పార్లమెంటులో ..33 కాదు 50 శాతం రిజర్వేషన్‌ | Amit Shah challenges opposition parties | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో ..33 కాదు 50 శాతం రిజర్వేషన్‌

Apr 17 2026 7:10 PM | Updated on Jul 2 2026 1:21 PM

Amit Shah challenges opposition parties

పార్లమెంట్‌ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలతో వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఛాలెంజ్‌ విసిరారు.. కాంగ్రెస్ ‍నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్‌ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు.

అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు.డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ వేసిన ట్రాఫ్‌లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ బీజేపీ చేసిన ప్రతి సంస్కరణకు అడ్డు తలిగిందన్నారు త్రిపుల్‌ తలాక్‌ను అడ్డుకుందని రామమందిరం నిర్మాణానికి ఆటంకం కలిగించిందని అన్నారు. దళిత మహిళను రాష్ట్రపతి చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందన్నారు. 

మహిళా రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్‌ పార్టీ మద్దతివ్వకుంటే వీగిపోతుందని వీరిని దేశంలోని మహిళలంతా గమనిస్తున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు లోక్‌సభలో గొడవ చేసి  బతికిపోవచ్చుగానీ ప్రజాక్షేత్రంలో  మహిళల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement