రాజ్యాంగాన్ని మార్చే కుట్ర తిప్పికొట్టాం: రాహుల్ | Rahul response to the defeat of the Women Reservation Bill | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర తిప్పికొట్టాం: రాహుల్

Apr 17 2026 8:10 PM | Updated on Apr 17 2026 8:32 PM

Rahul response to the defeat of the Women Reservation Bill

మహిళా బిల్లు వీగిపోవడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొట్టామన్నారు. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కానేకాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని 2023కు సంబంధించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువస్తే మద్దతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్‌తో మహిళా బిల్లుకు ముడిపెడితే కుదరదన్నారు.

అమిత్‌షా ఏమన్నారంటే?

కాగా అంతకుముందు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఛాలెంజ్‌ విసిరారు.. కాంగ్రెస్ ‍నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్‌ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. 

అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు. డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ వేసిన ట్రాఫ్‌లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. 

రాహుల్ గాంధీ  

అంతకుముందు రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు. నిన్న జరిగిన సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. 


వీగిపోయిన మహిళా బిల్లు

కాగా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మెుత్తం 528 మంది ఓటింగ్‌లో పాల్గొనగా అనకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. దీంతో సరైన సంఖ్యా బలం లేక బిల్లు వీగిపోయింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement