మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నాం: సోనియా | Congress committed to women's reservation bill: sonia gandhi | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నాం: సోనియా

Aug 20 2014 1:07 PM | Updated on Mar 18 2019 9:02 PM

మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నాం: సోనియా - Sakshi

మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నాం: సోనియా

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆపార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆపార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన 1996 నుంచి  పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు కొన్ని కారణాల వల్ల లోక్సభలో ఆమోదం పొందలేకపోయిందని సోనియా బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు.

 

పార్టీ మహిళా కార్యకర్తల సమావేశంలో సోనియా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి తాము కట్టుబడి ఉన్నామని సభలో బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సోనియా తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement