కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. తాను మే 2020 నుంచి ఇప్పటివరకు తన జీవనశైలిలో భారీ మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా మధుమేహం సమస్య నుంచి బయటపడ్డానన్నారు. తాను గతంలో షుగర్ వ్యాధితో బాధపడ్డానని, అందుకోసం అధిక మొత్తంలో మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి విముక్తి పొందాలని అనుకున్నాని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించి..బరువు తగ్గడమే గాక మధుమేహం సమస్యను అధిగమించానన్నారు. అందుకోసం తాను ఏం చేశానో, అలాగే యువత ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారో తదితరాల గురించి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు అమిత్‌షా. అవేంటంటే..
అమిత్ షా ఆరోగ్య అనుభవంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన ఫిట్‌నెస్ జర్నీ గురించి గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. గతంలో తాను మధుమేహంతో బాధపడ్డానని, మే 2020లో ఎలాగైన ఈ సమస్యను అధిగమించాలనే కృతనిశ్చయంతో భారీ మార్పులు చేశానని అన్నారు.
అందుకోసం తాను తగినంత నీళ్లు తాగడం, వేళకు భోజనం, క్రమం తప్పని వ్యాయామాలు చేసేలా కేర్ తీసుకున్నానన్నారు. అవి తనకెంతో మేలు చేస్తాయన్నారు. అన్నింటికంటే నిలకడగా ఆ అలవాట్లను భాగం చేసుకుంటే మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పైగా తనకు మందులపై ఆధారపడటం నుంచి విముక్తి లభించిందని చెప్పారు. ఆ జీవనశైలి మార్పులను అవలంభించి ఇవాల్టికి ఐదేళ్లవుతుందని, పైగా 20 కిలోల బరువు కూడా తగ్గానన్నారు.
ముఖ్యంగా తాను వాడే అల్లోపతి మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి బయటపడ్డానన్నారు. ఈ ప్రయోజనాలు శారీరక ఆరోగ్యానికి మించినవని అన్నారు. అంతేగాదు తన జీవనశైలిలో మార్పులు తన మానసిక చురుకుదనాన్ని, పని సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయన్నారు. ముఖ్యంగా పనిచేసే, ఆలోచించే విధానంలో మంచి మార్పుని తీసుకువచ్చిన చక్కటి నిర్ణయాలు తీసుకునేలా మెరుగుపరిచిందన్నారు.
యువతకు సందేశం..
తన అనుభవం ఫ్యాడ్ డైట్‌లు, తక్షణ పరిష్కారాల కంటే రోజువారి స్థిరమైన అలవాట్లు ఎంతటి గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయనేది చెబుతోందన్నారు. అందువల్ల యువత తమ ఆరోగ్యం కోసం వారే శ్రద్ధ తీసుకోవాలని కోరారు. శారీరక శ్రమకు, విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలని నొక్కి చెప్పారు.
దాంతోపాటు రోజుకు రెండు గంటల వ్యాయాయమం, బ్రెయిన్‌కి ఆరుగంటల నిద్ర కేటాయించమని కోరారు. తగినంత నిద్ర శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మెరుగైన ఏకాగ్రత, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి దోహదపడుతుందని చెప్పారు.
#WATCH | Delhi: At the event organised by ILBS (Institute of Liver and Biliary Sciences) on World Liver Day, Union Home Minister Amit Shah says, "... I made a huge change in my life since May 2020 till today. The required amount of sleep, water and diet, and routine exercise has… pic.twitter.com/HxDZgv0YGh
— ANI (@ANI) April 19, 2025
(చదవండి: weight loss: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..)


