ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ లక్ష్యం తమ నాయకుడు రాహుల్ గాంధీని బద్నాం చేయడమేని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంల్‌లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటరిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్‌గా అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమే ఏకైక అజెండా అమిత్ షా పెట్టుకున్నారని మండిపడ్డారు.
‘పార్లమెంట్‌లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు. గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు. అలాంటి గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది?,
జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ,,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు. గద్దర్‌తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?, బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే. గద్దర్ గురించి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారు
ఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి. మేము తప్పుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం’ అని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.


