కేంద్ర మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ | Ysrcp Mp Gurumurthy Letter To Amit Shah And Rajnath | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ

Aug 20 2026 11:42 PM | Updated on Aug 20 2026 11:42 PM

Ysrcp Mp Gurumurthy Letter To Amit Shah And Rajnath

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు, ముత్యాలమ్మ బోటును  రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇండియన్ నేవీ ఇండియన్ పోస్ట్ గార్డ్ సంయుక్తంగా మత్స్యకారులని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.

మత్స్యకారుల చివర మొబైల్ సిగ్నల్‌ని ట్రాక్ చేయాలి. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని బోటు అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిందా లేదా అనేది తెలుసుకోవాలి. గాలింపు చర్యల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఆగస్టు మూడో తేదీన ఓడలరేవు నుంచి వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టిన మత్స్యకారులని , బోట్లని  కనుగొనలేకపోయాయి. తమ వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. బోటు ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా మునిగిపోవడం, లేదంటే అంతర్జాతీయ జలాల్లో కి ప్రవేశించి ఉండవచ్చని జిల్లా కలెక్టర్ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement