సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కూడా కల్పించడం లేదు. ఈ విషయమై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత ఇవ్వడం లేదు. దీని వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో లాకప్ డెత్ లు కొనసాగుతున్నాయి
భారతి సిమెంట్స్ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీని వల్ల కార్మికుల ఉపాధికి దెబ్బ తగులుతుంది. పరిశ్రమలకు ఇబ్బందులు సృష్టించి ఏం సందేశం పంపుతున్నారు?. డీఎస్సీ పేపర్ లీక్ అంశంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరాం. బిల్లులపై కేంద్రంతో ఎలాంటి చర్చలు జరగలేదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం కొనసాగుతుందని అన్నారు.


