స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు  | PM Narendra Modi Attacks DMK, Congress Over Women Reservation | Sakshi
Sakshi News home page

స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు 

Apr 19 2026 6:34 AM | Updated on Apr 19 2026 10:10 AM

PM Narendra Modi Attacks DMK, Congress Over Women Reservation

కోయంబత్తూర్‌ ఎన్నికల ప్రచార సభలో మోదీ

సాక్షి, చెన్నై:  తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒక గొప్ప ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల విద్వేష, నీచ రాజకీయాల వల్ల ఆ బిల్లు పట్టాలు తప్పిందని అన్నారు. అధికారం కేవలం తమ కుటుంబాల చేతుల్లోనే ఉండాలన్న స్వార్థంతోనే విపక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, బిల్లు క్రెడిట్‌ను ప్రతిపక్షాలే తీసుకోవాలంటూ వ్యక్తిగతంగా అభ్యర్థించానని చెప్పారు.

 అయినా సరే విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. సాధారణ కుటుంబాల్లో జన్మింంచిన ఆడబిడ్డలు అత్యున్నత చట్టసభలకు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ గొప్ప ప్రయత్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలే అందుకు కారణమని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే సామాన్య కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమిళ మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలు అయ్యేవారని.. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడుకు లోక్‌సభలో మరెన్నో సీట్లు వచ్చేవని తెలిపారు. కానీ, ఇదంతా జరగడం డీఎంకేకు ఇష్టం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement