అవగాహన
‘మహిళలకు రిజర్వేషన్‌లు ఎందుకు?’ అనే ప్రశ్నకు 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా చెప్పే జవాబులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జవాబులకు ఉపయోగపడే పుస్తకం... ఉమెన్ అండ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. తరుణ్ బెహూరియా రాసిన ఈ పుస్తకంలో రిజర్వేషన్‌ల ప్రాముఖ్యత, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంపై దాని ప్రభావాన్ని గురించి వివరంగా చర్చించారు.
‘సరిౖయెనప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరం’ అనే అంశంతో ‘ఉమెన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా’ పుస్తకం రాశారు. పంచాయతీరాజ్‌లో రిజర్వేషన్‌ల ప్రభావం, భారతదేశంలో మహిళా సాధికారత: రాజకీయ రిజర్వేషన్‌లు, మహిళా రిజర్వేషన్ బిల్లు: ఒక సామాజిక అవసరం, జాతీయ బాధ్యత, భారతదేశంలో మహిళలకు కోటాల అమలు, మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా సాధికారతకు ఒక మైలురాయి.
స్థానిక స్వపరి పాలన, మహిళలు, రాజకీయ భాగస్వామ్యం: శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్... ఇలా ఆసక్తికరమైన చాప్టర్‌లు ఈ పుస్తకంలో ఉన్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్ర, ΄÷రుగుదేశాలలో మహిళల రాజకీయ భాగస్వామాన్ని గురించి వివరించే పుస్తకం... ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ పాలిటిక్స్– పోస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భారతదేశంలో మహిళలకు ఉన్న రిజర్వేషన్‌లను విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం. నాలుగు విభాలుగా విభజించిన ఈ పుస్తకం మహిళా రిజర్వేషన్ చట్టంలోని వివిధ కోణాలను వివరిస్తుంది.


