -
మత్తు ముఠాలపై యుద్ధమే
న్యూఢిల్లీ: దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా నిర్మూలించడమే లక్ష్యంగా కఠినమైన అణచివేత చర్యలు, చట్టాల అమలు, ఆర్థికపరమైన దర్యాప్తులతో కూడిన నూతన మూడేళ్ల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నార్కో–కోఆర్డినేషన్ సెంటర్(ఎన్కార్డ్) సదస్సుకు అమిత్ షా నేతృత్వం వహించారు. డ్రగ్ కంట్రోల్(2026–2029) విజన్ డాక్యుమెంట్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక–2025ను సైతం విడుదల చేశారు. జమ్మూ, గౌహతిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ కార్యాలయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సింథటిక్ డ్రగ్స్, డార్క్‌నెట్ ఆధారిత అక్రమ రవాణా, సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్, డ్రగ్స్ విషయంలో కొత్తగా తలెత్తుతున్న ముప్పులకు వ్యతిరేకంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ధ్యేయంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు అమిత్ షా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. రాబోయే మూడేళ్లలో మాదకద్రవ్యాల వ్యాపార వ్యవస్థను గట్టిగా దెబ్బకొడతామని, రాబోయే కొన్ని దశాబ్దాల పాటు అది కోలుకోలేదని తేల్చిచెప్పారు. మాదకద్రవ్యాల ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి ‘’గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం’అనే వ్యూహాన్ని అమలు చేయాలని డ్రగ్స్ నిరోధక సంస్థల అధికారులకు సూచించారు. సూత్రధారులు తప్పించుకోవడానికి వీల్లేదు డ్రగ్స్‌ను కట్టడి చేసే విషయంలో మానవ, సాంకేతిక నిఘా సమాచారాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని అమిత్ షా చెప్పారు. దేశంలోకి డ్రగ్స్ణు తీసుకొచ్చేవారు, సరిహద్దుల నుండి వివిధ రాష్ట్రాలకు వాటిని సరఫరా చేసేవారు, రాష్ట్రాల నుంచి వినియోగదారులకు పంపిణీ చేసేవారు... ఈ మూడు రకాల ముఠాలను అంతం చేసే దిశగా ముందుకు సాగాలని స్పష్టంచేశారు. ‘గుర్తించడం, అడ్డుకోవడం, నిర్మూలించడం’అనే వ్యూహం కింద.. మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను ప్రారంభ దశలోనే లక్ష్యంగా చేసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను ఛేదించడానికి, నేరస్థుల ఆస్తులను జప్తు చేయడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టే ఆర్థిక దర్యాప్తులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నేరాలకు సూత్రధారులుగా ఉన్నవారు విచారణ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని, అందుకు అవసరమైన అధికారాలు ప్రస్తుత చట్టాల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. వ్యసన విముక్తి, పునరావాస కేంద్రాల ఏర్పాటుతో డ్రగ్స్‌కు డిమాండ్ తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ప్రస్తుతం ఒక కీలక మలుపు వద్ద ఉన్నామని చెప్పారు. మాదకద్రవ్యాల వ్యాపారం మనల్ని ఓడిస్తుందా లేక మనం దానిని ఓడిస్తామా? అనేది రాబోయే మూడేళ్లలో తేలిపోతుందని అమిత్ షా స్పష్టంచేశారు. రాబోయే వందేళ్లలో దేశ భవిష్యత్తు కోసం, ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, దృఢ సంకల్పం, సమిష్టి కృషితో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మనం అత్యంత కఠినమైన వైఖరితో నెట్వర్క్–కేంద్రీకృత పోరాటాన్ని సాగించాలని, అప్పుడే ఈ సమస్యపై విజయం సాధించగలమని వెల్లడించారు.బాధితుల పట్ల సానుభూతి చూపాలి డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకునే వారి పట్ల కఠిన వైఖరిని, డ్రగ్స్ బాధితుల పట్ల సానుభూతి వైఖరిని కొనసాగించాలని అమిత్ షా సూచించారు. కరుణ, సద్భావన బాధితులను తిరిగి సాధారణ జీవితంతో మమేకం చేయగలవని వివరించారు. వారిని సరైన మార్గంలోకి నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలపై పోరాటాన్ని ఏ ఒక్క శాఖ, రాష్ట్రం, ప్రభుత్వం లేదా వ్యక్తి మాత్రమే నిర్వహించలేరని తెలియజేశారు. అన్ని రాష్ట్రాలు, శాఖలు ఒకేవేదికపైకి రావాలని పేర్కొన్నారు. నార్కో సిండికేట్లు వాడుకుంటున్న లొసుగులను అరికట్టడానికి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షిస్తోందని వెల్లడించారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకున్నామని, 2014 నుంచి 2026 వరకు 1.18 కోట్ల కిలోల సింథటిక్ డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాలపై మనం పోరాటం విజయ దిశగా స్థిరంగా సాగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అమిత్ షా తేల్చిచెప్పారు. -
మాదక ద్రవ్యాలపై కన్నెర్ర
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభు త్వం మరిన్ని కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 26న ఢిల్లీలో నార్కో–కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) 10వ అత్యున్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 44 మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, మాదకద్రవ్య నియంత్రణ సంస్థలకు చెందిన 108 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో పాల్గొంటారు. విజన్ డాక్యుమెంట్ విడుదలఎన్సీఓఆర్డీ సమావేశ సందర్భంగా అమిత్ షా ‘నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026–2029’ను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, మాదకద్రవ్య నిరోధక సంస్థలు, ఇతర భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పత్రాన్ని రూపొందించారు. మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు, సరఫరా నియంత్రణ, వ్యసన బాధితులకు పునరావాసం వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యా చరణ ప్రణాళికను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్, డార్క్‌నెట్ ద్వారా జరిగే అక్రమ రవాణా, యువతను మాదకద్ర వ్యాలకు దూరంగా ఉంచడం, చికిత్సా, పునరా వాస కేంద్రాల విస్తరణ వంటి అంశాలపై వచ్చే మూడు సంవత్సరాలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. దేశవ్యాప్తంగా విధాన రూపకల్పన, అమలు, సంస్థాగత బలోపేతానికి ఈ విజన్ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా అమిత్ షా ‘ఎన్సీబీ వార్షిక నివేదిక–2025’ను కూడా విడుదల చేయనున్నారు. అలాగే జమ్మూ, గౌహతిలో నూతనంగా నిర్మించిన ఎన్సీబీ జోనల్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. రూ.6 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసందేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టిన ప్రత్యే క ‘ఆన్లైన్ డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ను కూడా కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 2,09,500 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయనున్నాయి. వీటి అంచనా విలువ 6 వేల కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. దేశంలో మాద కద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఎన్సీఓఆర్డీ సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు, డ్రగ్స్ నియంత్రణ అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే మూడు సంవత్సరాల కార్యాచరణపై చర్చ జరగనుంది. -
అలా మధుమేహాన్ని తగ్గించుకున్నా: హోంమంత్రి అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. తాను మే 2020 నుంచి ఇప్పటివరకు తన జీవనశైలిలో భారీ మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా మధుమేహం సమస్య నుంచి బయటపడ్డానన్నారు. తాను గతంలో షుగర్ వ్యాధితో బాధపడ్డానని, అందుకోసం అధిక మొత్తంలో మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి విముక్తి పొందాలని అనుకున్నాని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించి..బరువు తగ్గడమే గాక మధుమేహం సమస్యను అధిగమించానన్నారు. అందుకోసం తాను ఏం చేశానో, అలాగే యువత ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారో తదితరాల గురించి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు అమిత్‌షా. అవేంటంటే..అమిత్ షా ఆరోగ్య అనుభవంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన ఫిట్నెస్ జర్నీ గురించి గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. గతంలో తాను మధుమేహంతో బాధపడ్డానని, మే 2020లో ఎలాగైన ఈ సమస్యను అధిగమించాలనే కృతనిశ్చయంతో భారీ మార్పులు చేశానని అన్నారు. అందుకోసం తాను తగినంత నీళ్లు తాగడం, వేళకు భోజనం, క్రమం తప్పని వ్యాయామాలు చేసేలా కేర్ తీసుకున్నానన్నారు. అవి తనకెంతో మేలు చేస్తాయన్నారు. అన్నింటికంటే నిలకడగా ఆ అలవాట్లను భాగం చేసుకుంటే మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పైగా తనకు మందులపై ఆధారపడటం నుంచి విముక్తి లభించిందని చెప్పారు. ఆ జీవనశైలి మార్పులను అవలంభించి ఇవాల్టికి ఐదేళ్లవుతుందని, పైగా 20 కిలోల బరువు కూడా తగ్గానన్నారు. ముఖ్యంగా తాను వాడే అల్లోపతి మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి బయటపడ్డానన్నారు. ఈ ప్రయోజనాలు శారీరక ఆరోగ్యానికి మించినవని అన్నారు. అంతేగాదు తన జీవనశైలిలో మార్పులు తన మానసిక చురుకుదనాన్ని, పని సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయన్నారు. ముఖ్యంగా పనిచేసే, ఆలోచించే విధానంలో మంచి మార్పుని తీసుకువచ్చిన చక్కటి నిర్ణయాలు తీసుకునేలా మెరుగుపరిచిందన్నారు. యువతకు సందేశం..తన అనుభవం ఫ్యాడ్ డైట్లు, తక్షణ పరిష్కారాల కంటే రోజువారి స్థిరమైన అలవాట్లు ఎంతటి గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయనేది చెబుతోందన్నారు. అందువల్ల యువత తమ ఆరోగ్యం కోసం వారే శ్రద్ధ తీసుకోవాలని కోరారు. శారీరక శ్రమకు, విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలని నొక్కి చెప్పారు. దాంతోపాటు రోజుకు రెండు గంటల వ్యాయాయమం, బ్రెయిన్‌కి ఆరుగంటల నిద్ర కేటాయించమని కోరారు. తగినంత నిద్ర శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మెరుగైన ఏకాగ్రత, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి దోహదపడుతుందని చెప్పారు.#WATCH | Delhi: At the event organised by ILBS (Institute of Liver and Biliary Sciences) on World Liver Day, Union Home Minister Amit Shah says, "... I made a huge change in my life since May 2020 till today. The required amount of sleep, water and diet, and routine exercise has… pic.twitter.com/HxDZgv0YGh— ANI (@ANI) April 19, 2025 (చదవండి: weight loss: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..) -
తెలంగాణలో ఒంటరి పోరే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలపైనా తమకు ఒక స్పష్టత ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని భారత్ మండంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ అన్యాయం జరగదు..: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రత లేదని అమిత్ షా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అందుకు కావాల్సిన మద్దతు లభించగానే బిల్లును ఆమోదింజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. బిల్లుకు అవసరమైన మద్దతు అభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ బిల్లుపై ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని.. నివేదిక రాగానే సబంధింత బిల్లుకు అవసరమైన మద్దతు లభిసుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు బలంగానే ఉన్నాయని.. తమతో కలిసి నడుస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకీ ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ ఆమె నామినేషన్ పత్రాలను నింపారు కాబట్టే తిరస్కరణకు గురై ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. -
రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?
తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ‘అన్నామలై రాజీనామా’ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. బీజేపీని వీడబోతున్నారన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారాయన. అయితే ఆయన తన రాజీనామా లేఖ అందించారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా.. అసలు అలాంటి చర్చే జరగలేదన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో అసలు అన్నామలై వ్యూహం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆయన ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తన అసంతృప్తిని నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సమావేశాల్లో రాజీనామా అంశం ప్రస్తావనకే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తమిళనాడులో పార్టీ పరిస్థితి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏఐఏడీఎంకేతో పొత్తు ప్రభావం వంటి అంశాలపై అన్నామలై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది ఉత్త ప్రచారంగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నామలై ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్ష నేతల్లో కొందరి వైఖరిపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని, రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ను కూడా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అన్నామలై చెన్నైకి వస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. దీంతో ఆయన స్పందిస్తేనే.. ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అన్నామలై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందా? లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం, లేదంటే పార్టీ కంటే ముందుగా ఒక సామాజిక-ప్రజా వేదికను నిర్మించడంపై ఉంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. యువతతో పాటు వివిధ వర్గాల వారిని కలుపుకోవాలన్న వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అన్నామలై ఆలోచనలు కేవలం పదవుల చుట్టూ కాకుండా, భవిష్యత్ రాజకీయ ప్రణాళికల వైపు సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
ప్రశ్నించే గొంతుకపై 'ఉక్కుపాదం'
‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రా యాన్ని నిర్భయంగా చెప్పే నీ హక్కును నా ప్రాణం అడ్డుపెట్టయినా కాపాడు తాను‘ అన్న ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టెయిర్ ప్రసిద్ధ సూక్తి ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా, పాత్రికేయుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, రాజకీయ విశ్లేషకుడిగా కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని చూరగొన్న వ్యక్తి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఆయనపై వరుసగా కేసులు నమోదు కావడం, కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చే మీడియా సంస్థలు ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక వ్యక్తిపై జరుగు తున్న దాడి కాదు, ప్రశ్నించే గొంతుకను చిదిమేయడా నికి జరుగుతున్న కుట్రగా భావించాలి. ఒక పాత్రికేయుడిగా తనకు అందుబాటులో ఉన్న సోర్సులను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న రాజకీయ పరిణామాలను బయటపెట్టినందుకు ఆయనపై పగబట్టడం పాలకుల అహేతుక వైఖరిని వెల్లడిస్తోంది.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన కీలకమైన హక్కు ‘భావప్రకటన స్వేచ్ఛ’. ఒక జర్నలిస్టుగా సమాజంలో జరుగుతున్న పరిణామాలను, తెరవెనుక రాజకీయాలను ప్రజల ముందుకు తేవడం ఆయన ప్రాథమిక బాధ్యత. ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ గురించి నాగేశ్వర్ ప్రస్తావించడంపై ఇంత రగడ సృష్టించడం అర్థరహితం. రాజకీయాల్లో ఇటువంటి సంభాషణలు సన్నిహిత వర్గాల ద్వారా లేదా అంతర్గత లీకుల ద్వారా సీని యర్ జర్నలిస్టులకు చేరడం అత్యంత సహజమైన ప్రక్రియ. జర్నలిజం నిబంధనల ప్రకారం తమకు సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఏ పాత్రికేయుడికీ లేదు. నమ్మదగిన సోర్స్ ద్వారా సమాచారం అందిన ప్పుడే బహిరంగంగా మాట్లాడతారు. ఒకవేళ నాగేశ్వర్ చెప్పిన విషయాల్లో నిజం లేకపోతే, అసలు వారి మధ్య ఏం సంభాషణ జరి గిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉప ముఖ్య మంత్రిపై ఉంటుంది. కనీసం ఆ వార్తలను ప్రజా స్వామ్య యుతంగా ఖండించే అవకాశం కూడా వారికి ఉంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ సరళ మైన, ప్రజాస్వామ్య మార్గాన్ని వదిలిపెట్టి, భయ బ్రాంతులకు గురిచేసే వ్యూహాన్ని ఎంచుకుంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే సహించేది లేదు’ అనే అర్థం వచ్చేలా సాగుతున్న ఈ వైఖరి ఒక ప్రమాదక రమైన సంస్కృతికి భాష్యం చెబుతోంది.ఒకసారి చరిత్రను చూస్తే...భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై అప్పట్లో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై, ఆయన ప్రభుత్వ విధానాలపై పదునైన వ్యంగ్య కార్టూన్లు గీసేవారు. వాటిని చూసి నెహ్రూ ఎన్నడూ ఆగ్రహించలేదు. ‘శంకర్, నన్ను కూడా వదలకు’ అంటూ ప్రోత్సహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తనపై వచ్చిన పత్రికా విమర్శలను, వ్యక్తిగత దూషణలను ఓపికతో భరించారు. ‘నన్ను విమ ర్శించే హక్కు పత్రికలకు ఉంది, నా తప్పులను నేను సరిదిద్దుకునే అవకాశం వాటి ద్వారా దక్కుతుంది’ అని ఆయన నమ్మారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న చర్చిల్‌పై మీడియా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. యుద్ధ వ్యూహాల లీకేజీలపై కథనాలు వచ్చినా, ఆయన పాత్రికేయులపై కేసులు పెట్టలేదు. ‘సజీ వంగా ఉన్న ప్రజాస్వామ్యానికి విమర్శే ప్రాణా ధారం’ అని ప్రకటించారు. ఈ చారిత్రక ఉదాహరణలతో పోల్చితే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎంత అసహనంతో ఉన్నారో స్పష్టమవుతుంది.– ఎం. కృష్ణ ఆదిత్య ‘ పాత్రికేయుడు -
‘సరిహద్దు’లో అక్రమ నిర్మాణాలను కూల్చేయండి: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల సమీపంలో అక్రమ నిర్మాణాలపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో వెలసిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని సూచించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించిన భద్రతా సమస్యలను ఆయన సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని సంస్థలు బ్యాంకుల బ్యాంకింగ్ లావాదేవీల్లో చట్టబద్ధ, ఆర్థిక నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. పెద్ద వ్యాపార సంస్థలను ధృవీకరించడం, వాటి నిధుల మూలాలను పరిశీలించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలను గుర్తించడం, నకిలీ ఆధార్ కార్డులను గుర్తించడం, సరిహద్దు స్మగ్లింగ్‌ను నియంత్రించడం వంటి బాధ్యతలను జిల్లా మేజి స్ట్రేట్లకు అప్పగించారు. నేరాలు, మాదకద్రవ్యాల బెడద వెనుక ఉన్న మూలాలు, తీరు, నెట్‌వర్క్‌లపై లోతైన అధ్యయనం చేయాలని, భవిష్యత్తులో ఈ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు రూపొందించాలని సరిహద్దు జిల్లాలను ఆదేశించారు. ప్రతి సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. చొరబాటు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యలను పరిష్కరించడానికి, సరిహద్దు నిర్వహణ కోసం బీఎస్ఎఫ్, సీబీడీటీ, ఎన్సీబీ, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమన్వయ విధానం రూపొందించాలన్నారు. సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలు అయ్యేలా చూడాలని షా ఆదేశించారు. అలాగే సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ‘1930’ కాల్ సెంటర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
6 నెలల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు
బికనెర్: సరిహద్దుల ఆవలి నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆరు నెలల్లోగా యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మన భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ల జాడ కనిపెట్టి అందులోని వస్తువులు, సరుకులు ఎవరు అందుకుంటున్నదీ గుర్తించడం అత్యంత ముఖ్యమన్నారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు, పౌర యంత్రాంగం మెరుగైన సమన్వయంతో ఇలాంటి ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనవచ్చని మంత్రి వివరించారు. సరిహద్దు సమగ్ర భద్రతకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), సాయుధ బలగాలు, స్థానిక యంత్రాంగం, పౌరుల మధ్య బహుళ అంచల ‘ఫోర్ పాయింట్ సెక్యూరిటీ గ్రిడ్’ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి సమన్వయం వల్లనే సంపూర్ణ సురక్షిత సరిహద్దు అనే సంకల్పం నెరవేరుతుందని స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే బిహార్, గుజరాత్, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో చర్యలు ప్రారంభించామని వివరించారు. డ్రోన్లు, ఇతర మార్గాల్లో దొంగచాటుగా జరిగే మాదకద్రవ్యాలు, ఆయుధాలను రవాణాను అడ్డుకునే విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం మన బాధ్యతని అన్నారు. మంగళవారం అమిత్ షా రాజస్తాన్‌లోని బికనెర్ జిల్లా సాంచులోని బోర్డర్ పోస్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్ఎఫ్ జవాన్లనుద్దేశించి మాట్లాడారు. సరిహద్దులకు 50 కిలోమీటర్ల పరిధిలో వెలిసే అక్రమ నిర్మాణాలు, అసాధారణమైన మార్పులు, అనుమానాస్పద కార్యకలాపాలపై బీఎస్ఎఫ్ యంత్రాంగం ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం ఔట్‌పోస్ట్ వద్ద మహిళా బ్యారెక్లను ప్రారంభించారు. 2030కల్లా అన్ని బోర్డర్ పోస్టుల్లోనూ మహిళా సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు. మహిళా సిబ్బంది విధుల్లో అంచనాలకు మించి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారంటూ కొనియాడారు. 1965 యుద్ధంలో మన జవాన్లు పాకిస్తాన్ బలగాల దాడులను ఎదుర్కొంటూ సాంచు ఔట్‌పోస్ట్‌ను కాపాడుకోవడంలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ వారి త్యాగాలను స్మరించుకున్నారు. -
రోడ్డు కుదరదా?.. బాబ్బాబు హెలికాప్టర్లైనా పంపండి
అది అడవుల మధ్య దాగి ఉన్న ఓ మారుమూల గిరిజన గ్రామం. నక్సలిజం ప్రభావం కారణంగా చాలాకాలం అభివృద్ధి పనులకు నోచుకోలేకపోయింది. పదేళ్ల కిందట ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. “నక్సల్ సమస్య తుడిచేశాం” అని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాక ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడవ లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై ఓ పని చేశారు. దశాబ్దాల నుంచి గుంతల దారే దిక్కుగా మిగిలిన ఆ గ్రామం.. ఇప్పుడు అసాధారణ విజ్ఞప్తితో వార్తల్లోకి ఎక్కింది.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా మారుకి గ్రామం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ వెళ్లింది. “ అయ్యా.. రోడ్లు నిర్మించలేకపోతే కనీసం హెలికాప్టర్లు అయినా పంపండి” అంటూ కాస్త వెటకారంగానే అక్కడి వాస్తవ దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. ఆ లేఖ ఎలాగోలా సోషల్ మీడియాకు చేరింది. అక్కడి నుంచి మీడియాకు చేరింది. దట్టమైన అటవీ ప్రాంతం నడుమ బస్తర్ ప్రాంతానికి సమీపంగా ఉండే మారుకి గ్రామం.. కొండలు, వాగులు, గాఢమైన అడవులతో కూడిన కఠినమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇక్కడి గ్రామాలు పెద్దగా ఉండవు. కొన్ని వందల మంది మాత్రమే నివసించే చిన్న గిరిజన గూడేలు మాత్రమే కనిపిస్తాయి. గోండ్, మరియా వంటి ఆదివాసీ సముదాయాలకు చెందిన ప్రజలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రహదారి అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, జీవనాధారం కూడా. అయితే మారుకి గ్రామానికి వెళ్లే రహదారి పరిస్థితి గత ఏళ్లు గడుస్తున్న మారలేదు. దశాబ్దం కిందట.. బ్రిడ్జిలు, కల్వర్టులు వంటి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, అవి మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాలు చేసిన గుంతలు అలాగే వదిలేయడం వల్ల మార్గం పూర్తిగా ధ్వంసమై, రాళ్లు, మట్టి, గుంతలతో నిండిపోయిన ప్రమాదకర దారిగా మారింది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారి గ్రామం బయట ప్రపంచానికి పూర్తిగా తెగిపోతుంది. చిన్న వర్షానికే రహదారి జారిపోవడం లేదంటే వాగులు పొంగిపోవడం వల్ల ప్రయాణం అసాధ్యమవుతుంది.ఈ దారుణ పరిస్థితుల్లో గర్భిణీలు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిని కూడా కొయ్య మంచాలపై కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో నిత్యకృత్యంగా మారింది. అంబులెన్స్‌లు గ్రామం లోపలికి రాలేకపోవడంతో ముందుగా అడవిలో కాలినడక, తర్వాత ప్రధాన రహదారికి చేరుకుని అక్కడి నుంచి మాత్రమే ఆసుపత్రికి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ఆలస్యాల కారణంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సర్పంచ్‌తో పాటు స్థానికులు చెబుతున్నదేమిటంటే.. ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా అధికారులు మొదలుకొని ఉన్నతస్థాయి అధికారుల వరకు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదని. ప్రతి సారి హామీలు మాత్రమే వస్తున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఈ పరిస్థితికి భిన్నమైన వివరణలు ఇస్తున్నారు. భౌగోళికంగా అత్యంత కఠినమైన అటవీ ప్రాంతం కావడం, గతంలో నక్సలిజం ప్రభావం ఉండటం, కాంట్రాక్టర్లు మధ్యలో పనులు వదిలేయడం వంటి కారణాలతో రహదారి నిర్మాణం ఆలస్యమైందని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల సుక్మా ప్రాంతంలో నక్సల్ ప్రభావం గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రహదారి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం అందడం లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని, మిగిలిన రహదారి భాగాన్ని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని ఐదారు నెలలుగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు చేసిన చివరి ప్రయత్నం.. “రోడ్లు ఇవ్వలేకపోతే హెలికాప్టర్లు అయినా ఇవ్వండి” ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. -
చొరబాట్లపై ఉక్కుపాదం: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లను ఏమాత్రం ఉపేక్షించబోమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు, సరిహద్దులను పూర్తిగా మూసివేసేందుకు ఈ ఏడాది ‘స్మార్ట్ బోర్డర్’ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. దేశ అంతర్జాతీయ సరిహద్దుల్లో 6 వేల కిలోమీటర్ల మేర అభేద్యమైన భద్రతా గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. స్మార్ట్ బోర్డర్ విధానంలో భాగంగా వచ్చే ఏడాదిలోగా బీఎస్ఎఫ్ బలగాలకు డ్రోన్ రాడార్లు, అత్యాధునిక కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరుస్తామన్నారు. అక్రమ వలసలు దేశ జనాభా స్వరూపాన్ని మార్చేందుకు పన్నుతున్న ఉద్దేశపూర్వక కుట్రగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి తిప్పి పంపుతామని ఆయన స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి సమన్వయం: సరిహద్దుల్లో చొరబాట్లు, పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ అధికారులు రాష్ట్ర పోలీసులు, జిల్లా కలెక్టర్లు, గ్రామ పటా్వరీలతో నేరుగా సమన్వయం చేసుకోవాలని అమిత్ షా సూచించారు. ఇందుకోసం నిఘా వ్యవస్థను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ‘సమస్యను అదుపులో ఉంచడం భద్రత అనిపించుకోదు, దానిని మూలాల నుంచి నిర్మూలించడమే సరైన విధానం‘అని వ్యాఖ్యానించారు. సరిహద్దు భద్రతా గ్రిడ్ కట్టుదిట్టమైన అమలుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కీలకమని షా పేర్కొన్నారు. ముఖ్యంగా పచ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాలతో విధానపరమైన సమన్వయం అవసరమని తెలిపారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వివరించారు. -
ప్రొఫెసర్ నాగేశ్వర్, కొమ్మినేనిపై అక్రమ కేసు
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గురువారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. తప్పుడు, రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేసి.. వ్యాప్తికి కారణమైన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని కాకినాడ అర్బన్ జయేంద్ర నగర్‌కు చెందిన నల్లం శ్రీరాములు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న ఒక చానల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించిన ప్రత్యక్ష చర్చలో హోం మంత్రి అమిత్ షా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌పై ఆధా రాలు లేకుండా మాట్లాడారని, అవి ఇతర మీడియా వేదికలపై ప్రముఖంగా వచ్చాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 'సాక్షి' మీడియా నిర్వహించిన చర్చల్లో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని కూటమి రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలను ప్రసారం చేసి ప్రజల్లో గందరగోళం ఏర్పడేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐఐ కె.ఏసుబాబు తెలిపారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లపై అవాస్తవాలు, అబద్దాలు ప్రచారం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ వ్యాఖ్యలు ప్రసారం చేసిన 99 టీవీ యాజమాన్యం, చర్చ నడిపిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు శిరంగు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు. జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన, పార్టీ నాయకులపైన అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణం పోలీసు కేసులు పెట్టడంతోపాటు న్యాయ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు జనసేన పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
అమిత్ షా తో పవన్ కళ్యాణ్ మీటింగ్.. జగన్ రియాక్షన్
-
ఢిల్లీకి పరుగులు.. అమిత్ షాతో పవన్ అర్జెంట్ మీటింగ్
-
మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ముమ్మాటికీ ద్రోహులే
రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముమ్మాటికీ ద్రోహులు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారంతా కలిసి భారత రాజ్యాంగంపై నిత్యం దాడి చేస్తున్నారని, దేశ ప్రయోజనాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ తన సొంత నియోజకర్గం రాయ్‌బరేలీలో రెండో రోజు బుధవారం కూడా పర్యటించారు. స్థానిక విప్లవవీరుడు ‘వీరా పాసీ’ సంస్మరణార్థం న్విహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీ ఇళ్లకు వచ్చి మోదీ, అమిత్ షాల గురించి మాట్లాడితే నిలబడి గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లు ద్రోహులేనని తేల్చిచెప్పాలని సూచించారు. రాజ్యాంగం, అంబేడ్కర్, గాం«దీజీలపై దాడి చేస్తూ దేశాన్ని అమ్మేస్తున్నవారు ద్రోహులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కుల గణన చేపట్టకుండా జాప్యం చేస్తూ, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ రాజ్యాంగంపై నిత్యం 20 గంటలూ దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహారం సహా అన్నింటి ధరలు ఎగబాకుతాయని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఎరువుల ధరలు సైతం పెరగడం తథ్యమని అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా సామాన్య ప్రజలే నష్టపోతారని, అంబానీ, అదానీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. అంబానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాన్ని విదేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడని, ఆ సొమ్మును నరేంద్ర మోదీకి చేరవేస్తున్నాడని రాహుల్ ధ్వజమెత్తారు. రాబోయే సంక్షోభం నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడలేదని, దాని ప్రభావం రెండు మూడు నెలల్లో కనిపిస్తుందని అన్నారు. చమురు ధరల విషయంలో ప్రభుత్వం తప్పేమీ లేదని మోదీ అంటున్నారని ఆక్షేపించారు. కానీ, తప్పంతా మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లదని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రాహుల్ విమర్శించారు.‘అది నాయకత్వ లక్షణం కాదు.. గిమ్మిక్’ ప్రధాని మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీకి మెలొడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడంపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందించారు. ‘అది నాయకత్వ లక్షణం కాదు.. ఉత్తి గిమ్మిక్’ అని తేల్చిచెప్పారు. ఒకవైపు పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇటలీలో చాక్లెట్లు ఇస్తున్నారని మోదీపై మండిపడ్డారు. మన రైతులు, కార్మికులు, వ్యాపారులు కష్టాల్లో ఉంటే మోదీ మాత్రం నవ్వుతూ రీల్స్ చేస్తున్నారని, అది చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారని రాహుల్ విమర్శించారు. రాజకీయాల్లో ఆయన రాహువు బీజేపీ చీఫ్ నబీన్ మండిపాటున్యూఢిల్లీ: ప్రధాని మోదీ ద్రోహి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ మాటలు ఆయన అరాచక మనస్తత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధ్వజమెత్తారు. 140 కోట్ల మంది ప్రజలను దారుణంగా కించపర్చారని, రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బుధవారం డిమాండ్ చేశారు. భారత రాజకీయాల్లో రాహుల్ ఒక ‘రాహువు’అని ఆరోపించారు. ఆయన తన ఆలోచనా విధానంతో దేశ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండడంతో అది తట్టుకోలేక నిరాశ, అసంతృప్తికి గురై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, మానసిక సమతుల్యత కోల్పోతున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. -
జగన్ తో మావల్ల కాదు.. ఢిల్లీకి పరుగెత్తిన పవన్
-
ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రూపురేఖలు మార్చడం తమ తదుపరి లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యం 2026 మార్చి 31లోగా దేశంలో మావోయిస్టులను నిర్మూలించడంలో కృషి చేసిన పోలీసులు, భద్రతా బలగాలను సోమవారం జగదల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. దీంతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవా కేంద్రాలను నేతనార్ గ్రామంలో అమిత్ షా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమ దగ్గర అభివృద్ధి జరగకపోవడం వల్లే ఆయుధాలు చేపట్టామనే తప్పుడు ప్రచారం చేస్తూ మావోయిస్టులు బస్తర్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఇటీవల మూడు వేల మంది మావోయిస్టులు లొంగిపోతే, అందులో రెండు వేల మందికి కనీసం రాయడం, చదవడం రాదని, ఈ ప్రాంతానికి మావోయిస్టులు చేసిన అన్యాయాలకు ఇదో ఉదాహరణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన కృషితో ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులను నిర్మూలించామని పేర్కొన్నారు.15 శాతం బస్తర్ ఆదివాసీల కోసం...నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సూచనలతో బస్తర్‌లో గుజరాత్ తరహాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని అమిత్ షా చెప్పారు. ఇకపై వచ్చే ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 15 శాతం ఉద్యోగాలను బస్తర్ ఆదివాసీల కోసం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టులను నిర్మూలించేందుకు 2018 నుంచి విస్త్రృత ప్రయత్నాలు జరిగాయని అమిత్‌షా అన్నారు.ఢిల్లీలో పెద్ద పెద్ద భవనాల్లో కూర్చుని కాగితాలు, కంప్యూటర్ల మీద ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31వ తేదీని గడువుగా పెట్టుకున్నామని అమిత్ షా గుర్తుచేశారు. పై స్థాయిలో ఎన్ని ప్లాన్లు వేసినా వాటి క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారనేది కీలకమని, ఆ విషయంలో వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, పారా మిలిటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేశాయని కితాబునిచ్చారు. ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.తెలంగాణకు అభినందనలుబస్తర్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నేతల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారున్నారు. దీంతో నిర్దేశిత గడువులోగా మావోయిస్టులను నిర్మూలించడంలో తెలంగాణ పోలీస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జగదల్పూర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ భద్రతా సలహాదారు శివధర్‌రెడ్డి (మాజీ డీజీపీ), తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, మల్కాజ్గిరి సీపీ బి.సుమతి (ఎస్ఐబీ మాజీ చీఫ్), డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్, గ్రేహౌండ్స్) అనిల్ కుమార్‌ను అమిత్‌షా సత్కరించారు. మావోయిస్టు కార్యకలాపాల నిరోధానికి శివధర్‌రెడ్డి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్, హోంమంత్రి విజయ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇది ఒక కల.. ఆ కలను నిజం చేసుకున్నాం: అమిత్ షా
బస్తర్: భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత(నక్సల్స్ లేని) దేశమని గర్వంగా చెబుతున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ స్పష్టం చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించడానికి నిర్దేశించిన మార్చి 31 గడువు తర్వాత చత్తీస్‌గడ్‌లోని బస్తర్‌లో అమిత్ షా తొలిసారి పర్యటించారు. దీనిలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశంగా నేను గర్వంగా ప్రకటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని దేశంలోని మిగతా ప్రాంతాలతో సమాన స్థాయికి తీసుకురావడానికి, రాబోయే కాలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.బస్తర్ జిల్లాలోని జద్గల్పూర్లో జరిగిన కార్యక్రమంలో, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న వివిధ భద్రతా దళాల సిబ్బందిని, అలాగే మావోయిస్టు దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులను, పౌరులను ఉద్దేశించి షా ప్రసంగించారు. @ ఇది బస్తర్‌కు చాలా పెద్ద రోజు. ఈ రోజు ఇక్కడ నిలబడి, భారతదేశం నక్సలిజం నుండి విముక్తి పొందిందని నేను గర్వంగా తల ఎత్తుకొని చెప్పగలను’ అని తెలిపారు.‘ఈ విజయంలో మొత్తం క్రెడిట్ అంతా మన భద్రతా దళాలకు చెందుతుంది. నేను మీ ముందర తల వంచుతున్నాను. ఇది ఒక కల. ఆ కలను నిజం చేయడానికి వేలాది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారు’ అని ఉద్వేగ భరితంగా మాట్లాడారు. -
తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో ‘క్యాప్టగాన్’ డ్రగ్ పట్టుబడింది. ‘జిహాదీ డ్రగ్’గా పిలిచే ఈ మత్తుపదార్థాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించేందుకు స్మ గ్లర్లు చేసిన యత్నాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమర్థవంతంగా భగ్నం చేసింది. ‘ఆపరేషన్ రేజ్ పిల్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.182 కోట్ల విలువైన 227.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకు న్నారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న ఓ సిరియా జాతీయుడిని అరెస్ట్ చేశారు.చపాతీ మిషన్.. గొర్రెల ఉన్ని.. భారత్ ట్రాన్సిట్ హబ్‌గా క్యాప్టగాన్ డ్రగ్స్ రవాణా జరుగుతోందని ఓ విదేశీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎన్సీబీకి సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మే 11న న్యూఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఓ ఇంట్లో సోదాలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వాడే చపాతీలు కట్ చేసే యంత్రంలో అత్యంత రహస్యంగా దాచిన 31.5 కిలోల క్యాప్టగాన్ మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. వీటిని సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. ఈ దాడుల్లో సిరియా జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 2024 నవంబర్ 15వ తేదీన పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చాడు. 2025 జనవరి 12వ తేదీతో అతడి వీసా గడువు ముగిసింది. అప్పటినుంచి నెబ్ సరాయ్లో అక్రమంగా అద్దెకు ఉంటూ ఈ దందాకు తెరతీశాడు. అతడిచ్చిన సమాచారంతో మే 14న గుజరాత్‌లోని ముంద్రా కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్ (సీఎఫ్ఎస్)లో ఎన్సీబీ తనిఖీలు చేపట్టింది. సిరియా నుంచి గొర్రెల ఉన్ని పేరుతో వచ్చిన ఓ కంటైనర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా మూడు బ్యాగుల్లో దాచిన 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్ లభ్యమైంది. ఈ డ్రగ్స్‌ను భారత్ మీదుగా సౌదీ అరేబియా సహా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర పన్నారని వెల్లడైంది.ఎవరినీ ఉపేక్షించేది లేదు: అమిత్ షాఆపరేషన్ రేజ్ పిల్ విజయవంతం కావడంపై హోంమంత్రి అమిత్ షా ఎన్సీబీ అధికారులను అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవాణా, వాడకాన్ని ఏమాత్రం సహించేదిలేదని, భారత్‌ను రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ఒక్క గ్రాము డ్రగ్స్‌ను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం క్యాప్టగాన్ (ఫెనెథిల్లిన్ అనే రసాయన సమ్మేళనం) సైకోట్రోపిక్ డ్రగ్. పశ్చిమాసియా దేశాల్లో దీని వాడకం తీవ్రంగా ఉంది. భయం, అలసట, నిద్రను ఎక్కువ కాలంపాటు దరి చేరనివ్వకుండా యుద్ధ క్షేత్రంలో దూకుడుగా వ్యవహరించేందుకు తీవ్రవాదులు దీనిని వాడతారని, అందుకే దీనికి ‘జిహాదీ డ్రగ్’అనే పేరు వచ్చిందని చెప్పారు. భారత్‌లో ఈ డ్రగ్ పట్టుబడటం ఇదే తొలిసారి. -
బెంగాల్ అధికారి సువేందు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడిపోయింది. సీనియర్ నేత సువేందు అధికారికే అధికారం అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కోల్‌కతాలో సమావేశమయ్యారు. సువేందును శుక్రవారం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. నూతన ముఖ్యమంత్రిగా 55 ఏళ్ల సువేందు పేరును ఖరారు చేశారు. తర్వాత సువేందు లోక్ భవన్‌కు చేరుకొని, గవర్నర్ ఆర్.ఎన్.రవిని కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేయాలంటూ సువేందు అధికారిని గవర్నర్ ఆహ్వానించారు. శనివారం ఉదయం కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీ ముఖ్యమంత్రి తొలిసారిగా కొలువుదీరుతున్న రెండో రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గత నెలలో బిహార్‌లో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. చొరబాట్లు ఇక అసాధ్యం: అమిత్ షా పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాలనలో చొరబాట్లు, పశువుల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలు అసాధ్యమని అమిత్ షా తేల్చిచెప్పారు. ఆయన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని కేవలం ఒక ఎన్నికల మైలురాయిగా మాత్రమే కాకుండా, అంతకు మించి జాతీయ భద్రత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఒక నిర్ణయాత్మక రాజకీయ మార్పుగా అమిత్ షా అభివరి్ణంచారు. ఈ విజయం కేవలం బీజేపీ విస్తరణకు లేదా దాని సిద్ధాంతానికి సంబంధించినది మాత్రమే కాదని అన్నారు. ఇది 21వ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినది కూడా కాదన్నారు. దేశ జాతీయ భద్రతలోని అతిపెద్ద లోపాల్లో ఒకదానిని ఈ విజయం పూడ్చివేస్తుందన్నారు. బెంగాల్లో చొరబాట్లు, గోవుల అక్రమ రవాణా ఆగిపోతాయన్నారు. చొరబాటుదార్లను గుర్తించి, బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. ఇది జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు విస్తరించిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. 1950లో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో ప్రారంభమైన సైద్ధాంతిక ప్రయాణం 2026లో ఆయన సొంత జన్మస్థలంలో ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని తెలిపారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనలో అరాచకమే రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. చొరబాట్లు లేని బెంగాల్, బంగారు బెంగాల్ స్వప్నాన్ని సాకారం చేస్తామన్నారు. మహిళలకు భద్రత కల్పిస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేయాల్సిన బాధ్యత బీజేపీ సర్కార్‌పై ఉందన్నారు.హామీలన్నీ అమలు చేస్తాం: సువేందు బెంగాల్లో భయోత్పాత కాలం ముగిసిందని సువేందు అధికారి స్పష్టంచేశారు. రాష్ట్రంలో తొలి బీజేపీ ప్రభుత్వం సామూహిక నాయకత్వ సూత్రంపై పనిచేస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సువేందు ప్రసంగించారు. రాష్ట్రంలో భయం పోయిందని, భరోసా వచ్చిందని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం వ్యక్తిగత అధికారం చుట్టూ తిరగదని స్పష్టం చేశారు. నేను కాదు మనం అనే భావనతో ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు. బెంగాల్ ప్రజలకు తమకు చరిత్రాత్మక విజయం కట్టబెట్టారని, హామీలు అమలు చేసిన వారి రుణం తీర్చుకుంటామని వెల్లడించారు. వాగ్దానాలను దశలవారీగా అమలు చేస్తామన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, మహిళల పట్ల నేరాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. బెంగాల్ పునరి్నర్మాణం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సానుకూల పాలన, సంకల్ప పత్రం(మేనిఫెస్టో) అమలు ద్వారా వచ్చే ఎన్నికల్లో 60 శాతానికి పైగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సువేందు తేల్చిచెప్పారు. కౌన్సిలర్ నుంచి సీఎం దాకా...!సువేందు రాజకీయ ప్రస్థానం కోల్‌కతా: మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన సువేందు అధికారి అంచెలంచెలుగా పైకి ఎదిగారు. ఆయన 1970 డిసెంబర్ 15న పూర్బ మేదినీపూర్‌లో బలమైన రాజకీయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు గాయత్రి అధికారి, శిశిర్ అధికారి. సోదరుడు దివ్యేందు అధికారి ఉన్నారు. సువేందు అధికారి రవీంద్ర భారతి యూనివర్సిటీ, సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎంఏ పూర్తిచేశారు. 2021లో నందిగ్రామ్‌లో, 2026లో భవానీపూర్‌లో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని ఓడించి, సంచలనం సృష్టించారు. మొదటిసారి 1,956 ఓట్లు, రెండోసారి 15,105 ఓట్ల తేడాతో మమతను ఓడించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. 2026 ఎన్నికల్లో భవానీపూర్లోపాటు నందిగ్రామ్‌లోనూ పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పబిత్ర కర్‌పై 9,665 ఓట్ల తేడాతో గెలిచారు. సువేందు అధికారి అవివాహితుడు. ఒకప్పుడు మమతా బెనర్జీకి వీర విధేయుడు, నమ్మిన బంటు అయిన సువేందు చివరికి ఆమెకు ప్రత్యర్థిగా మారడం, వరుసగా రెండు ఎన్నికల్లో ఓడించడం ఒక వైచిత్రి. తృణమూల్ కాంగ్రెస్‌లో నంబర్–2 సువేందు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉంది. ఆయన తొలుత కాంగ్రెస్‌లో చేరారు. 1995లో కాంతీ మున్సిపాల్టీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. సువేందు తండ్రి శిశిర్ అధికారి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. యూపీఏ–2 ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సువేందు సైతం 2009, 2014లో తామ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. 2007లో నందిగ్రామ్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే కీలక నేతగా గుర్తింపు పొందారు. 2016లో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తర్వాత నంబర్–2గా మారారు. బెంగాల్లో పార్టీని విస్తరించడంతో ఆయనదే కీలక పాత్ర. పార్టీలో ముఖ్యమైన బాధ్యతలను మమతా బెనర్జీ తన విశ్వాసపాత్రుడైన సువేందుకు అప్పగించేవారు. మమత మేనల్లుడి పెత్తనాన్ని సహించలేక.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మారిపోయింది. అతడి పెత్తనం పెరిగిపోవడం, సువేందు అధికారి ప్రాధాన్యం క్రమంగా తగ్గడం మొదలైంది. అభిషేక్ ఆధిపత్యాన్ని ఆయన పలుమార్లు ప్రశ్నించారు. ఇరువురి మధ్య విభేదాలు ముదిరాయి. మమతా బెనర్జీ సైతం మేనల్లుడికే వత్తాసు పలకడాన్ని సహించలేకపోయారు. 2020 నవంబర్ 27న మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా సమరి్పంచారు. 2020 డిసెంబర్ 17న తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇకపై పార్టీలో ఉండలేనని స్పష్టంచేశారు. డిసెంబర్ 19న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ పార్టీలో సీనియర్ నాయకుల ఆధిపత్యాన్ని తట్టుకొని తన బలం పెంచుకున్నారు. పార్టీలో జూనియర్ నేత అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మెప్పు పొందారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెల్చుకొని తిరుగులేని విజయం దక్కించుకుందంటే దాని వెనుక సువేందు అధికారి పాత్ర మరువలేనిది. ఆయన కృషిని, పట్టుదలను బీజేపీ పెద్దలు గుర్తించారు. అందుకే అధికార పీఠం అప్పగించారు. ముఖ్యమంత్రిగా సువేందును ఎంపిక చేయడాన్ని బీజేపీలో ఎవరూ ప్రశ్నించలేదు. సువేందుపై ఒక సందర్భంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014 సెప్టెంబర్‌లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించింది. -
బెంగాల్ తొలి BJP ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
-
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం శనివారం (రేపు) అధికారంలోకి రానుంది. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ కోల్‌కతాలో పర్యటించి, బీజేపీకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ న్యూటౌన్‌లోని బిస్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ వర్గాల ప్రకారం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండగా, ఇద్దరు మహిళలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించే నిర్ణయం తీసుకున్నారు.బెంగాల్లో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నందిగ్రామ్, భవానిపూర్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. భవానిపూర్‌లో 15 వేల ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీని ఓడించారు.కౌన్సిలర్ టూ సీఎంసువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘జెయింట్ కిల్లర్’గా పేరుపొందిన నేత. ఆయన కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తృణమూల్ కాంగ్రెస్ ద్వారా ఎదిగి, చివరికి బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.జననం: 15 డిసెంబర్ 1970, కార్కులి గ్రామం, పూర్బ మెదినిపూర్, పశ్చిమ బెంగాల్తల్లిదండ్రులు: సిసిర్ అధికారి (మాజీ యూనియన్ మంత్రి, ఎంపీ), గాయత్రి అధికారివిద్య: 2011లో రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారువివాహం: అవివాహితుడురాజకీయ ప్రస్థానం1995: కాంగ్రెస్‌లో కాంతి మునిసిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు1998: తండ్రితో కలిసి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు2006: కాంతి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, అదే సంవత్సరం కాంతి మునిసిపాలిటీ చైర్మన్‌గా కూడా అయ్యారునందిగ్రామ్ ఉద్యమం2007: నందిగ్రామ్‌లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారుటీఎంసీకి ప్రజాదరణ తెచ్చారుఈ ఉద్యమం మమతా బెనర్జీని రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తెచ్చిందితృణమూల్ కాంగ్రెస్‌లో ఎదుగుదల2009: తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు2014: మళ్లీ తమ్లుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు2016: నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మమతా బెనర్జీ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు2018–2020: నీటి వనరులు, సాగు శాఖ మంత్రిగా కూడా పనిచేశారుబీజేపీలో చేరిక2020 నవంబర్–డిసెంబర్: టీఎంసీ నుంచి రాజీనామా చేసి, 19 డిసెంబర్ 2020న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారుకారణం: మమతా బెనర్జీ వారసుడిగా అభిషేక్ బెనర్జీని ముందుకు తేవడంపై విభేదాలుఎన్నికల విజయాలు2021: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు2026: నందిగ్రామ్, భవానిపూర్ రెండింటిలోనూ గెలిచి, మమతా బెనర్జీని ఆమె స్వస్థల నియోజకవర్గంలో ఓడించారుఇది 1967 తర్వాత మొదటిసారి ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో గెలిచి, సిట్టింగ్ సీఎంను ఓడించిన ఘట్టంముఖ్య పదవులు2009–2016: లోక్‌సభ సభ్యుడు (తమ్లుక్)2016–2020: పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో రవాణా, నీటి వనరులు శాఖలు2020–2021: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్2021–2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత2026 నుంచి: పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిజెయింట్ కిల్లర్ అనే బిరుదు: మమతా బెనర్జీని నందిగ్రామ్ (2021), భవానిపూర్ (2026)లో ఓడించడం వల్ల ఈ పేరు వచ్చింది.నైపుణ్యం: గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్ నిర్మాణం, ఉద్యమాల ద్వారా ప్రజల్లో ప్రభావం చూపడం ఆయన ప్రత్యేకత.బీజేపీ తొలి సీఎం: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. -
అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్
'కాంతార' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషభ్ శెట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆయనతో జరిగిన భేటీ.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్లో ఒకటని రాసుకొచ్చాడు. ఈ మేరకు తామిద్దరి మధ్య సినిమాల గురించి చర్చ జరిగినట్లు చెబుతూ రెండు ఫొటోలని రిషభ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ)'కాంతార, కాంతర ఛాప్టర్ 1 సినిమాల గురించి అమితా షా మాట్లాడుతూ వాటిని ప్రశంసించడం గొప్ప అనుభూతి. నా తర్వాత చిత్రాల విశేషాలని కూడా ఆయనతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మన చరిత్ర, సంస్కృతి, కళలు, సినిమా మేకింగ్ గురించి ఆయన మాట్లాడుతుంటే నాకెంతో ఆనందంగా అనిపించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.రిషభ్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'జై హనుమాన్' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. అలానే శివాజీ జీవితం ఆధారంగా తీస్తున్న మరో పాన్ ఇండియా మూవీ, సితార సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రం కూడా చేయాల్సి ఉంది. 'కాంతార' ఫ్రాంచైజీలో మూడో భాగం అయితే ఇప్పట్లో రాకపోవచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి) View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
లద్దాఖ్ ధర్మభూమి: అమిత్ షా
లేహ్/జమ్మూ: శతాబ్దాలుగా బౌద్ధ జ్ఞానాన్ని పరిరక్షించి, పోషించి లద్దాక్ ‘సజీవ ధర్మభూమి’గా నిలిచిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బౌద్ధమతం సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా బుద్ధుని బోధనలను పరిరక్షించడానికి ఈ నేల కృషి చేసిందని, పరిరక్షించిన ఆ జ్ఞానాన్ని విస్తరించడానికి సహాయపడిందని కొనియాడారు. 75 ఏళ్ల తర్వాత బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలు లద్దాఖ్‌కు తిరిగి రావడాన్ని ‘చారిత్రక పునఃకలయిక’గా ఆయన అభివరి్ణంచారు. ఈ అవశేషాల పునరాగమనం లద్దాఖ్ ప్రజలకు బుద్ధ పౌర్ణమి ప్రాముఖ్యతను మరింత పెంచిందన్నారు. 2569వ బుద్ధ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం లేహ్‌లోని జీవేత్సల్లో తథాగతుని పవిత్ర అవశేశాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో బుద్ధుని బోధనల ప్రాముఖ్యతను షా నొక్కి చెప్పారు. జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని, దానిని అంతర్భాగం చేసుకోనంత వరకు మోక్షం సాధ్యం కాదన్నారు. ‘ఆధ్యాత్మిక సాధన లేకుండా జ్ఞానం అసంపూర్ణం. జ్ఞానం లేని ఆధ్యాతి్మక సాధన అంధకారం. ఆధ్యాత్మిక సాధన, జ్ఞానం కలయికే సరైన మార్గం. ఇవన్నీ ఉన్నా నైతిక క్రమశిక్షణ లేకపోతే, జ్ఞానవంతమైన జీవితాన్ని గడపలేరు. నైతిక క్రమశిక్షణే జ్ఞానవంతమైన జీవితానికి ఆధారం’అని షా పేర్కొన్నారు. భారత్‌లో ఉద్భవించిన బుద్ధుని బోధనలు లద్దాఖ్ ద్వారా చైనా, అనేక ఇతర దేశాలకు వ్యాపించాయని, ఎంతో మంది జీవితాలకు మార్గదర్శకంగా మారాయని చెప్పారు. కశ్మీర్, లేహ్, యార్కండ్, ఖోటాన్, టిబెట్లను కలిపే సిల్క్ రూట్ వాణిజ్యానికి మాత్రమే కాకుండా, ఆలోచనలకు, గ్రంథాలకు, కళాత్మక సంప్రదాయాలకు వ్యాప్తికి ఒక మార్గంగా మారిందన్నారు. లేహ్‌లో పలు డైరీ ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం సభలో షా మాట్లాడారు. దేశ సరిహద్దులను కాపాడటంలో లద్దాఖ్, కార్గిల్ ప్రజలు చూపిన దేశభక్తిని, త్యాగాలను ప్రశంసించారు. సరిహద్దు నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా సైన్యం రావడానికి ముందు స్థానిక ప్రజలే దేశ రక్షణకు నిలబడ్డారని కొనియాడారు. ఏడేళ్ల తర్వాత తాను ఈ ప్రాంతాన్ని సందర్శించడం, బుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడ ఉండటం ఆనందంగా ఉందన్నారు. -
‘మే 5 నుంచి..’ ఆడపిల్లలకు అమిత్ షా భరోసా!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. మహిళల భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మే 5 తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాత్రి ఒంటిగంట దాటినా ఆడపిల్లలు ఎలాంటి భయం లేకుండా వీధుల్లో తిరగగలరని ఆయన భరోసా ఇచ్చారు.మహిళల భద్రతపై దీదీకి సూటి ప్రశ్నలుగత పదిహేనేళ్ల మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలోని తల్లులు, సోదరీమణులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అమిత్ షా ఆరోపించారు. ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ, కలకత్తా లా కాలేజ్ వంటి ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలన్నారు. ‘రాత్రి 7 గంటల తర్వాత మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని దీదీ చెబుతున్నారు. దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రీ ఇలాంటి మాట అనలేదు. ఒక మహిళ.. సీఎంగా ఉండి కూడా భద్రత కల్పించలేకపోయినందుకు సిగ్గుపడాలి. మే 5న మేం అధికారంలోకి వచ్చాక ఏ రౌడీ కూడా మహిళల వైపు కన్నెత్తి చూడలేడు, అలాంటి వారిని కటకటాల వెనక్కి నెడతాం’ అని జమాల్పూర్ ర్యాలీలో అమిత్ షా హెచ్చరించారు. जमालपुर वासी भी भाजपा सरकार बना रहे हैं...ভোটের প্রথম দফাতেই ১১০টি আসনে জয়লাভ করে বিজেপি পশ্চিমবঙ্গে সরকার গঠনের পথে অনেকটাই এগিয়ে গিয়েছে। জামালপুর বিধানসভার বাসিন্দারাও তৃণমূল কংগ্রেসকে সম্পূর্ণভাবে পরাজিত করার জন্য প্রস্তুত।#BanglarHridoyeBJP https://t.co/E5l9lC5GPy— Amit Shah (@AmitShah) April 25, 2026తొలి దశలో 110కి పైగా స్థానాలు మావేమొదటి దశ పోలింగ్ సరళిని బట్టి బీజేపీకి తిరుగులేని విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ.. 152 స్థానాలకు గాను 110కి పైగా సీట్లను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. 16 జిల్లాల్లోని 52 స్థానాల్లో ఏకంగా 92.98 శాతం పోలింగ్ నమోదు కావడమే మమతా సర్కార్ పతనానికి సంకేతమన్నారు. బెంగాల్ ప్రజల్లో భయం పోయిందని, బీజేపీ పట్ల నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్ పూర్తయ్యే సరికి బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.మతువా సామాజిక వర్గానికి ‘సీఏఏ’ రక్షణ కవచంపౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని షా విమర్శించారు. అయితే బీజేపీ అధికారంలోకి రాగానే సీఏఏను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ మూలాలున్న మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: 29న కోల్‌కతాలో బిగ్గెస్ట్ ఫైట్ -
30 నిమిషాల డీల్.. ట్రెండింగ్‌లో పరిణితీ-రాఘవ్ చద్దా జోడి (ఫొటోలు)
-
అంగ.. వంగ.. కళింగ..!
కోల్‌కతా: బెంగాల్లో మొదటి విడత ఓటింగ్ సరళిని చూస్తే ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రాచీన సామ్రాజ్యాలు, ప్రస్తుత తూర్పు భారత రాష్ట్రాలైన అంగ(బిహార్), వంగ(బెంగాల్), కళింగ(ఒడిశా)ల్లో వచ్చే నెలలో ఉండేది బీజేపీ ప్రభుత్వాలేనని ఆయన ప్రకటించారు. కోల్‌కతాలో శుక్రవారం మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. బెంగాల్లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 సీట్లకుగాను బీజేపీ 110పైగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయం 92 శాతం మంది ఓట్లేసి ఈసారి సునామీ సృష్టించారు. సీట్లు, మెజారిటీ ఎక్కువగానే ఉండొచ్చు’అంటూ అంచనా వేశారు. -
బెంగాల్లో బీజేపీ సునామీ! గెలుపు పై అమిత్ షా ధీమా
-
బెంగాల్లో బీజేపీకి అన్ని సీట్లు.. అమిత్‌షా జోస్యం
నిన్న జరిగిన బెంగాల్ తొలివిడత ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు దక్కించుకోబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ ఏకంగా 110 సీట్లను సొంతం చేసుకోబోతుందన్నారు. బెంగాల్ ప్రజలు ప్రస్తుత పాలన పట్ల విసిగిపోయారని, రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఓటర్లు ఎనలేని ఉత్సాహంతో, ఆవేశంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని అందుకే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందన్నారు. ఇది అధికార పక్షానికి వ్యతిరేకంగా జరిగిన నిశ్శబ్ద విప్లవమని అభిప్రాయపడ్డారు. అయితే నిన్న (గురువారం) ప్రధాని మోదీ సైతం ఈ విధంగానే మాట్లాడారు. బెంగాల్లో జరిగిన భారీ ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. మే 4 తర్వాత బెంగాల్లో విజయోత్సవ సభ నిర్వహిస్తామని బెంగాల్ ప్రజలకు ఝాల్మురీ, స్వీట్లు పంపిణీ చేస్తానని తెలిపారు. కాగా ఎన్నికల ఫలితాలు రాకముందే ఇంత భారీ స్థాయిలో సీట్లు గెలుచుకుంటామని ప్రకటించడం వెనుక బీజేపీ పక్కా వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మిగిలిన విడతల ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాగా బెంగాల్ తొలివిడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 92.72శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. కాగా రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. -
బీజేపీతోనే మహిళలకు న్యాయం
సాక్షి, చెన్నై: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్, డీఎంకే లు మహిళలకు ద్రోహం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మహిళలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదకురిచి నియోజకవర్గ బీజేపీ కృతికా శివకుమార్‌కు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు. అధికార డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తన కొడుకు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడంపై స్టాలిన్ దృష్టిపెట్టారని, ఈ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయలేవని షా ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ఎన్డీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే–బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకొస్తామబని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నా యని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మహిళల హక్కులకు ఎవరు అ డ్డుపడుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్దీకరణకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చేయడం డీలిమిటేషన్‌తో సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన హక్కును ప్రజలకు దక్కకుండా చేసిందని, ఇప్పటికీ అదే పని చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తుండగా, విపక్ష ‘ఇండియా’కూటమి మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగం వీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వారికి సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల సీట్ల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా ఇంకా ఏం మాట్లాడారంటే.. పారదర్శకంగా పునర్విభజన ‘‘ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు గల కారణాలపై సభలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 2026 తర్వాత నిర్వహించే జనగణన అనంతరం జరిగే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ‘నారీశక్తి వందన అధినియం’లో పేర్కొన్నాం. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్‌ను నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే ‘నారీశక్తి వందన అధినియం’ను అమలు చేయగలం. అందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానాలు 127 వరకు ఉన్నాయి. ఇది ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ’అనే సూత్రానికి విరుద్ధం. కొన్నిచోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా లేదు. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఏకంగా 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎంపీ ఇంత భారీ జనాభా ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరు? ఈ అసమానతలను తొలగించి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలంటే పునర్విభజన అనివార్యం. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తాం కుల గణనను ఆలస్యం చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, అందుకే హడావుడిగా మూడు బిల్లులు తీసుకొచ్చిందన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే ఇప్పుడే ఆ సవరణ చేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు తావులేదుమతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. ‘ఇండియా’కూటమి బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్‌ను తెరపైకి తెస్తోంది. దేశంలో ఓబీసీలకు అతిపెద్ద వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే. మండల్ కమిషన్‌ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించిన ఘనత మాదే. మహిళా సాధికారతకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. గ తంలో సుష్మా స్వరాజ్, ఆనందిబెన్ పటేల్ లాంటి వారికి సీఎంలుగా అవకాశం ఇచ్చాం. పీవీని కాంగ్రెస్ సొంత మనిషిగా చూడలేదు దేశంలో మహిళలకు రిజర్వేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే. 1992లో 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పీవీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పీవీ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనను ఏనాడూ సొంత మనిషిగా అంగీకరించలేదు. ఆయన మరణానంతరం భౌతికకాయానికి అవమానం జరిగింది. కాంగ్రెస్ పీవీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు పీవీ పేరును గర్వంగా చెప్పండి. కాంగ్రెస్ ఆయనను విస్మరించడం శోచనీయం’’అని అమిత్ షా ఆక్షేపించారు. -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో చేపట్టిన కీలక ఓటింగ్‌లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్‌సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్‌సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్‌సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్‌కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్‌లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
పార్లమెంటులో ..33 కాదు 50 శాతం రిజర్వేషన్
పార్లమెంట్ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలతో వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఛాలెంజ్ విసిరారు.. కాంగ్రెస్ నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు.అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు.డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాఫ్‌లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రతి సంస్కరణకు అడ్డు తలిగిందన్నారు త్రిపుల్ తలాక్‌ను అడ్డుకుందని రామమందిరం నిర్మాణానికి ఆటంకం కలిగించిందని అన్నారు. దళిత మహిళను రాష్ట్రపతి చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వకుంటే వీగిపోతుందని వీరిని దేశంలోని మహిళలంతా గమనిస్తున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు లోక్‌సభలో గొడవ చేసి బతికిపోవచ్చుగానీ ప్రజాక్షేత్రంలో మహిళల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని అన్నారు. -
'నాకు, మోదీకి ఆ బాధ లేదు.. హమ్మయ్య! అమిత్ షా నవ్వారు'
ఢిల్లీ: లోక్‌సభలో మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నవ్వులు పూయించారు. తనకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భార్యల సమస్య లేదని సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. 131 రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై చర్చలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర గురించి గొప్పగా చెప్పారు.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మహిళల నుంచే నేర్చుకుంటారని అన్నారు. దైనందిన జీవితంలో ప్రతి విషయంలోనూ మహిళల సహకారం అవసరం ఉంటుందని వివరించారు. “మన జాతీయ భావన, దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర, చోదక శక్తి. మనమందరం, ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని తల్లులు, సోదరీమణులు, భార్యలైన మహిళల నుంచి ఎంతో ప్రభావితమయ్యాం, స్ఫూర్తి పొందాం, నేర్చుకున్నాం“ అంటూ మహిళలపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సరదాగా చేసిన ఓ వ్యాఖ్యకు రాహుల్ గాంధీ కూడా సరదాగానే సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లాగా తాను తన భార్య కోసం కవిత రాయనందుకు ఇంట్లో తిట్లు తిన్నానని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ జవాబిస్తూ.. "నిజానికి నాకు, ప్రధానమంత్రికి భార్యల సమస్య లేదు. కాబట్టి మాకు అలాంటి సలహాలు అందవు. కానీ మాకు మా అమ్మలు, సోదరీమణులు ఉన్నారు" అని అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.నేను చేయలేని పని ప్రియాంక చేసిందిగురువారం లోక్‌సభలో తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగంపై కూడా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. "నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేని పనిని నిన్న నా సోదరి ఐదు నిమిషాల్లో సాధించడం చూశాను. అదే అమిత్ షా గారిని నవ్వించడం" అని రాహుల్ అనగానే సభికులందరూ పగలబడి నవ్వారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ ప్రతిపక్షాలకేరాహుల్ వ్యాఖ్యలతో కలకలంకాగా, ఆపరేషన్ సిందూర్, బాలకోట్ వంటి అంశాలపై ప్రధాని మోదీ మ్యాజిక్ చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం రేగింది. ప్రధానమంత్రిని అవమానించిన రాహుల్ క్షమాపణ చెప్పాలని ఎన్డీఏ సభ్యులు డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీని సభ నుంచి బహిష్కరించాలని పట్టుబట్టారు. -
ముస్లిం కోటా ఉండబోదు
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లలో ముస్లింలకు కోటా ప్రత్యేక ఉండబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించబోదు. అవి రాజ్యాంగ విరుద్ధం. కనుక ముస్లిం మహిళలకు మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే ప్రస్తకే లేదు’’అంటూ కుండబద్దలు కొట్టారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు నిమిత్తం కేంద్రం గురువారం లోక్‌సభ లో మూడు బిల్లులు ప్రవేశపెట్టడం తెలిసిందే. వాటిపై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేశ్‌యాదవ్, ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ‘‘మహిళలు జనాభాలో సగ భాగం. ముస్లిం మహిళలను వారిలో భాగంగా పరిగణించడం లేదా?’’అని అఖిలేశ్ ప్రశ్నించారు.మహిళా రిజర్వేషన్లు ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా వర్తించేలా నిబంధనలు చేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదన్నారు. తాజా బిల్లులను ఉపసంహరించుకుని 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంలో వెనుకబడిన తరగతులతో పాటు ముస్లిం మహిళలను కూడా చేర్చాలని ధర్మేంద్ర యాదవ్ కోరారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. వారి డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘‘సమాజ్‌వాదీ పార్టీ కావాలనుకుంటే అన్ని టికెట్లూ ముస్లిం మహిళలకే ఇచ్చుకొమ్మనండి. ఎవరొద్దంటున్నారు? మాకైతే ఏ అభ్యంతరమూ ఉండబోదు’’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు
న్యూఢిల్లీ: చాణక్యుడు ఇప్పుడు గనుక బతికి ఉంటే బీజేపీ నాయకుల రాజకీయ చాతుర్యం చూసి ఆశ్చర్యపోయేవాడని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గురువారం మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, దేశ సమగ్రతపై అతిపెద్ద దాడి ప్రారంభించిందని ఆరోపించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరోవైపు ఓబీసీల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తన మాటలకు అమిత్ షా నవ్వుతున్నారని, ఈ స్కీమ్ వెనుక ఆయనే ఉన్నారని చెప్పారు. అమిత్ షా నవ్వుతున్నారంటే తన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఏకైక చాంపియన్‌గా మారాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ప్రియాంక తేల్చిచెప్పారు. ‘ఒక ఓటు, ఒక పౌరుడు, ఒకే విలువ’అనే విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. అమెరికాలో ఓటు హ క్కు కోసం మహిళలు 150 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు కేవలం అధికారం కోసమే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉనికిలో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కోటా చట్టాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెట్టారో చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. -
డీలిమిటేషన్.. తెలంగాణలో 26... ఏపీలో 38
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య 17నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి పెరగనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వీభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల చట్ట రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో అమిత్ షా ప్రసంగించారు. డీలిమిటేషన్ వల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. పునర్విభజన అనంతరం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 129 నుంచి 50 శాతం, అంటే 195కు పెరుగుతుందని వెల్లడించారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గదు. పైపెచ్చు సభలో వాటి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది’’అంటూ గణాంకాలతో సహా మంత్రి వివరించారు. ‘‘మొత్తం చర్చపై కేంద్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం సమాధానమిస్తాను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పదలచాను. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రజలకు ఎలాంటి అపోహలూ వద్దు. ఈ బిల్లులతో లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుందని పెద్ద వాదనను లేవనెత్తుతూ భ్రాంతిని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వదలచాను. సభ ముందున్న బిల్లుల ఆధారంగా వాస్తవాలు అందరి దృష్టికీ తెస్తాను. నియోజకవర్గాల పునర్వీభజనతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 25నుంచి 38కు, ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 4.60 నుంచి 4.65 శాతానికి పెరుగుతాయి. తెలంగాణలో స్థానాలు 17 నుంచి 26కు, ప్రాతినిధ్యం 3.13 నుంచి 3.18కి పెరుగుతాయి. తమిళనాడులో సీట్లు 39 నుంచి 59కు, ప్రాతినిధ్యం 7.18 నుంచి 7.23 శాతానికి పెరుగుతాయి. కర్నాటకలో లోక్‌సభ స్థానాలు 28నుంచి 42కు, సభలో ప్రాతినిధ్యం 5.15 శాతం నుంచి 5.14 శాతానికి చేరతాయి. కేరళలో సీట్లు 20 నుంచి 30కి, లోక్‌సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.68 నుంచి 3.67 శాతానికి చేరతాయి. మొత్తమ్మీద దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్య 195కు పెరుగుతుంది. లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం 23.76 శాతం నుంచి 23.97 శాతానికి పెరుగుతుందే తప్ప ఏ మాత్రమూ తగ్గదు. అలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయమన్న ప్రశ్నే తలెత్తదు’’అని స్పష్టం చేశారు. జనగణనతో పాటే కులగణన ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటే కులగణన కూడా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘కులగణన చేపట్టాలని కేంద్రం భావించడం లేదని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తన్నాయి. మోదీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జనగణన రెండు దశల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇళ్ల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. వ్యక్తిగత డేటాను తీసుకునేటప్పుడు కులగణన అంశం కూడా వస్తుంది’’అని ఆయన స్పష్టం చేశారు. 2029 తర్వాతే అమలు నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో అమలు కాబోదని సభకు అమిత్ షా తెలియజేశారు. ‘‘డీలిమిటేషన్ కమిషన్ నివేదికను పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాతే అమల్లోకి వస్తుంది. ఇదంతా 2029కి ముందు జరిగే ప్రసక్తే లేదు. కనుక అప్పటిదాకా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు పాత నియోజకవర్గాల ప్రాతిపదికనే జరుగుతాయి’’ అని చెప్పారు.లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 816! లోక్‌సభలో సీట్ల సంఖ్య పెంపుపై విపక్షాల ప్రశ్నలకు బదులిస్తూ అమిత్ షా ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ముందుగా మొత్తం సీట్లను 50 శాతం పెంచాలి. అప్పుడు వాటిలో 33 శాతం మహిళలకు కేటాయించినా మిగతా ఓపెన్ సీట్ల సంఖ్య యథాతథంగా ఉంటాయి. అంటే ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం పెంచితే వాటిలో 33 శాతాన్ని మహిళలకు రిజర్వ్ చేశాక కూడా ఓపెన్ కేటగిరీలో 543 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టే 50 శాతం పెంపును ప్రతిపాదించాం’‘అని ఆయన వివరించారు. ‘‘లోక్‌సభ స్థానాల పెంపు గరిష్టంగా 850 దాకా అనేది సుమారుగా వేసిన సంఖ్య. కచ్చితమైన సంఖ్య బహుశా 815, లేదా 816గా ఉండవచ్చు. దీనిపై సభకు సమగ్రంగా వివరణ ఇస్తా’’అని చెప్పారు. -
దక్షిణాదిలో పెరగనున్న పార్లమెంట్ స్థానాలు ఎన్నంటే : అమిత్‌షా
సాక్షి,న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనుందంటూ విపక్షాల ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కౌంటర్ ఇచ్చారు. బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయి. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం. కర్ణాటక, తెలంగాణ బాగా లాభపడతాయి. ఈ బిల్లుతో తెలంగాణలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు.. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుతాయి. అలాగే తమిళనాడులో 59కి, కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలు.. కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలకు పెరుగుతాయి. మేం సందేహాలకు సమాధానం ఇస్తాం.. వాకౌట్ చేయాల్సిన పనిలేదని విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా ఎద్దేవా చేశారు. కాగా, జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. -
అమిత్ షా Vs కేసీ వేణుగోపాల్.. బిల్లుపై మాటల యుద్ధం
-
లోక్‌సభలో డీలిమిటేషన్ మంట
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వేడెక్కింది. డీలిమిటేషన్, 131 రాజ్యాంగ సవరణ బిల్లులను గురువారం కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ వెంటనే ఎన్డీయే కూటమి, కాంగ్రెస్-మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం. 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఆ టైంలోనే 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు?. జనాభా లెక్కలు, మహిళా రిజర్వేషన్ బిల్లుల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని అన్నారు. ఇప్పుడేమో రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. బిల్లుకు అసలు కారణం వేరే ఉంది. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్ చేయాలని చూస్తోంది.131 రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లులను కేసీ వేణుగోపాల్ అవమానించారు. బిల్లును సభలో పెట్టకుండా ఎలా చర్చిస్తాం?. బిల్లు పూర్తిగా ప్రవేశపెట్టకుండానే అభ్యంతరం ఏంటి?. సభలో బిల్లు పెట్టాక మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. చర్చల సమయంలో అన్నింటకీ సమాధానం చెబుతాం’’ అని బదులిచ్చారు. అయితే బిల్లులను సభలో ప్రవేశపెట్టడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.Congress MP KC Venugopal opposes the introduction of Constitution (One Hundred and Thirty-First Amendment) Bill, 2026, Union Territories Laws (Amendment) Bill, 2026 and Delimitation Bill, 2026. pic.twitter.com/vTpO7phzQL— ANI (@ANI) April 16, 2026చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్‌సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు. మిగతా రెండూ చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. మిగతా రెండింటికీ సాధారణ మెజారిటీ సరిపోతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీటిని ప్రవేశపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందు ఉంచారు. అనంతరం వీటిపై చర్చ సభలో చేపట్టారు. ఈ బిల్లులపై నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్లో చర్చించనున్నారు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటలపాటు ఎంపీలు మాట్లాడుతారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రాజ్యసభలో 18న చర్చ ఉంటుంది. -
బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టనివ్వం
రాణిగంజ్: టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమాయూన్ కబీర్ ఇద్దరూ ఒక్కటేనని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే హుమాయూన్ ప్రకటించినట్లుగా బాబ్రీ మసీదును నిర్మించనివ్వబోమని స్పష్టం చేశారు. సోమవారం ఆయన బీర్భూమ్, పశ్చిమ్ బర్దమాన్ జిల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. అప్పట్లో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించగా.. ఆమె పార్టీ మాజీ నేత ఇప్పుడు అయోధ్యలో కూల్చిన బాబ్రీ మసీదును నిర్మించేందుకు చూస్తున్నారన్నారు. ‘550 ఏళ్లుగా టెంట్ కిందే ఉంటున్న రామ్ లల్లాను అలా ఉంచేందుకే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు మద్దతు తెలిపాయి. తిరుగులేని మెజారిటీతో గెలిచిన మోదీ ప్రభుత్వం మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది. మమతా బెనర్జీ మాదిరిగా ఆలోచించే హుమాయూన్ ఇప్పుడు బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టాలనుకుంటున్నారు’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాబ్రీ మసీదు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. బాంబులు, బుల్లెట్లకు బెంగాల్ ప్రజలు ఓట్లతోనే సమాధానం చెబుతారన్నారు. టీఎంసీ ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆ వెంటనే సిండికేట్ కట్‌మనీ ముఠాదార్లను, వారి మద్దతుదార్లను తలకిందులుగా వేలాడదీసి, తాము దారికి తెస్తామని హెచ్చరికలు చేశారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి టాటాబైబై చెప్పి, బీజేపీకి అధికారమిచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టేందుకు టీఎంసీ నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తోందంటూ మండిపడిన అమిత్ షా..మే 5న ఓట్ల లెక్కింపు తర్వాత కాషాయ పార్టీ కార్యకర్తలు ఈ నేరగాళ్లను బయటకు లాగి, చట్టం ముందు నిలబెడతారని స్పష్టం చేశారు. అందుకే టీఎంసీ గూండాలు మొదటి దశ పోలింగ్ జరిగే 23న ఇళ్లలోనే ఉండిపోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని మెజారిటీ మతస్తులను మమతా బెనర్జీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం చొరబాటుదార్లను వెళ్లగొట్టడమేనన్నారు. -
‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు(2026) దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అటు బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు అత్యంత రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు దాదాపు ఒకే వర్గం ఓటర్లను టార్గెట్ చేశాయి. అవే మహిళలు, యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అయితే ఈ ఓట్లను రాబట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పాత ఫార్ములాను నమ్ముకోగా, ఆమె కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ సరికొత్త వాగ్దానాలతో రంగంలోకి దిగింది.ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు..2011 నుండి బెంగాల్లో టీఎంసీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న మహిళలు, మైనారిటీలు, ఎస్సీ-ఎస్టీ సామాజిక వర్గాల కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మమతా బెనర్జీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ఆదరణ పొందిన ‘లక్ష్మీర్ భండార్’ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.1,500కి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ, పార్టీని ఆదుకుంటున్న మహిళా ఓటర్లను కట్టిపడేసేందుకే టీఎంసీ ఈ ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలో 30 శాతంగా ఉంటూ, సుమారు 110 సీట్లలో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ, అలియా యూనివర్సిటీ అభివృద్ధి వంటి హామీలను టీఎంసీ ఇచ్చింది. ‘మతం పేరిట రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రం ఇక్కడి తల్లులు, కుమార్తెలు, మైనారిటీలు, పేదల పక్షాన నిలబడుతుంది’ అని టీఎంసీ నేత జయప్రకాశ్ మజుందార్ స్పష్టం చేశారు.మహిళల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసేందుకు..ఇదే సమయంలో టీఎంసీకి అత్యంత బలంగా ఉన్న మహిళా ఓటు బ్యాంకుకే గండికొట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి సంచలన హామీలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా ‘దుర్గా సురక్షా స్క్వాడ్’ల ఏర్పాటు వంటివి బీజేపీ సంకల్ప్ పత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, సందేశ్‌ఖాలీ ఉదంతాలతో మహిళల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు, వారికి భద్రతపై భరోసా కల్పించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.‘చేపలు, గుడ్లు తినకుండా ఎవరూ ఆపలేరు’ మహిళా సాధికారతతో పాటు, హిందుత్వ అజెండాను కూడా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అమలు చేస్తామని, చొరబాటుదారులను ఏరివేస్తామని, ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది. ‘ఈ ఎన్నికలు బుజ్జగింపులకు-న్యాయానికి, చొరబాట్లకు-భద్రతకు, అవినీతికి-అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం’ అని బీజేపీ నేత దేబ్జిత్ సర్కార్ అభివర్ణించారు. 2021లో బీజేపీ అత్యధికంగా లాభపడిన ఎస్సీ-ఎస్టీ బెల్టుల్లో టీఎంసీ ఈసారి స్కాలర్షిప్లు, హాస్టళ్ల ఏర్పాటుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి దీటుగా బీజేపీ.. రాజ్‌బన్షీ, కుర్మి భాషలకు గుర్తింపుతో పాటు, ఉత్తర బెంగాల్‌కు ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం వంటి భారీ ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు తమపై ఉన్న ‘ఉత్తరాది పార్టీ’ అనే ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ ఈసారి ‘బెంగాలీ హిందుత్వ’ నినాదాన్ని ఎత్తుకుంది. వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్లు, చైతన్య మహాప్రభు సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెబుతూనే.. చేపలు, గుడ్లు తినకుండా బెంగాలీలను ఎవరూ ఆపలేరని భరోసా ఇవ్వడం గమనార్హం.ఉనికిని కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్..ఇక ఈ ద్విముఖ పోరులో ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు గుర్తింపు రాజకీయాలను పక్కనబెట్టి ఉపాధి చుట్టూ తమ ప్రచారాన్ని అల్లుకున్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని లెఫ్ట్ ఫ్రంట్ హామీ ఇస్తే, అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తామని, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు విశ్వనాథ్ చక్రవర్తి మాటల్లో.. ‘టీఎంసీ తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చూస్తుంటే, బీజేపీ దానిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాము ఇంకా రేసులో ఉన్నామని గుర్తుచేయడానికే లెఫ్ట్, కాంగ్రెస్ పోరాడుతున్నాయి’. కాగా పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వేస్తున్న ప్రతి ఎత్తుగడ, ఇస్తున్న ప్రతి హామీ బెంగాల్ ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది. ఏ మేనిఫెస్టో ఎవరి ఓటు బ్యాంకును కొల్లగొడుతుందో ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే!ఇది కూడా చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం -
సానుభూతి కోసం బాధిత కార్డు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమి త్ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమత బాధితురా లినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరో పించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా శనివారం బంకురా, పురూలియా జిల్లాల్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. బీజేపీకి అధికారమిస్తే టీఎంసీ సిండికేట్ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ‘సీఎం మమత బాధితురాలినంటూ చెప్పుకుంటున్నారు. కాలికో తలకో బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తుంటారు. ఈసారి అలా జరగదు. కాలికి, చేతికి, తలకు బ్యాండేజీతో కనిపించినా బెంగాల్ ప్రజలు ఆమెకు ఓటేయరు’అని ఆయన స్పష్టం చేశారు. -
మెగా శనివారం.. ఒకేరోజు బరిలో మోదీ, మమత, షా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఏప్రిల్ 11.. శనివారం.. ‘మెగా శనివారం’గా మారింది. నేడు బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక మహా ఘట్టంగా నిలిచిపోనుంది. ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ సత్తా చాటేందుకు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ నలుగురు అగ్ర నేతల రాకతో బెంగాల్ ఎన్నికల వాతావరణం దద్దరిల్లుతోంది. తూర్పు బర్ధమాన్ జిల్లాలోని కల్నా సమీపంలోని సిమ్లాన్ వద్ద ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం కల్నా-బర్ధమాన్ స్టేట్ హైవే పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో భారీ వేదికను సిద్ధం చేశారు. భద్రత కోసం వేదిక పరిసరాలను సీసీటీవీ నిఘాలోకి తీసుకురావడంతో పాటు, హెలికాప్టర్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. ఈ సభకు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారని, ప్రతిపక్ష శిబిరాల నుంచి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భౌమిక్ తెలిపారు.మరోవైపు బంకురా జిల్లా ఈరోజు ఒకేసారి రెండు ప్రధాన పార్టీల బలప్రదర్శనకు వేదిక కానుంది. బర్జోరా కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం మమతా బెనర్జీ భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని టీఎంసీ నాయకులు తెలిపారు. ఇదే జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒండాలోని రామ్‌సాగర్, ఛత్నాలోని ఝాటిపహాడీ వద్ద రెండు వేర్వేరు సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో పాటు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కూడా గంగాజల్ఘటిలో బీజేపీ అభ్యర్థి బిల్లేశ్వర్ సిన్హా తరఫున ప్రచారం చేయనున్నారు.బీర్భూమ్ జిల్లాలోనూ రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరింది. టీఎంసీ యువ నేత అభిషేక్ బెనర్జీ సైంథియాలోని జాలీబగాన్ సమీపంలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఈ సభ కోసం భారీ వేదికతో పాటు ప్రత్యేక హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. కేవలం సైంథియా నియోజకవర్గం నుంచే 50 నుంచి 60 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక టీఎంసీ అధ్యక్షుడు దేబాశిష్ సాహా తెలిపారు. లాబ్పూర్, మయూరేశ్వర్, నానూర్ అభ్యర్థులతో పాటు సీనియర్ నేత అనుబ్రత మండల్ కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ అగ్ర నేతల ప్రచార పర్వం ఓటర్లను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. పొరుగుదేశాల నుంచి చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. వారి కోసం సంక్షేమ పథకాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం విడుదల చేశారు. సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)కు ఇదొక రోడ్ మ్యాప్ అని ఆయన అభివరి్ణంచారు. అవినీతి, రాజకీయ హింస, చొరబాట్లు, నిరుద్యోగ సమస్యకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రెఫరెండమ్ అని తేల్చిచెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన ఆక్రమణదారులను, చొరబాటుదార్లను అక్కడి నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. ఆయా భూములకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. ప్రజా రవాణా సంస్థ వాహనాల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అధికార పార్టీ అవినీతి వ్యవహారాలు, ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి ఐదేళ్లపాటు వయసు సడలింపు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలను పారదర్శకంగా, నైపుణ్యాల ఆధారంగా భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఉద్యోగుల కోసం ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేస్తామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. చేపలు, గుడ్లపై నిషేధం ఉండదు: అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ బిడ్డనే పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే చేపలు, గుడ్లపై నిషేధం విధిస్తారంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నిషేధం ఉండదని స్పష్టంచేశారు.బీజేపీ సంకల్ప పత్రలో కీలకాంశాలు.. → బెంగాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం చట్టం. → అక్రమ వలసలపై కఠిన చర్యలు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట. → ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించేలా చట్టం. → మహిళలకు ప్రతినెలా రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. వారి సాధికారతకు చేయూత. → పోలీసు శాఖలో ప్రత్యేకంగా మహిళా బెటాలియన్ ‘దుర్గా సురక్ష స్క్వాడ్’ఏర్పాటు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. → కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించేదాకా నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. → ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం కేంద్ర రేట్లకు అనుగుణంగా మార్పు. ఏడో వేతన కమిషన్ సిఫార్సుల అమలు. → 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, దిగజారిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. → కట్ మనీ(చట్టవిరుద్ధమైన కమిషన్లు/లంచాలు) సంస్కృతికి చరమగీతం. సిండికేట్ వ్యవస్థ అంతం. → ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లోనూ అమలు. ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఏర్పాటు. → వరి, బంగాళదుంప, మామిడి పండించే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు. పంటలకు గిట్టుబాటు ధరలు. → రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోకి కుర్మాలీ, రాజ్‌బన్షీ భాషలు. → అత్యున్నత పారిశ్రామిక హబ్‌గా బెంగాల్ అభివృద్ధి. అతిపెద్ద చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు. → పాత తేయాకు తోటల పునరుద్ధరణ. డార్జీలింగ్ తేయాకుకు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు లభించేలా చర్యలు. జనపనార పరిశ్రమ ఆధునీకరణ. → రాష్ట్రంలో వందేమాతరం మ్యూజియం నిర్మాణం. -
365 రోజులున్నా ఫలితం శూన్యం
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ‘అమిత్ షా అన్నా, బీజేపీ అన్నా బెంగాల్ ప్రజలకు గిట్టదు. అందుకే అమిత్ షా ఇక్కడ 15 రోజులు కాదు..ఏకంగా 365 రోజులపాటు మకాం వేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు’అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం మాల్దా జిల్లా గజోల్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మాల్దాలో సర్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లిన న్యాయాధికారులను 8 గంటలపాటు నిర్బంధంలో ఉంచిన ఘటనపై మమత స్పందిస్తూ.. బీజేపీ హైదరాబాద్ కోకిల ఈ కుట్రకు పథకం వేసిందంటూ పరోక్షంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ నుంచి వేరుపడి ఆమ్ జనతా ఉన్నయన్ పేరుతో పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్‌కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం చీఫ్ ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎంఐఎం, ఐఎస్ఎఫ్ కార్యకర్తలకు మాల్దా ఘటనలో ప్రమేయం ఉందన్నారు. ఇందులో కాంగ్రెస్ హస్తం కూడా ఉందని చెప్పారు. ‘మాల్దా ఘటన బెంగాల్ పరువును మంటగలిపింది. ఈ ఘటనకు కారణం స్థానికులు కారు. వాళ్లకు ఇబ్బందులు ఉండే ఉండొచ్చు. బయటి వ్యక్తులే వారిని ఈ ఉచ్చులోకి లాగారు. హైదరాబాద్ నుంచి తమ మతానికి చెందిన కొందరిని వెంటేసుకు వచ్చిన ఒక బీజేపీ కోయిల దీని వెనుక ఉంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎయిర్‌పోర్టులో మా సీఐడీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది’అని మమత తెలిపారు. ‘బెంగాల్ అంటే ఢిల్లీ మాదిరిగా కాదు. వివిధ ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ, ఓటర్లకు డబ్బు ఎరవేసి ఏదైనా చేయొచ్చని అనుకుంటే కుదరదు’అని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమి ఖాయమని తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ తన నియంత్రణలోనే ఉందని, ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళ్లలేదని చెప్పారు. -
గిరిజనుల అభివృద్ధికి రోడ్ మ్యాప్
గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గోల్పారా, కామ్రూప్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి ప్రసంగించారు. ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతిగా అన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయిందని విమర్శించారు. ద్రౌపదీ ముర్మును దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. పలాశ్‌బరిలో ఐఐఎం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.‘మీరు ఎంతగా అడ్డుకున్నా, ఐఐఎం ఏర్పాటును ఏమాత్రం ఆపలేరు’ అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మినీ అస్సాంగా పేరున్న గోల్పారా జిల్లాలోని పలు గిరిజన తెగల అభివృద్ధికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా నొక్కి చెప్పారు. అదే సమయంలో, గిరిజనులు మెజారిటీగా ఉన్న జిల్లాలు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు పరిధిలోకి రావని వివరించారు. ప్రతి గిరిజన కుటుంబానికీ ఒక ఆవు, ఒక గేదెను పంపిణీ చేస్తామని సహకార శాఖ మంత్రిగా ఇది తన హామీ అంటూ ఆయన ప్రకటించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ధుబ్రి జిల్లా గోలక్గంజ్లో ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీ రద్దయింది. -
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్పునకు సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరిదారి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్‌లో గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, భవానీపూర్‌లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్‌కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘బెంగాల్లో మార్పు సంభవిస్తుంది. అయితే, ముందుగా భవానీపూర్‌లో మార్పు రావాలా? వద్దా? అంటూ ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపూర్ ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. నందిగ్రామ్ నుంచే కాదు భవానీపూర్‌లో కూడా పోటీ చేసి మమతను ఓడించాలని సువేందును ఒప్పించానన్నారు. 2021లో మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సువేందు చేతిలో మమత ఓడారన్నారు. ఈసారి మాత్రం, రాష్ట్రంలో అధికారంతోపాటు భవానీపూర్‌లోనూ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అమిత్ షా ప్రకటించారు. ‘మోదీ జీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చొరబాటుదార్లను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి వెళ్లగొట్టాలి’అని మంత్రి పేర్కొన్నారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందన్నారు. కాళీఘాట్ వద్ద హైటెన్షన్. బీజేపీ ర్యాలీలో జై శ్రీరాం, బీజేపీ జిందాబాద్, మమతా హటావో, బంగ్లా బచావో నినాదాలు భవానీపూర్‌లో మారుమోగుతున్న వేళ ర్యాలీ సీఎం మమతా బెనర్జీ నివాసమున్న కాళీఘాట్ సమీపానికి చేరుకుంది. అక్కడ టీఎంసీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని జోయ్ బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల నడుమ కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
2014 నుంచి వాళ్లంతా మార్పును చూశారు: అమిత్ షా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “టీఎంసీని బంగాళాఖాతంలోకి విసిరేయండి. పశ్చిమ బెంగాల్ ప్రజలు భయపడకుండా ఓటు వేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను గద్దె దించండి. ఈసారి ఎవరూ భయపడకూడదు. బెంగాల్ ఓటర్లను ఎవరూ అడ్డుకోలేరు. భవానీపురంలో సువేందు అధికారికి మద్దతు ఇవ్వండి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. అధికార టీఎంసీ పార్టీపై అవినీతి ఆరోపణల మచ్చ ఉంది. పశ్చిమ బెంగాల్లో మార్పు వస్తుంది. కానీ భవానీపూర్‌లో మార్పు కావాలా.. లేదా? మా అభ్యర్థి సువేందు అధికారికి మీ ఓట్లు వేయాలని కోరడానికి ఇక్కడికి వచ్చాను. 2014 నుంచి మోదీ జీపై నమ్మకం ఉంచిన వారు మార్పు చూశారు. గతంలో మమత ఒక ఎన్నికలో ఓడిపోయారు, ఈ సారి బెంగాల్ అంతటా ఓడిపోతారు. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం మారాలనే స్వరం వినిపిస్తోంది. మమతకు బైబై చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి 15 రోజులు రాష్ట్రంలో ఉంటాను’’ అని చెప్పారు.భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. 294 సభ్యులు ఉండే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఓటింగ్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో (రెండు దశల్లో) జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. 2021లో ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించింది. బీజేపీ 77 స్థానాలు దక్కించుకుంది. -
కరడుగట్టిన నక్సలిజం ఖతం: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలపాటు దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు చేపట్టిన చరిత్రాత్మక ’ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ విజయవంతం కావడంతో తెలంగాణ పూర్తిస్థాయిలో నక్సల్స్‌రహిత రాష్ట్రంగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సభలో సెల్యూట్ చేశారు. అదే సమయంలో వామపక్ష తీవ్రవాదానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఏ విధంగా అండగా నిలిచిందో వివరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్.. భీకర పోరు ‘తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో 50 కి.మీ. పొడవు, 37 కి.మీ. వెడల్పు ఉన్న ఒక కొండపై మావోయిస్టులు ఏళ్ల తరబడి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్క డ సోలార్ విద్యుత్, ఐఈడీ (బాంబుల) తయారీ ఫ్యాక్టరీలు, ఐదేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకున్నారు. 400 నుంచి 500 మంది కేడర్ అక్కడ ఉన్నారు. ఆ స్థావరాన్ని ఛేదించేందుకు కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా 21 రోజులపాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టారు. 45 డిగ్రీల భగభగమండే ఎండలో మన జవాన్లు రోజుకు కేవలం 300 మిల్లీలీటర్ల నీటిని తాగుతూ ధైర్యంగా పోరాడారు. ఈ ఆపరేషన్‌లో 30 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. మిగిలిన వారు లొంగిపోయారు లేదా పారిపోతూ పోలీసులకు చిక్కారు. దీంతో బస్తర్, మహారాష్ట్ర, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో నక్సల్స్ పైకి (ఉత్తరం వైపు) రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా వారు నిరాకరించారు. కిందికి వస్తే మాత్రం ఆపుతామని చెప్పారు‘ అని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయారు 2024 ప్రారంభంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో 21 మంది సభ్యులు ఉండగా.. ఇప్పుడు వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని అమిత్‌షా తెలిపారు. ‘ఒకరు పట్టుబడ్డారు, ఏడుగురు లొంగిపోయారు, 12 మంది హతమయ్యారు, ఒకరు మాత్రమే పరారీలో ఉండి చర్చలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని 37 మందికిగాను ఎవరూ మిగల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర కమిటీలో ఉన్న వారిలో ఆరుగురు లొంగిపోయారు, ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క నక్సలైట్ కూడా లేడు‘ అని చెప్పారు. బసవరాజు, హిడ్మా, వివేక్, పల్లూరి ప్రసాదరావు (చందన), వాసుదేవ్ వంటి అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం లేదా లొంగిపోయారని తెలిపారు. కాంగ్రెస్ దన్నుతోనే నక్సలిజం ‘1970లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ’అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చి, నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతు తీసుకున్నారు. ఆ మద్దతును ఆసరాగా చేసుకుని మావోయిస్టులు దేశంలోని 17 శాతం భూభాగానికి, 10 శాతం జనాభాకు విస్తరించారు. తిరుపతి నుంచి పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నారు‘ అని అమిత్‌షా చెప్పారు. అలాగే నక్సల్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ ప్రారంభించిన ’సల్వాజుడుం’ ఉద్యమాన్ని 2011 జూలై 5న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం చట్టవిరుద్ధమని ప్రకటించిందని, ఆ తీర్పు వల్లే నిరాయుధులైన ఎంతోమంది సల్వాజుడుం కార్యకర్తలను, ఆదివాసీలను నక్సల్స్ ఊచకోత కోశారని చెప్పారు. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయని, ఇదీ కాంగ్రెస్‌కు నక్సల్స్‌తో ఉన్న లాలూచీ అని దుయ్యబట్టారు. ‘రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో అనేకసార్లు నక్సల్స్ సానుభూతిపరులతో కనిపించారు. ఆయన జరిపిన భారత్ జోడో యాత్రలో నక్సల్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు చెందిన వారు పాల్గొన్నారు. 2010లో ఒడిశాలో లాడో సికాకాతో, 2018లో హైదరాబాద్‌లో గద్దర్‌తో రాహుల్ వేదిక పంచుకున్నారు‘ అని అమిత్‌షా పేర్కొన్నారు. 1970 నుంచి 2026 మార్చి వరకు వామపక్ష తీవ్రవాదానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తూనే ఉందని, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 20 వేల మంది పౌరులు, జవాన్ల మరణాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. -
‘బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే’
ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ లక్ష్యం తమ నాయకుడు రాహుల్ గాంధీని బద్నాం చేయడమేని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంల్లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటరిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్‌గా అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమే ఏకైక అజెండా అమిత్ షా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘పార్లమెంట్లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు. గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు. అలాంటి గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది?, జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ,,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు. గద్దర్‌తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?, బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే. గద్దర్ గురించి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారుఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి. మేము తప్పుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం’ అని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. -
డెడ్‌లైన్ ముగుస్తోంది.. ‘కగార్’పై అమిత్ షా ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు డెడ్‌లైన్ రేపటితో (మార్చి 31) ముగియనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లొంగిపోయారు కీలక మావో నేతలు. హిడ్మా సహా పలువురు అగ్రనేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌పై లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైంది. దేశంలో కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉంది. కాంగ్రెస్ 60 ఏళ్లపాటు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించింది. గత పాలకులు ఆదివాసీలను తప్పుదోవ పట్టించారు.గత కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. మావోయిస్టుల హింసలో అనేకమంది ప్రజలు నష్టపోయారు. తెలంగాణలో అనేక మంది మావో నేతలు లొంగిపోయారు. దేశంలో 12 రాష్ట్రాలు మావోయిస్టుల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. కాంగ్రెస్ వైఖరి వల్లే దేశంలో నక్సలిజం పెరిగింది. ఎన్డీఏ వచ్చాకే ఆదివాసుల హక్కులను పరిరక్షించాం. నక్సలిజం కథ ముగిసింది. ఆయుధాలు వీడకుంటే కఠిన చర్యలు తప్పవు. ఆయుధాలు పట్టుకుంటే బుల్లెట్లతో మేము సమాధానం చెబుతాం. గిరిజనులను నక్సలైట్లు తప్పుదోవ పట్టించారు. వారి చేతికి ఆయుధాలు ఇచ్చి హింసకు పురికొల్పారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు లూటీ చేశారు. జనతా సర్కారు పేరుతో ప్రజలను భ్రమలో ముంచారు. జనతా ఆదాలత్ పేరుతో ఎంతోమందిని చంపారు’ అని అమిత్ షా అన్నారు. కాగా, దేశంలో ఉన్న మావోయిస్టులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి. ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్‌లో భధ్రతా బలగాలు విజయం సాధించారు. -
అవినీతి, హింసకు చిరునామా!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో పశ్చిమబెంగాల్ అన్ని రంగాల్లోనూ తీవ్ర వెనకబాటుకు గురైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం ము స్లిం సంతుష్టీకరణ రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసనే నమ్ముకున్నారు. రాజకీ యంగా ఎదిగేందుకు, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అబద్ధాలు, హింసనే నమ్ముకు న్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లకు బెంగాల్‌ను ప్రధాన ద్వారంగా మార్చారు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ అక్రమాల న్నింటికీ బీజేపీ అడ్డుకట్ట వేసి తీరుతుందన్నారు.మమత సర్కారు తీరుపై పలు అభి యోగాలతో చార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శనివారం కోల్‌కతాలో ఆయన మీడియాతో మాట్లాడారు. మమత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని తూర్పారబట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను జాతీయ భద్రత కోసం జరుగుతున్న పోరాటంగా అభిర్ణించారు. 15 ఏళ్లుగా రాష్ట్రంలో భయోత్పాతంతో కూడిన పాలన సాగింది. ఈ ఎన్నికలు ఆ భయోత్పాతానికి, విశ్వాసానికి నడుమ జరుగుతున్న పోరాటం. మమత సర్కారు అసమర్థ పాలన, అవినీతి, రాజకీయ హింస, సంతుష్టీకరణ రాజకీయాలు, అక్రమ చొరబాట్లతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా ఫెన్సింగ్, ఓటర్ల జాబితా ప్రక్షాళన కూడా ప్రధాన ప్రచారాంశాలుగా ప్రజల్లోకి వెళ్తాం’’ అని ప్రకటించారు.దేశానికే ముప్పుగా చొరబాట్లుబంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ గుండా దేశంలోకి సాగుతున్న చొరబాట్లు జాతీయ భద్రతకే సవాలుగా పరిణమిస్తున్నాయని అమిత్ షా ఆందోళన వెలిబుచ్చారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం చొరబాట్లకు బెంగాల్ ఏకైక మార్గంగా మిగిలిందంటే మమత సంతుష్టీకరణ రాజకీయాలే అందుకు కారణం. వాటివల్ల వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ భద్రతే పెను ప్రమాదంలో పడింది. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక్క బెంగాల్‌కు మాత్రమే గాక దేశమంతటికీ చాలా కీలకంగా మారాయి. ఒకరకంగా దేశ భద్రతే ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది’’ అని చెప్పారు.‘‘కేంద్రం ఎన్నిసార్లు కోరినా బంగ్లాదేశ్ సరిహద్దులను ఫెన్సింగ్‌తో బలోపేతం చేసేందుకు భూమి కేటాయించేందుకు మమత ససేమిరా అన్నారు. చొరబాటు దారులతో తృణమూల్ ఓటుబ్యాంకును బలోపేతం చేసుకోవాలన్న దురాలోచనే ఇందుకు ఏకైక కారణం’’ అని అమిత్ షా ఆరోపించారు. ‘‘బెంగాల్ ప్రజలను ఒక్కటే అడగదలచుకున్నా. చొరబాటుదారులకు ఓటటుహక్కు ఇవ్వాలా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రతి చొరబాటుదారు ఓటునూ తొలగించి తీరతాం. అంతేకాదు, వాళ్లలో ప్రతి ఒక్కరినీ దేశం నుంచే వెళ్లగొడతాం’’ అని స్పష్టం చేశారు.‘‘బెంగాల్లో మమత అరాచక పాలనకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మే 6న రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత 45 రోజుల్లోనే సరిహద్దుల గుండా ఫెన్సింగ్‌కు అవసరమైన భూమిని కేంద్రానికి అప్పగిస్తాం. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి చొరబాట్లకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తాం’’ అని ప్రకటించారు. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా అంగ (బిహార్), వంగ (బెంగాల్), కళింగ (ఒడిశా) ఒకే పార్టీ పాలనలోకి రానున్నాయని జోస్యం చెప్పారు.మైనారిటీ ఓట్ల కోసమే ‘సర్’ డ్రామాఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై మమత వ్యతిరేక తను అమిత్ షా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఈసీపై విమర్శలు చేయడం బెంగాలీ సంస్కృతిలో భాగం కానే కాదు. కేవలం మైనా రిటీల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే మమత ఇలా రాద్ధాంతం చేశారు’’ అని ఆరో పించారు. దేశంలో విపక్షాల పాలనలో ఉన్న మరే రాష్ట్రంలోనూ సర్ ప్రక్రియపై వివాదాలు తలెత్తలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేయడాన్ని అమిత్ షా సమర్థించారు. వారిలో పలువురు అచ్చం తృణమూల్ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. ఆ బదిలీల తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు.బాధితురాలి కార్డు‘విక్టిమ్ కార్డు’ రాజకీయాలను మమత అలవాటుగా మార్చుకున్నారంటూ అమిత్ షా దుయ్యబట్టారు. ‘‘ప్రజల్లో సానుభూతి పొందేందుకు బాధితురాలి కార్డు ప్రయోగించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తనకు చిన్న గాయమైనా దానిపై విపరీతంగా ప్రచారం చేయించుకుంటారు. అవినీతి తదితర సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నికల సంఘంపై ఇష్టానికి విమర్శలు చేస్తారు. వీటిని బెంగాల్ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మమత విక్టిమ్ కార్డు పాచిక ఇకపై పారబోదు’’ అని స్పష్టం చేశారు. -
తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా
-
ముగుస్తున్న సమాంతర చరిత్ర
దేశంలో ‘నక్సలిజం అంతానికి’ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఆపరేషన్ కగార్ గడువు మరికొద్ది రోజులలో మార్చి 31న ముగియనున్నది. మరునాడు ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఎక్కడా నక్స లైట్లు గానీ, నక్సలిజం గానీ జాడలేని పరిస్థితి ఏర్పడుతుందా అన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గానీ, గత 59 సంవత్సరాలుగా మనం చూస్తున్న తరహా ఉద్యమం మాత్రం ముగింపునకు వస్తున్నదనటంలో సందేహం లేదు. ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు చనిపోవడం లేదా నాయకులతో సహా లొంగిపోవటం జరుగుతున్న ప్పుడు, ఉద్యమం ఇప్పటివలె ఇంకా కొనసాగగలదని భావించటం నిర్హేతుకమవుతుంది.అరవై ఏళ్ల పోరాటంభారతదేశం 1947లో స్వతంత్రాన్ని సాధించుకోగా, తర్వాత 20 సంవత్సరాలకే 1967లో నక్సలిజానికి బీజాలు పడ్డాయి. అప్పటి నుంచి దేశ చరిత్రకు సమాంతరంగా నక్సలిజం చరిత్ర దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఒక నియంతృత్వ వ్యవస్థలో రైతాంగం, ఆదివాసీలు, పేదలు ఇంత సుదీర్ఘమైన విప్లవోద్యమాన్ని సాగించి ఉంటే అది వేరు. కానీ, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఇట్లా ఎందుకు జరిగిందన్నది జాగ్రత్తగా, నిర్వికారంగా అర్థం చేసుకోవలసిన విషయం.అనేక శతాబ్దాల పాటు రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలలో, తర్వాత బ్రిటిష్ వలస పాలనలో తీవ్రమైన పీడనకు గురైన ఇండియా వ్యవ సాయిక దేశం. పీడనకు గురైన ప్రజలలో అత్యధికులు రైతులు, కౌలు దార్లు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన వివిధ వృత్తులవారు, ఆదివాసీలు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్య మించిన కాంగ్రెస్ తదితర పార్టీల నాయకత్వాలు ఈ సమస్యను మొదటి నుంచి గుర్తించాయి. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం రైతాంగం కోసమే. అది, బిహార్‌లోని చంపారన్‌లో 1917లో నీలిమందు రైతుల సమస్యలపై. ఆయన తన ప్రథమ శిష్యునిగా ప్రకటించిన వల్లభ్ భాయ్ పటేల్ ఆ మరుసటి సంవ త్సరమే గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో మహత్తరమైన రైతాంగ పోరాటం నడిపారు.ఈ నేపథ్యంలోకి వెళ్లటం ఎందుకంటే, నక్సలైట్లు ఏ పేద రైతాంగం కోసమైతే పశ్చిమ బెంగాల్‌లోని సిలిగుడిలో 1967లో సాయుధ ఉద్యమం ఆరంభించారో, అంతకు సరిగా 50 సంవత్స రాల ముందు, కాంగ్రెస్ నాయకత్వం అదే రైతుల కోసం ఉద్యమించింది. మరొక విధంగా చెప్పాలంటే, దేశ స్వాతంత్య్రానికి 30 సంవత్సరాల క్రితం అన్నమాట. అంతే కాదు– చంపారన్, ఖేడా రైతుల సమస్యల పరిష్కారంతో వారు దేశ రైతాంగాన్ని మరవలేదు. వారి విషయమై ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాలు చేస్తూ పోయారు. బ్రిటిష్ ప్రభుత్వానికి మహజర్లు సమర్పించారు. గవర్న మెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 ప్రకారం ఎన్నికలు జరిగి రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ఏర్పడినపుడు రైతాంగ అనుకూల చర్యలు తీసుకున్నారు.ఎందుకు తలెత్తినట్టు?స్వాతంత్య్రం తర్వాత ఇదే ధోరణి కొనసాగిస్తూ నెహ్రూ ప్రభుత్వం అనేక వ్యవసాయ సంస్కరణలను ప్రవేశ పెట్టింది. భూమిపై యాజమాన్యం సాగుచేసే రైతులకు మాత్రమే ఉండాలని, ఎవరెంత సాగు చేయగలిగితే అంతమాత్రమే లభించాలన్న గాంధీజీ సూచనల స్ఫూర్తితో భూపరిమితి చట్టాలు, జమీందారీ రద్దు, భూపంపిణీలు, కౌల్దారీ చట్టాల వంటివి చేశారు. రైతులకు ఉప యోగపడే సహకార చట్టాలు, పంచాయతీ రాజ్‌లను కూడా అమ లుకు తెచ్చారు. రుణ పరపతి విధానం ప్రవేశ పెట్టారు.విషయం ఏమంటే, 1947 కన్న ముందటి వ్యవసాయ రంగ పరిస్థితులను అంతగా అర్థం చేసుకుని, ఆ తర్వాత ఇన్నిన్ని చర్యలు తీసుకున్నప్పుడు, 20 సంవత్సరాలు గడిచేసరికి పేద రైతాంగం, రైతు కూలీల కేంద్రంగా నక్సలైట్ ఉద్యమం అసలు తలెత్తి ఉండ కూడదు. అదంతా ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు కనిపించే ఏకైక సమాధానం, పైన పేర్కొన్న వేర్వేరు ప్రభుత్వ చర్యలలో కొన్ని అరకొరగా అమలుకాగా, కొన్ని అసలు కాకపోవటం. నిజమైన ఆధిపత్యం చాలావరకు పెద్దవారి చేతులలోనే మిగిలి పోవటం. రాచ కుటుంబాల వారు, జమీందారీ తరగతులు, ఇతర ప్రాబల్య వర్గాలు కాంగ్రెస్‌లో చేరి, అధికారుల సహాయంతో రకరకాల యుక్తుల ద్వారా భూసంస్కరణలతో పాటు నెహ్రూ ప్రభుత్వపు అనేక సంస్క రణలను వీలైనంత బలహీనపరచారు. 1964లో ఆయన మరణం తర్వాత ఇక వారికి ఏ అడ్డూ అదుపూ లేకపోయింది. మరొక మూడేళ్లు గడిచేసరికి నక్సల్బరీకి అంకురార్పణ జరిగింది.‘అభివృద్ధి’కి ఇక అడ్డేమిటి?1917 నుంచి ఆరంభించి 1950ల వరకు కాంగ్రెస్ పార్టీ రైతాంగం పట్ల, ఆదివాసీల పట్ల చూపిన శ్రద్ధ మేరకు కార్యాచరణ జరిగి ఉంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రకు సమాంతరంగా నక్సలైట్ ఉద్యమ చరిత్ర అంటూ ఒకటి ఉండేదే కాదు. దానిని ‘అంతం’ చేయవలసిన అవసరమంటూ ఇపుడు ఏర్పడేది కాదు. మొదట అనుకున్నట్లు మొత్తానికి ఉద్యమమైతే ఇక ముగిసి పోతు న్నది. అందుకు ఒక ముఖ్య కారణం ప్రభుత్వాల అణచివేత. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సమన్వయంతో గతంలో లేనంత తీవ్ర మైన చర్యలు తీసుకుంటుండవచ్చు. కానీ, గత ప్రభుత్వాల చర్యలు తక్కువేమీ కాదు. రెండవ ముఖ్య కారణం ఉద్యమంలోని అనేక లోపాలు. సైద్ధాంతిక అవగాహనలో, దాని అన్వయంలో, వ్యూహ రచనలో, వ్యవస్థల నిర్మాణంలో, ఆచరణలో... ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అనేక లోపాలు కొనసాగినపుడు ఎంతటి ఉద్యమ మైనా క్రమంగా విఫలం కాక తప్పదు.విచారకరం ఏమంటే, కాంగ్రెస్‌కు 1917 నుంచి గణనీయమైన స్పృహ ఉండి, 1947 నుంచి ఎన్నో చర్యలు తీసుకుని, 1967 నుంచి తీవ్ర స్థాయిలో నక్సలైట్ ఉద్యమం జరిగిన తర్వాత కూడా, దేశం 2027 ముంగిట ఉండగా, రైతులూ, ఆదివాసీల స్థితిగతులు అసలు మెరుగుపడలేదనలేము. కానీ, మెరుగుపడవలసింది ఇంకా చాలా ఉందన్నది వాస్తవం. వారిలో గల అసంతృప్తి కూడా తక్కువ కాదు. అందువల్ల, నక్సలిజమైతే ‘అంతమవుతున్నది’ గానీ, అందుకు కార ణమైన సమస్యలను కూడా అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఏమి చర్యలు తీసుకోగలవో వేచి చూడవలసి ఉంది. నక్స లైట్లను ఇంతకాలం అభివృద్ధికి అడ్డుపడుతున్న శక్తులుగా నిందించిన మీదట, ఇక అటువంటి అడ్డులనేది లేకుండా ఈ నెల 31తో తొలగి పోతున్నందున, రైతులు, కౌలుదార్లు, కూలీలు, వృత్తి పనులవారు, ఆదివాసీలు, నిరుద్యోగులు తదితర వర్గాల సమస్యలను శీఘ్రగతిన తొలగించి అభివృద్ధి పరచేందుకు ఇపుడు మార్గం పూర్తిగా సుగమ మవుతున్నది. ఆ పని చేయనున్నారా?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ కృతజ్ఞతలు
తాడేపల్లి: రూరల్ డెవలప్ ట్రస్ట్(ఆర్డీటీ)కి ఎఫ్సీఆర్ఏ((ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పర్మిషన్లు రెన్యువల్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య ,వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. నిజంగా చంద్రబాబు కృషి ఉంటే పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టిందని వైఎస్ జగన్ ప్రశ్నించారు.చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు వైఎస్ జగన్. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కి FCRA పర్మిషన్లు రెన్యువల్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల… pic.twitter.com/FFrb8rpPfO— YS Jagan Mohan Reddy (@ysjagan) March 24, 2026 ఇదీ చదవండి:ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం -
మావోలకు ‘డెడ్’లైన్.. మరో పది రోజులే!
సాక్షి, హైదరాబాద్: ‘మార్చి 31 నాటికి భారత దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం’గత రెండేళ్లుగా పలు వేదికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటన ఇది. తాజాగా ఈ నెల 6న ఒడిశాలోని కటక్ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవంలోనూ ‘తిరుపతి నుంచి నేపాల్‌లోని పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ నిర్మించాలని కలలు కనే శక్తులను మన భద్రత దళాలు కచ్చితంగా ఓడిస్తాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో నక్సలిజం అంతం కావడమే లక్ష్యం’అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్చి 31 లోపు అజ్ఞాతం వీడి లొంగిపోని మావోయిస్టుల పట్ల కఠిన వైఖరే అని కూడా అమిత్ షా సుస్పష్టంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం..ఈనెల 31న మావోయిస్టులకు ‘డెడ్’లైన్ పూర్తవుతుంది, మరో పదిరోజులే గడువు ఉంది, అయితే ప్రభుత్వాలు చెబుతున్నట్టు మార్చి 31 తర్వాత మావోయిస్టులు లేని భారత్ సాధ్యమేనా..? మరోవైపు పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు చెబుతున్నట్లుగా డెడ్లైన్లు పెట్టి సిద్ధాంతాలు అంతం చేయలేరన్న వాదనలు గెలుస్తాయా..? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఇంకా మావోయిస్టులలో వందలాది మంది సాయుధులు ఉన్నారని, మావోయిస్టులను అంతం చేయడం ప్రభుత్వాలు అనుకున్నంత సులువేంకాదని ఇటీవల జనజీవనస్రవంతిలోకి వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఆ ఏడుగురు తిరిగొచ్చేనా...?మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2023లో 125 మంది ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య ఏడుకు పరిమితమైందని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యులు దేవ్‌జీ అలియాస్ టిపిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, చంద్రన్న సహా ఎంతో మంది కీలక నేతలు నెలల వ్యవధిలోనే లొంగుబాట పట్టారు. అయితే తాము అరెస్టు అయ్యామని చెబుతున్నా..పోలీసులు సరెండర్ చూపినా..ఫలితం మాత్రం ఆయుధాన్ని వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారు. 2024 నుంచి తెలంగాణ పోలీసుల ఎదుట 721 మంది లొంగిపోవడంతోపాటు 266 ఆయుధాలను అప్పగించారు. తెలంగాణకు చెందిన ఏడుగురు మావోయిస్టులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, గణపతి భార్య జోడే రత్నాబాయి, హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ , సికింద్రాబాద్‌కు చెందిన వార్త శేఖర్ , హైదరాబాద్‌కు చెందిన నక్క సుశీల అలియాస్ రేల, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భద్రాది జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్ ఉన్నారు. గణపతి లొంగుబాటుపై ఇప్పటికే తీవ్ర చర్చ.. దేశాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాలన్నా...అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించాలన్నా..అధికారిక రికార్డుల్లో ఉన్న మావోయిస్టులంతా అయితే లొంగిపోయారని, లేదంటే చనిపోయారని గుర్తించాల్సిందే. మావోయిస్టు అగ్రనేత, సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన నేత, తెలంగాణలో జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలీసులతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్, ఇతర దర్యాప్తు విభాగాలు సైతం గణపతి జాడ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల లొంగిపోయిన దేవ్‌జీ, రాజిరెడ్డి సహా కేంద్ర కమిటీ సభ్యుల స్థాయిలో పని చేసిన వారు కూడా తమకు గణపతి జాడ తెలియదని చెబుతున్న నేపథ్యంలో గణపతి లొంగుబాటు సాధ్యమా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 31 తర్వాత పరిస్థితి ఏంటి? సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన దాడులను ఎదుర్కోలేక మావోయిస్టు అగ్ర నాయకత్వం సైతం అడవులు వీడి లొంగుబాట పడుతున్నా..ఇంకా వందల మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.అజ్ఞాతం వీడేందుకు కొందరు అంగీకరించడం లేదు. అయితే మార్చి 31 తర్వాత మిగిలే మావోయిస్టులపట్ల కేంద్రం వైఖరి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. లొంగకపోతే మార్చి 31 తర్వాత మావోయిస్టుల ఏరివేత తప్పద న్న సంకేతాలే పంపుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం మరోసారి గడువు పెంచుతారా..లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.నిషేధం ఎత్తివేత షరతు ఫలించేనా?తాము అజ్ఞాతం వీడి జనంలో జనం మధ్య, ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన ఎంతో మంది కేంద్ర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే, మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే..అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశంలోనూ మావోయిస్టు మాజీ కీలక నేతలు ప్రతిపాదించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో స్వయంగా కలిసి చెప్పారు. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. -
పార్లమెంట్ మెట్లపై మీరు టీ తాగి, పకోడీ తిని..: అమిత్ షా
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అసోం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్రంలోని గువాహటిలో పర్యటించిన అమిత్ షా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. భారత్‌కు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు అపకీర్తి తెచ్చిపెట్టేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ మెట్లపై కూర్చుని “టీ, పకోడీలు” తింటారని పేర్కొన్నారు.“ఒక్కోసారి ఆయన పార్లమెంట్ ద్వారం వద్ద కూర్చొని టీ తాగుతారు, పకోడీలు తింటారు. అల్పాహారం తినే చోటు ఏది? ఈ విషయం ఆయనకు తెలియదా? భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ. అక్కడ కూర్చొని నిరసనకు దిగడం కూడా ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కానీ, మీరు అక్కడ నిరసనకు దిగడమే కాకుండా మరో రెండు అడుగులు వేసి టీ తాగుతూ, పకోడీలు కూడా తింటున్నారు. దీనివల్ల ప్రపంచం ముందు భారత్ అపకీర్తి పాలవుతుంది” అని అమిత్ షా అన్నారు.ఏఐ సదస్సులో ఇలాగేనా చేసేది? మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారని అన్నారు. పార్లమెంట్ చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం లేదని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన కృత్రిమ మేధస్సు సదస్సు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి 80 దేశాల కంపెనీల ప్రధాన కార్యనిర్వాహక అధికారి స్థాయి అధికారులు హాజరయ్యారని తెలిపారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ సదస్సును ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కృత్రిమ మేధస్సు సదస్సని పేర్కొన్నారని అమిత్ షా అన్నారు. ఆ కార్యక్రమంలో అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు నిర్వహించి భారతదేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సదస్సు సమయంలో అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వారికి రాహుల్ గాంధీ మద్దతు పలికారని కూడా విమర్శించారు.ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారత శక్తిని, యువత సామర్థ్యాన్ని చూడటానికి వచ్చే ఇటువంటి సదస్సుల్లో నిరసన ప్రదర్శలు చేస్తే.. ఇటువంటి వాటిల్లో మనకు అవకాలు తగ్గుతాయని చెప్పారు. భారత ప్రజలు అలాంటి చర్యలను క్షమించరని అన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఈశాన్య ప్రాంతం, అసోంలో ఆరోగ్య వ్యవస్థ చాలా దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కన్నా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. -
ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్‌ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్‌తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు. అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజుఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు. -
మావోయిస్టులపై అమిత్‌షా కీలక ప్రకటన
మావోయిస్టులపై కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లపై పెద్దఎత్తున కేంద్ర బలగాలు విరుచుకపడుతున్న సంగతి తెలిసిందే. శరణమా.. రణమా అంటూ వారిపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 31 (మార్చి) వరకూ భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా లేకుండా చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన చాలా మంది అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతమంది కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. దీంతో దేశంలో ఆ పార్టీ దాదాపు కనుమరుగైనట్లేనని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి అమిత్‌షా ఈ అంశంపై స్పందించారు.ఒడిశాలోని CISF కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ" మార్చి 31 వరకూ దేశంలో ఎట్టిపరిస్థితుల్లో మావోయిజాన్ని అంతం చేస్తాం" అని అన్నారు. అయితే గతంలోనే ఇవే వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా తాజాగా దానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. అయితే ఇప్పటికే నక్సల్స్‌పై కేంద్ర బలగాలు దాడులు తీవ్రతరం చేశాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కాల్పులు జరుపుతున్నాయి. -
తొలిసారిగా డిజిటల్ జనగణన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మక జనాభా లెక్కల (సెన్సస్–2027) సేకరణకు కేంద్రం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్యుమరేషన్ ప్రక్రియను తొలిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించనుంది. ఇందుకోసం రూపొందించిన నాలుగు అత్యాధునిక డిజిటల్ యాప్‌లు, పోర్టల్స్‌తో పాటు ‘ప్రగతి’, ‘వికాస్’అనే మస్కట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు. టెక్నాలజీతో సులభంగా ఇంటింటి సర్వే సుమారు 30 లక్షల మంది సిబ్బందితో ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టనుంది. కాగితాలతో పనిలేకుండా, సీ–డాక్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ల ద్వారా ఆఫ్లైన్లోనూ సిబ్బంది డేటాను సేకరిస్తారు. ఈసారి ప్రజలకు ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’(స్వీయ నమోదు) సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎన్యుమరేటర్ ఇంటికి రాకముందే, ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా 16 ప్రాంతీయ భాషల్లో కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయగానే వచ్చే ప్రత్యేక ఐడీని సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది. ఆకర్షణీయంగా ‘ప్రగతి’, ‘వికాస్’: జనగణన ప్రక్రియలో స్త్రీ, పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా మహిళా ఎన్యుమరేటర్‌ను ’ప్రగతి’గా, పురుష ఎన్యుమరేటర్‌ను ’వికాస్’గా నామకరణం చేస్తూ మస్కట్లను విడుదల చేశారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని ప్రభుత్వం తెలిపింది. నాలుగు కీలక సాధనాలు ఇవే.. : హౌస్‌లిస్టింగ్ వెబ్ యాప్: శాటిలైట్ మ్యాప్‌ల ద్వారా భౌగోళికంగా డిజిటల్ బ్లాక్‌ల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుంది. హెచ్ఎల్ఓ యాప్: ఎన్యుమరేటర్లు నేరుగా డేటాను సర్వర్‌కు పంపేందుకు ఈ ఆఫ్‌లైన్ మొబైల్ యాప్ ఉపకరిస్తుంది. స్వీయ నమోదు పోర్టల్ (ఎస్ఈ పోర్టల్ ): ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే వెబ్సైట్. సెన్సస్ మేనేజ్మెంట్ సిస్టమ్: అధికారులంతా ఎప్పటికప్పుడు సర్వే పురోగతిని పర్యవేక్షించే రియల్–టైం డ్యాష్‌బోర్డ్. రెండు దశల్లో సెన్సస్.. కులగణన కూడా : జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. ఇళ్ల వివరాలు సేకరించే మొదటి దశ (హౌస్ లిస్టింగ్) 2026 ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30 మధ్య రాష్ట్రాల వెసులుబాటును బట్టి 30 రోజుల పాటు జరుగుతుంది. వ్యక్తుల వివరాలు సేకరించే రెండో దశ (జనాభా లెక్కింపు) 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. విశేషమేమిటంటే, ఈ రెండో దశలోనే కులగణన వివరాలు కూడా సేకరిస్తారు. ఈ జనాభా లెక్కలకు 2027 మార్చి 1వ తేదీని ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. మంచు ప్రభావం ఉండే ప్రాంతాల్లో (లద్దాఖ్, జమ్మూకశీ్మర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) మాత్రం 2026 సెపె్టంబర్‌కల్లా ఈ సర్వేను పూర్తి చేస్తారు. -
గణపతి లొంగుబాటు?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోవడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన తిప్పిరి తిరుపతి, రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న తదితరులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైన సందర్భంలోనే.. గణపతి గురించిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కాగా త్వరలో జరగబోయే మావోయిస్టు రహిత భారత్ సదస్సుతో పాటు మావోయిస్టు నేతల లొంగుబాట్లపై చర్చించడానికి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి బుధవారం ఢిల్లీలో అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణపతి లొంగుబాటు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం సాయంత్రం నుంచే దేశ రాజధానిలో గణపతి లొంగుబాటు అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి.. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల నేపథ్యంలో గణపతి తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన త్వరలోనే లొంగిపోవడానికి మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ తరువాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిన గణపతి దేశం విడిచి నేపాల్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ పోలీసులతో టచ్‌లోకి వచ్చారని.. ఉన్నతాధికారులు ఆయనకు సేఫ్ ప్యాసేజ్ కల్పించి నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చేలా చూశారని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది. అనారోగ్యంతోనే బాధ్యతల నుంచి పక్కకు.. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న గణపతి అనారోగ్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. అయినా జనజీవన స్రవంతిలోకి రాకుండా ఉద్యమంలో కొనసాగారు. మూడు నాలుగు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్‌ను ఆ తర్వాత మావోయిస్టు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సాయుధ పంథావైపు నడిపించడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పోలీసులకు పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఏది ఏమైనా గణపతి లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం ముగింపునకు వచ్చినట్టేనని అంటున్నారు. సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా.. గణపతి 1949లో జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్లో జని్మంచారు. ఆయన్ను ఉద్యమంలో టీచర్ అని పిలుస్తారు. 1970లో జరిగిన రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర తర్వాత నక్సల్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా గణపతికి గుర్తింపు లభించింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయన పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతిది కీలక పాత్రగా చెబుతారు. గణపతితో పాటు ఆయన సహచరిణి సుజాత కూడా ఇప్పటివరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. -
అదనంగా ఐపీఎస్‌లను కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని..తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్‌షాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికీ అనేక ఆధునిక సవాళ్లు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని చెప్పారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని, ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఆ సంఖ్యను 105కు పెంచాలని రేవంత్ కోరారు. 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్‌షాతో సీఎం చర్చించారు. అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలోనే 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అగ్రనేతలు సైతం సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని చెబుతూ.. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం తదితర విషయాలను వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్‌కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ బి.సుమతి పాల్గొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం.. బుధవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే.. 45 రోజుల్లో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బంపరాఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోరి మథురాపుర్లో బీజేపీ పరివర్తన్ యాత్రను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును వ్యతిరేకించకపోతే.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి హిందూ శరణార్థి ఇప్పటికే పౌరసత్వాన్ని పొందేవాడు. అయినప్పటికీ హిందూ శరణార్థులెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క హిందూ శరణార్థి కూడా పౌరసత్వాన్ని కోల్పోకుండా చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్రమ చొరబాటుదారులను లేకుండా చేస్తాం. చొరబాటుదారుల పేర్లను ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి మాత్రమే తొలగిస్తున్నాం. దీనిపై మమతా దీదీ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే చొరబాటుదారులను పూర్తిగా ఇక్కడి నుంచి పంపించేస్తాంప్రజల కోసం దీదీ చేసిందేమీ లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను మాత్రం ఆమె బుజ్జగిస్తున్నారు. మేమే రామ మందిరాన్ని, కాశి విశ్వనాథ్, మహాకాల్ కారిడార్‌ను కట్టించాం. మమతా బెనర్జీ ప్రజల్ని విస్మరించి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇదే వారి పద్ధతి. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు అందుకుంటున్నారు. బెంగాల్ ఉద్యోగులు మాత్రమే ఇప్పటికీ ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాం’ అని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
బీజేపీ పాలనకు కౌంట్‌డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు తీర్పుతో మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలైనా గడవకమునుపే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందికి దించేందుకు కౌంట్‌డౌన్ మొదలైందంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. మద్యం విధానం కేసులో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కుట్రపన్నారని ఆరోపించారు. అయితే, కోర్టు ఇచి్చన చారిత్రక తీర్పు తాను కరుడుగట్టిన నిజాయతీపరడన్నది రుజవైందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీలో భయమొదలైందంటూ ఆయన..నిరంకుశుడు ఇలా భయపడుతున్నాడంటే దానర్థం..అతడి పాలనకు ముగింపు దగ్గరపడున్నట్లేనని పేర్కొన్నారు. చిన్నారుల విద్య కోసం పోరాడిన, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్చుక్ను మోదీయే జైలులో పెట్టించారు. మహిళా ఎంపీలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన ఒక రోజు పార్లమెంట్‌కు వెళ్లలేదు. ట్రంప్ అన్నా మోదీకి భయమే’అని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ 12 ఏళ్ల పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయన్నారు. రహదారులు, ఆరోగ్య రంగం, విద్య, పారిశుధ్యం..ఇలా అన్నీ దారుణంగా మారాయని విమర్శించారు. జీవించగలిగే భారత్‌ను ప్రజలు కోరుకుంటుండగా వికసిత్ భారత్ అంటూ ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పరీక్షా పే చర్చ పేరుతో డ్రామాలు ఆపి, పరీక్ష పత్రాల లీకేజీని అరికట్టాలన్నారు. ఏడాది పాలనలోనే ఢిల్లీని బీజేపీ నాశనం చేసిందని మండిపడ్డారు. దేశానికి మోదీ చేసిందేమీ లేదంటూ కేజ్రీవాల్..కుట్రలు, ఓటర్ల జాబితా అవకతకల ద్వారానే ఆయన అధికారంలో కొనసాగుతున్నారంటూ ఆరోపించారు. -
Liquor Scam Case మోదీ, అమిత్‌షా కుట్ర : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ మాజీ ఎక్సైజ్ (లిక్కర్) విధానానికి సంబంధించిన స్కాంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి కేసులో సహా నిందితులందరినీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్‌నేత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత, కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు కేసులు బనాయించి,తనను ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం కుట్ర పన్నిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలకు స్పందిస్తూ, తనపై, తన పార్టీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని తేలిందని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో సీబీఐ ,ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ, ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే దానిపై తుది నిర్ణయం కోర్టుదేనని స్పష్టం చేశారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కేసును కొనసాగించ డానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగంకేజ్రీవాల్కు క్లీన్ చిట్ రావడంతో అటు ఆప్ శ్రేణులు, ఇటు ఆయన భార్య సునీత ఆనందంలో మునిగి తేలారు. భర్తను ఆలించగనం చేసుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. -
చొరబాటు దారులను తరిమేస్తాం: అమిత్ షా
అరారియా: భారత నేల నుంచి ప్రతి చొరబాటుదారుడిని తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని కేవలం ఓటరు జాబితా నుంచే కాక.. భారత నేల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని చెప్పారు. పశి్చమ బెంగాల్లో అసె ంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ లోని సీమాంచల్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. బంగ్లాదేశ్–నేపాల్ సరిహద్దు వెంబడి బీహార్‌లోని కిషన్‌గంజ్, అరారియా, పూర్ని యా, కతిహార్ జిల్లాలతో కూడిన సీమాంచల్ ప్రాంతంలో షా మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. గురువారం అరారియాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. బీహార్‌లో సీమాంచల్ నుంచే చొరబాటుదారుల ఏరివేత ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పశి్చమ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రతి చొరబాటుదారుడిని తరిమికొడతామని నొక్కి చెప్పారు. చొరబాటుదారులు జాతీయ భద్రతకు ముప్పుగా ఆయన అభివరి్ణంచారు. బీహార్, జార్ఖండ్, పశి్చమబెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచే జనాభాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని, జనాభా సమతుల్యతను, ఆయా ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీడీ సావర్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఘన నివాళులరి్పంచారు. ‘భారత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్ధంతి. ఆయన స్వాతంత్య్ర పోరాటంలో యోధుడే కాదు.. నిర్భయమైన దేశ భక్తుడు కూడా. తన సాహిత్యంతో దేశంలో దేశ భక్తిని రగిలించారు. అంటరాని తనం నర్మూలన, జాతీయ దృక్పథం కోసం సావర్కర్ అపారమైన కృషి చేశారు. సావర్కర్‌కు నా నివాళులు’అని అమిత్ షా పేర్కొన్నారు. -
ఐదేళ్లలో తరిమేస్తాం
గువాహటి: దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను ఐదేళ్లలోపు దేశం నుంచి తరిమేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అస్సాంలోని రాష్ట్ర పోలీసుల 10వ బెటాలియన్ కోసం రూ.270 కోట్లతో నిర్మించతలపెట్టిన కొత్త ప్రాంగణానికి అమిత్ షా శంకుస్థాపనచేశారు. తర్వాత 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో జరపడం ఇదే తొలిసారి. ‘‘అక్రమ వలసదారుల పేర్లు కేవలం ఓటర్ల జాబితాలో తీసేయడమేకాదు అసలు వాళ్లు దేశంలో ఉండకుండా చేస్తాం. అందరినీ స్వదేశాలకు సాగనంపుతాం. వచ్చే ఐదేళ్లలో దీనిని చేసి చూపిస్తాం. గిరిజనుల ప్రాంతంలో చొరబాటుదారుల దురాక్రమణ చెర నుంచి వందల ఎకరాల భూములకు విముక్తి కల్పించాం. అలా విముక్తి పొందిన ఈ 347 ఎకరాల భూమిలోనే కొత్త బెటాలియన్ క్యాంపస్‌ను నిర్మించుకోబోతున్నాం. చొరబాటుదారులను ఏరిపారేస్తామని గతంలో రాహుల్‌గాంధీ పెద్ద ప్రతిజ్ఞలుచేశారు. అవన్నీ అబద్ధాలు. చొరబాటుదారులే కాంగ్రెస్ పారీ్టకి పెద్ద ఓటుగా తయారయ్యారు. చొరబాటుదారులను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ ఆందోళనలు చేస్తున్నారు. ఆరోపణల బాంబులు ఒకదానివెంట మరోటి విసురుతున్నారు. అవి కనీసం బాణా సంచా అంతటి స్థాయిలో అయినా పేలట్లేవు’’అని అమిత్ షా ఎద్దేవాచేశారు. కీలకపాత్ర పోషించిన మన బలగాలు ‘‘జమ్మూకశీ్మర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలు కీలకపాత్ర పోషించాయి. రాళ్లు రువ్వే ఘటనలు ఆగిపోయాయి. ఇక మణిపూర్‌లో జాతుల మధ్య విద్వేషం ఘటనలను తగ్గించడంలోనూ సీఆర్పీఎఫ్ అద్భుతంగా పనిచేసింది. కేవలం మూడేళ్లలో మావోయిస్టుల వెన్నువిరిచారు. 12 రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అసంఖ్యాక జిల్లాల్లో విస్తరించిన నక్సలిజంను సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూకటి వేళ్లతో పెకిలిస్తున్నాయి. సీఆర్పీఎఫ్ బలం కారణంగానే మార్చి నెల 31వ తేదీకల్లా దేశం నుంచి నక్సలిజాన్ని శాశ్వతంగా సమూలంగా తుడిచేస్తానని చెప్పగల్గుతున్నా. సీఆర్పీఎఫ్ 86 ఏళ్ల చరిత్రలో సీఆర్పీఎఫ్ రైజింగ్–డే వేడుకలు ఈశాన్య రాష్ట్రాల్లో జరగడం ఇదే తొలిసారి. ఇది ప్రతి ఒక్కరు, దేశం గర్వించదగ్గ విషయం’’అని షా అన్నారు. -
సరిహద్దు గ్రామాల ప్రగతికి పెద్దపీట
నథాన్పూర్: వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్(వీవీపీ) రెండో దశను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్సాంలోని చాచర్ జిల్లాలో ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దును తనిఖీ చేశారు. ఆయన శుక్రవారం అస్సాంలో పర్యటించారు. వీవీపీ ప్రారం¿ోత్సవంలో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో వలసలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. మనదేశంలోకి అక్రమ చొరబాట్లను సహించబోమని పునరుద్ఘాటించారు. దేశంలో సరిహద్దు గ్రామాల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వీవీపీ రెండో దశలో భాగంగా 1,954 సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 17 రాష్ట్రాల్లో ఈ గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రగతితో ప్రజలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పొట్టచేతపట్టుకొని ఇతర ప్రాంతాలు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. చొరబాట్లను అడ్డుకున్నాం అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దులను ఇష్టారాజ్యంగా తెరిచారని, పొరుగుదేశం నుంచి చొరబాట్లు విచ్చలవిడిగా జరిగాయని అమిత్ షా ధ్వజమెత్తారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత చొరబాట్లకు అడ్డుకట్ట పడిందని స్పష్టంచేశారు. అస్సాంకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో బీజేపీ పాలనలో నిత్యం 14 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. సరిహద్దు గ్రామాలను గతంలో దేశంలోనే చివరి గ్రామాలుగా పరిగణించేవారని గుర్తుచేశారు. అప్పట్లో అవి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవని అన్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు మారిపోయిందని స్పష్టంచేశారు. సరిహద్దు గ్రామాలు కూడా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. వీవీపీ రెండో దశలో భాగంగా అస్సాంలో రూ.6,900 కోట్లతో 140 గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామని తేలి్చచెప్పారు. రాష్ట్రంలో వరదల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని అమిత్ షా గుర్తుచేశారు. 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అస్సాంకు కేవలం రూ.1.28 లక్షల కోట్లు మాత్రమే ఇచి్చందని ఆక్షేపించారు. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అస్సాంకు ఏకంగా రూ.15 లక్షల కోట్లు ఇచి్చందని స్పష్టంచేశారు. మరోవైపు అమిత్ షా బంగ్లాదేశ్ సరిహద్దును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరిహద్దు వద్ద మర్రి మొక్క నాటారు. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బీఎస్ఎఫ్ క్యాంపులో అమర జవాన్ల స్మారకం వద్ద నివాళులరి్పంచారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది డిసెంబర్ 29 నుంచి అమిత్ షా అస్సాంలో పర్యటించడం ఇది మూడోసారి. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుబోతున్నాయి. -
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
సుల్తాన్పూర్: 2018 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఎదుట హాజరయ్యారు. కోర్టు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మకు రాహుల్ తెలియజేశారు. తన ప్రతిష్టను, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతియాలన్నదే ప్రత్యర్థుల పన్నాగమని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనపై వచి్చన ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఏనాడూ ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. మాటలతో ఇతరుల పరువుకు నష్టం కలిగించాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు ఫిర్యాదు చేశారని ఆక్షేపించారు. దాంతో న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ‘మీ వాదనను బలపర్చే సాక్ష్యాధారాలు సమర్పించండి’అంటూ రాహుల్‌కు సూచించింది. కోర్టు నుంచి రాహుల్ బయటకు వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ వారికి అభివాదం చేశారు. తమ నాయకుడి రాక సందర్బంగా సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్ నేతలు ‘సత్యమేవ జయతే’అని రాసి ఉన్న పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఏమిటీ కేసు? రాహుల్ గాంధీ 2018లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో నిందితుడైన అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ నీతి నిజాయతీ అంటూ కబుర్లు చెబుతోందని విమర్శించారు. దీనిపై సుల్తాన్‌పూర్‌కు చెందిన జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ విజయ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదయ్యింది. 2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ కోర్టు ఎదుట లొంగిపోయారు. రూ.25,000 పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. -
రాహుల్ చెప్పేవన్నీ అసత్యాలు
గాంధీనగర్: అమెరికా, యూకే, ఈయూతో వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తీవ్రంగా ఖండించారు. రాహుల్ రైతులను తప్పుదోవ పట్టించడంతో పాటు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చా వేదికను ఆయనే నిర్ణయించుకోవచ్చన్నారు. మన రైతులు, డెయిరీ ఉత్ప త్తులకు కేంద్రం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ‘‘వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు హాని చేస్తాయన్న కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదం. ప్రజలను తప్పుదోవపట్టించడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు. నిజానికి యూపీఏ హయాంలో కుదుర్చుకున్న పలు ఒప్పందాలు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాటిలోని ప్రమాదకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం రాగానే తొలగించింది’’ అని అమిత్ షా చెప్పారు. -
నిత్యం అబద్ధాలేనా?
కారైకల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పడం అనే కొత్త సంప్రదాయాన్ని రాహుల్ ప్రారంభించాడని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. గొంతు చించుకొని గట్టిగా అబద్ధం చెప్పడం, దాన్ని పునరావృతం చేయడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని చూడడం రాహుల్ విధానంగా మారిపోయిందని విమర్శించారు. రాహుల్ అబద్ధాల ఫ్యాక్టరీ వెనకున్న అసలు బాగోతాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. యూకే, ఈయూ, అమెరికాలతో కుదుర్చున్న వాణిజ్య ఒప్పందాలతో మన రైతులకు, మత్స్యకారులకు, పాడి పరిశ్రమకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదన్నారు. అయినప్పటికీ రాహుల్ తప్పుడు ప్రచారంతో వారిని భయోత్పాతానికి గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తప్పనిసరిగా కాపాడుందన్నారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి క్షుణ్నంగా తెలుసుకొని మాట్లాడాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పారు. మన ప్రయోజనాలు 100 శాతం కాపాడుకొనేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన ఘనత మోదీ నిర్ణయాత్మక నాయకత్వానిదేనని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌తో ముష్కర మూకలకు గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పుదుచ్చేరి అభివృద్ధి జరగాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
లోక్‌సభలో అవే దృశ్యాలు.. మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్షాల మధ్య పలు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండటంతో సోమవారం కూడా సభ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే వాయిదా పడింది. తొలుత ఉదయం రెండుసార్లు, అనంతరం మధ్యాహ్నం రెండింటి తర్వాత మంగళవారానికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. వారం రోజులుగా సభ నిత్యం అంతరాయాలనే ఎదుర్కొంటూ వస్తుండటం తెలిసిందే. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రయత్నించడం, అందుకు మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు. పదేపదే అవాంతరాలు ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టింది. ఆ వెంటనే విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలకు దిగారు. తాము లేవనెత్తిన పలు అంశాలపై తక్షణ చర్చకు పట్టుబట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వాటిని లేవనెత్తవచ్చని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. రాహుల్‌తో సహా సభ్యులంతా తమ అంశాలను లేవనెత్తవచ్చన్నారు. అయినా సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. కేవలం కార్యకలాపాలను స్తంభింపజేయడమే లక్ష్యంగా వారు వ్యూహం రూపొందించుకుని సభకు వచ్చారంటూ మండిపడ్డారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే, ముందుగా రాహుల్‌ను మాట్లాడనివ్వాల్సిందేనని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. నిబంధనల మేరకు బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కావాల్సి ఉందని సభాపతి స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రధాన వక్తగా శశి థరూర్ పేరు ఇచి్చనందున ఆయన మాట్లాడాలని సూచించారు. విపక్షాల నినాదాలు ఆగకపోవడంత సభ మధ్యాహ్నం రెండిటితో వాయిదా పడిడంది. తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా థరూర్‌కు సూచించారు. తన ప్రసంగానికి ముందు విపక్ష నేత రాహుల్ కొన్ని అంశాలను లేవనెత్తదలచారని థరూర్ పేర్కొన్నారు. రాహుల్ బడ్జెట్‌పై ప్రసంగిస్తే అభ్యంతరం లేదని రాయ్ బదులిచ్చారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, బడ్జెట్‌పై చర్చకు ముందు పలు అంశాలపై మాట్లాడేందుకు తనకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. అందుకు తనకు అవకాశమిస్తానని విపక్ష సభ్యులతో సమావేశం సందర్భంగా స్పీకర్ అంగీకరించినట్టు వెల్లడించారు. కానీ అలాంటిదేమీ లేకుండా నేరుగా బడ్జెట్‌పై చర్చను మొదలు పెడుతున్నారంటూ ఆక్షేపించారు. తనకు అలాంటి సమాచారమేదీ లేనందున ఇతర అంశాలు లేవనెత్తేందుకు అనుమతించలేనని రాయ్ పేర్కొన్నారు. స్పీకర్ అలాంటి అంగీకారానికి రాలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు స్పష్టం చేశారు. ఒప్పందంపైనే రాహుల్ మాట్లాడాలనుకుంటే దానిపై స్పందించేందుకు స్పీకర్ సభలో అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. అధికార, విపక్షాల్లో ఎవరూ పట్టు వీడకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు రాయ్ ప్రకటించారు. ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం ఫిబ్రవరి 5న ఆమోదం పొందడం తెలిసిందే! ఇలా జరగడం 22 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సందర్భంగా ఆయన స్థానం వద్దకు వెళ్లి అనూహ్య చర్యకు పాల్పడాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్టు కచి్చతమైన సమాచారం అందిందని స్పీకర్ పేర్కొన్నారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని తానే సూచించినట్టు తెలిపారు. దీన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా తోసిపుచ్చారు. అది పచ్చి అబద్ధమన్నారు. -
కమ్యూనిజం నుంచి విముక్తి పొందాలి
రాయ్‌పూర్: కమ్యూనిస్ట్ సిద్ధాంతంపై హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సిద్ధాంతం వినాశకరమైందంటూ మండిపడ్డారు. కమ్యూనిజం ఉన్న చోట అభివృద్ధి మచ్చుకైనా కనిపించదన్నారు. అందుకే, ఆ భావజాలం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని కోరారు. వామపక్ష తీవ్రవాదంపై ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్ట్ భావజాలం మనజాలదు. పశ్చిమబెంగాల్, త్రిపురల్లో కమ్యూనిస్టుల పాలన ముగిసింది. కేరళలో వారి ప్రభుత్వం చివరి ఊపిరి పీలుస్తోంది’’ అన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగానో, అభివృద్ధి లోపంగానో చూడరాదని షా చెప్పారు. ‘‘ఇది సిద్ధాంతపరమైన సవాలు. వామపక్ష తీవ్రవాదం పెరగకమునుపు బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతలు పరిస్థితి యూపీ, బిహార్ కంటే మెరుగ్గా ఉండేవి. మరో పదేళ్లలో బస్తర్ దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారనుంది’’ అన్నారు.మార్చి ఆఖరుకు అంతం‘‘దేశంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం 90 శాతం మేర తగ్గిపోయింది. మార్చి చివరికల్లా దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం’’ అని అమిత్ షా నొక్కి చెప్పారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో వందల సంఖ్యలో నక్సలైట్లు హతమయ్యారు. వేలాది మంది లొంగిపోయారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి. లొంగిపోయిన వారిని ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో ఆహ్వానిస్తుంది’’ అన్నారు. ప్రభుత్వం ఒక్క తూటా కూడా కాల్చాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. -
జమ్మూలో పర్యటిస్తున్న అమిత్‌షా
కేంద్ర హోం మంత్రి జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ వెళ్లిన ఆయన భద్రతాబలగాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలతో సమీక్ష నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అమిత్‌షా పర్యటనకు కొద్ది గంటల ముందే జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టడం కలకలం రేపిందిఅమిత్షాకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్అబ్దుల్లా ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హీరానగర్ సెక్టార్‌లోని గుర్నామ్, బోబియాన్ పోస్టులను సందర్శించారు. BSF బలగాలకు సంబంధించిన ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అనంతరం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు. అదేవిధంగా గతేడాది వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని అమిత్ సందర్శించారు.రేపు జమ్మూలోని లోక్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హాతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జమ్ము ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారు. ఉగ్రవాదుల ఎరివేతకు వారు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించనున్నారు. అనంతరం ఇటీవల ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన జవాన్ల కుటుంబాలతో అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అయి వారికి పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.కాగా అమిత్‌షా పర్యటనకు కొద్దిగంటల ముందు కిష్త్వార్, ఉదంపూర్ జిల్లాలలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. -
తూర్పు నాగాలాండ్ అభివృద్ధికి పాటుపడతా
న్యూఢిల్లీ: శాంతిస్థాపనకు పాటుపడుతూ నాగాలాండ్ రాష్ట్రంలోని ఆరు వెనకబడిన జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. టుయెన్సంగ్, మోన్, కిఫిరే, లోంగ్లెంగ్, నోక్లాక, షమాటార్ జిల్లాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్లతో గురువారం ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమిత్ షా ప్రసంగించారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ‘ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ(ఎఫ్ఎన్టీఏ)ను ఏర్పాటుచేస్తాం. త్రైపాక్షిక ఒప్పందం మేరకు 6 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా 46 అంశాలకు సంబంధించిన నిర్ణయాధికారం కేంద్రం నుంచి ఎఫ్ఎన్టీఏకు దఖలుపడుతుంది. ఎఫ్ఎన్టీఏ కోసం చిన్న సచివాలయం నిర్మిస్తారు. రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఈ మినీ సెక్రటేరియట్ పనిచేస్తుంది. జనాభా ప్రాతిపదికన నాగాలాండ్ ప్రధాన భూభాగానికి తగ్గట్లే తూర్పునాగాలాండ్కూ అభివృద్ధి నిధుల్లో కేటాయింపులు జరుగుతాయి. ఆర్థిక స్వావలంభన, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, వనరుల సది్వనియోగ సాధనకు తీసుకున్న నిర్ణయాత్మక ముందడుగు ఇది’’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
ఢిల్లీ, గుజరాత్‌లలో ‘భారత్ ట్యాక్సీ’
న్యూఢిల్లీ: సహకార రంగంలో దేశంలోని మొట్టమొదటిసారి యాప్‌తో పనిచేసే రైడ్ ఆధారిత ‘భారత్ ట్యాక్సీ’రవాణా సేవలు గురువారం దేశ రాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్(దేశ రాజధాని ప్రాంతం)లో ప్రారంభమయ్యాయి. ఈ సేవలను హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. వచ్చే మూడేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. అముల్ వంటి దేశంలోని టాప్–8 సహకార సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయి. ఈ వేదిక సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహణలో ఉంటుందని, దీనిని ఇఫ్కో, నాబార్డ్, అమూల్, క్రిభ్కో వంటి ప్రముఖ సంస్థలు ప్రమోట్ చేస్తున్నాయని మంత్రి వివరించారు. ఎస్బీఐ, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ వంటి సంస్థలతో భారత్ ట్యాక్సీ ఎంవోయూలను కుదుర్చుకుందన్నారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్ల ఆదాయం మరింతగా పెరగడంతోపాటు యజమానులుగా మారే అవకాశం కూడా వారికి రానుందన్నారు. యాప్ ఆధారిత ఇతర రైడింగ్ ఆధారిత రవాణా వేదికలు డ్రైవర్లకు తక్కువ ప్రతిఫలం అందిస్తున్నాయని చెప్పారు. లాభాలను భారత్ ట్యాక్సీతో సంబంధమున్న డ్రైవర్లందరికీ నేరుగా పంచుతామన్నారు. భారత్ ట్యాక్సీ వేదికలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ యాప్‌లోనే సారథి దీదీ అనే ప్రత్యేక విండో అందుబాటులోకి రానుందన్నారు. ఈ విండోలో బుక్ చేసుకున్న మహిళలను సారథి దీదీలే వచ్చి పికప్ చేసుకుంటారని అమిత్ షా వివరించారు. ప్రస్తుతం ఉబర్, ఓలా, రాపిడోల ప్రాబల్యమున్న ఈ రంగంలో మూడేళ్లలోనే భారత్ ట్యాక్సీ అగ్రస్థానానికి ఎదుగుతుందని, కశ్చిర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు డ్రైవర్ల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతుందన్నారు. డిసెంబర్ 2 నుంచి ప్రయోగాత్మకంగా మొదలైన భారత్ ట్యాక్సీలో ఢిల్లీ–ఎన్సీఆర్లో 2.5 లక్షల మంది డ్రైవర్లు చేరారని, మరో 8.5 లక్షల మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారని అమిత్ షా చెప్పారు. -
45రోజుల్లో కంచె నిర్మిస్తాం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదార్లను కాపాడుతోందని, అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చిందని, ఎన్నికల్లో లబ్ధి కోసం సరిహద్దుల్లో భద్రతను ఉద్దేశపూర్వకంగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. దేశ భద్రత కోసం బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం అత్యవసరం అని తేల్చిచెప్పారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో శనివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది రాజకీయపరమైన అంశం కాదని.. దేశ భద్రత కోణంలో పార్టీని గెలిపించుకోవాలని స్పష్టంచేశారు. చొరబాటుదార్లను ముద్దు చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి భూమి కేటాయించాలని కోర్టు ఆదేశించినా మమతా బెనర్జీ ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఆరోపించారు. చొరబాటుదార్లను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని, అంతిమంగా దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. పొరుగుదేశం నుంచి పశ్చిమ బెంగాల్లోకి విచ్చలవిడిగా అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. చొరబాటుదార్లను అడ్డుకోవడానికి బెంగాల్ ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చొరబాటుదార్లు బెంగాల్లో సులువుగా లభిస్తున్న ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని దేశమంతటా విస్తరిస్తున్నారని చెప్పారు. నేను హామీ ఇస్తున్నా.. ‘‘సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరించడం లేదని సాక్షాత్తూ కలకత్తా హైకోర్టు తప్పుపట్టింది. బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడం లేదని ఆక్షేపించింది. కోర్టు ఆదేశాల ప్రకా రం మార్చి 31వ లోగా ప్రభుత్వం భూమి కేటాయించాలి. ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయి నా.. నేను హామీ ఇస్తున్నా. ఏప్రిల్‌లో బీజేపీ ముఖ్యమంత్రి కొలువుదీరడం తథ్యం. బీజేపీ ప్రభుత్వం రాగానే 45 రోజుల్లోగా కంచె నిర్మాణం పూర్తిచేస్తాం. హామీలు అమలు చేయడంలో రికార్డులు సృష్టించిన ఘనత బీజేపీదే. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదార్లను కట్టడి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమ వలసలు యథేచ్ఛగా జరిగాయి. బీజేపీ రాగానే పరిస్థితి మారిపోయింది. అస్సాం తరహాలో బెంగాల్లోనూ చొరబాట్లను అడ్డుకోవడం ఖాయం. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే బెంగాల్లో కేవలం చొరబాటుదార్ల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను మమతా బెనర్జీ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా సరే ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లు తొలగించక తప్పదు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే. బెంగాల్లో మతువా, నామశూద్ర సామాజిక వర్గాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వేధింపులకు గురిచేస్తోంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో త్వరలో రాబోతున్న బీజేపీ ప్రభుత్వం మీకు రక్షణ కల్పిస్తుంది. మమతా బెనర్జీ పాలనలో అవినీతి వ్యవస్థీకృతంగా మారింది. అవినీతి మంత్రులకు ఎన్నికల్లో టికెట్లు నిరాకరించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? బీజేపీ వచ్చాక అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తాం. వందేమాతర గీతంపై పార్లమెంట్లో చర్చ చేపట్టడాన్ని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. చొరబాటుదార్లను బుజ్జగించడానికే ఆరాటపడింది. అందుకే ఆ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలి. దేశభక్తులు, జాతీయవాదుల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 50 శాతానికి పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వస్తుంది. 2026 సంవత్సరం తృణమూల్ కాంగ్రెస్‌కు టాటా, బైబై చెప్పే సంవత్సరం’’అని అమిత్ షా స్పష్టంచేశారు. -
ఏడు జిల్లాల్లో చొరబాటుదార్లదే మెజార్టీ
గౌహతి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదార్లు విచ్చలవిడిగా ప్రవేశించారని, రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో ప్రతికూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అస్సాం నుంచి చొరబాటుదార్లను బయటకు పంపించి, స్థానికులను రక్షించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. శుక్రవారం అస్సాం రాష్ట్రం ధెమాజీ జిల్లాలో మిసింగ్ తెగ ప్రజల యువజన వేడుక ముగింపు కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దిబ్రూగఢ్‌లో పర్యటించారు. రూ.1,715 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు.చొరబాటుదార్ల నుంచి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో విముక్తి లభించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఇక్కడ చొరబాటుదార్ల సంఖ్య ఏకంగా 64 లక్షలకు చేరుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడు జిల్లాల్లో వారే మెజార్టీగా ఉన్నారని చెప్పారు. ఈ ధోరణి మారాలంటే బీజేపీని గెలిపించాలని స్పష్టంచేశారు. అస్సాంలో జనాభా స్థితిగతులను పూర్వస్థితికి తీసుకురావాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడం బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి మరింత బలం ఇవ్వాలి ‘‘చొరబాట్లు ఆగాలని ప్రజలు నిజంగా కోరుకుంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు మరింత బలం ఇవ్వాలి. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 1.26 లక్షల ఎకరాల భూములను చొరబాటుదార్ల నుంచి కాపాడింది. మిసింగ్ తెగ ప్రజలు కష్టజీవులు. శ్రమించడం వారి సంస్కృతిలోనే ఉంది. ఎగువ అస్సాంలోకి చొరబాటుదార్లు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది.బ్రహ్మపుత్ర నదిపై బోగిబీల్ వంతెనను నిర్మించింది. దీనివల్ల దిబ్రూగఢ్, ధెమాజీ మధ్య అనుసంధానం పెరిగింది. భారతదేశ ప్రగతికి ఈ వంతెన ఒక ప్రతీకగా నిలుస్తోంది. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. కానీ, బోగిబీల్ వంతెన నిర్మాణం పూర్తిచేయలేదు. నరేంద్ర మోదీ పట్ల రాష్ట్ర ప్రజలు విశ్వాసం కనబర్చారు. అందుకే వంతెన నిర్మాణం నాలుగేళ్లలో విజయవంతంగా పూర్తయ్యింది’’ అన్నారు.రాహుల్ అవమానించడం దారుణం ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అవమానించడం దారుణం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ‘ఎట్‌హోం’ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేసిన ‘గమోసా’ను ధరించడానికి రాహుల్ నిరాకరించారు. దేశ విదేశీ ప్రముఖులు ఆ కండువాను గౌరవపూర్వకంగా ధరిస్తే రాహుల్ మాత్రం ధరించకుండా అగౌరవపర్చారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని కించపరిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదు. అస్సాం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. తుపాకులు, తూటాలు, ఘర్షణలు, మరణాలు తప్ప అస్సాంకు కాంగ్రెస్ ఇచ్చిందేమిటో చెప్పాలి. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. అందుకోసం చొరబాట్లను ఆయుధంగా ఉపయోగించుకుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాట్లకు అడ్డుకట్ట పడింది. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని గుర్తించి, కచ్చితంగా వెనక్కి పంపిస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది. యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అస్సాం తేయాకు పరిశ్రమకు, కారి్మకులకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ నుంచి యూరప్ దేశాలకు తేయాకు ఎగుమతులు పెరుగుతాయి. అభివృద్ధి, శాంతి, రక్షణ, పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి కావాలంటే మరోసారి బీజేపీకి పట్టం కట్టాలి. చొరబాట్లు, వరదల నుంచి అస్సాంను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు సమానమే‘‘కాంగ్రెస్ పాలనలో గిరిజన తెగలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొన్నారు. సొంత గుర్తింపును కాపాడుకొనేందుకు పోరాడాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారికి భద్రత లభిస్తోంది. పారామిలటరీ దళాల్లో నియామకాల విషయంలో గిరిజన యువతకు ప్రాధాన్యమిస్తాం. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు మరింత గుర్తింపు దక్కాల్సి ఉంది. వేర్వేరు సంస్కృతుల సమ్మేళనం వల్లనే భారతదేశ సంస్కృతి మరింత వికసిస్తుంది. దేశంలో అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలకు సమాన హక్కులున్నాయి. అవన్నీ సమానమే’’ అని అమిత్ షా చెప్పారు. -
కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన వర్గానికి పదవుల కోసం హస్తిన వేదికగా లాబీయింగ్‌కు తెరలేపారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఇక్కడికొచ్చి తన బంధువు, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కూడా ఇప్పుడు అదే బాటపట్టారు. తనకు, సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పైరవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన పార్టీ లో కీలకంగా ఉన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలÔౌరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. లింగమనేని కోసం పవన్ ఆరాటం.. త్వరలో ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో వీటికోసం అటు టీడీపీ ఇటు జనసేన, బీజేపీ పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీ వేదికగా పైరవీలు చేస్తుండగా.. సీఎం చంద్రబాబు ఇటీవల తన అస్మదీయుల కోసం అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్‌కు అత్యంత ఆప్తుడుగా ఉన్న కిలారు రాజేశ్‌కు రాజ్యసభ సీటు కేటాయించాలని చంద్రబాబు అడగ్గా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న తమకు కూడా రాజ్యసభలో చోటు కల్పించాలని పవన్ తాజాగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏడాది క్రితం ఖాళీ అయిన రెండు స్థానాలను టీడీపీ ఒకరికి, బీజేపీ మరొకరికి పంచుకున్నాయి. అప్పట్లో పవన్ లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే, ఇప్పుడు ఖాళీ అయ్యే సీట్లలో జనసేన నుంచి లింగమనేని రమేష్‌కు అవకాశం కల్పించాలంటూ పవన్ అమిత్ షాను అడిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ కి మంత్రి పదవిస్తే వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఎదుట పవన్ విన్నవించినట్లు సమాచారం. కాగా ఉప్పాడ సముద్ర రక్షణ కోసం గోడ నిర్మాణం, రాష్ట్రంలో పరిపాలన, ఇతర ముఖ్యమైన విషయాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించినట్లు పవన్‌కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
అమ్మాయిలంటే పవర్, బాధ్యత కాదు : హోమంత్రి అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం జాతీయ బాలికా దినోత్సవం (NationalGirlChildDay) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు కేవలం బాధ్యత మాత్రమే కాదని,వారు దేశ నిర్మాణంలో బలమైన శక్తి అని, మహిళలు భారతదేశ ప్రగతికి ముందుండి నడిపిస్తున్నారంటూ ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.అందరికీ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి బాలికలు కేవలం మన బాధ్యతలు మాత్రమే కాదు, వారు అపారమైన శక్తి అన్నారు. రాణి లక్ష్మీబాయి, రాణి వేలు నాచియార్, మూలా గభారు , ప్రీతిలత వాడేదార్ వంటి వారు ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ,స్ఫూర్తితో నింపుతారు.” అని ట్వీట్ చేశారు. భారతదేశ అభివృద్ధి గాథలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ మోడీ ప్రభుత్వ మహిళా నేతృత్వ అభివృద్ధి మంత్రం నారీ శక్తిని ప్రగతిలో అగ్రస్థానంలో నిలబెట్టిందనీ, నేడు మహిళలు దేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.Greetings to everyone on 'National Girl Child Day.’#NationalGirlChildDay symbolizes that girls are not merely our responsibilities but sheer strength. The glorious examples of Rani Lakshmi Bai, Rani Velu Nachiyar, Mula Gabharu, and Pritilata Waddedar fill every Indian heart…— Amit Shah (@AmitShah) January 24, 2026 నేషనల్ గర్ల్ ఛైల్డ్ డే- లక్ష్యాలుఆధునిక సమాజంలో ఇప్పటికీ బాలికలకు సమ ప్రాధాన్యత లభించంలేదు.ఈ వివక్షను తొలగించి, ఆడపిల్లలకు కూడా అబ్బాయిలతో సమానంగా ఆహారం, విద్య, గౌరవం దక్కాలనేది ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. బాలికల డ్రాపౌట్ రేటును తగ్గించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడం ఈ కాన్సెప్ట్‌లో కీలక భాగం. విద్యాపరంగా వారు సాధికారత సాధించినపుడే ఆర్థికంగా కూడా వారు సాధికారత సాధించగలరు. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు మరియు బాల్య వివాహాలను అరికట్టడం. ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం తదితర అంశాలో స్వయం నిర్ణయం తీసుకునేలా తామే తీసుకునేలా వారిని శక్తివంతులను చేయడం. స్వతంత్రులుగా తీర్చిదిద్దడం. లింగ నిష్పత్తి (Sex Ratio): ఆడపిల్లల సంఖ్యను పెంచడం మరియు భ్రూణహత్యలను అరికట్టడం."బేటీ బచావో - బేటీ పఢావో" అనే నినాదం ఇందులోభాగంగా వచ్చిందే.అలాగే బాలికల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి.బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 వీటితోపాటు చైల్డ్ హెల్ప్‌లైన్ మరియు ట్రాక్ చైల్డ్ పోర్టల్ వంటి సేవలను అందిస్తుంది, ఇది తప్పిపోయిన పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించినవి. -
ప్రమాదంలో కేరళ భద్రత
తిరువనంతపురం: కేరళలో శాంతి భద్రత పైకి సాధారణంగా కన్పిస్తున్నా లోపల అనేక ముప్పులు క్రమేపీ పెరుగుతున్నాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భవిష్యత్తులో ఇవి ప్రమాదకరంగా మారనున్నాయని హెచ్చరించారు. మలయాళ పత్రిక కేరళ కౌముది ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘పీఎఫ్ఐ, జమాతె ఇస్లామీ, ఎస్డీపీఐ వంటి రాజకీయ పార్టీలు కేరళను సురక్షితంగా ఉండనిస్తాయా? ఇటువంటి బెడదలను ముందుగానే గుర్తించి, తొలగించడం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని’ అని అన్నారు. పీఎఫ్ఐ కేడర్ మొత్తాన్నీ కటకటాల్లోకి నెట్టేసి, దేశాన్ని తాము సురక్షితంగా ఉంచామని చెప్పారు. తెరవెనుక ఉన్న ముప్పులను తొలగించినప్పుడే కేరళ సురక్షితంగా ఉండగలదని అమిత్ షా అన్నారు. బీజేపీ వల్లనే అది సాధ్యమని చెప్పారు. పద్మనాభుని సన్నిధిలో పూజలుకేరళలో ఒక్క రోజు పర్యటనకు గాను శనివారం రాత్రి తిరువనంతపురం చేరుకున్న అమిత్ షా ఆదివారం ఉదయమే అనంత పద్మనాభుని ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ ధోవతి, సిల్కు శాలువాతో వచ్చిన అమిత్ షాకు ట్రావెన్కోర్ రాచ కుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమిత్ షాకు ఆలయ అధికారులు పద్మనాభస్వామికి అంకితమిచ్చే సంప్రదాయ విల్లును బహూకరించారు. . కేరళ, బెంగాల్‌లలో ఒకేసారి ఎన్నికలుఅనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా నూతనంగా ఎన్నికైన తిరువనంతపురం బీజేపీ కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే కేరళలోనూ ఎన్నికలు జరుగుతాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శబరిమల ఆలయంలో బంగారు తరుగు కేసుపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. అసలైన దోషులను కాపాడేందుకు అధికార ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆలయ ఆస్తులనే కాపాడలేని వారు ప్రజల విశ్వాసాలను ఎలా పరిరక్షించగలరంటూ ప్రశ్నించారు. -
కేరళలో అమిత్ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’
తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.ఆలయ దర్శనం అనంతరం అమిత్ షా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రతినిధులతో ఆయన సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒక ప్రత్యేక సదస్సులో పాల్గొన్న అనంతరం, సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ‘మిషన్ 2026’ను ఈ పర్యటన ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2025లో ఆయన ప్రారంభించిన ‘మిషన్ 2025’ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026 శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.ఇది కూడా చదవండి: ‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా.. -
మన నినాదం స్వదేశీ, స్వభాష
జోద్పూర్/జైపూర్: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు స్వదేశీ, స్వభాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని, ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడుకోవాలని సూచించారు. మనదేశంలోనే తయారైన ఉత్పత్తులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సమాజాన్ని, సంస్కృతిని, మతాన్ని కాపాడుకోవాలంటే భాష అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆధునిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి, జీవితంలో ప్రగతి సాధించడానికి ఇతర భాషలు నేర్చుకోవడం, మాట్లాడడం అవసరమని తెలిపారు. ఇంట్లో మాత్రం పిల్లలతో మాతృభాషలో సంభాషించాలని చెప్పారు. దానివల్ల వారికి తమ మూలాలతో అనుబంధం మరింత బలపడుతుందన్నారు. స్వదేశీ, స్వభాష మనందరి నినాదం కావాలని స్పష్టంచేశారు. రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో శనివారం మహేశ్వరి అంతర్జాతీయ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన మహేశ్వరి వర్గం ప్రజలు హాజరయ్యారు. పిల్లలతో మాతృభాషలో మాట్లాడితే వారు స్వస్థలంతో, సొంత చరిత్రతో అనుసంధానమవుతారని అమిత్ షా వివరించారు. సమాజాన్ని, మతాన్ని సజీవంగా ఉంచేది, సంస్కృతిని ముందుకు నడిపించేది భాషేనని స్పష్టంచేశారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ మన ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఆ దిశగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనకు అవసరమైన ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా మనదేశంలో ఉత్పత్తి కానివాటిని తయారు చేయడానికి ముందుకు రావాలని కంపెనీలకు సూచించారు. దేశ అభివృద్ధిలో మహేశ్వరి వర్గం ప్రజల కృషిని అమిత్ షా ప్రశంసించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. రాజస్తాన్‌లో పేపర్ లీక్‌లు బంద్ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నేతృత్వంలో రాజస్తాన్ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శనివారం జైపూర్‌లోని రాజస్తాన్ పోలీసు అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధిస్తుందని అన్నారు. భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని చెప్పారు. క్రైమ్ రేటు చాలావరకు తగ్గిపోయిందని, పేపర్ లీక్‌లు ఆగిపోయానని తెలిపారు. లంచాలు, సిఫార్సుల బెడద లేకుండా యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. -
ఐఈడీ డేటా ప్లాట్‌ఫాం అందుబాటులోకి
గురుగ్రాం: ఉగ్రవాదులు, తీవ్రవాదులు విసురుతున్న అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన నేషనల్ డిజిటల్ ఐఈడీ డేటా ప్లాట్‌ఫాంను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఉగ్రవాదం బారినుంచి దేశాన్ని కాపాడే అత్యాధునిక రక్షణ ఛత్రంగా దీన్ని అభివరి్ణంచారు. ఈ నేషనల్ ఐఈడీ డేటా మేనేజ్మెంట్ సిస్టం (ఎన్ఐడీఎంఎస్)ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉగ్రవాద వ్యతిరేక కమెండో దళం ఎన్ఎస్జీ అభివృద్ధి చేసింది. ఇందుకు గాం«దీనగర్‌లోని రాష్రీ్టయ రక్షా యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ సాయం అందించాయి.పలు రకాల బాంబులను క్షుణ్నంగా అధ్యయనం చేసే అత్యాధునిక కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ పరికరాలు ఎన్ఐడీఎంఎస్ సొంతం. దీన్ని 2000లో ఏర్పాటైన ఎన్ఎస్జీ తాలూకు నేషనల్ బాంబ్ డేటా సెంటర్‌కు ఒకరకంగా అత్యాధునిక వెర్షన్‌గా చెబుతున్నారు. దేశ అంతర్గత భద్రతకు అత్యంత ముప్పుగా పరిణమించిన ఐఈడీల బారిన పడి ఏటా వేలాది మంది పౌరులు, భద్రతా సిబ్బంది మరణిస్తున్నారు. వెలకట్టలేని ఆస్తి ఎన్‌ఐడీఎంఎస్‌ను వెలకట్టలేని జాతీయ ఆస్తిగా అమిత్ షా అభివరి్ణంచారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదులు జరుపుతున్న బాంబుపేలుళ్లను ఇది సమర్థంగా అడ్డుకుంటుందని తెలిపారు. బాంబులు, బాంబు దాడులకు సంబంధించిన కీలకమైన, సమగ్రమైన డేటాను పోలీసు, భద్రతా సిబ్బంది, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాద వ్యతిరేక దళాలకు ఇది అందుబాటులోకి తెస్తుంది. అంతేగాక దర్యాప్తులను వేగవంతం చేయడంలో, నాణ్యతతో కూడిన ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణలో సాయపడుతుంది’’అని మంత్రి వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా ఏర్పాటవుతున్న ఎన్ఎస్జీ స్థావరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలో ఏ ప్రాంతానికైనా ఎన్ఎస్జీ కమెండోలు గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే చేరుకునే వీలుంటుందని తెలిపారు. ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పుడు చేరవేసే వేదికగా ఎన్‌ఐడీఎంఎస్‌ను ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ భృగు శ్రీనివాసన్ అభివర్ణించారు. -
అమిత్ షా గుట్టువిప్పుతా: మమత
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఇలా ఈడీ, దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మమత వార్నింగ్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో అమిత్ షా ప్రమేయం ఉందని బాంబు పేల్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బెంగాల్లో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు నిరసనగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నిరసన మార్చ్‌లో పాల్గొన్నారు. హజ్రాలో మార్చ్ ముగిసిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మమత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ మేల్కొంది, ప్రజల మద్దతు లభిస్తోంది. కార్యకర్తలే దగ్గరుండి ఆందోళనలను నడిపించారు. గతంలో ఇలాంటి ఘటనలు చూశాం. రక్తం వచ్చేలా లాఠీ దెబ్బలు తిన్నాం. ఈ హజ్రాలోనే నేను కూడా దెబ్బలు తిన్నాను. నేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను, శరీరమంతా గాయాలతోనే పని చేశాను. నన్ను ఎవరైనా కొట్టిన రోజున నేను పునర్జన్మ పొందుతాను. BREAKING : This is the most shocking development you will come across 🚨Do not play with fire. I have proof in pen drives showing how coal smuggling money reached Amit Shah through Suvendu Adhikari.— Mamata Banerjee 🤯 pic.twitter.com/2hRj8Vo8x5— Amock (@Politicx2029) January 9, 2026నాపై, నా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకండి. నేను ఏం చేస్తానో మీకు తెలుసు. మేము చేస్తే చాలా చేయగలం. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డబ్బు అమిత్ షా తింటారు. బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉంది. దేశద్రోహుల ద్వారా ఆ డబ్బు వెళుతుంది. బీజేపీకి చెందిన జగన్నాథ్ బొగ్గు స్కాంలో ఉన్నారు. జగన్నాథ్ ద్వారా బీజేపీ సువేందు అధికారి నుంచి డబ్బు అమిత్ షా దగ్గరకు వెళుతుంది. నా దగ్గర అన్ని పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి, అన్నీ బయటపెడతాను. నేను చేపట్టిన పదవికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. నాపై మరీ ఎక్కువ ఒత్తిడి తేకండి' అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.“Don’t irritate me — I will release all the evidence stored in pen drives.”CM @MamataOfficial issues a clear warning to HM Amit Shah.She alleges coal smuggling money changed hands and reached Amit Shah via Suvendu Adhikari and says she has proof.Final message is loud and… pic.twitter.com/KgGiHbfNjo— Spandan Gain (@GainSpandanLIVE) January 9, 2026అంతటితో ఆగకుండా..‘ఆరోగ్యంగా ఉన్న పులి కంటే గాయపడిన పులి ప్రమాదకరం. దేశ డబ్బును బయటకు తీసుకెళ్లారు, కానీ గ్రామస్తులకు డబ్బు ఇవ్వలేదు. నా డబ్బు నాకు ఇవ్వండి, ఇది పశ్చిమ బెంగాల్ డబ్బు. నాలుగు సంవత్సరాలుగా ఆవాస్, నీరు, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. ఒకరిని ఎన్నికల సంఘంలో కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి కేంద్ర హోంమంత్రి కింద పనిచేశారు. ఢిల్లీలో మా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు, పోలీసులు వారిని తీసుకెళ్లారు. అన్ని ఏజెన్సీలను ఆక్రమించారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్లను బలవంతంగా ఆక్రమించారు, ఇప్పుడు బెంగాల్‌ను కూడా బలవంతంగా ఆక్రమించాలని చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పేరును భరించలేకపోతున్నారు, బెంగాల్ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్లో కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో హిందీ మాట్లాడే వారిపై దాడి జరగలేదు, మేము ఎప్పుడూ చేయలేదు. మేము ఈ బీజేపీకి మర్యాద ఇస్తున్నాము, లేకపోతే చేతల్లో చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీపై ఆగ్రహం.. ఈడీని ఉద్దేశించి.. ‘మా పార్టీ పత్రాలను, హార్డ్‌డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం కూడా ఉంది. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశాను’ అని మమత తెలిపారు. అయితే, చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని, ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. ఈ పరిణామాలపై ఇరు వర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో తక్షణ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టును ఈడీ కోరింది. అయితే దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
అమిత్ షా కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం దుమారం కొనసాగుతుంది. న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, డెరెక్ ఓ’బ్రయన్ సహా పలువురు నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో పోలీసులు వారిని బలవంతంగా లాగి అరెస్టు చేశారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీకి ఐపాక్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. ఈనేపథ్యంలో ఈడీ అధికారులు ఐపాక్ కార్యాలయంపై దాడులు జరిపారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.అయితే,ఈడీ దాడుల్ని టీఎంసీ ఎంపీలు ఖండిస్తున్నారు. ఎన్నికల ముందు ఈడీ దాడులు ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ప్రయత్నం. తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని కేంద్రం చూస్తోంది’అని ఆరోపణలు గుప్పిస్తున్నారు.అందుకు బీజేపీ సైతం టీఎంసీ దాడుల్ని తిప్పికొడుతోంది. ఈడీ దాడులు చట్టుపరమైనవని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులు చట్టపరమైనవని, అవినీతి కేసులపై విచారణలో భాగమని స్పష్టం చేసింది. VIDEO | Delhi: TMC MPs protest outside Union Home Minister Amit Shah’s office with placards reading “Bengal rejects Modi-Shah’s dirty politics,” following the ED raids at I-PAC’s office in Kolkata yesterday.#TMC #AmitShah #Kolkata(Source - Third party)(Full VIDEO available… pic.twitter.com/7VyF2e7dfL— Press Trust of India (@PTI_News) January 9, 2026 -
కోల్‌కతాలో ఈడీ VS సీఎం మమతా బెనర్జీ
-
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌పై బీజేపీ బిగ్ ప్లాన్?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయం ములుపులు తీరుతోంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK Vijay) పార్టీతో పొత్తు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ మా సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన వేళ.. బీజేపీ రంగంలోకి దిగింది. టీవీకేతో పొత్తు గురించి బీజేపీ నేతలు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న తమిళనాడుపై (Tamil Nadu Politics) బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు అక్కడి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక, తమిళనాడులో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన టీవీకే విజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ తన పార్టీని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలు విజయ్ పార్టీపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.బీజేపీ ప్లానేంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండటం అందరూ గమనిస్తున్నారు. ఈ క్రమంలో టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. ఇదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని.. డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్ర పక్షాలకు పంపించారు. అలాగే, జనవరి 14వ తేదీన వచ్చే పొంగల్ (సంక్రాంతి) నాటికే మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలని అమిత్ షా.. తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని సూచించారు.అయితే ఇప్పటికే తాము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీవీకే పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు.. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉంది. టీవీకే పార్టీ ఏర్పాటు తర్వాత విజయ్ తమిళనాడులోని అధికార డీఎంకేను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ పలుమార్లు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, విజయ్ మధ్య గ్యాప్‌ను ఉపయోగించుకుని టీవీకేను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.టీవీకే నేత సంచలన ప్రకటన..!ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తమ సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లౌకికవాదం, మతత్వానికి వ్యతిరేకంగా వారి వైఖరి విషయంలో కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రపక్షాలు. ఆ కోణంలో మేము ఎల్లప్పుడూ సహజ భాగస్వాములమై రాహుల్ గాంధీ, మా నాయకుడు విజయ్ కూడా స్నేహితులే అనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రాజకీయంగా వ్యూహత్మకంగా ముందుకెళ్లే బీజేపీ.. టీవీకే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. మొత్తంగా తమిళ రాజకీయం పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. -
తమిళనాట ‘20% కమీషన్ల’ పాలన
పుదుకొట్టై: తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మండిపడ్డారు. రాష్ట్రంలో ‘20 శాతం కమీషన్ల’ పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రతి పనిలో 20 శాతం కమీషన్లు నొక్కేస్తున్నారని, ఇదొక నిబంధనగా మారిపోయిందని షా దుయ్యబట్టారు. తమిళనాడుతోపాటు పశ్చిమ బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగరత్నన్ చేపట్టిన యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం పుదుకొట్టైతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తమిళనాడులో ఉందన్నారు. తమిళ భాషను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తమిళాన్ని మరింత ప్రోత్సహించడానికి పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో హిందుమతాన్ని, హిందువులను డీఎంకే తరచుగా కించపరుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణా, ఢిల్లీ, బిహార్ తరితర రాష్ట్రాల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ అదే ఫలితం పునరావృతం కాబోతోందని స్పష్టంచేశారు. కుటుంబ రాజకీయాలకు ఇక చరమగీతం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని అమిత్ షా మండిపడ్డారు. ఆ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందన్నారు. క్యాష్ ఫర్ జాబ్స్‌తోపాటు మనీ లాండరింగ్ కేసుల్లో డీఎంకే నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయని గుర్తుచేశారు. అవినీతి నేతలుండగా రాష్ట్రం ప్రగతి సాధించడం సాధ్యం కాదని అన్నారు. అప్పులు, మద్యం ఆదాయంతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సీఎం స్టాలిన్ ఆరాటపడుతున్నారని, ఆయన ఆశ నెరవేరే ప్రసక్తే లేదని అమిత్ షా పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించని స్టాలిన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువుల పండుగలకు సైతం అనుమతి ఇవ్వడం లేదన్నారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి స్టాలిన్ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. -
నాలుగు నెలల్లో వచ్చేది మేమే... Amit Shah
-
అమిత్ షా ఆరోపణలకు దీదీ ఘాటు కౌంటర్
ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అలాంటప్పుడు పహల్గాం దాడిని కేంద్రమే జరిపించిందా? అని నిలదీశారామె. మంగళవారం బంకురా బిర్సింగ్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని, ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆ లెక్కన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు లేరంటే.. పహల్గాం దాడి ఎలా జరిగింది? దాన్ని మీరే చేయించారా?.. దేశ రాజధానిలో జరిగిన దాడికి కారణం ఎవరు?(ఎర్రకోట దాడిని ఉద్దేశించి..) అని ప్రశ్నించారామె. ప్రధాని మోదీని మహాభారతంలో దుర్యోధనుడిగా.. అమిత్ షాను దుశ్శాసనుడితో ఆమె పోల్చారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు.. ఇక్కడి నుంచి సమాచారం సేకరించేందుకు వచ్చారు. ఎన్నికల సమయంలోనే ఆ దుర్యోధన దుశ్వాసనలకు బెంగాల్ గుర్తుకు వస్తుంది. ఓట్ల కోసం ఎగబడి వచ్చేస్తుంటారు అని మండిపడ్డారామె. ఇక తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికల జాబితా వివాదం (SIR) ప్రస్తావిస్తూ కేంద్రంపై టీఎంసీ అధినేత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ ప్రజలను కేంద్రం ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తోంది. కోటిన్నర ఓట్లను తొలగించే యత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో.. రాజ్‌బన్షీలు, మటువాలు, ఆదివాసీలు లక్ష్యంగా మారతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎస్ఐఆర్ నిర్వహించడం పెద్ద మోసం. ఇది ఇలాగే కొనసాగితే చివరికి మీరు (అమిత్ షా) మరియు మీ కుమారుడు మాత్రమే మిగిలిపోతారు అని మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రంపై దృష్టిసారించింది. ఈ నెల 20న బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించారు. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మరో అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. అలాగే.. మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని.. ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలను కోరారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని.. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని హామీ ఇచ్చారు. -
చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా
కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన విమర్శలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం అవినీతి, భయం, చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని అమిత్‌షా అన్నారు.బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్లపై షా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, సరిహద్దుల వద్ద కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమిత్ షా పేర్కొన్నారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి, చొరబాటుదారులను బయటకు తరిమికొడుతుందని ఆయన అన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక్కడి ‘టోల్ సిండికేట్’,అవినీతి కారణంగా ప్రజలకు చేరడం లేదని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, భయం, దుర్పరిపాలన నుండి విముక్తి పొంది అభివృద్ధి దిశగా సాగాలని నిశ్చయించుకున్నారని అమిత్ షా అన్నారు. 2026, ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు తృణమూల్ ప్రభుత్వానికి చరమగీతం పాడనున్నారని ఆయన జోస్యం చెప్పారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నాటికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితర మహనీయులు కలలుగన్న బెంగాల్‌ను నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని కాపాడటానికి కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డిజిటల్ హోరులో 'ప్రింట్' జోరు.. యూపీ ముందడుగు -
వాళ్లను తరిమేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
బోర్డోవా/గువాహటి: అస్సాం అభివృద్ధి, సంస్కృతికి ప్రతిబంధకంగా మారిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అస్సాం ఓటర్లకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సోమవారం అస్సాంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గువాహటిలో నూతన పోలీస్ కమీషనరేట్, నిఘా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. చొరబాటుదారులతో పోరాటంతో ప్రాణత్యాగంచేసిన వీరులకు ‘స్వాహిద్ స్మారక్ క్షేత్ర’లో నివాళులరి్పంచారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు, సంఘ సంస్కర్త శ్రీమంత శంకర్‌దేవ్ ‘బతద్రవ థాన్’పుణ్యక్షేత్రంలో రూ.227 కోట్లతో పునరుద్ధరణ పనులను షా ప్రారంభించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపినాధ్ బోర్దోలాయ్, సంగీత సామ్రాట్ భూపెన్ హజారికా, యువ సంగీత తరంగం, దివంగత జుబెన్ గార్గ్, దిగ్గజ అహోం జనరల్ లాచిత్ బోర్ఫుకన్లకు షా నివాళులరి్పంచారు. తర్వాత బోర్డోవా పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రం నుంచి విదేశీ చొరబాటుదారులందరినీ మూకుమ్మడిగా తరిమికొట్టే సత్తా ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోండి. చొరబాటుదారులను అనుమతించని సర్కార్‌ను ఎన్నుకోండి. అస్సాం అభివృద్ధికి పాటుపడే నేతలకే పట్టంకట్టండి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి కాంగ్రెస్ రాష్ట్రంలోకి విదేశీయుల చొరబాట్లను ప్రోత్సహించింది. ఇప్పుడది అస్సాం అస్థిత్వం, గుర్తింపునకు ముప్పుగా పరిణమించింది’’అని షా అన్నారు. మరో ఛాన్స్ ఇవ్వండి ‘‘అస్సాంలో బీజేపీ ప్రభుత్వాల హయంలో గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. ఆ అభివృద్ధి సరిపోదు. శ్రీమంత సాధువు జని్మంచిన పుణ్యస్థలి నుంచి మీకు వాగ్దానం చేస్తున్నా. మరో ఐదేళ్లు పరిపాలించే అవకాశం ఇవ్వండి. అస్సాం నుంచి చొరబాటుదారులందరినీ వెనక్కి పంపేస్తాం. ఈ రాష్ట్రమేకాదు ప్రతి రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం. ప్రధాని మోదీ మీ సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించమేకాదు మీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారు’’అని షా అన్నారు. -
ప్రజలు కోరింది ఇవ్వకుంటే ఓట్లెలా వేస్తారు?
అహ్మదాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు ఓట్లెలా వేస్తారని రాహుల్‌ను ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ను రాహుల్‌కు అర్థమయ్యేలా చెప్పడం తనవల్ల కానిపని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలే ఆయనకు ఈ విషయం చెప్పలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్ నగర సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓ విషయం నన్నడిగారు..ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెసే ఎందుకు ఓటమిపాలవు తోంది అని. ప్రజలను అడగటానికి బదులుగా రాహుల్ ఈ ప్రశ్న నన్నడిగారు. రాహుల్ బాబా..! నేను ఇక్కడ ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలను అర్థం చేసుకుంటే, నీకు సమాధానం దొరుకుతుంది’అని అమిత్ షా అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలోనే కాదు, 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిపాలవుతుంది. మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందని రాహుల్ తెలుసుకుంటారని ఆయన అన్నారు. ‘మా సిద్ధాంతాలతో ప్రజలు మమేకమ య్యారు. ‘అయోధ్యలో ఆలయాన్ని, ఉగ్రవాదు లపై సర్జికల్ స్ట్రయిక్స్‌ను, ఆర్టికల్ 370 రద్దును, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను వెళ్లగొట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇలా ప్రజలు కోరుకునే వాటిని వ్యతిరేకిస్తూ పోతే ఆ పార్టీకి ప్రజలు ఓట్లెలా వేస్తారు’అని అమిత్ షా పేర్కొన్నారు. -
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఏటీఎస్.. యాంటీ టెర్రర్ గ్రిడ్
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్(అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్ గ్రిడ్‌ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జీరో టెర్రర్ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్ కాన్ఫరెన్స్–2025లో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్వర్క్ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. అటు తర్వాత, ఆ నెట్వర్క్ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్ క్రైం నెట్వర్క్ డేటాబేస్, వెపన్స్ డేటా బేస్ ఫర్ లాస్ట్, లూటెడ్ అండ్ రికవరీ ఆరŠమ్స్‌కు సంబంధించిన రెండు డేటాబేస్లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్లను కూడా రూపొందించాలని సూచించారు. -
సెమీ కండక్టర్ రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినా
గ్వాలియర్/రేవా: సెమీ కండక్టర్ రంగంలోకి మన దేశం కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బలోపేతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించి, ఎగుమతులను కూడా మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. గురువా రం గ్వాలియర్‌లో జరిగిన అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమిట్‌లో హోం మంత్రి మాట్లాడారు. కేవలం ఏడాది కాలంలోనే 4.57 లక్షల ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ)ల రిజిస్ట్రేషన్లను సాధించినందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. భౌగోళికంగా ఎంతో కీలకమైన, సారవంతమైన భూములున్న మధ్యప్రదేశ్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారు సైతం కోట్లాది రూపాయలు సంపాదించగలరన్నారు. ఇండోర్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు అక్కడ వేర్‌హౌస్‌లు, హబ్‌లు ఏర్పాటు చేసుకునేలా ఆహ్వానిస్తామని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రి అమిత్ షా రూ.2 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అటల్ జీ గొప్ప వక్త, సున్నిత భావాలున్న కవి, ప్రజాసంక్షేమానికే జీవితం అంకితం చేసిన నేత, రాజకీయాల్లో అజాతశత్రువు’అంటూ కొనియాడారు. సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయంమనకు వచ్చే ఎన్నో వ్యాధులకు రసాయన ఎరువులే మూల కారణమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అందుకే ప్రకృతి వ్యవసాయమే మేలన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులకు ఆదాయం కనీసం ఒకటిన్నర రెట్లు అధిక ఆదాయం వస్తుందని, నీరు ఆదా అవడంతోపాటు పరిశుద్ధమైన ఉత్పత్తులతో ప్రజారోగ్యానికి దోహదపడుతుందన్నారు. ఒకే ఒక్క దేశ వాళీ ఆవు మూత్రం, పేడను వినియోగించుకుంటూ 21 ఎకరాల్లో వ్యవసాయ చేయవచ్చన్నారు. రేవాలో జరిగిన రైతుల సదస్సులో మంత్రి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి ఉన్న అపారమైన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని రైతుల వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి మరింత మెరుగ్గా చేరుకునేలా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని షా చెప్పారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని, ఇవి రైతులకు అవసరమైన భూసార, విత్తన పరీక్షలను చేస్తాయన్నారు. -
చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉయికే (69) సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం కంధమాల్-గంజాం జిల్లా సరిహద్దులోని దట్టమైన రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)లతో కూడిన ఉమ్మడి భద్రతా దళంతో జరిగిన ఎన్‌కౌంటర్‌గణేష్ ఉయికేతో పాటు ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. గణేష్ ఉయికే మృతిని ధృవీకరించిరిన అమిత్‌షా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అంటూ హోం మంత్రి ట్వీట్ చేశారు. ‘‘నక్సల్ రహిత భారత్ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి"గా హోంమంత్రి అభివర్ణించారు. అటు ఇది మన దళాలకు చారిత్రాత్మక విజయం. రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న నాయకుడి నిర్మూలనతో ఈ ప్రాంతంలోని మావోయిస్టుల నడ్డి విరిచినట్టేనని ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వాన్ని మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేయాలనే తన లక్ష్యానికి దగ్గరి చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో జనరల్ సెక్రటరీ బసవరాజ్,నవంబర్‌లో కమాండర్ హిడ్మాలను మట్టు బెట్టడంతో కేంద్ర కమిటీ కుప్పకూలింది. అటు అగ్ర మావోయిస్టు నాయకులతోపాటు లొంగిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది.జిరామ్ ఘాటి మాస్టర్ మైండ్ 2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జిరామ్ ఘాటి మారణకాండ వెనుక గణేష్ ఉయికే ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరణించారు. అంతేకాదు అనేక హై ప్రొఫైల్ మావోయిస్టు దాడులలో ఆయనదే కీలక పాత్రం నమ్ముతారు. గతమూడేళ్లుగా గణేష్ ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, గెరిల్లా కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, మావోయిస్టు నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తున్నాడు. -
లొంగుబాటుకు దేవ్‌జీ షరతులు!
కోరుట్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లొంగుబాటు వ్యవహారంలో కొన్ని షరతుల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అందుకే దేవ్‌జీ లొంగుబాటులో తాత్సారం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ యంత్రాంగంతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా దేశాన్ని మావోయిస్టురహితంగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో దేవ్‌జీ లొంగుబాటు అంశం చర్చనీయాంశమైంది. కేంద్ర కమిటీ బలహీనం కావడంతో.. మావోయిస్టు పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన హిడ్మా సహా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1,800 మంది మావోయిస్టులు గత కొంతకాలంగా జరుగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్, ఎదురుకాల్పుల ఘటనల్లో మృతిచెందారు. దీనికితోడు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు సహా వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఫలితంగా మావోయిస్టు కేంద్ర కమిటీ బలహీనంగా మారింది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్‌జీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవ్‌జీ లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో మృతిచెందినా ఆపరేషన్ కగార్ ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల క్రితం దేవ్‌జీ అంగరక్షకులను పోలీసులు అరెస్టు చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని.. పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇప్పటికీ ఆయన లొంగుబాటు విషయంలో నెలకొన్న స్తబ్దత వీడటం లేదు. షరతులతో తాత్సారం? దేవ్‌జీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్లు ఇటీవల కాలంలో ప్రచారం సాగుతోంది. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాలతోపాటు జార్ఖండ్‌లోని తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి అంశాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఉద్యమంలో పనిచేసి జైలుశిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తు ఏమిటన్న అంశంపైనా చర్చించాలని దేవ్‌జీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షరతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రానందునే దేవ్‌జీ లొంగుబాటులో తాత్సారానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. అయితే డిమాండ్లన్నీ నెరవేరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు దేవ్ జీ లొంగిపోతారన్న ప్రచారం జరుగుతోంది. -
ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు
-
నౌకాశ్రయాలు, ఓడల భద్రతకు బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: దేశంలోని నౌకాశ్రయాల్లో మౌలికవనరుల భద్రత పెంపునకు కేంద్రం నడుం బిగించింది. బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ పేరిట చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. భద్రతాపరమైన అంశాల విశ్లేషణ, సమాచార సేకరణ, పోర్టులు, నౌకలకు సంబంధించిన భద్రతాపరమైన సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడం వంటి విధులను ఇది నిర్వర్తిస్తుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ(బీవోపీఎస్) నిర్మాణం తదితర విషయాలపై చర్చించేందుకు గురువారం హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో నౌకాశ్రయాలు, ఓడలు, జలరవాణా శాఖ మంత్రి శర్బందా సోనోవాల్, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు పాల్గొన్నారు. పటిష్టమైన నౌకాశ్రయ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. భద్రతా చర్యలను క్రమబద్ధంగా, ప్రమాద–ఆధారిత పద్ధతిలో అమలు చేయాలని అమిత్ షా ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలు,, వాణిజ్య సామర్థ్యం, భౌగోళిక ప్రాంతం, సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సముద్రప్రాంత భద్రతా వ్యవస్థ ద్వారా నేర్చుకున్న పాఠాలను విమానయాన భద్రతా రంగంలో కూడా అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) తరహాలో రూపొందించనున్న బీవోపీఎస్ విభాగం మర్చంట్ షిప్పింగ్ యాక్ట్–2025 ప్రకారం చట్టబద్ధమైన సంస్థగా పనిచేస్తుంది. ఇది ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. బీవోపీఎస్కు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తారు. నౌకలు, ఓడరేవుల్లో భద్రతా నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను ఈయన చూసుకుంటారు. ముందుగా ఒక ఏడాదిపాటు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ బీవోపీఎస్ డీజీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. బీవోపీఎస్ ఓడ రేవుల భద్రతా సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేíÙంచడం, సేకరించడం, పంచుకోవడం వంటి పనులను చేపడుతుంది. ముఖ్యంగా సైబర్ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఓడరేవుల్లోని ఐటీ మౌలిక వనరులను డిజిటల్ ముప్పు నుంచి రక్షిస్తుంది. దీనికోసం ఇందులోనే ఒక ప్రత్యేక విభాగం ఉంటుందని కేంద్రం ఆ ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో, నౌకాశ్రయాల భద్రతకు గుర్తింపుపొందిన భద్రతా సంస్థ (ఆర్‌ఎస్‌వో)గా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని (సీఐఎస్ఎఫ్)ను ఇటీవల కేంద్రం నియమించడం తెల్సిందే. ఓడరేవుల భద్రతలో పాలుపంచుకునే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు శిక్షణ ఇస్తాయి. కేవలం లైసెన్స్ పొందిన ఏజెన్సీలు మాత్రమే ఈ రంగంలో పనిచేసేలా తగిన నియంత్రణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. -
కేంద్ర హోంమంత్రి సాక్షిగా.. చంద్రబాబు బండారం బట్టబయలు
-
అయ్యో.. బాబో అన్నా.. పత్తాలేని ఏపీ పోలీస్
సాక్షి, అమరావతి: ‘ఇంటిపేరు కస్తూరి వారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. టెక్నాలజీకి తాను అంబాసిడర్‌నని, ఐటీ, ఏఐలను తానే కనిపెట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించే టోల్ ఫ్రీ నంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది.బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ఏపీ ప్రభుత్వం అసలు అందుబాటులోకి తేనేలేదన్నది తేటతెల్లమైంది. ఈ విషయాన్ని మరెవరో కాదు సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు ‘40 ఇయర్స్ ఇండస్డ్రీ’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఏమేం చేయాలో ఆయన చెప్పారు. ఇప్పటికైనా స్పందించండి అని అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 8న లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వ అసమర్థత జాతీయస్థాయిలో బట్టబయలైంది. మొద్దునిద్రలో ఏపీ పోలీస్ అయ్యా.. ఆపదలో ఉన్నాం. సహాయం చేయండి’ అని బాధితులు మొరపెట్టుకుంటుంటే.. ఏపీ పోలీసులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. చంద్రబాబు రెడ్‌బుక్ కక్షసాధింపు చర్యలకు కొమ్ముకాసే పనిలో బిజీగా ఉన్నాం.. సామాన్యుల బాధలను పట్టించుకోం అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఆపన్న హస్తం అందించడంలో ఏపీ పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన చేదు వాస్తవం ఇదీ. అగ్రస్థానంలో చండీగఢ్ పోలీసులు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసు, అగ్నిమాపక, ఇతర అత్యవసర సేవలను ఏకీకృత వ్యవస్థకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 112ను ప్రవేశపెట్టింది. ఆ నంబరుకు బాధితులు చేస్తున్న కాల్స్‌పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. దేశ వ్యాప్తంగా 112కు వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల సగటు స్పందన సమయం 18.28 నిమిషాలుగా ఉంది. అంటే బాధితుల నుంచి ఫోన్ కాల్ రాగానే 18.28 నిముషాల్లోనే పోలీసులు వారికి తగిన సహాయం అందించి రక్షణ కల్పిస్తున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో పోలీసుల సగటు స్పందన సమయం 25 నిమిషాలుగా ఉండేది. కేంద్ర హోంశాఖ సమర్థంగా పర్యవేక్షించిన తరువాత సగటు స్పందన సమయం 18.28 నిముషాలకు తగ్గింది. ఇక బాధితులకు తక్షణం సహాయం అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పోలీసులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. చండీగఢ్ పోలీసులు కేవలం 5.58 నిమిషాల్లోనే బాధితులకు రక్షణ కల్పిస్తుండటం విశేషం.’’ అని అమిత్‌షా లేఖలో పేర్కొన్నారు. మీరు వెనుకబడి ఉన్నారు.. ఇప్పటికైనా స్పందించండి పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడంలో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన లేఖలో ఏమాత్రం మొహమాటం లేకుండా ఎత్తిచూపారు. పోలీసు వ్యవస్థలోని లోపాలపై కుండబద్దలు కొట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ అత్యాధునిక విధానాన్ని తక్షణం అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం తదనుగుణంగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తద్వారా బహుళ సిగ్నల్స్, ఆర్టిఫీషియల్ / మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్డ్ ఫీచర్స్, డేటా ఎనలిటిక్స్, ఇంటర్ ఆపరేటరీ, స్టేట్ డేటా ఎక్స్చేంజ్ మొదలైన ఆధునాతన సాంకేతిక మౌలిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఈఆర్ఎస్ఎస్ 2.0 ఆపరేషన్ ప్రొసీజర్‌ను 21 రాష్ట్రాలు మాత్రమే ప్రవేశపెట్టాయని అమిత్ షా పేర్కొన్నారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో ఇప్పటివరకు ‘ఈఆర్ఎస్ఎస్ 2.ఓ’ ను ప్రవేశపెట్టనే లేదన్నది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 2026, మార్చి 31నాటికి ‘ఈఆర్ఎస్ఎస్ 2.0’ను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆ లేఖలో గుర్తు చేశారు కూడా. ఇక బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలనూ అమిత్ షా తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అమిత్‌షా చేసిన సూచనలు..» 112సేవలపై విస్తృత ప్రచారం కల్పించండి. » బాధితులకు 24/7 అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ వాహనాల సంఖ్య పెంచండి. » ఎమర్జెన్సీ వాహనాల్లో మొబైల్ డేటా టెర్మినల్స్(ఎండీటీ)లను ఏర్పాటు చేయండి. » 24 గంటలూ పనిచేసేలా తగినన్ని వర్క్ స్టేషన్లు, కాల్సెంటర్లను ఏర్పాటు చేయండి. » అత్యాధునిక సమాచార సాంకేతికత అందించే ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) లైన్లు తగినన్ని ఏర్పాటు చేయండి. » రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆస్పత్రుల జీఐఎస్ మ్యాప్‌లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. » డేటా ఇండికేటర్లను ఎప్పటికప్పుడు ఎన్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించండి. » సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్కంప్యూటింగ్( సిడాక్)తో కనెక్టివిటీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. » నేర, ఘటనాస్థలాలకు వీలైనంత త్వరగా వెళ్లే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురండి.బెడిసికొట్టిన సర్కారు కుతంత్రం.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు ఎస్పీల సమావేశంలో నానాపాట్లు పడింది. ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించడంలో సత్వరం స్పందిస్తున్నామని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఈ అత్యవసర సేవలు అందిస్తున్నామని ఆ నివేదికలో పేర్కొంది. కానీ, అత్యవసర సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులు దారుణంగా విఫలమవుతున్నారని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అత్యవసర సేవలు అందించేందుకు ఏకంగా 25.50 నిమిషాల సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారని ఆ లేఖలో ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ, 10 నిమిషాల్లోనే ఆ సేవలు అందిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం అవాస్తవ గణాంకాలను నివేదికలో పేర్కొని అడ్డంగా దొరికిపోయింది.వైఎస్సార్సీపీ హయాంలో భద్రతకు భరోసాతక్షణ అత్యవసర సేవలు పట్టణాల్లో 5 నిమిషాల్లోనే.. గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాల్లోనే.. ఆపదలో ఉన్నవారిని తక్షణం ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత సమర్థంగా వ్యవహరించింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 3 నిముషాల నుంచి 5 నిముషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణ కల్పించేవారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే గరిష్టంగా 8 నిÐషాల్లోనే పోలీసులు బాధితులకు అండగా నిలిచేవారు. హత్యలు, లైంగికదాడులు జరగకుండా నిరోధించేవారు. దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేవారు. బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేవారు. ఇక ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళల భద్రతకు పూర్తి భరోసానిచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్ వాహనాలు, దిశ క్రైమ్ డిటెక్షన్ వాహనాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు.. ఇలా అధునాతన వ్యవస్థను నెలకొల్పి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే దిశ యాప్ జాతీయ స్థాయిలో ఏకంగా 22 అవార్డులను గెలుచుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, పల్పింమ బెంగాల్ తదితర రాష్ట్రాల పోలీసు బృందాలు ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటించి దిశ యాప్ పనితీరును, ఇక్కడి పోలీసులు చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నాయి. ఈ తరహా యాప్‌లనే ఆ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి. -
నక్సలిజం సాధించిందేమీ లేదు!
రాయపూర్: నక్సలిజం నల్లతాచు పడగనీడ కారణంగా దేశంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ఆయన ప్రతిజ్ఞచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కేంద్రం జగ్దల్పూర్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జరిగిన బస్తర్ ఒలింపిక్–2025 క్రీడోత్సవ ముగింపు వేడుకలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ‘‘ఆయుధం చేతబట్టిన నక్సలైట్లు నక్సలిజం పేరుతో సాధించింది ఏమీ లేదు. నక్సలిజం అనేది ఇటు సాయుధులకు ఉపయోగపడలేదు. అటు గిరిజనులకూ అక్కరకు రాలేదు. సాయుధ భద్రతాబలగాలకూ ఎలాంటి ప్రయోజనంలేని పనికిమాలిన పనిగా నక్సలిజం తయారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీలోపు దేశంలో నక్సలిజంను అంతం చేస్తాం. ఏడు జిల్లాల సమాహారంగా ఉన్న బస్తర్ రీజియన్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుదాం. ఇకనైనా సీపీఐ(మావోయిస్ట్) ఉద్యమకారులు ఆయుధాలు విడనాడి సమాజ ప్రధాన స్రవంతితో కలిసి నడవాలి. దారితప్పిన యువతను పునరావాస పథకం ద్వారా మళ్లీ గాడినపెడతాం. గౌరవప్రద జీవితం గడిపే అవకాశం కల్పిస్తాం. ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడాలంటే ఒక్క శాంతితోనే సాధ్యం. బస్తర్ ఒలింపిక్–2024 చూడ్డానికి వచ్చా. ఈసారి కూడా బస్తర్ ఒలింపిక్–2025 వీక్షించేందుకు విచ్చేశా. వచ్చే ఏడాది బస్తర్ ఒలింపిక్–2026 చూడ్డానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమేకాదు యావత్ భారతావని నుంచి దానిని తరిమేస్తాం. 2026 మార్చి 31కల్లా దేశవ్యాప్తంగా ఎరుపు ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఇది త్వరలో సిద్ధించనుంది. నక్సలిజాన్ని రూపుమాపడమే మా పనికాదు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధే మా కర్తవ్యం. నక్సలిజం శకం ముగిసి నూతన అభివృద్ధి శకం త్వరలో ఆరంభమవుతుంది’’అని అమిత్ వ్యాఖ్యానించారు. మరో ఐదేళ్లలో అద్భుతాభివృద్ధి ‘‘బస్తర్ రీజియన్‌లో కాంకేర్, కొండగావ్, బస్తర్, సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతేవాడ జి ల్లాలున్నాయి. వెనుకబడిన ఈ 7 గిరిజన జిల్లాలను వచ్చే ఐదేళ్లలో అంటే 2030 డిసెంబర్‌కల్లా దేశంలోనే అత్యంత అభివృద్ధిబాటలో పయనించిన జిల్లాలుగా మార్చేస్తా. ఛత్తీస్‌గఢ్‌తోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఈ ఏడు జిల్లాల కోసం శతథా కృషిచేస్తాయి. అర్హులకు ఇళ్లతోపాటు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంటగ్యాస్ కనెక్షన్, ఐదు కేజీల ఉచిత రేషన్ బియ్యం, ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాది రూ.5లక్షల దాకా ఉచితవైద్య సదుపాయం కల్పిస్తాం. ఏడు జిల్లాల మధ్య రహదారుల ద్వారా అనుసంధానతను పెంచుతాం. విద్యుత్ స్తంభాలు వేయించి అందరి ఇళ్లలో విద్యుత్ వెలుగుల్ని ప్రసరింపజేస్తాం’’అని అన్నారు. ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం ‘‘ప్రతి ఒక్క గిరిజన గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల పటిష్ట నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తాం. అటవీ ఉత్పత్తులను శుద్ధిపరిచే కర్మాగారాలను సహకారసంఘాల సహకారంతో నెలకొల్పుతాం. ఇతర గిరిజన జిల్లాలతో పోలిస్తే అత్యధిక పాల ఉత్పత్తికేంద్రాలుగా ఈ ఏడు జిల్లాలను తీర్చిదిద్దుతాం. పాడి, కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఇక్కడి రైతుల కుటుంబాదాయాన్ని రెట్టింపుచేస్తాం’’అని అన్నారు. కొత్త పరిశ్రమలను తీసుకొస్తాం ‘‘నూతన పరిశ్రమలను ఈ జిల్లాలకు తీసుకొస్తాం. ఉన్నత విద్యా కేంద్రాలను నెలకొల్పుతాం. దేశంలోనే అత్యుత్తమమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తాం. బస్తర్ పట్టణంలో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిని కడతాం. గిరిజన ప్రాంతాలను పట్టిపీడిస్తున్న పోషకాహార లోప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త పథకాన్ని తీసుకొస్తాం. మావోయిస్టుల హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారికి, లొంగిపోయిన మావోయిస్టుల కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం’’అని అన్నారు.అప్పుడు రణగొణలు.. ఇప్పుడు గణగణలు ‘‘ఒకప్పుడు నక్సలైట్ల మందుపాతరల పేల్చివేతలు, బుల్లెట్ల మోత, రణగొణలే వినిపించేవి. ఇప్పుడు రుధిర దారుల్లో విద్యాసుమాలు వెల్లివిరుస్తున్నాయి. విద్యాలయాలను నిర్మించాం. అందుకే నాటి రణగొణలు పోయి ఇప్పుడు బడిగంటల గణగణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అనేది సుదూర స్వప్నంగా మారిన ఈ ప్రాంతంలో కొత్తగా రోడ్లు, రైల్వేలు, హైవేలు తీసుకొస్తున్నాం. అప్పట్లో ఇక్కడ లాల్ సలామ్ అనే నినాదమే వినిపించేది. ఇప్పుడంతా భారత్ మాతా కీ జై నినాదమే మార్మోగిపోతోంది. బస్తర్ అభివృద్ధికి మేమంతా కట్టుబడ్డాం. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీప్రభుత్వం కొలువుతీరాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని కూకటివేళ్లలో పెకిలించడం మొదలెట్టాయి. అందుకే ఎన్నో పరస్పర కాల్పుల ఘటనలు జరిగాయి. చాలా మంది నక్సలైట్లు చనిపోయారు. ఆ భయంతోనే గత రెండేళ్లలో ఏకంగా 2,000 మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు’’అని అమిత్ షా అన్నారు. -
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
-
ఓట్ చోరీ.. అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు: రాహుల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాస్త ఒత్తిడితో కనిపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ విషయంలో తాను సవాల్ విసిరినా అమిత్ షా ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ..‘ఓటు చోరీ అంశంపై నేను ఇప్పటికే మూడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు సవాల్ విసిరాను. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. నిన్న అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. ఆయన చేతులు వణికాయి. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న అందరూ చూశారు.నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఎలాంటి రుజువు ఇవ్వలేదు. పార్లమెంట్లో నా మీడియా సమావేశాల్లోని అన్ని అంశాల గురించి చర్చించడానికి నేరుగా క్షేత్రస్థాయికి రావాలని నేను అమిత్ షాకు సవాలు విసిరాను. నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అందరికీ వాస్తవమేంటో తెలుసు అని ఆరోపించారు. దీంతో, రాహుల్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. -
అమిత్ షా, రాహుల్ మాటల యుద్ధం
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. నా ప్రశ్నకు సమాధానమేది?ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘సర్’ను గబ్బర్‌సింగ్‌లా మార్చారు ‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్‌సింగ్‌లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్‌కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్‌లో గెలిచిందేమో గానీ బిహార్‌లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ – శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి ‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’ – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్ఐఆర్ అంటే బ్యాక్‌డోర్ ఎన్ఆర్సీ ‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి మరో రూపమే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’ – కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ మళ్లీ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా? ‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’ – రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి -
చొరబాటుదారుల ఓట్ల కోసమే!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ అమిత్ షా కొట్టిపారేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే.. తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో నెగ్గే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఆ పార్టీ నాయకత్వమే తప్ప ఈవీంఎలు లేదా ఓట్ల చోరీ కారణం కాదని తేల్చిచెప్పారు. దేశంలో ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో కొనసాగించడానికే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎంతగా వ్యతిరేకించినా, సభ నుంచి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా సరే చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించినవారికి ఓటు హక్కు ఇవ్వాలనడం న్యా యమేనా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులను అధికారికంగా గుర్తించి, ఎన్నికల జాబితాలో చేర్చాలంటూ నిస్సిగ్గుగా వాదిస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది ‘‘దేశంలో మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 28 మంది ఆయనకు మద్దతిచ్చారు. నెహ్రూకు కేవలం ఇద్దరే మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. అయినా సరే ఆమె ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఓట్ల చోరీ. ఇక సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఎన్నికల్లో ఓటు వేశారు. అలా చేయడం ఓటు చోరీ కాదా? విపక్ష నాయకులు కేసుల్లో ఓడిపోతే న్యాయమూర్తిని నిందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నిందలేస్తున్నారు. ఆ నిందలను జనం పట్టించుకోకపోతే ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. బిహార్‌లో కాంగ్రెస్ పరాజయానికి ముమ్మాటికీ ఆ పార్టీ నాయకత్వమే కారణం. ఈవీఎంలు లేదా ఓట్ల చోరీ కారణం అనడం ఉత్తమాట. కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒకరు ఆ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి మృతి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 18 ఏళ్ల వయసున్నవారిని చేర్చడం, విదేశీయులను తొలగించడం ఎస్ఐఆర్ అసలు ఉద్దేశం. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటూ కేకలు పెట్టారు. చొరబాటుదారులను కాపాడాలంటూ యాత్రలు చేశారు. చివరికి బిహార్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో మేమే గెలిచాం. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఓటర్ల జాబితాను తప్పుపట్టడం, ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశాయి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ. అయినా సరే ఏనాడూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టలేదు. ఈవీఎంలతో ఎన్నికల చోరీని అడ్డుకోవచ్చు. తప్పుడు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే విపక్షాలు ఈవీఎంలు వద్దంటున్నాయి. వారి బండారం పూర్తిగా బయటపడింది. దేశ ప్రజలు ప్రతిపక్షాలకు ఓట్లు వేయడం లేదు. ఎస్ఐఆర్తో చొరబాటుదారుల ఓట్లు కూడా రద్దయితే ఇక పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. 2004, 2009లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా! 2014లో ఓడిపోయిన తర్వాతే ఈవీఎంలపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించకుండా మేము పారిపోవడం లేదు. ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. అందుకే సభలో చర్చించలేం. ఎన్నికల సంస్కరణలపై చర్చించాలని కోరితే వెంటనే అంగీకరించాం. ఎస్ఐఆర్పై ఏకపక్షంగా అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలి’’ అని అమిత్ షా తేల్చిచెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఐఆర్ ప్రారంభం ఎస్ఐఆర్ గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చొరబాటుదారులు మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఎన్నుకొనే పరిస్థితి ఉంటే దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుందా? ఈ విషయం అందరూ ఆలోచించాలి. చరిత్ర గురించి మేము మాట్లాడడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. చరిత్ర తెలుసుకోకుండా సమాజం గానీ, దేశం గానీ ఎలా ముందుకెళ్తాయి. దేశంలో మొట్టమొదటి ఎస్ఐఆర్ను 1952లో నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. రెండోసారి 1957లో నెహ్రూ హయాంలో, మూడోసారి 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో, ఇందిరా గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, పీవీ నరసింహారావు హయాంలో కూడా ఎస్ఐఆర్ చేపట్టారు. అనంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనలో, మన్మోహన్ సింగ్ పాలనలోనూ ఎస్ఐఆర్ జరిగింది. అప్పట్లో ఎస్ఐఆర్ను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎస్ఐఆర్ అవసరం కాబట్టి వ్యతిరేకించలేదు. -
లోక్ సభలో అమిత్ షా స్పీచ్
-
నెహ్రూ, ఇందిర, సోనియానే ఓట్ చోరీ చేశారు
సాక్షి, ఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చకు అమిత్ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు. -
వందేమాతరంను విభజించడం వల్లే దేశం ముక్కలు
న్యూఢిల్లీ: వందేమాతర గీతానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాంగ్రెస్ రక్తంలోనే ఉందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని బుజ్జగింపు రాజకీయాల కోసం రెండుగా విడగొట్టడమే దేశ విభజనకు కారణమైందని, లేకుంటే దేశం ముక్కలై ఉండేది కాదని వ్యాఖ్యానించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభలో మంగళవారం చేపట్టిన చర్చను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 1937లో జవహర్లాల్ నెహ్రూ ఈ గీతాన్ని రెండు ముక్కలుగా చేసి, కేవలం రెండు చరణాలకే పరిమితం చేశారన్నారు.బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆయన అలా చేసినట్లు చాలా మంది భావించారని, వందేమాతరంను రెండుగా విభజించకుంటే దేశం ముక్కలయ్యేది కాదని కూడా అనుకున్నారని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ అలాంటి రాజకీయాలు చేస్తోందన్నారు. వందేమాతర గీతం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించిందన్నారు. జాతీయ గీతాన్ని త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలతో ప్రతిపక్షం ముడిపెట్టడాన్ని ఆయన నిరసించారు. దేశ సాంస్కృతిక జాతీయవాదాన్ని మేలుకొల్పిన మంత్రం వందేమాతరమని ఆయన చెప్పారు.స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆ గీతం ఎలాంటి ప్రముఖ పాత్ర పోషించిందో నేటికీ ఆ గీతానికి అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. భవిష్యత్ వికసిత్ భారత్‌కు కూడా వందేమాతరం ఎంతో అవసరమైందని చెప్పారు. ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే వందేమాతరంపై ప్రభుత్వం చర్చకు పెట్టిందని చాలా మంది కాంగ్రెస్ సభ్యులు అనుకుంటున్నారన్న ఆయన.. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం ఎన్నడూ భయపడలేదన్నారు. పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయకుండా, సరిగ్గా కార్యకలాపాలు జరగనిస్తే అన్ని అంశాలపైనా చర్చకు అవకాశమేర్పడుతుందని అమిత్ షా తెలిపారు.


