ఈ బిల్లు అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటాం: రాహుల్‌ | Rahul strong comments on the Women Reservation Bill | Sakshi
Sakshi News home page

ఈ బిల్లు అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటాం: రాహుల్‌

Apr 17 2026 3:17 PM | Updated on Apr 17 2026 8:23 PM

Rahul strong comments on the Women Reservation Bill

ఢిల్లీ: నారిశక్తి వందన్‌ అధినియం పేరుతో కేంద్రం తీసుకవచ్చిన బిల్లు వాస్తవానికి మహిళల రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు కానేకాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు చర్చపై ఆయన ఈ రోజు( శుక్రవారం) పార్లమెంటులో మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు.

మా నానమ్మ ఇందిర వల్లే నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందని నిన్న సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.

ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అన్నారు. ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇదన్నారు. బీజేపీ సభ్యులు రాజ్యాంగం కంటే మనువాదానికి  ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఉన్నతస్థాయి  అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరని, ప్రేవేటు రంగంలో కూడా రంగంలో కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు  చేసిందేమీ లేదన్నారు.

ఇది మహిళల బిల్లు కాదు.. "షేమ్ ఫుల్ యాక్ట్..!"

కులగణనను బైపాస్‌ చేసేందుకే కేంద్ర యత్నిస్తోందని అస్సోం, జమ్మూలో చేసినట్లు డీలిమిటేషన్ చేయాలనుకంటున్నారని  ఆరోపించారు. ఈ బిల్లు దేశవ్యతిరేఖ బిల్లని ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చేయడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ ఆత్మని చంపే బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరాతమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. కాగా రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement