breaking news
West Indies Women Cricket Team
-
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన వెస్టిండీస్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో న్యూజిలాండ్‌కు వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఘన విజయం సాధించింది. గత ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి విండీస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లిమ్మర్(8), కెప్టెన్ అమేలియా(5) ఆరంభంలోనే ఔటైనప్పటికి, బ్రూక్ హాలిడే(40), ఇసాబెల్లా గేజ్(39), మ్యాడీ గ్రీన్(35) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అల్లెన్ 4 వికెట్లతో సత్తాచాటింది.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ షెమైన్ కాంప్‌బెల్‌ది కీలక పాత్ర. కాంప్‌బెల్ కేవలం 62 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించింది.ఆమె టీ20 కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కావడం విశేషం. -
ఒకే ఒక్క పరుగు.. వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐర్లాండ్
టీ20 ప్రపంచకప్-2016 ఛాంపియన్ వెస్టిండీస్‌కు ఐర్లాండ్ మహిళల జట్టు ఊహించని షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా డబ్లిన్ వేదికగా జరిగిన విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు (డక్ వర్త్ లూయిస్ పద్దతి) తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. మహిళల టీ20ల్లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ విజయంతో ఐర్లాండ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన తన జట్టును ఒంటి చేత్తో గెలిపించింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(1), టేలర్(9),డాటిన్(16) వంటి సీనియర్ ప్లేయర్లు నిరాశపరినప్పటికి.. ఆఖరిలో గ్లాస్కో(36) కాస్త దూకుడుగా ఆడడంతో విండీస్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో కానింగ్, ప్రెండర్‌గాస్ట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐర్లాండ్ స్కోర్ 14.1 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ సమయానికి డీఎల్ఎస్ పార్ స్కోరు ప్రకారం ఐర్లాండ్ 3 పరుగులు వెనుకబడి ఉంది. అంపైర్లు మ్యాచ్‌ను ఆపేసే ముందు కనీసం ఒక్క బంతి అయినా వేయాలని ఐర్లాండ్ బ్యాటర్లు పట్టుబట్టారు.జాజారా క్లాక్స్టన్ వేసిన బంతి లూయిస్ లిటిల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది. వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ 1 పరుగు ఆధిక్యంలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఓర్లా ప్రెండర్‌గాస్ట్(46 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71) అజేయంగా నిలిచింది.చదవండి: 'వైభవ్‌ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు' -
టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి వెస్టిండీస్ జట్టు ప్రకటన
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్ వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ జట్టులో డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.పదేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన కరేబియన్ జట్టు.. ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. అటు విండీస్ పురుషల జట్టు కూడా 2016 తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. దీంతో తమ 10 ఏళ్ల సుదీర్ఘ నిర్ణీక్షణకు తెరదించాలని విండీస్ అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. అయితే సాధరణంగా ఇంగ్లండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ వెస్టిండీస్ సెలెక్టర్లు అనూహ్యంగా స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. . అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, మాండీ మంగ్రూ, కరిష్మా రామ్‌హారక్, హేలీ మాథ్యూస్, జైదా జేమ్స్ వంటి స్పిన్నర్లు విండీస్ ప్రపంచకప్ జట్టులో ఉన్నారు. ఇక ఈ టోర్నీలో విండీస్ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్‌తో పాటు ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు జూన్ 13న సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రపంచ కప్ సమరాన్ని ప్రారంభించనుంది.మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కు వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్ హెన్రీ, డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అల్లీన్, షెమైన్ కాంప్‌బెల్, అష్మిని మునిసర్, కరిష్మా రామ్‌హారక్, జాన్నిలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిషా హెక్టర్.చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్‌గా అతడే!’ -
కెప్టెన్ సెంచరీ వృధా.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. కాంటర్బరీ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హీలీ మాథ్యూస్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. మిగితా బ్యాటర్లు విఫలమైనప్పటికి మాథ్యూస్ మాత్రం ఇంగ్లీష్ బౌలర్లను ఊతికారేసారు. మాథ్యూస్ 67 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్లోట్, స్మిత్, వాంగ్ తలా వికెట్ సాధించారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫియా డంక్లి(56 బంతుల్లో 12 ఫోర్లతో 81) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హీథర్ నైట్(27 బంతుల్లో 6 ఫోర్లతో 43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. విండీస్ బౌలర్లలో జేమ్స్, ఫ్లేచర్ తలా వికెట్ పడగొట్టారు. మిగితా బౌలర్లందరూ చేతులెత్తేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 23న కౌంటీ గ్రౌండ్, హోవ్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే? -
ODI WC Qualifiers: విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ అవుట్
బ్రిడ్జ్‌టౌన్: వచ్చే నెలలో జరిగే మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే వెస్టిండీస్ జట్టును విండీస్ బోర్డు ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైనట్లు తెలిపింది. కాగా భారత్‌లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ సందర్భంగా డాటిన్ గాయపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో డాటిన్ విండీస్ తరఫున టాప్ స్కోరర్(ఐదు మ్యాచ్‌లలో కలిపి 120 పరుగులు)గా నిలిచింది. ఇక తాజా వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడే పదిహేను మంది సభ్యులతో కూడిన వెస్టిండీస్ జట్టుకు.. మరో ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ నాయకత్వం వహిస్తుంది. ఏప్రిల్ 9 నుంచి 19వ తేదీ వరకు పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది.ఈ టోర్నీలో వెస్టిండీస్‌తో పాటు పాకిస్తాన్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు–అక్టోబర్లలో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉంటే.. డియాండ్ర డాటిన్ మహిళల ప్రీమియర్ లీగ్-2025లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను గుజరాత్ ఏకంగా రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్‌తో కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు డాటిన్ గాయపడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడి ఇంటిబాట పట్టగా.. ముంబై ఫైనల్‌కు చేరి రెండోసారి చాంపియన్‌గా అవతరించింది.వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెర్మయిన్ క్యాంప్‌బెల్, అలియా అలెన్, అఫీ ఫ్లెచర్, చెర్రీ ఆన్ ఫ్రేజర్, షబీకా గజ్నబీ, జనీలియా గ్లాస్గో, చినెల్లీ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసార్, కరిష్మా రాంహరాక్, స్టెఫానీ టేలర్, రషాదా విలియమ్స్. -
అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డాటిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. డాటిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించింది. కాగా జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆమె దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలిపింది. "14 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్లో నాకు మద్దతుగా నిలిచిన వెస్టిండీస్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు. నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా దేశవాళీ క్రికెట్ ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ట్విటర్లో డాటిన్ పేర్కొంది. కాగా డాటిన్ ప్రస్తుతం కామన్ వెల్త్‌గేమ్స్‌లో బార్బడోస్ జట్టు తరపున ఆడుతోంది. కామన్ వెల్త్‌గేమ్స్‌లో భాగంగా ఆగస్టు 3న భారత్ మహిళల జట్టుతో బార్బడోస్ తలపడనుంది. అయితే డాటిన్ ఈ మ్యాచ్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం బార్బడోస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది. చదవండి: Eng VS SA: స్టబ్స్ అద్భుత విన్యాసం.. ఒంటిచేత్తో అవలీలగా! ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు! Thanks to all for the love and support with in my past 14 years of playing cricket for West Indies! I look forward to be playing domestic cricket around the world pic.twitter.com/Vmw6AqpYQJ — Deandra Dottin (@Dottin_5) July 31, 2022 -
స్మృతి, జెమీమా అర్ధ సెంచరీలు
నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 2–1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటయ్యారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (112 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కింగ్ (38) రాణించింది. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమై... ఈ మ్యాచ్‌తోనే బరిలోకి దిగిన స్మృతి మంధాన (63 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఆటకు తోడు జెమీమా రోడ్రిగ్స్ (92 బంతుల్లో 69; 6 ఫోర్లు) కూడా అండగా నిలవడంతో జట్టు విజయం సులువైంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించడం విశేషం. స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... స్టెఫానీ టేలర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. -
భారత మహిళల జోరు
నార్త్‌సౌండ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన భారత మహిళల జట్టు వెంటనే కోలుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో వన్డేలో భారత్ 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (128 బంతుల్లో 77; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (67 బంతుల్లో 40; 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (52 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం వెస్టిండీస్ 47.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. క్యాంప్‌బెల్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా...ముగ్గురు విభిన్న శైలి గల భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పడగొట్టారు. భారత్ 17 పరుగులకే ఓపెనర్లు ప్రియా పూనియా (5), జెమీమా (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూనమ్ రౌత్, మిథాలీ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి 9 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోగా, మిథాలీ తాను ఎదుర్కొన్న మూడో బంతిని బౌండరీకి తరలించి బోణీ చేసింది. పూనమ్ మరీ నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన 70వ బంతికి గానీ ఆమె తొలి ఫోర్ కొట్టలేకపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అనంతరం పూనమ్‌తో జత కలిసిన హర్మన్ దూకుడుగా ఆడింది. పూనమ్ కూడా ధాటిని పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 17.5 ఓవర్లలోనే వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జత చేయడం విశేషం. ఆరు బంతుల వ్యవధిలో పూనమ్, హర్మన్ అవుటయ్యారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ మొదటినుంచి తడబడుతూనే సాగింది. ఎవరూ భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (20) విఫలం కావడంతో ఆ జట్టు విజయంపై ఆశలు కోల్పోయింది. సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా చివరి వన్డే ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది. -
అంతా సింగిల్ డిజిట్.. 46కే ప్యాకప్!
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 8 వికెట్ల నష్టానికి 106 పరుగుల చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా.. విండీస్ బౌలర్ దియాంద్రా డాటిన్(5/6) దాటికి బంగ్లా బ్యాట్స్ఉమెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లా 46 పరుగులకే కుప్పకూలడంతో విండీస్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్ఉమెన్లో ఫర్గానా హక్ (8) పరుగులే అత్యధికం కావడం విశేషం. చదవండి: జస్ట్.. ఇది ఆరంభమే : హర్మన్ ప్రీత్ హర్మన్ హరికేన్ -
టి20 ఫైనల్లో ఆస్ట్రేలియా
మిర్పూర్: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో అడుగు పెట్టింది. గురువారమిక్కడ జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆసీస్ టీమ్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. విల్లాని 35, హీలీ 30, లానింగ్ 29 పరుగులు చేశారు. 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. డొటిన్(40), కింగ్(36) రాణించినా విండీస్ ఓడిపోయింది. దీంతో మూడోసారి ఆస్ట్రేలియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. రేపు జరిగే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో ఆసీస్ తలపడుతుంది.


