సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్‌కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు.


నూతన వధూవరులు వర్షితరెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.


