Sports
-
అండర్–19 సారథిగా ఆయుశ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుశ్ మాత్రే భారత అండర్–19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ సీజన్ ఐపీఎల్లో అరంగేట్రం చేసి... 35 బంతుల్లోనే సెంచరీతో సంచలనం రేకెత్తించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో భారత అండర్–19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా... 5 యూత్ వన్డేల సిరీస్‌తో పాటు 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. అంతకుముందు జూన్ 24న ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఇప్పటికే యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయుశ్, వైభవ్‌పై ఐపీఎల్‌తో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతేడాది ఆ్రస్టేలియా అండర్–19 జట్టుపై వైభవ్ సెంచరీతో ఆకట్టుకోగా... 17 ఏళ్ల ఆయుశ్ 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లాడి 962 పరుగులు చేశాడు. ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు సిరీస్ 16 వికెట్లతో అదరగొట్టిన కేరళ లెగ్‌స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్‌తో పాటు పంజాబ్ ఆఫ్‌స్పిన్నర్ అన్మోల్జీత్ సింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ వికెట్‌కీపర్ రాపోలు అలంకృత్‌కు స్థానం లభించింది. భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెపె్టన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్ సింగ్, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఇనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్లు: నమన్ పుష్పక్, దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, రాపోలు అలంకృత్. -
ప్రొ హాకీ లీగ్‌కు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) జట్టును ప్రకటించింది. జూన్ 7 నుంచి యూరప్‌లోని అమ్స్టెల్వీన్, నెదర్లాండ్స్, అంట్వెర్ప్, బెల్జియంలో భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం గురువారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జూన్ 7, 9న నెదర్లాండ్స్‌తో, 11, 12న అర్జెంటీనాతో టీమిండియా తపలడుతుంది. ఆ తర్వాత 14, 15న ఆ్రస్టేలియాతో, 21, 22న బెల్జియంతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ ప్రొ లీగ్ అంచె పోటీల్లో 8 మ్యాచ్‌లాడిన భారత్ 5 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ‘అనుభవజు్ఞలు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. ప్లేయర్లంతా బాగా సాధన చేశారు. హాకీ ప్రపంచకప్‌నకు అర్హత సాధించే నేపథ్యంలో... ప్రతి పాయింట్ కీలకం కావడంతో అన్నీ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. పెనాల్టీ కార్నర్లను సది్వనియోగం చేసుకునే అంశంలో మరింత దృష్టిపెట్టాం’అని భారత హెడ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ అన్నాడు. పరాజయాలను ‘డ్రాలుగా... ‘డ్రా’లను విజయాలుగా మలచడమే లక్ష్యంగా ఉన్నామన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్, డిఫెండర్స్: సుమిత్, అమిత్ రొహిదాస్, జుగ్రాజ్ సంగ్, నీలమ్ సంజీప్, హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, యశ్దీప్ సివాచ్, మిడ్ఫీల్డర్స్: రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషేర్ సింగ్, ఫార్వర్డ్స్: గుర్జాంత్ సింగ్, అభిషేక్, శైలానంద్ లక్రా, మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్. -
భారత క్రికెట్లో ‘సుదర్శన’ మంత్రం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ తరఫున రెండు, తమిళనాడు తరఫున మూడు సెంచరీలు నమోదయ్యాయి. మ్యాచ్ సాధారణ ‘డ్రా’ దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ కుప్పకూలింది. దాంతో చివరి రోజు తమిళనాడు విజయలక్ష్యం 11 ఓవర్లలో 144... సాధారణంగా ఇలాంటి స్థితిలో బ్యాటర్లు మైదానంలోకి దిగి లాంఛనంగా కొన్ని బంతులు ఆడి ‘షేక్ హ్యాండ్’కు సిద్ధమవుతారు. కానీ తమిళనాడు టి20 శైలిలో గెలుపుపై గురి పెట్టింది. ఒకవైపు సీనియర్ జగదీశన్ చెలరేగుతుండగా మరో ఓపెనర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. 7 ఓవర్లలో స్కోరు 108/1. అనూహ్యంగా వెలుతురులేమితో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో హైదరాబాద్ బతికిపోయింది. అయితే 21 ఏళ్ల ఆ ఓపెనర్ ఆటపై అన్ని వైపుల నుంచి అసాధారణ ప్రశంసలు వెల్లువెత్తాయి. తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఆ కుర్రాడే సాయి సుదర్శన్. అతనికిదే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. నాలుగు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడైన ఆటతో ‘ఆల్ ఫార్మాట్’ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు. - సాక్షి క్రీడా విభాగం రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందే సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఒక సీజన్ ఆడాడు. 2022లో ఐదు మ్యాచ్‌లలో కలిపి 114 బంతులు ఎదుర్కొని ఒక హాఫ్ సెంచరీ సహా 145 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్లో ఒక ఏడాది బాగా ఆడి ఆ తర్వాత ఎంతో మంది కనుమరుగైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రదర్శనను ఎవరూ అంత సీరియస్‌గా చూడలేదు. కానీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే అతని ఆటను చూశాక భవిష్యత్తులో చాలా తొందరగా భారత్‌కు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా సుదర్శన్‌కు గుర్తింపు లభించింది.రంజీ ఆరంభానికి చాలా ముందే ‘ఈ అబ్బాయిలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇతడిని తమిళనాడు జట్టులోకి తీసుకోండి’ అంటూ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటూ ‘ఫాస్ట్ ట్రాక్’తో ముందు టి20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి, ఆపై రంజీ టీమ్‌లోకి ఎంపిక చేశారు. తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి తమిళనాడు జట్టులోకి వచ్చాక తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని సుదర్శన్ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి ఆటతో... సుదర్శన్ బ్యాటింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాస్’ తరహా శైలి అతనిది. చక్కటి డ్రైవ్‌లతో అలవోకగా ఫోర్లు రాబట్టడం అతనికి బాగా తెలిసిన విద్య. అవసరమైన సమయంలో గేర్లు మార్చి సిక్స్‌లు కొట్టినా అందులోనూ ఒక కళ ఉంటుంది. అప్పుడప్పుడు పుల్, హుక్ షాట్లతో పాటు స్లాగ్ స్వీప్‌లు, స్కూప్ షాట్లను కూడా ఐపీఎల్లో సుదర్శన్ చూపించాడు. టి20లు అయినా సరే లెక్క లేనితనంతో గుడ్డిగా బ్యాట్ ఊపే తత్వం కాదు. తనకు ఏం కావాలనే దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. ఐపీఎల్లో నాలుగు సీజన్ల కెరీర్ చూస్తే అతని బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకపోవడమే కాదు... అనవసరపు చెత్త షాట్లతో అవుటైన సందర్భాలు చాలా అరుదు. ఇదే అతడిని ఇతర దేశవాళీ బ్యాటర్లతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది. అందుకే ఐపీఎల్లో చెలరేగుతున్న సమయంలో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపించడం సుదర్శన్ బ్యాటింగ్‌పై నమ్మకాన్ని చూపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ఫార్మాట్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నా... సుదర్శన్ వన్డేలూ బాగా ఆడగలడు కాబట్టే ముందుగా అదే ఫార్మాట్లో తొలి అవకాశం దక్కింది. ఇక టెస్టు క్రికెట్‌కు సరిపోగల బ్యాటింగ్ నైపుణ్యం, పట్టుదల, టెక్నిక్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అమ్మా నాన్న అండతో... సాయి సుదర్శన్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 వన్డేలు ఆడితే వరుసగా 55 నాటౌట్, 62, 10 పరుగులు సాధించాడు. బరిలోకి దిగిన ఏకైక టి20లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. వేర్వేరు కారణాలతో ఆ తర్వాత అతనికి అవకాశాలు లభించలేదు. సుదర్శన్ టి20 సామర్థ్యమేమిటో ఐపీఎల్ చూపించింది. నిజానికి ఈ ఫార్మాట్లో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టడంతోనే అతను ముందుగా వెలుగులోకి వచ్చాడు. అయితే అనూహ్యంగా మెరిసి ఆపై మళ్లీ కనబడకుండా పోయే ఆటగాళ్ల జాబితాలో అతను చేరరాదని సుదర్శన్ తల్లిదండ్రులు భావించారు. అందుకే పక్కా ప్రణాళికతో, సరైన కోచింగ్‌తో అతడికి వారు మార్గనిర్దేశనం చేశారు. క్రీడాకారుల కుటుంబం నుంచి రావడం కూడా అతనికి ఎంతో మేలు చేసింది. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ ‘శాఫ్’ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా...తల్లి ఉష తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున వాలీబాల్ ఆడింది. పదేళ్ల వయసులో క్రికెట్ మొదలు పెట్టిన సుదర్శన్ ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ ముందంజ వేశాడు. అండర్–19 చాలెంజర్ ట్రోఫీ తర్వాత భారత్ ‘ఎ’కు ఆడిన తర్వాత రెగ్యులర్‌గా మారాడు. వరుసగా రెండు ఐపీఎల్‌లలో 500కు పైగా పరుగులు సాధించి తన విలువేమిటో అతను చూపించాడు. టెస్టులకు చేరువలో...దేశవాళీలో నిలకడైన ప్రదర్శన, ప్రస్తుత ఫామ్, రోహిత్, కోహ్లిల రిటైర్మెంట్తో ఖాళీలు... ఇప్పుడు అన్నీ సరిగ్గా సరిపోయే సందర్భం 24 ఏళ్ల సుదర్శన్ కోసం వచ్చింది. దాదాపు 40 పరుగుల ఫస్ట్ క్లాస్ సగటు అసాధారణం కాకపోయినా... 29 మ్యాచ్‌లలో 1957 పరుగుల అనుభవం టెస్టు టీమ్‌లో అవకాశం కల్పించడానికి సరిపోతుంది. ప్రస్తుత టీమ్‌లో రాహుల్ ఓపెనింగ్ స్థానానికి మారితే మిడిలార్డర్ సుదర్శన్‌కు సరైన స్థానం కాగలదు. పైగా రెండు సీజన్ల పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ‘సర్రే’ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా అతనికి మరో అదనపు అర్హతగా మారనుంది. భారత్ తరఫున టెస్టు ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన సుదర్శన్ కోరిక త్వరలోనే తీరవచ్చు. ఇదే జోరును అతను కొనసాగిస్తే స్థానం సుస్థిరం కూడా కావచ్చు. -
పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్‌లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్‌షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది. -
క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్‌లకు పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్‌లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్‌పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్‌కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది. శ్రీకాంత్ వరుస గేముల్లో... పురుషుల సింగిల్స్‌లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్‌కు చెందిన తొమా పొపొవ్‌తో తలపడతాడు. మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు. -
గుజరాత్‌కు లక్నో షాక్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ తదుపరి లక్ష్యం టాప్–2లో చేరడం. ఈ ప్రయత్నానికి లక్నో సూపర్‌జెయింట్స్ అడ్డొచ్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతక్కొట్టగా, నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓడింది. షారుఖ్ ఖాన్ (29 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూథర్‌ఫర్డ్ (22 బంతుల్లో 38; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. క్యాన్సర్ అవగాహన–ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ఒక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ లావెండర్ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. ఓపెనింగ్ ధాటితో... ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ జోడీ లక్నోకు శుభారంభం ఇచ్చింది. గుజరాత్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడటంతో 5.3 ఓవర్లో లక్నో స్కోరు ఫిఫ్టీ దాటింది. మరోవైపు నుంచి మార్క్రమ్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా షాట్లతో పరుగుల వేగం పెంచాడు. ఈ క్రమంలో మార్ష్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ను కిషోర్ అవుట్ చేసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. రషీద్‌ఖాన్‌పై మార్ష్ పిడుగల్లే చెలరేగాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4, 4, 1లతో ఏకంగా 25 పరుగుల్ని రాబట్టాడు. మార్ష్ సెంచరీ, పూరన్ ఫిఫ్టీ మార్‡్షతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ పూరన్ కూడా ధాటిగా ఆడటంతో ప్రతీ ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. మార్ష్ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాసేపటికే పూరన్ కూడా 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో లక్నో 17.4 ఓవర్లలో 200 మార్క్ దాటింది. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేక్రమంలో మార్ష్ అవుట్‌కాగా... రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పూరన్‌తో పంత్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. షారుఖ్ పోరాడినా... కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆరంభం నుంచే దంచేందుకు దిగిన టాపార్డర్ బ్యాటర్లు అంతే వేగంగా వికెట్లు పారేసుకున్నారు. సాయి సుదర్శన్ (21; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 35; 7 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో లక్నో శిబిరం సంబరం చేసుకుంది. కానీ రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్లు ధనాధన్ షోకు శ్రీకారం చుట్టడంతో లక్నో గుండెల్లో గుబులు రేగింది. చెరోవైపు నుంచి రూథర్‌ఫొర్డ్, షారుఖ్‌లు సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించారు. అంతే... 16 ఓవర్లు గడిచేసరికి స్కోరు 182/3కి చేరింది. 24 బంతుల్లో 54 పరుగుల సమీకరణం గుజరాత్‌ను ఆశల పల్లకిలో ఉంచింది. రూథర్‌ఫొర్డ్, షారుఖ్ నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 86 పరుగులు జోడించారు. అయితే 17వ ఓవర్లో రూథర్‌ఫర్డ్, తెవాటియా (2), మరుసటి ఓవర్లో అర్షద్ ఖాన్ (1) అవుట్ కావడంతో లక్నో కు ఊరట లభించింది. 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ పోరాటం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) షారుక్ (బి) సాయి కిషోర్ 36; మార్ష్ (సి) రూథర్‌ఫొర్డ్ (బి) అర్షద్ 117; పూరన్ నాటౌట్ 56; రిషభ్ పంత్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–91, 2–212. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 3–0–36–1, రబడ 4–0–45–0, ప్రసి«ద్‌కృష్ణ 4–0–44–0, సాయి కిషోర్ 3–0–34–1, రషీద్ ఖాన్ 2–0–36–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) రూర్కే 21; గిల్ (సి) సమద్ (బి) అవేశ్ 35; బట్లర్ (బి) ఆకాశ్ సింగ్ 33; రూథర్‌ఫర్డ్ (సి)సబ్–బిష్ణోయ్ (బి) రూర్కే 38; షారుఖ్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) అవేశ్ 57; తెవాటియా (సి) హిమ్మత్ (బి) రూర్కే 2; అర్షద్ (సి) రూర్కే (బి) షాబాజ్ 1; రషీద్ ఖాన్ నాటౌట్ 4; రబడా (బి) బదోని 2; సాయి కిషోర్ (బి) బదోని 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–46, 2–85, 3–96, 4–182, 5–186, 6–193, 7–197, 8–200, 9–202. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3.1–0–29–1, ఆకాశ్‌దీప్ 4–0–49–0, రూర్కే 4–0–27–3, అవేశ్‌ఖాన్ 3.5–0–51–2, షాబాజ్ 4–0–41–1, బదొని 1–0–4–2. ఐపీఎల్లో నేడుబెంగళూరు X హైదరాబాద్‌వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో మ్యాచ్‌లు పరంగా అత్యంతవేగంగా 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో టెస్టులో 28 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద రూట్ ఈ ఫీట్ సాధించాడు.ఈ రేర్ ఫీట్‌ను రూట్ కేవలం 153 మ్యాచ్‌లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. కల్లిస్ 159 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. తాజా మ్యాచ్‌తో కల్లిస్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. కల్లిస్తో పాటు దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్(162), సచిన్ టెండూల్కర్(163)ను అధిగమించాడు.అయితే మ్యాచ్‌ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో సచిన్(266) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్(279 మ్యాచ్‌లు) ఐదో స్ధానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్‌నే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజులో పోప్(169), బ్రూక్(9) ఉన్నారు. అంతకుముందు డకెట్(140), క్రాలీ(124) సెంచరీలు సాధించారు -
మార్ష్ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై లక్నో విజయం
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.మార్ష్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో పూరన్ చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన పూరన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్..4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు 50 పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 సీజన్లో హెడ్ నాలుగు సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో తన ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా హాఫ్ సెంచరీతో హెడ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పూరన్.. 46.45 సగటుతో 511 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన డకెట్ -
మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లను మార్ష్ ఊతికారేశాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఆస్ట్రేలియన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. బౌలర్లను ఎంతమందిని మార్చినా మార్ష్ నుంచి వచ్చిన సమాధానమే ఒక్కటే. లక్నో ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్ష్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను మార్ష్ అందుకున్నాడు. మార్ష్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. కాగా ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.మార్ష్ సాధించిన రికార్డులు ఇవే..👉ఒకే సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా మార్ష్ నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో మార్ష్ ఇప్పటివరకు 560 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్(616) అగ్రస్ధానంలో ఉన్నాడు. 👉అదేవిధంగా ఒక సీజన్లో లక్నో తరపున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్ రికార్డును మార్ష్ సమం చేశాడు. ఐపీఎల్-2022 సీజన్లో రాహుల్ 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. ఈ ఏడాది సీజన్లో మార్ష్ కూడా సరిగ్గా ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. మార్ష్ మరో హాఫ్ సెంచరీ చేస్తే రాహుల్‌ను అధిగమిస్తాడు.𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗜𝗣𝗟 𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬 𝗙𝗢𝗥 𝗠𝗔𝗥𝗦𝗛! 💯As rightly said in the Bhojpuri commentary box, it’s been a "𝘿𝙖𝙣𝙙𝙞 𝙈𝙖𝙧𝙨𝙝" in Ahmedabad! 😁Will his knock prove to be a hurdle in Gujarat Titans' #Race2Top2 tonight? 🤔Watch the LIVE action in Bhojpuri ➡… pic.twitter.com/fmKMj5z25j— Star Sports (@StarSportsIndia) May 22, 2025 -
టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా అండ్ కోకు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ హెచ్చరికలు జారీ చేశాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో డకెట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్డేను తలపిస్తూ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. 134 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు. జాక్ క్రాలీతో కలిసి తొలి వికెట్‌కు 235 పరుగుల భాగస్వామ్యాన్ని డకెట్ నెలకొల్పాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లలో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. స్టోక్స్ సేన తమ మొదటి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లకు వికెట్ నష్టానికి 359 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(121), ఓలీ పోప్(79) ఉన్నారు. కాగా ఈ ఏకైక మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం ఇంకా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించలేదు. భారత జట్టును మే 24న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: IPL 2025: 'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే' -
'అతడొక అద్బుతం.. ఇంగ్లండ్ టూర్‌కు సెలక్ట్ చేయండి'
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.అయితే ఇంగ్లండ్ టూర్‌కు ఇంకా భారత జట్టును బీసీసీఐ ఖారారు చేయలేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మే 24న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేయడం సెలక్టర్లకు బిగ్ ఛాలెంజ్ వంటిదే అని చెప్పాలి. ఇందుకు ఈ కీలక పర్యటనకు ముందు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. దీంతో వారిద్దరూ స్ధానాలను భర్తీ చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ పర్యటనలో భారత టెస్టు జట్టులో కొన్ని కొత్త ముఖాలను చూసే అవకాశముంది. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్‌లు టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు హర్యానా స్పీడ్ స్టార్ అన్షుల్ కాంబోజ్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని చెన్నైసూపర్ కింగ్స్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచించాడు. ఐపీఎల్-2025 సీజన్లో కాంబోజ్ సీఎస్కే తరపున ఆడుతున్నాడు."కాంబోజ్ అద్బుతమైన బౌలర్. అతడు గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు తన పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. కాంబోజ్ వేసే బంతులు ఎల్లప్పుడూ చేతి గ్లౌవ్స్ దగ్గరగా వెళ్తూ ఉంటాయి.దీంతో బ్యాటర్లు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైట్ ఎక్కువగా ఉండడంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ప్లాట్ వికెట్లపై కూడా అతడు అద్బుతంగా బౌలింగ్ చేయగలడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫ్లాట్ వికెట్లపై ఎలా రాణించాడో చూశాము. కొంచెం సీమ్, స్వింగ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగా రాణిస్తాడు. కాబట్టి ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో అతడు ఉంటాడని ఆశిస్తున్నానని" ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..
IPL 2025 GT vs LSG Live Updates: ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుజరాత్ నాలుగో వికెట్ డౌన్..రూథర్‌ఫర్డ్ రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రూథర్‌ఫర్డ్.. ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 23 బంతుల్లో 54 పరుగులు కావాలి. క్రీజులో షారుఖ్ ఖాన్(49) ఉన్నాడు.దూకుడు పెంచిన షారుఖ్, రూథర్‌ఫర్డ్14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో షారుఖ్ ఖాన్(27),రూథర్ ఫర్డ్(25) ఉన్నారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన బట్లర్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన గిల్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. విలియం ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(24), జోప్ బట్లర్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్..33 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(15), సాయిసుదర్శన్(16) ఉన్నారు.గుజరాత్ ముందు భారీ టార్గెట్..అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాటన్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ..లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాఛ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో మార్ష్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 16 ఓవర్లకు లక్నో స్కోర్: 180/115 ఓవర్లకు లక్నో స్కోర్: 160/115 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(89), పూరన్(29) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన మార్క్రమ్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(51), పూరన్(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(28), మార్ష్(22) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(8), మార్క్రమ్(15) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నామాత్రపు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా లావెండర్ జెర్సీతో బరిలోకి దిగింది.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కేగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ -
'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే'
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్కమ్రించింది.181 పరుగుల లక్ష్యాన్ని అక్షర్ సేన ఛేదించిలేక చతికల పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ స్పందించాడు. ఆఖరి రెండు ఓవర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని అతడు అభిప్రాయడ్డాడు."ఈ మ్యాచ్‌లో మేము 18 ఓవర్ల వరకు అద్బుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఆఖరి రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. చివరిలో మా ప్రణాళికలను సరిగ్గా ఆమలు చేయలేకపోయాము. 12 బంతుల్లో ఏకంగా 48 పరుగులు ఇచ్చాము. ఆఖరి రెండు ఓవర్లలో పిచ్ కండీషన్స్ తగ్గట్టు మా బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్ స్లోగా ఉన్నందున కట్టర్లు కానీ వైడ్ యార్కర్లు గానీ ప్రయత్నించుంటే బాగుండేది.కానీ మా బౌలర్లు అది చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ఆటగాడో మనందరికి తెలుసు. అటువంటి బ్యాటర్‌కు స్లాట్‌లో బంతులు వేస్తే శిక్షించుకుండా ఎలా వదులుతాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బదానీ పేర్కొన్నాడు.అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది సీజన్‌ను నేను ఒక మారథన్గా భావించాము. మొదటిలో మాకు అద్బుతమైన ఆరంభం లభించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించాము.అయితే కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌లలో మేము ఓడిపోయాము. ఫ్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కొన్ని మ్యాచ్‌లను టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఆ మ్యాచ్‌లలో గెలవకపోతే తప్పు మనదే అవుతుంది. అందుకు ఎవరిని బాధ్యులు చేయలేము. ఏదేమైనప్పటికి ఒక జట్టుగా మేము బాగా రాణించాము" అని బదానీ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఆరు విజయాలు, మరో ఆరింట ఓటములను చవిచూసింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే? -
కెప్టెన్ సెంచరీ వృధా.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. కాంటర్బరీ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హీలీ మాథ్యూస్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. మిగితా బ్యాటర్లు విఫలమైనప్పటికి మాథ్యూస్ మాత్రం ఇంగ్లీష్ బౌలర్లను ఊతికారేసారు. మాథ్యూస్ 67 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్లోట్, స్మిత్, వాంగ్ తలా వికెట్ సాధించారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫియా డంక్లి(56 బంతుల్లో 12 ఫోర్లతో 81) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హీథర్ నైట్(27 బంతుల్లో 6 ఫోర్లతో 43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. విండీస్ బౌలర్లలో జేమ్స్, ఫ్లేచర్ తలా వికెట్ పడగొట్టారు. మిగితా బౌలర్లందరూ చేతులెత్తేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 23న కౌంటీ గ్రౌండ్, హోవ్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే? -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే?
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలోనే టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు 26 ఏళ్ల అర్ష్‌దీప్ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్దంగా ఉండాలని ఈ పంజాబ్ పేసర్‌కు సెలక్టర్లు సూచించినట్లు సమాచారం.అర్ష్‌దీప్ రాకతో భారత టెస్టు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేని లోటు తీరనుంది. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్‌గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్‌కు రాలేదు. ఇంగ్లండ్ టూర్‌తో అతడు మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం ఖాయమన్పిస్తోంది. అర్ష్‌దీప్‌కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులు అర్ష్‌దీప్‌కు బాగా తెలుసు. ఈ క్రమంలోనే అతడిని ఇంగ్లండ్‌కు పంపాలని అగర్కాకర్ అండ్ కో భావిస్తున్నట్లు వినికిడి.తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు పయనం కానుంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖారరైనట్లు సమాచారం. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి స్ధానాన్ని ఎవరి భర్తీ చేస్తారో వేచి చూడాలి. జూన్ 20 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
IPL 2025 Play-Offs: ఆర్సీబీలోకి పవర్ హిట్టర్.. ప్రకటన విడుదల
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి కొత్త ఆటగాడు చేరాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జేకబ్ బెతెల్ (Jacob Bethel) స్థానాన్ని యాజమాన్యం న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert)తో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఐపీఎల్-2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే 17 నుంచి లీగ్ పునః ప్రారంభమైంది. అయితే, మధ్యలో విరామం వచ్చిన కారణంగా మే 25న జరగాల్సిన ఫైనల్.. జూన్ 3కు షెడ్యూల్ అయింది.మే 24న స్వదేశానికిఈ నేపథ్యంలో జాతీయ జట్టు విధుల దృష్ట్యా పలు ఫ్రాంఛైజీలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. జేకబ్ బెతెల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో చేరే క్రమంలో అతడు ఆర్సీబీని వీడనున్నాడు. మే 24న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత జేకబ్ బెతెల్ ఆర్సీబీని వీడనున్నాడు.సెంచరీ మిస్ఈ క్రమంలో అతడి స్థానాన్ని కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్‌తో ఆర్సీబీ భర్తీ చేసింది. కాగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 66 మ్యాచ్‌లు ఆడిన టిమ్ సీఫర్ట్ 1540 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో పది అర్ధ శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 97. కాగా టిమ్ సీఫర్ట్ రూ. 2 కోట్ల ధరతో ఆర్సీబీలో చేరనున్నాడు. మే 24 నుంచి అతడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు.కాగా జేకబ్ బెతెల్ ఆర్సీబీ తరఫున ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి 67 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం (55) ఉండటం విశేషం. మరోవైపు ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (మే 23) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మంగళవారం (మే 27) లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటిదార్ సేన తలపడనుంది.ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. ముంబై ఇండియన్స్ బుధవారం తమ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక టాప్-4లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలను ప్లే ఆఫ్స్‌లో కోల్పోనుంది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై సిరీస్ నేపథ్యంలో బట్లర్ గుజరాత్‌కు దూరం కానున్నాడు.మరోవైపు.. ఈ నెల 26 తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ముంబై జట్టును వీడనున్నారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ వారి స్థానాలను జానీ బెయిర్‌స్టో (రూ. రూ.5.25 కోట్లు), రిచర్డ్ గ్లీసన్ (రూ. కోటి)తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంక (రూ. 75 లక్షలు)తో భర్తీ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్ గావస్కర్ సహా వసీం జాఫర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు జస్ప్రీత్ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని, పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్‌బాల్ క్రికెట్లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదేఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసిన వసీం.. శుబ్‌మన్‌ను అతడికి డిప్యూటీగా నియమించాడు.సాయి సుదర్శన్, నితీశ్‌లకు మొండిచేయిఅయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్ పేరును మాత్రం వసీం జాఫర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్‌ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత్-ఎ జట్టు కెప్టెన్ అయిన అభిమన్యు ఈశ్వరన్‌కు పెద్దపీట వేశాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వసీం జాఫర్ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్ శార్దూల్ ఠాకూర్‌వైపే మొగ్గుచూపాడు.శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్‌కు స్థానమిచ్చిన వసీం జాఫర్.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్ దళంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్.అదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్.. నాలుగో ఆప్షన్‌గా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్/ప్రసిద్ కృష్ణ/ అకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
India U-19 squad Announced for tour of England: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు సెలక్టర్లు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జూన్ 24- జూలై 23 వరకు సుదీర్ఘకాలం పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.ఇందులో భాగంగా తొలుత 50 ఓవర్ల ఫార్మాట్లో వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య రెండు మల్టీ-డే మ్యాచ్‌లు (Multi Day Matches) జరుగుతాయి.కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటుఇక ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే భారత యువ జట్టుకు ముంబై ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా అభిజ్ఞాన్ కుందును సెలక్ట్ చేశారు. అదే విధంగా.. ఐపీఎల్-2025లో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది.ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆయుశ్, వైభవ్‌ల ఆట తీరుపైనే ఉండనుంది. పొట్టి క్రికెట్లో అదరగొట్టిన ఈ ఇద్దరు యంగ్ స్టార్లు.. యాభై ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్లో యూకేలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు సాధించాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే చెన్నై తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి.. ఆరు మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2025లో తమదైన ముద్ర వేయగలిగారు.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టుఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ👉జూన్ 27- తొలి వన్డే- హోవ్👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్‌హామ్👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్.చదవండి: వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా -
ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.వరుసగా నాలుగు విజయాలుకాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్‌లో సీఎస్కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్లో రెండో విజయం సాధించింది.అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత గుజరాత్‌ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిలఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌తో తలపడనుంది.చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
UAE vs BAN: బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన యూఏఈ
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో చిత్తుగా ఓడి టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ (T20 Series) ఆడేందుకు బంగ్లాదేశ్ యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గత శనివారం (మే 17) తొలి టీ20 జరుగగా.. బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో యూఏఈ బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. లిటన్ దాస్ బృందాన్ని రెండు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.తాంజిద్ హసన్ ధనాధన్అనంతరం బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ యూఏఈ జయభేరి మోగించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమాన్ (0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ (18 బంతుల్లో 40) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ లిటన్ దాస్ (14) సహా తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) పూర్తిగా విఫలమయ్యారు. షమీమ్ హొసేన్ (9), రిషాద్ హొసేన్ (0), తాంజిమ్ హసన్ సకీబ్ (6) కూడా చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో హసన్ మహమూద్ (15 బంతుల్లో 26 నాటౌట్), షోరిఫుల్ ఇస్లాం (7 బంతుల్లో 16 నాటౌట్) మాత్రం దంచికొట్టారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లతో చెలరేగగా.. సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వాళ్లలో ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అర్ధ శతకంతో మెరిసిన అలిషాన్ షరాఫూఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే యూఏఈ ఓపెనర్, కెప్టెన్ ముహమద్ వసీం (9) అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ముహమద్ జోహైబ్ (29)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అలిషాన్ షరాఫూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (13) విఫలం కాగా.. ఆసిఫ్ ఖాన్‌తో కలిసి అలిషాన్ యూఏఈని గెలుపు తీరాలకు చేర్చాడు.అలిషాన్ షరాఫూ కేవలం 47 బంతుల్లోనే 68 పరుగులతో, ఆసిఫ్ ఖాన్ 26 బంతుల్లో 41 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు నష్టపోయి యూఏఈ లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా పొట్టి ఫార్మాట్లో యూఏఈకి బంగ్లాదేశ్‌పై ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. ఇక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అలిషాన్ షారిఫూ దక్కించుకోగా.. ముహమద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్ -
వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.టాప్-4లో అడుగుఇక ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.సూర్య, నమన్ ఫటాఫట్సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6)ను అవుట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)ను బౌల్డ్ పెవిలియన్‌కు పంపాడు.సాంట్నర్, బుమ్రా అదరగొట్టారుఆ తర్వాత మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్.. మరో హిట్టర్ అశుతోష్ శర్మ (18) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్ తివారి (3), ముస్తాఫిజుర్ రహ్మమాన్ (0)లను బౌల్డ్ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కాగా.. హార్దిక్ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్.. వికెట్ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్‌గా సిమ్రన్‌జీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ప్రొఫెషనల్‌గా మారనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన 29 ఏళ్ల సిమ్రన్‌జీత్ కౌర్ (Simranjeet Kaur)... అమెరికా మాజీ బాక్సర్ రాయ్ జోన్స్, భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది భారత్ నుంచి నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ ప్రొఫెషనల్‌గా మారగా... ఇప్పుడు ఆ జాబితాలో సిమ్రన్‌జీత్ కూడా చేరింది.కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సిమ్రన్‌జీత్... ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పలు పతకాలు నెగ్గింది. ఈ ఏడాది జాతీయ చాంపియన్‌షిప్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన కౌర్... అమెచ్యూర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.అతడి బాటలోనే నడుస్తూ‘ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన్దీప్ జాంగ్రా ఇప్పటికే దేశం గర్వపడే విజయాలు సాధించారు. అతడి బాటలోనే నడుస్తూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఈ ప్రయాణంలో రాయ్ జోన్స్ సహకారం మరవలేను’ అని సిమ్రన్‌జీత్ పేర్కొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్ విజేందర్ సింగ్... దేశం నుంచి తొలి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారగా... ఆ తర్వాత వికాస్ కృషన్, సరితా దేవి, నీరజ్ గోయత్ వంటి పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్‌గా మారారు. కాగా పంజాబ్ నుంచి తొలి మహిళా ప్రొఫెషనల్ బాక్సర్‌గా సిమ్రన్ నిలవనుండటం విశేషం. భారత జట్టు పసిడి బోణీన్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత జట్టు పసిడి బోణీ కొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన యువ షూటర్ కనక్ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో బుధవారం 17 ఏళ్ల కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది షూటర్లు పాల్గొన్న 24 షాట్ల తుదిపోరులో కనక్ తన గురితో అదరగొట్టింది.‘ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది.’ అని కనక్ వెల్లడించింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్స్ 1.7 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా... చెన్ యెన్ చింగ్ (చైనీస్ తైపీ) కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. కనక్ 571 పాయింట్లతో, ప్రాచి 572 పాయింట్లతో తుదిపోరుకు చేరారు. -
MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టాప్-4కు అర్హత సాధించింది.కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షించిన నీతాఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ముందు చేతులు శుభ్రం చేసుకోఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోవిడ్ కేసుల నేపథ్యంలోకాగా ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రవిస్ హెడ్‌కు ఇటీవల కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్ చేయడం గమనార్హం.సెలైవాతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశంకాగా ఈసారి ఐపీఎల్లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది. కరోనా కాలంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దంచికొట్టిన సూర్య, నమన్ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్ తదితరులకు సానిటైజర్ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (5) విఫలం కాగా.. రియాన్ రెకెల్టన్ (25) ఫర్వాలేదనిపించాడు. విల్ జాక్స్ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.బౌలర్లు చెలరేగడంతోఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025 -
MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జత చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆరంభంలో ఆకట్టుకున్నా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/48) రెండు వికెట్లతో రాణించగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది.ఢిల్లీ తడ‘బ్యా’టుఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (6) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు.అయితే, ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 59 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అనుచిత ప్రవర్తనఇక ఈ మ్యాచ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ముకేశ్ కుమార్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఐపీల్ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్మెంట్ను డ్యామేజ్ చేయడం) ప్రకారం ముకేశ్ కుమార్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు’’ అని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. అయితే, ముకేశ్ కుమార్ చేసిన తప్పేమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ఈ ఢిల్లీ పేసర్ కాస్త అసహనానికి లోనైన విషయం తెలిసిందే.ఇక ముంబైతో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ ఆల్‌రౌండర్ సేవలను జట్టు వినియోగించుకోలేకపోయింది. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీని ముందుకు నడిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడంతో ఇంటిబాట పట్టింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
వెస్టిండీస్‌కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్.. చిత్తు చిత్తుగా ఓడించి..
వెస్టిండీస్‌కు ఐర్లాండ్ క్రికెట్ జట్టు భారీ షాకిచ్చింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series)ను ఘనంగా ఆరంభించింది. డబ్లిన్ వేదికగా బుధవారం జరిగిన తొలి పోరులో ఐర్లాండ్ వెస్టిండీస్‌ను ఏకంగా 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం వెస్టిండీస్ ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరిగింది. ‘ది విలేజ్’ మైదానంలో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 303 పరుగులు చేసింది.ఓపెనర్లలో ఆండీ బాల్బిర్నీ (138 బంతుల్లో 112; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు).. నాలుగో నంబర్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ (56; 6 ఫోర్లు) అర్ధశతకాలు బాదారు. ఇక విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 34.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్ చేజ్ (55; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ 4 వికెట్లు తీశాడు. సెంచరీ హీరో బాల్బిర్నీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో వన్డే జరగనుంది. కాగా ఓవరాల్‌గా వెస్టిండీస్‌పై ఐర్లాండ్కిది నాలుగో విజయం కావడం విశేషం. ఇదీ చదవండి: విండీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్లండన్: ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 29న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్చర్‌కు కుడిచేతి బొటనవేలికి గాయమైంది. లీగ్ వారం వాయిదా పడగానే స్వదేశానికి చేరుకున్న అతను తిరిగి ఐపీఎల్ పునఃప్రారంభమైనప్పటికీ గాయం కారణంగానే భారత్‌కు రాలేకపోయాడు.గాయపడిన అతని పరిస్థితిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, రెండు వారాల తర్వాత మరోసారి గాయం తీవ్రతను సమీక్షిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే ఆర్చర్‌కు గాయమవడం... జట్టుకు దూరమవడం ఇదేం కొత్త కాదు. సుదీర్ఘకాలంగా అతను మోచేతి గాయంతో సతమతమయ్యాడు. పలుమార్లు సర్జరీలు కూడా జరిగాయి.తర్వాత వెన్నెముక గాయంతో చాన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అమెరికా, కరీబియన్లు ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌తో పునరాగమనం చేశాడు. ఈ ఏడాది పాక్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అతని స్థానంలో లాంకషైర్‌కు చెందిన లెఫ్టార్మ్ సీమర్ ల్యూక్ వుడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇదివరకే టీ20 జట్టుకు ఎంపికైన వుడ్‌కు ఇప్పుడు వన్డే జట్టులోనూ స్థానం దక్కింది. 2022–23 సీజన్లో రెండు వన్డేలాడిన ల్యూక్ వుడ్ ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చదవండి: IPL 2025: ‘ప్లే ఆఫ్స్’కు ముంబై█▓▒▒░░░Score update░░░▒▒▓█What a hundred from Balbo 👏👏👏▪️Ireland 256-3 (44 overs)👀 WATCH: TNT Sport 2 (411)📝 SCORECARD: https://t.co/9cwPX120LU#BackingGreen #TokenFi @solar_failte☘️🏏 pic.twitter.com/Sgvq0EOBDp— Cricket Ireland (@cricketireland) May 21, 2025 -
22 ఏళ్ల తర్వాత...
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌కు ఇక ఈ ఏడాదంతా బిజీ షెడ్యూల్ వుంది. మేటి జట్లతో కీలకమైన ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడాల్సి ఉంది. అలాంటి ఇంగ్లండ్ జట్టు తమ సొంతగడ్డపై జింబాబ్వేలాంటి కూనతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. 22 ఏళ్ల తర్వాత జింబాబ్వేతో జరుగుతున్న ఈ ఏకైక టెస్టును ఆతిథ్య జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం సన్నాహక మ్యాచ్‌గా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే వచ్చే నెలలోనే ఇక్కడ పర్యటించేందుకు భారత్ వస్తోంది. అనంతరం ఈ సీజన్లోనే ఆ్రస్టేలియా గడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇవన్నీ కూడా ఐదేసి మ్యాచ్‌ల పూర్తిస్థాయి సిరీస్‌లు. ఈ 10 టెస్టులకు ముందు ఇంగ్లండ్ ఓ క్రికెట్ కూనపై నాలుగు రోజులు ప్రతాపం చూపనుంది. టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కానీ ఈ టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఇచ్చే ప్రాధాన్యత అంతా తదుపరి సన్నద్ధం కోసమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గురువారం నుంచి జరిగే ఈ సంప్రదాయ పోరులో జింబాబ్వే ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి. 18 ఏళ్ల క్రితం కేప్‌టౌన్‌లో టి20 ప్రపంచకప్ ఆడినప్పటికీ అసలైన టెస్టు మ్యాచ్‌ను జింబాబ్వే చివరిసారిగా 2003లో ఆడింది. ఆ సిరీస్‌లోనే 20 ఏళ్ల అండర్సన్ పేస్ బౌలర్‌గా అరంగేట్రం చేశాడు. ఇన్నేళ్లలో ఓ వెలుగువెలిగిన అండర్సన్ రిటైర్ కూడా అయ్యాడు. మరోవైపు జింబాబ్వే మాత్రం దేశంలోని రాజకీయ అస్థిరత, ఆరి్థక సంక్షోభం, క్రికెట్ బోర్డులో మితిమీరిన ప్రభుత్వ జోక్యం తదితర సమస్యలతో సతమతమైంది. ఆరేళ్ల పాటు పూర్తిగా టెస్టు క్రికెట్‌కు దూరమైంది. 2005 నుంచి 2011 అసలు సంప్రదాయ సమరమే లేకుండా గడిపిన జింబాబ్వే ఆ తర్వాత కూడా పూర్తిస్థాయి సిరీస్‌లను ఆడే అవకాశాన్ని కోల్పోయిందనే చెప్పాలి. 2022 నుంచి 2024 వరకు ఈ జట్టు కేవలం నాలుగంటే నాలుగు టెస్టులే ఆడిందంటే జింబాబ్వే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.» జింబాబ్వే రెండోసారి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంతకుముందు 2017లోనూ దక్షిణాఫ్రికాతో కూడా జింబాబ్వే నాలుగు రోజుల టెస్టు ఆడింది. » మరోవైపు ఇంగ్లండ్ కూడా రెండోసారి నాలుగు రోజుల టెస్టు ఆడబోతుంది. 2023లో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ తొలిసారి నాలుగు రోజుల టెస్టులో పోటీపడింది. ఈ రెండింటికంటే ముందు 1973లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మొదటిసారి నాలుగు రోజుల టెస్టు జరిగింది.14 జింబాబ్వే జట్టు 1992 నుంచి ఇప్పటి వరకు మొత్తం 123 టెస్టులు ఆడింది. 14 టెస్టుల్లో విజయం సాధించి, 79 టెస్టుల్లో ఓడిపోయింది. 30 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.3 ఇంగ్లండ్ జట్టుతో ఓవరాల్‌గా జింబాబ్వే 6 టెస్టులు ఆడింది. 3 టెస్టుల్లో ఓడిపోయి, 3 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. -
Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్ నిష్క్రమించి ఉండొచ్చు. కానీ ఒక కుర్రాడి ఆగమనం మాత్రం అద్వితీయంగా మలిచింది ఆ ఫ్రాంచైజీ! 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం రాజస్తాన్‌కు కోచింగ్ ఇవ్వడం... ముఖ్యంగా కుర్రాళ్లను సానబెట్టడంతో దిట్టయిన ద్రవిడ్ సూచనలు, హెచ్చరికలు వైభవ్‌పై మంచి ప్రభావమే చూపాయి. బ్యాటింగ్‌పైనే ధ్యాస పెట్టమని, ఎప్పుడైనా సరే చురుకుదనంతో అందుబాటులో ఉండాలనే హెచ్చరికలు తనను ఆటపైనే దృష్టి కేంద్రీకరించేలా చేశాయని స్వయంగా వైభవ్ చెప్పుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసిన సందర్భంలో తన ఫోన్‌కు ఏకంగా 500 పైచిలుకు మిస్స్డ్ కాల్స్ వచ్చాయని చెప్పాడు. ద్రవిడ్ సూచనలతో ఆటపై ఫోకస్ చేసేందుకు ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయగా సెంచరీ తర్వాత ప్రశంసించేందుకు అన్ని కాల్స్ వచ్చినట్లు వైభవ్ చెప్పాడు. ‘మూణ్నాలుగు నెలలుగా నేను పడుతున్న కష్టానికి ఫలితం వచ్చింది. అదేపనిగా ప్రాక్టీస్‌లో నా బలహీనతల్ని అధిగమించడం వల్లే మ్యాచ్‌ల్లో ఆడటం సులువైంది. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం ఎలాగో నేర్చుకున్నాను. జట్టు విజయానికి అవసరమైన బ్యాటింగ్ శైలీని అలవర్చుకున్నా. నా బలమెంటో నాకు తెలుసు. జట్టుకేం కావాలనేది అప్పటి పరిస్థితులకు తెలుసు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాణించాలి’ అని రాయల్స్ హెడ్‌కోచ్ ద్రవిడ్‌తో పాల్గొన్న వీడియోలో వైభవ్ చెప్పాడు. ఈ వీడియోను ఐపీఎల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీనేజ్ సంచలనాన్ని అభినందించిన ద్రవిడ్ అసలైన సవాళ్లు ముందున్నాయని అతనికి గుర్తు చేశాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లాడిన సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. 206.56 స్ట్రయిక్ రేట్‌తో 36 సగటును నమోదు చేశాడు. -
IPL 2025 GT vs LSG: టాప్2లో నిలవాలని...
అహ్మదాబాద్: ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు... ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 18వ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 3 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ దక్కించుకున్న మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నేడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో తలపడనుంది. 2022, 2023లలో ఫైనల్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్... ఈసారి కూడా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఫైనల్‌కు చేరేందుకు అదనంగా మరో అవకాశం ఉండటంతో... ప్రస్తుతానికి టైటాన్స్ దానిపైనే దృష్టి పెట్టింది. మరోవైపు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ చివర్లో అయినా మెరిపించాలని భావిస్తోంది. ఈ సీజన్లో టైటాన్స్ ఓడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి లక్నో చేతిలో ఉండటంతో దానికి సొంతగడ్డపై బదులు తీర్చుకోవాలని కూడా చూస్తోంది. గుజరాత్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదుంటే... లక్నో జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మరి టైటాన్స్ అదే ఊపుతో మరింత ముందుకు దూసుకెళ్తుందా లేక... లక్నో పరాజయాల బాట వీడుతుందా చూడాలి! ముగ్గురు మొనగాళ్లు... ఈ సీజన్లో టైటాన్స్ ఆధిపత్యానికి ప్రధాన కారణం... టాప్–3 ఆటగాళ్లే. కెపె్టన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్, ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ కలిసికట్టుగా కదంతొక్కడంతోనే గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధించగలిగింది. సాయి సుదర్శన్ 56.09 సగటుతో 617 పరుగులు చేయగా... గిల్ 60.10 సగటుతో 601 పరుగులు సాధించాడు. బట్లర్ 500 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు జట్టు భారాన్ని మోస్తూ మెరుగైన ఆరంభాలు అందిస్తుండటంతో... టైటాన్స్ భారీ స్కోర్లు చేయగలుగుతోంది. ఈ త్రయం 16 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసిందంటే వీరి ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ముగ్గురితో పాటు రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ బలంగా ఉండగా... బౌలింగ్‌లో కూడా మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదీ పేసర్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రబడ, రషీద్ ఖాన్, సాయి కిషోర్ రూపంలో బౌలింగ్ దళం మెరుగ్గా ఉంది. అయితే గుజరాత్ బలం, బలహీనత రెండు టాపార్డరే కావడం గమనార్హం. టాప్–3 ఆటగాళ్లు విఫలమైతే మిడిలార్డర్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడేవాళ్లు కనిపించడం లేదు. లక్నోతో లీగ్ మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసిన టైటాన్స్... గిల్, సుదర్శన్, బట్లర్ అవుటైన తర్వాత 180/6కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కీలక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు మిడిలార్డర్‌ను పరీక్షించుకోవాల్సిన అవసరముంది. సీజన్లో అన్నీ మ్యాచ్‌లు ఆడిన ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా ఫ్రాంఛైజీ పరిశీలిస్తోంది.తీవ్ర ఒత్తిడిలో పంత్ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషభ్ పంత్... సీజన్ చివరికి వచ్చేసరికి తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అంచనాల భారాన్ని మోయలేకపోతున్న పంత్... అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా విఫలమవుతున్నాడు. మిచెల్ మార్‡్ష, మార్క్రమ్, నికోలస్ పూరన్ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... జట్టు విజయాలు సాధించలేకపోవడానికి పంత్ ప్రదర్శనే ప్రధాన కారణం. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకున్నా... పంత్ ఆటతీరు మాత్రం మారడం లేదు.పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో నిలవకుండానే పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరడం పరిపాటిగా మారింది. ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన పంత్ 12.27 సగటుతో 135 పరుగులే చేశాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితోనే ‘ప్లే ఆఫ్స్’చేరే అవకాశాలు కోల్పోయిన ఎల్ఎస్జీ... ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మెరుగైన స్థానంతో సీజన్‌ను ముగించాలని భావిస్తోంది. ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్ నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... బౌలర్లను గాయాల బెడద వెంటాడుతోంది. ప్రధాన పేసర్లు గాయాల బారిన పడటంతో ప్రత్యామ్నాయాలు లేక మేనేజ్మెంట్ చిక్కులు ఎదుర్కొంటోంది. మయాంక్ యాదవ్ అందుబాటులో లేకపోగా... అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు గత మ్యాచ్‌లో హద్దులు దాటినందుకు స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు.తుది జట్లు(అంచనా)గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్ ), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబడ, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్ష్ , మార్క్రమ్, పూరన్, బదోని, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, అవేశ్ ఖాన్, షాబాజ్ నదీమ్, రూర్కె. -
సంచలనాల మోత
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు అదర గొట్టారు. తొలి రౌండ్లో నలుగురు భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సతీశ్ కుమార్ కరుణాకరన్, ఆయుశ్ శెట్టి తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈ సీజన్లో ఫామ్‌లో లేని ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 13–21, 21–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–17, 21–16తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 51వ ర్యాంకర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ 21–13, 21–14తో ప్రపంచ 9వ ర్యాంకర్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను కంగుతినిపించాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 20–22, 21–10, 21–8తో ప్రపంచ 30వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు.అయితే భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్‌కు నిరాశ ఎదురైంది. ప్రియాన్షు 15–21, 17–21తో జియా హెంగ్ జేసన్ టెహ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో సతీశ్; యుషి టనాకా (జపాన్)తో ప్రణయ్; ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ఆయుశ్ శెట్టి తలపడతారు. సింధుకు నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బరిలో ఉన్న నలుగురు క్రీడాకారిణులు పీవీ సింధు, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 11–21, 21–14, 15–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ఉన్నతి 12–21, 20–22తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో, ఆకర్షి 9–21, 8–21తో పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా) చేతిలో, మాళవిక 21–19, 18–21, 8–21తో చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 10–21, 14–21తో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా) జంట చేతిలో ఓడిపోగా... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–18, 15–21, 21–14తో అద్నాన్–సారి జమాల్ (ఇండోనేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్; హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. -
‘ప్లే ఆఫ్స్’కు ముంబై
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X లక్నోవేదిక: అహ్మదాబాద్∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్ (25), రోహిత్ శర్మ (5), విల్ జాక్స్ (21) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.కుల్దీప్ సెంచరీఈ మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో కుల్దీప్ ఐపీఎల్లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్ (84 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇలా..ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. -
ఇండియా ఏతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. వోక్స్, ఫ్లింటాఫ్‌కు చోటు
మే 30 నుంచి ఇండియా-ఏతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టును ఇవాళ (మే 21) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. వోక్స్ కాలి మడమ గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే జింబాబ్వేతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు వోక్స్‌ను ఎంపిక చేయలేదు.ఇండియా ఏతో సిరీస్‌కు ఎంపిక చేసిన లయన్స్ జట్టుకు జేమ్స్ ర్యూ సారథ్యం వహించనున్నాడు. వోక్స్‌తో పాటు రెహాన్ అహ్మద్, డాన్ మౌస్లీ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటే ఆటగాళ్లకు జాతీయ జట్లలో చోటు దక్కే అవకాశం ఉంది.భారత్-ఏతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు..జేమ్స్ ర్యూ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్, రాకీ ఫ్లింటాఫ్, ఎమిలియో గే, టామ్ హైన్స్, జార్జ్ హిల్, జోష్ హల్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ, అజీత్ సింగ్ డేల్, క్రిస్ వోక్స్ఇంగ్లండ్ లయన్స్‌తో సిరీస్‌కు భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే, తనుశ్ కోటియన్, ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..మే 30-జూన్ 2- తొలి టెస్ట్ (కాంటర్బరీ)జూన్ 6-9- రెండో టెస్ట్ (నార్తంప్టన్) -
IPL 2025: ఢిల్లీపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 59 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.5వ ఓవర్- ఢిల్లీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో అశుతోష్ శర్మ (18) స్టంపౌటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.2వ ఓవర్- 103 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వి (39) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. 9.2వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (2) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ7.6వ ఓవర్- 55 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో విప్రాజ్ (20) కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 27 పరుగలకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ4.2వ ఓవర్- 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జాక్స్ బౌలింగ్‌లో రికెల్టన్ అద్బుతమైన స్టంపింగ్ చేయడంతో అభిషేక్ పోరెల్ (6) ఔటయ్యాడు. టార్గెట్ 181.. 20 పరుగులకే రెండో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ2.4వ ఓవర్- 20 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్ క్యాచ్ పట్టడంతో కేఎల్ రాహుల్ (11) ఔటయ్యాడు. టార్గెట్ 181.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ1.4వ ఓవర్- 181 పరుగల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ (6) ఔటయ్యాడు. స్కై, నమన్ ధిర్ కొసమెరుపు.. ఫైటింగ్ టార్గెట్‌ను సెట్ చేసిన ముంబైటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదిల్చింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆఖరి రెండు ఓవర్లలో నమన్ ధిర్, సై 48 పరుగులు పిండుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ముంబై16.3వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్‌లో ముకేశ్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (3) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వికి క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (27) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 95/312 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 95/3గా ఉంది. తిలక్ వర్మ (23), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 58 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మాధవ్ తివారి క్యాచ్ పట్టడంతో రికెల్టన్ (25) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై5.3వ ఓవర్- 48 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్‌కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (21) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 46/15 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 46/1గా ఉంది. విల్ జాక్స్ 20, రికెల్టన్ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్2.2వ ఓవర్- 23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (5) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని భావించిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ముంబై విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కార్బిన్ బాష్ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మిగిలిన ఏకైక ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సీజన్లో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), అభిషేక్ పోరెల్(w), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, దుష్మంత చమీరా, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్స్: KL రాహుల్, సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, త్రిపురాన విజయ్, మన్వంత్ కుమార్ -
వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
మే 29 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కుడి చేతి బొటన వేలి గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. ఆర్చర్‌కు ప్రత్యామ్నాయంగా లూక్ వుడ్‌ను ఎంపిక చేసింది. ఆర్చర్ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ గాయం బారిన పడ్డాడు. దీని కారణంగా అతను కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మధ్యలో ఐపీఎల్ ఆగిపోవడంతో స్వదేశానికి వచ్చేసిన ఆర్చర్ తిరిగి భారత్‌కు రాలేదు. ఈ సీజన్లో ఆర్చర్ 12 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక ఇంటిముఖం పట్టింది. నిన్న (మే 20) సీఎస్కే విజయంతో రాయల్స్ ఈ సీజన్‌ను ముగించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 జరుగుతుండగానే వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ మే 29, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్ కారణంగా ఇంగ్లండ్, విండీస్‌కు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నారు. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ కూడా జరుగుతుంది. జూన్ 6, 8, 10 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.విండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జోస్ బట్లర్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోఫ్రా ఆర్చర్ (లూక్ వుడ్), బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లీ, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్విండీస్ జట్టు..బ్రాండన్ కింగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ఎవిన్ లెవిస్, కీసీ కార్తీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, జస్టిన్ గ్రీవ్స్, గుడకేశ్ మోటీ, జువెల్ ఆండ్రూ, షాయ్ హోప్ (కెప్టెన్), ఆమిర్ జాంగూ, మాథ్యూ ఫోర్డ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్, జేదియా బ్లేడ్స్ -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్
ఐర్లాండ్ వెటరన్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకున్న తొలి ఐరిష్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఐరిష్ క్రికెట్‌కు మూలస్థంభంగా ఉన్న స్టిర్లింగ్.. ఆ దేశం తరఫున 8 టెస్ట్‌లు, 167 వన్డేలు, 150 టీ20లు ఆడి 10000 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 57 అర్ద సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసిన 97వ ఆటగాడిగానూ స్టిర్లింగ్ రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టిర్లింగ్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. స్టిర్లింగ్ తర్వాత ఆండ్రూ బల్బిర్నీ అత్యధికంగా 6055 పరుగులు చేశాడు. ఆతర్వాత కెవిన్ ఓబ్రెయిన్ 5850, విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ 5480, హ్యారీ టెక్టార్ 3732 పరుగులు చేశారు. 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్టిర్లింగ్.. ఆ మరుసటి ఏడాది టీ20లు, 2018లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 3 వన్డేలు, 3 మ్యాచ్ టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (మే 21) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ 35 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (54), కార్మిచెల్ (16) ఔట్ కాగా.. బల్బిర్నీ (87), హ్యారీ టెక్టార్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టిర్లింగ్ 10000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టిర్లింగ్ సాధించిన హాఫ్ సెంచరీ వన్డేల్లో అతనికి 57వది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
సంజూ శాంసన్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 4000 పరుగుల మార్కును తాకిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంజూ ఈ ఫ్రాంచైజీ తరఫున 148 మ్యాచ్‌లు ఆడి 141.24 స్ట్రయిక్‌రేట్‌తో 4027 పరుగులు చేశాడు. సంజూ తర్వాత జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన సంజూ ఈ ఘనత సాధించాడు. మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహాయించి ఐపీఎల్ కెరీర్ మొత్తం రాజస్థాన్‌కే ఆడిన సంజూ ఇప్పటివరకు 176 మ్యాచ్‌లు ఆడి 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 4704 పరుగులు చేశాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి.2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌పై వేటు పడటంతో ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సంజూ, ఆ ఫ్రాంచైజీ తరఫున 28 మ్యాచ్‌లు ఆడి ఓ శతకం సాయంతో 677 పరుగులు చేశాడు. 2021 సీజన్లో రాజస్థాన్ కెప్టెన్‌గా నియమితుడైన సంజూ ఐదు సీజన్లలో ఆ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.ఈ సీజన్లో సంజూ గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో అతని స్థానంలో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. మొత్తంగా ఈ సీజన్లో రాజస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చి లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఊరట పొందే విజయం సాధించి సీజన్‌ను ముగించింది.నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబే (39) ఓ మోస్తరు స్కోర్లు చేసి సీఎస్కేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. రాయల్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, యుద్ద్‌వీర్ సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్..యశస్వి జైస్వాల్ (36), వైభవ్ సూర్యవంశీ (57), సంజూ శాంసన్ (41), ధృవ్ జురెల్ (31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జింబాబ్వేతో రేపటి నుండి (మే 22) ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌తో ఎసెక్స్ సీమర్ సామ్ కుక్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో జేమీ స్మిత్ ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా వ్యవహరించనున్నాడు. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టాపార్డర్‌లో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ కొనసాగనున్నారు. పేస్ విభాగంలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, సామ్ కుక్ ఉండనున్నారు. ఇంగ్లండ్ జింబాబ్వేతో చివరిసారిగా 2003లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్ హోం సమ్మర్లో ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కానుంది.ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ల్లో మొదటిగా వన్డేలు (3), ఆతర్వాత టీ20లు (3) జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం కూడా ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. విండీస్‌తో సిరీస్‌ల తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలోనే భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో తలపడుతుంది.జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, సామ్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
అతడెలా ఖరీదైన ఆటగాడు?.. వారికి డబ్బు ఎలా చెల్లిస్తారో తెలుసా?
ఐపీఎల్-2025(IPL 2025) ప్లే ఆఫ్స్ దశలో పలు ఫ్రాంఛైజీలలోకి కొత్త ఆటగాళ్లు చేరారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో లీగ్ వారం పాటు వాయిదా పడటంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన కొందరు ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. మరికొంత మంది గాయాలు, ఫిట్నెస్ లేమి కారణంగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు కొత్త ప్లేయర్లతో వీరి స్థానాలను భర్తీ చేశాయి.ఇందులో భాగంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంఛైజీ కొత్తగా ముగ్గురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఈ నెల 26 తర్వాత జాతీయ జట్టుకు అందుబాటులో ఉండేందుకు ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ముంబై జట్టును వీడుతుండటంతో... ఫ్రాంఛైజీ వారి స్థానాలను మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో భర్తీ చేసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్లు జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంకలను జట్టులోకి తీసుకుంది.రూ.5.25 కోట్లుబెయిర్ స్టోతో రూ. రూ.5.25 కోట్లకు, గ్లీసన్‌తో రూ. కోటికి, అసలంకతో రూ. 75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన రెండు- మూడు మ్యాచ్‌ల కోసమే ముంబై వీరికి పెద్ద మొత్తంలో చెల్లిస్తోందని.. తద్వారా ముంబైతో పాటు కొత్త ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఫ్రాంఛైజీలపై అదనపు భారం పడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘కేవలం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం ముంబై జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకలను తీసుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ముస్తాఫిజుర్ రహ్మమాన్ కూడా వచ్చాడు.. ఇక ఆర్సీబీ లుంగి ఎంగిడి స్థానంలో బ్లెస్సింగ్ ముజర్బానీని తీసుకుంది.ఆడిన మ్యాచ్‌లను బట్టిమరి వీళ్లకు ఎంత డబ్బు చెల్లిస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా మంది సోషల్ మీడియాలో ఓ నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఐపీఎల్లో బెయిర్‌స్టో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడని చెబుతున్నారు.కేవలం మూడు మ్యాచ్‌లకే రూ. 5.25 కోట్లు పొందుతున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు) పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. మీరన్నట్లు ఫ్రాంఛైజీలు వారితో ఆ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ప్రొ-రెటా ఆధారంగా మాత్రమే వారికి డబ్బు చెల్లిస్తారు. అంటే.. అందుబాటులో ఉ న్న, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మాత్రమే ఫీజు ముట్టజెప్పుతారు’’ అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.ఢిల్లీతో అమీతుమీకాగా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకునేందుకు తహతహలాడుతున్న ముంబై జట్టు... పాయింట్ల పట్టికలో తుది నాలుగు స్థానాల్లో నిలిస్తేనే ఈ ముగ్గురు ఆటగాళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం మ్యాచ్ ఆడనున్న ముంబై.. ఈ నెల 26న పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.ఆ తర్వాతే ఈ ముగ్గురు జట్టుతో కలవనున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ఈనెల 26 తర్వాత ముంబై జట్టును వీడనున్నారు. ‘జాక్ స్థానాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్‌స్టో భర్తీచేస్తాడు. అతడిని రూ. 5 కోట్ల 25 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసుకుంది. కాగా రికెల్టన్ స్థానంలో జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌కు 1 కోటి రూపాయాలు... శ్రీలంక బ్యాటర్ అసలంకను రూ. 75 లక్షలు అందజేస్తారు’ అని ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
నా వల్ల కాదని చెప్పి.. వెంటనే రిటైర్ అయిపో!
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్థాయికి తగ్గట్లు ఆకట్టులేకపోతున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి ధోని కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 30 నాటౌట్.ఇక రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా దూరం కావడంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత పగ్గాలు చేపట్టిన ధోని.. సీఎస్కేను మునుపటి విధంగా ముందుకు తీసుకువెళ్లలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది సీఎస్కే.అంతేకాదు.. ఆడిన పదమూడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి తమ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమయ్యే దుస్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ధోనిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.నా వల్ల కాదు.. అని చెప్పి వెళ్లిపో‘‘ధోని వయసు పెరుగుతోంది. కాబట్టి ఆటగాడిగా అతడి నుంచి మనం ఎక్కువగా ఆశించడం కూడా తప్పే. అయితే, ఒక్కోసారి అతడి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు కూడా దెబ్బతింటోంది.ఒకవేళ నీకు హిట్టింగ్ ఆడటం కుదరకపోతే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది చేయలేను’ అని జట్టును వీడిపోతే మంచిది. ధోని ఇలా చేయడమే మంచిది. ఒకవేళ అతడు ఇంకా ఇంకా కొనసాగుతూ... ఉంటే జట్టులో ఏ పాత్ర పోషిస్తాడు?మోకాలి నొప్పులు కూడాకెప్టెన్గా ఉంటాడా? వికెట్ కీపరా లేదంటా ఫినిషర్గానా?.. నిజాయితీ చెప్పాలంటే ధోనిలో క్రికెట్ ఆడే సత్తువ తగ్గిపోయింది. అతడిని మోకాలి నొప్పులు వేధిస్తున్నాయి. ఇకనైనా ధోని తప్పుకొంటే మంచిది’’ అని చిక్కా.. తలాకు సూచించాడు. 43 ఏళ్ల ధోని వీలైనంత త్వరగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేశాడు. రాజస్తాన్ ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దంచికొట్టిన రాజస్తాన్.. 17.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57), సంజూ శాంసన్ (31 బంతుల్లో 41), ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. కాగా ఐపీఎల్లో సీఎస్కేను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. కానీ ఈసారి మాత్రం అతడికి సారథిగా ఘోర పరాభవం ఎదురైంది.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?.. సమీకరణలు ఇలా..Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్, ఆయుశ్లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీఅదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్తాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయుశ్ కూడా అదరగొట్టాడుమరోవైపు.. ఆయుశ్ మాత్రే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయుశ్ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.ఒత్తిడికి లోనుకావద్దుఇదిలా ఉంటే.. రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత సీఎస్కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్, ఆయుశ్ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.అయితే, 200కు పైగా స్ట్రైక్ రేటు మెయింటెన్ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.అందుకు ఓటమిఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విఫలమైతే ఆ ప్రభావం లోయర్ ఆర్డర్‌పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం, ఢిల్లీ👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 187/8 (20)👉రాజస్తాన్ స్కోరు: 188/4 (17.1)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
ఖరీదైన ఫ్లాట్ కొన్న శిఖర్ ధావన్.. ధర తెలిస్తే షాక్!
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్ (Gurugram)లోని విలాసవంతమైన ఈ ఇంటి కోసం దాదాపు రూ. 69 కోట్లు ఖర్చు చేశాడు. కాగా భారత జట్టు మాజీ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్.రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ధావన్.. 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 363 పరుగులతో సత్తా చాటి ధోని సేన ట్రోఫీని ముద్దాడేలా చేశాడు.జాతీయ జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌ల రాకతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో 2022లో చివరగా భారత్‌కు ఆడిన ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.రెండు చేతులా సంపాదన.. నికర ఆస్తి?మొత్తంగా టీమిండియా తరఫున 288 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 10867 పరుగులు సాధించాడు. ఇక ఫామ్‌లో ఉండగా రెండు చేతులా సంపాదించిన ధావన్.. ఐపీఎల్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించి తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు.జాతీయ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి శిఖర్ ధావన్ నికర ఆస్తుల విలువ రూ. 120 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక 39 ఏళ్ల ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న గబ్బర్‌కు కుమారుడు జొరావర్ ఉన్నాడు.మరోసారి ప్రేమలో గబ్బర్అయితే, ఆయేషాతో విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే మహిళతో శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గబ్బర్ గురుగ్రామ్‌లో కొత్త ఫ్లాట్ కొనడం విశేషం.గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 5, సెక్టార్ 54, గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ధావన్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. సుమారు 65.61 కోట్లు కాగా..స్టాంపు డ్యూటీగా రూ. 3.28 కోట్లు చెల్లించినట్లు సమాచారం.అద్బుత ఆట తీరుతోకాగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్..టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ సాధించాడు. ఇక టీమిండియా తరఫున 68 టీ20లలో 1759 పరుగులు చేసిన గబ్బర్.. ఐపీఎల్లో 221 ఇన్నింగ్స్‌లో 6769 పరుగులు సాధించాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా తన అద్బుత ఆట తీరుతో కోట్లు గడించాడు ధావన్.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తొలి మూడు స్థానాలను ఆక్రమించి టాప్-4కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన మరొక్క బెర్తు కోసం ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) పోటీపడుతున్నాయి.ఇరుజట్ల మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఫలితంగా.. ఢిల్లీ గనుక ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మాత్రం తప్పక ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సిందే. అయితే, ‘క్వార్టర్ ఫైనల్’ను తలపిస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.వర్షం ముప్పు.. ఆక్యూమీటర్ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యెల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. వాన పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నట్లు ఆక్యూమీటర్ వెదర్ రిపోర్టు వెల్లడించింది. అయితే, రాత్రి వేళ ఇందుకు కేవలం 25 శాతం మాత్రమే ఆస్కారం ఉందని పేర్కొంది. కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదని.. ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా వర్షం పడే అవకాశం తప్పక ఉందని తెలిపింది.మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం పడి.. మ్యాచ్ రద్దైతే మాత్రం ఢిల్లీకి తిప్పలు తప్పవు. వరుణుడి కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే.. నిబంధనల ప్రకారం ముంబై- ఢిల్లీ జట్లకు చెరో పాయింట్ వస్తుందన్న విషయం తెలిసిందే. తద్వారా ఇక ఇప్పటికే పన్నెండింట ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ముంబై ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది.మరోవైపు.. పన్నెండింట ఆరు గెలిచి.. ఒకటి వర్షం వల్ల రద్దైన కారణంగా పదమూడు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఖాతాలో మొత్తంగా పద్నాలుగు పాయింట్లు చేరతాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ముంబై, ఢిల్లీలకు లీగ్ దశలో చెరో మ్యాచ్ మిగులుతాయి.అయితే, ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తోనే తలపడనున్నాయి. మే 24న ఢిల్లీ, మే 26న ముంబై పంజాబ్ జట్టును ఢీకొడతాయి. ఒకవేళ బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే.. ఢిల్లీ పంజాబ్‌పై తప్పక గెలవాలి. అప్పుడు అక్షర్ సేన ఖాతాలో పదహారు పాయింట్లు చేరతాయి.అయితే, పంజాబ్‌పై గెలవడంతో పాటు.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పంజాబ్ చేతిలో ముందుగానే ఓడినా.. లేదంటే పంజాబ్‌పై ముంబై గెలిచినా అక్షర్ సేన కథ కంచికే! ఎలా చూసుకున్నా ముంబైతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
ఇద్దరిదీ తప్పే.. మీరు భారత క్రికెటర్లని గుర్తుపెట్టుకోండి: రైనా ఫైర్
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తీరును టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టాడు. ఈ ఇద్దరు భారత క్రికెటర్ల నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదన్నాడు. అసలేం జరిగిందంటే... లక్నో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (LSG vs SRH) చేతిలో ఓడింది. సోమవారం జరిగిన ఈ కీలక పోరులో రిషభ్ పంత్ సేన 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.పవర్‌ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడిన అభిషేక్అయితే, లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లలో అభిషేక్... పవర్‌ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది సత్తా చాటాడు. మొత్తంగా 20 బంతుల్లోనే 59 పరుగులతో చెలరేగి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పేశాడు.గొడవపడిన దిగ్వేశ్, అభిషేక్ఇలా జోరుమీదున్న అభిషేక్ శర్మను దిగ్వేశ్ సింగ్ రాఠీ.. తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 8వ)లో అవుట్ చేసి ఎప్పట్లాగే నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. వెళ్లు.. వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. ఈ సమయంలో క్రీజు నుంచి నిష్క్రమిస్తున్న అభిషేక్ దిగ్వేశ్‌ను చూసి ఏదో అన్నాడు.వెంటనే రాఠీ అతడివైపు దూసుకొచ్చి వాగ్వావాదానికి దిగాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్లు కల్పించుకోవడంతో ఈ జగడం అక్కడితోనే ఆగిపోయింది. అయితే ఈ సీజన్లో దిగ్వేశ్ రాఠి పరిధి దాటడం ఇది మూడోసారి! ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం దిగ్వేశ్ సింగ్‌పై మ్యాచ్ నిషేధం పడింది.మ్యాచ్ ఆడకుండా నిషేధం‘ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాం. ఈ ఒక్క సీజన్లోనే నియమావళిలోని ‘లెవెల్ 1’ను మూడోసారి అతిక్రమించడంతో 2 డీమెరిట్ పాయింట్లు కూడా విధించాం. ఇదివరకే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉండటంతో మొత్తం 5 డీమెరిట్‌ల కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేశాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో, 4న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ దిగ్వేశ్ ఇలాగే అతి సంబరాలతో డీమెరిట్ పాయింట్లకు గురయ్యాడు.అదే విధంగా.. సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా ఐపీఎల్ నిర్వాహకులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేశారు. ఈ ఘటనపై స్పందించిన సురేశ్ రైనా.. దిగ్వేశ్- అభిషేక్‌ల తీరును విమర్శించాడు.మీరు భారత క్రికెటర్లని గుర్తుపెట్టుకోండిస్టార్ స్పోర్ట్స్ కామెంట్రీలో భాగంగా... ‘‘దిగ్వేశ్ రాఠీ నోట్‌బుక్‌లో అభిషేక్ శర్మ పేరు కూడా చేరిపోయింది. అప్పుడే ఈ ‘యుద్ధం’ జరిగింది. నేను నిన్నేమీ అనలేదని దిగ్వేశ్ అభిషేక్‌కు చెప్పినట్లు కనిపించింది.ఏదేమైనా ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరూ భారత ఆటగాళ్లే. వారి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు’’ అని సురేశ్ రైనా పెదవి విరిచాడు.గౌరవం ఇవ్వడం నేర్చుకోఅదే విధంగా.. భారత మరో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం కాస్త కష్టంగానే ఉన్నా.. తప్పదంటూ దిగ్వేశ్‌ను విమర్శించాడు. అయితే, రాఠీ తన ఆటలో దూకుడు కొనసాగిస్తూనే.. మైదానంలోని ప్రతీ ఆటగాడికి గౌరవం ఇస్తేనే విజయవంతంగా ముందుకు సాగగలడని అభిప్రాయపడ్డాడు. చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ The intensity of a must-win clash! 🔥#DigveshRathi dismisses the dangerous #AbhishekSharma, & things get heated right after! 🗣️💢Is this the breakthrough #LSG needed to turn things around? 🏏Watch the LIVE action ➡ https://t.co/qihxZlIhqW #IPLRace2Playoffs 👉 #LSGvSRH |… pic.twitter.com/TG6LXWNiVa— Star Sports (@StarSportsIndia) May 19, 2025 -
బంగ్లాతో సిరీస్.. జట్టును ప్రకటించిన పాక్.. బాబర్, రిజ్వాన్‌లకు షాక్
తమ కీలక బ్యాటర్లు బాబర్ ఆజం (Babar Azam), మహ్మద్ రిజ్వాన్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాకిచ్చింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో వీరిద్దరికి మరోసారి మొండిచేయి చూపింది. సల్మాన్ ఆఘా (Salman Ali Agha)ను కెప్టెన్‌గా కొనసాగించిన సెలక్టర్లు.. షాదాబ్ ఖాన్‌ను అతడికి డిప్యూటీగా నియమించారు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బాబర్‌తో పాటు రిజ్వాన్ కూడా తేలిపోయాడు. ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పొటి ఫార్మాట్ సిరీస్‌లలో కూడా పాక్ జట్టు నిరాశపరిచింది.షాహిన్ ఆఫ్రిదికి కూడా షాక్ఇక న్యూజిలాండ్ టూర్‌కు బాబర్, రిజ్వాన్‌లను ఎంపిక చేయని పీసీబీ... సల్మాన్ ఆఘాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, అతడి సారథ్యంలో పాక్ కివీస్ చేతిలో 4-1తో చిత్తుగా ఓడింది. దీంతో సీనియర్లను తిరిగి పిలిపిస్తారని విశ్లేషకులు భావించారు. కానీ సెలక్టర్లు బాబర్ ఆజం, రిజ్వాన్‌ల ఆశలపై నీళ్లు చల్లారు. వీరితో పాటు పేసర్ షాహిన్ ఆఫ్రిదికి కూడా షాకిచ్చారు.బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పీసీబీ తాజాగా జట్టును ప్రకటించింది. పదహారు మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఫఖర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, నసీం షా వంటి వాళ్లకు చోటు దక్కింది. ఇక సిరీస్‌తో మైక్ హెసన్ పాకిస్తాన్ కొత్త కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.వరల్డ్‌కప్‌లోనూ ఆడించరా? కాగా 2026లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగానే బంగ్లాదేశ్‌తో పాక్ ఈ సిరీస్ ఆడుతోంది. అంటే.. బాబర్ ఆజం, రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిదిలను పక్కనపెట్టడం ద్వారా.. ఈ మెగా టోర్నీకి కూడా వారి పేర్లను పరిగణనలోకి తీసుకోవడం లేదనే సంకేతాలు ఇచ్చింది. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు పాకిస్తాన్ సూపర్ లీగ్ -2025 ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేసినట్లు పీసీబీ చెప్పడం గమనార్హం. కాగా బంగ్లాదేశ్‌తో పాక్ ఆడబోయే మూడు టీ20 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదిక.ఇక వన్డేల్లో మాత్రం మహ్మద్ రిజ్వాన్‌ను పీసీబీ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. అతడి సారథ్యంలో ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. గ్రూప్ దశలో భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గెలుపన్నదే లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఐసీసీ టైటిల్‌ను రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హ్యారీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, ముహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీం షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సయీమ్ ఆయుబ్.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఓ సీజన్లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయం కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.విధ్వంసకర శతకంతొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్ అయిన వైభవ్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. తాజాగా సీఎస్కేపై చితక్కొట్టిన ఈ హర్యానా కుర్రాడు 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఓ శతకం, ఓ అర్ద శతకం సాయంతో 252 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అది కూడా 18 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించి.. తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్-2025లో తమ ఆఖరి మ్యాచ్‌లో చెన్నైతో తలపడ్డ రాజస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా సీజన్ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది.18 ఏళ్ల వయసు నిండక ముందే ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ- మొత్తం పరుగులు- 252 (రెండు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు)👉ఆయుశ్ మాత్రే- మొత్తం పరుగులు- 206 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉రియాన్ పరాగ్- మొత్తం పరుగులు- 160 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉సర్ఫరాజ్ ఖాన్- మొత్తం పరుగులు- 111 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0)👉అభిషేక్ శర్మ- 63 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0).చదవండి: ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటాNo fear and pressure 🙅Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ సీఎస్కేతో మంగళవారం తలపడింది.ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. ఆరంభంలో కుదేలైనా... చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్‌ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.వైభవ్ ధనాధన్లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్‌వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్‌లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది. మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్‌లు 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
శ్రీకాంత్ ముందంజ
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 65వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ తొలి రౌండ్లో 21–8, 21–13తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. అనంతరం రెండో రౌండ్లో 9–21, 21–12, 21–6తో హువాంగ్ యి కాయ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి ప్రవేశించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆరో సీడ్, చైనా ప్లేయర్ లు గ్వాంగ్ జుతో శ్రీకాంత్ తలపడతాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన 32 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడినా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. మరోవైపు గతవారం థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు దూసుకెళ్లిన హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లికి ఈ టోర్నీలో నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే తరుణ్ వెనుదిరిగాడు. తరుణ్ 13–21, 21–23తో పనిత్చఫోన్ తీరారత్సకుల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి 20–22, 20–22తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. అన్మోల్ 14–21, 18–21తో హుంగ్ యి టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మోహిత్–లక్షిత జగ్లాన్ ద్వయం 15–21, 16–21తో మింగ్ యాప్ టూ–లీ యు షాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు నేడు మొదలవుతాయి. -
MI vs DC: ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ లక్ష్యంగా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్ బెర్త్’ను ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను అభిమానులు క్వార్టర్ ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు.తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య గత నెలలో జరిగిన పోరులో ముంబైనే విజయం వరించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాంటి పోరాటం కనబరుస్తుందో చూడాలి! అన్ని రంగాల్లో పటిష్టంగా... సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత రాకెట్లా దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గత ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు ఆల్‌రౌండర్లతో దట్టంగా ఉంది. సీజన్లో 63.75 సగటుతో 510 పరుగులు చేసిన సూర్యకుమార్ జట్టు తరఫున టాప్ స్కోరర్ కాగా... రికెల్టన్ 336, రోహిత్ శర్మ 300, తిలక్ వర్మ 246 పరుగులు చేశారు.గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై... తిరిగి పుంజుకుని సమష్టిగా సత్తాచాటాలని చూస్తోంది. రోహిత్ శర్మతో కలిసి రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. వీరిద్దరూ కలిసికట్టుగా కదంతొక్కితే ఢిల్లీ బౌలర్లకు చిక్కులు ఖాయమే. ఇక సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. లీగ్ దశ ముగియగానే రికెల్టన్, జాక్స్, బాష్ జట్టును వీడనున్నారు. బౌలింగ్‌లోనూ ముంబైకి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా పేస్ భారం మోయనుండగా... కరణ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా... ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ అవి ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి. స్టార్క్ లోటుతో! అక్షర్ పటేల్ సారథ్యంలో ఈ సీజన్ ఆరంభంలో ఆశలు రేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత లయ కోల్పోయింది. ఆరంభంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గిన క్యాపిటల్స్... ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. 11 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 61.63 సగటుతో 493 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అభిషేక్ పొరెల్ 295, ట్రిస్టన్ స్టబ్స్ 280, అక్షర్ పటేల్ 263 పరుగులు చేశారు. ఆరంభంలో మెరిపించిన అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ ప్రభావం చూపలేకపోతుండగా... బౌలింగ్‌లో ఆ జట్టు స్టార్క్‌పై అతిగా ఆధారపడుతోంది. చావో రేవో మ్యాచ్‌లో అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. గత మ్యాచ్‌లో చూసుకుంటే వికెట్లు చేతిలో ఉన్నా... ఆశించిన వేగంతో ఆడలేకపోయిన ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్ సెంచరీ సాయంతో 199 పరుగులు చేసింది.అయితే బౌలింగ్‌లో ఢిల్లీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. స్పిన్ త్రయం అక్షర్, కుల్దీప్, విప్రాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనే దానిపైనే ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ భవితవ్యం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్వని కుమార్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్, చమీరా. -
వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్‌గా ఘనతకెక్కిన స్నైడర్‌ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్‌ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్‌బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. -
అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్
న్యూఢిల్లీ: ఐపీఎల్ 18వ సీజన్ తుదిపోరుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రెండో క్వాలిఫయర్ పోరు కూడా అహ్మదాబాద్‌లోనే (జూన్ 1న) జరుగుతుంది. నిజానికి ఈ రెండు మ్యాచ్‌లు గత విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ కావడంతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగాలి. అయితే భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలతో లీగ్‌ను వారం వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్ సమయంలో కోల్‌కతా, హైదరాబాద్‌లో వర్షాలు ఉంటాయనే సమాచారంతో ఈ రెండు నగరాల్లో జరగాల్సిన ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌లను అహ్మదాబాద్, ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్) తరలించారు. 2022, 2023 ఐపీఎల్ ఫైనల్స్ అహ్మదాబాద్‌లోనే జరిగాయి. ఇక ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్‌లో నిర్వహిస్తారు. ఈ నెల 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్ మ్యాచ్ ముల్లాన్‌పూర్‌లో జరుగుతాయి. దీంతో ఈ సీజన్లో కోహ్లి మ్యాచ్‌ను క్వాలిఫయర్ రూపంలో అయినా హైదరాబాద్‌లో చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రొటేషన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచ్‌కు ఈసారి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ ఆరంభం నుంచి అదరగొట్టడంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దీంతో టాప్–2 జట్ల మధ్య తొలి క్వాలిఫయర్... 3–4వ స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్... ఈ రెండింటిలో ఏదైనా ఒక మ్యాచ్‌లోనైనా కోహ్లి మెరుపులు చూడాలనుకున్న హైదరాబాద్ ప్రేక్షకులు ఇప్పుడు మరో సీజన్ దాకా నిరీక్షించక తప్పదు. ఈ నెల 23న బెంగళూరు, సన్రైజర్స్ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను లక్నోకు మార్చారు. 23న బెంగళూరులో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్‌ను లక్నోకు తరలించినట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఐపీఎల్ పునఃప్రారంభమైన 17న బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’షెడ్యూల్మే 29 క్వాలిఫయర్–1 ముల్లాన్‌పూర్ మే 30 ఎలిమినేటర్ ముల్లాన్‌పూర్ జూన్ 1 క్వాలిఫయర్–2 అహ్మదాబాద్ జూన్ 3 ఫైనల్ అహ్మదాబాద్ -
సుమిత్ నగాల్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 170వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–1తో ప్రపంచ 141వ ర్యాంకర్ మిచెల్ క్రుగెర్ (అమెరికా)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్ నెగ్గిన మొత్తం 59 పాయింట్లలో 22 విన్నర్స్ ఉన్నాయి. 14 అనవసర తప్పిదాలు చేసిన సుమిత్ నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచాడు. రెండో రౌండ్లో ప్రపంచ 225వ ర్యాంకర్ జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా)తో సుమిత్ తలపడతాడు. 27 ఏళ్ల సుమిత్ తన కెరీర్లో ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మూడుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఒక్కోసారి, యూఎస్ ఓపెన్‌లో మూడుసార్లు అతను మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. 2020 యూఎస్ ఓపెన్‌లో, 2024 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరడం సుమిత్ గ్రాండ్‌స్లామ్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. -
వైభవ్ వీర విహారం.. సీఎస్కేపై రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్‌ను రాజస్తాన్ ఘన విజయంతో ముగించింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. కాగా ఇరు జట్లు కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించాయి. -
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!?
ఐపీఎల్-2025లో బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా కీలక పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆశలను పదిలం చేసుకుంటుంది. నాలుగో స్ధానం కోసం ముంబై, ఢిల్లీ జట్లు పోటీపడుతున్నాయి.ఇక ఈ కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బంతి రాహుల్ మోకాలికి బలంగా తాకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే నెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ ఆడే అనుమానమే. ఇప్పటికే మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీకి.. రాహుల్ కూడా దూరమైతే గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్లో రాహుల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో మెరిశాడు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్, దుష్మంత చమీరా, సెడికుల్లా అటల్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్ కుమార్, అజయ్ జాదవ్ మండల్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా, మన్వంత్ కుమార్ -
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్ సరసన
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 350 సిక్సర్ల బాదిన జాబితాలోకి ధోని చేరాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్‌ను అందుకున్నాడు.. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన తలా.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ధోని ఇప్పటివరకు 403 టీ20 మ్యాచ్‌లు ఆడి సరిగ్గా 350 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా ఈ సాధించిన 34వ బ్యాటర్‌గా ధోని నిలిచాడు. ఈ జాబితాలో చేరిన నాలుగో భారత ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డు సాధించారు.ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్( 1,056 ) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా ధోని తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. -
రోహిత్ శర్మకు ఘోర అవమానం!.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకస్మికంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు వినిపించాయి. ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ తొలగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని, అందుకే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని ప్రచారం జరిగింది. తాజాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్కై స్పోర్ట్స్ సంచలన రిపోర్ట్‌ను వెల్లడించింది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా తనను ఎంపిక చేయాలని, టూర్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి హిట్‌మ్యాన్ తెలియజేసినట్లు తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం రోహిత్‌ను కేవలం ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేస్తామని, కెప్టెన్‌గా వేరే ప్లేయర్‌కు అవకాశమిస్తామని చెప్పినట్లు సదరు వెబ్సైట్ తమ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన రెడ్ బాల్ కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ రానున్నాడు.కెప్టెన్సీ రేసులో శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. ఇక రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: ఐపీఎల్-2025 ఫ్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే? -
ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్‌లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఈ ఏడాది సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆడాల్సిన ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లను లక్నో మార్చారు. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు వేదికగా తలపడాల్సి ఉంది. ఇప్పుడు రీ షెడ్యూల్ చేయడంతో ఈ రెండు మ్యాచ్‌లనీ లక్నో లోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ ఆడనుంది."ఐపీఎల్-2025లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను లక్నోకు తరలించాము. బెంగళూరులో వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్సీబీ-లక్నో మ్యాచ్ కూడా అదే వేదికలో జరగనుంది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇప్పటికే బెంగళూరు వేదికగా ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వేదికను భారత క్రికెట్ బోర్డు మార్చింది.మరోవైపు ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముల్లాన్‌పుర్ ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్ 2 (జూన్ 1), ఫైనల్ (జూన్ 3) అహ్మదాబాద్‌లో జరుగుతాయి.చదవండి: ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటా -
సీఎస్కేపై రాజస్తాన్ గ్రాండ్ విక్టరీ..
IPL 2025 RR vs CSK Live Updates: విజయంతో ముగింపు..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లురాజస్తాన్ రాయల్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ వేసిన 14 ఓవర్లో రెండో బంతికి సంజూ శాంసన్(41) ఔట్ కాగా.. ఆరో బంతికి సూర్యవంశీ(57) ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 33 బంతులు 57 పరుగులు కావాలి.సూర్యవంశీ ఫిప్టీ..రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లోనే సూర్యవంశీ 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 110/111 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజులో సూర్యవంశీ(44), సంజూ శాంసన్(30) ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..యశస్వీ జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన జైశ్వాల్.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది.రాణించిన మాత్రే, బ్రెవిస్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు.బ్రెవిస్ ఔట్..డెవల్డ్ బ్రెవిస్ రూపంలో సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన బ్రెవిస్.. మధ్వాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ధోని వచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 126/512 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో దూబే(12), బ్రెవిస్(36) ఉన్నారు.రవీంద్ర జడేజా ఔట్..చెన్నై సూపర్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్లో హసరంగా బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్(12) ఔట్ కాగా.. ఆ తర్వాత యుద్ద్‌వీర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా(1) ఔటయ్యారు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 19 బంతుల్లోనే 43 పరుగులు చేసిన మాత్రే.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 68/3ఒకే ఓవర్లో రెండు వికెట్లు..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సెకెండ్ ఓవర్ వేసిన యుద్ద్‌వీర్ సింగ్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0) పెవిలియన్‌కు చేరారు. 3 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే తుది జట్టులోకి డెవాన్ కాన్వే తిరిగొచ్చాడు. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, యుధ్వీర్ సింగ్ చరక్, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్ -
ఐపీఎల్-2025 ఫ్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే?
ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లకు ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళవారం జరిగిన సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండేది.అయితే భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వారం రోజులు పాటు ఈ ఏడాది సీజన్ వాయిదా పడడంతో.. షెడ్యూల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఫైనల్ మే 25కు బదులుగా జూన్ 3న నిర్వహించినున్నట్లు భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. కానీ ఫైనల్ మ్యాచ్ వేదికను మాత్రం ఖారారు చేయలేదు. తుదిపోరుకు ఆతిథ్యమిచ్చేందుకు బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ సిద్దంగా ఉన్నప్పటికి.. నైరుతి రుతుపవనాలు కారణంగా కోల్‌కతాకు భారీ వర్ష సూచన ఉంది. ఈ క్రమంలో బీసీసీఐ ఫైనల్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి కానుంది. గతంలో 2022, 2023 సీజన్లలో ఈ వేదికలోనే ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వాస్తవానికి.. ఫైనల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ల సొంత మైదానంలో నిర్వహిస్తారు.ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచినందున గతేడాది సీజన్ ఫైనల్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల ఫైనల్ వేదిక కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు తరలిపోనుంది.ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ తాత్కాలిక షెడ్యూల్మే 29: క్వాలిఫైయర్ 1 – ముల్లన్పూర్మే 30: ఎలిమినేటర్ – ముల్లన్పూర్జూన్ 1: క్వాలిఫైయర్ 2 – అహ్మదాబాద్జూన్ 3: ఫైనల్ – అహ్మదాబాద్ -
ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటా
ఐపీఎల్-2025లో ఆదివారం(మే 18) రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హగ్ చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.అంతేకాకుండా 14 ఏళ్ల చిన్నారికి హాగ్ ఇవ్వడం ఏంటని కొన్ని వెబ్ సైట్లు కూడా కథనాలు ప్రచరించాయి. తాజాగా ఇదే విషయంపై ప్రీతి జింటా స్పందించారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది."ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆఖరి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని వార్తలుగా చూపిస్తున్నాయి. అది చూసి నేను ఆశ్చర్యపోయాను" అని ఎక్స్‌లో ఆమె రాసుకొచ్చింది.కాగా అసలు వీడియోలో మాత్రం ప్రీతి జింటా వైభవ్‌తో కరచాలనం చేసి, కాసేపు మాట్లాడినట్లు ఉంది. కొంతమంది ఏఐ సాయంతో ప్రీతీ.. వైభవ్ ను కౌగిలించుకుంటున్నట్టు ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వరుస విజయాలతో పంజాబ్ కింగ్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్This is a morphed image and fake news. Am so surprised now news channels are also using morphed images and featuring them as news items !— Preity G Zinta (@realpreityzinta) May 20, 2025 -
IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్
ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఊరట లభించింది. భుజం గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు.ఈ ఏడాది సీజన్లో ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ గాయపడ్డాడు. దీంతో మే 3న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌కు ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ దూరమయ్యాడు. అంతలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడడంతో హాజిల్‌వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ క్రమంలో హాజిల్‌వుడ్ తిరిగి భారత్‌కు వస్తాడా? లేదా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు అతడిని భారత్‌కు పంపించి క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకోదని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హాజిల్‌వుడ్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో త్వరలోనే భారత్‌కు చేరుకునే అవకాశముంది. మే 29 నుంచి ప్రారంభమయ్యే ప్లేఆఫ్‌లకు హాజిల్‌వుడ్ తిరిగి వస్తాడని ఆర్సీబీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ ఏడాది సీజన్లో జోష్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన హాజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఆర్సీబీ ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలూండగానే ఫ్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. బెంగళూరు జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.Josh Hazlewood started bowling. We're coming for that tinpot trophy 😭🔥😭🔥😭🔥😭 pic.twitter.com/oxSFVVjxwL— M0 B0BAT 🧠 (@rohancric947) May 20, 2025 -
సోషల్ మీడియా పోస్ట్‌తో.. రూ. 14 కోట్ల జాబ్ పోయింది
లండన్: ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కామెంటేటర్ గ్యారీ లినేకర్ (Gary Lineker) బీబీసీ వ్యాఖ్యాత స్థానం నుంచి వైదొలగనున్నాడు. సామాజిక మాధ్యమాల్లో జియోనిజానికి సంబంధించిన పోస్ట్ పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గ్యారీ... ఇప్పుడు వ్యాఖ్యాతగా తప్పుకోనున్నాడు. మీడియా సెలబ్రిటీగా మంచి పేరున్న 64 ఏళ్ల లినేకర్... అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రిటిష్ జాతీయ ప్రసారకుడిగా ఉన్నాడు. బీబీసీలో వ్యాఖ్యాతగా అతడు ఏడాదికి దాదాపు 1.7 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 14 కోట్ల 52 లక్షలు) ప్రతిఫలంగా పొందుతున్నాడు.‘జియోనిజం రెండు నిమిషాల్లో వివరించొచ్చు’ అనే క్యాప్షన్‌తో కూడిన ఎలుక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో లినేకర్‌పై విమర్శలు గుప్పుమన్నాయి. యూదు వ్యతిరేక భావజాలం కలిగిన ఇలాంటి పోస్టు పెట్టినందుకు లినేకర్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ... బీబీసీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సోషల్ మీడియా పాలసీ (Social Media Policy) ప్రకారం అతడిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 80 మ్యాచ్‌లాడిన లినేకర్... 48 గోల్స్ చేశాడు. 1986 ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవలే 90 మీటర్ల మార్క్‌ను అధిగమించి ఇకపై మరింత పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాడు. తాజా ప్రదర్శనతో నీరజ్‌పై ఒక పెద్ద భారం దిగిపోయిందని, మున్ముందు అతని నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చని భారత మాజీ షూటర్, 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ (Gagan Narang) అభిప్రాయపడ్డాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో భాగంగా జావెలిన్‌ను నీరజ్ 90.23 మీటర్ల దూరం విసిరాడు.‘ఇంత కాలం నీరజ్ తన వీపుపై 90 మీటర్ల లక్ష్యం అనే పెద్ద బరువును మోసుకొని తిరిగాడు. అతని మనసులో కూడా అదే భావనతో ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు అదంతా తొలగిపోయింది. ఇకపై మరింత స్వేచ్ఛగా ఆడి ఇంతకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నేను కూడా ఒక దశలో 600/600 పాయింట్ల కోసం ఎంతో శ్రమించా. 597–599 చాలాసార్లు సాధించినా అసలైన అంకె మాత్రం రాలేదు. ఎట్టకేలకు దానిని అందుకున్న తర్వాత స్వేచ్ఛ లభించినట్లయింది’ అని గగన్ అన్నాడు. నీరజ్ చోప్రా (Neeraj Chopra) సాధించిన ఘనతలు కేవలం దూరానికి సంబంధించినవి మాత్రమే కాదని, అంతర్జాతీయ వేదికలపై అతని స్థాయిని చూపించాయని గగన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.‘దోహాలో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతను సాధించిన చాలా పెద్ద ఘనత. అయితే దీనిని కేవలం 90 మీటర్ల దూరం అనే లెక్కల్లోనే చూడవద్దు. భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి అతను చరిత్రను తిరగరాస్తున్నాడు. ఒక తరం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాడు. సీజన్లో ఇది తొలి టోర్నీ మాత్రమే. మున్ముందు చాలా పోటీలు ఉన్నాయి. కాబట్టి మైలురాయిని దాటడమే కాదు సరైన సమయంలో సరైన ఫలితం సాధించడం కూడా ముఖ్యం’ అని ఈ హైదరాబాదీ షూటర్ వ్యాఖ్యానించాడు.మరోవైపు షూటింగ్ లీగ్ నిర్వహించాలనే ఆలోచన పట్ల అతను సానుకూలంగా స్పందించాడు. ‘చాలా కాలంగా దీని గురించి చర్చ సాగింది. మన షూటర్లు జర్మనీలోని బుండెస్‌లీగాలో ఆడేందుకు వెళుతుంటారు. ఇప్పుడు మనకూ ఒక లీగ్ ఉంటుంది. ప్రతీ జట్టులో సీనియర్, యూత్, జూనియర్ ఆటగాళ్లు ఉండటం షూటింగ్‌కు మేలు చేస్తుంది. లీగ్ నిర్వహణకు ఇది సరైన సమయం కూడా’ అని గగన్ నారంగ్ విశ్లేషించాడు.చదవండి: PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే -
IPL 2025: చరిత్ర సృష్టించిన లక్నో ప్లేయర్లు.. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి..!
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. లీగ్‌లో మునుపెన్నడూ జరగని విధంగా ఈ సీజన్లో లక్నోకు చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి.నిన్న (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ త్రయం ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించింది. సీజన్ ప్రారంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. ఈ మ్యాచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్ష్ (61), మార్క్రమ్ (61), పూరన్ (45) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందే పూరన్ 400 పరుగులు పూర్తి చేయగా.. మార్క్రమ్, మార్ష్ ఈ మ్యాచ్‌లో 400 పరుగుల మైలురాయిని తాకారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పూరన్ నాలుగు అర్ద సెంచరీల సాయంతో 455 పరుగులు చేయగా.. మార్ష్ 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు.. మార్క్రమ్ 12 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 409 పరుగులు చేశారు. ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో పూరన్ 9, మార్ష్ 10, మార్క్రమ్ 12 స్థానాల్లో ఉన్నారు.ఈ సీజన్లో ముగ్గురు విదేశీ బ్యాటర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం సోచనీయం. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్, మార్ష్, మార్క్రమ్ సత్తా చాటినా లక్నో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో లక్నో తరఫున ఈ ముగ్గురు మినహా బ్యాటింగ్‌లో ఎవ్వరూ రాణించలేదు. అడపాదడపా బదోని బ్యాట్‌కు పని చెప్పాడు. మిడిలార్డర్లో పంత్ ఘోరంగా విఫలం కావడం.. సరైన్ ఫినిషర్ లేకపోవడం ఈ సీజన్లో లక్నో కొంపముంచాయి. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ పర్వాలేదనిపించినా వీరికి సహకరించే బౌలర్లే కరువయ్యారు. రవి బిష్ణోయ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. పేసర్ ఆకాశ్‌దీప్ తేలిపోయాడు. మరో పేసర్ ప్రిన్స్ యాదవ్ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సీజన్ ప్రారంభ మ్యాచ్లకంతా దూరంగా ఉండిన మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్‌లు ఆడి తిరిగి గాయపడ్డాడు. వీటన్నిటికి మించి రిషబ్ కెప్టెన్సీలో లోపాలు ఈ సీజన్లో లక్నో ఖేల్ ఖతం చేశాయి. మార్క్రమ్, మార్ష్, పూరన్ ఫామ్ మినహా ఈ సీజన్లో లక్నో గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సీజన్లో లక్నోకు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు (మే 22న గుజరాత్‌తో, మే 27న ఆర్సీబీతో) మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవడం తప్ప లక్నో చేయగలిగిందేమీ లేదు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరు కూడా..!
జాతీయ జట్టు విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్న ర్యాన్ రికెల్టన్ (సౌతాఫ్రికా), కార్బిన్ బాష్ (సౌతాఫ్రికా), విల్ జాక్స్ (ఇంగ్లండ్) స్థానాలను ముంబై ఇండియన్స్ మరో ముగ్గురితో భర్తీ చేసుకుంది. విల్ జాక్స్‌కు ప్రత్యామ్నాయంగా జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), ర్యాన్ రికెల్టన్కు ప్రత్యామ్నాయంగా రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్‌కు ప్రత్యామ్నాయంగా చరిత్ అసలంకను (శ్రీలంక) జట్టులోకి తీసుకుంది. వీరు ముగ్గురు ఒకవేళ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అందుబాటులో ఉంటారు. లీగ్ చివరి మ్యాచ్ వరకు జాక్స్, రికెల్టన్, బాష్ అందుబాటులో ఉంటారు. బెయిర్‌స్టోను ముంబై యాజమాన్యం రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. గ్లీసన్‌ను రూ. కోటికి, అసలంకను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం మే 21న జరిగే మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది. ఆ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇదివరకే సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ లీగ్ దశలో తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లో జయాపజాలు టాప్-2 బెర్త్‌లను డిసైడ్ చేస్తాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టాప్-2 పోజిషన్స్‌లో ఉండే జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఓ మ్యాచ్ ఓడినా మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఆ అవకాశం ఉండదు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడే జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. -
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ తర్వాత ప్రేక్షకాదరణలో రెండో స్థానంలో నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దబంగ్ ఢిల్లీ స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ (Naveen Kumar) తొలిసారి పీకేఎల్ వేలానికి వచ్చాడు. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలుకాగా దబంగ్ ఢిల్లీ (Dabang Delhi) 8వ సీజన్లో విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆరు సీజన్లు ఆడిన నవీన్ 1102 రెయిడింగ్ పాయింట్లు సాధించాడు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వదిలేసుకోవడంతో మిగతా ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి.ఇలా విడుదల, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను 12 ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 83 మందిని రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకున్నాయి. నాలుగు కేటగిరీలుమొత్తం నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలుంది. ఎ, బి, సి, డిగా విభజించిన రిటెయినర్లలో ఎ ఆటగాడికి రూ. 30 లక్షలు, బి ప్లేయర్‌కు రూ. 20 లక్షలు, సి, డి ఆటగాళ్లకు వరుసగా రూ. 13 లక్షలు, రూ. 9 లక్షలు చెల్లించాల్సివుంటుంది.ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ట పరిమితి రూ. 5 కోట్లకు లోబడే రిటెయిన్ మొత్తాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముంబైలో ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు కబడ్డీ ఆటగాళ్ల వేలం పాట జరుగనుంది.ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ప్లేయర్లుబెంగాల్ వారియర్స్: విశ్వాస్, యశ్ మలిక్, మన్జీత్, దీప్ కుమార్, సుశీల్ కాంబ్రేకర్. బెంగళూరు బుల్స్: చంద్ర నాయక్, లక్కీ కుమార్, మన్జీత్, పంకజ్. దబంగ్ ఢిల్లీ: సందీప్, మోహిత్. గుజరాత్ జెయింట్స్: హిమాన్షు సింగ్, హిమాన్షు, ప్రతీక్ దహియా, రాకేశ్. హరియాణా స్టీలర్స్: రాహుల్ సెప్తాల్, వినయ్, శివమ్ అనీల్, జైదీప్, జయసూర్య, విశాల్ తటే, సాహిల్ మనికందన్, వికాస్ రామదాస్ జాదవ్. జైపూర్ పింక్‌పాంథర్స్: రెజా మిర్బాఘెరి, అభిషేక్, రోనక్ సింగ్, నితిన్ కుమార్, సోంబిర్, రితిక్ శర్మ. పట్నా పైరేట్స్: హమిద్ మిర్జాయి నదిర్, త్యాగరాజన్ యువరాజ్, సుధాకర్, అయాన్, నవ్‌దీప్, దీపక్, సాహిల్ పాటిల్. పుణేరి పల్టన్: అభినేశ్, గౌరవ్ ఖత్రి, పంకజ్ మోహితే, అస్లామ్ ముస్తఫా, మోహిత్ గోయత్, దాదాసొ శివాజీ పూజారి, ఆదిత్య తుషార్ షిండే. తమిళ్ తలైవాస్: మొయిన్ షఫాగి, హిమాన్షు, సాగర్, నితేశ్ కుమార్, నరేందర్, రోనక్, విశాల్ చహల్, ఆశిష్, అనూజ్ గవాడే, ధీరజ్ రవీంద్ర బైల్మరే. తెలుగు టైటాన్స్: శంకర్ భీమ్రాజ్, అజిత్ పాండురంగ పవార్, అంకిత్, ప్రఫుల్ జవారే, సాగర్ చేతన్ సాహు, నితిన్, రోహిత్. యు ముంబా: సునీల్ కుమార్, రోహిత్, అమిర్ మొహమ్మద్, సతీశ్ కన్నన్, ముకిలన్ షణ్ముగమ్, అజిత్ చౌహాన్, దీపక్ కుండు, లోకేశ్ గోస్లియా, సన్నీ.యూపీ యోధాస్: సుమిత్, భవానీ రాజ్‌పుత్, సాహుల్ కుమార్, సురేందర్ గిల్, అషు సింగ్, హితేశ్ గగన గౌడ, శివమ్ చౌదరి, జయేశ్ వికాస్ మహాజన్, గంగారామ్, సచిన్, కేశవ్ కుమార్.చదవండి: Football Tournament: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. -
IPL 2025: అభిషేక్ శర్మతో గొడవ.. దిగ్వేశ్ రాఠీపై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా స్పందించిన అభిషేక్ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జమయ్యింది.ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe— Johns. (@CricCrazyJohns) May 19, 2025సస్పెన్షన్ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (మే 22న గుజరాత్‌తో) ఆడలేడు. ఈ సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించి గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్లో రాఠీ డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఓ సీజన్లో మూడు సార్లు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రాఠీ ఈ సీజన్లో పంజాబ్ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్‌ల్లోనూ కోడ్‌ను ఉల్లంఘించి డిమెరిట్ పాయింట్లు మూటగట్టుకున్నాడు.కాగా, దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ కాస్త శృతి మించాయి. అభిషేక్‌తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు. రాఠీ ఇంతలా రియాక్డ్ కావడానికి అంతకుముందు అభిషేక్ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఈ క్రమంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం రాజీవ్ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: మా వ్యూహాలు మార్చాల్సిన పనిలేదు: సీఎస్కే హెడ్‌కోచ్
తన దృష్టిలో ఎప్పటికీ అనుభవానికి పెద్ద పీట ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. గతంలో సీనియర్లతోనే తాము వరుసగా టైటిల్స్ గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపవాదు మూటగట్టుకున్న సీఎస్కే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది ఇప్పటికి ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి దారుణంగా విఫలమైంది.సీనియర్లు విఫలంయువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే, నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) లాంటివారు రాణించినా... జట్టు నమ్ముకున్న సీనియర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా లీగ్‌లో ఎంతో అనుభవం ఉన్నా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. అయితే తమ టీమ్ వైఫల్యానికి పలు కారణాలు ఉన్నాయని కోచ్ ఫ్లెమింగ్ అన్నాడు. అయితే, ఆటగాళ్ల వయసు ఇందుకు కారణం కాదని పేర్కొన్నాడు.అనుభవం అమూల్యమైంది‘ఆటగాళ్ల వయసు ఎంత ఎక్కువగా ఉందనేది నేను పట్టించుకోను. నా దృష్టిలో అనుభవం అమూల్యమైంది. గత కొన్నేళ్లలో మాకు అదే ఎన్నో విజయాలు అందించింది. ఈ సీజన్లో అది పని చేయకపోవచ్చు. ఫలితం అందరికీ నిరాశ కలిగించిన మాట వాస్తవమే కానీ వైఫల్యానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి’ అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.ఇన్నేళ్లుగా చెన్నై టీమ్ సీనియర్ల ఆటతో అనుసరిస్తున్న వ్యూహాలను ఇకపై కూడా మార్చాల్సిన అవసరం లేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ‘సీనియర్లపై నమ్మకం ఉంచడంతో పాటు ప్రతిభాన్వేషణ కూడా ఈ సమయంలో ముఖ్యం. జట్టులో యువ ఆటగాళ్లు ఉండాలని అందరూ అంటున్నారు. కానీ వారందరినీ వెతికి తెచ్చుకోవాలి కదా. జట్టులో వారు సరిపోతారో లేదో చూడాలి.అనుభవజ్ఞులతో కలిపి వారిని ఆడించాలి. ఈ సీజన్లో కొందరు కొత్త కుర్రాళ్లు చెలరేగడం నిజమే అయినా అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల ఆటగాళ్ల జాబితా చూస్తే ఐపీఎల్లో అనుభవం ఉన్నవారే కనిపిస్తారు. మాకు ఈ సీజన్ పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని ఫ్లెమింగ్ వివరించాడు.చదవండి: IPL 2025: దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్ -
ధోనికి ఒకటి.. సంజూకు రెండు.. ఒకే మ్యాచ్‌లో భారీ మైలురాయిపై కన్నేసిన సీఎస్కే, రాజస్థాన్ కెప్టెన్లు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 20) నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ధోని, సంజూ శాంసన్ ఓ భారీ మైలురాయిపై కన్నేశారు.ధోని ఓ సిక్సర్, సంజూ రెండు సిక్సర్లు బాదితే టీ20ల్లో 350 సిక్సర్ల మార్కును తాకుతారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 33 మంది మాత్రమే ఈ మైలురాయిని తాకారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (1056) బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు (టాప్-10లో).ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటర్లు మొదటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ లక్ కలిసి రాలేదు. యశస్వి జైస్వాల్, కుర్ర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో సారి తెగబడి ఆడే ఛాన్స్ ఉంది. కొత్తగా జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్ కూడా బ్యాట్‌కు పని చెప్పవచ్చుఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో రాయల్స్ గెలుపు వాకిట బోల్తా పడింది. ఇలా జరిగినందుకు ఈ సీజన్లో ఆ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నేడు సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్ రాయల్స్‌కు ఈ సీజన్లో చివరిది. కాబట్టి సీజన్‌ను గెలుపుతో ముగించి పరువు కాపాడుకోవాలని రాయల్స్ భావిస్తుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు కూడా నేటి మ్యాచ్‌లో విజృంభించే అవకాశం ఉంది. ఈ జట్టు బ్యాటర్లు ఎదురుదాడి చేస్తే పోయేదేముందన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. కుర్ర బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ నుంచి రికార్డు విన్యాసాలు ఆశించవచ్చు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 2020 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో రాయల్స్ ఏడింట విజయాలు సాధించింది. నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్లు ప్రయోగాల బాటపట్టవచ్చు.తుది జట్లు (అంచనా)..సీఎస్కే: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్/మతీషా పతిరానారాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, నాంద్రే బర్గర్, అశోక్ శర్మ/శుభమ్ దూబే -
'అందుకే' మందు మానేశా: స్టార్ క్రికెటర్
లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తరచు గాయాల బారిన పడుతూ మళ్లీ మళ్లీ ఆటకు దూరమవుతున్న 33 ఏళ్ల స్టోక్స్ గత ఏడాది డిసెంబర్ తర్వాత అసలు ఏ స్థాయి మ్యాచ్ కూడా ఆడలేదు. తొడ కండరాల గాయంతో తప్పుకున్న అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వేగంగా ఫిట్నెస్ అందుకునే క్రమంలో భాగంగా ‘రీహాబిలిటేషన్’ సమయంలో మద్యానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘నాకు తొలిసారి గాయమైనప్పుడు నా శరీరం చికిత్సకు సరిగా స్పందించలేదు. ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తే వారం రోజుల క్రితం బాగా మద్యం తాగిన విషయం గుర్తుకొచి్చంది. బహుశా అది కూడా కారణం కావచ్చనిపించింది. దాంతో ఈసారి గాయం తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మారితే మంచిదని భావించా. అయితే పూర్తిగా అది సాధ్యం కాదు కాబట్టి రీహాబిలిటేషన్ వరకు నియంత్రణలో ఉండేందుకు ప్రయత్నించా. మైదానంలోకి దిగే వరకు దీనిని పాటించాలని ప్రయతి్నస్తున్నా. అందుకే ఈ ఏడాది జనవరి నుంచి మద్యం మానేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిని ముట్టలేదు’ అని స్టోక్స్ చెప్పాడు. గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో బరిలోకి దిగనున్న స్టోక్స్...ఆ తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్, యాషెస్ సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. -
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన నేపాల్, థాయ్‌లాండ్
నేపాల్, థాయ్‌లాండ్ జట్లు ఆఖరి నిమిషంలో మహిళల టీ20 వరల్డ్‌కప్-2026 గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీ పడేందుకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో యూఏఈపై విజయాలు సాధించిన నేపాల్, థాయ్‌లాండ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు ఇదివరకే స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి అర్హత సాధించే జట్లేవో తెలియాల్సి ఉంది. ఈ రెండు టోర్నీల నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో ఆరు జట్లు పోటీ పడి, నాలుగు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, 2026 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లండ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడతాయి. ఆతిధ్య దేశ హోదాలో ఇంగ్లండ్ తొలుత ఈ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు బెర్త్‌లు గ్లోబల్ క్వాలిఫయర్స్ ద్వారా డిసైడ్ అవుతాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగిందేమీ లేనప్పటికీ.. లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను మాత్రం ఆవిరి చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్నో నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ స్టేడియంలో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి (నాలుగు ప్రయత్నాల్లో).మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో పూరన్ (26 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. రిషబ్ పంత్ (7) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లలో ఆయుశ్ బదోని 3, అబ్దుల్ సమద్ 3, శార్దూల్ ఠాకూర్ 4, ఆకాశ్‌దీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు.ఓపెనర్లు అందించిన శుభారంభానికి ఈ మ్యాచ్‌లో లక్నో ఇంకాస్త భారీ స్కోర్ సాధించి ఉండాల్సింది. అయితే చివరి ఓవర్లలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో లక్నో మూడు వికెట్లు (2 రనౌట్లు) కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గొడవ పడిన అభిషేక్, దిగ్వేశ్ మ్యాచ్ పూర్తయ్యాక ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజీవ్ శుక్లా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు. -
రికార్డు విజయం.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన యూఏఈ
క్రికెట్ పసికూన యూఏఈ రికార్డు విజయం సాధించింది. తమ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్‌పై విజయం నమోదు చేసింది (టీ20ల్లో). మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (మే 19) జరిగిన రెండో టీ20లో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో యూఏఈ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్ కోసం యూఏఈలో (షార్జా) పర్యటిస్తున్న బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 మే 21న (షార్జాలో) జరుగనుంది.రాణించిన బంగ్లా బ్యాటర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. టాపార్డర్ బ్యాటర్లు తంజిద్ హసన్ (59), లిటన్ దాస్ (40), నజ్ముల్ హసన్ షాంటో (27), తౌహిద్ హృదోయ్ (45), జాకిర్ అలీ (6 బంతుల్లో 18) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా 3, సాఘిర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.యూఏఈని గెలిపించిన కెప్టెన్అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని కెప్టెన్ ముహమ్మద్ వసీం (42 బంతుల్లో 82) అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. వసీం ఔటయ్యే సరికి యూఏఈ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తలో సిక్సరో, బౌండరీనో బాది జట్టు గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో ధృవ్ పరాషార్ (11), హైదర్ అలీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి యూఏఈకి రికార్డు విజయాన్నందించారు. యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్, నహిద్ రాణా, రిషద్ హొసేన్ తలో రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లాం, తంజిమ్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. -
టైటిల్ బోణీ చేసేనా?
కౌలాలంపూర్: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో టోరీ్నకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత కొంత కాలంగా లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. గత నెల సుదిర్మన్ కప్‌లో భాగంగా ఇండోనేసియా, డెన్మార్క్ చేతిలో ఓడిన ఈ ఇద్దరు తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన సింధు ప్రస్తుతం ప్రపంచ 16వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ నుగుయెన్ థుయ్ లిన్ (వియత్నాం)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)తో 35వ ర్యాంకర్ ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మూడో సీడ్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)తో సతీశ్ కుమార్ కరుణాకరన్, బ్రియాన్ యంగ్ (కెనడా)తో ఆయుశ్ శెట్టి, జియా హెంగ్ జాసన్ (సింగపూర్)తో ప్రియాన్షు రజావత్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధుతో పాటు ఉన్నతి హూడా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ పోటీ పడుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి, హరిహరన్–రూబన్ కుమార్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో నాలుగు జోడీలు పోటీలో ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో రుతి్వక శివాని–రోహన్ కపూర్, ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత్ సూర్య–అమృత, ఆద్య–సతీశ్ కుమార్ బరిలో దిగనున్నారు. ఇక ప్రధాన పోటీలకు ముందు జరగనున్న క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌తో పాటు శంకర్ ముత్తుస్వామి, తరుణ్ మన్నెపల్లి మంగళవారం బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగం నుంచి అన్మోల్ పోటీలో ఉంది. -
SRH Vs LSG: లక్నోను ముంచిన సన్‌రైజర్స్
లక్నో: ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఇదివరకే ముగిసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వారి ‘ప్లే ఆఫ్స్’ ఆశల్ని కూడా ముంచింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో లక్నోపై జయభేరి మోగించింది. ముందుగా లక్నో నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. ఇషాన్ మలింగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. దిగ్వేశ్ రాఠి 2 వికెట్లు తీశాడు. సెంచరీ భాగస్వామ్యం మిచెల్ మార్ష్ దూకుడుతో లక్నో ఆట మొదలైంది. కమిన్స్ తొలి బంతికి 4, నాలుగో బంతికి 6 కొట్టాడు. ఇదే జోరుతో హర్ష్ దూబే రెండో ఓవర్లో మార్ష్ మరో సిక్స్ బాదాడు. మూడో ఓవర్లో బౌండరీతో మార్క్రమ్ టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే మార్క్రమ్ అవుటవ్వాల్సింది. క్రీజు వదిలి ఆడిన అతన్ని ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేయలేకపోయాడు. ఇలా బతికిపోయిన మార్క్రమ్ 6, 4లతో రెచి్చపోయాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. మార్ష్ దంచే పనిలో ముందున్నాడు. హర్షల్, ఇషాన్ మలింగ ఓవర్లలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. కాసేపటికే మార్ష్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 9వ ఓవర్లో మార్క్రమ్కు మరోమారు లైఫ్ వచి్చంది. జీషాన్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్ ఎక్స్ట్రా కవర్లో అనికేత్ వదిలేశాడు. దీంతో అదే ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. తర్వాత ఎట్టకేలకు మార్ష్ వికెట్ తీసిన హర్ష్ దూబే 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. లక్నో కెపె్టన్ రిషభ్ పంత్ (7) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాన్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్‌లను సది్వనియోగం చేసుకున్న మార్క్రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పూరన్ మధ్యలో పడిపోయిన రన్‌రేట్ పెంచేందుకు బ్యాట్ ఝుళిపించాడు. హర్షల్ 16వ ఓవర్లో సిక్స్ బాదిన మార్క్రమ్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. నితీశ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన పూరన్‌తో పాటు శార్దుల్ (4)కూడా రనౌటయ్యారు. సమద్ (3)ను బౌల్డ్ చేయగా... ఆకాశ్ దీప్ (6) సిక్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. 20వ ఓవర్లో నితీశ్ 20 పరుగులిచ్చాడు. అభిషేక్ అదరహో రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 23/1. అప్పటికి అభిషేక్ ఒక పరుగే చేశాడు. ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ నుంచి అతని విధ్వంసం మొదలైంది. 4, 6 బాదిన అభిషేక్ తర్వాతి రూర్కే ఓవర్లోనూ దీన్ని రిపీట్ చేశాడు. దీంతో 3.3 ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌కు దిగితే వరుస బౌండరీలతో జోరు కనబరచడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ 72/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ఓవర్ వేసిన రవి బిష్ణోయ్‌కి అభిషేక్ చుక్కలు చూపించాడు. 6, 6, 6, 6లతో 26 పరుగులు రాబట్టాడు. మూడో సిక్స్ బాదేసరికే 18 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. మరుసటి ఓవర్లో అభిషేక్ జోరుకు దిగ్వేశ్ రాఠి బ్రేక్ వేశాడు. ఈ సందర్భంగా రాఠి, అభిషేక్ మాటామాట పెంచుకున్నారు. అంపైర్లు సముదాయించి పంపారు. 35 బంతుల్లోనే 82 పరుగుల ధనాధన్ రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లు ధాటిని కొనసాగించడంతో సన్‌రైజర్స్ లక్ష్యంవైపు దూసుకెళ్లింది. కిషన్ అవుటయ్యాక ‘దంచే’పనిని క్లాసెన్, కమిందు మెండిస్ (21 బంతుల్లో 32 రిటైర్డ్‌హర్ట్; 3 ఫోర్లు) చక్కబెట్టారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరినా... మిగతా లాంఛనాన్ని అనికేత్ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) పూర్తి చేశారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ 65; మార్క్రమ్ (బి) హర్షల్ 61; పంత్ (సి అండ్ బి) మలింగ 7; పూరన్ (రనౌట్) 45; బదోని (సి) నితీశ్ (బి) మలింగ 3; సమద్ (బి) నితీశ్ 3; శార్దుల్ (రనౌట్) 4; బిష్ణోయ్ (నాటౌట్) 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–115, 2–124, 3–159, 4–169, 5–194, 6–199, 7–199. బౌలింగ్: కమిన్స్ 4–0–34–0, హర్ష్ దూబే 4–0–44–1, హర్షల్ పటేల్ 4–0–49–1, ఇషాన్ మలింగ 4–0–28–2, జీషాన్ అన్సారి 2–0–22–0, నితీశ్ 2–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అథర్వ తైడే (సి) దిగ్వేశ్ (బి) రూర్కే 13; అభిషేక్ (సి) శార్దుల్ (బి) దిగ్వేశ్ 59; కిషన్ (బి) దిగ్వేశ్ 35; క్లాసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 47; కమిందు (రిటైర్డ్‌హర్ట్) 32; అనికేత్ (నాటౌట్) 5; నితీశ్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–17, 2–99, 3–140, 4–195. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 3–0–33–0, రూర్కే 2.2–0–31–1, దిగ్వేశ్ రాఠి 4–0–37–2, అవేశ్ ఖాన్ 3–0–25–0, రవి బిష్ణోయ్ 1–0–26–0, మార్క్రమ్ 1–0–14–0, శార్దుల్ 4–0–39–1. -
ఎస్ఆర్హెచ్ చేతిలో చిత్తు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంత్ టీమ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.అభిషేక్ శర్మ విధ్వంసం.. అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్ వికెట్ సాధించారు. -
దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రథీ మరోసారి తన సెలబ్రేషన్స్‌లో అతి చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 206 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ దూకుడుగా ఆడాడు.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ ఏకంగా నాలుగు సిక్స్‌లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అతడి దూకుడుకు కళ్లెం వేసేందుకు దిగ్వేష్ సింగ్‌ను లక్నో కెప్టెన్ ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే పంత్ నమ్మకాన్ని దిగ్వేష్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. ఈ క్రమంలో దిగ్వేష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. అభిషేక్ వైపు చూస్తూ కోపంగా ఇక ఆడింది చాలు తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో డగౌట్‌కు వెళ్లేందుకు సిద్దమైన అభిషేక్ మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేష్‌పై ఫైరయ్యాడు. అతడు కూడా అభిషేక్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే దిగ్వేష్ సింగ్‌పై బీసీసీఐ రెండు సార్లు కొరడా ఝళిపించింది. ఓసారి అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం, మరోసారి 50 శాతం కోత బీసీసీఐ విధించింది.Fight between Digvesh Rathi and Abhishek Sharma 😳 pic.twitter.com/8ngcvpnIVK— 𝑺𝒉𝒆𝒓𝒂 (@SheraVK18) May 19, 2025 -
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
టీమిండియా వెటరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా ( బంతులు పరంగా) 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా హర్షల్ నిలిచాడు. 2381 బంతుల్లో ఈ ఫీట్‌ను పటేల్ అందుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను పటేల్ నమోదు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(2444 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో హర్షల్ పటేల్(117) రెండో స్దానంలో నిలిచాడు. తొలి స్ధానంలో మలింగ(105) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో బంతులు పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..2381- హర్షల్ పటేల్2444- లసిత్ మలింగ2543- చాహల్2656- డ్వైన్ బ్రావో2832- జస్ప్రీత్ బుమ్రామ్యాచ్ల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..లసిత్ మలింగ- 105హర్షల్ పటేల్- 117యుజ్వేంద్ర చాహల్-118రషీద్ ఖాన్- 122జస్ప్రీత్ బుమ్రా- 124 -
IPL 2025: మళ్లీ అదే కథ.. తీరు మారని రిషబ్ పంత్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. 6 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ పేసర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. తన ధరకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.27 సగటుతో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు.ఈ క్రమంలో పంత్ చెత్త ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్ ఔటైన అనంతరం మ్యాచ్ వీక్షిస్తున్న లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.చదవండి: అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా -
అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు.అతడి విధ్వంసర ఇన్నింగ్స్ ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అతడితో పాటు గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్‌పై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు.సుదర్శన్ తన ప్రదర్శనలతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడని జడేజా కొనియాడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సుదర్శన్ 12 మ్యాచ్‌లు ఆడి 56.10 సగటుతో 617 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయిసుదర్శన్ వద్దే ఉంది."సాయి సుదర్శన్ అద్బుతమైన బ్యాటర్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. ఈ ఏడాది సీజన్లో సుదర్శన్ తన ప్రదర్శనలతో శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు మ్యాచ్‌లలో కూడా గిల్ కంటే మెరుగ్గా రాణించాడు.శుబ్మన్తో పోలిస్తే సుదర్శన్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో తొలుత గిల్ బంతిని టైమ్ చేయడానికి కాస్త కష్టపడ్డాడు. గిల్ బంతిని స్టాండ్స్‌కు తరలించేందుకు తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించాడు. కానీ సాయి విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడు చాలా సులువుగా షాట్లు ఆడాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు? -
IPL 2025: లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..
IPL 2025 LSG vs DC Live Updates:లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమించింది. 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 179/316 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్(35) రూపంలో సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. దిగ్వేష్ సింగ్ రాఠీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు సన్ రైజర్స్ స్కోర్: 117/2అభిషేక్ శర్మ ఫిప్టీలక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. అభిషేక్ 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న అభిషేక్, కిషన్..4 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ఇషాన్ కిషన్(11) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన ఆధర్వ తైడే.. విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోర్: 23/1చెలరేగిన లక్నో బ్యాటర్లు..ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.లక్నో మూడో వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన మార్క్రమ్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో.. 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.15 ఓవర్లకు లక్నో స్కోర్: 146/215 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(53), నికోలస్ పూరన్(16) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..రిషబ్ పంత్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పంత్.. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 12 ఓవర్లకు లక్నో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మారక్రమ్(49), రిషబ్ పంత్(7) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్మిచెల్ మార్ష్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన మార్ష్.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(2), మార్క్రమ్(48) ఉన్నారు.6 ఓవర్లకు లక్నో స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(26), మార్ష్(41) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న మార్ష్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(18), మార్క్రమ్(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ లక్నోకు చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ టీమ్ తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆరెంజ్ ఆర్మీ.. తమ ఆఖరి మ్యాచ్‌లలో గెలిచి పరువు నెలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కరోనా కారణంగా దూరమయ్యాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కేసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ -
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ఆర్జే మహ్వశ్!
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్వశ్ పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ ముద్దుగుమ్మకు టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్‌తో కనిపించడమే. వీరిద్దరు కలిసి దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఫోటోలు పెద్దఎత్తున వైరలయ్యాయి. ఆ తర్వాతే ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ మహ్వశ్ సందడి చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జే మహ్వశ్.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. అవీ తనను ఎలా ప్రభావితం చేశాయో వివరించింది. కొంతమంది ట్రోల్స్ కారణంగా ఇలాంటివీ జరుగుతూ ఉంటాయని తెలిపింది. కానీ అందులో ఎలాంటి నిజం లేకపోవడంతోనే వాటిని అంగీకరించలేకపోయానని పేర్కొంది. ఈ వ్యక్తులు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు.. నిజం తెలియనప్పుడు నా జీవితం పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? అని బాధపడ్డానని వెల్లడించింది. అందుకే సోషల్ మీడియాను వదిలేసి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆర్జే మహ్వశ్ తన బాధను పంచుకుంది. కానీ నాపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్ బాగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చెప్పేవన్నీ కల్పితాలేనని.. మా మధ్య అలాంటిదేమీ లేదని ఆర్జే మహ్వశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.కాగా.. ఆర్జే మహ్వశ్ ప్యార్ పైసా ప్రాఫిట్ అనే సిరీస్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్లో ప్రసారం అవుతోంది. ఈ షో ప్రీమియర్ అయినప్పుడు చాహల్ ఈ సిరీస్‌పై పోస్ట్ పెట్టారు. -
ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు?
ఐపీఎల్-2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ దారుణ ప్రదర్శన కరబరిచింది. అజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్.. అందరి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ టోర్నీలో వరుస ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో సైతం కేకేఆర్ చేతులేత్తేసింది. ముఖ్యంగా వేలంలో రూ.23.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వెంకటేశ్ అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 20.28 సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు.అయితే వేలంలో కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ సూచన మేరకే వెంకటేశ్ అయ్యర్‌పై ఫ్రాంచైజీ యాజమాన్యం అంత భారీ ధర వెచ్చించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చంద్రకాంత్ కేకేఆర్ మెనెజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సీజన్ తర్వాత ప్రధాన కోచ్‌గా అతడిపై వేటు వేయాలని కోల్‌కతా ఫ్రాంచైజీ భావిస్తోందంట. చంద్రకాంత్ పండిట్ స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం. ఇయాన్ మోర్గాన్‌తో కేకేఆర్‌కు మంచి అనుబంధం ఉంది. మోర్గాన్ కెప్టెన్‌గా 2021 సీజన్లో కేకేఆర్‌ను ఐపీఎల్ ఫైనల్స్‌కు చేర్చాడు.అయితే ఫైనల్లో మాత్రం సీఎస్కే చేతిలో నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. అదేవిధంగా మెంటార్‌గా ఉన్న డ్వైన్ బ్రావోను కూడా తొలిగించే యోచనలో కేకేఆర్ ఉన్నట్లు సమాచారం. నైట్‌రైడర్స్‌కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మే 25న ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా -
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించిన ఎస్ఆర్హెచ్.. కనీసం మిగిలిన మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌కు భారీ షాక్ తగిలింది. లక్నోతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. దీంతో లక్నో మ్యాచ్‌కు హెడ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ధ్రువీకరించాడు."ట్రావిస్ హెడ్‌కు దురదృష్టవశాత్తు కోవిడ్-19 సోకింది. దీంతో అతడు భారత్‌కు చేరుకోవడం కాస్త ఆలస్యం కానుంది. అతడు సోమవారం భారత్‌కు రాననున్నాడు. హెడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో లక్నోతో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. అతడు పూర్తిగా కోలుకుని తిరిగి మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని" ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో వెట్టోరీ పేర్కొన్నాడు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం పాటు వాయిదా పడిన విషయం విధితమే. ఈ క్రమంలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు హెడ్ తమ స్వదేశానికి వెళ్లిపోయారు. ఐపీఎల్ రీస్టార్ట్ కావడంతో కమ్మిన్స్ తిరిగి వచ్చినప్పటికి.. హెడ్ మాత్రం కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా జట్టులో చేరనున్నాడు.ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో, ఆ తర్వాత ఆర్సీబీ, కేకేఆర్‌తో మ్యాచులు ఆరెంజ్ ఆర్మీ ఆడనుంది.చదవండి: 'అవన్నీ రూమర్సే.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు': బీసీసీఐ -
'అవన్నీ రూమర్సే.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు': బీసీసీఐ
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌గా ఉండడంతో భారత క్రికెట్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు."ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ రెండు ఏసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇదే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిరాధరమైన వార్తలు. బీసీసీఐ ఇప్పటివరకు తదుపరి ఏసీసీ ఈవెంట్లకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదు. అదేవిధంగా ఏసీసీకి ఎటువంటి లేఖ కూడా బీసీసీఐ రాయలేదు.ప్రస్తుతం మా దృష్టింతా ఐపీఎల్, తదుపరి ఇంగ్లండ్ సిరీస్‌లపైనే మాత్రమే ఉంది. ఆసియా కప్ లేదా ఏదైనా ఇతర ఏసీసీ ఈవెంట్‌పైన ఎటువంటి నిర్ణయం తీసుకున్న భారత క్రికెట్ బోర్డు ప్రెస్‌నోట్ కచ్చితంగా విడుదల చేస్తోంది" అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కాగా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ వచ్చే నెలలో జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో పురుషుల ఆసియా కప్ టోర్నీని నిర్వహించనున్నారు. గత ఆసియాకప్ టోర్నీ శ్రీలంక, పాక్‌ల వేదికగా హైబ్రిడ్ మోడల్లో జరిగింది.చదవండి: IPL 2025: పాకిస్తాన్ సరసన గుజరాత్ టైటాన్స్ -
IPL 2025: పాకిస్తాన్ సరసన గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ జట్టు పొట్టి క్రికెట్లో ఓ అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన ఈ జట్టు.. పాకిస్తాన్ తర్వాత టీ20ల్లో 200, అంతకుమించిన లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన రెండో జట్టుగా నిలిచింది. యావత్ టీ20 ఫార్మాట్ చరిత్రలో ఈ రెండు జట్లే (పాకిస్తాన్, గుజరాత్) ఇప్పటివరకు 200, అంతకుమించిన లక్ష్యాలను వికెట్ కోల్పోకుండా ఛేదించాయి.2022లో పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో 200కు పైగా లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో నాటి పాక్ కెప్టెన్ అజేయమైన సెంచరీతో (66 బంతుల్లో 110) విధ్వంసం సృష్టించగా.. అతని పార్ట్నర్, ప్రస్తుత కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (51 బంతుల్లో 88 నాటౌట్) చెలరేగాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 5, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్‌లో గిల్-సాయి సుదర్శన్ నెలకొల్పిన 205 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్దైంది. ఈ సీజన్లో గిల్-సాయి జోడీ 839 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. లీగ్ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక పరుగులు జోడించిన భారత జోడీగా రికార్డుల్లోకెక్కింది. -
IPL 2025: కేఎల్ రాహుల్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో రాహుల్ పలు రికార్డులు సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్స్ సాయంతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!ఈ క్రమంలో రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్లో పంజాబ్ తరఫున 2, లక్నో తరఫున 2, ఇప్పుడు ఢిల్లీ తరఫున ఓ సెంచరీ (మొత్తం 5) చేసి ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. తాజా సెంచరీతో తన టీ20 సెంచరీల సంఖ్యను ఏడుకు పెంచుకున్న రాహుల్.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు:8 - విరాట్ కోహ్లీ7 - జోస్ బట్లర్6 - క్రిస్ గేల్5 - కేఎల్ రాహుల్*4 - శుభ్‌మన్ గిల్4 - షేన్ వాట్సన్4 - డేవిడ్ వార్నర్పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు:విరాట్ కోహ్లీ - 9రోహిత్ శర్మ - 8అభిషేక్ శర్మ - 7కేఎల్ రాహుల్ - 7*ఫాస్టెస్ట్ ఇండియన్‌గా..ఈ మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లికి ఈ మార్కు తాకేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్ తన 224వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్ (224), కోహ్లి (243), పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రికార్డు సెంచరీ చేసినా ఓడిన ఢిల్లీఈ మ్యాచ్‌లో రాహుల్ రికార్డు సెంచరీతో కదంతొక్కినా ఢిల్లీ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ఢిల్లీపై విజయంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు శుభవార్త.. సెంచరీల మోత మోగిస్తున్న యువ ఆల్‌రౌండర్
వచ్చే నెలలో (జూన్ 11) సౌతాఫ్రికాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా ఎనిమిది నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో గ్రీన్ రెండు సెంచరీలు (112, 128) చేశాడు. ఈ టోర్నీలో గ్లోసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న గ్రీన్ కెంట్ జట్టుపైనే రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రత్యర్థి సౌతాఫ్రికాకు గట్టి వార్నింగ్ మెసేజ్ పంపాడు. గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కొద్ది రోజుల కింద ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ నిమిత్తం గ్రీన్ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నాడు. అతనితో పాటు డబ్ల్యూటీసీ జట్టు సహచర సభ్యుడు మార్నస్ లబూషేన్ కూడా కౌంటీల్లో ఆడుతున్నాడు. అయితే గ్రీన్ తరహాలో లబూషేన్‌కు సత్ఫలితాలు రాలేదు. లబూషేన్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో 0, 4 పరుగులకు ఔటయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ అయిన లబూషేన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓపెనర్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రీన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జట్టులో ఆవకాశం కల్పించాలంటే లబూషేన్ ఓపెనర్‌గా ప్రమోట్ కాక తప్పదు. లబూషేన్.. వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజాతో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. గ్రీన్, వెబ్‌స్టర్ ఇద్దరికీ తుది జట్టులో ఛాన్స్ దొరుకుతుంది.ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన వెంటనే సౌతాఫ్రికా కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధిగా వ్యవహరించనుండగా.. ఏకంగా ఆరుగురు పేసర్లు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) ఎంపికయ్యారు.డబ్ల్యూటీసీ ఫైనల్-2025కి ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్. -
విరాట్ కోహ్లికి హగ్ ఇస్తా
యశవంతపుర(కర్ణాటక): బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ వీడియో కలకలం రేపింది. మ్యాచ్ జరిగే సమయం లో పిచ్‌లోకి చొరబడి విరాట్ కోహ్లికి హగ్ చేస్తానంటూ శరణ్ అనే వ్యక్తి ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశారు. అది వైరల్ అవు తుండగానే బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు శరణ్ అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్టాలో లైక్స్, వీవ్స్ కోసం ఈ విధంగా వ్యవహరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
IPL 2025: ఆర్సీబీ జట్టులోకి జింబాబ్వే ప్లేయర్.. అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.గుజరాత్, పంజాబ్ కూడా..!నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై విజయం సాధించడంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఎంగిడికి ప్రత్యామ్నాయంగా ముజరబానీవచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీతో భర్తీ చేసింది. ముజరబానీ.. ఆర్సీబీ లక్నోతో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ (సీఎస్కే) ఆడిన ఎంగిడి అందులో మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.🚨 BLESSING MUZARABANI WILL PLAY FOR RCB IN PLAYOFFS 🚨- He replaces Lungi Ngidi. pic.twitter.com/kzZ1rLrGgl— Johns. (@CricCrazyJohns) May 19, 2025ముజరబానీ విషయానికొస్తే.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన 28 ఏళ్ల ముజరబానీ.. జింబాబ్వే తరఫున 12 టెస్ట్‌లు, 55 వన్డేలు, 70 టీ20లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా ముజరబానీ టీ20ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అందుకే ఆర్సీబీ ఈ ఆఫ్రికా ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుంది. ముజరబానీ.. సికందర్ రజా తర్వాత ఐపీఎల్ ఆడనున్న రెండో జింబాబ్వే క్రికెటర్. -
IPL 2025: ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ.. యాదృచ్ఛికంగా..!
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరింది. నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైంది. ఢిల్లీపై గెలుపుతో గుజరాత్‌తో పాటు ఆర్సీబీ, పంజాబ్ ఒకేసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.పదోసారిఈ సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.యాదృచ్ఛికంగుజరాత్ ఢిల్లీపై గెలవడంతో అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్సీబీ.. యాదృచ్ఛికంగా గత సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన రోజునే (మే 18) ఈ సీజన్లోనూ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మ్యాచ్ ఆడకుండా, గెలవకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కావడంపై ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ.. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తుంది. హేమాహేమీ జట్లకు షాకిస్తూ తొలి టైటిల్ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆర్సీబీ సాధించిన విజయాలు రికార్డుల్లోకెక్కాయి. 17 ఏళ్ల తర్వాత సీఎస్కేను వారి సొంత మైదానంలో ఓడించిన ఆ జట్టు.. పదేళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో (వాంఖడే) మట్టికరిపించింది. ఇదే సీజన్లో కేకేఆర్‌ను కూడా వారి సొంత మైదానంలో (ఈడెన్ గార్డెన్స్) ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేను, ముంబై ఇండియన్స్‌ను, కేకేఆర్‌ను వారి సొంత మైదానాల్లో ఓడించిన రెండో జట్టుగా (ఒకే సీజన్లో) రికార్డుల్లోకెక్కింది.ఇదిలా ఉంటే, నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 5, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. -
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనకూడదని డిసైడ్ చేసుకుంది. ఏసీసీ ఆథ్వర్యంలో జరిగే ఈవెంట్లలో భారత క్రికెట్ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని స్పష్టం చేసింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్,ఆ తర్వాత సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగాల్సిన ద్వైవార్షిక పురుషుల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసింది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.కాగా, పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తూ, జోడు పదవులను అనుభవిస్తున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. రోస్టర్ విధానంలో ఏసీసీ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దఫా పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. అంతకుముందు ఏసీసీ చైర్మన్‌గా ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా ఉండేవాడు. షా.. ఐసీసీ పదవి చేపట్టాల్సి ఉండటంతో ఏసీసీ చైర్మన్‌గిరికి ముందుగానే రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే, భారత్ పురుషుల ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా పాక్ మంత్రి ఏసీసీ చైర్మన్‌గా ఉన్నందుకు బీసీసీఐ ససేమిరా అంటుంది. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనపోతే టోర్నీ జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. వీరు స్పాన్సర్షిప్కు ముందుకు రాకపోతే టోర్నీ జరుగదు.పెహల్గామ్ దాడితో మొదలు..ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. తదనంతరం పరిణామాల్లో భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్‌గా తయారయ్యాడు. ఇంకా ఫిట్‌గా, బెటర్ క్రికెటర్‌గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్ అంటున్నాడు.కొత్త లుక్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్ న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్ ఓవర్ వెయిట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్ వెయిట్) సర్ఫరాజ్‌ను టార్గెట్ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో జాయిన్ అయ్యాడు. న్యూట్రిషియన్‌ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్‌ను ప్రతి రోజు షెడ్యూల్ చేసుకున్నాడు.సర్ఫరాజ్‌తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్ లాస్ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్, అతని చిన్న సోదరుడు మొయిన్ ఖాన్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. సర్ఫరాజ్ రెండో సొదరుడు మునీర్ ఖాన్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్ వెయిట్ లాస్ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు.గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన హొం టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్‌ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఏ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే -
IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారధుల్లో ఒకడైన శ్రేయస్ అయ్యర్ మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంపై అమర్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన తొలి, ఏకైక కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రన్నరప్‌గా నిలబెట్టిన శ్రేయస్.. గత సీజన్లో (2024) కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ సీజన్లో పంజాబ్ ఫ్రాంచైజీ శ్రేయస్‌పై భారీ అంచనాలతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ధర (రూ. 26.75 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే శ్రేయస్ తన తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. నిన్న (మే 18) రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ జట్టు 11 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. చివరిగా 2014 సీజన్లో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇప్పుడు తిరిగి శ్రేయస్ నేతృత్వంలో మరోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. శ్రేయస్ తనుకు మాత్రమే సాధ్యమైన వైవిధ్యభరితమైన కెప్టెన్సీతో పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఈ సీజన్లో పంజాబ్ శ్రేయస్ నేతృత్వంలో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (ఓ మ్యాచ్ రద్దు) సాధించి 17 పాయింట్లతో (0.389) పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు పట్టికలో పంజాబ్ స్థానాన్ని డిసైడ్ చేస్తాయి. పంజాబ్ తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (మే 24), ముంబై ఇండియన్స్‌తో (మే 26) తలపడాల్సి ఉంది.కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్లో ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో లాగే రాజస్థాన్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచే స్థితిలో ఉండి ఓటమిపాలైంది. చివరి రెండు ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. 19 పరుగులకు మాత్రమే పరిమితమైంది.బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోర్ (219/5) చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టారు. ప్రభ్‌సిమ్రన్ (21), శ్రేయస్ అయ్యర్ (30), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ప్రియాంశ్ ఆర్య (9), మిచెల్ ఓవెన్ (0) విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2, మపాకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మధ్వాల్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. జన్సెన్, ఒమర్జాయ్ తలో రెండు వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బకొట్టడంలో తమవంతు పాత్ర పోషించారు. -
LSG Vs SRH: రైజర్స్ గాడిన పడేనా!
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో రైజర్స్ తలపడనుంది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్... మెరుగైన స్థానంతో ఈ సీజన్‌కు ముగింపు పలకాలని భావిస్తోంటే... పడుతూ లేస్తూ సాగుతున్న లక్నో జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. ఈ నేపథ్యంలో తెగించి పోరాడేందుకు రెడీ అవుతోంది. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో సారథి పంత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అనుకోని విరామం తర్వాతైనా పంత్ విజృంభిస్తాడా చూడాలి. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన లక్నో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. మరోవైపు ‘ఆరెంజ్ ఆర్మీ’ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 7 పాయింట్లతో ఉంది. బౌలింగ్ మెరుగైతేనే! తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేక పరాజయాలతో సహవాసం చేసింది. ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న కమిన్స్ బృందం... ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అయినా కాస్త మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. గతేడాది ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు గెలుచుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి పేలవ ప్రదర్శన చేస్తుంటే... తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత జట్టుకే భారంగా మారాడు. అభిషేక్ శర్మ అడపాదడపా మెరుపులు తప్ప నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... సీజన్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్ కోవిడ్–19 సోకడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అభిషేక్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా... సచిన్ బేబీకి తుది జట్టులో చోటు దక్కనుంది. మిడిలార్డర్లో క్లాసెన్, నితీశ్, అనికేత్, మెండిస్ కీలకం కానున్నారు. ఇక ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీతో పాటు కమిన్స్, ఉనాద్కట్ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరముంది. పంత్‌పైనే అందరి చూపు పది రోజుల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న లక్నో జట్టు పంత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పంత్... 12.8 సగటుతో 128 పరుగులు చేశాడు. కనీసం 100 బంతులు ఎదుర్కొన్న వారిలో పంత్‌దే అతితక్కువ సగటు, స్ట్రయిక్ రేట్. ఈ గణాంకాలు చాలు ఈ సీజన్లో పంత్ ఎంతలా తడబడుతున్నాడో అర్థం చేసుకునేందుకు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అయితే అబ్దుల్ సమద్, ఆయుశ్ బదోనీ తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్సీ రేసులో ముందు వరసలో ఉన్న పంత్ ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగుతాడా చూడాలి. మార్క్రమ్, మార్‡్ష, పూరన్, మిల్లర్ రూపంలో నలుగురు భీకర బ్యాటర్లు లక్నోకు అందుబాటులో ఉండగా... మిల్లర్ ఫామ్‌లేమీ మేనేజ్మెంట్ను ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌లో లక్నో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆరంభంలో మెరిపించిన శార్దుల్ ఠాకూర్ ప్రభావం చూపలేకపోతుండగా... మయాంక్ యాదవ్ గాయాలతో సతమతమవుతున్నాడు. విఘ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ కలసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్‡్ష, పూరన్, బదోని, మిల్లర్, సమద్, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, విగ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సచిన్ బేబీ, క్లాసెన్, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ఉనాద్కట్, హర్శల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ. -
IPL 2025: గుజరాత్ దర్జాగా...
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు... ఫోర్లు బాదేందుకు... సిక్సర్లు కొట్టేందుకు ఇలా ప్రతిదానికి ఆఖరుదాకా పోటీపడి మరీ సాధించడంతో కఠిన లక్ష్యం కూడా ఓ ఓవర్‌కు ముందే కరిగిపోయింది. అంత చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో కుంగిపోయింది. అంతేకాదు గుజరాత్ దర్జాగా సాధించిన విజయంతో తమతోపాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లింది. ఇక మిగిలింది ఒకే ఒక్క బెర్త్. దీని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కాచుకున్నాయి. మరి ఆఖరి బెర్త్ ఎవరిని వరిస్తుందో చూడాలి. న్యూఢిల్లీ: ఓపెనర్ల గర్జనతో గుజరాత్ టైటిల్స్ దర్జాగా ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సంపాదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఢిల్లీ బౌలింగ్‌ను దంచికొట్టారు. దీంతో టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అర్షద్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ అజేయంగా, ఆకాశమే హద్దుగా చెలరేగారు. నెల నిషేధం ముగియడంతో గుజరాత్ తరఫున రబడ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు. రాహుల్ 112 నాటౌట్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి ఆఖరుదాకా నడిపించింది... పరుగులు రాబట్టింది ఒకే ఒక్కడు రాహుల్. డుప్లెసిస్ (5)తో ఓపెనింగ్ వికెట్ ఎంతోసేపు నిలబడలేదు. ఆరంభంలో స్కోరులో ఏమాత్రం జోరు లేదు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 28/1. పవర్‌ప్లేలో కనీసం బంతికో పరుగైనా చేయలేదు. అయితే ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్స్‌లు, ఓ బౌండరీ బాదడంతో క్యాపిటల్స్ 45/1 స్కోరుతో కోలుకుంది. అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అడపాదడపా భారీషాట్లు బాదాడు. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రబడ 11వ ఓవర్లో పొరెల్, రాహుల్ చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో మరుసటి ఓవర్లోనే క్యాపిటల్స్ 100 మార్క్‌ను దాటింది. కానీ ఆఖరి బంతికి పొరెల్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెపె్టన్ అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాగా... రాహుల్ ధాటిని పెంచాడు. 14వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు కొట్టాడు. అక్షర్ కూడా 4, 6తో దంచేపనిలో పడ్డాడు కానీ మరుసటి ఓవర్లోనే ప్రసి«ద్కృష్ణకు వికెట్ సమరి్పంచుకున్నాడు. 19వ ఓవర్లో 6, 4 బాదిన రాహుల్ 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఆరంభం నుంచే ధనాధన్ తొలి ఓవర్లో సాయి సుదర్శన్ బౌండరీతో శుబ్‌మన్ సిక్స్‌తో తమ ఖాతా తెరవడం ద్వారా లక్ష్యానికి దీటైన ఆరంభమిచ్చారు. నటరాజన్ వేసిన రెండో ఓవర్‌ను సుదర్శన్ 6, 4, 4, 0, 2, 4లతో చితగ్గొట్టాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. అక్షర్ మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. టైటాన్స్ 6 ఓవర్లలో 59/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చక్కని సమన్వయంతో ఆడటంతో పరుగులకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలో మొదట సుదర్శన్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 93/0 స్కోరు చేసింది. ఇక మిగిలిన 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలోనూ ఓపెనింగ్ జోడీ పరుగుల పయనం సాఫీగా సాగిపోయింది. దీంతో ఓవర్లు గడిచేకొద్దీ ఢిల్లీ బౌలర్లు కాస్తా డీలా బౌలర్లుగా మారిపోయారు. 33 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తవగా జట్టు స్కోరు 15వ ఓవర్లో 150 దాటింది. ఇక 30 బంతుల్లో 46 పరుగుల సమీకరణంతోనే... చేతిలో పది వికెట్లున్న టైటాన్స్ చేతుల్లోకే మ్యాచ్ వచ్చేసింది. ఈ లాంఛనాన్ని మరో బ్యాటర్‌కు ఇవ్వకుండా ఓపెనర్లే పూర్తి చేశారు. భారీ సిక్సర్‌తో సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ సాధించగా, చూడచక్కని బౌండరీలతో గిల్ కూడా శతకానికి చేరువయ్యాడు. కానీ ఈ లోపే 200 పరుగుల పెద్ద లక్ష్యం 19వ ఓవర్లోనే దిగిరావడంతో అతని సెంచరీకి అవకాశం లేకుండాపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిషోర్ 30; అక్షర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ కృష్ణ 25; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–16, 2–106, 3–151. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 2–0–7–1, రబడా 2–0–34–0, ప్రసిద్‌కృష్ణ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–32–0, సాయికిషోర్ 4–0–47–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (నాటౌట్) 108; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 93; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205. బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–35–0, నటరాజన్ 3–0–49–0, ముస్తాఫిజుర్ 3–0–24–0, చమీర 2–0–22–0, విప్రాజ్ 4–0–37–0, కుల్దీప్ 4–0–37–0. -
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్‌మైర్ (బి) తుషార్ 9; ప్రభ్‌సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్‌మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్‌ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్‌ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్‌ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్‌మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2. -
IPL 2025: ఢిల్లీపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. దీంతో తమ ఫ్లే ఆఫ్స్ బెర్త్‌ను గుజరాత్ టీమ్ ఖారారు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్(18 పాయింట్లు) అగ్రస్ధానంలో కొనసాగుతోంది. గుజరాత్ విజయంతో ఆర్సీబీ(17 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) సైతం ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాయి. మరో స్ధానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడుతున్నాయి.ఓపెనర్ల విధ్వంసం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలోనే ఊదిపడేసింది. గుజరాత్ ఓపెనర్లే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. సాయిసుదర్శన్(58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఒక్కరూ కనీసం వికెట్ సాధించలేకపోయారు.రాహుల్ సెంచరీ వృథా..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు. -
ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్‌షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్‌కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ -
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్.. ఐదు ఓవర్ల తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.శుబ్‌మన్ గిల్‌ను దాటేసిన రాహుల్..ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లను రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన లిస్ట్‌లో రాహుల్(5) నాలుగో స్దానంలో నిలిచాడు. అగ్రస్ధానంలో విరాట్ కోహ్లి(8) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..8: విరాట్ కోహ్లీ7: జోస్ బట్లర్6: క్రిస్ గేల్5: కెఎల్ రాహుల్4: శుభ్‌మన్ గిల్4: షేన్ వాట్సన్4: డేవిడ్ వార్నర్ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్ -
రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.వధేరా, శశాంక్ మెరుపులుఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.ఆరంభం వచ్చినా..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. లక్ష్య చేధనలో రాజస్తాన్ ఓపెనర్లు(50), వైభవ్ సూర్యవంశీ(40) అద్బుతమైన ఆరంభం ఆందించారు.తొలి వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధ్రువ్‌జురెల్(53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
ఓపెనర్లే కొట్టేశారు.. ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
IPL 2025 DC vs GT Live Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.ప్లే ఆఫ్స్‌కు గుజరాత్..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61 బంతుల్లో 108) సూపర్ సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.విజయం దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 165 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(87), శుబ్‌మన్ గిల్(74) ఉన్నారు.శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..200 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ అద్బుతంగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(59), సాయిసుదర్శన్(72) హాఫ్ సెంచరీలతో తమ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు.7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 63/07 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(46), శుబ్‌మన్ గిల్(17) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(25), శుబ్‌మన్ గిల్(6) ఉన్నారు.కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యంఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన పోరెల్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేఎల్ రాహుల్ ఫిప్టీ..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 పరుగులతో రాహుల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 44/16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(36), అభిషేక్ పోరెల్(1) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డుప్లెసిస్.. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 14పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(9), ఫాఫ్ డుప్లెసిస్(3) ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్ , అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్ -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ముంబై రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. రాజస్తాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అత్యధిక ఐపీఎల్ స్కోర్ సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ఈ వేదికపై గతంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబై రికార్డును శ్రేయస్ సేన బ్రేక్ చేసింది.అదేవిధంగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు మొత్తం కలిపి అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు కలిపి మొత్తంగా 180 పరుగులు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్(174) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ముంబైని పంజాబ్ అధిగమించింది.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'
క్రికెటర్ల ఫ్యాన్ బేస్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనికి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారని, మిగతా క్రికెటర్లందరికి ఉన్నది పెయిడ్ ఫ్యాన్సేనని భజ్జీ వివాదస్పద కామెంట్స్ చేశాడు.ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2025 తర్వాత ధోనికి రిటైర్ అయ్యే ఆలోచన లేదని ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యానికి తెలియజేశాడని శనివారం వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే హర్భజన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు."ఎంఎస్ ధోని తను ఎప్పటివరకు ఆడాలనుకుంటే అప్పటి వరకు ఐపీఎల్లో కొనసాగుతాడు. ఒకవేళ సీఎస్కే యాజమాని నేనే అయితే ధోని విషయంలో వేరే నిర్ణయం తీసుకునేవాడిని. నా వరకు అయితే.. ధోనికి ఒక్కడికే అసలైన అభిమానులు ఉన్నారు. మిగిలిన క్రికెటర్లందరికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. అందులో కూడా కొంతమంది పెయిడ్ ఫ్యాన్సే. వారి గురించి మాట్లాడటం అనవసరం. అటువంటి వారి మాట్లాడితే ఈ చర్చ పక్కదారి పడుతుంది" అని హార్భజన్ క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు.ఈ క్రమంలో హార్భజన్ అనుచిత వ్యాఖ్యలపై విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోనిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఎంఎస్ ధోని దేశద్రోహి అంటూ ఎక్స్‌లో ప్రచారం చేస్తున్నారు. "SHAME ON DESHDROHI DHONI" అనే కీవర్డ్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది.చదవండి: IPL 2025: అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డకౌట్ -
వధేరా, శశాంక్ మెరుపులు.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య(9) వికెట్ కోల్పోయినప్పటికి.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక మిచెల్ ఓవెన్ తప్ప మిగితా అందరూ తమ పని తాము చేసుకుపోయారు.పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్ -
అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డకౌట్
ఆస్ట్రేలియా యవ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఓవెన్ అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో మిచెల్ తీవ్ర నిరాశపరిచాడు.కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఖాతా తెరవకుండానే మిచెల్ పెవిలియన్‌కు చేరాడు. రాజస్తాన్ యువ పేసర్ క్వేనా మఫాకా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్‌కు చేరాడు. కాగా మరో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్ధానంలో పంజాబ్ జట్టులోకి ఓవెన్ వచ్చాడు.ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు మాక్సీ గాయం కారణంగా దూరం కావడంతో.. మిచెల్ ఓవెన్ రూ.3 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. పంజాబ్ ఈ యువ ఆటగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఓవెన్ మాత్రం తన మొదటి మ్యాచ్‌లోనే తుస్సుమన్పించాడు.అంతకంటే ముందు మాక్స్వెల్ సైతం ఇదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు మాక్సీ స్థానంలో వచ్చిన ఓవెన్ కూడా అదే తీరును కనబరిస్తున్నాడు. అరంగేట్రంలోనే డౌకటైన ఓవెన్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. మరో మాక్స్వెల్ జట్టులోకి వచ్చాడని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఓవెన్‌కు మాత్రం టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది.ఈ టాస్మానియా ఆల్‌రౌండర్ ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఓవెన్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. పంజాబ్ జట్టులో చేరకముందు ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ నుంచి ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే అతడు వైదొలిగాడు.Kwena Maphaka gets Mitchell Owen 0(2). ☝️Not a good start for Owen in the IPL. pic.twitter.com/XJtfKQtJpf— Rishabh Singh Parmar (@irishabhparmar) May 18, 2025 -
IPL 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. తుది జట్లు ఇవే..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 18) మధ్యాహ్నం సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో (జైపూర్) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా శాంసన్ గత కొన్ని మ్యాచ్‌లుగా దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ నితీశ్ రాణా స్థానంలో సంజూ శాంసన్.. జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్వేనా మపాకా తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మూడు మార్పులు చేసింది. మిచెల్ ఓవెన్, మార్కో జన్సెన్, ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఆ జట్టుకు నామమాత్రమే. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉంది. ఆ జట్లు ఈ మ్యాచ్ గెలిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్తుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్ -
IPL 2025: ప్రమాదంలో విరాట్ పేరిట ఉన్న భారీ రికార్డు
ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత ఇవాళ (మే 18) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో రికార్డుల రారాజు, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ టీ20 రికార్డు బద్దలయ్యే ప్రమాదముంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 33 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా విరాట్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. విరాట్‌కు ఈ ఘనత సాధించేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్‌కు 214వ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ వచ్చింది. నేటి మ్యాచ్‌లో రాహుల్ 8000 పరుగులు పూర్తి చేస్తే, విరాట్ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా సొంతమవుతుంది. యావత్ టీ20ల్లో అతి తక్కువ 8000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఘనత విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 213 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..క్రిస్ గేల్- 213 ఇన్నింగ్స్లుబాబర్ ఆజమ్- 218 ఇన్నింగ్స్లుకాగా, ఈ సీజన్లో రాహుల్ వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పటికీ పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో రాహుల్ ఓసారి ఓపెనింగ్, రెండు మ్యాచ్‌ల్లో మూడో స్థానం, ఏడు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 47.63 సగటున, 142.63 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రాహుల్ 10వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే నేడు గుజరాత్‌తో జరుగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (ఓ మ్యాచ్ రద్దైంది) 13 పాయింట్లు సాధించిన ఢిల్లీ పట్టికలో ఐదు స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం రెండు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇవాళ గుజరాత్‌ను ఢీకొట్టబోయే ఢిల్లీ.. ఆతర్వాతి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 21), పంజాబ్ కింగ్స్‌తో (మే 24) తలపడాల్సి ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ రేసులో ఉండే ఢిల్లీ.. తదుపరి ముంబై, పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. -
IPL 2025 Update: ఆ విండీస్ బ్యాటర్‌కు ప్రత్యామ్నాయంగా సన్‌రైజర్స్ బౌలర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ ప్రస్తానాన్ని ముగించిన డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తాజాగా ఓ అప్డేట్తో ముందుకొచ్చింది. లీగ్ పునఃప్రారంభం తర్వాత తిరిగి రాని విండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్‌కు (గాయం) ప్రత్యామ్నాయంగా మధ్యప్రదేశ్ మిస్టరీ స్పిన్నర్ శివమ్ శుక్లాను ఎంపిక చేసుకుంది. శుక్లా ఈ సీజన్లో కేకేఆర్ ఆడబోయే చివరి మ్యాచ్‌కు (మే 25న సన్‌రైజర్స్‌తో) అందుబాటులో ఉంటాడు. 29 ఏళ్ల శివమ్ శక్లా ఈ సీజన్లో సన్‌రైజర్స్ నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. 🚨 The mystery spinner from MP is a Knight now! Shivam Shukla replaces Rovman Powell for the remainder of the #TATAIPL2025 pic.twitter.com/usUoOnFzLG— KolkataKnightRiders (@KKRiders) May 18, 2025అక్కడ అతను ముత్తయ్య మురళీథరన్ ఆథ్వర్యంలో రాటు దేలాడు. కేకేఆర్.. సన్‌రైజర్స్‌తో ఆడబోయే తమ చివరి మ్యాచ్ కోసం వారి అస్త్రాన్నే (శివమ్ శుక్లా) ప్రయోగించనుంది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ అయిన శుక్లా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. శుక్లా సన్‌రైజర్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో అభిషేక్ శర్మ వికెట్ తీసి ప్రాచుర్యంలోకి వచ్చాడు. తదుపరి సీజన్ దృష్ట్యా కేకేఆర్ శుక్లాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.Shivam Shukla the mystery spinner who plays for MP in domestic under Rajat’s Captaincy. SRH picked him as Net bowler as he took Abhishek’s wicket in 1st over in practice game.Kudos to RCB’s scouting 🙏 https://t.co/artzL8rOPP pic.twitter.com/0l2hBdqUaR— Fearless🦁 (@ViratTheLegend) March 19, 2025ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 పునఃప్రారంభం తర్వాత నిన్న (మే 17) జరగాల్సిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించగా.. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆరు జట్లు (ఆర్సీబీ (17), గుజరాత్ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13), లక్నో (10)) మాత్రమే మిగిలాయి. సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఇవాల్టి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఆదివారం (మే 18) ఐపీఎల్ 2025లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సువాయ్ మాన్సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్, పంజాబ్ తలపడనున్నాయి. రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
42 ఏళ్ల వయసులోనూ ఇరగదీసిన ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం.. వైరల్ వీడియో
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మరోసారి నిరూపించాడు. 42 ఏళ్ల వయసులోనూ కౌంటీ మ్యాచ్ ఆడుతూ ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో భాగంగా లాంకాషైర్‌కు ఆడుతున్న ఆండర్సన్.. డెర్బిషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 2 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ వికెట్ (కాలెబ్ జువెల్) మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆండర్సన్ సంధించిన ఇన్ స్వింగింగ్ బంతికి వికెట్లు గాల్లోకి లేచాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. జిమ్మీ లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడని క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు.43 YEAR OLD JIMMY ANDERSON FOR LANCASHIRE. 🤯pic.twitter.com/w5AwHTndmv— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2025గతేడాది జులైలో అంతర్జాతీయ క్రికెట్‌కు (టెస్ట్‌లకు) రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. ఆతర్వాత కొద్ది రోజులు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. ఆతర్వాత 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆండర్సన్ ప్రస్తుతం లాంకాషైర్ తరఫున టీ20, సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగుతున్నాడు. అతను ఇంగ్లండ్ దేశవాలీ టీ20 లీగ్ టీ20 బ్లాస్ట్‌లోనూ ఆడనున్నాడు. గత నెలలో కాలి మడమ సమస్యతో బాధపడిన ఆండర్సన్ నెల రోజుల్లోనే కోలుకుని రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే రెండు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా రిటైరయ్యాడు. 188 మ్యాచ్‌ల్లో అతను 704 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులకు ఆలౌటైంది. వెల్స్ (141) సెంచరీతో కదంతొక్కగా.. మాథ్యూ హర్ట్స్ (51), జార్జ్ బెల్ (57), బాల్డర్సన్ (73) అర్ద సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బిషైర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇందులో ఆండర్సన్ 2 వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ, వెల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
విరాట్ కోహ్లికి "భారతరత్న" అవార్డు..?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి "భారతరత్న" అవార్డు ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా భారత ప్రభుత్వాన్ని కోరాడు. భారత క్రికెట్‌కు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా విరాట్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని విజ్ఞప్తి చేశాడు. విశ్వ వేదికపై విరాట్ ఎన్నో అసాధారణ ఘనతలు సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశాడని అన్నాడు. భారతరత్న అవార్డుకు విరాట్ అన్ని విధాల అర్హుడని అభిప్రాయపడ్డాడు.ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఏర్పాటు చేయండి..!కొద్ది రోజుల కిందట టెస్ట్ క్రికెట్‌కు అనూహ్య రీతిలో వీడ్కోలు పలికిన విరాట్‌కు తన సొంత మైదానమైన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని రైనా డిమాండ్ చేశాడు. ఆ మ్యాచ్‌కు విరాట్ కుటుంబ సభ్యులు, అతని చిన్ననాటి కోచ్‌లను ఆహ్వానించాలని బీసీసీఐని కోరాడు. భారత క్రికెట్‌కు ఎంతో చేసిన విరాట్‌కు సకల మర్యాదలతో వీడ్కలు పలకాలని విజ్ఞప్తి చేశాడు.కాగా, విరాట్ కోహ్లి ఈ నెల 12వ తేదీన ఎవరూ ఊహించని రీతిలో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు తన పేరును పరిశీలిస్తున్న వేల విరాట్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విరాట్ అప్పుడే రిటైరయ్యాడేంటని భారత క్రికెట్ అభిమానులు తెగ బాధపడ్డారు. 36 ఏళ్ల విరాట్ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడి 46.9 సగటున 30సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. విరాట్.. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు చరిత్రలో నిలిచిపోయాడు. విరాట్.. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 విజయాలు సాధించింది. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ప్రస్తుతానికి సచిన్ ఒక్కడికే..!ప్రస్తుతానికి భారతరత్న అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత భారత ప్రభుత్వం అతన్ని భారతరత్న అవార్డుతో సత్కరించింది. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి 34,357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు ఉన్నాయి. సెంచరీల సెంచరీ ఘనత భూగ్రహం మీద మరే ఇతర క్రికెటర్ సాధించలేదు.భారతరత్న ఎవరికి ఇస్తారు..?భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు సాహిత్యం, విజ్ఞానం, కళలు, ప్రజా సేవ, క్రీడలు వంటి రంగాలలో విశేష సేవలు చేసిన వారికి అందించబడుతుంది. భారత రాష్ట్రపతి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. -
IPL 2025: ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు.. రికార్డుల్లోకెక్కిన బెంగళూరు స్టేడియం
ఐపీఎల్ 2025 పునఃప్రారంభంలో జరగాల్సిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ (మే 17) వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి భారీ కురుస్తుండటంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. రాత్రి 10:30 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించగా.. ఆర్సీబీ టేబుల్ టాపర్‌గా, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. కేకేఆర్ నిష్క్రమణతో ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆరు జట్లు (ఆర్సీబీ (17), గుజరాత్ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13), లక్నో (10)) మాత్రమే మిగిలాయి. సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన జట్లు.ఆర్సీబీ-కేకేఆర్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు రద్దైన స్టేడియంగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి (ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌తో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో ఇన్ని మ్యాచ్‌లు ఏ వేదికపై రద్దు కాలేదు.ఐపీఎల్లో మ్యాచ్‌లు రద్దైన స్టేడియాలు (టాప్-5) చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)-5అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)- 1ఎకానా స్టేడియం (లక్నో)- 1బర్సపరా స్టేడియం (గౌహతి)- 1ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)- 1రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)- 1ఇవాల్టి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఆదివారం (మే 18) ఐపీఎల్ 2025లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సువాయ్ మాన్సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్, పంజాబ్ తలపడనున్నాయి. రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
పరాయి దేశానికి ఆడుతూ సెంచరీల మోత మోగించిన భారత బ్యాటర్లు
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 2023-27లో భాగంగా నిన్న (మే 17) కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో యూఎస్ఏ ప్రాతినిథ్యం వహిస్తున్న భారత క్రికెటర్లు స్మిట్ పటేల్, మిలింద్ కుమార్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. ఓపెనర్ స్మిట్ పటేల్ (137 బంతుల్లో 152 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), ఐదో నంబర్ ఆటగాడు మిలింగ్ కుమార్ (67 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు అజేయ సెంచరీలతో శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 361 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా.. సంజయ్ కృష్ణమూర్తి (3.2-0-10-3), కెంజిగే (10-0-41-2), మిలింద్ కుమార్ (9-0-40-2), హర్మీత్ సింగ్ (10-1-38-2), జస్దీప్ సింగ్ (7-0-35-1) సత్తా చాటడంతో 46.2 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఎస్ఏ 169 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో మిలింద్, స్మిట్ పటేల్ రికార్డు సెంచరీలతో కదంతొక్కడంతో యూఎస్ఏ వన్డేల్లో తమ అత్యధిక స్కోర్‌ను (361) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మిలింద్.. వన్డేల్లో యూఎస్ఏ తరఫున వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో మిలింద్ టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ బ్యాటర్‌గా సెహ్వాగ్ సరసన నిలిచాడు. సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ ప్లేయర్ రికార్డు విరాట్ కోహ్లి (52 బంతులు) పేరిట ఉంది.ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 44 బంతులు తీసుకున్న మిలింద్.. ఆతర్వాత హాఫ్ సెంచరీని కేవలం 16 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మిలింద్ ఓ ఓవర్లో (48వ ఓవర్లో) 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 30 పరుగులు పిండుకున్నాడు. స్మిట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో అతను చేసిన అజేయమైన 152 పరుగుల స్కోర్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 చరిత్రలోనే రెండో అత్యుత్తమం. -
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఏఈలో పర్యటిస్త్ను బంగ్లాదేశ్ విజయంతో బోణీ కొట్టింది. నిన్న (మే 17) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఆతిథ్య జట్టును 27 పరుగుల తేడాతో ఓడించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన యూఏఈ 164 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.ఎమోన్ విధ్వంసకర శతకంఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. మిగతా ఎనిమిది మంది బంగ్లా బ్యాటర్లు కలిపి 66 బంతుల్లో 70 పరుగులు మాత్రమే చేశారు. యూఏఈ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 21 పరుగులిచ్చారు.రికార్డు శతకంఎమోన్ విధ్వంసకర సెంచరీ సాధించిన క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో తమీమ్ ఇక్బాల్ (2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్‌పై) తర్వాత బంగ్లా తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఎమోన్ చేసిన సెంచరీ (53 బంతుల్లో) టీ20ల్లో బంగ్లా తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. తమీమ్ ఒమన్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు.తమీమ్ 27 ఏళ్ల వయసులో సెంచరీ చేయగా.. ఎమోన్ 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా బంగ్లా తరఫున అతి చిన్న వయసులో టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఎమోన్ కొట్టిన 9 సిక్సర్లు టీ20ల్లో ఆ జట్టు తరఫున (ఓ మ్యాచ్‌లో) అత్యధికం. గతంలో ఈ రికార్డు రిషద్ హొస్సేన్ (2024లో శ్రీలంకపై 7 సిక్సర్లు) పేరిట ఉండేది.సత్తా చాటిన బౌలర్లు192 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్లు తంజిమ్ (4-0-22-2), మెహిది హసన్ (4-0-55-2), హసన్ మహమూద్ (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-17-2), తన్వీర్ ఇస్లాం (4-0-30-1) సత్తా చాటడంతో 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున కెప్టెన్ ముహమ్మద్ వసీం (54), ఆసిఫ్ ఖాన్ (42), రాహుల్ చోప్రా (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 19న షార్జా వేదికగా జరుగనుంది. -
‘మరింత మంది కోహ్లిలు వస్తారు’
హైదరాబాద్: భారత క్రికెట్లో విరాట్ కోహ్లిది ఒక ప్రత్యేక అధ్యాయమని, అతని బాటలో మరెంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోహ్లి అద్భుతమైన ఆటగాడు. అతని కవర్‌డ్రైవ్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇకపై టెస్టుల్లో అలాంటివి చూడలేము. బౌలర్ల తల మీదుగా అతను ఆడే స్ట్రెయిట్ షాట్ కూడా నాకు చాలా నచ్చుతుంది. అయితే మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు.ఎంతో మంది కోహ్లిలు ఉన్నారు. వారంతా మున్ముందు వెలుగులోకి వచ్చి దేశానికి ఆడతారు’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థిగా ఉన్నప్పుడు మీడియం పేసర్‌గా సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ అండర్–25 టోర్నీలో ఆడిన ఒవైసీ... జాతీయ స్థాయి యూనివర్సిటీ వన్డే టోర్నీ విజ్జీ ట్రోఫీలో కూడా ఓయూకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో క్రికెట్ కెరీర్ ముగిసింది. భారత క్రికెట్లో ఇప్పుడు గొప్ప దశ నడుస్తోందని, ప్రతిభ ఉంటే చాలు ఏ స్థాయికైనా చేరవచ్చని హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చూపించాడని ఒవైసీ అన్నారు. ‘పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన సిరాజ్ తన కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరాడు. టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకోగలిగిన అతనిది గొప్ప ప్రస్థానం. ఎందరికో స్ఫూర్తిదాయకం. సిరాజ్ భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలి’ అని ఒవైసీ ఆకాంక్షించారు. -
నిధి నాయకత్వంలో...
బెంగళూరు: ఈ ఏడాది డిసెంబర్లో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఈ నెలలో నాలుగు దేశాల టోర్నీలో పోటీపడనుంది. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో ఈనెల 25 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో ఆడనున్న భారత జట్టును శనివారం హాకీ ఇండియా ప్రకటించింది. 24 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు గోల్‌కీపర్ నిధి నాయకత్వం వహిస్తుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను మే 25న చిలీతో ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా ఉరుగ్వేతో (మే 26న), అర్జెంటీనాతో (మే 28న), చిలీతో (మే 30న), ఉరుగ్వేతో (జూన్ 1న), అర్జెంటీనాతో (జూన్ 2న) తలపడతుంది. ‘ఈ టోర్నీ ద్వారా మా అత్యుత్తమ క్రీడాకారిణులు ఎవరో గుర్తిస్తాము. మరో ఆరు నెలల్లో జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. తాజా టోర్నీ మన అమ్మాయలకు అంతర్జాతీయ అనుభవం కలిపిస్తుంది’ అని భారత జూనియర్ జట్టు కోచ్ తుషార్ ఖాండ్కర్ తెలిపారు. భారత జూనియర్ మహిళల హాకీ జట్టు: నిధి (కెప్టెన్, గోల్‌కీపర్), ఏంజిల్ హర్షరాణి మింజ్ (గోల్‌కీపర్), మమితా ఓరమ్, లాల్తట్లుయాంగి, మనీషా, పూజా సాహూ, పార్వతి టొప్నో, నందిని, సాక్షి శుక్లా (డిఫెండర్లు), ప్రియాంక యాదవ్, అనీషా సాహూ, రజని కెర్కెట్టా, బినిమా ధన్, ఖైడెమ్ షిలీమా చాను, సంజన హోరో, సుప్రియా కుజుర్, ప్రియాంక డోగ్రా (మిడ్ ఫీల్డర్లు), హీనా బానో, సోనమ్, సుఖ్వీర్ కౌర్, గీతా యాదవ్, లాల్రిన్పుయ్, కనిక సివాచ్, కర్మన్ప్రీత్ కౌర్ (ఫార్వర్డ్లు). స్టాండ్‌బై: విద్యశ్రీ, హుదా ఖాన్, ముని్మని దాస్, సెలెస్టినా హోరో. -
విజేత ప్రజ్ఞానంద
బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా నిర్వహించిన సూపర్‌బెట్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చాంపియన్‌గా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిర్ణిత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద, మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. అలీరెజాతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. లాగ్రెవ్పై గెలిచి 1.5 పాయింట్లతో టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. విజేత ప్రజ్ఞానందకు 77,667 డాలర్లు (రూ. 66 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్ కోలుకునేనా!
న్యూఢిల్లీ: ఐపీఎల్–2025ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ప్రారంభించింది. తొలి 4 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి జోరు ప్రదర్శించింది. అయితే తర్వాత జట్టు ఫామ్ ఒక్కసారిగా తిరోగమించింది. తర్వాత 7 మ్యాచ్‌లలో ఢిల్లీ కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. హైదరాబాద్‌లో జరిగిన తమ చివరి పోరులో కూడా క్యాపిటల్స్ 133 పరుగులకే పరిమితమై ఓటమికి బాటలు వేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ వర్షంతో ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌లలో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ‘ప్లే ఆఫ్స్’కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నిలకడకు మారుపేరులా ఆడుతూ ముందంజ వేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న ఆ టీమ్ మరో మ్యాచ్ గెలిస్తే చాలు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లోనే దానిని అందుకోవాలని గిల్ బృందం భావిస్తోంది. ముస్తఫిజుర్ దూరం... ఐపీఎల్ కొత్త షెడ్యూల్ కారణంగా ఢిల్లీ ప్రణాళికలు కూడా మారాయి. కీలక సమయంలో జట్టును గెలిపించే సత్తా ఉన్న ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఆ్రస్టేలియాకు వెళ్లిపోయాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్‌ను ఢిల్లీ ఎంచుకుంది. అయితే శనివారం షార్జాలో టి20 మ్యాచ్ ఆడిన అతను తిరిగి వచ్చి ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం లేదు. దాంతో తుది జట్టులో ముగ్గురు విదేశీయులే ఉండనున్నారు. డుప్లెసిస్, స్టబ్స్ పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా, పేసర్ చమీరా కూడా ఆడనున్నాడు. అయితే జట్టు విజయావకాశాలు భారత ఆటగాళ్లు పొరేల్, కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ అక్షర్ ప్రదర్శనపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. విప్రాజ్, అశుతోష్ మిడిలార్డ్‌లో చెలరేగాల్సి ఉండగా... కుల్దీప్ యాదవ్ ఎప్పటిలాగే తన పదును చూపిస్తే ప్రత్యర్థిని కట్టిపడేయవచ్చు. మార్పుల్లేకుండా... టోర్నీ వాయిదా తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాదాపు అదే ప్రధాన ఆటగాళ్లతో జట్టును సిద్ధం చేసుకోవడంలో గుజరాత్ సఫలం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే ముందంజ వేసే టీమ్ మరో రెండు కూడా నెగ్గి టాప్ స్థానంపై గురి పెట్టింది. లీగ్ దశ వరకు బట్లర్, రూథర్‌ఫర్డ్, రబడ, కొయెట్జీ అందుబాటులో ఉంటుండటంతో టైటాన్స్ మేనేజ్మెంట్ ధీమాగా ఉంది. ఓపెనర్లు గిల్, సుదర్శన్ అందిస్తున్న చక్కటి ఆరంభాలు జట్టును ముందంజలో నిలిపాయి. ఆ తర్వాత బట్లర్ మిగిలిన పని పూర్తి చేస్తున్నాడు. సీజన్లో 500 పరుగులు దాటిన టాప్–5లో ముగ్గురు టైటాన్స్ సుదర్శన్, గిల్, బట్లర్ ఉండటం విశేషం. షారుఖ్, తెవాటియా చివర్లో అదనపు పరుగులు జోడించగలరు. ముగ్గురు పేసర్లు ప్రసిధ్, సిరాజ్, అర్షద్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తుండగా... స్పిన్నర్లు సాయికిషోర్, రషీద్ ఖాన్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బలాబలాలపరంగా చూస్తే టైటాన్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది. -
‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్‌లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్‌లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్‌వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్‌ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్‌లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్‌కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లే గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్‌మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి. -
ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్
ఐపీఎల్-2025 పున ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిలవాలంటే ఆర్సీబీపై కచ్చితంగా గెలవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోల్‌కతా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఆర్సీబీ 17 పాయింట్లతో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగళూరు జట్టు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో గెలిచినా చాలు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్తే భారత్‌కు వస్తా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. గత రెండు మూడు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అందరి అంచనాలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, పాటిదార్ చెలరేగుతుంటే.. బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఫ్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఫైనల్స్‌కు చేరుకుంటే తను ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు భారత్‌కు వస్తానని డివిలియర్స్ వాగ్ధానం చేశాడు."ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో కచ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మరొకటి ఉండదు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది" అంటూ డివిలియర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.చదవండి: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్ -
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి.. బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్సీ రేసులో గిల్‌తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రయాన్ని వెల్లడించాడు. వీరి ముగ్గురిలో శుబ్‌మన్ గిల్‌కే గవాస్కర్ ఓటేశాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. అదే రోజున కొత్త టెస్టు కెప్టెన్ పేరును బీసీసీఐ వెల్లడించనుంది."ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా మన సూపర్ లీడర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ధాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండేళ్లు పడుతోంది. ఈ ముగ్గురు టెస్టు కెప్టెన్సీకి సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులైన గిల్, అయ్యర్, పంత్‌లను చూస్తుంటే, నాకు ధోని, రోహిత్, విరాట్ గుర్తుస్తున్నారు. బహుశా అయ్యర్, పంత్ కంటే గిల్‌కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా న్నాయి. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్? -
ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి శనివారం నుంచి ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ సీజన్ రీ స్టార్ట్ కానుంది. అయితే ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడడంతో ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లలో కొంత మంది తిరిగి భారత్‌కు రావడానికి నిరాకరించారు. కొంతమంది జాతీయ విధుల కారణంగా దూరంగా ఉంటే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్లో పాల్గోనేందుకు తిరిగి రాలేదు.సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు భారత్‌కు వచ్చినప్పటికి ప్లే ఆఫ్స్‌కు మాత్రం అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆ వీడియోలో ఏముందంటే?ఐపీఎల్-2025 సెకెండ్ లెగ్ కోసం జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, జోష్ హేజిల్‌వుడ్, మార్కో జాన్సెన్ వంటి ఆటగాళ్లు తిరిగి వస్తారా? లేదా అని ఇద్దరు వ్యక్తులు సీరియస్‌గా చర్చించుకుంటారు. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జోక్యం చేసుకుని.. "మీరు మాట్లాడుకుంటున్న వాళ్లంతా నిజంగా టాలెంటెడ్ క్రికెటర్లే.కానీ ఇది 'ఇండియన్' ప్రీమియర్ లీగ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఐపీఎల్ కొనసాగడానికి ఫారన్ ప్లేయర్స్ వస్తానే కాదు, ఇండియన్ ప్లేయర్స్ ఉంటే చాలు అని ఉద్దేశంతో అయ్యర్ అన్నాడు.Yatra pratibha avsara prapnotihi! ❤️ pic.twitter.com/UBRjCs8Bua— Punjab Kings (@PunjabKingsIPL) May 17, 2025 -
ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు
IPL 2025 RCB vs KKR Live Updates: ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దుఐపీఎల్-2025 పున:ప్రారంభంలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.👉బెంగళూరు వర్షం ఇంకా కురుస్తోంది. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆట సాధ్యపడేలా లేదు.👉బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం ఇంకా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.👉ఐపీఎల్-2025 పున:ప్రారంభానికి వరుణడు ఆడ్డంకిగా నిలిచాడు. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. మైదానం మొత్తాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. దీంతో ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. కాగా చిన్నస్వామి స్టేడియంలో అద్బుతమైన డ్రైనజీ వ్యవస్ద ఉండంతో వర్షం తగ్గిన వెంటనే మైదానాన్ని సిద్దం చేసే అవకాశముంది. -
IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి ప్రారంభానికి సిద్దమైంది. శనివారం(మే 17) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ పునఃప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో అగ్రస్థానానికి ప్రమోట్ చేయాలని ఢిల్లీ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు విజయం సాధిస్తే.. ఎటువంటి సమీకరాణాలు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని హెడ్ కోచ్ హేమంగ్ బదాని, మెంటార్ కెవిన్ పీటర్సన్ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను రాహుల్ ప్రారంభించే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో రాహుల్ 10 మ్యాచ్‌లలో ఆడాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. రెండు సార్లు మూడో స్ధానంలో, మిగిలిన మ్యాచ్‌లలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభ మ్యాచ్‌లలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, డుప్లెసిస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్రెజర్ మెక్ గర్క్‌ను పేలవ ఫామ్ కారణంగా ఢిల్లీ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్ధానంలో అభిషేక్ పోరెల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే డుప్లెసిస్ గాయం బారిన పడడంతో కరుణ్ నాయర్ కూడా ఓపెనర్‌గా వచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీకి ఓపెనర్లు మాత్రం మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఇప్పుడు రాహులైనా ఢిల్లీకి మంచి ఆరంభాలను అందిస్తాడో లేదో వేచి చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
గిల్ క్రిస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్.. కోహ్లికి నో ఛాన్స్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అయితే తన ఎంచుకున్న జట్టులో కేవలం ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్లకు మాత్రమే గిల్‌క్రిస్ట్ అవకాశమిచ్చాడు. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కువగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు ఫ్రాంచైజీలు చెరో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. ఈ జట్టుకు కెప్టెన్‌గా సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనిని గిల్ ఎంపిక చేశాడు. ధోనితో పాటుగా సీఎస్కే లెజెండ్స్ సురేష్ రైనా, రవీంద్ర జడేజాలు ఉన్నారు.అదేవిధంగా ముంబై ఇండియన్స్ నుంచి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, డేంజరస్ పేస్ ద్వయం లసిత్ మలింగ,జస్ప్రీత్ బుమ్రాలకు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక రెండు సార్లు ఛాంపియన్ కేకేఆర్ నుంచి సునీల్ నరైన్‌కు మాత్రమే చోటు దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌ను గిల్ క్రిస్ట్ ఎంపిక చేశాడు. అయితే ఆర్సీబీ టైటిల్ గెలవకపోవడంతో ఈ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. కాగా భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.గిల్ క్రిస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ఎంఎస్ ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్చదవండి: రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్ -
రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రశంసలు కురిపించాడు. సారథిగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన హిట్‌మ్యాన్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సత్కరించిన తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. కాగా రోహిత్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల చేతుల మీదుగాముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అతడి పేరిట స్టాండ్‌ను నెలకొల్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా- గురునాథ్ శర్మతో కలిసి ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రోహిత్ భార్య రితికా సజ్దేతో పాటు తమ్ముడు విశాల్ శర్మ, అతడి భార్య దీపాళీ షిండే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇలాంటి ఓ రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు.నూటికి నూరు శాతం అర్హుడివికుటుంబ సభ్యుల త్యాగాల వల్లే తాను ఉన్నత స్థితికి చేరుకున్నానని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హిట్‌మ్యాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపించాడు. ఇంతటి గౌరవానికి నువ్వు నూటికి నూరు శాతం అర్హుడివని కొనియాడాడు.‘‘శుభాకాంక్షలు.. ఈ గౌరవానికి నువ్వు అన్ని విధాలా అర్హుడవి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు స్టాండ్ ఆవిష్కరణ.. ఇలాంటి రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. రోహిత్ శర్మ స్టాండ్‌లోకి నువ్వు మరిన్ని సిక్స్‌లు కొట్టాలని ఆశిస్తున్నా.నాకెప్పుడైనా ముంబై స్టేడియంలో టికెట్లు దొరక్కపోతే ఎవరిని సంప్రదించాలో ఇప్పుడు బాగా తెలిసింది. నీ పేరిట స్టాండ్ ఉంది కదా.. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోను’’ అంటూ ద్రవిడ్ వీడియో సందేశం ద్వారా రోహిత్‌ను అభినందిస్తూనే ఇలా చమత్కరించాడు.వరల్డ్‌కప్ గెలిచారుకాగా రోహిత్ శర్మ- ద్రవిడ్‌ల జోడీ టీమిండియాను పరిమిత ఓవర్ల క్రికెట్లో అగ్రస్థానంలో నిలిపింది. అయితే, టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్‌లోనే నిష్క్రమించడంతో వీరిద్దరిపై విమర్శలు వచ్చాయి. ఇద్దరూ రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి.ఈ క్రమంలో అనూహ్య రీతిలో రోహిత్ కెప్టెన్సీలో జట్టును తిరిగి పుంజుకునేలా చేశాడు ద్రవిడ్. అందుకు ప్రతిఫలంగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా వీరిద్దరి కాంబినేషన్లో వన్డే వరల్డ్‌కప్-2023లో రన్నరప్‌గానూ నిలిచింది. ఇక టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గౌతం గంభీర్ ఆ బాధ్యతలు స్వీకరించాడు.రోహిత్- గంభీర్ కాంబోలో ఇటీవలే భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచింది. కాగా గతేడాది ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతడు భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ద్రవిడ్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు.చదవండి: Suresh Raina: కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుRahul Dravid's message to RO got us like... 🥹💙P.S. The humour at the start & end 😂👌#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 | @rajasthanroyals pic.twitter.com/sdnasfUIKi— Mumbai Indians (@mipaltan) May 17, 2025 -
బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్ ఎలెవన్‌లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్ చోటివ్వలేదు.టీమిండియా నుంచి ఆ ఇద్దరుఅయితే, భారత్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపిన రోహిత్ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.హిట్‌మ్యాన్ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ హిట్టర్‌గా పేరొందిన రోహిత్‌ను బాబర్ ఆజం తన జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు స్థానం ఇచ్చాడు.ఇక వన్‌డౌన్‌లో పాక్‌కే చెందిన ఫఖర్ జమాన్‌ను సెలక్ట్ చేసుకున్న బాబర్.. మిడిలార్డర్లో ధనాధన్ దంచికొట్టే సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో నంబర్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్, సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.ఏకైక స్పిన్నర్ ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్‌కు చోటు ఇచ్చిన బాబర్ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఇక పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఆసీస్‌కే చెందిన మరో ఫాస్ట్‌బౌలర్ మిచెల్ స్టార్క్‌లకు బాబర్ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌ను పేస్ దళంలో చేర్చాడు.తన జట్టులో పవర్ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్ సమతూకంగా ఉంటుందని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో కనీసం గ్రూప్ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలోనూ పాక్ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్:రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మార్క్‌వుడ్.చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటు: సురేశ్ రైనా
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ‘రన్‌మెషీన్’ తన వృత్తిగత జీవితంలో అన్నీ సాధించేశాడని.. అయితే, పదిహేడేళ్లుగా ఓ లోటు మాత్రం అలాగే మిగిలిపోయిందన్నాడు. ఇంతకీ అదేమిటంటే..!?కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ విషయంలోనూ రోహిత్‌నే అనుసరించాడు.రోహిత్ సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారంలోపే తానూ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి వెల్లడించాడు. ఇక ఇప్పటికే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్లో కొనసాగుతున్న వీరిద్దరు.. భారత్ తరఫున వన్డేల్లోనూ కొనసాగనున్నారు.ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ ఆటగాడిగానూ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. అయితే, క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ అంటే 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తోనే ఉన్న కోహ్లికి ఇంత వరకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.చిరకాల కల నెరవేరేనా?ఈసారి మాత్రం కోహ్లి చిరకాల కల నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపీఎల్-2025లో వరుస విజయాలతో జోరు మీదున్న పాటిదార్ సేన చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఈసారి ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.ఇక ఐపీఎల్-2025 పునఃప్రారంభం నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లి మైదానంలో దిగబోతున్నాడు.కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుఒకవేళ ఆర్సీబీ గనుక ఈసారి ట్రోఫీ గెలిస్తే అతడి సంతోషానికి అవధులు ఉండవు. ఆర్సీబీకి వెన్నెముక, ప్రధాన బలం అతడే. తన జీవితంలో అన్నీ ఉన్నాయి.. అయితే, ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోవడం మాత్రమే లోటు.ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈసారి ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడుతుందనే అనుకుంటున్నా. విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ జాలువారితే అదేమీ పెద్ద కష్టం కాబోదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లితో పాటు మిగిలిన పది మంది కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 505 పరుగులు సాధించి.. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.ఆరెంజ్ క్యాప్ పోటీలో సూర్యకుమార్ యాదవ్ (510), సాయి సుదర్శన్ (509), శుబ్‌మన్ గిల్ (508)లతో కోహ్లి పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ- కేకేఆర్ మధ్య మే 17 నాటి మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక అన్న సంగతి తెలిసిందే. చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
ఇంగ్లండ్ టూర్: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?
ఐపీఎల్-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTV) 2025-27 సీజన్ ఆరంభం కానుంది.తొలుత అనధికారిక టెస్టులుఅయితే, అంతకంటే ముందే భారత్-‘ఎ’- ఇంగ్లండ్ లయన్స్ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు, భారత ‘ఎ’ టీమ్ మధ్య కూడా జూన్ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది.జైసూ, నితీశ్, గిల్, జురెల్ కూడాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ గత సీజన్లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్ కరుణ్ నాయర్‌కు భారత టెస్టు టీమ్‌లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్ నాయర్‌కు చోటు లభించింది. అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్‌దీప్‌లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.కాగా ఇంగ్లండ్‌కు వెళ్లే భారత్-‘ఎ’ జట్టులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్‌లు ఉన్నారు. వీరి టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్ రాయల్స్ (యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ పోటీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే, శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
‘బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్’
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ అంశంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.దిగ్గజాల వీడ్కోలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్ భారత్- ఇంగ్లండ్ సిరీస్‌తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్, నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బుమ్రానే ఫస్ట్ చాయిస్.. కానీ వద్దే వద్దు‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్ప్రీత్ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్‌గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.బౌలర్‌గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు.ఒత్తిడికి లోనయ్యే అవకాశంఅయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్‌గా, కెప్టెన్‌గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఆ ఇద్దరిలో ఒకరు బెటర్ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్‌గా శుబ్‌మన్ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.రిషభ్ పంత్‌ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్, పంత్‌లలో ఒకరికి టీమిండియా కెప్టెన్‌గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.కాగా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పెర్త్, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
‘ఈసారి హార్దిక్ అలా చేయడం లేదు.. అందుకే ముంబై దూసుకెళ్తోంది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుస పరాజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కొట్టడం అద్భుతమని కొనియాడాడు. ఇందుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ ప్రధాన కారణమని గావస్కర్ ముంబై సారథిని ప్రశంసించాడు.గతేడాది చేదు అనుభవాలుకాగా గతేడాది ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మైదానం లోపలా, వెలుపలా అతడిని హేళన చేస్తూ నిరుత్సాహపరిచారు.ఖేల్ ఖతమే అనుకున్నవేళఈ క్రమంలో గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. తాజా ఎడిషన్‌లో తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. దీంతో ముంబై ఖేల్ ఖతమే అని అనుకున్న సమయంలో.. ఊహించని రీతిలో పుంజుకుంది.అంతా హార్దిక్ వెంట ఉన్నారువరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ముంబై జట్టు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీరును కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది సొంత జట్టు అభిమానుల నుంచే హార్దిక్‌కు మద్దతు లేదు.కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముంబై ప్రేక్షకులు, ముంబై జట్టు మద్దతుదారులు అంతా హార్దిక్ వెంట ఉన్నారు. ప్రతి ఒక్కరు టీమ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో తడబడినా ముంబై అద్భుత రీతిలో తిరిగి పుంజుకుంది.హార్దిక్ ఈసారి అలా చేయడం లేదుహార్దిక్ పాండ్యా ప్రభావం ఈసారి గట్టిగానే ఉంది. అతడు తన భావోద్వేగాలను మైదానంలో ఎక్కువగా కనిపించకుండా దాచేస్తున్నాడు. మిస్‌ఫీల్డ్ అయినప్పుడు, క్యాచ్‌లు జారవిడిచినపుడు ఫీల్డర్లకు మరేం పర్లేదు అన్నట్లుగా మద్దతుగానే ఉంటున్నాడు.ఒకవేళ కెప్టెన్ ఇలాంటపుడు అతిగా స్పందిస్తే.. ఫీల్డర్ కూడా డీలాపడిపోతాడు. అయితే, హార్దిక్ ఈసారి అలా చేయడం లేదు. అందుకే ముంబై ఇంత త్వరగా తిరిగి రేసులోకి వచ్చింది. అయినా.. వాళ్లకు ఇది అలవాటే. ముంబై ఇండియన్స్ అభిమానిగా ఆ జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.ధనాధన్‌కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. పద్నాలుగు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న హార్దిక్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. పదకొండు ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. పదమూడు వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 510 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
IPL 2025: ఆర్సీబీని గెలిపిస్తాం కదా!.. అంతా కోహ్లి మయం!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండుల్కర్ (100) తర్వాత అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లి (82) కొనసాగుతున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ రికార్డుల రారాజు.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు (Test Retirement) పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు.. టీమిండియా తరఫున వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు కోహ్లి.అంతా కోహ్లి మయం..ఈ క్రమంలో ఇటీవల వ్యక్తిగత పని పూర్తి చేసుకొని తిరిగొస్తుండగా మైదానంలో ఒక అభిమాని ఎందుకు టెస్టులకు రిటైర్మెంట్ తీసుకున్నావని కోహ్లిని అడిగాడు. ఇందుకు స్పందిస్తూ ‘ఆర్సీబీని గెలిపిస్తాం కదా’ అని కోహ్లి జవాబిచ్చాడు. ఈ సీజన్లో బెంగళూరుకు టైటిల్ అందించాలని అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనూ అది కనిపిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 7 అర్ధసెంచరీలతో ఇప్పటికే 505 పరుగులు సాధించిన కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి కోహ్లి మైదానంలోకి దిగుతుండటంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది. గురువారం అతడి ప్రాక్టీస్ సెషన్ సమయంలో కూడా చిన్నస్వామి స్టేడియంను ఫ్యాన్స్ హోరెత్తించారు. వందల సంఖ్యలో హాజరైన అభిమానులు కోహ్లి ప్రతీ కదలికపై సందడి చేశారు. దాదాపు గంట పాటు అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. కోహ్లి ఉన్నంత సేపూ అతని పేరు తప్ప అక్కడ మరేమీ వినిపించలేదు.భారీ స్థాయిలో స్పందనకోల్‌కతాతో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. కోహ్లి టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత కొందరు వీరాభిమానులు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ‘కింగ్’పై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేస్తూ ఐపీఎల్ మ్యాచ్‌కు కూడా తెలుపు రంగు టెస్టు జెర్సీలతో స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారీ స్థాయిలో స్పందన లభించింది.ఎలాంటి ప్రభావం చూపదుఈ రకంగా చూస్తే శనివారం ఆర్సీబీ రెగ్యులర్ జెర్సీ ‘రెడ్ అండ్ గోల్డ్’లో కాకుండా ‘విరాట్ 18’ వైట్ జెర్సీలే మైదానాన్ని ముంచెత్తవచ్చు. అయితే విరాట్‌పై మైదానం బయటి స్పందనలు, వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించవని... ఏకాగ్రత చెదరకుండా తనదైన శైలిలో ఎప్పటిలాగే అతను బాగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడని ఆర్సీబీ డైరెక్టర్ మో బొబాట్ వ్యాఖ్యానించారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ తాజా ఎడిషన్ శనివారం (మే 17) నుంచి పునః ప్రారంభం కానుంది. ఆర్సీబీ- కోల్‌కతా జట్ల మధ్య జరిగే శనివారం నాటి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు జట్టు.. ఎనిమిదింట గెలిచి పదహారు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతాపై తాజా మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ఎయిర్ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్ ఏంజెలిస్‌లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ‘ఎయిర్ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు. సోఫీ స్టేడియం, లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్ కౌంటీ, హాలీవుడ్ వేదికలకు ఎయిర్ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్ ఏంజెలిస్ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఫైనల్లో అల్కరాజ్రోమ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఒక ఏస్ సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్కరాజ్ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్; రోటర్‌డామ్ ఓపెన్) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. యానిక్ సినెర్ (ఇటలీ), టామీ పాల్ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. -
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 12వ సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో నిర్వహించే ఈ వేలానికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే 12 ఫ్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేశామని నిర్వాహకులు వెల్లడించారు. కాగా 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 11 సీజన్లలో 8 వేర్వేరు జట్లు టైటిళ్లు గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో కబడ్డీ లీగ్‌లో పలానా జట్టు ఫేవరెట్ అనే మాటే లేకుండా ప్రతీ జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. దీంతో యేటికేడు కబడ్డీ కూతకు ఆదరణ అంతకంతకు పెరుగుతూనే ఉండటం విశేషం. బెంగాల్ వారియర్స్ కోచ్‌గా నవీన్ ఈ ఏడాది జరిగే 12వ సీజన్ పీకేఎల్ కోసం బెంగాల్ వారియర్స్ తమ జట్టు హెడ్ కోచ్‌గా నవీన్ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం కోచ్‌గానే కాదు... అంతకుముందు ఆటగాడిగాను అతనికి మంచి రికార్డు ఉంది. దక్షిణాసియా క్రీడలు (2006), ఆసియా క్రీడలు (2006), కబడ్డీ ప్రపంచకప్ (2007), ఆసియా ఇండోర్ క్రీడల్లో (2007) భారత్ స్వర్ణాలు గెలిచిన బృందంలో అతను సభ్యుడిగా ఉన్నాడు. కోచ్‌గానూ నిరూపించుకున్నాడు.గతంలో అతను భారత జాతీయ, దేశవాళీ జట్లకు కోచింగ్ సేవలందించాడు. భారత నేవి, స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) జట్లకు కోచ్‌గా వ్యవహించాడు. ఆటలో కడదాకా కనబరిచే పోరాటస్ఫూర్తి, ఏ దశలోనూ కుంగిపోని సానుకూల దృక్పథం అతన్ని మేటి కోచ్‌గా నిలబెడుతోంది. 12 ఫ్రాంచైజీలు తలపపడిన గత సీజన్లో బెంగాల్ పదో స్థానంతో నిరాశపరిచింది.ఈ నేపథ్యంలో వేలానికి ముందే అతన్ని నియమించుకోవడం ద్వారా సరైన ఆటగాళ్ల కొనుగోలు, జట్టు కూర్పు, పటిష్టమైన దళాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభిస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది. బెంగాల్‌కు కోచింగ్ పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారియర్స్‌ను దీటైన జట్టుగా, బరిలో ఎదురులేని ప్రత్యర్థిగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ప్రపంచం ‘కన్ను’గప్పి నాటకాలు.. ఎట్టకేలకు పాపం పండింది!
బాకు (అజర్బైజాన్): ప్రపంచాన్ని ‘గుడ్డి’గా నమ్మించిన అజర్బైజాన్ పారా జూడో క్రీడాకారిణి పాపం పండింది. జీవితకాల నిషేధానికి గురైంది. ఒక శాతం కూడా దృష్టిలోపం లేకపోయినా... నకిలీ అంధత్వ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పోటీల్లో అజర్బైజాన్ జూడో క్రీడాకారిణి షహానా హాజియెవా (Shahana Haji) పతకాలు గెలిచింది. ఇప్పుడు పాపం పండటంతో ‘పోడియం’కెక్కిన ఆమె పాతాళానికి పడిపోయింది.అసలు విషయమేమిటంటే... 26 ఏళ్ల హాజియెవా టోక్యో పారాలింపిక్స్‌లో దృష్టి లోపం ఉన్న జూడో క్రీడాకారిణిల విభాగంలో (48 కేజీలు) పోటీపడి బంగారు పతకం గెలుపొందింది. కాలచక్రం తిరిగేసరికి ఈ లోపల మరో పారాలింపిక్స్ క్రీడలు (పారిస్) కూడా ముగిశాయి. ఇన్నాళ్లూ బాగానే ఉంది. కానీ ఈనెల కజకిస్తాన్‌లోని అస్తానాలో ప్రపంచ పారా జూడో చాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో కళ్లున్నా... కనపడనట్లు ఆడిన కపట నాటకం బయటపడింది.ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన అంధత్వ పరీక్షలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది. షహానా హాజియెవాకు రెండు కళ్లు వందశాతం కనిపిస్తూనే ఉన్నాయని తేలింది. ఎలాంటి దృష్టి లోపం, పాక్షిక అంధత్వం కూడా లేదని తేలింది. దీంతో ప్రపంచ పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. ప్రపంచం ‘కన్ను’గప్పిన ఆమె మోసంతో ఇప్పుడు పారా క్రీడలు కాదుకదా అసలైన క్రీడల్లో కూడా పాల్గొనే అర్హతను పూర్తిగా కోల్పోయింది.అజర్‌బైజాన్‌కే చెందిన ఎల్నారా నిజామ్లికి పాక్షిక దృష్టి లోపం ఉంది. కానీ ఆమె పూర్తి అంధత్వంతో ‘జే1’ కేటగిరీలో పాల్గొనాలని చూసిన మోసం కూడా బట్టబయలైంది. అయితే ఆమెకు ‘జే2’ కేటగిరీ (పాక్షిక అంధత్వం)లో పాల్గొనే అవకాశమిచ్చారు. అజర్బైజాన్ జాతీయ పారాలింపిక్ సంఘం తమ అథ్లెట్ల కపట నాటకంపై స్పందించింది. ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. -
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సముచిత రీతిలో గౌరవించిన విషయం తెలిసిందే.ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి ‘రోహిత్ శర్మ స్టాండ్’ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్ ఆవిష్కరణ కార్యక్రమంశుక్రవారం జరిగింది. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక (Ritika), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరై ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ప్రారంభించారు. రోహిత్ భావోద్వేగంఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్‌లలో సాధించే ఎన్నో మైలురాళ్లకంటే విశేషమైంది.వాంఖడేలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్ ముందు ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాను. అది చాలా గొప్ప అనుభవం అవుతుంది.ఇక భారత్ తరఫున మ్యాచ్ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడను’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!మరోవైపు.. కుమారుడి పేరిట స్టాండ్ ఆవిష్కరణ కాగానే పూర్ణిమా- గురునాథ్ ఆనందభాష్పాలు రాల్చగా.. రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరిట, సీనియర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్లను ఆవిష్కరించిన ఎంసీఏ... ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే పేరిట ప్రత్యేక లాంజ్‌ను కూడా ప్రారంభించింది. ‘నేనైతే సిడ్నీలో రోహిత్‌ను ఆడించే వాడిని’ మరోవైపు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌తో చివరి టెస్టుకు ముందు తాను ఫామ్‌లో లేనంటూ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకొన్నాడు. సిడ్నీలో జరిగిన ఈ టెస్టుకు దూరమైన అతను మళ్లీ టెస్టు ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాను జట్టు కోచ్‌గా ఉండి ఉంటే రోహిత్‌ను తప్పనిసరిగా ఆ టెస్టులో ఆడించే వాడినని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.‘సిరీస్ ముగిసిపోలేదు కాబట్టి కచి్చతంగా అతడిని ఆడించే వాడిని. సిరీస్‌లో 1–2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్టులో తేడా ఒక 30–40 పరుగులు మాత్రమే. ఫామ్ ఎలా ఉన్న అతనో మ్యాచ్ విన్నర్. పిచ్‌పై పరిస్థితిని అర్థం చేసుకొని ఓపెనర్‌గా ఒక 35–40 పరుగులు చేసి ఉంటే చాలు మ్యాచ్ ఫలితం మారిపోయేదేమో. సిరీస్ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది’ అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నాడు. చదవండి: Rohit Sharma Interesting Facts: పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా! లగ్జరీ ఇల్లు, కార్లు.. ఆస్తి ఎంతంటే?#WATCH | Mumbai | Rohit Sharma stands unveiled at Wankhede stadium. Indian ODI men's cricket team captain Rohit Sharma and his family, Maharashtra CM Devendra Fadnavis, NCP-SCP chief Sharad Pawar, and others, are also present.The Mumbai Cricket Association (MCA) is formally… pic.twitter.com/K39kSfRkCY— ANI (@ANI) May 16, 2025 -
IPL 2025: ‘షో’ మళ్లీ షురూ...
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో తొమ్మిది రోజుల విరామానంతరం తర్వాతి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా లీగ్‌ను గవరి్నంగ్ కౌన్సిల్ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతుంది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఈ నెల 7న జరిగింది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి లీగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారు. 70 మ్యాచ్‌ల లీగ్ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లతో పాటు నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) కలిపి మొత్తం ఈ సీజన్లో మరో 17 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. ముస్తఫిజుర్, డుప్లెసిస్ రెడీ... ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల విషయంలో శుక్రవారం మరింత స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌కు మార్గం సులువైంది. ఢిల్లీ తరఫున అతను బరిలోకి దిగుతాడు. ఢిల్లీ టాప్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తాను మిగిలిన మ్యాచ్‌లకు తిరిగి రావడం ముందే స్పష్టం చేసేశాడు. ఓపెనర్ డుప్లెసిస్ కూడా ఆడేందుకు సిద్ధం కావడం క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. స్టబ్స్ మిగిలిన లీగ్ దశలో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం వెళ్లిపోతాడు.ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన హైదరాబాద్, చెన్నై, రాజస్తాన్ జట్లకు విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే ఫలితాన్ని ప్రభావితం చేయగల విదేశీ ఆటగాళ్లు ఉన్న టీమ్‌లకు వారంతా తిరిగి రావడం ప్లే ఆఫ్స్ అవకాశాలకు పెద్ద బలంగా మారింది. సాల్ట్, షెఫర్డ్, టిమ్ డేవిడ్‌లతో ఆర్సీబీ సంతృప్తిగా కనిపిస్తుండగా... హాజల్‌వుడ్ మాత్రం దూరమయ్యాడు. స్టొయినిస్, ఇన్‌గ్లిస్ విషయంలో పంజాబ్ కింగ్స్‌కు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముంబై ఇండియన్స్ తరఫున అంతా అందుబాటులో ఉండగా... ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ్రస్టేలియా కెప్టెన్ కమిన్స్ మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్‌తో చేరడం ఆశ్చర్యకరం! గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ... సీజన్లో జోరు చూపిస్తూ ఎనిమిది విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో విజయంపై గురి పెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ సొంతగడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో పాటు పదునైన బౌలింగ్‌తో జట్టు బాగా బలంగా కనిపిస్తోంది. బెతెల్, కోహ్లి శుభారంభం అందిస్తుండగా, కెప్టెన్ రజత్ పాటీదార్ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్, కృనాల్, సుయాశ్‌లతో బౌలింగ్ కూడా బాగుంది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్ ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఖాయమేమీ కాదు. ఇతర ఎన్నో సమీకరణాలతో ముందంజ వేయడం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ చాన్స్ కోల్పోయిన నాలుగో జట్టుగా కేకేఆర్ నిలుస్తుంది. -
నీరజ్ 90.23 మీటర్లు
దోహా: 90 మీటర్లు... ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? అని కొన్నేళ్లుగా అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం సమాధానం ఇచ్చాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు భారత స్టార్ తన కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ చోప్రా తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనను నమోదు చేశాడు.27 ఏళ్ల నీరజ్ తన మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో నీరజ్ తన పేరిటే ఉన్న (2022 స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ మీట్లో 89.94 మీటర్లు) జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. విఖ్యాత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ ప్రారంభించాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. 11 మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడ్డ దోహా డైమండ్ లీగ్ మీట్లో జూలియన్ వెబెర్ (జర్మనీ; 91.06 మీటర్లు) అగ్రస్థానాన్ని క్కించుకున్నాడు. నీరజ్ చోప్రా (90.23 మీటర్లు) రెండో స్థానం సంపాదించగా... అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 86.64 మీటర్లు) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కే చెందిన కిశోర్ కుమార్ జేనా (78.60 మీటర్లు) ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డైమండ్ లీగ్ మీట్లలో అథ్లెట్లకు పతకాలు బదులుగా పాయింట్లు కేటాయిస్తారు. టాప్–8లో నిలిచిన వారికి వరుసగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 పాయింట్లు లభిస్తాయి. వెబెర్‌కు 8 పాయింట్లు, నీరజ్‌కు 7 పాయింట్లు, పీటర్స్‌కు 6 పాయింట్లు దక్కాయి.నిర్ణిత నాలుగు మీట్లు ముగిశాక టాప్–7లో నిలిచిన వారు ఫైనల్ మీట్లో పోటీపడతారు. సీజన్ తొలి మీట్లో నీరజ్ తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 88.44 మీటర్ల దూరం విసిరి శుభారంభం చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అతను ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ 90.23 మీటర్లకు వెళ్లింది. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 80.56 మీటర్ల దూరం విసరగా... ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 88.20 మీటర్లు విసిరాడు. 3 ఆసియా నుంచి జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరిన మూడో ప్లేయర్‌గా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 92.97 మీటర్లు), చావో సున్ చెంగ్ (చైనీస్ తైపీ; 91.36 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్‌గా 25 మంది క్రీడాకారులు జావెలిన్‌ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరారు. -
ఇంగ్లండ్ టూర్.. భారత-ఎ జట్టు హెడ్ కోచ్‌గా హృషికేష్?
ఈ ఏడాది జూన్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. జూన్ 20న లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్‌కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్‌లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ సిరీస్క భారత-ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. అదేవిధంగా కరుణ్ నాయర్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది.హెడ్ కోచ్‌గా కనిత్కర్..!ఇక ఇంగ్లండ్ టూర్లో భారత-ఎ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హృషికేష్ కనిత్కర్ వ్యవరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రెగ్యూలర్ హెడ్ కోచ్ గౌతం గంభీర్ జూన్ 6న ఇంగ్లండ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జట్టు కోచింగ్ బాధ్యతలు హృషికేష్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.కనిత్కర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2022 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన భారత మహిళా జట్టుకు హెడ్‌కోచ్‌గా హృషికేష్ కనిత్కర్ వ్యవహరించాడు. అతడు గోవా , తమిళనాడు రాష్ట్ర జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశాడు.ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే -
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఇంగ్లండ్ టూర్‌కు భారత-ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్ నియమితుడయ్యాడు. ఈ టూర్లో ఈశ్వరన్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు. కాగా ఇండియా-ఎ జట్టుకు చానాళ్ల తర్వాత వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ ఎంపికయ్యాడు. కరుణ్ 8 ఏళ్ల తర్వాత ఇండియా సీనియర్ టెస్టు జట్టులోకి సైతం రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక కరుణ్ నాయర్‌తో పాటు ఇషాన్ కిషన్‌కు కూడా భారత-ఎ జట్టులో చోటు దక్కింది. అయితే ఆశ్చర్యకరంగా శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అయ్యర్ ఇంగ్లండ్‌తో టెస్టులకు ప్రధాన భారత జట్టులో లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఈ 18 మంది సభ్యుల జట్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ కూడా ఉన్నారు. వారిని ప్రాక్టీస్ కోసం ముందుగా ఇంగ్లండ్‌కు బీసీసీఐ పంపింది. అదేవిదంగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తర్వాత శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్‌లు ఇండియా-ఎ జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. వికెట్ల వీరుడికు చోటుఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ హర్ష్ దుబే కూడా భారత-ఎ జట్టులో భాగమయ్యాడు. ఈ విదర్భ స్పిన్నర్ 10 మ్యాచ్‌ల్లో 17 సగటుతో 69 వికెట్లు పడగొట్టాడు. మరో ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రధాన సిరీస్‌కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు మే 30 నుండి జూన్ 9 వరకు జరగనున్నాయి.ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారత తుది జట్టులో ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.అదేరోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెల్లడించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. సాయిసుదర్శన్, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లకు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశముంది. జూన్ 20 నుంచి హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భారత్‌కు ఇదే తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు.రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు చోప్రా అవకాశమిచ్చాడు. భారత ఇన్నింగ్స్‌ను యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ప్రారంభించాలని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి స్ధానంలో సాయి సుదర్శన్ లేదా దేవ్‌దత్త్ పడిక్కల్‌కు అవకాశమివ్వాలని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక కెప్టెన్సీ రేసులో ఉన్న శుబ్‌మన్ గిల్‌కు నాలుగో స్దానంలో అతడు చోటు కల్పించాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను ఈ భారత మాజీ క్రికెటర్ ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలకు చోటిచ్చాడు.అయితే అనూహ్యంగా దీపక్ చాహర్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని అతడు సెలక్టర్లను సూచించాడు. ఎనిమిదవ స్ధానంలో దీపక్ చాహర్ లేదా శార్ధూల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఇవ్వాలని అతడు మెనెజ్‌మెంట్‌ను కోరాడు. కాగా దీపక్ చాహర్ ఇప్పటివరకు టెస్టుల్లో భారత తరపున అరంగేట్రం చేయలేదు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలకు చోప్రా చోటిచ్చాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు చోప్రా ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్/దేవ్‌దత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ/ ప్రసిద్ద్ కృష్ణ -
వెస్టిండీస్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్?
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ ఎంపికానున్నట్లు తెలుస్తోంది. విండీస్ టెస్టు కెప్టెన్‌గా వైదొలిగిన క్రెయిగ్ బ్రాత్‌వైట్ స్ధానాన్ని చేజ్ భర్తీ చేయనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని చేజ్ ప్రారంభించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చేజ్ నియమాకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.2016లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన చేజ్.. తన కెరీర్లో ఇప్పటివరకు 49 టెస్టులు ఆడాడు. అందులో 26.33 సగటుతో 2,000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 85 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.రోస్టన్ చేజ్ ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం చేజ్ సిద్దమవుతున్నాడు. ఆ తర్వాత ఈ నెల ఆఖరిలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ తలపడనుంది.అనంతరం జూన్ మధ్యలో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో కరేబియన్లు ఢీకొట్టనున్నారు. ఈ సిరీస్ డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భాగంగా జరగనుంది. కాగా విండీస్ టెస్టు కెప్టెన్సీ బ్రాత్‌వైట్ ఈ ఏడాది మార్చిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.చదవండి: వారి త్యాగాల వల్లే ఇలా ఉన్నా.. అరుదైన గౌరవం.. రోహిత్ శర్మ భావోద్వేగం🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨Roston Chase has been named the new West Indies Test captain, taking over from Kraigg Brathwaite, who stepped down from the role in March this year. 🏏🌴 #TestCricket #WestIndies #Sportskeeda pic.twitter.com/O74YrAb7EB— Sportskeeda (@Sportskeeda) May 16, 2025 -
కలలో కూడా ఊహించలేదు.. మాటల్లో వర్ణించలేను: రోహిత్ శర్మ భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో రోహిత్ శర్మ పేరిట ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ఆరంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు.ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుఆ సమయంలో సీనియర్ నేత శరద్ పవార్, భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇక్కడి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ముంబైకి.. టీమిండియాకు ఆడాలని కలలు కంటూ పెరిగాను. దేశానికి నా వంతు సేవ చేయాలని భావించాను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలు సాధించాను.కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమించాను. అయితే, వాటన్నింటికంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. వాంఖడే వంటి ప్రసిద్ధ స్టేడియంలో నా పేరు ఇలా.. ఈ మైదానంతో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.మాటల్లో వర్ణించలేనుప్రపంచంలోని పేరెన్నికగన్న రాజకీయ నాయకులతో పాటు నా పేరు ఉండటం.. హో.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఎంసీఏ సభ్యులు, యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. నేను ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఎంతో ప్రత్యేకం.రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇంకో ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాను. నిజంగా ఈ భావనను మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. టీమిండియా తరఫున, ఐపీఎల్లో ముంబై తరఫున ఇక్కడికే వచ్చి మళ్లీ ఆడబోతున్నా. ఇంతకంటే గొప్పది నా జీవితంలో మరొకటి ఉండదు.వారి త్యాగాలు మరువలేనివిమా అమ్మానాన్న, నా భార్య, తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా ఇక్కడే ఉంది. వారందరి సమక్షంలో ఈ గౌరవం అందుకోవడం నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. నా కోసం వారంతా తమ జీవితంలోని చాలా సంతోషాలను త్యాగం చేశారు.మా ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడే ఉంది. నా ప్రసంగం ముగిసిన వెంటనే వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతారు’’ అంటూ రోహిత్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024తో పాటు టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన ఘనత రోహిత్ సొంతం. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత భారత్‌కు అత్యధిక (రెండు) ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడేలో ఇప్పటి వరకు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. చదవండి: ‘రోహిత్ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5— Mumbai Indians (@mipaltan) May 16, 2025 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ రాకకు లైన్ క్లియర్!
ఐపీఎల్ 2025 పునఃప్రారం వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లో ఆడేందుకు ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అతడు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజులు వాయిదా పడడంతో చాలా మంది ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుండడంతో కొంతమంది తిరిగి భారత్‌కు రావడానికి సిద్దపడితే, మరి కొంతమంది నిరాకరించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్.ఐపీఎల్ 16వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు తన అందుబాటులో ఉండడని మెక్‌గర్క్ ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఈ క్రమంలో మెక్‌గర్క్ స్ధానంలో బంగ్లాపేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ముస్తఫిజుర్‌తో ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి అతడు యూఏఈతో టీ20 సిరీస్ ఆడేందుకు దుబాయ్‌కు పయనమయ్యాడు.యాదృచ్ఛికంగా యూఏఈ-బంగ్లా సిరీస్ కూడా మే 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అతడు తిరిగి భారత్‌కు వస్తాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఎన్వోసీ మంజారు చేయడంతో ఢిల్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్ సైతం దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.