Womens reservation bill
-
50 శాతం ఫార్ములాతో దక్షిణాదికి మేలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా 1996 సెప్టెంబర్ 13న మహిళా ఎంపీలందరూ పార్టీలకతీతంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఏకతాటిపైకి వచ్చారు. లోక్‌సభలో ఈ విషయంపై గళమెత్తారు. మహిళా బిల్లును జాయింట్ కమిటీకి పంపడంపై దివంగత నేత సుష్మా స్వరాజ్ ‘దేశ మహిళలపై జరిగిన భారీ కుట్ర’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లును జాయింట్ కమిటీకి పంపి వెంటనే లోక్ సభను రద్దు చేశారు. దీంతో మళ్లీ మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి 27 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం 2023లో ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లు తీసుకొచ్చింది. 2034 నాటికి రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉండగా, 2029 నాటికే మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ, స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50%గా ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి, డీలిమిటేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం చేజారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఈ రెండు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినవి. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరచడం– ఇవి రెండూ దేశ భవిష్యత్తును నిర్ధారించే కీలకమైన అంశాలు.దాదాపు 3 దశాబ్దాలుగా ఈ బిల్లును తీసుకురావాలని, మహిళా లోకానికి సాధికారత కల్పించాలని చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు దీన్ని అడ్డుకున్నాయి. 1996లో దేవేగౌడ హయాంలో... ఆ తర్వాత 1998, 1999, 2002లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది. ఎన్డీయే ఒత్తిడితో యూపీఏ హయాంలో 2008–10 మధ్యలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా, తమ మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనవసర దుష్ప్రచారండీలిమిటేషన్పై చర్చలు మొదలైనప్పటినుంచే, విపక్షాలు దక్షిణాదిపై ఎక్కడలేని ధృతరాష్ట్ర ప్రేమను కురిపించాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్ ఆడిన ఈ నాటకానికి డీఎంకే, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు వంతపాడాయి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమని ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్పినా దుష్ప్రచారం ఆగలేదు.అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచేందుకు తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 సీట్లు 50% పెరిగి 195 సీట్లకు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 26కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరిగేందుకు వీలుండేది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెంచేలా మోదీ సర్కారు సరికొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ద్వారా దక్షిణాది సీట్లకు ‘జనాభా ప్రాతిపదికన’ నష్టం జరగకుండా, ఆ మాటకొస్తే ప్రత్యేకమైన లాభం జరిగేలా ఈ ఫార్ములా మేలు చేకూర్చేది. దీనివల్ల ఆ యా పార్టీలకు ఏం ఒరిగిందో తెలియదు కానీ... 70 కోట్ల మంది మహిళలకు, 30 కోట్ల మంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచే అవకాశాన్ని కూడా కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు దెబ్బకొట్టాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఎస్సీలకు 21 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు రిజర్వేషన్లుండగా... 50% సీట్లను పెంచితే, ఎస్సీలకు 32 స్థానాలు, ఎస్టీలకు 8 స్థానాలు దక్కేందుకు వీలుండేది. అలాచేస్తే దక్షిణాదికి నష్టంమహిళా బిల్లు విషయంలోనే కాదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాల విషయాల్లోనూ కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు, ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిసినా వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి దేశ సమగ్రతను బలపరిచే ప్రయత్నం చేసినప్పుడూ వ్యతిరేకించింది. రైతుల అభివృద్ధి కోసం తెచ్చిన సంస్కరణలను రాజకీయ కారణాలతో వ్యతిరేకించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థంలేని కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. దీని ప్రకారం... తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15కు తగ్గుతాయి. ఇది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం. రేవంత్ రెడ్డి ఫార్ములా ప్రకారం తెలంగాణే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాకుండా, ఈ ఫార్ములా ప్రకారం... ఏపీ 16 సీట్లు, తెలంగాణ 11 సీట్లు, కర్ణాటక 16 సీట్లు, కేరళ 16 సీట్లు, తమిళనాడు 27 సీట్లు... ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు 86 సీట్లు నష్టపోనున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చైతన్యవంతులు. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది. మహిళల గౌరవం, దేశ సమగ్రత, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. జి.కిషన్ రెడ్డివ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి -
బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నందుకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’(జన ఆక్రోష్ పాదయాత్ర) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోపాటు ’ఇండి’ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ యాత్ర సాగింది. కాంగ్రెస్ కొన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటోందంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజీ వద్ద నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని పాదయాత్రగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు. ఈ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మహిళా నేతలు బంగారు శ్రుతి, బండారు విజయలక్ష్మీ, జూటూరు కీర్తిరెడ్డి, ప్రభాగౌడ్, జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు, బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముందుండి నడిచారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొని మహిళా లోకానికి సంఘీభావాన్ని ప్రకటించారు. బీజేపీ మహిళా మోర్చా, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించారు. పల్లెపల్లెనా ఎండగట్టాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై అడ్డుకోవడం ఆ పార్టీల మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని పల్లె పల్లెనా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు , మహిళా సంఘాలు ఏకమై కాంగ్రెస్ కపట బుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాం«దీ, రేవంత్ రెడ్డితోపాటు మిత్రపక్షాల నేతలు స్టాలిన్, అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రేవంత్... మహిళాద్రోహి : బండి సంజయ్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు వారికిచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్‌ను గద్దె దించాలన్నారు. రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులు: రాంచందర్‌రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ.. ఈ అంశాన్ని ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకు వస్తోందన్నారు. -
మహిళా రిజర్వేషన్లకు సరికొత్త ‘మార్గం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలకమైన ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల’ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో పార్లమెంట్లో ఎదురైన సాంకేతిక, రాజ్యాంగపరమైన ఆటంకాలను అధిగమిస్తూ, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సరికొత్త రూపం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, న్యాయస్థానాల్లో నిలబడేలా పటిష్టమైన సవరణలతో బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏమిటా కొత్త వ్యూహం? ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు గట్టెక్కాలంటే అదే పాత పద్ధతిలో కాకుండా ‘ప్రత్యామ్నాయ మార్గాల’ను అన్వేషించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతోంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని భవిష్యత్తులో ఎవరూ కోర్టులో సవాల్ చేయకుండా, చేసినా అది వీగిపోకుండా ఉండేలా రాజ్యాంగబద్ధమైన లోపాలను సరిదిద్దడంపై దృష్టి పెట్టింది. గతంలో బిల్లు నిలిచిపోవడానికి కారణమైన వివాదాస్పద అంశాలపై చర్చలు జరపకుండానే, ఒక మధ్యేమార్గం ద్వారా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసేలా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా వారికి లబ్ధి చేకూరేలా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. న్యాయ సలహాలు తీసుకోవడంతోపాటు ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని బిల్లులో సవరణలు చేయబోతున్నారు. కోర్టులో గతంలో ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేసి లోపాలు లేని ముసాయిదా రూపొందించబోతున్నారు. నిపుణుల కమిటీ కసరత్తు మహిళా రిజర్వేషన్ల విషయంలో సీనియర్ న్యాయ సలహాదారులు ప్రస్తుతం సవరణల ముసాయిదాపై తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ప్రభుత్వ సంకల్పం చెక్కుచెదరలేదని, ఈ విషయంలో చట్టపరమైన చిక్కులు రాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నామని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని అధికార పక్షం చెబుతోంది. మొత్తానికి శాసన, పరిపాలన వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
సాక్షి, చెన్నై: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒక గొప్ప ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విద్వేష, నీచ రాజకీయాల వల్ల ఆ బిల్లు పట్టాలు తప్పిందని అన్నారు. అధికారం కేవలం తమ కుటుంబాల చేతుల్లోనే ఉండాలన్న స్వార్థంతోనే విపక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, బిల్లు క్రెడిట్‌ను ప్రతిపక్షాలే తీసుకోవాలంటూ వ్యక్తిగతంగా అభ్యర్థించానని చెప్పారు. అయినా సరే విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. సాధారణ కుటుంబాల్లో జన్మింంచిన ఆడబిడ్డలు అత్యున్నత చట్టసభలకు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ గొప్ప ప్రయత్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలే అందుకు కారణమని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే సామాన్య కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమిళ మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలు అయ్యేవారని.. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడుకు లోక్‌సభలో మరెన్నో సీట్లు వచ్చేవని తెలిపారు. కానీ, ఇదంతా జరగడం డీఎంకేకు ఇష్టం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. -
బాధాకరమే.. పరాజయం కాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి తాము చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ ఆడ్డుకుందని విమర్శించారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు వారి న్యాయమైన హక్కును కల్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. కిరణ్ రిజిజు శనివారం మీడియాతో మాట్లాడారు. బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమే అయినప్పటికీ దీన్ని తాము పరాజయంగా భావించడం లేదన్నారు.మహిళల హక్కులను హరించివేసిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోందని, అందుకు మహిళలు ఆ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు హక్కులను దూరం చేసి, అది విజయంగా భావించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వం బట్టబయలైందని, అది ఆ పార్టీకి ఒక నల్ల మచ్చ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల మనోభావాలను కాంగ్రెస్ గాయపర్చిందని మండిపడ్డారు. దేశంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, వారికి సాధికారత కల్పించాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మహిళల బాగు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని బలవంతం చేయలేం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రభుత్వం, అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించాయని.. చివరకు సఫలం కాలేకపోయాయని కిరణ్ రిజిజు చెప్పారు. ఒక బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్రతిపక్షాన్ని భౌతికంగా బలవంతం చేయలేమన్నారు. పార్లమెంట్లో బిల్లులపై ఓటింగ్ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని తెలిపారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. లోక్‌సభ ఉత్పాతకత 93 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 110గా నమోదైందని అన్నారు. -
ఎన్డీయేతో పొత్తు.. కాంగ్రెస్‌తో గమ్మత్తు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముసుగు రాజకీ యం మరోసారి చర్చనీయాంశమైంది. అవసరానికి తగ్గట్లుగా ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆరితేరిన ఆయన ఇప్పుడు ఎన్డీయేతో పొత్తులో ఉండి తెరచాటున కాంగ్రెస్‌తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో లోపాయకారీగా మంతనాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, నేతలతో కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన ఓ మంత్రి ఆహ్వానం మేరకు ఎన్డీయే ఇచ్చిన విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దీన్నిబట్టి సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఉంటూనే రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో గుట్టుగా దోస్తీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో రహస్య స్నేహం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 2024 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు కాంగ్రెస్‌కి అనుకూలంగా వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి తెరచాటున విశ్వప్రయత్నాలు చేసినట్లు బయటపడింది. ఏపీలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. బయటకు మాత్రం ఎన్డీయేతో పొత్టు పెట్టుకుని అవసరాన్ని బట్టి మాత్రం కాంగ్రెస్‌తో సంబంధాలు నెరిపారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంతో టీడీపీ మంత్రులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడం బహిరంగ రహస్యమే. వారు తరచూ ఆయనతో విందు భేటీల్లో పాల్గొంటున్నట్లు బహిరంగ రహస్యం. చంద్రబాబు కూడా రేవంత్‌కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను కోరిన మీదటే చంద్రబాబు నిలిపివేసినట్లు స్వయంగా రేవంత్‌రెడ్డి అక్కడి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్నిబట్టే చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అప్పట్లో తేటతెల్లమైంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ ఆయన ఎన్డీయేలో ఉండి తెరవెనుక కాంగ్రెస్‌తో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. 2011లో చీకట్లో చిదంబరాన్ని కలిసిన బాబు..మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు కాంగ్రెస్‌తో రహస్య బంధం కొనసాగించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన తన రాజకీయ అవసరాల కోసం రాత్రి వేళ అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన యూపీఏ ప్రభుత్వంతో లోపాయకారీగా పలు వ్యవహారాలు నడిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు అన్ని విధాలా సహకరించారు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోయేందుకు సహకరించి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టారు. 2011–2013 మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో తెరచాటున కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజనలోనూ కాంగ్రెస్‌తో స్నేహం..ఆ సమయంలోనే ఆంధ్రా ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగేలా రాష్ట్ర విభజన జరుగుతున్నా చంద్రబాబు కాంగ్రెస్‌కే అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుని తన అవకాశవాదాన్ని చాటుకున్నారు. ఇక 20014–19 మధ్య కూడా ఎన్డీయేతో పొత్తులో ఉండి కాంగ్రెస్‌తో రహస్యం బంధాన్ని కొనసాగించారు. 2018లో ఆ ముసుగును తీసేసి ఎన్డీయే నుంచి బయటకొచ్చి యూపీఏతో స్నేహం చేశారు. అదే ఏడాది తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో యూపీఏతో అవగాహన కుదుర్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే యూపీఏను వదిలేసి ఎన్డీయేకి జైకొట్టారు...ఇలా తన రాజకీయ అవసరాన్ని బట్టి రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లింది. ఇదే క్రమంలో తాజాగా ఎన్డీయేతో కలిసి ఉంటూనే బీజేపీకి అనుకూలంగా అన్నీ చేస్తున్నట్లు నటిస్తూ తెర వెనుక మాత్రం కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్, పునర్వీభజన బిల్లులను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కేంద్రాన్నో, బీజేపీనో కాంగ్రెస్ ఓడించలేదని, 70 కోట్ల మంది మహిళలను ఓడించిందని చెప్పారు.మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం చూసేందుకే రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి ఈ బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా చేయడం కొత్తేమీ కాదని, గతంలో ఏడుసార్లు కుట్రలు చేసి మహిళా బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. దేవెగౌడ, వాజ్‌పేయి ప్రభుత్వాల హయాంలో బిల్లు పేపర్లు చించి స్పీకర్, ప్రధానిపై వేశారని, మన్మోహన్సింగ్ హయాంలో మిత్రపక్షాలను ఉసిగొల్పి అడ్డుకునేలా నాటకాలాడారని మండిపడ్డారు. దక్షిణాదికి తీరని ద్రోహం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మొన్నటిదాకా గగ్గోలు పెట్టిన విపక్షాలు, ఇప్పుడు సీట్లు పెంచుకునే అవకాశం వస్తే అడ్డుకోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా తెలంగాణలో ఎంపీ స్థానాలను 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ స్థానాలను పెంచే ప్రయత్నం చేసిందని అన్నారు.ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చినందుకు రాహుల్‌గాంధీ 30 కోట్ల మంది దక్షిణాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనికులు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్లను మాయాజాలంగా అభివర్ణించడం ద్వారా 140 కోట్ల మంది ప్రజలను, సైనికులను రాహుల్ అవమానించారన్నారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా చేశారా అని ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీని, తెలంగాణను పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీని లేదా మహిళను సీఎం చేసిందా? అని నిలదీశారు. -
ఎక్కాల్సిన రైలు ఎప్పుడొస్తుంది?
131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రతిపాదించిందని ప్రతిపక్షం ఆరోపించింది. నిజమే కావచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనతో కలిపేయడం వెనుక రాజకీయ కుట్ర దాగున్నదని ప్రతిపక్షం విమర్శించింది. ఇది కూడా నిజమే కావచ్చు. నియోజకవర్గాల పెంపును అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో పెంచుతామని ప్రధాని ఇచ్చిన హామీ బిల్లులో లేకపోవడం మోసపూరిత చర్యగా విపక్షం అభివర్ణించింది. అలా అనుమానించడంలో కూడా తప్పు లేదు. కనుక రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందివ్వకుండా అది వీగిపోయేలా చేసింది. అయితే బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్షం సాధించిన ఘనకార్యమేమిటన్నదే అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోతున్నది.మన దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా సందర్భాల్లో పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటూ తమ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులుగా పురుషులతో సమానస్థాయిలో రాణించగలుగుతున్నారు. చారిత్రక కారణాల వలన ఆర్థిక స్వాతంత్య్రంలో గానీ, వనరుల అజమాయిషీలో గానీ పురుషులతో పోలిస్తే వారు పోటీ పడలేరు. విస్తృత ప్రజా సంబంధాలను నెరపడంలో కూడా కుటుంబ బాధ్యతలు, సామాజిక బంధనాల వల్ల పురుషుల కంటే వెనకబడుతున్నారు. ఫలితంగా పురుష పుంగవులతో పోటీపడి గౌరవ ప్రదమైన సంఖ్యలో చట్టసభలకు ఎన్నిక కాలేకపోతున్నారు. సగం జనాభాకు ప్రాతినిధ్యం వహించేవారి ప్రాతినిధ్యం పది నుంచి పదిహేను శాతం దాటడం లేదు. వారిలో కూడా తండ్రి చాటు బిడ్డలు, భర్త నీడలోని భార్యలే ఎక్కువ!ఆందోళనకరమైన ఈ అసమానతను అధిగమించాలంటే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అవసరమనే ప్రతిపాదన చాలాకాలం కిందనే రాజకీయ వేదికపైకి వచ్చింది. ముప్ఫయ్ సంవత్సరాల కిందట 1996లో మహిళా బిల్లు తన ప్రయాణానికి సిద్ధమై స్టేషన్లో కూర్చున్నది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అని అభ్యుదయ కవి ఆరుద్ర చెప్పిన మాట మహిళా బిల్లులో నిజమైంది. రాజకీయ నేతలు కుంటిసాకులు చెప్పకుండా అప్పుడే ఆమోదించి వుంటే చట్టసభల్లో మూడో వంతు మహిళలు మూడు దశాబ్దాల కిందనే ప్రవేశించి ఉండే వారు. బహుశా వారిలో చాలామంది రంగంలోంచి తప్పుకొని రెండో తరానికి మార్గమిచ్చి ఉండేవారు. నిజంగానే ఒక తరం మహిళలు ఎక్కాల్సిన రైలు వారి జీవితకాలం లేటయ్యింది.ఇంకో మూడేళ్లలో రెండో తరం ఎక్కడానికి అవకాశం ఉందను కున్న రైలును స్టేషన్‌కు చేరకముందే ప్రతిపక్షం చైన్ లాగి నిలిపే సింది. అది ఎప్పటికొస్తుందో!డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేయడమేమిటని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ప్రారంభ మైన జనగణన పూర్తయిన తర్వాత, ఆ నివేదికను ప్రచురించిన తర్వాత రాజ్యాంగ విధిగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నది. ఈ ప్రక్రియ ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850 వరకు పెంచాలని కేంద్రం భావిస్తున్నది. కనుక ఆ నిష్పత్తి ప్రకారమే మహిళా సీట్లను పెంచి తాజా జనగణనతో సంబంధం లేకుండా 2011 లెక్క ప్రకారమే పునర్విభజన చేయడానికి బిల్లును రూపొందించినట్టు కేంద్రం చెబుతున్నది. అయితే తాజా జనగణన ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేప థ్యంలో దాని రిపోర్టు వచ్చేవరకు ఆగకుండా ఆదరాబాదరాగా పదిహేనేళ్ల కిందటి లెక్కలతో డీలిమిటేషన్ చేపట్టవలసిన అవసరమేమిటన్నది హేతుబద్ధమైన ప్రశ్న. ఇప్పుడున్న 543 సీట్లలోనే మహిళలకు మూడో వంతు కేటాయించి అమలు చేయడానికి దానికోసం ప్రత్యేక చట్టం చేయడానికి ఉన్న అభ్యంతరమేమిటో, రాజ్యాంగపరమైన అవాంతరాలేమిటో అర్థం కాని ప్రశ్న. కేంద్రం కూడా ఈ సందేహాలను తీర్చలేదు.డీలిమిటేషన్ ప్రక్రియ పట్ల ప్రతిపక్షాలకు అభ్యంతరాలు న్నాయి. కానీ, రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం పదేళ్ల కోసారి జరిగే ప్రతి జనగణన తర్వాత చట్టసభల స్థానాలను పునర్విభజన చేయడానికి పార్లమెంట్ ఒక అథారిటీని నియమించవలసి ఉన్నది. అట్లాగే 170వ అధికరణం ప్రకారం రాష్ట్రాల్లో కూడా! 1971 దాకా ఈ పద్ధతే కొనసాగింది. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతున్నదనే వాదన ముందుకొచ్చింది. దాంతో 1976లో అప్పటికి ఉన్న సీట్ల గరిష్ఠ సంఖ్యను స్తంభిం పచేసేలా చట్ట సవరణ జరిగింది. మొదట 2002 వరకు, ఆ తర్వాత 2026 వరకు ఈ గరిష్ఠ పరిమితిని విధించడం జరిగింది. ఈ పరిమితికి లోబడే ఇప్పటివరకు జరిగిన పునర్విభజనలన్నీ మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితమయ్యాయి.చట్టసభల్లో సీట్ల సంఖ్యను స్థిరీకరించి యాభై ఐదేళ్లు గడిచిపోయాయి కనుక ఇప్పుడు సీట్ల సంఖ్యను పెంచుతామని ఎన్డీఏ సర్కార్ చెబుతున్నది. రాజ్యాంగ నిబంధన కూడా పదేళ్ల కోసారి జరిగే జనగణన తర్వాత సీట్ల పునఃపంపిణీ జరగాలని ఆదేశిస్తున్నది. జనాభా పెరిగితే సీట్ల సంఖ్య పెరగాలని రాజ్యాంగంలో లేకపోవచ్చు. కానీ ఎక్కువమంది ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడమే 82 అధికరణం అంత స్సూత్రం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించి ఎన్నాళ్లిలా గరిష్ఠ సంఖ్యను స్తంభింపజేయగలరు? మల్కాజిగిరి లోక్‌సభ నియో జకవర్గంలో 38 లక్షలమంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి ఎన్ని కైన ప్రజాప్రతినిధి ఎంతమందికి అందుబాటులో ఉండగలరు? అసలీ సీట్ల పెంపును విపక్షం ఎందుకు వ్యతిరేకిస్తున్నది?డీలిమిటేషన్ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి పక్ష కూటమి చెప్పడం లేదు. పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నది. డీలిమిటేషన్ జరిగే ప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు కొంత లాభం జరుగుతుందనే అపోహ రాజకీయ పార్టీల్లో ఉన్నది. ఎన్నికల సమయంలో ఏ గాలీ లేకపోతే కొద్దిమేరకు ఇది ఉపయోగపడవచ్చేమో! కానీ పాజిటివ్ లేదా నెగెటివ్ ధోరణులు బలంగా ఉన్నప్పుడు ఇదేమీ ఉపకరించదు. అయినా ఈ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు బాహాటంగా అంగీకరించవు కనుక స్పష్టాస్పష్టమైన కొన్ని భావనలను వారు ముందుకు తెస్తున్నారు. అభ్యంతరాల్లో ముఖ్యమైనది... కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుచేసిన రాష్ట్రాలు జనాభా లెక్క ప్రకారం జరిగే పునర్విభజనలో నష్టపోతాయి. యాభయ్యేళ్ల తర్వాత కూడా ఇదే వాదన. ఈ వాదన ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అంటే హిందీ రాష్ట్రాలకు లాభం, హిందీయేతర రాష్ట్రాలకు నష్టం. దీనికితోడు నార్త్ – సౌత్ వాదన. దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి, హిందీభాషను బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. బీజేపీ సర్కార్‌కు హిందీ – హిందూ ఎజెండా ఉన్నదనే సంగతిని ఎవరూ దాచలేరు. ఆ పార్టీ గత కొంతకాలంగా తన ఎజెండాను బలంగా జనంలోకి తీసుకొనిపోతున్నది. దేశంలోనే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి నిలబడలేకపోతున్నది. అసమర్థ నాయకత్వం ఆ పార్టీ పాలిటి శనిగా దాపురించింది. బీజేపీ ఎజెండాను ఎదిరించే ప్రాంతీయ పార్టీలు కొన్ని సమర్థంగా నిలబడగలుగుతున్నాయి.ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకత. మహిళా రిజర్వేషన్లు దేశ ప్రజల చిరకాల వాంఛితం. ఇప్పుడు ప్రారంభమైన జనగణన ముగిసి తుది రిపోర్టు 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని చెబు తున్నారు. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్‌ను వేయాలి. అది తన రిపోర్టును ఇవ్వటానికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ సమయాన్ని ఎప్పుడూ తీసుకోలేదు. కేంద్రంలోనూ, రాష్ట్రా ల్లోనూ ఇప్పుడు సీట్ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో మరింత ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. అంటే 2033 కంటే ముందు ఈ ప్రక్రియ పూర్తికాదు. 2029 ఎన్నికల నాటికే ముందుకు తెస్తామని ఎన్డీఏ సర్కార్ చెప్పిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఇంకో ఐదేళ్లు వెనక్కు పోతాయి.ఇప్పుడు ప్రతిపక్షం కోరుకుంటున్నదేమిటి? ఐదేళ్ల తర్వాత రాజ్యాంగబద్ధ ప్రక్రియ ప్రకారం జరిగే డీలిమిటేషన్ వారి అభీష్టానికి అనుగుణంగా జరుగుతుందా? 2028లో మోదీ ప్రభుత్వమే ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించడానికీ, దాని విధివిధానాలు రూపొందించడానికీ పార్లమెంట్లో సాధారణ మెజారిటీ చాలు. అప్పుడు మోదీ మనస్సులో ప్రతిపక్షం ఆశిస్తున్న మార్పేమైనా వస్తుందా? ‘ఇదే బిల్లులో జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం వంతున సీట్లను పెంపుదల చేసే విషయాన్ని బిల్లులో పొందుపరుస్తాం... ఓ గంట టైమివ్వండ’ని అమిత్ షా సభలో అడిగినప్పుడు ప్రతి పక్షాలు ముక్తకంఠంతో ఎందుకు అంగీకరించలేదు? గంట కాదు, రెండు గంటలు కాదు రేపటి వరకైనా సరే, మార్చి తీసుకురమ్మని ఎందుకు కోరలేదు? అలా స్పందించి ఉంటే ఎన్డీఏ సర్కార్ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయేది కదా! ఇప్పుడు ప్రతి పక్షాల చిత్తశుద్ధిపైనే ప్రజలకు అనుమానాలు కలిగేలా వ్యవహరించారు.ఇక్కడ 50 శాతం సీట్ల చొప్పున పెంపుదల అనేది ఏ ప్రాతిపదికపై చేస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వ ప్రాతిపదిక ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాయే ప్రాతిపదిక కావాలి. అందుకే పదేళ్లకోసారి జరిగే జనగణన అనంతరం అందుకు అనుగుణంగా సీట్ల పునఃపంపిణీ చేయాలని రాజ్యాంగంలో 82వ అధికరణం ఆదేశించింది. దాంతో నిమిత్తం లేకుండా 50 శాతం సీట్ల సమాన పెంపు అంశం న్యాయసమీక్షకు నిలబడుతుందా అన్నది కూడా సందేహాస్పదమే. లోక్‌సభ అనేది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది తప్ప ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించదు.లోక్‌సభ అనే పేరులోనే ‘హౌస్ ఆఫ్ ద పీపుల్’ అనే అర్థం ఉన్నది. రాజ్యసభను మాత్రం ‘కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్’ అంటారు. రాష్ట్రాల లెజిస్లేటర్లే దాని సభ్యుల్ని ఎన్నుకుంటారు. శాసన ప్రక్రియలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కుండా ఉండాలంటే రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేయవచ్చు. న్యాయ సమీక్షకు ఇది లోబడే ఉంటుంది. కొన్ని దేశాల్లోని ఎగువ సభల్లో రాష్ట్రాల జనాభాలతో నిమిత్తం లేకుండా సమాన సంఖ్యలో ప్రాతినిధ్యం ఇప్పటికే ఉన్నది. కొన్ని ప్రాంతాలకు నష్టం కలిగించగల రాజ్యాంగ సవరణలను ఎగువ సభలు అడ్డుకోగలవు కూడా! అసలు విషయాలను పక్కదారి పట్టించి సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షం సాధించిందే మిటి! మహిళల మూడు దశాబ్దాల నిరీక్షణను మరో పదేళ్లు పొడిగించడం తప్ప!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బిల్లు వీగిపోవడమంటే బీజేపీ ఓడిపోవడమే: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు. -
సీఎం రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో టెన్షన్ వాతవరణం నెలకొంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు.ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు.. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పక్ష నేతల తీరుకు నిరసనగా సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరితే అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. మా ముట్టడి అడ్డుకున్నారు. నిన్న దేశానికి ఎమర్జెన్సీ కంటే చీకటి రోజు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం. కేవలం మైనార్టీ, కుటుంబ ప్రాతినిధ్యం కోసమే తప్ప సామాన్య మహిళ కోసం కాంగ్రెస్ మాట్లాడదు. కామన్ ఉమెన్ చట్ట సభలోకి రావొద్దని కాంగ్రెస్ తీరు ఉంది. రిజర్వేషన్ రాబోతుందని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. హైబ్రిడ్, ఉత్తరాది, దక్షిణాది కేవలం మహిళ రిజర్వేషన్ వ్యతిరేకించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిది. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అంటూనే.. వ్యతిరేకంగా ఓట్లు వేశారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదు: ప్రియాంక గాంధీ
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో విపక్షంపై బురద జల్లే కుట్ర చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి దెబ్బ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘కేంద్రం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు. 543 సీట్ల నుంచే మహిళలకు 33 శాతం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు. తమ మాటలు నమ్మాలని కేంద్రం పదేపదే చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. దేశం మారింది.. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Our stand is very clear. The entire INDIA alliance has made its stand very clear, and this vote has made it even clearer that, in our understanding, this bill that was introduced and the three-day discussion was not about… pic.twitter.com/6GkCRVtPXK— ANI (@ANI) April 18, 2026భారత్ మేల్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదు. వారికి తమ హక్కులను వెంటనే కల్పించాలి. మా వైఖరి అత్యంత స్పష్టం. ఇండియా కూటమి మొత్తం వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రవేశపెట్టిన ఈ బిల్లు, దానిపై జరిగిన మూడు రోజుల చర్చ మా అవగాహన ప్రకారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించినవి కాదు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే సంబంధించింది. ఇదే విషయం ఓటింగ్ ద్వారా మరింత స్పష్టం చేసింది. ఈ విషయంపై మేమందరం మా అభిప్రాయాలను చాలా నిర్ద్వంద్వంగా వ్యక్తం చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. వరుదు కళ్యాణి రియాక్షన్
-
లోక్‌సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
-
గెలవదని తెలిసే బిల్లు విషయంలో ముందుకెళ్లారా?
-
బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి?
సాక్షి, అమరావతి: ‘కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించి ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లూ పెరిగేవి... మహిళా రిజర్వేషన్ బిల్లూ ఆమోదం పొందేది..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ బిల్లులను లోక్‌సభలో అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలో మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకూ న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడటంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు వాయిదా పడిందన్నారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలే అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై తన అభిప్రాయాన్ని వైఎస్ జగన్ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు ద్వారా వెల్లడించారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇవీ... » కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగేవి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింతగా దిగజారుతుంది. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయి. » 50 శాతం సీట్ల పెంపుదల విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు 38 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 34 మాత్రమే అవుతాయి. అంటే ఏపీ 4 ఎంపీ సీట్లు నష్టపోతుంది. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు 26 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 24 మాత్రమే అవుతాయి. అంటే రెండు సీట్లు నష్టపోవాలి. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ సీట్లు 42 స్థానాలకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ఆ రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే ఆ రాష్ట్రం ఏమీ నష్టపోదు. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కేరళలో ఉన్న 20 ఎంపీ సీట్లు 30 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 23 మాత్రమే అవుతాయి. అంటే కేరళ 7 ఎంపీ సీట్లు నష్టపోతుంది. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న 39 ఎంపీ సీట్లు 59 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 50 మాత్రమే అవుతాయి. అంటే తమిళనాడు 9 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 50 శాతం సీట్ల పెంపుదలే ఉత్తమ విధానం.. 2026 జనాభా లెక్కలు అమలైతే మరింతగా నష్టపోతాంమాజీ సీఎం వైఎస్ జగన్ తన వాదనను బలపరిచే గణాంకాలను పట్టిక రూపంలో కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పునర్విభజన బిల్లులో చెబుతున్నట్టుగా 50 శాతం సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల ఎలా ఉంటుంది..? అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు ఎంతగా తగ్గుతాయో వివరించారు. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును యథాతథంగా ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరమన్నారు. వైఎస్ జగన్ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.... మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి సంక్షిప్తంగా ఇలా..» ప్రస్తుతం దేశంలో ఉన్న 534 లోక్‌సభ ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే దేశంలో ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 శాతంగా ఉంది. » కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే... ప్రస్తుతం చెబుతున్న 50 శాతం పెంపు విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య 195కు పెరుగుతుంది. అంటే దేశం మొత్తం మీద 815 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.87 శాతానికి పెరుగుతుంది. » 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే దేశంలో ఏర్పాటయ్యే 850 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 174 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే దక్షిణాది రాష్ట్రాల వాటా 20.44 శాతమే ఉంటుంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు 21 ఎంపీ సీట్లను నష్టపోతాయి. » అదే 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నాయి. దాంతో ఆ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. కాబట్టి 2026 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు బాగా తగ్గిపోతాయి. అందుకే జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో చేపట్టిన కీలక ఓటింగ్‌లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్‌సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్‌సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్‌సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్‌కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్‌లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
నారీశక్తికి వందనం ఇంకెప్పుడు?
2023 సెప్టెంబర్‌లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో వచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టం ‘జనాభా గణన జరిగి,ఆ ప్రాతిపదిక మీద నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తరువాతనే అమల వుతుందన్న నిబంధన అప్పుడే విమర్శకు గురైంది. ఆ లెక్కన 2030 నాటికి గానీ ఆ చట్టం అమలులోకి రాదని చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా ఉద్యమకారులు ఆవేదన పడ్డారు. మహిళల హక్కుల అమలులో సాచివేత ధోరణిని నిరసించారు.ఇప్పుడు మూడేళ్లు పూర్తి కాకుండానే, జనగణన జరగకుండానే 2011 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనతో కలిపి మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన సవర ణలతో కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసింది. ప్రజాప్రతినిధుల వాదోపవాదాలతో వాతావరణం వేడెక్కి ఉంది. ఈ సందర్భంలో చట్ట సభలలో మహిళ లకు రిజర్వేషన్ కల్పించటానికి తాము సంసిద్ధంగా ఉంటే ప్రతి పక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయనీ, మహిళా ప్రపంచం వాళ్ళను క్షమించదనీ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్నది. ఇది చూస్తుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు భుజాల మీదుగా దక్షిణ ప్రాంతాల రాజ కీయ ప్రాతినిధ్యం గురించి అనేక సందేహాలకు తావిస్తున్న నియో జకవర్గాల పునర్విభజన బిల్లును నెగ్గించుకొనే ప్రయత్నం చేసిందా ప్రభుత్వం అన్న సందేహం కలుగుతుంది. అయితే, దక్షిణాది రాష్ట్రా లకు అన్యాయం జరగకుండా, దేశంలోని అన్ని నియోజక వర్గాలసంఖ్యను సమంగా 50 శాతానికి పెంచుతామనే ప్రతిపాదనపై గట్టి విశ్వాసాన్ని ప్రభుత్వం కలిగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో!నియోజక వర్గాల పెంపు ద్వారా తప్ప స్త్రీలకు చట్ట సభలలోకి ప్రవేశం సాధ్యం కాకపోవటం అన్న భావన ప్రజాస్వామికమైనదేమీ కాదు. ఇప్పటికి అనుభవిస్తున్న రాజకీయాధికారాన్ని ఉన్నది ఉన్న ట్లుగా స్త్రీలతో పంచుకొనటానికి పురుష సమాజం భావజాలసంస్కారాన్ని అభివృద్ధి చేసుకోలేదన్న సంకేతాన్ని ఇస్తుందది. పితృస్వామిక స్వభావంమహిళా సాధికారత లక్ష్యంగా 1990లలో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన చైతన్యం, ఒత్తిడి నుండి 1992లో 73,74రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక పాలనా వ్యవస్థలలో స్త్రీలకు 33 శాతం స్థానాలను కేటాయిస్తూ చట్టం వచ్చింది. కానీ 2001ని మహిళా సాధికార సంవత్సరంగా ప్రకటించిన ప్రభుత్వం చట్ట సభలకు మహిళా రిజర్వేషన్‌ను విస్తరింపచేయటానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉండటమే మనకు తెలిసిన చరిత్ర. 1996 నుండి స్థానిక సంస్థలలో ఎన్నికల ద్వారా పదవులు చేపట్టిన స్త్రీల స్థానంలో కుటుంబ సభ్యులైన పురుషులో, గ్రామ పెత్తందారులో అధికారాలు చలాయించటం, ప్రభుత్వ పాలనా వ్యవస్థలు ఆ విషయం తెలిసి కూడా చర్యలు ఏవీ చేపట్టకపోవడం ప్రజాక్షేత్రంలో జరిగిన పరిశోధనలు, ప్రజల అనుభవాల నుండి వచ్చిన సాహిత్యం లోకానికి తెలియచెప్పాయి. ఇటువంటి పరిస్థి తులలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన ప్పుడల్లా వీగిపోవటంలో, 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన ప్పటికీ లోకసభలో చర్చకు రాకుండా కోల్డ్ స్టోరేజిలో పెట్టబడటంలో ఆశ్చర్యపడవలసింది ఏమున్నది?మొత్తంగా మహిళలు అధికార స్థానంలో ఉండటాన్ని అంగీకరించలేని సగటు పితృస్వామిక స్వభావమే దీని మూలం. 2001ని మహిళా సాధికారతా సంవత్సరంగా ప్రకటించినప్పుడు స్త్రీ పురుష వివక్షకు సంబంధించిన పాతబడ్డ భావజాల నిర్మూలనకు, మనుషులలో నూతన ప్రజా స్వామిక చైతన్య వికాసానికి చేపట్టే ఎన్నెన్నో కార్యక్రమాల గురించిన వాగ్దానాల వైఫల్యం మనం చూస్తున్నదే. స్త్రీలు అందరూ ఒకటి కాదు. కులంవల్ల, సామాజిక ఆర్థిక స్థాయివల్ల వాళ్ళు భిన్న సమూహాలుగా ఉన్నారు. లింగ వివక్ష నిరపేక్ష అంశం కాదన్న ఎరుక... చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం అగ్రవర్ణ మహిళల అవకాశంగా మాత్రమే మిగిలిపోకూడ దన్న ఆకాంక్షగా వ్యక్తం కావటం సహజం. అందువల్లనే బహుజన మహిళలకు అంతర్గత రిజర్వేషన్ ఉండాలన్న ప్రతిపాదనమహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలోకి వచ్చినప్పుడల్లా వినబడుతూనే ఉంది. అయినా దానికి పెడచెవి పెట్టడానికి కారణం మనువాద సంస్కృతే అన్నది తెలిసిందే. ఆ చరిత్రను సౌకర్యవంతంగా విస్మరించి ఆ ప్రసక్తే లేకుండా ‘నారీ శక్తి వందన్ అధినియం’ వచ్చింది.ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంటులో వీగి పోయింది. అందుకు మహిళలు నిరాశపడవలసినది ఏమీ లేదు. విశాల ప్రతిపాదిక మీద భిన్న సమూహాల స్త్రీల సరైన ప్రాతినిధ్యాన్ని చట్టంలో భాగంగా చేసేవరకూ ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావటం, నియోజకవర్గాల పునర్విభజనతో పనిలేకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలును డిమాండ్ చేయటం ఇప్పుడు తక్షణ కర్తవ్యాలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ సమన్వయకర్త-కాత్యాయనీ విద్మహే -
ఇది ట్రైలర్ మాత్రమే: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం తమ విజయమని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. లోక్‌సభలో తమిళనాడు.. ఢిల్లీని ఓడించిందన్నారు స్టాలిన్. ఇది తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు అని, అది వీగిపోయిందన్నారు సీఎం స్టాలిన్. ఇదిట్రైలర్ మా త్రమేనని, ముందు అసలు సినిమా ఉందని సెటైర్లు వేశారు సీఎం స్టాలిన్.ఇక తెలంగాణ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత ముందు కేంద్రం తలవంచిందన్నారు. నల్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చిరస్మరణీయమని రేవంత్ పేర్కొన్నారు. బిల్లును ఓడించిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్.. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని కొనియాడారు.ఇదీ చదవండి:ఓడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు -
‘ మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’
న్యూఢిల్లీ: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కారణమైన పలు పార్టీల వైఖరికి నిరసనగా ఎన్డీయే ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ బిల్లును విపక్షాలే ఓడించాయంటూ నిరసనకు దిగారు. విపక్ష ఎంపీలన దేశం క్షమించదు అంటూ నినాదాలు చేశారు. ‘మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా లోకానికి ఇది చీకటి రోజు అని అన్నారు బీజేపీ మహిళా ఎంపీ డీకే అరుణ. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ మోదీకే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. మరొకవైపు హైదరాబాద్‌లో బీజేవైఎం నేతలు.. విపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్‌ను రాహుల్ అడ్డుకోవడంపై మండిపడ్డారు. విపక్షాలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. విపక్షాల నిజస్వరూపం మరోసారి బయటపడిందంటూ బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. డీలిమిటేషన్ ముసుగులో మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు. కాగా, కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్‌సభ వేధికగా జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. -
ఓడిన మహిళా రిజర్వేషన్ బిల్లు
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్‌సభ వేధికగా జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 352. దాంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాంతో మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. బిల్లులివే..రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026: మహిళా రిజర్వే షన్లను 2029 నుంచే అమలు చేయడానికి వీలుగా గతంలోని జనగణనను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం.కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026: అసెంబ్లీల్లో 33శాతం మహిళల కోటా అమలుకు వీలుగా కేంద్ర పాలిత ప్రాంతాలో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడం.డీలిమిటేషన్ బిల్లు-2026: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం.బిల్లులు ప్రవేశఫెట్టేముందు కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఓబీసీలను వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్ ముందుంటుంది. చరణ్ సింగ్,కేసరిలాంటి ఓబీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఓబీసీల కోసం కాకాసింగ్ కాలేకర్ చేసిన సూచనలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం కాంగ్రెస్ ఆమోదించలేదు. వీపీ సింగ్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్టుకు మోక్షం దక్కింది. రాజీవ్ గాంధీ తన జీవితాంతం మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ వచ్చారు. 15-20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్‌కు ఓబీసీలు గుర్తుకొచ్చారు. బీజేపీ మాత్రమే అత్యంత వెనకబడిన ఓబీసీ నాయకుడు మోదీని ప్రధానినిన చేసింది. మోదీ ప్రభుత్వంలో 27మంది కేంద్రమంత్రులు ఓబీసీలే. మొత్తం క్యాబినెట్లో ఓబీసీల శాతం 40. 1992,72,73 సవరణల ద్వారా వీపీ నరసింహరావు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. పీవీ నరసింహరావును ఎప్పుడూ కాంగ్రెస్ తన సొంత మనిషిగా భావించలేదు. 1996లో దేవేగౌడ 81వ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళా బిల్లును బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన పార్టీలే మహిళా బిల్లును వ్యతిరేకించాయి.కాంగ్రెస్ కుట్రతోనే తన అనుకూల పార్టీలతో మహిళా బిల్లును వ్యతిరేకించింది.ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును.. అడ్డుకుంటున్న వారికి ప్రజాక్షేత్రంలో మహిళలు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు. -
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర తిప్పికొట్టాం: రాహుల్
మహిళా బిల్లు వీగిపోవడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొట్టామన్నారు. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కానేకాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని 2023కు సంబంధించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువస్తే మద్దతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్‌తో మహిళా బిల్లుకు ముడిపెడితే కుదరదన్నారు.అమిత్‌షా ఏమన్నారంటే?కాగా అంతకుముందు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఛాలెంజ్ విసిరారు.. కాంగ్రెస్ నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు. డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాఫ్‌లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ అంతకుముందు రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు. నిన్న జరిగిన సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. వీగిపోయిన మహిళా బిల్లుకాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మెుత్తం 528 మంది ఓటింగ్‌లో పాల్గొనగా అనకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. దీంతో సరైన సంఖ్యా బలం లేక బిల్లు వీగిపోయింది. -
పార్లమెంటులో .."33 కాదు 50 శాతం రిజర్వేషన్"
పార్లమెంట్ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలతో వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఛాలెంజ్ విసిరారు.. కాంగ్రెస్ నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు.అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు.డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాఫ్‌లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రతి సంస్కరణకు అడ్డు తలిగిందన్నారు త్రిపుల్ తలాక్‌ను అడ్డుకుందని రామమందిరం నిర్మాణానికి ఆటంకం కలిగించిందని అన్నారు. దళిత మహిళను రాష్ట్రపతి చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వకుంటే వీగిపోతుందని వీరిని దేశంలోని మహిళలంతా గమనిస్తున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు లోక్‌సభలో గొడవ చేసి బతికిపోవచ్చుగానీ ప్రజాక్షేత్రంలో మహిళల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని అన్నారు. -
ఈ బిల్లు అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటాం: రాహుల్
ఢిల్లీ: నారిశక్తి వందన్ అధినియం పేరుతో కేంద్రం తీసుకవచ్చిన బిల్లు వాస్తవానికి మహిళల రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు కానేకాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు చర్చపై ఆయన ఈ రోజు( శుక్రవారం) పార్లమెంటులో మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు.మా నానమ్మ ఇందిర వల్లే నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందని నిన్న సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అన్నారు. ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇదన్నారు. బీజేపీ సభ్యులు రాజ్యాంగం కంటే మనువాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరని, ప్రేవేటు రంగంలో కూడా రంగంలో కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు చేసిందేమీ లేదన్నారు.కులగణనను బైపాస్ చేసేందుకే కేంద్ర యత్నిస్తోందని అస్సోం, జమ్మూలో చేసినట్లు డీలిమిటేషన్ చేయాలనుకంటున్నారని ఆరోపించారు. ఈ బిల్లు దేశవ్యతిరేఖ బిల్లని ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చేయడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ ఆత్మని చంపే బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరాతమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
33% మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్..
-
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
మూడు కీలక బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నేడు ఓటింగ్ ప్రక్రియ.. -
రాజకీయ ఆయుధంగా డీలిమిటేషన్
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్‌సభ స్థానాల పెంపునకు బలవంతంగా ఆమోదముద్ర వేయించుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. బీజేపీకి బాగా అలవాటైన బుల్డోజర్ పద్ధతినే ఈ విషయంలోనూ పాటిస్తోందంటూ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగొయ్ తూర్పారబట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని సవరించేందుకు గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చను ఆయన ప్రారంభించారు. అవి మహిళా వ్యతిరేక బిల్లులంటూ మండిపడ్డారు. కులగణనకు, రాజ్యాంగానికే గాక దేశ సమాఖ్య నిర్మాణానికి కూడా ఆ బిల్లులు వ్యతిరేకమని ఆరోపించారు.ఆ బిల్లుల ద్వారా డీలిమిటేషన్‌కు దొడ్డిదారిన ఆమోదం పొందడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం తప్ప మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం కానేకాదని కుండబద్దలు కొట్టారు. బీజేపీ కేవలం తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకే డీలిమిటేషన్‌ను రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని గొగొయ్ ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లపై ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే లోక్‌సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత సంఖ్య 543తోనే ఆ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ద్వారా అనుచిత రాజకీయ లబ్ధి పొందడమే మోదీ సర్కారు ఏకైక ధ్యేయమని పునరుద్ఘాటించారు.ఈ గెర్రీమాండరింగ్ (నియోజకవర్గాల సరిహద్దులను ఒక పార్టీకి లబ్ధి చేకూరేలా మార్చడం) ప్రయత్నాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ‘‘అసలు లోక్‌సభ స్థానాల పెంపు ఆలోచన ఎక్కడినుంచి వచి్చంది? ఎన్ని స్థానాలను పెంచాలన్న అంశంపై మోదీ సర్కారు తనంత తానుగానే ఎలా నిర్ణయం తీసుకుంటోంది? ఏదైనా పార్లమెంటరీ నివేదిక ఆధారంగా ఇందుకు పూనుకున్నారా? లేదా నాగపూర్ (ఆరెస్సెస్) నిర్దేశాల మేరకా? లేదంటే ఇది కేవలం ఆకాశం నుంచి ఊడిపడ్డ ఆలోచనా?’’అంటూ ధ్వజమెత్తారు. దేశమంతటా ‘అస్సాం’ప్రయోగం రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్‌ను ఆయుధంగా మలచుకోవడం బీజేపీకి అలవాటేనని గౌరవ్ గొగొయ్ ఆరోపించారు. ‘‘గతంలోనూ ఆ పార్టీ ఎన్నోసార్లు ఇందుకు పాల్పడింది. జమ్మూకశ్మీర్, అస్సాంల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను ఇష్టానుసారంగా మార్చేసి అనుచిత లబ్ధి పొందింది. దాంతో ఇప్పుడదే ప్రయోగాన్ని దేశమంతటా చేసేందుకు మోదీ సర్కారు నిశ్చయించుకుంది.అందుకు మహిళా రిజర్వేషన్లను సాకుగా వాడుకుంటోంది’’అని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు నిజంగా సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలని మోదీ సర్కా రు భావిస్తే అందుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ దానికి డీలిమిటేషన్‌తో ముడిపెట్టడానికి వీల్లేదు. లోక్‌సభ స్థానాలను పెంచే ప్రయత్నానికి స్వస్తి చెప్పి ప్రస్తుతమున్న 543 స్థానాలకే తక్షణం అమలయ్యేలా మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయాలి’’అని గొగొయ్ డిమాండ్ చేశారు.కులగణనకు బీజేపీ వ్యతిరేకిరాజ్యాంగాన్ని మోదీ సర్కారు క్రమేపీ అన్నివిధాలా బలహీనపరుస్తూ వస్తోందని గౌరవ్ గొగొయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కులగణన పట్ల కేంద్రం సానుకూలంగా లేదన్న అనుమానాలు కూడా నానాటికీ బలపడుతున్నాయి. మోదీ సర్కారు అందుకు తొలినుంచీ వ్యతిరేకే. కేవలం మా నేత రాహుల్‌గాంధీ ఒత్తిడి కారణంగానే కులగణనకు అయిష్టంగా అంగీకరించింది’’అని ఆయన చెప్పుకొచ్చారు.తాజాగా మూడు బిల్లులను ప్రవేశపెడుతూ లోక్‌సభలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ ప్రసంగించిన తీరును గొగొయ్ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఇప్పుడే తొలిసారిగా తాము ప్రవేశపెడుతున్నాం అన్నట్టుగా మంత్రి మాట్లాడారు. కానీ 2023లోనే ఆ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఆ సందర్భంగా కూడా సభలో వాళ్లు సరిగ్గా ఇవే వాదనలు చేశారు. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలనే ఇప్పుడు మేఘ్వాల్ మళ్లీ యథాతథంగా అప్పజెప్పారంతే!’’ అని తూర్పారబట్టారు. -
ముస్లిం కోటా ఉండబోదు
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లలో ముస్లింలకు కోటా ప్రత్యేక ఉండబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించబోదు. అవి రాజ్యాంగ విరుద్ధం. కనుక ముస్లిం మహిళలకు మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే ప్రస్తకే లేదు’’అంటూ కుండబద్దలు కొట్టారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు నిమిత్తం కేంద్రం గురువారం లోక్‌సభ లో మూడు బిల్లులు ప్రవేశపెట్టడం తెలిసిందే. వాటిపై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేశ్‌యాదవ్, ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ‘‘మహిళలు జనాభాలో సగ భాగం. ముస్లిం మహిళలను వారిలో భాగంగా పరిగణించడం లేదా?’’అని అఖిలేశ్ ప్రశ్నించారు.మహిళా రిజర్వేషన్లు ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా వర్తించేలా నిబంధనలు చేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదన్నారు. తాజా బిల్లులను ఉపసంహరించుకుని 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంలో వెనుకబడిన తరగతులతో పాటు ముస్లిం మహిళలను కూడా చేర్చాలని ధర్మేంద్ర యాదవ్ కోరారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. వారి డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘‘సమాజ్‌వాదీ పార్టీ కావాలనుకుంటే అన్ని టికెట్లూ ముస్లిం మహిళలకే ఇచ్చుకొమ్మనండి. ఎవరొద్దంటున్నారు? మాకైతే ఏ అభ్యంతరమూ ఉండబోదు’’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
డీలిమిటేషన్.. తెలంగాణలో 26... ఏపీలో 38
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య 17నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి పెరగనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వీభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల చట్ట రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో అమిత్ షా ప్రసంగించారు. డీలిమిటేషన్ వల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. పునర్విభజన అనంతరం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 129 నుంచి 50 శాతం, అంటే 195కు పెరుగుతుందని వెల్లడించారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గదు. పైపెచ్చు సభలో వాటి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది’’అంటూ గణాంకాలతో సహా మంత్రి వివరించారు. ‘‘మొత్తం చర్చపై కేంద్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం సమాధానమిస్తాను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పదలచాను. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రజలకు ఎలాంటి అపోహలూ వద్దు. ఈ బిల్లులతో లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుందని పెద్ద వాదనను లేవనెత్తుతూ భ్రాంతిని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వదలచాను. సభ ముందున్న బిల్లుల ఆధారంగా వాస్తవాలు అందరి దృష్టికీ తెస్తాను. నియోజకవర్గాల పునర్వీభజనతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 25నుంచి 38కు, ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 4.60 నుంచి 4.65 శాతానికి పెరుగుతాయి. తెలంగాణలో స్థానాలు 17 నుంచి 26కు, ప్రాతినిధ్యం 3.13 నుంచి 3.18కి పెరుగుతాయి. తమిళనాడులో సీట్లు 39 నుంచి 59కు, ప్రాతినిధ్యం 7.18 నుంచి 7.23 శాతానికి పెరుగుతాయి. కర్నాటకలో లోక్‌సభ స్థానాలు 28నుంచి 42కు, సభలో ప్రాతినిధ్యం 5.15 శాతం నుంచి 5.14 శాతానికి చేరతాయి. కేరళలో సీట్లు 20 నుంచి 30కి, లోక్‌సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.68 నుంచి 3.67 శాతానికి చేరతాయి. మొత్తమ్మీద దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్య 195కు పెరుగుతుంది. లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం 23.76 శాతం నుంచి 23.97 శాతానికి పెరుగుతుందే తప్ప ఏ మాత్రమూ తగ్గదు. అలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయమన్న ప్రశ్నే తలెత్తదు’’అని స్పష్టం చేశారు. జనగణనతో పాటే కులగణన ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటే కులగణన కూడా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘కులగణన చేపట్టాలని కేంద్రం భావించడం లేదని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తన్నాయి. మోదీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జనగణన రెండు దశల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇళ్ల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. వ్యక్తిగత డేటాను తీసుకునేటప్పుడు కులగణన అంశం కూడా వస్తుంది’’అని ఆయన స్పష్టం చేశారు. 2029 తర్వాతే అమలు నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో అమలు కాబోదని సభకు అమిత్ షా తెలియజేశారు. ‘‘డీలిమిటేషన్ కమిషన్ నివేదికను పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాతే అమల్లోకి వస్తుంది. ఇదంతా 2029కి ముందు జరిగే ప్రసక్తే లేదు. కనుక అప్పటిదాకా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు పాత నియోజకవర్గాల ప్రాతిపదికనే జరుగుతాయి’’ అని చెప్పారు.లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 816! లోక్‌సభలో సీట్ల సంఖ్య పెంపుపై విపక్షాల ప్రశ్నలకు బదులిస్తూ అమిత్ షా ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ముందుగా మొత్తం సీట్లను 50 శాతం పెంచాలి. అప్పుడు వాటిలో 33 శాతం మహిళలకు కేటాయించినా మిగతా ఓపెన్ సీట్ల సంఖ్య యథాతథంగా ఉంటాయి. అంటే ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం పెంచితే వాటిలో 33 శాతాన్ని మహిళలకు రిజర్వ్ చేశాక కూడా ఓపెన్ కేటగిరీలో 543 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టే 50 శాతం పెంపును ప్రతిపాదించాం’‘అని ఆయన వివరించారు. ‘‘లోక్‌సభ స్థానాల పెంపు గరిష్టంగా 850 దాకా అనేది సుమారుగా వేసిన సంఖ్య. కచ్చితమైన సంఖ్య బహుశా 815, లేదా 816గా ఉండవచ్చు. దీనిపై సభకు సమగ్రంగా వివరణ ఇస్తా’’అని చెప్పారు. -
‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులోని నియోజకవర్గాల పునర్వీభజన నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాయి. సంబంధిత బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత బిల్లు అని ఆరోపించారు. విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న విధానం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేసి బిల్లును నెగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గతంలో ఆమోదించిన సవరణ బిల్లును అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ పేరిట డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని వ్యతిరేకించాలని ఉమ్మడిగా నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్పష్టత లేని జనగణన, భవిష్యత్తు డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దని కోరారు. పార్లమెంట్ వద్ద ఉండాల్సిన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి కల్పిస్తూ, రాజకీయంగా అనుకూలమైనప్పుడల్లా నియోజకవర్గాలను మార్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మోసం చూశామని ఖర్గే తెలిపారు. అందుకే నియోజకవర్గాల పునర్వీభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. అధికారం కోసమే ఈ కుతంత్రం: రాహుల్ మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును 2023లో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డీలిమిటేషన్‌తో అధికారం దక్కించుకోవాలన్న కుతంత్రం తప్ప ఇందులో ఇంకేముందని ప్రశ్నించారు. విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీల హక్కులను చోరీ చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే దక్షిణ, ఈశాన్య, వాయువ్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదకరం: కె.సి.వేణుగోపాల్మోదీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన చర్య ప్రమాదకరమైనదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా రాష్ట్రాలకు సమాన అధికారాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విపక్ష నేతల సమావేశంలో డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సాగరికా ఘోష్, శివసేన(ఉద్ధవ్) నాయకులు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. -
డీలిమిటేషన్ దంగల్
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుకు, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలకు నడుమ పార్లమెంటులో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు వీలు కల్పించేందుకు ఉద్దేశించిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ఇందుకు వేదిక కానుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు పట్టుదలగా ఉంది. అందుకోసమే గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ మేరకు మహిళా రిజర్వేషన్ల చట్టానికి చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టేలా రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం గురు, శుక్రవారాల్లో బిల్లుపై కీలక చర్చ జరగనుంది. ఇందుకు 18 గంటల సమయం కేటాయించారు. చర్చకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చాక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం రాజ్యసభలో ప్రవేశపెడతారు. 10 గంటల చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ జరగనుంది. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచనున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్ వ్వవస్థీకరణకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026ను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ రెండు బిల్లులనూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ ప్రవేశపెడతారు. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టం (సవరణ) బిల్లు–2026 కూడా సభ ముందుకు రానుంది. దాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంపై గుర్రుగా విపక్షాలు మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలన్నీ గుర్రుగా ఉన్నాయి. తమతో మాటమాత్రం కూడా సంప్రదించకుండా, వివరాలేవీ వెల్లడించకుండా గుట్టుగా వ్యవహరించడం వెనక మతలబు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనికి తోడు డీలిమిటేషన్‌పైనా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారం అసమంజసంగా పెరిగిపోతుందని, తద్వారా తమకు తీరని నష్టం, అన్యాయం జరుగుతాయని అవి వాదిస్తున్నాయి. దీనిపైనా కేంద్రం వ్యవహార శైలిని విపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. అంతేగాక మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు డీలిమిటేషన్‌తో ఎందుకు ముడి పెట్టాల్సి వచ్చిందన్నది వాటి ప్రధాన అభ్యంతరం. మహిళా రిజర్వేషన్ల అమలు సాకుతో లోక్‌సభ స్థానాలను పెంపుకు ఆమోదం పొందేందుకు కేంద్రం ప్రయతి్నస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును వ్యతిరేకించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ విషయంలోమోదీ సర్కారు వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగట్టాలని కూడా భావిస్తున్నాయి. దాంతో సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. దీనికి తోడు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు మోదీ సర్కారుకు విపక్షాల మద్దతు తప్పనిసరి కానుంది! ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై లోతుగా చర్చించాయి. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. విపక్షాలన్నీ డీలిమిటేషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఆయన ప్రకటించారు! ‘‘మేం మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మోదీ సర్కారు రాజకీయ లబ్ధి కోసం బిల్లు తెచ్చిన తీరునే వ్యతిరేకిస్తున్నాం’’అన్నారు. సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.గరిష్టంగా 850కి లోక్‌సభ స్థానాలు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేసేలా 2023లోనే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’పేరుతో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది 2034కు ముందు అమలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. అందుకు వీలుగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850 దాకా> పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. తుది సంఖ్యను త్వరలో ఏర్పాటయ్యే డీలిమిటేషన్ కమిషన్ నిర్ధారిస్తుంది. దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా జనాభా లెక్కలను, అంటే 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు బిల్లు ముసాయిదాలో వెల్లడించింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా 81వ ఆరి్టకల్‌కు సవరణలు ప్రతిపాదించింది.అవన్నీ వదంతులే ‘దక్షిణాదికి అన్యాయం’పై కేంద్రం లోక్‌సభ నియోజకవర్గాల పెంపులో దక్షిణాదికి అన్యా యం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘‘వాస్తవానికి ఆ రాష్ట్రాలకే లబ్ధి చేకూరబోతోంది. సీట్ల పెంపులో దామాషా ప్రాతినిధ్య పద్ధతిని అనుసరిస్తుండటమే ఇందుకు కారణం’’అని తెలిపాయి. ఈ విషయమై పార్లమెంటులో ప్రధాని స్పష్టత ఇవ్వనున్నట్టు అవి వెల్లడించాయి. దీనిపై వదంతులు ప్రచారం చేయొద్దని సూచించాయి. సవరణ బిల్లు గట్టెక్కేనా? రాజ్యంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. లోక్‌సభలో మూడు ఖాళీలు పోను ప్రస్తుత సభ్యుల సంఖ్య 540. ఆ లెక్కన మూడింట రెండొంతుల మెజారిటీ 360. అధికార ఎన్డీఏ కూటమికి సభలో ఉన్నది 292 మంది సభ్యులే. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యులు 245. ఒక స్థానం ఖాళీగా ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీ 163 కాగా ఎన్డీఏ కూటమికి ఉన్నది 139 సభ్యుల బలమే. కనుక ఉభయ సభల్లోనూ సభ్యులంతా ఓటింగ్‌కు హాజరయ్యే పక్షంలో బిల్లు ఆమోదానికి అధికార పక్షానికి లోక్‌సభలో మరో 68 మంది, రాజ్యసభలో 24 మంది ఎంపీలు అవసరం. ఇందుకు విపక్షాల మద్దతు తప్పనిసరి. లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి బలం 233. మరో 15 మంది చిన్న పార్టీలకు చెందిన/స్వతంత్ర ఎంపీలున్నారు. రాజ్యసభలో ఇండియా కూటమికి 75 మంది, ఇతర విపక్షాలన్నింటికీ కలిపి 30 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి పార్టీలన్నీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో బిల్లు గట్టెక్కడంపై కేంద్రం ధీమా ఏమిటన్నది అంతుపట్టడం లేదు. -
అక్షరాలా... మహిళా సాధికారతకే ఓటు
‘మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు?’ అనే ప్రశ్నకు 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా చెప్పే జవాబులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జవాబులకు ఉపయోగపడే పుస్తకం... ఉమెన్ అండ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. తరుణ్ బెహూరియా రాసిన ఈ పుస్తకంలో రిజర్వేషన్ల ప్రాముఖ్యత, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంపై దాని ప్రభావాన్ని గురించి వివరంగా చర్చించారు. ‘సరిౖయెనప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరం’ అనే అంశంతో ‘ఉమెన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా’ పుస్తకం రాశారు. పంచాయతీరాజ్‌లో రిజర్వేషన్ల ప్రభావం, భారతదేశంలో మహిళా సాధికారత: రాజకీయ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు: ఒక సామాజిక అవసరం, జాతీయ బాధ్యత, భారతదేశంలో మహిళలకు కోటాల అమలు, మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా సాధికారతకు ఒక మైలురాయి. స్థానిక స్వపరి పాలన, మహిళలు, రాజకీయ భాగస్వామ్యం: శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్... ఇలా ఆసక్తికరమైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్ర, ΄÷రుగుదేశాలలో మహిళల రాజకీయ భాగస్వామాన్ని గురించి వివరించే పుస్తకం... ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ పాలిటిక్స్– పోస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భారతదేశంలో మహిళలకు ఉన్న రిజర్వేషన్లను విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం. నాలుగు విభాలుగా విభజించిన ఈ పుస్తకం మహిళా రిజర్వేషన్ చట్టంలోని వివిధ కోణాలను వివరిస్తుంది. -
...ఆల్ ది బెస్ట్
భారతీయ మహిళలకు ఆల్ ది బెస్ట్. చైతన్యవంతమైన తెలుగింటి మహిళలకు ఆల్ ది బెస్ట్. మేధస్సులో, దార్శనికతలో, భవిష్యత్తు నిర్మాణంలో గొప్ప దక్షత, దీక్ష కలిగిన మన నారీశక్తికి ఆల్ ది బెస్ట్. అదిగో... చట్టసభల్లో స్త్రీలకు సంబంధించిన గొప్ప ఘట్టానికి తెర లేవనుంది. నేటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఎన్నాళ్ల కల ఇది! ఎన్నో తరాల కల. అందుకే ఇది చారిత్రాత్మక ఘట్టం. ప్రజాస్వామ్యంలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉందని చాటే అపురూప ఘట్టం. ఇక చట్టసభల్లో స్త్రీల గళం మరింత బలంగా వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. విధాన నిర్ణయాల్లో స్త్రీ దృక్పథం చేరితే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని స్త్రీలు చూపబోతున్నారు. ఇంటిని నడిపిన అనుభవంతో దేశాన్ని నడిపే సామర్థ్యం స్త్రీలకు ఉంది. ఈ బిల్లు కేవలం సీట్ల గురించి కాదు, గౌరవం గురించి. ఆత్మగౌరవం గురించి. స్త్రీలు ద్వితీయశ్రేణి పౌరులు కాదని ఎలుగెత్తి చాటడం గురించి. ఈ సందర్భం స్త్రీల పోరాటానికి, పట్టుదలకు తార్కాణం. చర్చ సజావుగా సాగి, బిల్లు కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిద్దాం. ఒక కొత్తప్రారంభానికి సిద్ధమవుదాం. భారత నారీ శక్తికి మరోసారి ఆల్ ది బెస్ట్. ... మీరు గెలవాలి!మహిళలకు అధికారం ఇస్తే వారు ఎంత అద్భుతంగా పనిచేస్తారో అనడానికి మన గ్రామ పంచాయతీలే నిదర్శనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 14.5 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాగునీటిప్రాజెక్టుల అమలులో సుమారు 60% పైగా మెరుగుదల కనిపించినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మహిళా నాయకత్వం స్థానిక పాలనను ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా తీసుకువస్తుందని స్పష్టంగా చూపిస్తుంది.అప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యంప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, పార్లమెంటులో మహిళలప్రాతినిధ్యం సగటున 27.5%గా ఉంది. మహిళ లప్రాతినిధ్యం పెరిగిన దేశాల్లో సమాజం ఎంతోవేగంగా అభివృద్ధి చెందిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యధికంగా 64% మంది మహిళలు పార్లమెంటులో ఉన్న రువాండాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అక్కడ మహిళా నాయకత్వం వల్ల భూమిపై మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు వచ్చాయి, ప్రస్తుతం అక్కడ 26% భూమి మహిళల పేరు మీదనే ఉంది. తల్లి మరణాల రేటు సగానికి పైగా తగ్గడమే కాకుండా, ఆడపిల్లలందరికీప్రాథమిక విద్య అందేలా అక్కడి మహిళా నాయకులు అద్భుతమైన కృషి చేశారు. అర్జెంటీనా వంటి దేశాల్లో 42.4% మంది మహిళలు చట్టసభల్లో ఉండటం వల్ల మహిళల హక్కులకు సంబంధించిన బిల్లుల సంఖ్య భారీగా పెరిగింది. కుటుంబాల్లో మహిళలు చేసే అప్రకటిత సేవలకు (అన్‌పెయిడ్ కేర్ వర్క్) గుర్తింపు తెచ్చేలా వారు విధానాలను మార్చగలిగారు.సామాజిక జీవనం మారి పోయిందిస్వీడన్, నార్వే వంటి నార్డిక్ దేశాల్లో మహిళలప్రాతినిధ్యం 45% పైగా ఉండటం వల్ల అక్కడ సామాజిక జీవనమే మారి పోయింది. పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవడమే కాకుండా, తండ్రులకు కూడా సమానంగా పేరెంటల్ లీవ్స్ ఇచ్చేలా చట్టాలను రూపొందించారు. దీనివల్ల మహిళలు ఉద్యోగాల్లో, వ్యా పారాల్లో రాణించడానికి గొప్ప అవకాశం దక్కింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా 21% పైగా మహిళాప్రాతినిధ్యం ఉండటం వల్ల పేద కుటుంబాల సంక్షేమంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. జనాభాలో సగం ఉన్న మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే సమ్మిళిత ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. ఎన్ని సవాళ్లు ఉన్నా...ఈ రిజర్వేషన్ల విధానం సమాన అవకాశాలు అనే రాజ్యాంగప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తుందని కొందరు విమర్శకులు భావిస్తారు. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక వారి అర్హతలు, ప్రజాబలం, సిద్ధాంతాల ఆధారంగా జరగాలి కానీ, కేవలం జెండర్ ఆధారంగా జరగకూడదని వారు వాదిస్తారు. చట్టసభల్లో మహిళలకు స్థానాలు కేటాయించినప్పటికీ, వాస్తవంగా వారి కుటుంబాల్లోని పురుషులే పెత్తనం చెలాయించే అవకాశం ఉందనే విమర్శలు బలంగా ఉన్నాయి. అలాగే, ఓటర్ల స్వేచ్ఛ పరిమితం అవుతుందని, పార్టీల అంతర్గత విభేదాలు తలెత్తి భవిష్యత్తులో ఇతర వర్గాల నుండి కూడా ఇలాంటి కోటా డిమాండ్లు పుట్టుకొచ్చి వ్యవస్థను సంక్లిష్టం చేస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. పలువురు మహిళా నాయకులు సైతం తమను కేవలం ఒక మహిళగా కాకుండా, తమ నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాలని కోరుకోవడం కూడా గమనించాల్సిన అంశం. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మహిళలకుప్రాతినిధ్యం కల్పించే విధానం కేవలం రాజకీయ స్థానాలను పెంచే సాధారణ చర్య కాదు. ఇది భారతీయ సమాజాన్ని మరింత సమానత్వపూర్వకంగా మలిచే ఒక గొప్ప నిర్మాణాత్మక సంస్కరణ. చట్టసభల్లో మహిళలు అడుగుపెట్టడం వల్ల విధానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మానవీయ కోణాన్ని సంతరించుకుంటాయి. చట్టసభల వేదికగా మహిళలు ధైర్యంగా మాట్లాడటం, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువతులకు వారు సజీవ ఆదర్శంగా, మార్గదర్శకులుగా నిలుస్తారు.– బాల లత మల్లవరపు సివిల్స్ మెంబర్, డైరెక్టర్, ధనిక్ భారత్ప్రోత్సాహం అవసరంమామూలుగా ఒక బిల్లు అమలు చేయనున్నారనే వార్త రాగానే అందరం థ్యాంక్స్ చెబుతాం... ఎన్నో మాట్లాడతాం. కానీ ఆ బిల్లు పాస్ అవ్వాలి.. అంతటితో ఆగకూడదు... అమలు చేశాక దాని తాలూకు పనులు సరిగ్గా జరుగుతున్నాయా... లేదా అనేది ముఖ్యం. ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిసారీ మహిళల కోసం ఏదో చేస్తాం అని మాటలు చెబితే చాలామంది నమ్మే పరిస్థితుల్లో లేరు. చెప్పినది అమలు చేయాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలాంటివి అమలు చేసినా... చేయక పోయినా అన్ని రంగాల్లో మహిళలు తమను నిరూపించుకుంటున్నారు. పాలిటిక్స్, జర్నలిజమ్, డాక్టర్స్, పైలట్స్... ఇలాంటి రంగాల్లో ముందుంటున్నారు. కష్టమైనా, ఒడిదుడుకులు ఎదురైనా తమ కలలను నిజం చేసుకుంటున్నారు. అయితే జనరల్‌గా మహిళల శాతం ఏ రంగంలో అయినా తక్కువే ఉంటోంది. అంతెందుకు? పొలిటికల్ మీటింగ్స్ తీసుకోండి... 20 మంది మగవాళ్లు ఉంటే అందులో ఓ ముగ్గురు లేదా నలుగురు మహిళలు ఉంటే అది పెద్ద విషయం. అదే ఒక బిల్లు పాస్ అయినప్పుడు, అది ఒక ‘లా’ అయినప్పుడు కేటాయించిన ‘శాతం’లో మహిళలకు పూర్తి అవకాశం దక్కుతుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలదే. రూరల్ ఏరియాస్‌లో కొన్ని చోట్ల ఇంకా మహిళల పట్ల కాస్త వివక్ష ఉందనిపిస్తోంది. చె΄్పాలంటే ఈ విషయంలో నార్త్ కంటే సౌత్ కొంత బెస్ట్. అక్కడితే పోలిస్తే ఇక్కడ మహిళలకు ప్రోత్సాహం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ‘గ్రాస్ రూట్’ లెవల్లో ఉన్న అమ్మాయిలకు ఇంకా ఎంకరేజ్మెంట్ అవసరం. ఇప్పుడు మారుమూలప్రాంతాల్లో కూడా అమ్మాయిలను చదివిస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్లను ఎంకరేజ్ చేయాలి. ‘గ్రాస్ రూట్’ లెవల్ నుంచి ఆ నెక్ట్స్ లెవల్ వరకూ అందరూ ముందుకు వస్తే అప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్ ఫుల్ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ చట్టం అమలులోకి తెచ్చినా మహిళలు సద్వినియోగం చేసుకోక పోతే ఇక ఉపయోగం ఏం ఉంటుంది? అందుకే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలచుకున్నాను. కాస్త ధైర్యంగా మాట్లాడే మహిళలను ఎలా ఎదగనివ్వకుండా చేయాలా... అని కొంతమంది చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి, అనుకున్నది సాధించిన మహిళలు ఉన్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోవాలి. మహిళలకు కేటాయించినవి దక్కించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ముందుకు రండి... నిరూపించుకుని నిలబడండి. – జయసుధ, నటిఇదో గొప్ప ముందడుగుఈ 33 శాతం రిజర్వేషన్ బిల్లు మహిళా సాధికారతకు భరోసా ఇస్తుంది. నారీ శక్తి కేవలం మాటలకే పరిమితం కాదు, ప్రధాని దానిని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, చెందుతుంది అంటే మహిళలకు సాధికారత కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ బిల్లు వ్యవస్థపై, పాలకవర్గంపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ బిల్లు ఒక గొప్ప ముందడుగు, ఒక కల నిజమైన క్షణం. – ఖుష్బూ, నటిస్ఫూర్తిదాయకం33 శాతం బిల్లు అనేది కచ్చితంగా ఆహ్వానించదగ్గది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించే ఇలాంటి నిర్ణయాలు స్వాగతించదగ్గవి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది. రాజకీయాలైనా, సినిమా అయినా... ఏ రంగం అయినా మనకు వచ్చిన చాన్స్‌ని ఉపయోగించుకోవాలి. సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఇలాంటి రిజర్వేషన్లు ఉండవు. కానీ, 33 శాతం అనేది ఇతర రంగాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వాలి. అలాగే ఎవరో ఒకరు ప్రోత్సహించాలని ఆశించకుండా అమ్మాయిలు తమకు తాముగా కూడా ముందడుగు వేయాలి. – మానస శర్మ, యువ దర్శకురాలుఐపీయూ (ఇంటర్– పార్లమెంటరీ యూనియన్) అనేది ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లకు సంబంధించిన సంస్థ. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పాటైంది. పార్లమెంట్లు మరింత బలంగా, పర్యావరణహితంగా ఉండడానికి, లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది ఐపీయూ. ∙ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వంలో మహిళలప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనీ, అత్యంత శక్తిమంతమైన నిర్ణయాలు ఇప్పటికీ పురుషులే తీసుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.ఐపీయూ, యూఎన్ ఉమెన్ విడుదల చేసిన గణాంకాలలో ముఖ్యాంశాలు...27.5%ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ సీట్లలో 27.5 శాతం మహిళలు ఉన్నారు. ఇది 2025 నాటి 27.2 శాతం కంటే కొద్దిగా ఎక్కువ. రాజకీయప్రాతినిధ్యానికి సంబంధించి మహిళలు ఎంత నెమ్మదిగా పురోగమిస్తున్నారో ఇది తెలియజేస్తుంది.19.9%జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 54 మంది మహిళలు పార్లమెంట్ స్పీకర్లుగా ఉన్నారు. మొత్తం స్పీకర్లలో ఇది 19.9 శాతం.76%రాజకీయాల్లోని మహిళలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వివిధ రకాలుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మహిళా పార్లమెంటేరియన్లలో 76 శాతం మంది బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. సమాన రాజకీయ అధికారం దిశగా మహిళల పురోగతిని మందగింపచేసే ప్రయత్నాల్లో భాగమే ఈ బెదిరింపులు.మహిళలు నాయకత్వ స్థానాలకు చేరుకున్నప్పటికీ తరచుగా అ్ర పాధాన్య శాఖలకే పరిమితమవుతున్నారురక్షణ, హోం, న్యాయ, ఆర్థిక, ఆరోగ్య, విద్య వంటి మంత్రిత్వశాఖలను దాదాపుగా పురుషులే నిర్వహిస్తున్నారు. 14 దేశాలుప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల క్యాబినెట్లో లింగసమానత్వాన్ని సాధించాయి. సమానప్రాతినిధ్యం సాధ్యమేనని నిరూపించాయి. ఎనిమిది దేశాలలో ఇప్పటికీ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. -
వస్తున్నాయ్... వస్తున్నాయ్.. నారీశక్తి రథచక్రాలు
నారీశక్తి రథచక్రాల్ వస్తున్నాయ్... వస్తున్నాయ్’... అవును... ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి చట్టరూపాన్ని తీసుకోనుంది. ‘మేముపాలిచ్చి పెంచినవాళ్లే మమ్మల్ని విభజించిపాలిస్తున్నారు’ అని గతంలో ఒక కవయిత్రి రాశారు.పాలిచ్చి పెంచగలిగే స్త్రీలకు ప్రజలనుపాలించడం తెలియదా? తెలుసు. మహిళల ప్రాతినిధ్యం పెరగడం ఎంత అవసరమో దాని వల్ల చట్టసభలలో స్త్రీ ప్రధాన, మానవీయ ప్రధాన అంశాలకు ఎంత చోటు దొరకగలదో అందరికీ తెలుసు. కాని ఆట కొనసాగింది. అయితే ఏ ఆటకైనా ముగింపు ఉండనే ఉంది.2026 అందుకు సాక్షిగా నిలవొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లులో సహేతుకమైన సవరింపులు కూడా ఉన్నాయి. స్త్రీలకు ప్రాతినిధ్యం అన్నప్పుడు స్త్రీలలో ఉన్న అన్ని శ్రేణులకూ చోటు దక్కాలనుకోవడం ఒక న్యాయమైన ప్రతిపాదనే. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏప్రిల్ 16 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక చర్చ చేయనున్న సందర్భంగా వివిధ ఆలోచనాపరుల అబీప్రాయాలను ఇక్కడ అందిస్తున్నాం.ఓబీసీ కోటా అవసరంభారత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ అనేది ఒక ఎడతెగని చర్చ. ఈ ముప్ఫై ఏళ్లలో ప్రతిసారీ ఒకే ప్రశ్న దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుకి పీటముడి పడి ఆగిపోతోంది. మారుతున్న కాలంలో స్త్రీలకు రిజర్వేషన్లు అంగీకరించే విషయంగా భావిస్తున్నప్పటికీ దానిలో ఇతర వెనుకబడిన కులాలకు కూడా కోటా వుండాలి అనే అంశం దగ్గరే సమస్యంతా వస్తోంది. ఎస్.సి., ఎస్.టి. కులాలకు ఉప రిజర్వేషన్ వుంటుంది కదా ఇంకా అంతకు మించి వుండటం అనవసరం అనే భావజాలమే ప్రధానంగా పనిచేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీలలో 33% మహిళలకు కేటాయించే రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో సూటిగా చర్చించాలి.ఓబీసీ కోటా ఎందుకు అవసరం అంటే, ప్రజాస్వామిక రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అనేవి చాలా ముఖ్యమైన అంశం కాబట్టి! మన దేశంలో ఓబీసీ జనాభా అధికం అయినప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం తక్కువ, అందులో మహిళల శాతం మరీ తక్కువ. ఓబీసీ రిజర్వేషన్ కూడా ఉంటే గ్రామీణ మహిళలు కూడా రాజకీయ అవకాశాలలోకి, ప్రాతినిధ్యంలోకి రావటానికి ఊతం లభిస్తందనేది నిర్వివాదాంశం. స్త్రీలకు రాజకీయ అవకాశాలంటే అది కేవలం ఆధిపత్య కుల– వర్గ స్త్రీలకే అనే భావజాలం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా వుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి చాలా విషయాలను అధిగమించాల్సి వుంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. 50% రిజర్వేషన్ పరిమితిని పరిష్కరించడంతోపాటు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, సమగ్ర కులగణన, రాజకీయ అంగీకారం వంటి అనేక సీరియస్ అంశాలు దీనితో ముడిపడి వున్నాయి. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వడం ద్వారా సూత్ర్రపాయంగా సమానత్వం, మహిళా సాధికారతకు అడుగు ముందుకు పడుతుంది. అయితే కార్యాచరణలో ఇది అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. – కె. సజయ, సామాజిక కార్యకర్తఈ బిల్లు అనివార్యంప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మొత్తానికి కొంచం ఆలస్యంగానయినా 128వ అమెండ్మెంట్ బిల్లుగా ‘మహిళా రిజర్వేషన్ బిల్’ లోక్‌సభలో పరిగణనకు రానుంది. ఈ బిల్లు ప్రతిపాదించే 33 శాతం మహిళా రిజర్వేషన్లో ఎస్.సి., ఎస్.టి.లకు 1/3 శాతం సీట్లు ప్రతిపాదించారు. వాస్తవానికి రెండుసభల్లో (లోకసభ, రాజ్యసభలో) 2/3 శాతం మెజారిటీ వస్తేనే బిల్లుపాస్ అవుతుంది. అన్నిపార్టీల మద్దతుతోనే అది సాధ్యం అనేది జగమెరిగిన సత్యం. అదే జరిగి బిల్‌పాస్ అయితే లోకసభలో 33 శాతం సీట్లు మహిళలకు దక్కుతాయి.ఉభయసభల్లో మహిళల ప్రాధాన్యత వల్ల ఎన్నో ఉపయోగాలు లేకపోలేదు. మహిళా సమస్యలను చట్టసభల్లో గట్టిగా వినిపించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.పార్లమెంట్లో మహిళా బిల్లు పలుమార్లు ప్రతిపాదించడం, రిజెక్ట్ చెయ్యడం జరిగింది. 1996, 1998, 2002, 2003లోపార్లమెంట్లో రిజెక్ట్ చెయ్యడం జరిగింది. 2008లో రాజ్యసభలో ప్రతిపాదించినప్పుడు 186 ఓట్లతో ఆమోదం పొందింది కానీపార్లమెంట్లో ఆ బిల్ దురదృష్టవశాత్తు చర్చకు ఎప్పటికీ రానేలేదు. అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులయినా మహిళల ప్రాధాన్యతలో మార్పు పెద్దగా లేదని అర్థం. మన దేశంతో పోల్చినప్పుడు ఎంతో వెనకబడిన ఆఫ్రికన్ దేశం రువాండాలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా 61.3 శాతం ఉంది. చిన్న దేశమయినా... క్యూబాలో 53.2 శాతం, నేపాల్ 32.7 శాతం, ఫ్రాన్స్, కొరియ, నేపాల్‌లలో మహిళలకు 50 శాతంపార్టీ కోటాపాస్ చెయ్యడం జరిగింది. ఇండియా ముందు అతి చిన్న దేశాలయినా అర్జెంటీనా, మెక్సికో, కోస్టరికా దేశాల్లో 36 శాతం మహిళా లెజిస్లేటివ్ మెంబర్స్ ఉండడం విడ్డూరం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమయినా ఇండియాలో ప్రస్తుతం 14.4 శాతం మాత్రమే మహిళలకు ప్రాతినిధ్యం ఉండడం మనందరం సిగ్గు పడాల్సిన విషయం. మహిళా బిల్లు మన రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉండొచ్చేమో గాని మారిన కాలానికి అనుగుణంగా అదిపాస్ అవడం అనివార్యమే. మహిళా బిల్లు ఉభయ సభల్లో పూర్తి మెజారిటితోపాస్ అయితే అదొక కొత్త చరిత్రకు నాంది పలకొచ్చు. అందుకై ఆకాంక్షిస్తూ, మంచి మార్పును స్వాగతిస్తున్నాను. – నిశ్చల సిద్ధ రెడ్డి, హైకోర్టు న్యాయవాదివెంటనే అమలులోకి తేవాలిపార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకి సరయిన ప్రాతినిధ్యం కల్పించాలంటే ఏదో రకమైన రిజర్వేషన్లు తప్పనిసరి అన్నది 20వ శతాబ్దపు ప్రజాస్వామ్య చరిత్ర స్పష్టం చేసింది. మన దేశంలో గ్రామీణ పంచాయతీల్లోనూ, పట్టణపాలనా వ్యవస్థలోనూ దాదాపు 30 ఏళ్ల నుండి అమలవుతున్న రిజర్వేషన్ల కారణంగా అనేక మంది అణగారిన వర్గాల మహిళలు, దాని అమలులో ఎన్ని సమస్యలున్నా సరే, రాజకీయ అనుభవం గడించారు. గడిస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాల పోరాటం తర్వాత 2023లో ఏకగ్రీవంగా అన్నిపార్టీలూపార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని ఆలస్యం చెయ్యకుండా వెంటనే అమలులోకి తేవాలి.ఈ మూడు దశాబ్దాల్లో ప్రపంచంలో అనేక దేశాల్లో ఏదో రూపంలో మహిళలకి రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయన్నది గుర్తు చేసుకోవాలి. దీన్ని వివాదాస్పదమయిన డీలిమిటేషన్తోనూ ముడిపెట్టటం అవసరమైన ప్రజాస్వామిక చర్చ లేకుండా ప్రభుత్వం తేవాలని అనుకుంటున్న మార్పులకి మహిళా రిజర్వేషన్లని వాడుకోవటం కిందే చూడాలి. జనాభా లెక్కలకి దీనికి కూడా సంబంధం లేదు. అయితే, ఈ చట్టంలో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించిన దళిత, ఆదివాసీ మహిళలతోపాటు ఇతర వెనకబడిన, అణగారిన, అంచుల్లో వున్న అన్ని సమూహాలకు కూడా చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కలిపించాల్సిన అవసరం గురించి ఈ సందర్భంలో చర్చించాలి. దీని గురించిన అన్ని సమూహాలూ పోరాటం చేస్తూనే ఉంటాయి. – ఎ. సునీత, సామాజిక వ్యాఖ్యాతచారిత్రక స్పృహతో చర్చ జరగాలిఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రులుగా పనిచేసిన కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపార్లమెంట్‌లో వీగిపోయింది. మహిళల రిజర్వేషన్ చట్టంలో సమాంతర రిజర్వేషన్ (హారిజంటల్ రిజర్వేషన్స్)ల కోసం 1996లోపార్లమెంట్లో శరద్ యాదవ్, నితీష్ కుమార్‌లు గట్టిగా వాదనలు వినిపించారు. ఇప్పటిదాకా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలుపార్లమెంట్లో అడుగుపెట్టకుండా నిరోధించబడ్డారు...ఈ తప్పును సరిదిద్దాలని అంబేద్కర్ దృష్టి కోణం నుంచి వాదనలు జరిగాయి.2008లో జయంతి నటరాజన్ కమిటీకి ముందు ట్రాన్స్‌జెండర్ గ్రూప్‌లకు రిజర్వేషన్ ఉండాలనే డిమాండ్ ఉండేది. ఇది ఇంకా చర్చించ లేదు.పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రశంసించే క్రమంలో ప్రధాని మోదీ ‘మాతృశక్తి’ అనే పదాన్ని ఉపయోగించారు. 2010లో రాజ్యసభలో జరిగిన చర్చలో అన్నాడీయంకె సభ్యుడు డాక్టర్ మైత్రేయన్ ఉపయోగించిన పదం ఇది. మనకు ప్రాతినిధ్యం కావాలా, లేక గ్రేడెడ్ సొసైటీ(అంతరాల సమాజం)కి సమానమైన ప్రాతినిధ్యం కావాలా అనేది మన ముందు ఉన్న ప్రశ్న. దళిత్ హిస్టరీ మంత్ (ఏప్రిల్)లో మనం మాట్లాడుతున్నప్పుడు, న్యాయమైన ప్రాతినిధ్యం కోసం మనం ఇంకా ఎంతకాలం వేచి చూడాలి? మహిళా బిల్లుపై చారిత్రక స్పృహతో చర్చ జరగాలి. – కల్పన కన్నబిరాన్, స్త్రీవాద రచయితప్రభావ వంతమైన అడుగునేను నా జీవితమంతా పరుగులతోనే గడిపాను. మొదట కేరళలోని మట్టిదారులలో, ఆ తరువాత ప్రపంచ వేదికపై. ఇప్పుడు ప్రజాజీవనదారుల్లో అడుగులు వేస్తున్నాను. మహిళలకు రాజకీయాలలో స్థానం లేదని చెప్పే అడ్డంకులను ఎదుర్కొన్నాను. వాటిలో కొన్ని కంటికి కనిపించేవి. మరికొన్ని మాటల్లో చెప్పలేనివి. అడ్డంకులు తొలగితే వచ్చే ఫలితం ఏమిటో చూశాను. అవకాశం ఫలితాన్ని మారుస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే నారీ శక్తి వందన అధినియమ్ అనేది కేవలం ఒక శాసనపరమైన మైలురాయి మాత్రమే కాదు. నామమాత్రపు పని కూడా కాదు. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఒక ప్రభావవంతమైన అడుగు.– పి.టి.ఉష, క్రీడాకారిణి∙అంతర్జాతీయంగాజెండర్ కోటా లేకుండానే...జాతీయపార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి క్యూబా రెండో స్థానంలో నిలిచింది. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఎన్నో దేశాలు కోటాలను ఉపయోగిస్తుండగా, క్యూబా అవి లేకుండానే చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అగ్రస్థానంలో ఉంది.కీలకపాత్రమహిళల రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో లాటిన్ అమెరికా దేశాలు అగ్రగామిగా ఉన్నాయి. చట్టసభల ద్వారా లింగ సమానత్వాన్ని పెంచడానికి, బాలికలు, మహిళలపై హింసను నిరోధించడానికి చట్టసభలలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.అగ్రస్థానంలో రువాండాచట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలలో రువాండా మొదటి స్థానంలో ఉంది. అక్కడి చట్టసభలలో 63.9 శాతం మహిళలు ఉండడం విశేషం. రువాండాలో 2003లో కొత్త రాజ్యాంగం ఏర్పాటు కావడం మహిళలకు సంబంధించి విప్లవాత్మకమైన సామాజిక మార్పుకు దారి తీసింది. ఈ కొత్త రాజ్యాంగం మహిళలకు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించింది.జెండర్ కోటా... ఎంతో ఉపయోగం’యూఎన్ ఉమెన్ డేటా ప్రకారం 1 జనవరి 2026 నాటికి... క్యాబినెట్ మంత్రి పదవులలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా మహిళలు కలిగిన ఉన్న దేశాలు 14 మాత్రమే.⇒ ఐరోపా, ఉత్తర అమెరికాపార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం ఉంది. ∙జెండర్ కోటాలు మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి గణనీయంగా తోడ్పడ్డాయి. కోటా లేని దేశాలతో పోల్చితే, ఉన్న దేశాలలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏడు శాతం ఎక్కువగా ఉంది.మదర్ ఆఫ్ పార్లమెంట్లో...‘మదర్ ఆఫ్పార్లమెంట్’గా యూకేపార్లమెంట్కు పేరు. యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో మహిళల ప్రాతినిధ్యం 40.6 శాతం ఉంది. యూకే రాజకీయాలలో లింగ సమానత్వం దిశగా జరుగుతున్న పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని గణంకాలు సూచిస్తున్నాయి.ఒక్కరూ లేరు!2026 సంవత్సరం ఆరంభం నాటికి చైనా ఉన్నత స్థాయి రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. చైనా అత్యున్నతపాలక మండలి అయిన ఏడుగురు సభ్యుల పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఒక్కరు కూడా మహిళా లేరు. -
డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు, లోక్‌సభ స్థానాల పెంపుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టనున్నారు. దానితో పాటు డీలిమిటేషన్ బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి 18 దాకా పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుండటం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లుఖరీఫ్ సీజన్‌కు ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంపు నిర్ణయానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందుకు రూ.41,533.81 కేటాయించారు. 2025 ఖరీఫ్ సీజన్ బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,317 కోట్లు అదనమని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు భారీగా పెరిగినా రైతులకు మాత్రం 50 కిలోల బస్తాను రూ.1,350కే అందుబాటులో ఉంచుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా రాయితీని హేతుబద్ధీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘రూ.13 వేల కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో కూడిన జైపూర్ మెట్రో రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 36 స్టేషన్లతో 41 కి.మీ. మేరకు ఉంటుంది’’ అని వైష్ణవ్ వివరించారు. -
16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యేకంగా కొలువుదీరుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయడంతోపాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంపు, రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచడానికి ఉద్దేశించిన బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ నెల 16, 17, 18న లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం నిరవధికంగా వాయిదా పడాల్సిన ఉభయ సభలు, ప్రత్యేక సమావేశాల దృష్ట్యా 16వ తేదికి వాయిదా పడ్డాయి. కీలకమైన బిల్లుపై చర్చ కోసం ఉభయ సభలు త్వరలోనే భేటీ అవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రకటించారు. కొన్ని ముఖ్యమైన బిల్లులు, అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రభుత్వం పెత్తందారులాగా వ్యవహరిస్తోందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అంశంతో రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఏ బిల్లును ఎప్పుడు తీసుకురావాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. త్వరలో సభ మళ్లీ సమావేశం కాబోతుందని, అందుకు కారణం ఏమిటో సభ్యులకు తెలుసని కిరణ్ రిజిజు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేశ్ తప్పుపట్టారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఈ సమయంలో బిల్లు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. ఇది పూర్తిగా అభ్యంతరకరమని చెప్పారు. ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో హామీని నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కిరణ్ రిజిజు బదులిచ్చారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో ఈ అంశానికి సంబంధం లేదన్నారు. ముఖ్యమైన బిల్లుపై రాజకీయం చేయొద్దని విపక్షాలను కోరారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. బిల్లును ఎప్పుడు, ఎలా తీసుకురావాలన్న దానిపై డ్రామాలు ఆడొద్దని అన్నారు. -
President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. జనవరి 22 చిరస్మరణీయమైన రోజు ‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు. నక్సల్స్ హింసాకాండ తగ్గుముఖం ఆర్టికల్ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది. అదుపులోనే ద్రవ్యోల్బణం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’. మహిళలకు 15 వేల డ్రోన్లు ‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి ‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం) పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’. 25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు ‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’. -
మహిళా రిజర్వేషన్ బిల్లు... ఆ భాగాన్ని కొట్టేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన మహిళల రిజర్వేషన్ బిల్లులో ‘జనగణన అనంతరం అమల్లోకి వస్తుంది’అని పేర్కొంటున్న భాగాన్ని కొట్టేయడం చాలా కష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులిచ్చేందుకు తిరస్కరించింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో తెచి్చన మహిళా బిల్లును రానున్న సాధారణ ఎన్నికల్లోపే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి దర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. దీన్ని ఈ అంశంపై దాఖలైన మరో పిటిషన్‌తో పాటు నవంబర్ 22న విచారిస్తామని పేర్కొంది. లోక్‌సభలోనూ, అసెంబ్లీల్లోనూ మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేస్తూ కేంద్రంలో బీజేపీ సర్కారు సెపె్టంబర్ 21న ఈ బిల్లు తేవడం తెలిసిందే. దానికి పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా లభించింది. ఇక మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదమే మిగిలింది. ఇది నిజంగా మంచి ముందడుగని ధర్మాసనం అభిప్రాయపడింది. -
భారత్ స్వరం మరింత బలపడుతోంది
పితోర్‌గఢ్: సవాళ్లతోనిండిన ప్రపంచంలో భారత్ వాణి మరింత బలపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ సత్తా చాటుకుందని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి గత 30, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై సైతం తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైందని తెలిపిన ప్రధాని మోదీ, చంద్రుడిపై వేరే ఏ దేశమూ చేరుకోని ప్రాంతంలోకి మనం వెళ్లగలిగామన్నారు. ‘ఒక సమయంలో దేశంలో నిరాశానిస్పృహలు ఆవరించి ఉండేవి. వేల కోట్ల రూపాయల కుంభకోణాల చీకట్ల నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందా అని ప్రజలు ప్రార్థించేవారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. వెనుకబడిన ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రజలు వలస బాట పట్టారు. పరిస్థితులు మారి అలా వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు’అని ప్రధాని చెప్పారు. ‘ప్రపంచమంతటా సవాళ్లు నిండి ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్ వాణి గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచానికే భారత్ మార్గదర్శిగా మారడం మీకు గర్వకారణం కాదా? ఈ మార్పు మోదీ తీసుకువచ్చింది కాదు. రెండోసారి మళ్లీ అధికారం అప్పగించిన 140 కోట్ల దేశ ప్రజలది’అని ప్రధాని అన్నారు. గత అయిదేళ్లలో 13.50 కోట్ల ప్రజలను పేదరికం నుంచి తమ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చిందన్నారు. పేదరికాన్ని అధిగమించగలమని దేశం నిరూపించిందని చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రజలు తనను కుటుంబసభ్యునిగా భావించారని చెప్పారు. రూ.4,200 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆదికైలాస శిఖరంపై ప్రధాని ధ్యానం అంతకుముందు, రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం జోలింగ్‌కాంగ్ చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన స్వాగతం పలికారు. జోలింగ్‌కాంగ్‌లోని పార్వతీ కుండ్ వద్ద ఉన్న శివపార్వతీ ఆలయంలో ఆరతిచ్చి, శంఖం ఊదారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని పరమేశ్వరుని నివాసంగా భావించే ఆది కైలాస పర్వత శిఖరాన్ని సందర్శించుకున్నారు. అక్కడ కాసేపు ధ్యానముద్రలో గడిపారు. అనంతరం అక్కడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామం గుంజికి చేరుకున్నారు. అక్కడి మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. స్థానికులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. ఉన్ని దుస్తులు, కళారూపాలతో ఏర్పాటైన ప్రదర్శనను తిలకించారు. భద్రతా సిబ్బందితోనూ ప్రధాని ముచ్చటించారు. అక్కడ్నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్మోరా జిల్లాలో పురాతన శివాలయం జగదేశ్వర్ ధామ్‌కు వెళ్లారు. అక్కడున్న జ్యోతిర్లింగానికి ప్రదక్షిణలు, పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రధాని పితోర్‌గఢ్‌కు చేరుకున్నారు. అత్యల్పానికి నిరుద్యోగిత: మోదీ న్యూఢిల్లీ: నానాటికీ దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత గత ఆరేళ్లలో అతి తక్కువగా నమోదైందని తెలిపారు. తాజాగా జరిపిన ఓ సర్వేలో ఈ మేరకు తేలిందని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ కౌశల్ దీక్షాంత్ సమారోహ్ను ఉద్దేశించి గురువారం ఆయన వీడియో సందేశమిచ్చారు. భారత్‌లో కొన్నేళ్లుగా ఉపాధి కల్పన కొత్త శిఖరాలకు చేరుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగిత బాగా తగ్గుముఖం పడుతోంది. అభివృద్ధి ఫలాలు పల్లెలను చేరుతున్నాయనేందుకు ఇది నిదర్శనం. ప్రగతిలో అవిప్పుడు పట్టణాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. అంతేకాదు, పనిచేసే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుండటం మరో సానుకూల పరిణామం. ఇదంతా మహిళా సాధికారత దిశగా కొన్నేళ్లుగా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల పర్యవసానమే’’ అని మోదీ చెప్పారు. -
మహిళలకు మంచి భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో భారతీయ మహిళల భవిష్యత్తు మెరుగవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. విప్లవాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట సభల్లోకి మరింత మంది మహిళలు అడుగు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ‘మహిళా రిజర్వేషన్లు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై లండన్‌లో ప్రముఖ పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్ ‘బ్రిడ్జి ఇండియా’ నిర్వహించిన సదస్సులో కవిత శనివారం కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉండగా బిల్లు అమలైతే ఈ సంఖ్య ఏకంగా 181కి చేరుతుందని ఆమె చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలను ఇంటికే పరిమితం చేయలేరని, ఈ విషయాన్ని గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో సానుకూలంగా వ్యవహరించాయని చెప్పారు. 1996లో దేవెగౌడ, 2010లో సోనియాగాంధీ, 2023లో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా బిల్లు కోసం చేసిన కృషికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని ప్రస్తావిస్తూ.. తెలంగాణ ఏర్పడిన నెల రోజుల్లోనే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాక బీఆర్ఎస్ ఎంపీలు అనేకమార్లు లోక్‌సభలో లేవనెత్తారని, కేసీఆర్ కూడా కేంద్రానికి అనేక పర్యాయాలు లేఖలు రాశారని తెలిపారు. అయితే వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు (ఓబీసీ) ప్రత్యేక కోటా లేకపోవడం దురదృష్టకరమని, దీని కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కవిత చేసిన కృషిని, పోరాటాన్ని పలువురు వక్తలు అభినందించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు -
ఓబీసీ మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతాం
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఓబీసీ మహిళా రిజర్వేషన్ల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత శుక్రవారం అంబేడ్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు తెరమీదకు తీసుకొచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. జనగణన, నియోజక వర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ల అమలును ముడిపెట్టడమే దీనికి నిదర్శనమన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు తేదీ లేని పోస్ట్‌డేటెడ్ చెక్కులా ఉండటంతో రిజర్వేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని మహిళా రిజర్వేషన్ల కోసం తాను ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన దూరదృష్టితో రూపకల్పన చేసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. మ్యూజియం సందర్శనకు వెళ్లిన కవితకు ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కర్ అండ్ బుద్దిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్తకార్యదర్శి శామ్కుమార్ స్వాగతం పలికారు. -
బిల్లు ఆమోదంతోనే సరిపోతుందా?
అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళల శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఉపయోగించుకొనేందుకు బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నారు. లింగ వైవిధ్యం కలిగిన రంగాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది చట్ట సభలకు సైతం వర్తిస్తుంది. ఎక్కువ మంది మహిళలు భాగస్వాములైతే – నేర, అవినీతిమయ స్వభావాల నుంచి ప్రేమ, వాత్సల్య స్వభావాలకు రాజకీయాలను మార్చడా నికి దోహదపడుతుందని సామాజికవేత్తల అంచనా. మహిళా బిల్లు ఆమోదం పొందడం ఓ చరిత్రాత్మక ఘట్టమే. కానీ, ఈ చట్టం విజయవంతం కావాలంటే పార్టీల స్వరూప స్వభావాలు మారాలి. అన్ని పార్టీలూ మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించి, వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందడం దేశ చరిత్రలో మైలురాయి. పార్టీలకు అతీతంగా విస్తృత స్థాయిలో ఈ బిల్లుకు ఆమోదం లభించినందున రెండో దశలో కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుకు అడ్డు చెప్పేందుకు ఆస్కారం లేదు. ఆ ప్రక్రియ కూడా పూర్తయితే 2026 నుంచి రిజ ర్వేషన్లు అమలులోకి వస్తాయి. ఆ లోగా కులగణన, నియోజక వర్గాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియలు ముగియాలి. ఎంతో వ్యవధి పట్టే ఈ కార్యక్రమాలు 2026 లోపు పూర్తవుతాయా? అందుకే కాబోలు,కాంగ్రెస్ నేత ఒకరు ఈ బిల్లును ‘పోస్ట్ డేటెడ్ చెక్’తో పోల్చారు. ప్రాంతీయ పార్టీలపై నెపాన్ని నెట్టి 2004–14 మధ్య పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అటకెక్కించింది. ఆ విధంగా చూసిన పుడు చెల్లని చెక్కు కంటే పోస్ట్ డేటెడ్ చెక్ మేలు కదా? తాము అధికా రంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేసే అవకాశాన్ని జారవిడుచుకొన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోటా ఉండాలన్న డిమాండ్ దాదాపుగా అన్ని రాజ కీయ పార్టీలు చేస్తున్నందున భవిష్యత్తులో అందుకు అవసరమైన సవరణలు జరుగుతాయనే ఆశించాలి. భారతదేశంలో అనాది నుంచి మహిళల పట్ల భిన్నమైన దృక్ప థాలు చూపడం కనిపిస్తుంది. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు మహిళను మాతృమూర్తిగా చూపిస్తూ ఉన్నత స్థానాన్ని కల్పించాయి. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ సిరులు పండుతా యని భారతీయులు పవిత్రంగా భావించే వేదాలు ఘోషించాయి. అదే సమయంలో ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ అంటూ మహిళల స్వేచ్ఛను అణచివేసే అనేక దురాగతాలు భారత ఉపఖండంలో జరిగాయి. స్వాతంత్య్రానంతరం వివిధ చట్టాల ద్వారా బాల్య వివాహాలు, సతీసహగమనం, వితంతు వివాహాల నిషేధం వంటి దురాచారాలను సరిదిద్దడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ చట్టాల కంటే సంప్రదాయాలకే మొగ్గుచూపే భారతీయ సమాజంలో చట్టాల వల్ల ఒనగూరిన ప్రయోజనం తక్కువే! చట్టాల అమలు కంటే ప్రజా చైతన్యం ద్వారా మొదలయిన సంస్కరణోద్యమాలు చక్కని ఫలితాలు అందించాయి. సావిత్రీబాయి ఫూలే మహిళా విద్య కోసం చేసిన కృషి, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు వంటి రచయితలు, సంఘసంస్కర్తలు తెలుగునాట వితంతు వివాహాలు జరగడానికి చేసిన కృషి చెప్పుకోదగ్గది. జాతీయోద్యమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడానికి గాంధీజీ కృషిచేశారు. ఆయన తన సతీమణి కస్తూర్బాను వివిధ ఉద్యమాలలో పాల్గొనేలా ప్రోత్సహించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలలో మహిళలు గణనీయ సంఖ్యలో పాలుపంచుకొన్నారు. గొప్ప కవయిత్రిగా పేరు తెచ్చుకొన్న సరోజినీ నాయుడు గాంధీజీ చొరవతోనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలై, రాజకీయాలలో మహిళలు ప్రవేశించడానికి ప్రేరణగా నిలిచారు. ప్రపంచంలోనే అతిగొప్ప ఉద్యమాలలో ఒకటిగా చెప్పుకొనే తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంత గ్రామీణ పేద మహిళలు ప్రముఖ పాత్ర పోషించారు. వీరమహిళ చాకలి ఐలమ్మ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇందిరా గాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, విజయరాజె సింథియా వంటి వారు రాజకీయాలలో మహిళలు చురుకైన భాగ స్వామ్యం వహించడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇక 1983లో నందమూరి తారక రామారావు మహిళలకు తండ్రి ఆస్తిలో సగభాగం దక్కేలా చట్టం చేయడం, స్థానిక సంస్థలలో తొలి సారిగా 9 శాతం రిజర్వేషన్లు అందించడం చారిత్రాత్మక ఘట్టాలుగానే పరిగణించాలి. ఆ తర్వాత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, అభయహస్తం వంటి పథకాలు మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్ని రకాల నామినేటెడ్ పదవులలో పార్టీ పరంగా 40 శాతంకు పైగా అందిస్తూ, చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రిజర్వేషన్లే ఉండాలన్న నిబంధన అవసరం లేదని రుజువు చేశారు. ‘జిందా తిలిస్మాథ్’ కాదు! మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఒక్క ఎంఐఎం తప్ప పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం విశేషం. దీనిని బట్టి ఆయా పార్టీలలో ఉన్న పురుషాధిక్యత తొలగిపోయిందనుకుంటే పొరపాటే! ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం ద్వారా మహిళల సమస్యలన్నింటినీ పరిష్కరించేసినట్లు ప్రచారం చేసుకొంటోంది. కాంగ్రెస్ పార్టీ, ఇంకా కొన్ని పార్టీలు తాము ఎక్కడ వెనకబడిపోతామో అనే భయంతో అసలు మహిళా బిల్లును ముందుకు తెచ్చింది ‘మేమంటే మేము’ అని తమను తామే అభినందించుకోవడం విడ్డూరం. చట్టసభలలో మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన వారికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కాజాలవు. అదే నిజమైతే స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు పొందుతున్న మహిళలు తమ ప్రాంతాలలో ఏవైనా అద్భుతాలు సాధించారా? వారికి ఆ అవకాశం లభించకపోవడానికి కావడమేమిటి? జిల్లా పరిషత్‌ల పరిధిలో బాలికల విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించి ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు అమలు జరుగుతున్నాయా? ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు తగినన్ని మరుగుదొడ్లు లేనందున ‘డ్రాపవుట్లు’ ఎక్కువగా ఉంటున్నాయి. స్థానిక ప్రభుత్వాలలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగినప్పటికీ ఎందువల్ల మహిళలకు సముచిత న్యాయం జరగడం లేదు? కొన్ని ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను మహిళల పేరిట అందజేస్తున్న మాట నిజమేగానీ, మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, గృహæహింస, మహిళల అదృశ్యం (ఉమెన్ ట్రాఫికింగ్) మొదలైన కేసుల్లో ఎంతో వెనుకబడి ఉన్నాం. మహిళా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం ఓ చారిత్రాత్మక ఘట్టమే. కానీ, ఈ చట్టం విజయవంతం కావాలంటే రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలు మారాలి. సమ సమాజమే ధ్యేయం అని చెప్పుకొంటూ మహిళల సమస్యలపై ఉద్యమించడానికి ప్రత్యేక అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకొన్న కమ్యూనిస్టు పార్టీల పొలిట్ బ్యూరోలలో, సెంట్రల్ కమిటీలలో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. మహిళా బిల్లు ఘనత తమదేనని చాటుకొంటున్న బీజేపీ కార్యవర్గంలోకి 33 శాతం మంది మహిళల్ని ఎప్పుడు నియమిస్తారు? రాజకీయ పార్టీలలో ముందుగా భాగస్వామ్యం లేకుండా వారిని చట్టసభలకు పంపడం ఏ విధంగా సాధ్యపడుతుంది? మహిళా బిల్లు అమలు కావడానికి ఇంకా సమయం ఉంది కనుక, ఈలోపే అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు సముచిత భాగ స్వామ్యం కల్పించి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. కీలకమైన పదవులలో వారికి స్థానం కల్పించాలి. ప్రతి నిర్ణయంలో వారికి భాగ స్వామ్యం ఉండాలి. ఇదంతా ఓ సుదీర్ఘ ప్రక్రియ. ఇందుకు భారతీయ జనతా పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు తగిన కార్యాచరణ చేపడితేనే, మహిళా సాధికారత పట్ల వారికున్న చిత్తశుద్ధి తేటతెల్లం అవుతుంది. ఈ రాజకీయ ప్రక్రియ లేకుండా మహిళా బిల్లును కేవలం ఓ ‘స్కీమ్’లా అమలు చేయాలని చూస్తే ఫలితాలు అందవు. లేకుంటే, ఆపరేషన్ విజయవంతమేగానీ రోగి బతకలేదన్నట్టు ఇదొక ప్రహస నంలా మిగిలిపోతుంది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉన్నారని అన్నారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని తెలిపారు. అయితే మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలన్న గవర్నర్.. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. నాపై రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటా.. పిన్స్ వేస్తే ఆ పిన్స్ గుచ్చుకొని వచ్చే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాస్తానంటూ తమిళిసై వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం గవర్నర్ మాట్లాడుతూ.. లోక్‌సభ, శాసనసభలో 33% మహిళా రిజర్వేషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక కలతోనే రాజకీయాల్లోకి వస్తారని, అవకాశం వచ్చినప్పుడు పురుషులతో పోలిస్తే 20 రేట్లు ఎక్కువగా పని చేస్తే కానీ మహిళకు గుర్తింపు లభించదని తమిళిసై అన్నారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనని, ఇప్పుడు గవర్నర్ అని పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీలో 33 శాతం రిజర్వేషన్‌ను మహిళలకు కల్పిస్తూ పార్టీ నిర్ణయించిందని, ఫలితంగా ఎంతోమంది మహిళలు పార్టీలో చేరారని ప్రస్తావించారు. రాజకీయాలపై మక్కువతోనే తను ఎంతగానో ఇష్టమైన వైద్యవృత్తిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు గవర్నర్. ‘రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. భారత్‌లో 15 లక్షల పంచాయతీలకు ప్రెసిడెంట్లుగా మహిళలు ఉన్నారు. నేను పురుషులకంటే మెరుగ్గానే పని చేస్తున్నాను. ఇకపై రాజకీయాల్లో మహిళా పవర్ కనిపిస్తుంది. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక మహిళా మంత్రి కూడా లేరు. గవర్నర్‌గా పదవి చేపట్టిన రోజు సాయంత్రం ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకున్నా పనిచేసుకుంటూ పోతానంటూ’ తమిళిసై పేర్కొన్నారు. చదవండి: పాతబస్తీ ఫలక్‌నుమాలో మరో బాలుడు కిడ్నాప్.. -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్ట రూపం
ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ ద్వారా ఆమోదించబడ్డ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో చట్ట రూపంలోకి వచ్చింది. కాగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఇరు సభల్లోనూ ఆమోద ముద్ర పడింది. ఇప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో మహిళా బిల్లు చట్ట రూపం దాల్చింది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. దీనికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. ఇది 2029 కల్లా జరిగే అవకాశముంది. ఏమిటీ బిల్లు? ► ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియమ్‌గా పేర్కొంటున్నారు. ► దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ► ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. -
మహిళా రిజర్వేషన్‌కు మద్దతుగా ఏపీ అసెంబ్లీ
-
అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే
జైపూర్: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును సవరిస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ బిల్లు అమలుకు ప్రస్తుతానికి ఎటువంటి ప్రధాన అవరోధాలు లేకున్నా మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల వరకు పక్కనబెడుతోందని ఆయన ఆరోపించారు. జైపూర్‌లో శనివారం జరిగిన పార్టీ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. -
PRS Legislative Research: నిర్ణీత సమయానికి మించి పనిచేసిన పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో లోక్‌సభ, రాజ్యసభలు షెడ్యూల్ సమయానికి మించి పనిచేశాయి. 17వ లోక్‌సభ సెషన్లలో ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి సమయంపాటు కార్యకలాపాలు కొనసాగించిన ఏకైక సెషన్ కూడా ఇదే. ఈ విషయాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తెలిపింది. గురువారంతో ముగిసిన ఈ ప్రత్యేక సెషన్లో 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం, చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ జరిగింది. ఒకే ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. స్పెషల్ సెషన్లో లోక్‌సభ షెడ్యూల్ సమయం 22 గంటల 45 నిమిషాలు కాగా ఎనిమిదిగంటల కంటే ఎక్కువగా మొత్తం 31 గంటలపాటు పనిచేయడం విశేషం. దీంతో, లోక్‌సభ 137 శాతం ఎక్కువ సమయం పనిచేసింది. అదే విధంగా, రాజ్యసభ షెడ్యూల్ సమయం 21 గంటల 45 నిమిషాలు కాగా, 27 గంటల 44 నిమిషాల సేపు కార్యకలాపాలు సాగాయి. దీంతో, రాజ్యసభ 128 శాతం ఎక్కువ సమయం పనిచేసినట్లయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరించింది. -
Womens Reservation Bill 2023: ఓబీసీలను అధికారానికి దూరం చేశారు
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీయే హయాంలో తాము ప్రతిపాదించిన బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తామని పేర్కొనపోవడం పట్ల తనకిప్పటికీ ఎంతగానో ఆవేదనగా ఉందని చెప్పారు. ఇప్పుడు వారికి రిజర్వేషన్ కోసం పట్టుబడతామని ఒక ప్రశ్నకు బదులుగా స్పష్టం చేశారు. మోదీ సర్కారు ఫక్తు రాజకీయ కారణాలతోనే మహిళా బిల్లు తెచి్చందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీలకు ప్రత్యేక కోటా పెట్టకపోవడం ద్వారా వారిని అధికారానికి దూరం చేసిందని రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం తక్షణం కుల గణన చేపట్టి, ఆ వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగపరచాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇతర సామాజిక వర్గాల మహిళలకు కూడా వారి జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దృష్టి మళ్లించే నాటకమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను అధికార బీజేపీ ప్రతిపాదించినప్పుడు తాము ఆహ్వానించామని రాహుల్ అన్నారు. ‘ఆ సందర్భంగా ఎంపీలమంతా అట్టహాసంగా పార్లమెంటు పాత భవనంలో నుంచి కొత్త భవనంలోకి మారాం కూడా. మోదీ కూడా అత్యంత నాటకీయ ఫక్కీలో రాజ్యాంగ ప్రతిని చేబూనారు. ’అతి ముఖ్యమైన బిల్లును ఆమోదించబోతున్నాం, అంతా సహకరించండి’ అని అన్నారు. ఆయన ప్రతిపాదించిన మహిళా బిల్లు నిస్సందేహంగా వారి సాధికారత దిశగా కీలక అడుగు. కానీ జన గణన, డీ లిమిటేషన్ రూపంలో రెండు మెలికలు పెట్టారు. వాటివల్ల అది మరో పదేళ్లకు గానీ అమల్లోకి రాదు. ఇది ఫక్తు సమస్యల నుంచి దృష్టి మళ్లించే కుట్రే‘ అని ఆరోపించారు. అధిక సంఖ్యాకులకు అధికారమేది? కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో కేవలం ముగ్గురు ఓబీసీలు మాత్రమే ఉన్నారని తెలిసి తాను షాకయ్యానని రాహుల్ అన్నారు. ‘ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కలిపి బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం ఆరు శాతం! ప్రధాని మోదీ మాట్లాడితే తాను ఓబీసీ నేతను అంటుంటారు. వారి చేతుల్లో అధికారం లేని ఈ దురవస్థకు కారణం ఏమిటో ఆయనే చెప్పాలి. ఈ చేదు నిజాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఓబీసీలు ఎందరు? ఇతర సామాజికవర్గాల వారు ఎందరు? ఇవిప్పుడు కీలక ప్రశ్నలు. అందుకే మేం కుల గణనకు డిమాండ్ చేస్తున్నాం‘ అని చెప్పారు. ‘దేశ ప్రజలకు అధికారాన్ని బదలాయించాలంటే ఈ సామాజిక గణాంకాలు తెలియడం చాలా అవసరం. జన గణన ఇప్పటికే జరిగింది గనుక ఈ లెక్కలన్నీ ఇప్పటికే కేంద్రం వద్ద అన్నాయి. ప్రధాని మోదీ వాటిని ఎందుకు విడుదల చేయడం లేదు?‘ అని రాహుల్ ప్రశ్నించారు. వారికి భాగస్వామ్యం ఉందా? తమ పార్టీలో అత్యధిక సంఖ్యలో ఓబీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్న బీజేపీ వాదనను రాహుల్ ఎద్దేవా చేశారు. ‘చట్టాల రూపకల్పనలో, దేశ ద్రవ్య వినిమయంలో వారు ఏ మేరకు పాలుపంచుకుంటున్నారో అడగండి. అసలే లేదని వారే అంగీకరిస్తారు‘ అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే లోక్ సభలో బీజేపీ ఎంపీలకు వాస్తవంలో ఎలాంటి అధికారాలూ లేవని రాహుల్ అన్నారు. వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారన్నారు. ఒక బీజేపీ ఎంపీయే తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
Womens Reservation Bill 2023: సుస్థిర ప్రభుత్వం వల్లే మహిళా బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్రంలో పూర్తి మెజార్టీతో కూడిన బలమైన, సుస్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బిల్లుకు రికార్డు స్థాయిలో మద్దతు లభించిందని, చిరకాలం నాటి కల సాకారమైందని అన్నారు. పూర్తి మెజార్టీతో కూడిన స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకోవచ్చని ఈ పరిణామం నిరూపిస్తోందని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ మహిళా ఎంపీలు, నేతలు శుక్రవారం ఢిల్లీలో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచడం అనేది సాధారణ చట్టం కాదని చెప్పారు. ఇది నవ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక అంకితభావ తీర్మానమని స్పష్టం చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్న ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పుడు తాము తీసుకొచి్చన బిల్లుకు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వ హయాంలో మహిళా శక్తి పెరిగిందని, అందుకే బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించిందని వివరించారు. గౌరవాన్ని పెంచితే తప్పేమిటి? మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం కంటే ముందే మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని స్థాయిల్లో మహిళల స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా పని చేశామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలు అడ్డుపడకుండా చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఈ బిల్లు విషయంలో అప్పటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆక్షేపించారు. మహిళలను కించపర్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహిళా బిల్లుకు ‘నారీశక్తి వందన్’ అనే పేరుపెట్టడం పట్ల విపక్ష ఎంపీలు చేస్తున్న ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. మహిళామణుల గౌరవాన్ని పెంచితే తప్పేమిటని ప్రశ్నించారు. బిల్లును పార్లమెంట్లో ఆమోదించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల బీజేపీ ఆకాంక్ష నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. మహిళల్లో నూతన విశ్వాసం కొన్ని నిర్ణయాలకు దేశ భవిష్యత్తు మార్చే శక్తి ఉంటుందని, ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వాటిలో ఒకటని ప్రధానమంత్రి అన్నారు. ఈ చట్టం మహిళల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని, దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ నెల 20, 21న కొత్త చరిత్ర నమోదైందని, దీని గురించి భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయని పేర్కొన్నారు. ‘మోదీ గ్యారంటీలు’ అమలవుతాయని చెప్పడానికి మహిళా బిల్లే ఒక నిదర్శనమని చెప్పారు. మహిళల సారథ్యంలో అభివృద్ధి అనే నూతన శకంలోకి అడుగుపెట్టబోతున్నామని ప్రకటించారు. భారత్‌ను చంద్రుడిపైకి చేర్చడంలో మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. -
మీ సీటు కోల్పోయినా నేనున్నాగా..!
మీ సీటు కోల్పోయినా నేనున్నాగా..! -
మహిళా బిల్లుకు ఆమోదం.. పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. నారీ శక్తికి పార్లమెంటు సగౌరవంగా ప్రణమిల్లింది. నూతన భవనంలో తొట్టతొలిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి రాజ్యసభ వేదికైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన నారీ శక్తి విధాన్ అధినియమ్ బిల్లుకు గురువారం పెద్దల సభ సైతం జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన మొత్తం 214 మంది సభ్యులూ పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. దాంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మహిళా బిల్లు బుధవారమే లోక్‌సభలో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో పాస్ అవడం తెలిసిందే. 454 మంది ఎంపీలు మద్దతివ్వగా ఇద్దరు మజ్లిస్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్లు 15 ఏళ్లపాటు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అనంతరం వాటి కొనసాగింపుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది పార్టీలకతీతంగా మద్దతు అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యులంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. కొందరు విపక్షాల సభ్యులు మాత్రం దీన్ని బీజేపీ ఎన్నికల గిమ్మిక్కుగా అభివరి్ణంచారు. తాజా జన గణన, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా బిల్లు అమలు ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లును తక్షణం అమలు చేయాలని కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) డిమాండ్ చేశారు. ఈ బిల్లు అంశాన్ని తొమ్మిదేళ్లుగా పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఓబీసీ మహిళలకూ దీన్ని వర్తింపజేయాలన్నారు. 2014, 2019ల్లో కూడా మహిళా బిల్లు తెస్తామని బీజేపీ వాగ్దానం చేసి మోసగించిందని ఎలమారం కరీం (సీపీఎం) ఆరోపించారు. మహిళలంటే మోదీ సర్కారుకు ఏ మాత్రమూ గౌరవం లేదన్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ నిర్లిప్తతే ఇందుకు రుజువన్నారు. ఎన్నికల వేళ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ) ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తక్షణం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కె.కేశవరావు (బీఆర్ఎస్), వైగో (ఎండీఎంకే) డిమాండ్ చేశారు. తక్షణం డీ లిమిటేషన్ కమిషన్ వేయాలని వారన్నారు. మహిళా బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను రాజ్యసభకు, రాష్ట్రాల శాసన మండళ్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. కర్ణాటక సీఎంగా, ప్రధానిగా మహిళా రిజర్వేషన్ల కోసం తాను తీసుకున్న చర్యలను జేడీ (ఎస్) సభ్యుడు దేవెగౌడ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే మహిళా బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఇది 2029 కల్లా జరిగే అవకాశముందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారమే పరోక్షంగా తెలిపారు. ఏమిటీ బిల్లు? ► ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియమ్‌గా పేర్కొంటున్నారు. ► దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ► ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. చరిత్రాత్మక క్షణాలివి! ప్రధాని మోదీ భావోద్వేగం మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన క్షణాలను చరిత్రాత్మకమైనవిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బిల్లు పెద్దల సభ ఆమోదం పొందిన సమయంలో ఆయన సభలోనే ఉన్నారు. ‘భారత మహిళలకు మరింత ప్రాతినిధ్యం, సాధికారత లభించే నూతన శకంలోకి మనమిక సగర్వంగా అడుగు పెట్టనున్నాం. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు. మన దేశాన్ని నిరంతరం ఇంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దుతున్న, అందుకోసం తమ సర్వస్వాన్నీ నిరంతరం త్యాగం చేస్తూ వస్తున్నా సంఖ్యాకులైన మహిళామణులకు, మన మాతృమూర్తులకు మనం చేస్తున్న వందనమిది. వారి సహనశీలత, త్యాగాలు అనాదిగా మన గొప్ప దేశాన్ని మరింత సమున్నతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి‘ అంటూ మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఉభయ సభల్లోనూ బిల్లుపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. అవన్నీ పూర్తిగా విజయవంతమయ్యాయి. ఈ చర్చలు భవిష్యత్తులోనూ మనందరికీ ఎంతగానో ఉపకరిస్తాయి. బిల్లుకు మద్దతి చి్చన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ స్ఫూర్తి భారతీయుల ఆత్మ గౌరవాన్ని సరికొత్త ఎత్తులకు చేరుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ, మండళ్లలో అసాధ్యం: నిర్మల చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా పార్లమెంటు నూతన భవనానికి శుభారంభం అందించే నిమిత్తమే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బిల్లుపై చర్చలో ఆమె మాట్లా డుతూ రాజ్యసభ, శాసన మండళ్లకు జరిగేవి పరోక్ష ఎన్నికలు గనుక మహిళలకు రిజర్వేషన్లు ఆచరణసాధ్యం కాదన్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదా చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి 18న మొదలైన ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్ ప్రకారం 22వ తేదీ దాకా జరగాల్సి ఉంది. రాజ్యసభకు ఇది 261 సెషన్. కాగా, 17వ లోక్‌సభకు బహుశా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. -
నారీలోకానికి నీరాజనం!
చిరకాలంగా మహిళాలోకం ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందటంతో పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్టయింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావటం, దీన్ని దాదాపు అన్ని పక్షాలూ ఏకగ్రీవంగా ఆమోదించటం ఒక అరుదైన సన్నివేశం. మహిళా కోటాకు లోక్‌సభలో బుధవారం 454 మంది అనుకూలంగా ఓటేయగా, కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యసభలో హాజరైన మొత్తం సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించితీరాలి. దశాబ్దాలుగా నేతల ఎన్నికల ప్రచార సభల్లో... చానెళ్ల చర్చల్లో మాత్రమే వినబడుతూ చట్టసభల్లో మాత్రం కనబడని బిల్లుకు ప్రాణప్రతిష్ట చేసి, పట్టాలెక్కించి అన్ని పార్టీలనూ అంగీకరింపజేయటం చిన్న విషయమేమీ కాదు. అయితే జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చాకే కోటా అమలవుతుందనటం నిరాశ కలిగించే అంశం. ఏతావాతా 2029 తర్వాత మాత్రమే ఇది ఆచ రణలోకొస్తుంది. అంటే... మరో ఆరేళ్ల వరకూ దీనికి మోక్షం కలగదు! విస్తట్లో అన్ని పదార్థాలూ వడ్డించి, తినడానికి ఇంకా ముహూర్తం ఆసన్నం కాలేదని చెప్పినట్టయింది. స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడిచాక మాత్రమే మహిళా కోటా సాకారం కాగా, దాని అమలుకు మరింత సమయం పడుతుందనటం ఏమాత్రం భావ్యంకాదు. ఈ బిల్లు ఆమోదంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం మరొకటుంది. ఇరవైయ్యేడేళ్ల క్రితం తొలిసారి లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఓబీసీ వర్గాల వాటా నిర్ధారించాలని బలహీనవర్గాలు పట్టుబట్టాయి. చట్టసభలో మాత్రమే కాదు... వెలుపల సైతం అనేక ప్రజాసంఘాలు ‘కోటాలో కోటా’ గురించి డిమాండు చేస్తూనే ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు గడిచాక కూడా ఆ విషయం తేల్చకుండానే బిల్లు ఆమోదం పొందటం మనం ఆచరిస్తున్న విలువలను పట్టి చూపుతుంది. బిల్లుపై అన్ని పార్టీలనూ ఒప్పించిన అధికార పక్షానికి ‘కోటాలో కోటా’ గురించి నిర్దిష్టంగా తేల్చటం అంత కష్టమైన పనేమీ కాదు. ఎందుకనో ఆ పని చేయలేదు. మహిళా కోటా బిల్లుకు తామే ఆద్యులమని, యూపీఏ ప్రభుత్వ కాలంలో 2010లో దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందామని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ చెబుతున్నారు. కానీ ఆ బిల్లుకూ, ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లుకూ సంబంధం లేదు. అసలు మహిళా కోటా బిల్లుకు అంతకన్నా పూర్వ చరిత్ర చాలా ఉంది. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ మరుసటి ఏడాది వచ్చిన ఐకె గుజ్రాల్ సర్కారు సైతం బిల్లు దుమ్ము దులిపింది. అప్పుడే ఓబీసీ కోటా సంగతేమిటన్న చర్చ మొదలైంది. వాజపేయి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరసగా 1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో మహిళా కోటా బిల్లును గట్టెక్కించాలని ప్రయత్నించింది. కానీ ఓబీసీ కోటా విషయంలో దుమారం రేగి ఆగిపోయింది. 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. కానీ లోక్‌సభలో ఎస్పీ, బీఎస్పీ తదితర పక్షాలు ‘కోటాలో కోటా’ కోరుతూ అడ్డుకున్నాయి. ఇప్పుడు ఓబీసీ కోటా తేల్చాలని చెబుతున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారో సంజాయిషీ ఇవ్వాలి. మరోపక్క కోటా చట్టంగా రూపుదిద్దుకున్న నాటినుంచి కేవలం పదిహేనేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ లెక్కన 2029 వరకూ అమలే సాధ్యం కాని చట్టం మరో తొమ్మిదేళ్లపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పొడిగింపు సంగతి ఏమవుతుందన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ పరిమితి ఏవిధంగా చూసినా సబబుగా లేదు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వటంలో జాప్యం జరగటం సమర్థించుకోలేనిది. లింగ వివక్ష, అసమానతలు, వేధింపులు అన్ని స్థాయిల్లోనూ ఉన్న సమాజంలో మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయటం, వారి ప్రాతినిధ్యం పెంచటం ఎంతో అవసరం. అందువల్ల సమాజ నిర్మాణంలో తామూ భాగస్వాములమని, తమ ఆలోచనలకూ విలు వుంటున్నదని స్త్రీలు గుర్తిస్తే అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరింతమంది మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వీలవుతుంది. సమాజంలో మహిళలపట్ల ఉన్న ఆలోచనా ధోరణి మారు తుంది. దీన్ని అవగాహన చేసుకోవటానికీ, ఆచరించటానికీ ఇంత సుదీర్ఘ సమయం పట్టడం విచార కరం. మనకన్నా ఎంతో చిన్న దేశాలూ, బాగా వెనక బడిన దేశాలూ సైతం మహిళలకు చట్టసభల్లో పెద్ద పీట వేసిన వైనం గమనిస్తే మహిళల విషయంలో మనం ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తు న్నామో అర్థమవుతుంది. రువాండా పార్లమెంటులో మహిళలు 61 శాతం ఉంటే... క్యూబా(53), నిగ రాగువా(52), మెక్సికో, న్యూజిలాండ్ చట్ట సభల్లో 50 శాతం మహిళలుండి మన సమాజం తీరు తెన్నుల్ని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి దశాబ్దం క్రితం ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా ఆవిర్భవించిన నేపాల్‌లో సైతం పార్లమెంటులో 33 శాతం మహిళలున్నారు. అమలుకు ఇంకా సమయం పడుతుందంటు న్నారు గనుక ఈలోగా పార్లమెంటు చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా ఓబీసీ కోటా సంగతి తేల్చటం, చట్టం అమలుకు విధించిన పరిమితిని ఎత్తివేయటం అత్యంత కీలకమని కేంద్రం గుర్తించాలి. ఎన్నెన్నో అవాంతరాలను అధిగమించి సాకారం కాబోతున్న ఈ చట్టం భవిష్యత్తులో సమాజం మరింత పురోగతి సాధించటానికి నాంది కాగలదని ఆశించాలి. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షం - సినీ నటి తమన్నా
-
Womens Reservation Bill 2023: ఏకగ్రీవ ఆమోదానికి కలిసి రండి
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు కలిసి రావాల్సిందిగా విపక్షాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బిల్లులో లోపాలేమన్నా ఉంటే తర్వాత సరిచేసుకుందామని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లు అమలులో ఆలస్యానికి సంబంధించి కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. మహిళలకు రిజర్వేషన్లు 2029 తర్వాత అమల్లోకి వస్తాయన్న సంకేతాలిచ్చారు. ఓబీసీలకు బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. వారికి తమ హయాంలోనే అన్నింటా అత్యధిక ప్రాతినిధ్యం దక్కిందని చెప్పారు. ‘రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదానికి ఇది ఐదో ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ లేవనెత్తిన అడ్డంకులను అధిగమించేందుకు వారి హయాంలో ఎందుకు ప్రయతి్నంచలేదు? అందుకే గత నాలుగు సార్లూ బిల్లును ఆమోదించలేని పార్లమెంటు తీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈసారైనా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించుకుందాం‘ అని విపక్షాలను అమిత్ షా కోరారు. రాహుల్ పై విసుర్లు 90 మంది కేంద్ర కేబినెట్ కార్యదర్శుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అమిత్ ఎద్దేవా చేశారు. ‘కార్యదర్శులు దేశాన్ని నడుపుతారన్నది నా సహచర ఎంపీ అవగాహన! కానీ నాకు తెలిసినంత వరకూ ప్రభుత్వమే దేశాన్ని నడుపుతుంది. విధాన నిర్ణయాలు చేసేది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‘ అన్నారు. ‘ఎవరో స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన చీటీలను సభలో చదవడం గొప్ప కాదు. ఓబీసీల అభ్యున్నతికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో కృషి చేశారు‘ అన్నారు. ‘బీజేపీ ఎంపీల్లో దాదాపు 29 శాతం మంది ఓబీసీలే. దేశవ్యాప్తంగా 27 శాతానికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు, 40 శాతానికి పైగా ఎమ్మెల్సీలు ఓబీసీలే’ అని అమిత్ అన్నారు. అప్పుడు కేంద్రాన్నే నిందిస్తారు! మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను అమిత్ షా తోసిపుచ్చారు. ‘రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు ఒకవేళ మహిళలకు రిజర్వ్ అయితే రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది‘ అన్నారు. -
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
Womens Reservation Bill 2023: ఇంకెంతకాలం నిరీక్షణ
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కాదు. ఇది మహిళల పట్ల పక్షపాతం, అన్యాయాన్ని తొలగించడానికి ఉద్దేశించినది. మహిళలకు ప్రత్యేకంగా వందనాలు అవసరం లేదు. అందరితోపాటు సమాన గౌరవాన్ని పొందాలని మహిళలు కోరుకుంటున్నారు. మహిళా కోటాను అమలు చేయడంలో జాప్యం తగదు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయనడం సరైంది కాదు. ఇంకా ఎంత కాలం నిరీక్షించాలి? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమే – కనిమొళి, డీఎంకే ఎంపీ ఓబీసీ కోటా సంగతేంటి? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎముంది? ఇది పోస్టు–డేటెడ్ చెక్కులాగా ఉంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేయాలి. మహిళా రిజర్వేషన్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారో కచి్చతమైన తేదీ, టైమ్‌లైన్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. దేశంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కరువు నివారణ చర్యలపై చర్చించాలి – సుప్రియా సూలే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బడుగు వర్గాల మహిళలకు భాగస్వామ్యం కావాలి మహిళా రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఈ మేరకు అవసరమైతే చట్టంలో సవరణలు చేయాలి. బడుగు వర్గాల మహిళలకు న్యాయం చేకూర్చాలి. – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశంలో మహిళలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ రిజర్వేషన్లను రాబోయే ఎన్నికల్లో అమలు చేయకుండా జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అధికార బీజేపీ నాయకులు మహిళలపై ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. వారిపై ఎలాంటి చర్యలకు తీసుకోలేదు. దేశంలో గత ఐదేళ్లలో మహిళలపై నేరాలు 26 శాతం పెరిగినప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు – హర్సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ మహిళా సాధికారతను అడ్డుకోవద్దు మహిళా రిజర్వేషన్లలో మైనారీ్టలకు కోటా కల్పించాలనడం అర్థరహితం. మతపరమైన రిజర్వేషన్లపై రాజ్యాంగం నిషేధం విధించింది. చట్ట ప్రకారం.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. వెంటనే అమలు చేయాలని కోరడం సమంజసం కాదు. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. మహిళా సాధికారతను అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా – స్మతి ఇరానీ, కేంద్ర మంత్రి, బీజేపీ నేత 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేవలం 33 శాతం కాదు, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ విషయంలో మీకు చేతనైతే మమ్మలి్న(తణమూల్ కాంగ్రెస్)ను పట్టుకోండి చూద్దాం – కకోలీ ఘోష్–దస్తీదార్, తణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పేరును ‘రీషెడ్యూలింగ్ బిల్లు’ అని పెడితే పోలా? ఈ బిల్లు ఒట్టి మాయ. షెడ్యూల్ ప్రకారం ఫలానా తేదీకల్లా అమల్లోకి వస్తుందని చెప్పలేము. అలాంటప్పుడు ఈ బిల్లుకు మహిళా రిజర్వేషన్ రీషెడ్యూలింగ్ బిల్లుగా మారిస్తే సరిపోతుంది’ అని తణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రా సభలో ఎద్దేవా చేశారు. ఇదంతా పెద్ద గిమ్మిక్కు. – టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా -
Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా సభ్యులు బిల్లుకు జై కొట్టారు. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరిట కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ నెల 19న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’పై బుధవారం దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు మాట్లాడారు. కొందరు బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. మరికొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా కోటా గురించి ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎగువ సభలోనూ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత 2029 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఓటింగ్ జరిగిందిలా.. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్లిప్‌ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్లిప్‌లను సభ్యులకు అందజేశారు. ఓటు ఎలా వేయాలో లోక్‌సభ సెక్రెటరీ జనరల్ వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్పై ‘ఎస్’ అని రాయాలని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్పై ‘నో’ అని రాయాలని చెప్పారు. ఆ ప్రకారమే ఓటింగ్ జరిగింది. బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏఐఎంఐంఎ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఓవైసీతోపాటు మరో ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్) ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వారిద్దరూ ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఒక చరిత్రాత్మక చట్టం అవుతుందన్నారు. ఈ చట్టంతో మహిళా సాధికారతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మన రాజకీయ వ్యవస్థలో మహిళామణుల భాగస్వామ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న. మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇంకా మనం వాళ్లని రెండేళ్లు, నాలుగేళ్లు, ఆరేళ్లు, ఎనిమిదేళ్లు వేచి ఉండండని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కుల గణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం దక్కాలి. – సోనియా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ సరికాదు. ఒకవేళ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే మా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ల కలను సాకారం చేస్తుంది. – అమిత్ షా ఈ బిల్లుతో సవర్ణ మహిళలకే మేలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుతో అగ్ర వర్ణాల మహిళలకే మేలు జరుగుతుంది. పార్లమెంట్లో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, మైనార్టీ మహిళలకు ఈ రిజర్వేషన్లలో ప్రత్యేకంగా కోటా కలి్పంచకపోవడం దారుణం. దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నారు. లోక్‌సభలో వారి సంఖ్య కేవలం 0.7 శాతమే ఉంది. లోక్‌సభలో సవర్ణ మహిళల సంఖ్య పెంచాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఓబీసీ, మైనార్టీ మహిళలు ఈ సభలో ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆయా వర్గాల మహిళలను మోదీ సర్కారు దగా చేస్తోంది – అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పారీ్టలకతీతంగా మహిళా ఎంపీలు బిల్లుకు ఏకగ్రీవంగా జై కొట్టారు. లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలుండగా బుధవారం చర్చలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. అయితే, బిల్లు ఆలస్యంగా అమలయ్యే అంశాన్ని ప్రధానంగా తప్పుబట్టారు. -
నా సీటు కోల్పోవాల్సి వచ్చినా సిద్ధమే..!
సాక్షి, హైదరాబాద్: ‘భారత పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ బిల్లు అమలులోకి వస్తే మరింతమంది మహిళానేతలు ప్రజాజీవితంలోకి వస్తారు. నేను నా సీటు కోల్పోవాల్సి వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నా. మనందరివి చాలా చిన్నజీవితాలు, అందులో నా పాత్ర నేను పోషించాననే అనుకుంటున్నాను’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు. ‘క్యాపిటా లాండ్ ఇన్వెస్ట్మెంట్’(సీఎల్ఐ) కొత్తగా పునర్నిర్మించిన ‘ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్’(ఐటీపీహెచ్)ను కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ నిర్మాణరంగం సింగపూర్ అభివృద్ధిని తలపిస్తోందని, ఆసియాఖండంలో అభివృద్ధి చెందిన సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. తెలివైనవారు ఇతర అనుభవాల నుంచి నేర్చుకుంటారు అనే సామెతను గుర్తు చేస్తూ సింగపూర్ నుంచి అనేక అంశాలను హైదరాబాద్ అభివృద్ధిలో తాము అనుకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నిర్మాణరంగంలో భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. క్యాపిటా లాండ్ ఇన్వెస్ట్మెంట్ తమ పెట్టుబడుల కోసం దేశంలోని ఇతర ప్రాంతాల వైపు చూడకుండా మాన్యుఫాక్చరింగ్, లైఫ్ సైన్సెస్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎల్ఐ ఇండియా సీఈఓ సంజీవ్దాస్ గుప్తా, సీఎల్ఐ ఇండియా పార్క్స్ సీఈఓ గౌరీశంకర్ నాగభూషణం, సింగపూర్ డిప్యూటీ స్పీకర్ జెస్సికా, సీఎల్ఐ చైర్మన్ మనోహర్ ఖైతాని, ఐటీ విభాగం చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 40 మెగావాట్ల డేటా సెంటర్ క్యాపిటా లాండ్ ఇన్వెస్ట్మెంట్ (సీఎల్ఐ) ఇటీవల మాదాపూర్‌లో పునర్ నిర్మించిన ఐటీపీహెచ్ బుధవారం ప్రారంభమైంది. ఈ బిజినెస్ పార్కులోని బ్లాక్ ఏ భవనంలో అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వందశాతం లీజ్ కమిట్మెంట్ జరిగినట్టు సీఎల్ఐ వెల్లడించింది. బ్లాక్ ఏ భవన్లో 1.4 మిలియన్ల చదరపు అడుగుల్లో అంతర్జాతీయ సంస్థలు బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యూ ఎస్ టెక్నాలజీ, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నా యి. ఐటీపీహెచ్ దశలవారీగా వచ్చే 7 నుంచి పదే ళ్లలో క్యాపిటా లాండ్ ఇండియా ట్రస్ట్ (క్లింట్) పూర్తి చేస్తుంది. ఈ పార్కు పూర్తయితే 4.9 మిలియన్ అడుగుల ఏ గ్రేడ్ ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ ఆవరణలో 40 మెగావాట్ల సామర్థ్యమున్న డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూమిపూజ జరిగింది. క్లింట్కు దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో 12 బిజినెస్ పార్కులు ఉండగా, అందులో మూడు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ హైదరాబాద్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం ప్రపంచవ్యాప్తంగా మీడియా, వినోద రంగంలో పేరొందిన వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ కార్యాలయాన్ని ఐటీపీహెచ్లో మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రాకతో మరిన్ని వైవిధ్యమైన కంపెనీలు హైదరాబాద్‌కు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో 2021–22లో 33శాతం, 2022–23లో 44శాతం ఐటీ ఉద్యోగాల కల్పన హైదరాబాద్‌లోనే జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ సీఈఓ గున్నార్ వీడెన్‌ఫెల్స్, హైదరాబాద్ క్యాపబిలిటీ సెంటర్ బాధ్యులు జైదీప్ అగర్వాల్, హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక విభాగ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తించవని అన్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని చెప్పారు. కావాలంటే చట్టంలో కొన్ని మార్పులు చేస్తామని తెలిపారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఏయే స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. బీజేపీకి మహిళా బిల్లు రాజకీయ అంశం కాదని, మహిళల సాధికారత కోసం చేసే ప్రయత్నమని అని స్పష్టం చేశారు. కొందరు ఓబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారన్న అమిత్ షా... బీజేపీ దేశానికి ఏకంగా ఓబీసీ ప్రధానినే ఇచ్చిందనతి తెలిపారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది వీళ్లే! కాగా నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుపై 80 మంది ఎంపీలు మాట్లాడారు. దాదాపు 8 గంటల వరకు సుధీర్ఘ చర్చ సాగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు విమర్శించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కింద ఓబీసీ, ఎస్సీ కోటా పెట్టాలని, త్వరగా ఈ బిల్లును అమల్లోకి తీసుకు రావాలని డిమాండ్ చేశాయి విపక్షాలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. సోనియా పేరు ఎత్తకుండానే విమర్శల వర్షం కురిపించారు. 2010లో బిల్లు తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం “ఇది మా బిల్లు” అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన కోటాలు అడుగుతూ కాంగ్రెస్ దేశాన్నితప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. -
శక్తి స్వరూపిణి..! మోదీపై ప్రశంసలు
-
ఇది యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు: ఎంపీ అసుదుద్దీన్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం నేత, ఎంపీ అసుదుద్దీన్ పేర్కొన్నారు. ఆ బిల్లులో కొన్ని ప్రధాన లోపాలున్నాయని అన్నారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చలేదని విమర్శించారు. కాగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై దిగువసభలో బుధవారం చర్చ సాగింది.ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని విమర్శించారు. బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందన్నారు. కేవలం ధనవంతులే చట్టసభల్లో ఉండేలా ఈ బిల్లు పెట్టారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారని, వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఉండేదని ఆరోపించారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును 15 ఏళ్లకే పరిమితం చేయొద్దు: ఎంపీ సత్యవతి -
మూడో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-
మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యసభ కొలువుదీరింది. ఈ సందర్భంగా తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని అనఅన్నారు. పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఎన్నో విప్లవాత్మక బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. భారత్ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని.. రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోందని పేర్కొన్నారు. ఇందుకు కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలవబోతోందని తెలిపారు మేకిన్ ఇండియా గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు ప్రధాని మోదీ. 2047లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. కొత్త పార్లమెంట్‌లోనే స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటామని చెప్పారు. మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నామన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టామని, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని ప్రస్తావించారు. దేశ నిర్మాణంలో మహిళలతే కీలక పాత్ర ఉండబోతుందన్నారు. చదవండి: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says..." Federal structure presented India's power in front of the world and the world was impressed...during G 20 summit, various meetings took place across different states. Every state with great… pic.twitter.com/IgQoHNldJo — ANI (@ANI) September 19, 2023 ఇదిలా ఉండగా సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవానికి ఎంపీలు వీడ్కోలు పలికి.. నేడు కొత్త భవనంలో అడుగుపెట్టారు. మంగళవారం నుంచి సభా కార్యకలాపాలు కొత్తపార్లమెంట్ వేదికగా జరుగుతున్నాయి. #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says, "...we did not have a majority in the Rajya Sabha but we were confident that the Rajya Sabha would rise above political thinking and take decisions in the interest of the country. Because of your… pic.twitter.com/1uxql7s3u8 — ANI (@ANI) September 19, 2023 ఈ క్రమంలో నేడు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. రేపు లోక్‌సభలో బిల్లుపై చర్చ జరగనుంది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో చర్చకు రానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. -
మహిళా బిల్లు కోసం ఒత్తిడి తేవాలి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంటు లో ప్రాతినిధ్యం కలిగిన 47 రాజకీయ పార్టీల అ«ధ్యక్షులతో పాటు దేశంలోని ఇతర పార్టీల నేతలకు కవిత మంగళవారం లేఖ రాశారు. రాజకీయాలకతీతంగా మహిళా బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కోరారు. దేశ జనాభాలో మహిళలు 50% ఉన్నా చట్టసభల్లో మాత్రం సరైన ప్రాతినిధ్యం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే దాదాపు 14 లక్షల మంది మహిళలు క్రియాశీలక ప్రజా జీవితంలో ఉన్నారని గుర్తుచేశారు. లింగ సమానత్వం కోసం చారిత్రక నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీలకు ఆమె పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు లేఖలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎంలు వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్‌కుమార్, నవీన్ పట్నాయక్, హేమంత్ సోరెన్, ఏక్నాథ్ షిండేతో పాటు మాయావతి, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, చంద్రబాబు, వైఎస్ షర్మిల, చంద్రశేఖర్ ఆజాద్, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్, అర్వింద్ దేవే గౌడ, ప్రకాశ్ అంబేడ్కర్‌కు కవిత లేఖలు రాశారు. -
బీఆర్ఎస్ను కలుపుకొనే కాంగ్రెస్ పోరుబాట?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ తీరుకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగా ఉన్న పార్టీలు సైతం రాహుల్ అనర్హతను ఖండించడం, ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ తమకు అండగా నిలవడంతో విపక్షాలన్నింటినీ ఏకంచేసే అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడుతున్న బీఆర్ఎస్ సైతం రాహుల్‌కు సంఘీభావం ప్రకటించడం... అనర్హత పూర్తిగా ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఇకపై తాము చేసే ప్రజాపోరాటాలన్నింటినీలో బీఆర్ఎస్ను భాగస్వామిని చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. రాహుల్‌పై అనర్హతను నిరసిస్తూ వచ్చే వారం విపక్ష పార్టీలను కలుపుకొని భారీ కవాతు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో బీఆర్ఎస్ సైతం పాల్గొనేలా ఆ పార్టీ ఎంపీలతో మాట్లాడాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చి నట్లు చెబుతున్నారు. మహిళా బిల్లుపై బీఆర్ఎస్కు కాంగ్రెస్ అండ! ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన నిరాహా దీక్ష సహా రౌండ్‌టేబుల్ సమావేశాలకు కాంగ్రెస్‌ను పిలిచినా ఆ పార్టీ ప్రతినిధులెవరూ హాజరు కాలేదు. ఇకపై అలాకాకుండా మహిళా బిల్లుపై బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమాలకు హాజరు కావడంతోపాటు కవితపై ఈడీ విచారణను నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ఇతర పక్షాలతో కలిసి పాల్గొనాలనే నిశ్చయానికి వచ్చి నట్లు ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. బీజేపీపై పోరును ఉధృతం చేసే క్రమంలో బాధిత పక్షాలన్నింటినీ కలుపుకోవడం ముఖ్యమని, అందులో బీఆర్ఎస్ సైతం ఉంటుందని శనివారం ఏఐసీసీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ ఓ క్రమపద్ధతిలో విపక్షాల ఐక్యతను నిర్మించాల్సిన అనివార్యత ఏర్పడిందన్నారు. తమకు మద్దతిచ్చి న బీఆర్ఎస్ సహా అన్ని విపక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మా పార్టీ అయినా అంతే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మా పార్టీ సహా ఏ పార్టీ రాజ్యాంగంలోనూ మహిళలకు 50శాతం గానీ, లేదా ఇన్ని సీట్లు అనే ప్రస్తావనగానీ లేకపోవటమే అసలు సమస్య..’’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా మహిళలకు సీట్లు కేటాయించడమనేదీ ఏ పార్టీలోనూ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పి స్తూ చట్టం చేస్తేనే అన్ని రాజకీయ పార్టీలు దారికొస్తాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై భారత్ జాగృతి నేతృత్వంతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా 13 పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ‘‘రాజకీయ పార్టీల రాజ్యాంగాల్లో మహిళలకు 50% లేదా ఇన్ని సీట్లు అనే ప్రస్తావన ఉందా? మీ పార్టీ రాజ్యాంగంలో ఆ విధంగా ఏమైనా పొందుపరిచారా?’’అని అభిమన్యుసింగ్ అనే జర్నలిజం విద్యార్థి ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ‘‘మా పార్టీ సహా ఏ పార్టీ రాజ్యాంగంలో కూడా మహిళలకు ఇన్ని సీట్లు కేటాయించాలని లేకపోవటమే అసలు సమస్య. కొన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతీ పార్టీలోనూ, ఎన్నికల్లోనూ మహిళలకు తగినన్ని సీట్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా పూనుకుంటేనే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది’’అని పేర్కొన్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతం రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లోపల, బయట ఒత్తిడి పెంచేందుకే ఎంపీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు డ్రాఫ్ట్‌తోపాటు పార్లమెంట్లో ఎంపీలు ఎలాంటి ప్రశ్నలు అడిగి మహిళా బిల్లును సాధించేందుకు ముందుకు వెళ్లొచ్చనే మెటీరియల్‌ను భారత్ జాగృతి తరఫున తయారు చేసి ఇచ్చామన్నారు. త్వరలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదానిపై ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులతో చర్చించామని కవిత తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు సంధించడంతోపాటు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనల ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై పోరాటాన్ని కొనసాగిస్తారని వెల్లడించారు. అందరినీ కలుపుకొని వెళతాం బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ మహిళలకు ఇచ్చి న మాటను నిలబెట్టుకోవాలని.. దేశ మహిళలను మోసం చేయవద్దని కవిత విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ, టీడీపీలను భారత్ జాగృతి చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఆహ్వానించ లేదని.. త్వరలో వారిని కూడా కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించినా.. తమతో కలిసి పోరాటం చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదని పేర్కొన్నారు. -
కవిత దీక్ష విజయవంతం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష విజయవంతం అయింది. శుక్రవారం జంతర్‌మంతర్‌లో చేపట్టిన ఈ దీక్ష కు తెలంగాణతోపాటు ఢిల్లీ, దాని పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. భారత్ జాగృతి చెప్పినట్లుగానే సుమారు 5 వేల మంది ఈ దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కవిత అనుచరు లు కలిపి ఐదారువందల మంది రాష్ట్రనేతలు హాజరుకాగా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు దీక్షకు తరలివచ్చారు. ఢిల్లీలోని జేఎన్‌యూ, జామి యా యూనివర్సిటీలతో పాటు చుట్టుపక్కల వర్సిటీల నుంచి వచ్చిన యువతులు ఆరంభం నుంచి ముగింపు వరకు దీక్షలో పాల్గొన్నారు. 18 పార్టీల నేతలు, ప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ఆరంభించగా, సీపీఐ నేత నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సంజయ్ సింగ్, చిత్ర సర్వార (ఆప్), నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్), అంజుమ్ జావెద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్సీపీ), పూజ శుక్లా (ఎస్పీ), శ్యామ్ రజక్ (ఆర్జేడీ)తోపాటు శివసేన నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ కిసాన్ యూనియన్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు, తమిళనాడు, కేరళ రైతు సంఘాల ప్రతినిధులు, సింగరేణి కోల్ మైన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాలుపంచుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా కవిత చేపట్టిన దీక్షపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. దీక్షకు హాజరైన రాష్ట్ర నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత వివరాలన్నింటినీ సేకరించాయి. సివిల్ దుస్తుల్లో ఉన్న సుమారు 20 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులు దీక్ష జరిగినంత సేపూ అక్కడే ఉండి ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నారు. వేర్వేరు భాషల్లో మాట్లాడిన నేతల ప్రసంగాలను అక్కడే మీడియా ప్రతినిధులు, ఇతరులతో తర్జుమా చేయించుకోవడం కనిపించింది. కవిత శనివారం ఈడీ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల వైఫల్యం చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే ఇంటెలిజెన్స్ కన్నేసినట్లు చెబుతున్నారు. -
నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్‌తో శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరాహార దీక్షకు అంతా సిద్ధమైంది. జంతర్‌మంతర్ వేదికగా జరిగే ఈ దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభం కానుండగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షకు 18 రాజకీయ పా ర్ణీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు. మద్దతుపై కాంగ్రెస్‌తోనూ చర్చలు... మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేపడుతున్న దీక్షకు సంఘీభవం తెలపాలని వివిధ రాజకీయ పా ర్ణీల నేతలను భారత జాగృతి నేతలు సంప్రదించారు. అందుకు బీఆర్ఎస్ సహా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డీ, జేఎమ్ఎమ్ వంటి పా ర్ణీలు సమ్మతించాయి. కాగా ఈ దీక్షకు సంఘీభావంగా పార్టీ తరఫున ప్రతినిధులను పంపాలని కాంగ్రెస్ అగ్రనేతలను సైతం సంప్రదించామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ నుంచి ప్రతినిధుల హాజరుపై మాత్రం స్పష్టత రాలేదు. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభిస్తారు. ఈ మేరకు గురువారం సీతారాం ఏచూరిని కవిత కలిసి శుక్రవారం నాటి దీక్ష ప్రారంభ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వా నించారు. ఇక దీక్ష ముగింపునకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు పాల్గొనే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. దీక్షలో సుమారు 5వేల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీక్ష కోసం వివిధ వర్శిటీల నుంచి యువకులు, మహిళలను పెద్ద ఎత్తున తరలించేలా నేతలు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో బీజేపీ వేదిక మార్పు .. కాగా జంతర్‌మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్షా స్థలి విషయంలో కొంత వివాదం తలెత్తింది. దీక్షలో 5వేల మంది పాల్గొనేందుకు వీలుగా తొలుత విశాలమైన దీక్షా స్థలిని కేటాయించిన ఢిల్లీ పోలీసులు గురువారం మధ్యాహ్నం దానిని కుదించినట్లు కవితకు సమాచారమిచ్చారు. దీక్షకు మొదటగా కేటాయించిన ప్రాంతాన్ని విభజించి టిబెట్ అంశంపై జరిగే ఆందోళన, ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనకు స్థలం కేటాయించారు. ఈ నేపథ్యంలో కవిత ఢిల్లీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో దీక్షాస్థలికి పక్కనే బీజేపీ ఆందోళనకు కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ పోలీసులు మార్చారు. భారత జాగృతి దీక్ష, బీజేపీ ఆందోళన పక్క పక్కనే జరిగితే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశ్యంతో బీజేపీ కార్యక్రమ వేదికను దీన్ దయాళ్ మార్గ్ ప్రాంతానికి మార్చారు. -
వన్ థర్డ్
మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే వచ్చింది.. లేదంటే మహిళలే తమంతట తాము ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారన్న ఒక ఉత్తేజకరమైన ఆశాభావాన్ని అత్యధికంగా ఎన్నికైన కొత్త మహిళా ఎంపీల సంఖ్య కలిగిస్తోంది. మహిళలు ఉత్సాహంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ సంఖ్య పెరగడం అనేది ఒక ప్రేరణాంశం. మాధవ్ శింగరాజు పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉన్నట్లే, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలూ వేరుగా ఉంటాయి. అయితే ఈసారి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే విధమైన హామీ ఇచ్చారు. తమని అధికారంలోకి తెస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని! బాగా పాతబడిన హామీ ఇది. ఇరవై రెండేళ్లుగా నాయకులు హామీ అయితే ఇస్తున్నారు కానీ, రిజర్వేషన్ మాత్రం ఇవ్వడం లేదు. గత ఐదేళ్ల పాలనలో మన్‌కీ బాత్, పాకిస్తాన్‌కి జరిపిన ఆశ్చర్యకర పర్యటన, ‘యోగా డే’కి ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం, పెద్ద నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రయిక్స్.. ఇవి మాత్రమే మోదీ సాధించిన ఘనతలుగా, గుర్తులుగా మిగిలిపోయాయి. రిజర్వేషన్ బిల్లుని నోటి మాటగానైనా మోదీ ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా పైన వేటికీ (మన్ కీ బాత్ వగైరా..) పార్లమెంటు ఆమోదం అవసరం లేదు కాబట్టి అవి సాధ్యమయ్యాయేమో! మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం అవసరం. రాజ్యసభ 2010లోనే బిల్లును ఆమోదించింది. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పదహారవ లోక్‌సభలో (ఇప్పుడొచ్చింది పదిహేడవ లోక్‌సభ) ఎన్డీయేకి తగినంత బలం ఉన్నప్పటికీ మహిళా బిల్లును తెచ్చే సంకల్పబలం లేకపోయింది. గత ఐదేళ్లలో వంద వరకు కీలకమైన బిల్లులు పాస్ అయిన లోక్‌సభలో మహిళా బిల్లు కనీసం ప్రతిపాదనకు కూడా రాలేదు.హెచ్.డి. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా 1996 సెప్టెంబర్ 12న పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆయన తర్వాత.. ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి. మన్మోహన్సింగ్, నరేంద్ర మోదీ.. ఇంత మంది ప్రధానులు మారినా.. లోక్‌సభకు రాలేదు. మహిళా బిల్లు చట్టంగా వస్తే కనుక లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. మహిళా బిల్లు చట్టంగా రావాలంటే లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదం పొందాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి సంతకం చేయాలి. ఇప్పటి వరకు ఒక్క రాజ్యసభలో మాత్రమే అయితే బిల్లు ఆమోదం పొందింది.2009 డిసెంబర్ 17న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టింది. సమాజ్‌వాదీ, జనతాదళ్ (యు), ఆర్జేడీ నిరసనలు, తీవ్ర వ్యతిరేకతల నడుమ బిల్లుపై ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది. అనంతరం 2010 మార్చి 8న బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ మర్నాడు జరిగిన ఓటింగులో భారీ మెజారిటీతో మహిళా బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అప్పట్నుంచీ ఎనిమిదేళ్లు గడిచాయి. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే బిల్లును లోక్‌సభకు తేలేకపోతున్నామని రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నా.. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం గానీ, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం గానీ ఒక చట్టం తెచ్చేందుకు ఏకాభిప్రాయంతో పని లేదని నిపుణులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు.బీజేపీని గెలిపిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తామని ఈ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ కారణంగానే ఆయన గెలవక పోవచ్చు కానీ, గెలిచాక హామీని నెరవేర్చే బాధ్యత ఆయన మీద ఉంది. రాహుల్ వచ్చి ఉంటే రాహుల్ మీద ఉండేది. కొద్ది రోజుల్లో కొలువు తీరబోతున్న కొత్త లోక్‌సభకు 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన పదహారు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఎంపీలు లేరు. 78 మంది అంటే లోక్‌సభలో 14 శాతం. ఇది ముప్పైమూడు శాతానికి చేరుకోవాలంటే ఇంకా 103 మంది ఉండాలి. రిజర్వేషన్లేమీ లేకుండా లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య వన్ థర్డ్కు (వందకు ముప్పైమూడు) అందుకోవాలంటే మరో నలభై ఏళ్లు పడుతుందని ఒక అంచనా! అంటే మరో ఎనిమిది సార్వత్రిక ఎన్నికలు. ‘పెర్ఫార్మింగ్ రిప్రెజెంటేషన్ : ఉమెన్ మెంబర్స్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్’ అనే పుస్తకం కోసం 2009–2016 మధ్య.. డాక్టర్ కరోల్ స్ప్రే అనే ఇంగ్లండ్ ప్రొఫెసర్.. షిరిన్ రాయ్ అనే భారతీయ ప్రొఫెసర్ సహకారంతో వందల మంది మహిళా ఎంపీలను, పురుష ఎంపీలను ఇంటర్వ్యూ చేశారు. కరోల్ వేసిందే ఈ ‘మరో నలభై ఏళ్లు’ అనే అంచనా. అసలీ రిజర్వేషన్లు లేకుండా ప్రతి పార్టీ తప్పనిసరిగా 33 శాతం సీట్లను మహిళలకు ఇచ్చేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తే పోయేదానికి రాజ్యాంగాన్నే సవరించడం ఎందుకు?! అలా చేస్తే మహిళలకు మళ్లీ అదొక అవరోధం అవుతుంది. ఓడిపోయే స్థానాల్లో పార్టీలు మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టి, గెలిచే చోట మగాళ్లను నిలబెడతాయి. అప్పుడిక రిజర్వేషన్ అన్నమాటకే అర్థం ఉండదు. పోటీ చేసేవాళ్లు 33 శాతం ఉంటారు కానీ, గెలిచి చట్టసభల్లోకి వెళ్లే వాళ్లు అంతమంది ఉండరు. ఇన్ని రాజకీయాలు ఉంటాయి కనుకే మహిళలు చట్టసభల్లోకి రావడానికి మహిళా రిజర్వేషన్ చట్టం తప్పనిసరిగా ఉండాలి. చట్టం రాకపోతే.. కరోల్ భావిస్తున్నట్లు చట్టంతో పనిలేకుండా తమంతట తామే ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారు..కాలక్రమంలోనో, కాలాన్ని తామే ముందుకు నడిపిస్తూనో! -
'మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి'
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో అమలుకు నోచుకోలేకపోయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్లీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆమె లేఖ రాశారు. లోక్‌సభలో ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, ఇదే అదనుగా మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ఆమోదింపచేయాలని ఆమె కోరారు. బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించి చాలాకాలం అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ఈ బిల్లు పార్లమెంటు ఆమోదానికి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ సమావేశాల్లోనే తీసుకురావాలి
మహిళా బిల్లుపై తమ్మినేని... 15న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు సాక్షి, హైదరాబాద్: వామపక్ష పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు మహిళలను మభ్యపెడుతున్నాయని, మహిళా రిజర్వేషన్ చట్టం తేవడం వారికి ఇష్టం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 17న ప్రారంభమ య్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఆందోళనల్లో మహిళలు, ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినా, నేటికీ లోక్‌సభలో ఆమోదానికి నోచుకోలేదన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సైతం మహిళా బిల్లుతోనే కలిపి ప్రవేశపెట్టాలంటున్నారని, అయితే తాము బీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని, దానిని సాకుగా చూపి మహిళా బిల్లును వెనక్కి కొట్టాలని కుట్ర చేస్తున్నారని విశ్లేషించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు వెంకట్, జ్యోతి పాల్గొన్నారు. -
మహిళలను అన్ని పార్టీలు మభ్యపెడుతున్నాయ్
హైదరాబాద్ : వామపక్ష పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు మహిళలను మభ్యపెడుతున్నాయని, మహిళా రిజర్వేషన్ చట్టం తేవడం వారికి ఇష్టం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నామన్నారు. దేశవ్యాప్త ఆందోళనలకు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన మేరకు తామ చేపడుతున్న ఆందోళనల్లో కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా మహిళలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొనాలని ఆయన పిలుపు ఇచ్చారు. సీపీఎం కార్యాలయం ఎంబీ భవన్లో తమ్మినేని వీరభద్రం మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 1996లోనే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టగా అనేక మలుపులు తిరిగి 2010లో రాజ్యసభలో ఆమోదం పొందినా, నేటికీ లోక్‌సభలో ఆమోదానికి నోచుకోలేదన్నారు. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు సైతం మనకంటే చాలా ముందున్నాయని తమ్మినేని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సైతం దీనితో పాటు ప్రవేశపెట్టాలంటూ కొందరు అడ్డుతగులుతున్నారన్నారు. తాము బీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని... అయితే ఆ వంకతో మహిళా బిల్లు ఆమోదానికి నోచుకోకుండా కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ఎంపీ కవిత మహిళా బిల్లుపై స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే విషయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ పార్టీల విలీనంపై చర్చ జరుగుతోందని ఇందుకు ఆరు నెలలైనా, ఆరు సంవత్సరాలైనా పట్టవచ్చని తమ్మినేని అన్నారు. -
మహిళా బిల్లుపై ఢిల్లీలో కనిమొళి పాదయాత్ర
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలిగించాలని డిమాండ్ చేస్తూ... ఢిల్లీలో డీఎంకే ఉమెన్స్ వింగ్ ఆందోళన చేపట్టింది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమైన పార్టీలు తమ గొంతు విప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ ఈ పాదయాత్ర కొనసాగింది. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
మహిళా బిల్లుకు 20 ఏళ్లు..
లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. ‘లోక్‌సభ, శాసనసభల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు, కోట్లాది భారతీయ మహిళల సమస్యలపై మహిళలు పార్లమెంటులో గళం ఎత్తేందుకు ఇది ఉపయోగపడుతుంది. 2014లో 15వ లోక్‌సభ కాలం ముగిసిన అనంతరం దీనికి కాలం చెల్లిపోయింది. కేంద్రం ఈ బిల్లును తెచ్చి మహిళా సాధికారత కోసం పాటుపడాలి’అని పేర్కొన్నారు. -
రచ్చ కాదు.. చర్చ జరగాలి!
పార్లమెంటు ధర్నాలు, నిరసనలకు వేదిక కాదు: రాష్ట్రపతి ► సభలో అంతరాయం ఆమోదయోగ్యం కాదు ► ఎంపీలున్నది ప్రజా సమస్యలపై చర్చించేందుకే... ► సభను ఆటంకపర్చడమంటే మెజార్టీ సభ్యుల్ని అడ్డుకోవడమే న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రతిష్టంభనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంటులో ఎంపీల ప్రాథమిక విధి ప్రజా సమస్యలపై చర్చించడమేనని, ఆ బాధ్యతను సజావుగా నిర్వర్తించాలని సూచించారు. ధర్నాలు, నిరసనలకు పార్లమెంటు వేదిక కాదని, అందుకు వేరే వేదికలున్నాయని చురకలంటించారు. కొద్ది మంది సభ్యులు మెజారిటీ సభ్యులను అడ్డుకుంటూ సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలు ఏ ఒక్క వ్యక్తినో, పార్టీనో ఉద్దేశించి చేసినవి కావంటూ స్పష్టం చేశారు. రెండు వారాలుగా పార్లమెంటు స్తంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరిచుకున్నాయి. ‘అంతరాయం అనేది పార్లమెంటరీ వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదు. సమస్యలపై చర్చించేందుకే ప్రజలు వారిని పార్లమెంట్‌కు పంపారు. అంతేకానీ ధర్నాలు చేయడం, సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించేందుకు కాదు’ అని డిఫెన్స ఎస్టేట్స్ డే సందర్భంగా గురువారం ‘బలమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల సంస్కరణలు’ అంశంపై రాష్ట్రపతి మాట్లాడారు. ‘సభా కార్యక్రమాల్ని అడ్డుకోవడం అంటే మెజార్టీ సభ్యులకు అడ్డుపడడమే.. మెజార్టీ సభ్యులు ఈ ఆందోళనలో పాల్గొనడం లేదు. కేవలం కొద్దిమంది ఎంపీలు వెల్‌లోకి వచ్చి, నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారికి సభను వారుుదా వేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’ అంటూ ప్రణబ్ స్పందించారు. ఏడాదిలో పార్లమెంట్ కేవలం కొన్ని వారాలే నడుస్తుందన్న విషయం సభ్యులు గుర్తుంచుకోవాలన్నారు. చర్చ, విభేదించడం, నిర్ణయం... ప్రజాస్వామ్యంలో ‘చర్చ’, ‘విభేదించడం’, ‘నిర్ణయం’ అనేవి మూడు ముఖ్యమైన అంశాలని... అందులో నాలుగో అంశమైన ‘అంతరాయం’ ఉండకూడదన్నారు. ‘పార్లమెంట్ ఆమోదం లేకుండా బడ్జెట్ నుంచి సొమ్ము ఖర్చుపెట్టడానికి వీల్లేదు. ఏటా రూ. 16-18 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుంటే... దానిపై పార్లమెంట్లో పూర్తి పరిశీలన లేకుండా, చర్చించకుండా ఉంటే పార్లమెంటరీ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నట్లు కాదు. ప్రజాస్వామ్యం విజయవంతంగా ముందుకు సాగదు’ అని రాష్ట్రపతి అన్నారు. మహిళా బిల్లును ఆమోదించండి మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ... 2014 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో ఏ పార్టీ ఉదారంగా వ్యవహరించలేదన్నారు. లోక్‌సభలో ప్రస్తుత ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నందున మహిళాబిల్లు ఆమోదం పొందేలా చూడాలన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఈసీ రూపొందించిన నివేదికపై బహిరంగ చర్చ అవసరమన్నారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకా రం లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వివాదాస్పదమే కాకుండా కష్టతరమని అరుు తే ఒకేసారి నిర్వహించడం ఎలా సాధ్యమో మార్గాలు అన్వేషించాలని సూచించారు. ఏ పార్టీనీ ఉద్దేశించి అనడం లేదు 'ధర్నా కోసం మీరు ఇతర ప్రాంతాల్ని ఎంచుకోవచ్చు. దయచేసి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. తమకున్న హక్కులు, అధికారాల్ని నిర్వర్తించేందుకు సభ్యులు సమయాన్ని వెచ్చించాలి’ అని రాష్ట్రపతి ఉద్బోధించారు. తాను ఏ ఒక్క పార్టీ, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడట్లేదని, ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలన్నారు. ‘పార్లమెంట్లో గందరగోళం ఒక అలవాటుగా మారింది. అది ఆమోదయోగ్యం కాదు. ఏ భేదాభిప్రాయాలున్నా మాట్లాడేందుకు అవకాశముంది. సభలో ఏం మాట్లాడినా కోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ఒక సభ్యుడు ఎవరిపై ఆరోపణలు చేసినా కోర్టు అతణ్ని విచారించలేదు’ అంటూ సభ్యుల హక్కుల్ని గుర్తుచేశారు. -
దేవెంద్ర టు నరేంద్ర
హెచ్.డి.దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆమన తర్వాత ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్.. ఇప్పు నరేంద్ర మోదీ హయంలోనూ అర్దామోదంతోనే ఆగిపోయిన దశలో ఉంది! 1996 - 2016 : బిల్లుకు 20 ఏళ్లు మహిళా రిజర్వేషన్ బిల్లుకు నేటికి 20 ఏళ్లు! నేడు ట్వెంటీయెత్ బర్త్‌డే! పుట్టని బిల్లుకు బర్త్‌డే ఏమిటి? అవును కదా! పురుడుకు నోచుకోకుండా, ప్రాణం మాత్రమే పోసుకున్న ‘డే’ని బర్త్ డే అనలేం. అదొట్టి ‘బిల్’డే మాత్రమే. 1996లో తొలిసారి బిల్లు పార్లమెంటుకు వచ్చింది. ఈ 2016లోనూ ఆ వచ్చింది వచ్చినట్టే ఉంది! ప్రవేశ పెట్టిన ఏడాదికో, రెండేళ్లకో బిల్ పాసై ఉన్నా మహిళా బిల్లుకు ఇప్పుడు 18 ఏళ్లు వచ్చి ఉండేవి. అదే టైమ్‌కి మనింట్లో అమ్మాయి పుట్టి ఉంటే ఆమెకూ 18,19 ఏళ్లు వచ్చి ఉండేవి. ఆమెకు ఓటు హక్కు వచ్చి ఉండేది. తనక్కావలసిన అభ్యర్థినో, ప్రత్యేకించి మహిళా అభ్యర్థినో ఆమె ఎన్నుకుని ఉండేది. భారీ ప్రాజెక్టులకే ఇన్నేళ్లు పట్టలేదు! ఇరవై ఏళ్లన్నది కాల గమనంలో దీర్ఘమైన వ్యవధి. పెద్ద పెద్ద డ్యామ్‌లు పూర్తవడానికి కూడా ఇంత సమయం పట్టలేదు. (నాగార్జునసాగర్ 12 ఏళ్లలో, భాక్రానంగల్ 15 ఏళ్లలో, హీరాకుడ్ 9 ఏళ్లలో కంప్లీట్ అయ్యాయి). అలాంటిది ప్రజాస్వామ్య భవన నిర్మాణానికి 33 శాతం బంగారు తాపడం వెయ్యడానికి మనం ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ, పని మొదలు కాలేదు! హెచ్.డి. దేవె గౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన బిల్లు.. ఆయన తర్వాత ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్సింగ్.. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలోనూ అర్ధామోదంతోనే ఆగిపోయిన దశలో ఉంది. రాజ్యసభలో ఓకే. లోక్‌సభలో నాట్ ఓకే. ఇదీ బిల్లు ప్రస్తుత స్థితి. పెండింగులో ఉన్న ఏ బిల్లుకైనా లోక్‌సభ కాలపరిమితి తీరనంత వరకే ప్రాణం. కొత్త లోక్‌సభ వచ్చాక బిల్లును మళ్లీ కొత్తగా పెట్టాల్సిందే. అలా లోక్‌సభలో మహిళా బిల్లు చచ్చిబతుకుతూ వస్తోంది. రాజ్యసభ పర్మినెంట్. అందుకే అక్కడ బిల్లును వదలకుండా పట్టుకుని సాధించుకోవడం వీలైంది. బిల్లుకు బాబ్డ్ హెయిర్ అడ్డొస్తుందా! మహిళా బిల్లును లోక్‌సభ ఎందుకని ప్రతిసారీ వెనక్కి నెట్టేస్తోంది? ఎందుకంటే.. అక్కడ బిల్లు పెట్టేవాళ్లు ఒకరైతే.. గగ్గోలు పెట్టేవాళ్లు వంద మంది. ‘బాబ్డ్ హెయిర్ మహిళలకు రిజర్వేషన్ ఇస్తే.. అవకతవకగా జుట్టు ముడేసుకుని పనికిపోయే ఆడవాళ్ల బాధ వాళ్లకేం తెలుస్తుంది’ అని అనేవాళ్లు కొంతమంది. 33 లోనే మళ్లీ కొంత రిజర్వేషన్ ఉండాలని వీళ్ల డిమాండ్. ‘ఎన్నేళ్లయినా సరే, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే మహిళా బిల్లుకు విముక్తి’ అనే అర్థం వచ్చేలా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు డి.వి.సదానంద గౌడ ఆమధ్య లోక్‌సభలో చేసిన ప్రకటనను బట్టి ఒకటైతే స్పష్టం అవుతోంది. ఇప్పట్లో ఇది తెగేలా లేదు. బహుశా ఎప్పటికీ తెగేది కాదేమో! బిల్లొస్తే మగవాళ్ల అవకాశాలు తగ్గుతాయి. అధికారాలు తగ్గుతాయి. అది ఖాయం. అందుకే భయం. ‘మాన్సూన్’లో చిన్న జల్లైనా లేదు! న్యూఢిల్లీలో ఈఏడాది మార్చి 5, 6 తేదీలలో మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సు జరిగింది. అది కూడా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవతో మాత్రమే జరిగింది. ‘జాతి నిర్మాణంలో మహిళా ప్రతినిధుల (ఉమన్ లెజిస్లేచర్స్) పాత్ర’ అనేది ప్రసంగాంశం. మొదటి రోజు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడారు. ‘పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 12 శాతం మించి లేదు. ఇది కరెక్టు కాదు’ అన్నారు ప్రణబ్, హమీద్. ‘ఇకనైనా మనం మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచించాలి’ అని కూడా అన్నారు. రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అయితే ఆయన మహిళా రిజర్వేషన్ మాటే ఎత్తలేదు! ‘స్త్రీలు అభివృద్ధి గురించి కాదు, స్త్రీల నాయకత్వంలో జరిగే అభివృద్ధి గురించి ఆలోచించే సమయం ఆసన్నమైంది’ అన్నారు కానీ, మహిళా బిల్లుకు ఏకాభిప్రాయం సాధించవలసిన సమయం ఆసన్నమైందని అనలేదు! ‘స్త్రీలకు సాధికారతను ఇచ్చేందుకు పురుషులెవరు?’ అని ప్రశ్నించారు కానీ, సాధికారతను చేకూర్చే మహిళా బిల్లును ప్రస్తావనకు తేలేదు! ‘మిమ్మల్ని మీరు సమర్థంగా తీర్చిదిద్దుకోండి. సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించుకోండి’ అని సలహా ఇచ్చారు కానీ.. సమర్థత నిరూపణకు, సాధికారత సాధనకు వీలు కల్పించే మహిళా బిల్లును త్వరలోనే మళ్లీ ప్రవేశపెడుతున్నాం అని హామీ ఇవ్వలేదు. అంతేనా! బిల్లునొదిలేసి పొగడ్తల విల్లంబును ఎత్తుకున్నారు. ‘‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ గుణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తారు’’ అని ప్రశంసించారు. ‘‘చాలా కొత్త విషయమే చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ! రిజర్వేషన్ బిల్లు చాలా పాతది కాబట్టి పాత సంగతి వద్దనుకున్నట్లుంది’’ అని కాంగ్రెస్ విమర్శ. ఆ విమర్శను ఆ పార్టీ మొన్నటి మాన్సూన్ సెషన్స్‌లో వినిపించనేలేదు. ఇరవై ఏళ్లు... అరవై సమావేశాలు ఇరవై ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు బడ్జెట్ సమావేశాలలో లెక్కలోకి రానిదిగా అయిపోతోంది. వర్షాకాల సమావేశాలలో నీరుగారి పోతోంది. శీతాకాల సమావేశాలలో గడ్డకట్టుకుని పోతోంది. ఈ వికారాలన్నీ బిల్లువి కాదు. బిల్లు పెట్టేందుకు సంశయిస్తున్న వారివి. మన ‘ప్రోగ్రెసివ్’ మోదీ, ‘మేక్ ఇన్ ఇండియా’ మోదీ కూడా బిల్లు మాట లేకుండానే ఈ వర్షాకాల సమావేశాలను దాటేశారు. బహుశా చట్ట సవరణతో పని లేకుండా బిల్లును గట్టెక్కిస్తారేమో చూడాలి.. వచ్చే రెండేళ్లలో. బిల్లు ‘రక్షణ’భారం మహిళలదే యు.పి.ఎ. తొలి విడత హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్.ఆర్.భరద్వాజ్ పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు ఆయనపై సమాజ్‌వాది సభ్యులు దాడి చేసి, బిల్లు పత్రాలను గుంజుకోబోయారు. అక్కడే ఉన్న మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేణుకా చౌదరి, మరో మహిళా ఎంపీ చురుగ్గా స్పందించి, భరద్వాజ్‌కు రక్షణగా అటొకరు ఇటొకరు నిలబడ్డారు. ‘బిల్లుపై చెయ్యి పడిందా..’ అని హెచ్చరించారు! ఎప్పటికైనా మహిళా బిల్లు.. మహిళా ఎంపీల తెగింపుతో మాత్రమే సాధ్యమౌతుందనడానికి ఆనాటి సంఘటన ఒక స్పష్టమైన సంకేతం. బిల్ బయోగ్రఫీ ♦ మహిళా బిల్లు చట్టంగా వస్తే కనుక లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ♦ మహిళా బిల్లు చట్టంగా రావాలంటే లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదం పొందాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి సంతకం చేయాలి. ఇప్పటి వరకు ఒక్క రాజ్యసభలో మాత్రమే బిల్లు ఆమోదం పొందింది. ♦ తొలిసారి హెచ్.డి.దేవెగౌడ ప్రభుత్వం 1996 సెప్టెంబర్ 12న మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ♦ సి.పి.ఐ. ఎంపీ గీతా ముఖర్జీ అధ్యక్షతన బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను 1996 డిసెంబర్ 9న లోక్‌సభకు సమర్పించింది. తర్వాత కొద్ది కాలానికే దేవెగౌడ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి లోక్‌సభ రద్దయింది. ♦ దేవెగౌడ, గుజ్రాల్‌ల తర్వాత వచ్చిన వాజపేయి ప్రభుత్వం 1998 జూన్ 26న మహిళా బిల్లును లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ గవర్నమెంటు కూడా మైనారిటీలో పడిపోవడంతో లోక్‌సభ అర్ధంతరంగా రద్దయింది. ♦ ఎన్నికల తర్వాత వాజపేయి ప్రభుత్వమే మళ్లీ 1999 నవంబర్ 22న బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది. ♦ తిరిగి 2002లో, 2003లో వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం బిల్లును సభ ముందుకు తెచ్చింది. అప్పుడూ అదే సమస్య. ♦ ఎన్డీయే తర్వాత, 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం మహిళా బిల్లు తెస్తామని చెప్పింది కానీ, నాలుగేళ్ల వరకు అలాంటి ప్రయత్నాలే చేయలేదు! ♦ ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా, 2008 మే 6న బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. లా అండ్ జస్టిస్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపింది. ♦ స్థాయీ సంఘం తన నివేదికను సమర్పించాక, 2009 డిసెంబర్ 17న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టింది. సమాజ్‌వాది పార్టీ, జనతాదళ్ (యు), ఆర్జేడీ నిరసనలు, తీవ్ర వ్యతిరేకతల నడుమ బిల్లుపై ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది. ♦ బిల్లును వీలైనంత త్వరగా తెచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని 2010 ఫిబ్రవరి 22న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ♦ కేంద్ర మంత్రిమండలి 2010 ఫిబ్రవరి 25న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ♦ తర్వాత కొద్ది రోజులకు 2010 మార్చి 8న బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) సభలో గందరగోళం సృష్టించాయి. ♦ మర్నాడు (2010 మార్చి 9) ఓటింగులో భారీ మెజారిటీతో మహిళా బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ♦ ఆరేళ్లు గడిచాయి. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో యూపీఏ పోయి, ఎన్డీయే వచ్చింది. ఇప్పటి వరకు మళ్లీ బిల్లు మాటే లేదు. మహిళల్లో విల్ పవర్ ఉంటే బిల్ పవర్ ఎందుకు అన్నట్లుంది మోదీ వైఖరి! సాకులు, సైడు ట్రాకులు ⇒ జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల బిల్లును తేలేకపోతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నిజానికి రాజ్యాంగం ప్రకారం కానీ, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం కానీ ఒక చట్టం తెచ్చేందుకు ఏకాభిప్రాయంతో పని లేదు. పేటెంటు చట్టం, పోటా చట్టం వంటివి ఏకాభిప్రాయం లేకుండా అమల్లోకి వచ్చినప్పుడు మహిళా బిల్లును చట్టంగా ఎందుకు తేకూడదు? ⇒ బిల్లు చట్టంగా వస్తే అగ్రవర్ణ మహిళలే ఎక్కువ సీట్లను ఎగరేసుకుపోతారని బిల్లును వ్యతిరేకిస్తున్నవారి వాదన! అందుకే 33 శాతంలోంచి మళ్లీ కొంత శాతం బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ కోసమైతే 33 శాతం నుంచే ఎందుకు తీసుకోవాలి? మొత్తం చట్టసభ సీట్లలోంచే అడగొచ్చు కదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు! ⇒ ప్రతి పార్టీ తప్పనిసరిగా 33 శాతం సీట్లను మహిళలకు ఇచ్చేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తే పోయేదానికి రాజ్యాంగాన్నే సవరించడం ఎందుకు అనేవాళ్లూ ఉన్నారు! దీని వెనుకా కుట్ర ఉంది. ఓడిపోయే స్థానాల్లో మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిచే చోట మగాళ్లు నిలబడొచ్చు. అప్పుడు రిజర్వేషన్ అన్నమాటకే అర్థం ఉండదు. పోటీ చేసేవాళ్లు 33 శాతం ఉంటారు కానీ, గెలిచి చట్టసభల్లోకి వెళ్లే వాళ్లు అంతమంది ఉండరు. ⇒ ఇన్ని రాజకీయాలు ఉంటాయి కనుకే మహిళలు చట్టసభల్లోకి రావడానికి మహిళా రిజర్వేషన్ చట్టం తప్పనిసరి అవసరం. - మాధవ్ శింగరాజు -
మహిళా బిల్లును ఆమోదించండి: కరుణానిధి
చెన్నై: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు. ఈ బిల్లు ఆమోదించిన తర్వాతే బీసీలకు సబ్ కోటాపై ముందుకెళ్లాలని ఆయన సూచించారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ, కాంగ్రెస్ లకు ఉన్న మెజారిటీ దృష్ట్యా బిల్లు ఆమోదం పొందడం సాధ్యమేనని పేర్కొన్నారు. ఈ మేరకు కరుణానిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నాం: సోనియా
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆపార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన 1996 నుంచి పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు కొన్ని కారణాల వల్ల లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయిందని సోనియా బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. పార్టీ మహిళా కార్యకర్తల సమావేశంలో సోనియా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి తాము కట్టుబడి ఉన్నామని సభలో బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సోనియా తెలిపారు. -
అగ్రరాజ్యాల్లోనూ ఇంతింతే..
మహిళల హక్కులపై నిరంతరం నీతిచంద్రికలు వల్లించే అగ్రరాజ్యాల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే. ‘ఆకాశంలో సగం’ అంటూ మాటలతోనే మహిళలను ఆకాశానికెత్తిన మావో పుట్టిన దేశంలోనూ చట్టసభల్లో మహిళలకు దక్కుతున్న చోటు అంతంత మాత్రమే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కు మోక్షం దక్కే ముహూర్తం ఇంకా ఆసన్నం కాకపోవడంతో భారత్‌లోనూ అదే పరిస్థితి. వివిధ దేశాల్లోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు - ఎలక్షన్ సెల్ * ప్రస్తుత పార్లమెంటులో మహిళలకు 11 శాతమే ప్రాతినిధ్యం గల భారత్ ఐపీయూ జాబితాలో 108వ స్థానంలో ఉంది. * పొరుగునే ఉన్న పలు దేశాలు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మన కంటే ముందున్నాయి. మహిళలకు 27.7 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తూ అఫ్గానిస్థాన్ 37వ స్థానంలో, 20.7 శాతం ప్రాతినిధ్యంతో పాకిస్థాన్ 66వ స్థానంలో, 19.7 శాతం ప్రాతినిధ్యంతో బంగ్లాదేశ్ 71వ స్థానంలో ఉన్నాయి. * చైనా చట్టసభలో మహిళలకు 23.4 శాతం ప్రాతినిధ్యమే లభిస్తోంది. ఐపీయూ జాబితాలో చైనా 56వ స్థానంలో నిలుస్తోంది. * ప్రపంచంలో సుమారు పాతిక దేశాల్లో మాత్రమే చట్టసభల్లో మహిళలకు కనీసం మూడోవంతు ప్రాతినిధ్యం లభిస్తోంది. * ప్రపంచంలోని ఎనిమిది దేశాల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మచ్చుకైనా లేదు. పెద్దన్న.. చిన్న బుద్ధి పేరుకు అగ్రరాజ్యమే కానీ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మాత్రం అమెరికా వెనకబడే ఉంది. అమెరికా ప్రతినిధుల సభలో మహిళల ప్రాతినిధ్యం 17.8 శాతం మాత్రమే. ఐపీయూ జాబితాలో ఈ దేశం 80వ స్థానంలో ఉంది. -
పార్లమెంట్ వద్ద మహిళల నిరసన
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను పొడిగించైనా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంట్ బయట కొంతమంది మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొచ్చిన వారు 144 సెక్షన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో నినాదాలిచ్చారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కీలక బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ సమావేశాలు పొడిగించే అవకాశం ఉందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అంతకుముందే ప్రకటించారు. -
మా ఇంట్లో నానమ్మే బాస్!
అందుకే మహిళా సాధికారత కోసం బిల్లు తెద్దాం: రాహుల్ భోపాల్: ‘మా ఇంట్లో నాన్న(రాజీవ్), బాబాయ్(సంజయ్) ఉండేవారు. అయితే ఇంటికి బాస్ మాత్రం నానమ్మే(ఇందిరాగాంధీ). ఇందులో అనుమానమే లేదు. ఆమే బాస్‌గా ఉండేవారు.. అందుకే మహిళా సాధికారత కోసం మహిళా బిల్లు తెద్దాం. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు సాధికారత కల్పించకపోతే భారత్ శక్తిమంతమైన దేశంగా అవతరించలేదు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో తయారీలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాల సేకరణ కోసం సోమవారమిక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 250 మంది మహిళలతో ముచ్చటించారు. మహిళల సాధికారత ఆవశ్యకతను ప్రస్తావిస్తూ ‘మా ఇంట్లో దాదీనే(నానమ్మ) బాస్’ అని నవ్వుతూ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాల్సిన అవసరముందని, దానికి మోక్షం లభించకపోతే అన్ని రంగాల్లో మహిళలకు సాధికారత కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ నిర్వహించిన ఈ సమావేశంలో సెక్స్ వర్కర్లు, హిజ్రాలు, సామాజిక కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు తమ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. కొందరు నిర్మొహమాటంగా ధరల పెరుగుదల, వంటగ్యాస్ సమస్యలను లేవనెత్తారు. వారి డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తామని రాహుల్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి సారథ్యం వహిస్తున్న ఆయన ఈ సమావేశంలో ఏమన్నారంటే.. చట్టసభల్లో స్త్రీలకు33 శాతం కోటా ఇచ్చేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఉంది. దాన్ని అలాగే వదిలేయలేం. ఈ విషయంలో పార్టీలకూ బాధ్యత ఉంది. బిల్లుకు ఆమోదం లభిస్తుంది. వచ్చే ఐదు, పదేళ్లలో కాంగ్రెస్ మంత్రుల్లో సగం మంది స్త్రీలే ఉంటారు. దేశంలో మహిళలు ఇప్పటికీ అన్ని రకాలుగా హింసకు గురవుతుండడం బాధాకరం. మహిళలకు సాధికారత కల్పించడం పెద్ద పోరాటం లాంటిది. మనం పోరాడి గెలవాలి. మా పార్టీతోపాటు పార్లమెంటులో, ప్రభుత్వంలో మహిళలకు విస్తృత ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తాను. {పతి మహిళా దేశానికి ఆస్తి. నాయకత్వ పదవుల్లో అత్యధికం వారికి దక్కేలా కృషి చేస్తాను. శక్తిసామర్థ్యాల్లో స్త్రీపురుషుల మధ్య తేడా లేదు. మహిళలకు ఎలాంటి రక్షణా అవసరం లేదు. వారి హక్కులను వారికిస్తే వారిని వారే రక్షించుకుంటారు.


