అమిత్‌షా పర్యటన రద్దు! | Union Home Minister Amit Shah state visit cancelled | Sakshi
Sakshi News home page

అమిత్‌షా పర్యటన రద్దు!

Jul 24 2026 4:14 AM | Updated on Jul 24 2026 4:14 AM

Union Home Minister Amit Shah state visit cancelled

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన రద్దయింది. వచ్చే ఆదివారం, 26న కరీంనగర్‌లో జరగనున్న ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉండగా అది రద్దయింది. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా...నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు, వాటికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కడం, విపక్షాల నిరసనలు రోజు కో రూపం తీసుకుంటుండడంతో అమిత్‌షా పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోగా లేదా ఆ తర్వాత అమిత్‌షా తప్పకుండా తెలంగాణ ప ర్యటనకు వస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement