breaking news
tour Canceled
-
టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ ప్రకటన.. మచిలీపట్నం టూర్‌కు బాబు వెనుకడుగు
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పర్యటనను ప్రతిపక్ష నేత చంద్రబాబు రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 12న బుధవారం సాయంత్రం మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. రోడ్ షోలో భాగంగా చింతగుంటపాలెం గో సంఘం వద్ద ఉన్న జీ+3 టిడ్కో గృహాలను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ జీ+3 గృహాలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసింది. స్థానిక టీడీపీ నేతలు ఈ గృహ సముదాయాల పనులను పరిశీలించారు. దీంతో చంద్రబాబును ఇక్కడకు తీసుకువస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అంచనాకు వచ్చారు. నిర్మాణాలు పూర్తవడంతో చంద్రబాబు పరువుపోవడం ఖాయమని భావించిన టీడీపీ నేతలు ఆయన పర్యటనను రద్దు చేయించారు. నాడు: చంద్రబాబు హయాంలో 2019 నాటికి రుద్రవరంలోని జీ+3 గృహాల నిర్మాణ పరిస్థితి ఇది చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా గృహాలు నగరంలోని గోసంఘం, రుద్రవరం ప్రాంతాల్లో జీ+3 గృహాల నిర్మాణం పనులకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శ్రీకారం చుట్టారు. గోసంఘంలో 18 బ్లాక్‌ల్లో 864 గృహాలు నిర్మించాల్సి ఉండగా 14 బ్లాక్‌లను మాత్రమే నిర్మించారు. నాలుగు బ్లాక్‌ల పనులు చేపట్టనేలేదు. ఈ గృహాల్లో ఫ్లోరింగ్, కరెంటు, నీటి సదుపాయం తదితర మౌలిక వసతుల పనులు ప్రారంభించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన నాలుగు బ్లాక్‌లను నిరి్మంచి, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసింది. గృహాల నిర్మాణ పనులకు రూ.53.93 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.13.15 కోట్లు వెచ్చించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుద్రవరంలో నిర్మించిన జీ+3 గృహాలు, ముమ్మరంగా సాగుతున్న రహదారి పనులు రుద్రవరంలోనూ అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రుద్రవరంలో 30 బ్లాక్‌ల్లో 1,440 గృహాలు నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు బ్లాక్‌ల జీ+2 పనులు మాత్రమే చేశారు. 28 బ్లాక్‌లకు సంబంధించి ఫుట్టింగ్ లెవల్ వరకు మాత్రమే పనులు చేపట్టి అలాగే వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 30 బ్లాకులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం అన్ని బ్లాక్‌ల్లో జీ+3 గృహాలను నిర్మించింది. మచిలీపట్నంలోని గో సంఘం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న జీ+3 గృహాలు బ్లాక్‌ల మధ్య రహదారుల నిర్మాణం, వ్యర్థాలకు సంబంధించిన సివిలేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గో సంఘం, రుద్రవరంల్లో జీ+3 గృహాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకు మచిలీపట్నంలోని వాటర్ వర్క్స్ వద్ద నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జీ+3 గృహాలకు తాగునీరు సరఫరా కానుంది. రెండు చోట్లా తాగునీటిని నిల్వ చేసే సంపులను కూడా నిర్మించారు. గృహాల వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ పంపిణీకి సిద్ధం చేశాం.. గో సంఘం వద్ద జీ+3 గృహాల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశాం. రుద్రవరంలో అన్ని బ్లాక్‌ల నిర్మాణం పూర్తయింది. గృహాల్లోని మెట్లు, బాత్రూమ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్ పైప్లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. – ఎం.గణేష్‌బాబు, ఏఈ -
8న సీఎం పర్యటన లేనట్టే
ఏలూరు : ఏలూరులో ఈనెల 8న జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన రద్దయ్యింది. మహా సంకల్పం పేరిట ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని గురువారం తణుకు మండలం వేల్పూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విష యం విదితమే. ఆ కార్యక్రమం గుంటూరుకు మారడంతో ఏలూరులో బహిరంగ సభ ఉండదని అధికార వర్గాలు వెల్లడిం చాయి. వేల్పూరులో సీఎం చేసిన ప్రకటనతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఏర్పాట్లు ఎలా చేయాలోనని యంత్రాం గం కంగారుపడింది. ఈనెల 8న సీఎం రావడం లేదని తెలిసి ఊపిరి పీల్చుకుంది. 10 రోజుల అనంతరం ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. -
నేటి వైఎస్ జగన్ పర్యటన రద్దు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని తుపాను బాధితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల బుధవారం నాటి పర్యటన రద్దయింది. ఈ విషయూన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బాధితుల్ని పరామర్శించేందుకు జగన్ సోమవారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్న విషయం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఖరారు చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలలో మందుగుండు సామగ్రి కంపెనీలో పేలుడు సంభవించి 18 మంది మృంతి చెందిన విషయూన్ని జీర్ణించుకోలేకపోయారు. అక్కడి నేతల ద్వారా మరింత సమాచారం అందుకున్న జగన్ మంగళవారం రాత్రి పర్యటనను కుదించుకుని కాకినాడ బయల్దేరారు. దీంతో రెండో రోజైన బుధవారం పర్యటన రద్దయిందని ధర్మాన పేర్కొన్నారు. నాగుల చవితి తరువాత మరోమారు జగన్ జిల్లాకు రానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు శ్రీకాకుళం అర్భన్: తుపాను, వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జిల్లా పర్యటనను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం కేసీఆర్ పర్యటన రద్దు ..?
రాంనగర్ : జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. జిల్లాలో నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్, గడియగౌరారం, లేదా జిల్లా కేంద్రంలో భూపంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని జిల్లా అధికార యంత్రాంగానికి సోమవారం రాత్రి సమాచారం అందింది. కానీ అనివార్య కారణాల వల్ల సీఎం పర్యటన రద్దయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీఎం ఎప్పుడు పర్యటించినా అందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.