
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. కాంటర్బరీ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హీలీ మాథ్యూస్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. మిగితా బ్యాటర్లు విఫలమైనప్పటికి మాథ్యూస్ మాత్రం ఇంగ్లీష్ బౌలర్లను ఊతికారేసారు. మాథ్యూస్ 67 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్లోట్, స్మిత్, వాంగ్ తలా వికెట్ సాధించారు.
అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫియా డంక్లి(56 బంతుల్లో 12 ఫోర్లతో 81) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హీథర్ నైట్(27 బంతుల్లో 6 ఫోర్లతో 43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. విండీస్ బౌలర్లలో జేమ్స్, ఫ్లేచర్ తలా వికెట్ పడగొట్టారు. మిగితా బౌలర్లందరూ చేతులెత్తేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 23న కౌంటీ గ్రౌండ్, హోవ్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే?