ఏపీ డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం | Another New Angle In The Sale Of AP Dsc Jobs | Sakshi
Sakshi News home page

ఏపీ డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం

Aug 20 2026 3:19 PM | Updated on Aug 20 2026 4:47 PM

Another New Angle In The Sale Of AP Dsc Jobs

సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ.14.5 లక్షలు బాధితురాలి నుంచి టీడీపీ నేతలు వసూలు చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షలు వసూలు చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి డీఎస్సీ బాధితురాలు రాధిక ఫిర్యాదు చేశారు. 

మంత్రి లోకేష్‌ కోటాలో ఉద్యోగం అంటూ మోసం చేశారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పరీక్ష లేకుండా నాకు డీఎస్సీ ఉద్యోగం ఇస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు మెడికొండ జ్యోతి, అడపా భాను ప్రకాష్‌లు డబ్బులు తీసుకున్నారు.  ఆ ఉద్యోగం వేరే వ్యక్తికి ఇచ్చి నన్ను మోసం చేశారు. ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశా.. 10 నెలలైనా చర్యలు లేవు. నన్ను చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.

..ఎస్పీ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ పోస్ట్‌ ఇస్తామని మోసం చేశారు. నా దగ్గర ఆధారాలున్నా.. నిందితుడిని అరెస్ట్‌ చేయలేదు. నాకు జరిగిన మోసాన్ని వైఎస్‌ జగన్‌కు వివరించాను’’ అని రాధిక తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement