సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు గురువారం కలిశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టి చంపిన విషయమై వైఎస్ జగన్‌కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.
తమ కుమార్తెను తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని వైఎస్ జగన్ సముదాయించి ధైర్యం చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ వైఎస్ జగన్‌ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. అవసరమైన న్యాయ పోరాటం చేద్దామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.



