సెమీస్‌లో వెస్టిండీస్‌ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా | Women’s T20 World Cup 2026, Australia Cruise Into Final After Dominant Win Over West Indies, Check Out More Details | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సెమీస్‌లో వెస్టిండీస్‌ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

Jun 30 2026 9:56 PM | Updated on Jul 1 2026 11:05 AM

T20 World Cup 2026: Beth Mooney Takes Australia Into Final With Easy Win

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 టోర్నీ ఫైన‌ల్‌కు ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. మంగ‌ళ‌వారం లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి సెమీఫైన‌ల్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్‌.. రికార్డు స్ధాయిలో ఎనిమిదో సారి ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించింది. 

ఈ నాకౌట్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియ‌న్ జ‌ట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. విండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హీలీ మాథ్యూస్‌(30) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డాటిన్‌(26) ఆఖరిలో బ్యాట్ ఝూళిపించింది.  ఆసీస్‌ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, గార్డెనర్‌, జార్జియా వేర్‌హామ్ తలా రెండు వికెట్లు సాధించారు.

అనంత‌రం 126 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 13 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఆసీస్ స్టార్ బ్యాట‌ర్ బెత్ మూనీ(36 బంతుల్లో 61) అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేసింది. ఆమెతో పాటు ఆష్లీ గార్డెనర్‌(35 నాటౌట్‌), జార్జియా వాల్‌(16) రాణించారు. విండీస్‌ బౌలర్లలో హెన్రీ, మాథ్యూస్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement