సీఎం కేసీఆర్ పర్యటన రద్దు ..? | Telangana CM KCR nalgonda tour Canceled | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ పర్యటన రద్దు ..?

Aug 13 2014 2:27 AM | Updated on Aug 29 2018 4:16 PM

సీఎం కేసీఆర్ పర్యటన రద్దు ..? - Sakshi

సీఎం కేసీఆర్ పర్యటన రద్దు ..?

జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమాన్ని

 రాంనగర్ : జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా  ప్రారంభించాల్సి ఉంది.  జిల్లాలో నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్, గడియగౌరారం, లేదా జిల్లా కేంద్రంలో భూపంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని జిల్లా అధికార యంత్రాంగానికి సోమవారం రాత్రి సమాచారం అందింది. కానీ అనివార్య కారణాల వల్ల సీఎం పర్యటన రద్దయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీఎం ఎప్పుడు పర్యటించినా అందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement